Appeal to the husband's mahasayas Review- Rating in Telugu Film Reviews by SriNiharika books and stories PDF | భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ- రేటింగ్

Featured Books
Categories
Share

భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ- రేటింగ్



రవితేజ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ మూవీ నవ్వించిందా? మాస్ మహారాజాకు హిట్ పడిందా?

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్‌గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూలో తెలుసుకుందాం.
నటీనటులు: రవితేజ, డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్, సునీల్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను, మురళిధర్ గౌడ్, అజయ్ ఘోష్, రోహన్ తిదితరులు
దర్శకత్వం: కిషోర్ తిరుమల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరేళ్ల
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
విడుదల తేది: జనవరి 13, 2026
మాస్ మహారాజ రవితేజ ఎనర్జీకి, సినిమాలకు సూపర్ క్రేజ్ ఉంటుంది. అలాంటి రవితేజ గత కొంతకాలంగా వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి రూట్ మార్చి ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించేందుకు రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి.
రామ్ సత్యనారాయణ (రవితేజ), బాలమణి (డింపుల్ హయాతి) ఇద్దరు భార్యాభర్తలు. చాలా అన్యోన్యంగా ఉంటారు. వీరికి అనార్కలి అనే వైన్ బ్రాండ్ కంపెనీ ఉంటుంది. వ్యాపార నిమిత్తం స్పెయిన్‌కు వెళ్తాడు రామ్. అక్కడ పరిచయం అయిన మానస శెట్టి (ఆషిక రంగనాథ్)తో ఫిజికల్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్తాడు రామ్.

తనకు పెళ్లయిన విషయాన్ని మానస దగ్గర, ఎఫైర్ గురించి భార్య బాలమణి దగ్గర దాస్తాడు రామ్. ఆ తర్వాత ఏమైంది? భార్యకు, ప్రియురాలికి నిజం తెలియకుండా రామ్ ఎలాంటి తంటాలు పడ్డాడు? పరాయి స్త్రీతో తన భర్త శారీరక సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన బాలామణి ఏం చేసింది? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే? భర్త మహాశయులకు విజ్ఞప్తి చూడాల్సిందే.
ఇద్దరు హీరోయిన్స్
రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ ఇద్దరు హీరోయిన్స్‌గా చేశారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ
టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ఆకట్టుకున్న భర్త మహాశయులకు మూవీ ఇవాళ (జనవరి 13) థియేటర్లలో విడుదలైంది. మరి చాలా కాలం తర్వాత రవితేజకు హిట్ పడిందా?, ప్రేక్షకులను ఈ సినిమా నవ్వించిందా? అనేది నేటి భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూలో తెలుసుకుందాం.
స్పెయిన్‌లో మానస (ఆషికా రంగనాథ్) వైన్ తయారీ కంపెనీకి యజమాని. రామ సత్యనారాయణ అలియాస్ రామ్ (రవితేజ) తన భార్య బాలమణి (డింపుల్ హయతి)తో కలిసి వైన్ తయారీ కంపెనీని హైదరాబాద్‌లో నిర్వహిస్తుంటారు. తాము తయారు చేసిన అనార్కలి అనే వైన్ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి స్పెయిన్‌లోని మానస కంపెనీతో భాగస్వామ్యం చేసుకోవాలని ప్లాన్ వేస్తాడు. కానీ మానసను కలిసే క్రమంలో కొన్ని ఇబ్బందులను సాల్వ్ చేసుకొని ఆమెకు రామ్ చేరువ అవుతాడు. రామ్ మంచితనాన్ని చూసి అతడిని ఇష్టపడుతుంది. అంతేకాకుండా ఓ రాత్రి శారీరకంగా ఒక్కటవుతారు. ఆ తర్వాత బిజినెస్ పని మీద స్పెయిన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి రామ్‌ను కలుస్తుంది.
రామ్, బాలమణి మధ్య ఉండే అన్యోన్య దాంపత్య జీవితం ఎలా సాగింది? స్సెయిన్‌లో మానసను కలువడానికి రామ్‌కు విందా అలియాస్ బెల్లం (సత్య) ఎందుకు అడ్డంకులు కల్పించాడు? భార్య తప్ప మరో మహిళను కన్నెత్తి చూడని రామ్.. మానసకు ఎలా చేరువయ్యాడు? మానసతో రామ్ శారీరక సుఖాన్ని పంచుకోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ఏకపత్నీవ్రతుడిగా భావించే రామ్‌పై బాలమణికి ఎలాంటి అనుమానాలు కలిగాయి? రామ్‌కు చేరువ కావడానికి ప్రయత్నించిన నేపథ్యంలో అతడు వివాహితుడు అని తెలిసిన తర్వాత మానస రియాక్షన్ ఏమిటి? రామ్‌ చేసిన మోసానికి ఎలాంటి ప్రతీకారాన్ని మానస తీర్చుకోవాలని ఉంది. ఒకవైపు భార్య, మరోవైపు మానస మధ్య రామ్ ఎలా నలిగిపోయాడు? మానస ప్రేమను రామ్ అంగీకరించాడా? భర్త చేసిన పనికి బాలమణి ఎలా రియాక్ట్ అయింది? మానస ద్వారా ఎదురైన సమస్యను రామ్ ఎలా డీల్ చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కథ. పవిత్రంగా దాంపత్య జీవితాన్ని ఆస్వాదించే వ్యక్తి జీవితంలోకి యాక్సిడెంటల్‌గా మరో మహిళ ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? వివాహేతర సంబంధం ఎలాంటి సమస్యలకు దారి తీస్తుందనే చిన్న పాయింట్ చుట్టూ నలుగురైదుగురు కమెడియన్లను బలవంతంగా కథలోకి లాక్కొచ్చి చేసిన కసరత్తు ఈ సినిమాగా కనిపిస్తుంది. ఈ మూవీ కథ పాతదే. కానీ ఆ కథను చెప్పిన విధానం కొత్తగా లేకపోవడం రొటీన్, రెగ్యులర్‌గా మారిందనే ఫీలింగ్ కలుగుతుంది. నాసిరకమైన కామెడీ, జబర్దస్త్ తరహా పేలవమైన డైలాగ్స్‌తో అనుక్షణం సహనానికి పరీక్ష పెట్టారనే చెప్పాలి. ఫస్టాఫ్‌లో సత్య కామెడీతో కొంత బెటర్‌గా మూవీ మొదలైనప్పటికీ.. కథలోకి వెళ్లిన కొద్ది మరీ నాసిరకంగా మారింది. ఈ సినిమాకు రైటింగ్ అత్యంత బలహీనతగా కనిపిస్తుంది. ఈ సినిమా విషయంలో కొంతలో కొంత ఫస్టాఫ్ పర్వాలేదనిపిస్తుంది.
ఇక సెకండాఫ్‌లోనైనా ఏదైనా కొత్తగా, ఏదైనా ఉంటుందని ఎదురు చూసిన వారికి పూర్తిగా నిరాశే ఎదురవుతుంది. సెకండాఫ్‌లో సరైన కథ లేకపోవడం.. చిన్న సమస్యను లాగి లాగి చెప్పాల్సి రావడంతో.. చేసేది ఏమీ లేక..పాత సినిమా పాటలతో సినిమాను క్లైమాక్స్ వరకు లాగే ప్రయత్నం చేశారు. కార్తీకదీపం, పిన్ని పాటలపై డ్యాన్సులు ఊర్లలో రికార్డు డ్యాన్సుల కంటే దారుణంగా చిత్రీకరించారు. కనీసం క్లైమాక్స్‌లోనైనా కొత్తగా చెప్పి ఆడియెన్స్ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాడా? అని ఆశించిన వారికి పూర్తిగా నిరాశే మిగులుతుంది. వెరసీ ఈ సినిమా నాసిరకరమైన ఫ్యామిలీ, రొమాంటిక్ డ్రామాగా ముగిసిందనే ఫీలింగ్ వెంటాడుతుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. రవితేజ నుంచి కొత్తగా ఆశించే నటన ఏమీ లేదు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే. కాబట్టి వేవ్‌లో కాకుండా ఫ్లోలో వెళ్లిపోయాడు. డింపుల్ హయతిది బలమైన పాత్రలా కనిపిస్తుంది. కానీ పెర్ఫార్మ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేకపోవడం వల్ల ఆమె కూడా ఏమీ చేయలేకపోయింది. ఈ సినిమాలో పూర్తిగా ఫుల్ మార్కులను ఆషికా రంగనాథ్ కొట్టేశారు. పొట్టిదుస్తుల్లో అందాల ఆరబోతతో స్క్రీన్‌ను ఫుల్లుగా హీట్ ఎక్కించింది. గ్లామర్ పరంగానే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకొన్నది. ఈ సినిమాలో ఏదైనా క్రెడిట్ ఏదైనా ఎవరికైనా ఇవ్వాలంటే.. అది ఆషికాకే ఇవ్వాల్సి ఉంటుంది. సత్య ఉన్నంత సేపు ఫుల్లుగా నవ్వించాడు. ఓ దశ తర్వాత ఆయన కామెడీ కూడా ఓవరాక్షన్ మాదిరిగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ పంచ్ డైలాగ్స్ అక్కడక్కడ పేలాయి. సునీల్, మురళీధర్, రోహన్ కామెడీ ఆకట్టుకోలేకపోయింది.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాలోని పేలవమైన సన్నివేశాలకు భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బలాన్ని ఇచ్చింది. పాటలు ఆడియెపరంగానే కాకుండా సినిమాల్లోకూడా బాగున్నాయి. కానీ వాటి ప్లేస్‌మెంట్ సరిగా లేకపోవడం, వెంటవెంటనే పాటలు రావడం వల్ల అవీ తెర మీద మరింతగా ఆకట్టుకోలేకపోయాయి. విదేశీ అందాలను ప్రసాద్ మూరెళ్ల తన కెమెరాలో అద్బుతంగా బంధించాడు. కంటెంట్ లేకపోయినా సన్నివేశాలను కలర్‌ఫుల్‌గా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే ఇంకా కంటెంట్‌పై కొంత ఫోకస్ చేసి ఉంటే ఈ సినిమా అవుట్‌పుట్ మరోలా ఉండేది.
విశ్లేషణ:
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అందుకు కారణం యాక్షన్ పాత్రలు వదిలేసి ఫ్యామిలీ ఒరియెంటెడ్ సబ్జెక్ట్‌తో రవితేజ రావడం ఒకటి అయితే, మరోటి డైరెక్టర్ కిషోర్ తిరుమల. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి వంటి బ్యూటిపుల్ లవ్ స్టోరీలతో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి కుటుంబ కథా నేపథ్యం సినిమాలతో మెప్పించారు కిశోర్ తిరుమల.
దానికితోడు భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి. అవి చూస్తే దాదాపుగా కథ మొత్తం అర్థమైపోతుంది. పెళ్లయిన హీరో ఫారెన్‌కు వెళ్లి మరో అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉండటం, అది తెలియకుండా కవర్ చేయడం, చివరికి తెలిసాక ఏం జరిగింది అనేదే మూవీ కథ.
ఇది ఒక రెగ్యులర్ స్టోరీనే. వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు వంట్లింట్లో ప్రియురాలు మూవీలాగా అనిపిస్తుంది. ఇప్పటి జెనరేషన్‌కు తగినట్లుగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాను మలిచారు కిషోర్ తిరుమల. ఒకరికొకరి నిజం తెలియనివ్వకుండా రవితేజ చేసే పనులు కామెడీ తెప్పిస్తాయి.
నిరాశపరిచే క్లైమాక్స్
ఈ క్రమంలో వచ్చే సత్య, వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్ హాయిగా నవ్విస్తుంది. డైలాగ్స్ చాలా బాగా పేలి నవ్విస్తాయి. అయితే, కథనం మాత్రం నెమ్మదిస్తుంది. టేకింగ్‌లో డైరెక్టర్ తడబడిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఆకట్టుకోవాల్సిన క్లైమాక్స్ మాత్రం కాస్తా నిరాశపరుస్తుంది.
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ అందంగా ఉన్నాయి. ఎడిటింగ్ బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. బీజీఎమ్ ఓకే. గుర్తుండిపోయేలా పాటలు అలరిస్తాయి. హీరో హీరోయిన్ల డ్యాన్స్ అదిరిపోయింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఆడియెన్స్‌ను నవ్వించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.
పాత రవితేజ కనిపిస్తాడు. సీరియస్ పాత్రలతో వచ్చిన రవితేజ ఈసారి తన ఎనర్జీతో అలరిస్తాడు. కామెడీ టైమింగ్, డీజే మిక్స్ సాంగ్‌లో స్టేప్పులు అదిరిపోతాయి. ఇద్దరు హీరోయిన్స్‌కు ప్రాధాన్యత ఉంది. భార్యగా డింపుల్ సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చింది.
మెప్పించిందా అంటే?
ప్రియురాలిగా ఆషిక రంగనాథ్ గ్లామర్‌తో అట్రాక్ట్ చేస్తుంది. నటిగా కూడా ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలు అంతా బాగా చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే రొటీన్ స్టోరీ అయిన ప్రేక్షకులను నవ్వించే భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీపై లుక్కేయవచ్చు.

రేటింగ్: 3/5