Not the end - 55 in Telugu Mythological Stories by Ravi chendra Sunnkari books and stories PDF | అంతం కాదు - 55

Featured Books
  • નિર્દોષ - 2

    ​અધ્યાય ૩: શંકાનું બીજ અને બુદ્ધિનો અજવાળ​૩.૧. તર્કની લડાઈ​ઇ...

  • સૂર્યકવચ

    ​સૂર્યકવચ: કેદીનું સત્ય – તપાસનો નાટ્યાત્મક વળાંક​પ્રકરણ ૧:...

  • ટેલિપોર્ટેશન - 1

    ટેલિપોર્ટેશન: પહેલું સંકટ​આરવની ગાથા (Aarav Ni Gatha)​પાત્ર...

  • એકાંત - 56

    કુલદીપ અને ગીતા એમનાં ઘરેથી ભાગી ગયાં હતાં. ગીતાનાં પપ્પાએ એ...

  • MH 370- 23

    23. દરિયાઈ વંટોળમાંફરીથી કોઈ સીટી વાગી અને હવે તો કેટલાંયે સ...

Categories
Share

అంతం కాదు - 55

ఇప్పుడు నారదుడిని చూస్తూ 'అమ్మో నారదా, ఇప్పుడు నా కొంపకి నిప్పంటావు కదా అయ్యా!' అని అనుకుంటూ 'అమ్మ చెప్పేది వినండి' అని అంటున్నాడు. తన భార్య కూడా గట్టిగా ఏడుస్తూ 'అమ్మ, నాన్న' అని అరుస్తుంది. అక్కడికి యమపురి రాణి యొక్క అమ్మా నాన్నలు వస్తారు. 'ఏమైంది అమ్మ? ఎందుకు ఏడుస్తున్నావ్?' అని అంటాడు. 'చూడండి, మీరేమో పెళ్లి చేశారు, ఇప్పుడు నాకు ఇష్టం లేనట్టుగా నా కూతురికి వేరే వాళ్ళతో పెళ్లి చేయాలని చూస్తున్నాడు మీ అల్లుడు. ఏం చేస్తారో నాకు తెలియదు. నా కూతురికి ఇష్టం వచ్చినట్టు చేయాలి. ఈ ప్రయత్నం చేయకపోతే మీ అందరినీ నేను బ్రహ్మదేవుడు దగ్గరికి చేరుస్తాను. ఆయన చెప్తాడు ఏం చేయాలో' అని భయపెట్టడం మొదలుపెట్టింది. 'అమ్మో అమ్మో, ఇది ఎక్కడిది రా మామ? ఇప్పుడు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారా? వద్దులే ఆగండి! ఒక చిన్న ప్రశ్న, మీరు చెప్పినట్టే చేస్తా' అని అంటాడు. అందరూ ఒక్క క్షణం అలా నిలబడతారు. 'నేను చెప్పేది విను తల్లి, నేను చివరిసారిగా అడుగుతున్నా. నీకు అమ్మా నాన్న కావాలా? మానవుడి ప్రేమ కావాలా?' అని అడుగుతాడు. ఒక్క నిమిషం ఆలోచించడం మొదలు పెట్టింది. 'నాకు మీ ప్రేమ, మానవుడితో ఆత్మబంధం కలిసి కావాలి నాన్న' అని అంటుంది మాయ.

యముడి వరం, మాయ త్యాగం

గట్టిగా అరుస్తున్నాడు యముడు, "అది అసాధ్యం! మీకు కేవలం ఒకటి మాత్రమే కనిపిస్తుంది. నిన్ను వదలడం మాకు కూడా ఇష్టం లేదు కానీ ఇప్పుడు చెప్తున్నా ఇదిరా దైవ రహస్యం. ఒక దైవశక్తులు కలిగిన ఒక మహిళ భూమి మీదకి వెళ్లి అక్కడ జీవనం సాగించాలి అంటే, ఇప్పుడున్న నీకున్న ఈ శక్తులు తగ్గిపోవాలి, మాతో కనెక్షన్ తెగిపోవాలి" అని గట్టిగా చెప్తాడు. ఒక్క క్షణం విత్తరి పోయింది మాయ. "ఏమంటున్నారు నాన్న? నేను మిమ్మల్ని వదిలి జీవితాంతం బ్రతకడం, నాకు జీవం పోసిన మిమ్మల్ని నేను వదులుకోవాలని నేను ఎప్పుడూ అనుకోను. మీ ఇష్టం మీరు ఏదైనా చేయండి" అని గొంతులో నుంచి బాధ తన్నుకు వస్తూ ఉండగా తల దిండు మొహానికి హత్తుకొని అలా పడుకుంటుంది. తన బాధ చూసిన తండ్రి మనసు మరోసారి కరిగింది.

"చూడు తల్లి, నువ్వు అంతగా అతనితో జీవించాలి అని అనుకుంటున్నావు కాబట్టి నీకు నేను ఒక వరం ఇస్తాను. ఏంటంటే, నీకు పెళ్లి అయినప్పుడు మాతో ఎటువంటి సంబంధం ఉండదు. కానీ నీకు ఎప్పుడైతే పిల్లలు పుడతారో, అప్పుడు నీకు భర్త యొక్క ప్రేమ తగ్గి, పిల్లల యొక్క ప్రేమ పెరుగుతుంది. కాబట్టి అప్పుడు మేము మమ్మల్ని కలుసుకోవడానికి నీకు ఛాన్స్ వస్తుంది. నువ్వు నీకు పెళ్లి కానంతవరకు మాతో నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నీకు ఒక్కసారి పెళ్ళైన తర్వాత మాకు మీకు అసలు సంబంధం ఉండదు" అని చెబుతాడు. "ధన్యవాదాలు నాన్న, కనీసం ఇటువంటి వరం అయినా ఇచ్చినందుకు" అని గట్టిగా ఏడుస్తూనే తన నాన్నను హత్తుకుంటుంది. అప్పుడు యముడు కూడా ప్రేమగా హత్తుకుని తమ తల నిమురుతూ, "తల్లి, ఎంత త్వరగా తల్లివైతే నీ తండ్రి మళ్ళీ నీ చెంతకు వస్తాడు" అని అంటాడు యముడు.

విక్రమ్, మాయల ప్రేమ ప్రయాణం

అలా అక్కడ కట్ చేస్తే, చివరిగా ఒక రోజు ఆఫీసుకు వెళ్తున్న విక్రమ్‌కు ఒక పెద్ద వెలుగుతో మాయ తన ఎదుట నిలబడుతుంది. మాయను చూసిన తర్వాత విక్రమ్ కళ్ళల్లో జీవం వచ్చినట్టుగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ "వచ్చేసావా? ఎలా వచ్చావు? మీ నాన్న వద్దన్నాడు కదా?" అని బాధగా అడుగుతూ సంతోషంగా హత్తుకుంటాడు. వాళ్ళిద్దరూ అలా ప్రేమలో మునిగితేలి, చివరికి ఒకరోజు విక్రమ్ వాళ్ళ నాన్నకు మాయను పరిచయం చేసి పెళ్లి కుదుర్చుకుంటాడు. అలా ఇప్పుడు సీన్ కట్ అవుతూ కార్లో వెళ్తున్న మాయా మరియు విక్రమ్‌ల ఫేసులు చూపిస్తారు.

మాయ మాయాజాలం, పోలీసు ఎంక్వైరీ

అలా సీన్ కట్ చేస్తూ ఒక చిన్న ఎడారి ప్రాంతంలో, చెట్లు ఎక్కడా లేని ప్రదేశంలో ఆపుతాడు. అక్కడ మాయ దిగి, "జాగ్రత్త, నేను వచ్చేసరికి ప్రమాదాలు ఏమీ లేకుండా చూసుకో. మనం ప్రశాంతంగా మన జీవితాన్ని గడిపేద్దాం" అని చిన్నగా ముద్దు పెడుతుంది. "ఏంటి, ఇన్ని రోజులకు ఒక్క కిస్సేనా ఇచ్చేది?" అని అంటాడు విక్రమ్. "పెళ్లి కాని ముద్దుల వర్షంలో మునిగితే వెళ్దాం" అని చిన్నగా చెబుతూ, తను బ్లాక్ డ్రెస్లోకి మారి చెయ్యి పైకి ఎత్తి ఒక్కసారిగా స్పీడ్‌గా ఆకాశంలోకి వెళుతుంది. విక్రమ్ ఇంకా చేసేది ఏమీ లేక నిరాశగా తన డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లిపోయి పడుకుంటాడు.

మరుసటి రోజు జాన్ చెప్పిన ఆఫీసర్ అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాడు. "ఎవరు ఎక్కడికి వెళ్లారు? ఏం చేస్తున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎవరు మిస్ అయ్యారు?" అని అన్ని అడుగుతున్నాడు. చివరిగా విక్రమ్ బయటకు వచ్చి "ఏంటయ్యా, మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఏదో అడుగుతున్నారు? మేము ఎవరో తెలుసు కదా?" అని అంటాడు. "తెలుసు, మీ మీద కేసు అప్లై అయింది. దానికోసం ఎంక్వైరీ చేస్తున్నాం" అని అంటాడు. "ఎవడు వాడు నామీద కంప్లైంట్ ఇచ్చినవాడు? ఎవడు వాడు?" అని అడుగుతాడు. "అవన్నీ సీక్రెట్. అయితే సీక్రెట్‌గా చేసుకోవాలి. అంతేకానీ 10 మంది ముందు వచ్చి మా కుటుంబాన్ని ఇలా నిలదీయడమేంటి? నా గురించి నీకు తెలియదు అనుకుంటా. నన్ను నేను తక్కువ చేసుకోను. నన్ను ఎవరైనా తక్కువ చేస్తే అసలు ఒప్పుకోను" అని అంటాడు. ఇంట్లో ఎంత ఎంక్వయిరీ చేసినా ఎటువంటి క్లూ లేకపోవడంతో అతను బయటికి వెళ్లిపోతాడు.

విక్రమ్lదర్యాప్తు, రావణ్ సవాలు

అప్పుడే జాన్ ఫోన్ చేసి "ఇక్కడికి వెళ్ళండి, అవకాశం ఉంది" అని అంటాడు. వెంటనే అక్కడికి వెళ్తూ ఉండగా విక్రమ్‌కి అనుమానం వస్తుంది. వెంటనే ఏదో ఆలోచించి స్పీడ్‌గా ఎక్కడికో వెళ్తాడు. ఒక దగ్గరికి వెళ్లి అక్కడ ఒకరిని బెదిరిస్తాడు. గుండుబాస్‌ను బెదిరించి వస్తాడు. కార్లో నిదానంగా వస్తూ పాటలు పాడుకుంటూ వచ్చేస్తాడు. కట్ చేస్తే, అప్పుడు యుద్ధంలో 100 మందిని చంపి పక్కన పడేసి కాలుస్తా, బెదిరిస్తా అని భయపెట్టి వాళ్ళను చంపేశాడు కదా విక్రమ్. ఆ చోటికి వస్తారు. అక్కడ పెద్దగా శవాలు కనిపించలేదు కానీ రక్తపు మరకలు, బాంబులు వేసినట్టుగా గుంతలు, ఎవరో కొట్టినట్టుగా పెద్ద పెద్ద పాదం అడుగులు... ఇలా భయంకరమైన అడుగులు కనిపిస్తూ ఆధారాలను వెతుకుతూ ఉండగా, అక్కడికి గుండు బాస్ వచ్చి "సార్, ఇక్కడ ఒక పెద్ద విధ్వంసం జరిగింది. ఏంటంటే ఎవరో ఒక యోధుడు వచ్చి వీళ్ళందర్నీ చంపేశాడు. అది నా కళ్ళారా చూశాను" అని అంటాడు. "ఎవరు వాడు?" అని విక్రమ్ ఫోటో చూపిస్తే "వీడు కాదు సార్. వాడు ఎర్ర కళ్ళతో, నల్లటి పెదాలతో భయంకరంగా ఉన్నాడు" అని ఏదో ఒక స్టోరీ చెప్పాడు. "ఏంట్రా వీడు పిచ్చోడిలా ఉన్నాడు? పట్టుకొని రా. ఇది ఇన్వెస్టిగేషన్ ఇక్కడి నుంచి చేద్దాం" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే విక్రమ్ స్టైల్‌గా తిరుగుతూ "ఏంట్రా? దొంగల్ని పట్టుకున్నారా మీ పోలీస్ ఆఫీసర్స్? ఆఫీసర్స్ ఎప్పుడు ఇలాగే చేస్తారు, మంచి వాళ్ళని పట్టుకుంటారు, దొంగల్ని చేరదీస్తారు" వెక్కిరిస్తున్నట్టుగా మరోసారి తన కాలును గట్టిగా భూమి మీద కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. "ఇంకా ఎవడు వాడు నా మీద కేసు అప్లై చేసింది? ఎవరు వాడు?" అని అనుకుంటూ ఇంటికి వెళ్తాడు.

రావణ్, విక్రమ్ పోరాటం, లింగయ్య రూపాంతరం

కట్ చేస్తే రావణ్ అటు ఇటు వెతుకుతూ ఆ మణి యొక్క శక్తి ఆధారంగా వెతుకుంటూ విక్రమ్ వాళ్ళ ఇంటిముందు వస్తాడు. అది నైట్ కావడం వల్ల రాత్రిపూట దాడి చేయకూడదని ఒక లెటర్ రాసి అక్కడ పెట్టి ఉంటాడు. పొద్దున్నే పోస్ట్ బాక్స్‌లో చూడగా అతనికి ఒక లెటర్ ఉంటుంది. అందులో "రావణ్ ఫర్ యు, వెయిటింగ్ ఫర్ యు" అని ఉంటుంది. పురాతన భాషలో ఆ ప్లేస్ గురించి రాసి ఉంటాడు. ఇక ఇక్కడ కట్ చేస్తే విక్రమ్ దాన్ని గట్టిగా పట్టుకొని పిసికి పడేస్తూ "ఎవడు వాడు? వీడేనా నా మీద పోలీస్ ఆఫీసర్స్‌కు కంప్లైంట్ చేసింది? వీడిని వదలకూడదు. మాయ వచ్చేలోపు ఎటువంటి ప్రమాదం లేకుండా మా జీవితం సాగిపోవాలంటే ఎటువంటి వాళ్ళను అసలు వదలకూడదురా. చూసుకుందాం, ఎవరు గొప్ప చూసుకుందాం" అని అంటున్నాడు. అలా అక్కడ కట్ అవుతుంది.

ఇక ఆ రోజు పొద్దున్నే 10:00 గంటలకు ఆఫీస్‌కి వెళ్తున్నానని వెళ్తున్నాడు. అతని వేగం మామూలుగా కనిపించడం లేదు. అటు ఇటు తిప్పుతూ స్పీడుగా రోడ్డు వెంబడి పంపిస్తూ ఒకచోట ఆపుతాడు. బాగా ఎండ కాస్తున్నట్టుంది, చెమటలు పడుతున్నాయి. "ఎక్కడరా వీడు? నన్నేమో రమ్మన్నాడు, వీడు ఎక్కడున్నాడు? ఎండలో నన్ను చంపేద్దామని చూస్తున్నాడా? ఎండకు చనిపోయేవాడు కాదు విక్రమ్" అని అనుకుంటూ చూస్తున్నాడు. ఇంకొద్ది సేపటికి ఏదో శబ్దం. అతని కళ్ళు నల్లగా మారాయి. చుట్టూ చూస్తున్నాడు. ఏదో వింత శబ్దం. ఒక దూరంగా ఒక మనిషి నిలబడినట్టు కనిపిస్తూ ఉండగా "ఏంట్రా భయపడ్డావా? మాయా రూపంలో దాక్కొని ఉన్నావా? రారా, చూసుకుందాం. నాకు ఓపిక చాలా తక్కువగా ఉంది. ఎంత స్పీడ్‌గా కనిపిస్తే అంత స్పీడ్‌గా అక్కతో అయిపోతుంది" అని అంటున్నాడు. "మొదటిగా చిన్న ప్రశ్న, యుద్ధం సరాసరి చేస్తే అనర్థమే. నాకు కావాల్సింది అడుగుతా, ఇవ్వాల్సింది ఇవ్వు మధ్యమా" అని అంటున్నాడు. "చూసుకుందాం రా, ఏం కావాలి నీకు?" అని అంటారు. "నీ చేతిలో ఉన్న మణి కావాలి, నాగమణి కావాలి" అని అంటాడు. "ఇది ఎందుకురా నీకు? ఇది నాదిరా, నేను పూర్వజన్మ నుంచి కాపాడుకుంటూ వచ్చాను" అంటాడు. "అరె పిచ్చి సచ్చినోడా, అది నీది కాదు. అది మా గురువు గారిది. ఆ జన్మలో నువ్వు దొంగతనం చేసి ఇక్కడికి వచ్చి చచ్చావురా" అని అంటాడు రావణ్. వెంటనే విక్రమ్ "నేను ఇవ్వను, ఏం చేసుకుంటావో రా!" అని అంటాడు.

"రేయ్, ఏందిరా, ఎప్పుడు యుద్ధాలేనా? రెండు మూడు రోజుల క్రితమే వందమందిని చంపావు. ఇప్పుడు మళ్ళీ నాతో యుద్ధం అంటున్నావ్. కానీ నాతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా?" అని పరిగెడుతూ ఒక్కసారిగా భూమిలోకి వెళ్తాడు. నీతో పజిల్ లాంటిది పైకి లేస్తుంది. చుట్టూ భయంకరమైన శబ్దాలతో ఒక చిక్కు ప్రశ్న లాంటి ఒక ఓపెనింగ్ స్టార్ట్ అయింది. "నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను పట్టుకోగలిగితే నువ్వు దమ్మున్నోడివే రా" అని అంటాడు. "ఏంట్రా, నిన్ను పట్టుకోవడానికి దమ్ము కావాలా? నా బలం చాలు!" అని అంటూ లోపలికి అడుగు పెడతాడు. వెంటనే భూమి నుంచి రావణ్ విక్రమ్ కాలును పట్టుకొని గట్టిగా విసిరి గోడకేసి కొడతాడు. "దొంగ సచ్చినోడు, ఏంట్రా ఇలా కొట్టావ్? నిన్ను వదలనురా!" అని "ఎక్కడున్నావ్ రా? బయటికి రా, బయటికి వచ్చి మాట్లాడుకుందాం రా!" అని అంటాడు. "నిన్ను పట్టుకోమన్న నేను కనిపిస్తా అని చెప్పాలా? దమ్ముంటే పట్టుకో!" అని అంటాడు. "ఇదేదో బాగుంది, ట్రై చేద్దాంలే" అని అంటూ ఆ పదాన్ని అలాగే గుర్తుపెట్టుకోవడం మొదలుపెట్టాడు విక్రమ్. ఎంత వెతికినా రావణ్ కనిపించడం లేదు. రావణ్ మాత్రం విక్రమ్‌ను ఎగిరెగిరి తంతున్నాడు. చివరికి "ఇక నాకు ఓపిక లేదురా" అని అంటూ తన శక్తిని ఆక్టివేట్ చేసుకున్నాడు. ఎక్కడున్నాడో కనిపిస్తూ ఉంది. ఇద్దరూ భారీగా కొట్టుకుంటున్నారు. ఆ దెబ్బకు గోడలు పగిలిపోతున్నాయి. మెల్లగా బయటకు వచ్చాడు రావణ్. రావణ్‌ను చూసి "ఏంట్రా, ఎంత యంగ్ బాయ్‌గా ఉన్నావ్? ఇంత పెద్ద మహాశక్తి ఎలా వచ్చింది రా నీకు?" అని అంటున్నాడు విక్రమ్. "నీ కంటే ఎక్కువ కాదు కదా?" అని అంటూ రావణ్ తన చేతిలోకి గద తీసుకున్నాడు. గదతో ఊపుతుంటే విక్రమ్ ఎగిరి పడుతున్నాడు కానీ తనకు దెబ్బలు తగలడం లేదు. ఎందుకంటే తన కవచం దగ్గరే ఉంది కదా. ఆ కవచానికి కనీసం మట్టి కూడా అంటడం లేదు. ఇద్దరూ అంతసేపు కొట్టుకున్నారు.