pranaya geethika in Telugu Drama by sreelu books and stories PDF | ప్రణయ గీతిక - 10

The Author
Featured Books
Categories
Share

ప్రణయ గీతిక - 10

ప్రభ ,పప్పులు రూమ్ కి చేరిన తర్వాత  తమ లగేజీని లోపలికి పెట్టి పప్పు ఏదో పని ఉందని బయటికి వెళితే ప్రభ అలా కిటికీ నుంచి బయటికి చూస్తాడు. తామున్న రూమ్ కి పక్కనే పెద్ద హౌస్ చుట్టూ గార్డెన్ తో చాలా అందంగా కనిపిస్తూ ఉంది "ఇట్స్ బ్యూటిఫుల్ హౌస్ నాచురల్ చాలా బాగుంది నిజంగా అక్కడ కనిపిస్తూ ఉన్న అంత మంచి పూల మొక్కలు పెద్ద పెద్ద చెట్లు చూస్తూ ఉంటే దానిని గార్డెన్ హౌస్ అనకుండా ఉండలేకపోతున్నాను"  అనుకున్నాడు ప్రభ.

కిటికీ తలుపులు మూసి అలా బయటకి వస్తూ ఉండగా బండికి ఒక తాత అడ్డు రావడంతో తను బండిని ఎడమవైపు పోనిచ్చేసరికి తాత ఇంకొక వైపు పడతాడు.చూసిన ప్రభ బండిని ఆపి వెళ్లి  పైకి లేవనెత్తి" తాత ఎలా ఉన్నారు,  దెబ్బలు ఏమి తగలలేదు కదా" అని అడుగుతాడు.

" లేదు బాబు నేను బాగానే ఉన్నాను నువ్వేమో  రోడ్డుకి ఎడమవైపున వస్తున్నావు నేనే పొరపాటున అటువైపు వచ్చాను," అని తాతయ్య చెబుతాడు .

సరే రండి మీ ఇంటికి వదులుతాను "అని పిలవడంతో "ఇక్కడే బాబు" అని గార్డెన్ హౌస్ వైపు చూపించేసరికి గేటు దగ్గరికి వదులుతాడు .

అదే రోజు  సాయంత్రం కావడంతో గార్డెన్ హౌస్ ముందు రూమ్ లో ఒక్కొక్క కిటికీ  మూతపడుతున్నది ".   కిటికీ వేసేటప్పుడు కనిపిస్తున్న చేతుల్ని చూస్తూ ఇంకాస్త వంగి చూడగా మంగురులు గాలికి ఊగుతూ ఉంటే వాటి మధ్యలో గాలికి కనురెప్పలు మూసి తెరిచినట్లు అనిపిస్తోంది.  ముఖం కనిపించట్లేదు అంతలో కిటికీలన్ని బంద్ అయిపోయాయి. 

ఎందుకు నా మనసు ఇంతగా ఆరాటపడుతోంది ఒక్కసారి ముఖం పూర్తిగా కనిపిస్తే బాగుండేది కన్ఫామ్ చేసుకునేవాడిని"  అనుకొని నిద్ర రాకపోయేసరికి లేచి కిటికీ తలుపులు తెరచి గార్డెన్ హౌస్ వైపు చూడగా బయట  తాతయ్య అతని పక్కన తన శ్రీమతి అనుకుంటా అంటే జేజి కూర్చుని ఉండగా తాతయ్య,   జేజిల ముఖాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.పక్కనే   నీలం రంగు డ్రెస్సు పూర్తిగా శరీరాన్ని కవర్ చేసి ఉండగా జడ ముందుకు వేసుకోవడం వల్ల తన శంఖంలాంటి చెవికి వేలాడే చెవిరింగులు లైటింగ్ కి  మెరుస్తున్నట్టు కనిపిస్తున్నాయి అప్పుడప్పుడు తల ఆడిస్తూ ఉన్నప్పుడు ఆ చెవి రింగులు ఊగుతూ ఉన్నాయి తప్ప  ముఖo కనిపించలేదు కనీసం చెక్కిలి కనబడిన తనని నేను గుర్తుపట్టగలను అనుకుని మరొక్కసారి పరిశీలనగా చూస్తే  జేజి వచ్చి   అమ్మాయి భుజం పట్టుకొని ప్రేమగా తల నిమరుతూ ఉంటే అమ్మాయి జేజి ఎదపై వాలి ఉంది .

అమ్మాయి ముఖానికి అడ్డంగా జేజి చేతులు  ఉండడంతో ఈసారి నిరాశగా కిటికీ కరటన్   జరపబోయిన ప్రభ కి అటు ఒకసారి చూడగా తాతయ్య,జేజి లోపలికి వెళ్లాలని లేచి నిలబడడంతో అమ్మాయి కూడా నిలబడింది.

ప్రభ వెళ్లాలని ఒక అడుగు ముందుకు వేయగా తను వేసుకున్న నీలం రంగు వోణి గాలికి కాస్త  ఎగురుతూ ఉంటే తన మృదువైన చేతుల తో  తీసుకోవాలని చేతి ని అలా పైకెత్తగా వోణి  ఇంకాస్త గాలికి పైకి ఎగిరేసరికి చివరి కొనని ఎడమ చేతితో పట్టుకొని తన చంద్రబింబం లాంటి గుండ్ర ని ముఖాన్ని మెల్లగా తిప్పి ఓణి ఎగురుతున్న వైపు తిరగడంతో    ఆత్రంగా చూసినా కూడా  తన ముఖమైతే స్పష్టంగా కనిపించలేదు .ఓనీ అడ్డం పడుతూనే ఉంది  కానీ ప్రభ కళ్ళు మాత్రం చాలా ఆశగా వెతుకుతూ  ఉండగానే అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. 

కర్టన్ క్లోజ్ చేసి బెడ్ మీద పడుకొని "  మై  డియర్ స్వీట్ హార్ట్  " నీవేనేమో అని    కొట్టుకునే నా గుండె సవ్వడి నీకేం తెలుసు అమావాస్య చీకటి పోయి నిండు పున్నమిలా  కనిపించావు అని నా మనసు  ఆరాటపడుతుంది   .

  తాతయ్య పరిచయమయ్యాడు కాబట్టి ఎలాగైనా నువ్వా , కాదా తెలుసుకుంటాను  "    ముందుగా తాతయ్య,  జేజేలకి దగ్గర అవ్వాలి కచ్చితంగా దగ్గర అవుతాను అనుకుంటూ ప్రియా తన కళ్ళలో మెదులుతూ ఉంటే మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు ప్రభ .

ఉదయం లేచిన ప్రభ తనకి గార్డెన్ హౌస్ లో కనిపించిన అమ్మాయి తన స్వీట్ హార్ట్ అవునో, కాదో తెలుసుకోవాలని తపన పెరిగిపోతుంది. అందుకే తాత ఎప్పుడు కనిపిస్తాడా  ' అని ఎదురు చూస్తున్నాడు పని లేకపోయినా గార్డెన్ హౌస్ నుంచి అటువైపు . ఒకసారి ఏదో పని ఉందని అటువైపు వెళతాడు మరోసారి వెనక్కి వస్తూ ఉండగా దారిలో తాతయ్య కనిపించడంతో "  తాతయ్యని చూస్తే చాలా డల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది" అనుకుని  మాట్లాడిస్తాడు.

ప్రభ పరిచయంతో కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అన్న మాటలకు కూడా జవాబు రావడంతో తాతయ్య తనకు ఒక మనవరాలు కూడా ఉందని తను చాలా డల్ గా కనిపిస్తూ ఉందని చెబుతాడు. 

తాతయ్య , నేను మీకు ఒక చార్ట్ ఇస్తాను దానిని తనకి చూపించండి అప్పుడు తన ముఖంలో కళ ఏమన్నా మారుతుందేమో అని ప్రభ చెప్పేసరికి 
ఏంది ? చార్ట్ ఇవ్వడమంటే ,  దానివల్ల  ముఖంలో మార్పు రావడం ఏంటి  ?   అని తాతయ్య ప్రశ్న.

తాతయ్య ముందు మీరు ఆ పని చేయండి ఆ తర్వాత ఆలోచిస్తాను అని చెప్పి తన దగ్గరున్న ఒక చార్ట్ ఇచ్చేసరికి తాతయ్య ఇంటికి తీసుకెళ్తాడు. దానిని ప్రియ గదిలో ఉంచాలనుకుని అనుకున్న తను చాలా సూక్ష్మంగా ఆలోచిస్తుంది వద్దులే తను వస్తోంది కదా అని తాతయ్య జేజేలు ఇద్దరూ ఆ చార్ట్ ని పట్టుకొని సిగ్గుపడుతుండడం చూస్తుంది ప్రియా.

"ఏంటి ఇద్దరు అలా చూసి మురిసిపోతున్నారు" అని దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ చార్టులో గీసిన బొమ్మలను చూసి నవ్వు ఆపుకోలేక పోతుంది ప్రియ .

ఇదేంటి జేజికి  తాతయ్యకి ఒక పిలక జేజికి రెండు జడలా అమ్మో! మీ వయస్సు 20 కి తీసుకెళ్లినట్టుంది. కానీ గీసిన బొమ్మ మాత్రం 60 లోనే ఉంది అంటూ తను నవ్వుతుంటే వాళ్ళిద్దరు కూడా చిరునవ్వు నవ్వుతారు. 

అమ్మయ్య , గీతిక ముఖంలో చిరునవ్వు కనబడింది అనుకుంటూ ఉండగా తాతయ్య దాన్ని తీసి చెత్తకుప్పలో పారేయండి మీ ఇద్దరి బొమ్మలు నేను గీసిస్తాను అని చెప్పి ఆ చార్ట్ ని డస్ట్ బిన్ లోకి వేస్తుంది.

ప్రియకి మైండ్ కొంచెం రిఫ్రెష్ అయినట్టు అనిపించడంతో   ఫ్రెష్ అప్ అయి  వచ్చి  జారవిడిచిన కురుల్ని  పైకి తీసి     తలకు ఒక వైపు చుట్టి ఫ్లవర్ ప్లక్కర్ని గుచ్చి ఒక చిన్న పాయను అలా వదిలి ఇటు తిరుగుతుండగా చెత్తబుట్టలో ఉన్న డ్రాయింగ్ షీట్స్ కనబడడంతో చేతికి తీసుకుని డ్రాయింగ్ షీట్ వైపు చూసి  వచ్చే నవ్వును ఆపుకోలేక పెదవుల్ని మాత్రమే కదిలిస్తూ  నవ్వింది ప్రియ. 

ఎవడో మహానుభావుడు ఎంత చక్కగా గీసాడు . 'ఈ డ్రాయింగ్ వర్ణనాతీతం ' అని    నవ్వుతూ తల ఊపుతూ కళ్ళను తిప్పుతూ ఉంటే ప్రియ ముఖ కవళికలు మారుతూ ఉన్నాయి. తాతయ్యకి  వంకర పిలక అంటూ హహహ అని నవ్వింది . జేజికి  పాము లా మెలికలు తిరిగిన  వాలు జడ. రెండింటి నీ ముడి వేసి మధ్యలో ఒక గంట. ఆ గంట కొంచెం మోగేలా ఉంటే  ఇంకా బాగుండేది అనుకుని గట్టిగానవ్వింది ప్రియ.  సొట్ట బోయిన ముక్కులు,  ,   కళ్ళు ఉన్నచోట కాక పక్కకు కదిలి ఒకరికి మెల్లకన్ను, ఇంకొకరికి గుడ్డి కన్ను , అసలే కనపడని చెవులు,   తాతయ్య జేజీలు ఎంత ముద్దొస్తున్నారో !   అబ్బబ్బ ! ఎంత సక్కగా గీశావయ్యా నిన్ను మాత్రం పొగడక తప్పదు  అనుకొని మరొకసారి తాతయ్య పిలక వైపు చూసి పిలకను చూస్తే నవ్వు ఆపుకోలేక పోతున్నాను బాబు    అంటూ గట్టిగా నవ్వుతోంది మొండెం వరకు తప్ప కాళ్లు చేతులు మాత్రం గీయలేదు మంచిపని లేకపోతే కాళ్ళు చేతులు  కట్టెల్లా గీసే వాడేమో !  ఇక నవ్వలేను బాబోయ్   అనుకుని నవ్వుని కంట్రోల్ చేసుకుని   ఎట్లో తాతయ్య , జేజి ల ముందు నవ్వలేదు అసలా అప్పుడు వచ్చి నన్ను  చాలా కష్టంతో ఆపుకున్నాను .ఇది ఇంకా ఇక్కడే ఉంటే కడుపుబ్బరం వచ్చేస్తుంది అనుకొని చుట్టేసి అలమరలో పెట్టేసింది ప్రియ.

 కిటికీ నుండి గీతిక సంతోషంగా నవ్వుతూ ఉండడం చూసిన తాతయ్య, జేజీలు చాలా ఆనందించారు.

 డ్రాయింగ్ చూసి మైండ్ రిఫ్రెష్ అయింది అనుకున్న గీతికకి ఆ నవ్వు ఎక్కువ సేపు నిలబడలేదు. క్షణంలో మాయమైపోయింది. నాకేమైంది ఎందుకు నేను ఇంటర్వ్యూలు ఫెయిల్ అవుతున్నాను నా మనసుని ఎంత నిమగ్నం చేసినా అక్కడికి వెళ్ళగానే ఏదో ఒక తప్పు చేస్తున్నాను . సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇది బాదా ? లేదా భయమా ?  నా మనసుని ఎలా కంట్రోల్ చేయాలి  ? నేను ముందులాగ మాట్లాడటం తగ్గించేసాను . కనీసం తాతయ్య జేజి లతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదు మనం మనకు దగ్గర ఉన్న వాళ్ళతో కాస్త మాటల్ని షేర్ చేసుకుంటే గుండెలోని బాధ కాస్త తగ్గుతుందని అంటారు. అయినా నేను ఎందుకు వాళ్ళతో ఫ్రీగా ఏ విషయం షేర్ చేసుకోలేకపోతున్నాను. వాళ్లు నాకోసం అంత దూరం నుంచి వచ్చారు కనీసం నేను వాళ్లతో మాట్లాడకుండా  ఉంటే వాళ్ళు ఎలా   ఫీలయ్యారో  ఏమో!  నాకు వాళ్లంటే చాలా ఇష్టం.  అలాంటి వాళ్ళని నేను ఇలా ఇబ్బంది పెట్టడం బాగోలేదనుకుంటా  . నా ఖర్మకి ఎవరు బాధ్యులు ఎవరి కర్మ వారు అనుభవించే తీరాలి. నేను  పడే బాధ వలన  మరొకరిని ఎప్పటికీ ఇబ్బంది పెట్టకూడదని అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఇంతవరకు చేసిన ప్రయత్నం కేవలం నన్ను నవ్వించడానికి అర్థం అయింది కాబట్టి వాళ్ళని నేను కష్టపెట్టకూడదు.  ఈ వయసులో కూడా వాళ్ళు తమకున్న బాధలన్నిటిని మరిచి ఎంత సంతోషంగా ఉంటున్నారు కనీసం వాళ్లని చూసైనా నేను నా బాధని పక్కన పెట్టి వాళ్లతో అయినా సంతోషంగా ఉండాలి వాళ్ళిద్దరి డ్రాయింగ్ వేసి వాళ్ళని సంతృప్తి పరచాలి అనుకుని  హాల్లోకి వచ్చి తాతయ్య, జేజి ఇలా రండి   అని పిలిచింది గీతిక . ఇద్దరు గీతిక పిలవగానే సంతోషంతో వడివడిగా వచ్చి హాల్లో నిలుచున్నారు ఇద్దరూ.చూడండి లైలా, మజ్ను అన్న గీతిక మాటలు వినగానే చాలా ఆశ్చర్యం ,సంతోషంతో అటువైపు చూశారు ఇద్దరు.

 ఏంటి అలా చూస్తున్నారు.

 ఏం లేదు , నువ్వేదో అన్నావే అది సరిగా వినపడలేదు అంటూ ముందుకొచ్చింది జేజి.

అదా! అన్ని చిరునవ్వుతో తల ఊపుతూ లైలా, మజ్ను అంటూ ఇంకోసారి చెప్పింది గీతిక.

 ఆ మాట వినగానే ఇద్దరు సిగ్గుపడుతూ ఉండడం చూసి సిగ్గు పడింది చాలు ఫోజులు ఇవ్వాలి అన్న గీతిక. మాటలు విని అర్థం కానట్టు చూస్తూ మేము  చూస్తున్నది మా గీతిక నేనా!  అనుకున్నారు ఇద్దరు.

 అర్థం కాలేదా ! మీరిప్పుడు కొన్ని ఫోజులిస్తే నేను వాటిలో ఏది బాగుందో దాన్ని డ్రాయింగ్ వేసి మీకు ఇస్తాను ఇప్పుడు అర్థం అయిందా అంది గీతిక.

 ఫోజులు అంటే గుర్తొచ్చింది మా కాలంలో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ , కృష్ణ ఎంతమంది హీరోలు ఉన్నారు వాటిలో ఏ ఫోజు కావాలి అడిగాడు తాతయ్య.

 అబ్బో !  సినిమాలు బాగానే చూసినట్టు ఉన్నారు అంది గీతిక.

 మీ తాతయ్య పెళ్లయిన తర్వాత ఫస్ట్ తీసుకెళ్ళింది సినిమా హాల్ కేనమ్మా     అంది జేజి తాతయ్య వైపు చూస్తూ.

 మీ ఇద్దరినీ కదిలిస్తే నేను చాలా విషయాలు తెలుసుకోవచ్చు అంది చూపుడువేలు చూపిస్తూ గీతిక .

 ఇంతకీ ఏ హీరో ఫోజు కావాలో చెప్పనేలేదు గీతిక అన్నాడు తాతయ్య నవ్వుతూ.

 తాతయ్య అన్ని సినిమాలు చూసి అంతమంది హీరోల ఫోజులు చూసి నీకు ఒక సొంత ఐడియా రాదా ? నువ్వే సొంతంగా జేజి తో కలిసి  ఐదు ఫోజులు ఇచ్చేయ్ అందులో ఏది బాగుంటే దానికి గీసేస్తా చెప్పింది గీతిక. 

 ఇదే మంచి అదనుగా భావించి  ఇద్దరూ ఒకరినొకరు  కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఒకటి,  ఒకరి చేతిలో మరొక చెయ్యి వేసి తిరుగుతున్నట్లు ఒకటి ,ఇద్దరు కూర్చుని పనిచేస్తున్నట్లు ఒకటి అలా అయిదారు ఫోజులు ఇవ్వగా అందులో నుంచి  ఒక్క ఫోజ్ ని సెలెక్ట్ చేసుకుని చేసుకుంది గీతిక.

 ఆ ఫోసుని పరిశీలనగా చూస్తూ వీళ్ళిద్దరూ ఫిజికల్ గానే కాదు ఇద్దరి కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది అనుకుంది మనసులో గీతిక. అందుకే వాళ్ళిదరినీ మరణించే వరకు ఇంతే హ్యాపీగా ఉంచాలని నేను కూడా ఈరోజు డిసైడ్ అవుతున్నాను అనుకుంది గీతిక.

 ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అడిగింది జేజి.

 ఏం లేదులే జేజి  మీ ఇద్దరి అన్యోన్యత  చాలా బాగుంది  అనుకుంటున్నాను అంతే అంది గీతిక.

 అన్యోన్నత, అనురాగం,  పవిత్రమైన బంధం అనేది మనం ఆలోచించే విధానాన్ని బట్టి అంత బలంగా ఉంటుందమ్మా చెప్పింది జేజి.

 మిమ్మల్ని చూస్తుంటే అర్థం అవుతుంది  జేజి మీరు చాలా పుణ్యం చేసుకున్న దంపతులు అందుకే  ఈ డ్రాయింగ్ నేను మీకు ఇచ్చే గిఫ్ట్ అని చెప్పింది గీతిక.

 అలాగే తల్లి నీకు నచ్చినట్టు చెయ్ అంటూ గీతికని హగ్ చేసుకుంది జేజి.

 తాతయ్య  గీతిక దగ్గరికి వచ్చి  ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మ నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను అనుకుంటున్నాను అనడంతో గీతిక కళ్ళలో ఆనంద భాష్పాలు రాలాయి. అలాగే తాతయ్య అని నవ్వుతూ ముగ్గురు చాలా హ్యాపీగా వాళ్ళ రూమ్ కి వాళ్ళు వెళ్లారు.

 తాతయ్య జేజి లు రూమ్ కి వెళ్ళిన తర్వాత ప్రభ కి ఫోన్ చేసి డ్రాయింగ్ గురించి గీతిక తిట్టిన మాటలు చెప్పగా చెవులు మూసుకుని అమ్మో !   మౌనంగా ఉండే అమ్మాయి అన్ని మాటలు అందా  :? ఊరికే ఉన్నారా తాతయ్య అన్నాడు ప్రభ.

 పోనీలేరా ముందు ఎన్ని మాటలన్నా ఆ తర్వాత తన రూమ్ కి వెళ్లి నీ డ్రాయింగ్ ని తలచుకొని నవ్విందిచూడు నిజంగా ఆ  నవ్వుల దేవత అనిపించింది మాకు . అన్న జేజి మాటలు విని ప్రభ కి గాలిలో తేలుతున్నట్లు అనిపించింది . తాతయ్య ఇంకా ఏదో చెబుతూ ఉన్నా వినిపించుకోకుండా ఫోన్ పక్కన పెట్టి అలా వెల్లకిలా పడుకొని నవ్వుతూ 
అలా పైకి చూస్తూ ఉండగా వస్తాడు పప్పు లోపలికి.

 ఇదేంటి కొత్త వింత  వీడినెప్పుడు నేను ఇలా చూడలేదే అనుకొని  ఏరా  ప్రపంచంలో ఎవరైనా ఏదైనా కొత్తగా కనుక్కుంటే ఇలా ఉంటారు లేదా కొత్త ప్రేమలోకానికి వెళ్లితే ఇలా ఉంటారు. నీ వాలకం చూస్తుంటే నువ్వు ప్రేమలోకంలో ఉన్నావనిపిస్తుంది నాకు అన్న పప్పు మాటలకి అవునన్నట్టు తలుపుతూ నవ్వుతాడు ప్రభ.