Quotes by avani Shri Muktha in Bitesapp read free

avani Shri Muktha

avani Shri Muktha

@avani.235


ఓ మగువ.. ఏది నీ స్థానం..
తల్లి పెంపకంలోనా.. తండ్రి బాధ్యతలోనా..
మౌనపు కోరికల మధ్యనా..

ఓ మగువ..
అత్తగారి సాధింపుల్లోనా..ఆడపడుచు ఆరాటాల్లోనా..
మగని మనసులోనా..కన్న బిడ్డ ఎదురు చూపుల్లోనా..

ఓ మగువ..
ఆగిపోయిన నడకల్లోనా..చెరబడిన గమ్యాల్లోనా..
కరిగిపోయిన కలల్లోనా.. విరిగిపోయిన నవ్వుల్లోనా..
బానిసైన వంట గదిలోనా..

ఓ మగువ..
అడిగే ప్రతి ప్రశ్నలోనా..చేజారే ప్రతి నిశ్శబ్దంలోనా..
కన్నీళ్లలో కొట్టుమిట్టాడే.. జీవితంలోనా..

ఓ మగువ
అధికారం లేని నిర్ణయాల్లోనా..సర్దుకున్న మనసులోనా..
వదులుకున్న ఆశల్లోనా.. మిగిలిపోయిన ఊపిరిలోనా…
ఏదురు చూసే కాలంలోనా..
ఓ మగువ.. ఎక్కడ నీ ఉనికి..

Read More

చంద్రకాంతి నిండిన అడవిలో   చల్లని సెలయేటి ఒడ్డున
కడివెడు కుండను నెత్తిన పెట్టిన  ఓ  పడతి......

అది కేవలం నీ  రూపం కాదు…

ఒక జీవంతమైన వయ్యారం.....

నెత్తిన కుండలో నీరు కాదు  నెత్తిన మోస్తున్న  బరువేమో 

ఆమె నడకలో నిండింది ఓ సహనం
చేతుల వలయాల్లో మెరిసేది వెండి కాదు
కాలాల్ని మోయగల ఓ నిశ్శబ్ద బలం....

నీలాకాశం కళ్ళలోకి దిగివచ్చినట్టు   చంద్రుడు ఆమె లలాటాన తిలకమై కూర్చున్నట్టు  పల్లవి పాడే   గాలికి కూడా   ఆమె పాదాల దగ్గర నిశ్శబ్దం నేర్పే వయ్యారం...

చీర మడతల్లో దాగుంది   నీలి  వయ్యారం 
నెత్తి మీద  మోస్తున్న   కుండ  నీటి బరువుకన్నా
బాధ్యత బరువు ఎక్కువైనా పెదవుల  మీద చిరునవ్వు మాత్రం తరుగని అందం.....

చంద్రుని వెలుగు నెమ్మదిగా జారుతున్న వేళ    అడవి ఊపిరి ఆపుకుని చూసిన దృశ్యం ఆమె  సౌందర్యం అన్నట్టుగా ఉంది...

Read More