The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
శీర్షిక: అమర కావ్యం కవిత: "నువ్వు నాకు దొరికిన అక్షరానివి కాదు, నా మౌనం యుగాల పాటు తపించి రాసుకున్న 'అనుభవం'వి..... లోకం నిన్ను ఒక రక్తమాంసాల రూపంగా చూస్తుందేమో.. కానీ నేను నిన్ను నాలోని 'మరో నేను'గా, నా అంతరాత్మ ప్రతిబింబంగా ప్రేమిస్తున్నాను!... ప్రేమ అంటే నీడలా వెంట నడవడం అని అందరూ అంటారు.. కానీ నా దృష్టిలో... నువ్వు లేని శూన్యంలో కూడా, నీ జ్ఞాపకపు వెలుగుతో నా నిశీధిని 'నిండుగా' మార్చుకోవడమే అసలైన ప్రేమ!.... ఒకరి చేతులు ఒకరు పట్టుకుని లోకమంతా తిరగడం కాదు, ఒకరి ఆలోచనల అడవుల్లో.. మరొకరు అడుగులు వెతుక్కోవడం బంధం..... మ్యాపుల మీద మన మధ్య దూరం మైళ్ళలో లెక్కించవచ్చు, కానీ మన మనసుల మధ్య 'క్షణ కాలం' కూడా విరామం లేని ఏకత్వం ఉంది..... నిన్ను ప్రేమిస్తున్నానని పెదవులతో చెప్పడం కన్నా, నిన్ను నా అణువణువులో 'జీవింపజేయడమే' నా నిరంతర సాధన..... నీ ఉనికి నా శ్వాసలోని లయ అయితే.. నీ జ్ఞాపకమే నా అస్తిత్వానికి మూల విరాట్టు! ప్రేమ అంటే ఒకరిని బంధించి 'సొంతం' చేసుకోవడం కాదు, ఒకరి ఉన్నతి కోసం మనల్ని మనం 'అంకితం' చేసుకోవడం. సముద్రపు అలలు తీరాన్ని ముద్దాడి వెళ్ళిపోవచ్చు.. కానీ మన అనుబంధం, ఆ అలల కింద నిశ్చలంగా నిద్రిస్తున్న సముద్ర గర్భంలోని అగాధ నిశ్శబ్దం లాంటిది.. ఎప్పటికీ విడిపోనిది!.... కాలం మన దేహాలను వేరు చేయవచ్చు, పరిస్థితులు మనల్ని దూరం ఉంచవచ్చు.. కానీ నువ్వు నా పక్కన ఉన్నా, లేకపోయినా.. నీ ఊపిరి నా గాలిలో పరిమళంలా కలిసిపోతూనే ఉంటుంది, నీ నీడ నా అడుగులకి దారి చూపే వెలుగై తోడుంటుంది. ఎందుకంటే..... మన బంధం కేవలం కాలంతో కరిగిపోయే శరీరాల కలయిక కాదు,... జన్మజన్మల సుదీర్ఘ ప్రయాణంలో.. రెండు ఆత్మలు రక్తాక్షరాలతో రాసుకున్న 'అమర కావ్యం'!"
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser