Quotes by ambushi in Bitesapp read free

ambushi

ambushi

@kavithalu


తూటాల తగువు

ఆకలి కేకలు
కుల కత్తిపోట్లు
మత ఈర్ష్యలు
పెట్టబడి ఆరాటాలుకు
అసువులు బాసిన అనువుల
అంతరిస్తున్న తనవులు -

పురిటి నొప్పులకు ఎంత బాదో
ఆకలికి అంతే బాద
అయ్యూషూ పోసి పెంచి
ప్రజల శ్రేయాసుకై
పరితపించే ప్రాణాలను
పాతరేసి ప్రశంశలు పొందు?

అక్కడ, ఇక్కడ ఒకే తూట
ఆకలి వేటకై ఆ తూట
ప్రశంసా పత్రలకై ఈ తూటా!

మీకు మీ కుటుంబాలు బాగుంటేచాలు
సమాజం సంవృద్ధిగా అభివృద్ధిగా
అటు పోటు లేకుండా
అందరూ సమానం అనే
ఆలోచన వచ్చే వరకు
ఆగదు తుటాల మోత

మీ అంబుషి

Read More