Can you be my partner?! - 1 in Telugu Love Stories by Stories books and stories PDF | నా జతకాగలవా?! - 1

The Author
Featured Books
Categories
Share

నా జతకాగలవా?! - 1






రాత్రి 11:30 అవుతుండగా మబ్బులు పట్టిన ఆకాశం కురవనా వద్దా అని ఆలోచిస్తున్నట్టుగా ఉంటే... నీకోసమే వేచి చూస్తున్నాము అన్నట్టుగా చెట్లన్నీ ఊగుతూ హోరుగా వీస్తుంది గాలి...

దట్టమైన మబ్బుల మధ్యన దాగుతూ బయటపడుతూ వెన్నల దోబూచులాడుతుంటే ఆ వెన్నల వెలుగుకి,గాలికి లేత ఆకులు మెరుస్తూ వన్నెలుబోతున్నాయి....

ఆ సొగసును తాకడానికి ఇక ఆలస్యం చేయలేను అన్నట్టు వర్షపు బిందువొకటి నేల రాలి లేలేత ఆకు మీద గర్వంగా నిలవగా... ఆ వెనకే జోరుగా మొదలయ్యింది వర్షం...

ఎంత అందమైనదో ప్రకృతి...!!

కాని ఆ అందాన్ని ఆస్వాదించే పరిస్థితుల్లో లేని అతను... ఛ.. నా కర్మకు ఈ వర్షమోక్కటే తక్కువయ్యింది అని తిట్టుకుంటూ బైక్ ఒక పక్కన ఆపి పెద్ద చెట్టు కింద నిలబడి ఫోన్ చూసుకోగా అది కాస్త బాటరీ డెడ్ అయ్యి కనిపిస్తుంది...

విసుగుతో దాన్ని విసరబోయి చివరి క్షణం లో పాంట్ ప్యాకెట్ లో దోపుకుని టైమ్ చూసుకుంటాడు...

వీడి సర్ప్రైస్ తగలయ్య... ఇప్పుడు వీడిని ఎవడు అడిగాడు మమ్మల్ని సర్ప్రైస్ చేయమని... అందరికీ హ్యాపీగానే ఉన్నా నాకు మాత్రం ఇక్కడ వాచిపోతుంది అని ఎవరినో తిట్టుకుంటూ ఉండగా పెద్దగా వినిపిస్తుంది ఒక అమ్మాయి అరుపు...

గాడ్... ఈ టైమ్ లో ఈ సౌండ్స్ ఏంటి..? వర్షానికి టెంప్ట్ అయ్యి ఏ దయ్యమో డాన్స్ చేయట్లేదు కదా అని తనలో తను అనుకుంటూ ఉండగానే మరోసారి 'హెల్ప్' అని వినిపిస్తుంది అదే గొంతు...

ఆ మాటకు సెకండ్ కూడా లేట్ చేయకుండా సౌండ్ వచ్చిన వైపుగా పరిగెడతాడు అతను...

వీధి లైట్లు కూడా లేని రోడ్ మీద మధ్యమధ్యలో మెరుపులతో కూడుకున్న ఉరుముల వెలుగులో ఒక అమ్మాయిని నలుగురు అబ్బాయిలు రౌండప్ చేసినట్టుగా నీడలు మాత్రమే కనిపిస్తున్నాయి...

వెంటనే అటువైపుగా పరిగెత్తి ఆ అబ్బాయిల్లో ఒకడి వీపు మీద వెనకనుండి తన్నగా వాడు ఎదురుగా ఉన్న అమ్మాయి మీద పడబోతుండటం గమనించి సెకండ్ లో రియాక్ట్ అవుతూ ఒంటి చేత్తో ఆ అమ్మాయి నడుము పట్టుకుని లిఫ్ట్ చేసి పక్కన నిలబెడతాడు అతను...

ఆ ప్రాసెస్ లో అనుకోకుండా ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూసిన అతను ఆ కలువ కళ్ళల్లో లాక్ అయిపోతాడు...

వర్షానికి తడిదేరి అతుక్కుపోయిన కనుపాపలు, బెదురుతున్న కళ్ళనిండా కన్నీళ్లు... పొడవాటి కనుబొమ్మల మధ్య బ్లాక్ స్టిక్కర్ ఆ కళ్ళకు ఇంకాస్త అందాన్ని పెంచిందేమో అన్నట్టుంది... ఆ అందమైన కళ్ళల్లో కన్నీళ్లు చూడటం నచ్చకపోతుంటే మరోచేత్తో కళ్ళు తుడుచి... భయపడకు అని చెప్పి తన కళ్ళను ఇంకాస్త కిందికి దించి మొహం చూసేలోగా ఉరుము వల్ల వచ్చిన వెలుగు మాయమయ్యి చీకటి నెలకొంది...

వీళ్ళు... వీళ్ళు... ప్లీజ్ హెల్ప్ మీ...

ష్... నేనున్నాను కదా... భయపడకు అని చీకటిలోనే భరోసా ఇస్తుండగా అతని తల వెనక రోడ్ పక్కన పడున్న చెక్క కర్రతో గట్టిగా కొడతాడు అంతకుముందు దెబ్బ తిన్నవాడు...

అంతే... ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు అతను..

కళ్లుతెరిచిన అతనికి తను తన రూమ్ లో ఉన్నాడని అర్ధమయ్యి డీప్ బ్రీత్ తీసుకుని వదిలి మొహాన్ని రెండు చేతులతో రుద్దుకుని బెడ్ దిగుతాడు అసహనంగా...

టైమ్ ఉదయం అయిదవుతున్నట్టు చూపిస్తుంటే... కల వల్ల పుట్టిన విసుగును తీర్చుకోను చాలాసేపు పంచింగ్ బ్యాగ్ కి తన పంచ్ పవర్ చూపించి గంట తరువాత చెమటలు కక్కుతున్న దేహాన్ని షవర్ కింద నిలబెడతాడు...

అరచేతులను గోడకు అణిచిపెట్టి మూసుకున్న కళ్ళమాటున ఏవేవో దృశ్యాలు... కొన్ని ఆనందాన్ని ఇస్తే, కొన్ని ఆలోచించేలా చేస్తే, ఒక్క దృశ్యం మాత్రం తన కళ్ళనిండా నీళ్లు నింపింది...

మరో అరగంట షవర్ కిందే గడిపేసి బయటకు వచ్చిన అతను తన వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఒక సాదాసీదా షర్ట్, జీన్స్ వేసుకుని ఒక చేతికి వాచ్ ఇంకో చేతికి పడుకునేముందు అలవాటుగా తీసి పక్కనపెట్టిన వెండి కడియం వేసుకుని హెయిర్ ని వేళ్ళతో సెట్ చేసుకుని... కింది సెల్ఫ్ లో ఉన్న చిన్న లగేజ్ బ్యాగ్ ఓపెన్ చేస్తాడు...

నైట్ సర్దుకున్న బ్యాగ్ నే మరోసారి చెక్ చేసుకుని లాకర్ లో ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్ ని జాగ్రత్తగా బ్యాగ్ అడుగు భాగాన దాచి...
"ఇంద్రజిత్ " గా ఉన్న ఐడెంటిటీ ప్రూఫ్ కార్డ్స్ అన్నీ లాకర్ లో దాచి... "అజిత్ " గా దగ్గరుండి ప్రిపేర్ చేయించుకున్న ఫేక్ కార్డ్స్ ని పర్స్ లో పెట్టుకుని ఆ రూమ్ దాటుతూ గోడకు తగిలించి ఉన్న ఫోటో వైపు చూసి వెనక్కి వచ్చి ఆ ఫోటోని ఏ భావం లేకుండా నిమిరి గబగబా బయటకు వస్తాడు...

అప్పటికే బుక్ చేసిన క్యాబ్ రెడీగా ఉండటంతో ఆ క్యాబ్ లో హైదరాబాద్ లోనే ఒక ఏరియాకి చేరుకుని క్యాబ్ డ్రైవర్ ని వెయిట్ చేయమని చెప్పి తనకు బాగా పరిచయమున్న ఇంట్లోకి వెళ్తాడు ఇంద్ర...

అరగంట తరువాత బయటకు వచ్చిన అతను మళ్ళీ క్యాబ్ లో కూర్చుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళు అని చెప్పి ఫోన్ లో రాజమండ్రి వెళ్లేందుకు ఫ్లయిట్ టికెట్ కోసం చూడగా మరుసటిరోజు వరకు ఫ్లైట్స్ అవైలబుల్ గా లేనట్టు చూపిస్తుంది...

ఛ... విసుగును మించిన చిరాకు అతనిలో చోటుచేసుకోగా బస్ స్టేషన్ కి వెళ్ళు అని డ్రైవర్ కి చెప్పి అతను యూటర్న్ తీసుకోగానే కళ్ళుమూసుకుని తలను వెనక్కి వాలుస్తాడు...

కొంతసేపటికి కార్ ఆగినట్టు తెలిసి చుట్టూ చూసి డ్రైవర్ కి ఫేర్ ఇచ్చేసి ఫాస్ట్ గా లోపలికి వెళ్లి రాజమండ్రికి టికెట్ తీసుకుని ఏసీ బస్ లో కూర్చుని ఆలోచనలకు వెల్కమ్ చెప్తాడు...

ఎనిమిది గంటల సుదీర్ఘ ప్రయాణం తరువాత బస్ దిగి అక్కడినుండి ఇంకో క్యాబ్ పట్టుకుని స్టార్ట్ అయ్యి గంట తరువాత మహేంద్రవరం ( కల్పితం ) అనే చిన్న గ్రామంలో అడుగుపెట్టి అటుగా వెళ్తున్న ఒక తాతను పిలిచి...

తాత... ఇక్కడ శేఖర్ అంకుల్ వాళ్ళ ఇల్లు ఎక్కడుంటుంది...? కొంచెం దారి చెప్తారా అని అడుగుతాడు...

మా శేఖర్ బాబుగారి కోసం వచ్చావా... చూస్తుంటే పట్నం నుండి వచ్చినట్టున్నావు... ఈ పల్లెటూరిలో అన్ని సంధులూ ఒకేలా ఉంటాయి... దారి చెప్పినా కనుక్కోలేవుగాని నేను తీసుకెళ్తాను రా బాబు అని శేఖర్ గారి మీదున్న అభిమానంతో తనే ఇంద్రను తీసుకెళ్లి ఒక ఇంటి ముందు నిలబెట్టి...

ఇదే శేఖర్ బాబు గారి ఇల్లు... లోపలికి వెళ్ళు బాబు అని అప్పటికే సాయంత్రం అవ్వడంతో తన పశువులను చూసుకోను పొలానికి వెళ్ళిపోతాడు ఆ తాత...

తాతల కాలంనాటి ఇల్లని చూడగానే తెలిసేలాంటి కట్టడం తో శేఖర్ గారి తెలివికి తగ్గట్టు మోడీఫై చేయించడం వల్ల అటు ట్రేడిషనల్ ఇటు ట్రెండీ లుక్ కవర్ చేసేలా కనిపిస్తుంది రెండంతస్థుల విశాలమైన బంగ్లా...

బంగ్లా నుండి గేట్ వరకు పాత మార్బుల్స్ వేసుండి చూడటానికి చాలా అందంగా ఉంది...

విశాలమైన గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లిన ఇంద్ర గుమ్మం దగ్గరే నిలబడి... అంకుల్ అని గట్టిగా పిలుస్తాడు...

'అజిత్' కోసమే ఎదురుచూస్తున్న శేఖర్ గారు బయటకు వచ్చి ఎవరు కావాలి బాబు అని అడుగుతారు...

నన్ను మూర్తి అంకుల్ పంపించారు అంకుల్...

అజిత్...?

అవునంకుల్...

నీకోసమే చూస్తున్నాను బాబు... ప్రయాణం బాగా జరిగిందా... అని అభిమానంగా అడుగుతారు

చాలా బాగా జరిగింది అంకుల్ అని చెప్పి చిన్నగా నవ్వుతాడు అజిత్...
( ఇకనుండి అవసరాన్ని బట్టి ఇంద్ర, అజిత్ పేర్లు మారుతూ ఉంటాయి... ఇద్దరూ ఒకరే... కన్ఫ్యూస్ అవ్వకండి )

సుజాత... సుజాత...

వస్తున్నానండి అంటూ కిచెన్ నుండి చేతులను నాప్కిన్ కి తుడుచుకుంటూ వచ్చిన సుజాత గారు అజిత్ ని చూసి... ఈ అబ్బాయికోసమేనా మీరు ఉదయం నుండి కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నారు అని నవ్వుతూ అడుగుతారు...

నా ప్రాణస్నేహితుడు తన ఆత్మీయ బంధువును మనింటికి పంపిస్తే ఈమాత్రం ఉత్సాహం ఉండకుండా పోతుందా...

మ్మ్... మీ ఉత్సాహంతో అబ్బాయిని బెదరగొట్టకండి అని చెప్పి అజిత్ ని చూసి... మూర్తి అన్నయ్యగారు ఎలా ఉన్నారు బాబు... అని అడుగుతారు

చాలా బాగున్నారు ఆంటీ... విజయ ఆంటీ మీకోసం ఇవి పంపించారు అని బూందీ లడ్డులు ఉన్న బాక్స్ ఇస్తాడు...

వాటిని చూసి గర్వంగా భార్యకు ఒక లుక్ ఇచ్చి... అది నా స్నేహితుడికి చెల్లమ్మకి నామీదున్న ప్రేమ... నా ఇష్టాలను గుర్తుపెట్టుకుని పంపించారు చూసావా అంటారు శేఖర్ గారు...

ఈ లడ్డుల్లో కంటే మీ ఒంట్లో కావాల్సినంత షుగర్ ఉంది... కాబట్టి నాకు మీ ఇష్టాలకంటే ఆరోగ్యమే ముఖ్యం...

హహహ... అవి షుగర్ ఫ్రీ ఆంటీ...

అంటే ఈ స్వీట్స్ తిన్నా షుగర్ పెరగదు అంటావా బాబు...

అవునాంటీ...

అలా అయితే రోజుకొకటి ఇస్తానులేండి... అని చెప్పి నువ్వు ఫ్రెష్ అవ్వు బాబు భోజనం చేసేద్దువు గాని... ఎప్పుడు తిన్నావో ఏంటో... అంటారు సుజాత గారు..

అవును... ఎప్పుడు తిన్నాడు తను...? అసలు తనను తాను పట్టించుకుంటేనే కదా గుర్తుండటానికి...

ఆకలిగా లేదు ఆంటీ... పర్లేదు..

కొత్త అని మొహమాటపడుతున్నావేమో... అలాంటివేమి పెట్టుకోకు అజిత్... మూర్తి చెప్పాడు నీకు 3-6 నెలల పని ఇక్కడే ఉందని... నీకు కావాల్సినన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు... నువ్వు మూర్తి కుటుంబానికి బంధువ్వి అయితే మాక్కూడా బంధువే... కాబట్టి నీకేది కావాలి అనిపించినా అడిగి మరీ చేయించుకో... అంటారు శేఖర్ గారు..

ఆయన అభిమానానికి చిన్నగా నవ్వి తలను ఊపుతాడు అజిత్...

పైన రూమ్ క్లీన్ చేయించాను... మీరు అబ్బాయికి రూమ్ చూపించండి... నేను భోజనాలకు రెడీ చేస్తాను అని చెప్పి సుజాత గారు కిచెన్ లోకి వెళ్తే అజిత్ ని పైకి తీసుకెళ్తారు శేఖర్ గారు...

ఇదే నీ రూమ్ అజిత్... నచ్చిందా...?

చాలా బాగుంది అంకుల్... థాంక్యూ..

అరే... చుట్టాలకు థాంక్స్ చెప్తారా ఎక్కడైనా... త్వరగా ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి ఆ రూమ్ నుండి బయటకు వచ్చి రైలింగ్ పట్టుకుని కిందకి చూస్తూ... మంగా అని పనిమనిషిని కేకేస్తారు...

ఏంటి పెద్దయ్య...?

రేపు దక్ష వస్తుంది... తన రూమ్ కూడా క్లీన్ చేసి పెట్టు అని చెప్పి వేరే రూమ్ కి వెళ్ళిపోతారు శేఖర్ గారు...



Continues.... ❣️