Quotes by SriNiharika in Bitesapp read free

SriNiharika

SriNiharika Matrubharti Verified

@sriniha1234
(20)

నిజమైన ప్రేమకు అర్థం, మనం మనపై చూపించుకునే అభిమానం అంతే నిబద్దతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించటం.



మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు. కానీ అది తప్పు, ఎందుకంటే నిన్ను చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను.



నీవు మాట్లాడితే వినాలని ఉంది. కానీ నీవు మాట్లాడే క్షణం నీ కళ్ళలో నేను మాయం అయిపోతున్నా

ఒకరిని ప్రేమించటం మీ ధైర్యానికి కారణం అయితే, ప్రేమించబడటం మీ బలానికి కారణం అవుతుంది.



ప్రేమికుడి యొక్క విలువైన ఆభరణం అతని ప్రక్కనే ఎల్లపుడూ నడిచే అతని ప్రేయసియే.

Read More

తల రాతలో మనది అని రాసి పెట్టి ఉంటె
ఎక్కడ ఉన్న ....??
ఎంత దూరంలో ఉన్న ...??
ఈ ప్రపంచంలో ఎక్కడ దాగున్న మన దగ్గరికి వస్తుంది ... అది వస్తువైనా మనిషైనా ...
ఆలా నా జీవితంలోకి వచ్చినా అద్భుతానివి నువ్వు
నా వెంటే ఉండే అదృష్ఠనీవి నువ్వు
నన్ను ప్రేమాగా పలకరించే అనురాగానివి నువ్వు
నన్ను వీడి ఉండలేని ఆయువుని నువ్వు

ఇరువురి దేహాలు దూరమైనా మనసులు దగ్గరికి ముడిపెసుకున్న బంధం నువ్వు 🥰
ఇరువురి చూపులు దూరమైనా మాటలు కలిసి మరువలేని విధంగా ముడిపడిన బంధం మనది 🫂
✍️ ✍️💝❤️🌹

Read More

నా భవిష్యత్తు జీవిత భాగస్వామికి,

ఈ రోజును నీతో జరుపుకోవాలని ఉంది, కానీ ఎక్కడ ఉన్నావో, నువ్వెవరో ఇంకా తెలియదు. అయినా, నా మనసు నిన్ను ఊహించుకుంటూ ఒక అందమైన గులాబీలా వికసిస్తోంది. ప్రేమ కూడా గులాబీలా మృదువుగా, సుగంధభరితంగా ఉండాలని కోరుకుంటున్నాను.

నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పుడు, నీ ప్రతి రోజూ ప్రేమతో నిండిపోయేలా చూస్తాను. ఈ రోస్ డే సందర్బంగా, మన ప్రేమ ఎప్పటికీ గులాబీలా వికసించాలని కోరుకుంటూ…
నీ భవిష్యత్తు జీవిత భాగస్వామి.

Read More

తాళి బంధంతో....
భార్యని కొట్టని భర్త ఉండడు ....
భార్య మాటలకి భాద పడని భర్త ఉండడు.....
వారి నడుమ ఎన్ని మనస్పర్థలు ఉన్న .....
నలుగురిలో నవ్వుతూ .......
పదిమంది మీ గురించి ......
ఇలా ఉండాలి భార్య భర్తలు అనేలా బ్రతకాలి🥰....
ఇంట్లో భార్య మాట చెల్లలి .....
బయట భర్త మాట నెగ్గలి......
అప్పుడే మూడవ వ్యక్తి మీ బంధాన్ని విడతియ్యలేరు.. ❤️

Read More

చుట్టుపక్కల చుట్టాలు ఎందరున్నా
అందరికీ మనమేంటో తెలిసిన
అందులో అర్థం చేసుకునే వాళ్ళు కొందరే ఉంటారు
వాళ్లు మన పక్కనుండరు
ఎందుకంటే ..
అర్థం చేసుకోవడంలో కన్నా అపార్థం చేసుకోవడం లోనే ముందుంటుంది మన సమాజం .
దీనికి భయపడే వాళ్ళు
మన పక్కనుండరు
మన మీద ప్రేమ లేకో ఇష్టం లేకో గౌరవం లేకో బాధ్యత లేకో కాదు .✍️

Read More

ఎంత ప్రేమిస్తే,
అంత మోసపోతాం
ఎంత నటిస్తే
అంత కోల్పోతాం
మనసుకు తీసుకోకుండా ప్రేమించడం
నిజాయితీగా ఉన్న వాళ్లకి సాధ్యం కాదు
అది కేవలం
వాడుకుని వదిలేసే వారికి మాత్రమే
సాధ్యమవుతుంది
ఈ ప్రపంచంలో ప్రేమికుల సంఖ్యతో పాటు
దోమల సంఖ్య పెరుగుతూ పోతుంది

దోమల్ని చంపడానికి గుడ్ నైట్ వాడో,
దోమలు బ్యాట్ వాడో చంపొచ్చు

అదే ప్రేమ దోమ కుడితే,
మనం చంపేంత వరకు అది చావదు
పోతే దోమ జోలికైనా పో
ప్రేమ జోలికి మాత్రం పోకు
ఒకసారి ఒకరి నీ మనం వద్దు అనుకున్నామంటే
ఆ మనిషికి గౌరవం ఇచ్చి
వాళ్లని ఇబ్బంది పెట్టే పనులు చేయరు
సంస్కారం ఉన్నవాడైతే
సంస్కారం, బాధ్యత లేనివారు
కారణాలు లేకపోయినా
కారణాలను వెతికి చూపించడానికి
ఆ మనిషిని అగౌరపరిచే విధంగా
ప్రవర్తిస్తారు.
Marriage is just a drama
భార్య భర్తలు కలిసి ఉండడానికి కాదు పెళ్లి
రెండు కుటుంబాలతో కలిసి ఉండాలి

దానిని బంధం అని పిలవరు
అదొక మేనేజ్మెంట్ అంతే
అదొక అడ్జస్ట్మెంట్ అంతే
చాలామందికి తెలియనిది
పెళ్లయితే సెటిల్మెంట్ అనుకుంటా రు
లైఫ్ లో బోర్ కొడితే పెళ్లి చేసుకోకండి
మీతో మీరు జర్నీ మొదలు పెట్టండి
ఏప్పుడైనా సరే,
ప్రేమే దూరమవుతుంది
కానీ స్నేహం మాత్రం
చివరి వరకు అలానే ఉంటుంది

ప్రేమను నమ్మి మోసపోవడం కన్నా
స్నేహాన్ని నమ్ముకుని జీవితాంతం సంతోషంగా ఉండడం మేలు
FriendshipGoals
vibes
Facts

Read More

నీవు కనని నా కనులకు ఆరాటం...ఎందుకో
నీ.మది మాట దాటనియని మధికేందుకో ...మొహమాటం
నీ పెదవి దాటి రాని మాట పలకరింపుకై..నా పోరాటం...ఎందుకో
నీ చెవులు గ్రహించలేని నా మాటలు నిబ్ చెవినపడలని ఆత్రుత ఎందుకో ...
నీ గుండెకు వినపడని నా ఎద చప్పుడు ...ఎక్కువయ్యే ఎందుకో...
నా వెంట రాని నీ అడుగులకై నా ఎదురు చూపులు ఎందుకో....
ఎంత వెతికినా దొరకని సమాధానానికి,నా ప్రశ్న వెల్లువ దేనికో.....
ఇంకా నాలో నిన్ను వేతుకుతున్నదుకేనేమో...
ఈ తడబాడు....
😌😌😌😌🍒🍒😨😨😞😞

Read More

నా ఆత్మ సహచరికి.., 


  కొత్తగా ఉంది సంబోధన అని చూస్తున్నావా.. అవును ఇన్నాళ్లు.. ఇన్నేళ్లు... నేను ఎదురు చూసిన నా ఆత్మ సహచరివి నువ్వే అని అనిపించింది అందుకే ఇలా... 


నా ఆత్మ ను.నీ ఆత్మతో ఏకం చేయటం కోసమే.. ఈ లేఖ.. 

ఇది చదువుతున్నప్పుడు నేను నీ పక్కనే.... నీతోనే ఉన్నాననే అనుభూతి కలగాలని నా ఆశ... 


 నా గుండె గోదారిలో నువ్వొక స్వచ్ఛమైన స్వాతి ముత్యం.. 

నీ ప్రేమ నాకు ఎన్నో జన్మల జ్ఞాపకం.. మరెన్నో జన్మలకు ప్రయాణం..

  

రోజు రోజు కి నీ మీద నాకు ప్రేమ ఎక్కువ అవుతుంది.

ప్రతి ఉదయం నీ నుదిటి మీద స్వచ్ఛమైన ముద్దుతో నిన్ను నిద్రలేపాలని.. ఆకలితో నువ్వు ఉంటే కమ్మని గోరుముద్దలు తినిపించాలని.. సాయంత్రం చల్లగాలిలో నీకు కబుర్లు చెప్తూ నీతో ఒంటరిగా నడవాలని... పండువెన్నెలలో నీ ఒడిలో తలవాల్చి నీ హృదయ స్పందన వింటూ.. నన్ను నేను మర్చిపోవాలని.. 


నువ్వు నాతో మాట్లాడవు..కానీ ప్రతి ఉదయం నీ చూపులు నన్ను పలకరిస్తాయి.. నీ భావాలను నాతో పంచుకోవు.. కానీ నీ మనసు.. నా మనసుతో మాట్లాడుతుంది.. 

నువ్వు.. నీ భావాలు.. నీ భాద్యతలు.. అన్ని నన్ను నీ వైవు నడిపిస్తున్నాయి.. నువ్వు అంటే ఎందుకు ఇంత ఇష్టం అంటే చెప్పలేను కానీ.. నీలా నేను ప్రేమించలేను.. అనిపిస్తుంది.. 

  

నీ ప్రేమను పొందటం కోసం ఎన్ని జన్మలు అయినా ఎదురు చూస్తాను... నీ ప్రేమ కోసం మళ్ళీ మళ్ళీ జన్మిస్తాను.. 

ఒక్కో జన్మలో ఒక్కో బంధం కావాలి నీతో.. ప్రేయసిగా.. భార్యగా... కూతురి గా.. నీ ప్రేమను పొందాలని ఆశ... ఆరాటం.. 

నువ్వు కళ్ళు తెరవగానే కలిగే మొదటి ఆలోచన.. నిద్రపోయేముందు కలిగే చివరి ఆలోచన నేనే అవ్వాలి.. 

నువ్వు .. నేను.. మనం అవ్వాలి..

నీ ప్రేమను ఆస్వాదిస్తూ.. నీలో ఉండిపోవాలి.. 

ఇద్దరి ఊపిరి కలిసి పోవాలి... 

ఇద్దరి ప్రాణం ఒకటవ్వాలి.... 


నా ఆత్మ సహచరికి... 

నా ప్రాణ సఖునికి... నేను ఎం ఇవ్వగలను... నా ప్రేమ కన్నా.. ప్రాణం కన్నా విలువ అయినది ఏది లేదు నా దగ్గర... 

అందుకే నా ప్రేమతో....పాటు... ప్రాణం కూడా నీదే... 


ఇట్లు... 


నీ ప్రియసఖి.. 


శ్రీ....

Read More

ఆడపిల్ల గాధ   తల్లిదడ్రుల ఆవేదన 

అయ్యో దేవుడా ! 

పాపం పసి ప్రాణం!?? .

తాను చేసిన నేరమెంట్టి..?

అమ్మాయిల జన్మించడమే నా.! దేవుడా.......?

ప్రాణం పోయేంత నొప్పిని బరించిన ఓ మహా తల్లి, తన కూతురికి సంతోషంతో జన్మనిచ్చే మహా మూర్తి వీ....

చిన్నారి చిరు పలుకుతో ఆ నొప్పిని  

నవ్వుతో మరిచిన మహా మూర్తి వి..!

కానీ........................

పాపం ఎవరిది....?

ఆడపిల్లగా జన్మించిన పసి పాప దా..!

లేదా.....

ఆ ప్రాణానికి జన్మనిచ్చిన తన తల్లదండ్రులదా.....!

లేదా పుట్టించిన లోక తీరా....!

లేదా కామంతో చూసే కళ్ళ దా....!

కనీసం 10 సంవత్సరాలు కూడా నిండ ని చిన్నారి....

ఈ లోకం అంటే ఎంట్టో కూడా తెలియని పసి పావురం........

అన్యాయంగా కామంతో కళ్ళు మూసుకు పోయి పసి ప్రాణం తీసిన సమాజపు పోకడను......,

గుండెల్లో కరీగి పోని భాదల మిగిలిపోయేన........

తన తల్లి కడుపుకోత కనపడలేదా.....!

తండ్రీ ఆర్తనాదాలు వినపడలేదా....!

ఈ సమాజంలో ఎదిగిన ఆడపిల్లకే అనుకున్నాం......కానీ పాపం పసిబుగ్గల చిన్నారులకి కూడా అదే గతి!!!

ఇలాంటి రాక్షసులు ఉన్నతకాలం ఇంతే ఈ సమాజం.....

కామం తో కొవ్వెక్కి కొట్టుకుంట్టున సమాజం ఇది....

భద్రతా లేని నిర్లక్షపు జనన మరణ మృదంగపు జీవితపు సజీవ సమాధి మందిరం గా మారిన

ఓ ఆడపిల్ల నీ జన్మ!!!!.............

Read More

మనకి కూడా మంచికాలం చెడ్డకాలం అని
రెండు ఉంటాయి 👍
మంచిటైం నడుస్తున్నపుడు సంతోషంగా నవ్వుతు నవ్విస్తూ చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటాం 🙂🙂
చెడ్డ కాలం నడుస్తున్నపుడు బాధలు కష్టాలు
కన్నీళ్లు ఎవరితో షేర్ చేసుకోవాలి అనిపించకపోవడం, ఒక్కోసారి షేర్ చేసుకుందాం చుసిన ఎవరు పట్టించుకోకపోవడం 😔
అప్పుడే సహనం ఓర్పు మనకి ఉండాలి 🙏
చెట్టున్ని చివరివరకు కొట్టేసిన మళ్ళీ
చిగురిస్తుంది మనం కూడా అన్ని దారులు
మూసుకుపోయిన ఏదో ఒక మార్గం
కచ్చితంగా తెరిచే ఉంటుంది 🙂
మన మనసుని మనకి మనమే సర్దిచెప్పుకోవాలి 🙏
ఫ్రెండ్స్ 🍫🙂

Read More