Part - 1
ఆత్మహత్య (Suicide)
అందమైన సముద్ర తీరం కలిగిన విశాఖపట్టణం. సాఫ్టవేర్ రంగం బాగా పుంజుకుంటున్న తరుణం లొ పెద్ద పెద్ద కంపనీలు వాళ్ళ శాఖలను విశాఖపట్టణం లొ పెడుతున్నారు. అలా వచ్చిన వాటిలొ
ఒక పెద్ద సాఫ్టవేర్ కంపనిలొ ఇంటర్వ్యూస్ (Interviews) జరుగుతున్నాయి.
అర్జున్ అనె ఒక మామూలు మద్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ ఇంటర్వ్యూ (Interview) కి వచ్చాడు. అతడు ఎంతొ కష్టపడి పార్ట టైమ్ జాబ్ చెసుకుంటు ఇంజినేరింగ్ మరియు ఎంటెక్ (Mtech) పూర్తి చేసాడు. తనకి ఈ ఉద్యోగం వస్తె తన ఇంటి సమస్యలన్నీ తీరిపోతాయి అని అనుకుంటు ఉండాగా.
కాసేపటికి తనని ఇంటర్వ్యూ (Interview) కి అని లోపలికి పిలిచారు. అక్కడ వాళ్ళు పెట్టిన పరిక్షలలొ మరియు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఎంతొ సమర్ధవంతంగా సమాధానాలిచ్చి. ఆ ఉద్యోగాన్నీ సంపాదించాడు.
అలా ఆ ఉద్యోగాల్లొ చేరిన 5 సంవత్సరాలలొ తన నైపుణ్యం మరియు తెలివితేటలతొ మంచి పొజిషన్ కి చేరుకున్నాడు.
అంతె కాకుండా ఈ 5 సంవత్సరాలలొ తను షేర్ మార్కట్ లొ చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టి బాగా సంపాదించాడు కూడా.
అలా తన సంపాదన తొ తన తండ్రి కి గుండె ఆపరేషన్ చేయించాడు. తన చెల్లి ని చదివిస్తున్నాడు. తన కుటుంబం ఉండడానికి తన సొంత ఊరు విజయనగరం లొ ఒక ఇల్లు కొన్నాడు మరియు విశాఖపట్టణం లొ తన ఉండడానికి అపార్టమెంట్ లొ ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు.
వాళ్ళ తల్లితండ్రులు తనకి మీరా అనె ఒక అమ్మాయి ని చూసారు ఆమెది విశాఖపట్టణం. ఆ అమ్మాయి తన తల్లి దండ్రుల తొ కలిసి ఉంటుంది ఒక్కర్తె కూతురు. అర్జున్ కి మరియు తన కుటుంబానికి మీరా నచ్చింది.
మీరా ది కూడా మద్యతరగతి కుటుంబం కావడంతొ ఎటువంటి కట్నం తీసుకోకుడా పెళ్ళి కి కూడా పెద్ద ఖర్చు పెట్టకుండా అర్జున్ మీరా ని పెళ్ళి చేసుకున్నాడు.
మీరా అందమైన మరియు తెలివైన అమ్మాయి. అర్జున్ తొ కలిసి చాలా అన్యోన్యంగా ఉండేది. అర్జున్ కూడా తనని బాగా చూసుకునే వాడు.
అలా వీళ్ళ పెళ్ళి అయి 6 నెలలు గడచాయి. ఒకరోజు అర్జున్ కంపని పని మీద బెంగుళూరు వెళతాడు. వారం రోజులు తరువాత తెల్లవార్ఝామున తన ఇంటికి తిరిగి వస్తాడు.
కాలింగ్ బెల్ కొడతాడు. కాని తన భార్య తలుపు తీయ్యదు. చాలా సేపు కాలింగ్ బెల్ కొట్టాడు గాని ఎంతకి మీర తలుపు తియ్యకపోయె సరికి అర్జున్ మీరా మొబైల్ కి కాల్ చేస్తాడు కాని స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంక లాభం లేదు అని తన దగ్గర ఉన్న స్పేర్ తాళం చెవి (spare key) తొ తలుపు తీసి లోపలి కి వెళతాడు.
లోపల ఇంట్లొ మీరా కోసం వెతుకుతూ వాళ్ళ పడక గదిలోకి వెళతాడ. ఆ గదిలొ కూడా మీరా ఉండదు. సరే ఎక్కడికైన బయటికి వెళ్ళి ఉంటుందని అనుకోని స్నానానికి వెళతాడు.
కాసేపటికి అర్జున్ ఫ్రేష్ అయ్యి బయటకి రాగానె కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరా అని తీసి చూస్తె పని మనిషి.
పనిమనిషి లోపలికి వచ్చి చీపురుతొ ఇల్లు శుభ్రం చేయడం మొదలు పెడుతుంది. అలా శుభ్రం చేసుకుంటు పక్క గది తలుపు తీయగానె మీరా ఫాన్ కి ఉరి వేసుకొని చనిపోయి ఉంటుంది.అది చూసి పనిమనిషి గట్టిగా అరుస్తుంది. ఏమైందని అర్జున్ వస్తాడు ఎదురుగా తన భార్య శవం ఫాన్ కి వేలాడుతూ కనిపంచేసరికి ఒక్కసారి దిగ్బ్రాంతి లోనై భయ పడతాడు.
కాసేపటికి పోలీసులు వస్తారు. మీరా శవాన్నీ క్రిందకి దించి పంచనామా (Postmortem) కి పంపిస్తారు. ఫారన్ సిక్ బృందం (Forensic team) ఆధారాల కోసం ఇల్లు అంతా వెతుకుతారు. పోలీస్ వాళ్ళు అర్జున్ ని మరియు పనిమనిషిని విచారణ చేస్తున్నారు.
ఫారాన్ సిక్ బృందం (Forensic team) వాళ్ళ కి మీరా మొబైల్ మంచం క్రింద దొరుకుతుంది. అది స్విచ్ ఆఫ్ అవ్వడం తొ దాన్నీ తీసుకొని వెళతారు.
మరుసటి రోజు మీరా మొబైల్ తెరిచి అందులొ ఉన్న వీడియోలు, ఫోటోలను, మరియు వాట్సాప్ చాట్ లన తనకి చేస్తుండగా వాళ్ళు ఒక వీడియొ తీసి చూస్తారు.
అందులొ మీరా తాను అత్మహత్య చేసుకుంటున్నట్టు, తన చావు కి కారణం తన భర్త అర్జున్, అతని తల్లిదండ్రులు మరియు అతని చెల్లి అని. అదనపు కట్నం కోసం వాళ్ళు పెట్టె హింస భరించలేకె చనిపోతున్నట్టు మరణ వాంగ్మూలం ఇచ్చి ఉరి వేసుకుంటున్నట్టు ఉంది.
పంచనామా (Postmortem) రిపోర్టు లొ కూడా మీరా ఉరి తీసుకోవడం వల్లె చనిపోయినట్టు ఉంది. అంతె కాదు ఆ శవం మీరా దె అని facial recognition మరియు DNA test ద్వారా ధృవీకరిస్తారు
దాంతొ పోలీసులు అర్జున్ మరియు అతని కుటుంబాన్నీ అదుపులోకి తీసుకుంటారు. పత్రికలలొ మరియు టీవి చానెల్సుల లొ ఇది పెద్ద వార్త గా మారుతుంది. ప్రజలు మరియు మహిళా సంఘాలు అర్జున్ మరియు అతని కుటుంబానికి కఠిన శిక్ష వేయాలని గొడవచేయడం మొదలు పెట్టారు.
పోలీసులు అర్జున్ మరియు అతని కుటుంబాన్నీ కోర్టు లొ హాజరు పరిచారు. విచారణ నిమిత్తం కోర్టు వారం రోజులు గడువు ఇచ్చింది.
పోలీస్: చెప్పు అర్జున్ అదనపు కట్నం కోసం నీ భార్య ని వేధించావా?
అర్జున్ : లేదు. నేను తనని వేధించలేదు.
పోలీస్ : మరి ఎందుకు మీరా ఆ వీడియొ అలా చెప్పింది?
అర్జున్ : అదె నాకు అర్ధం కావడం లేదు. కాని నేను తనని బాగా చూసుకునె వాడిని.
పోలీస్ : నీకు నీ భార్యకు మద్యన ఏమైన గొడవలు జరిగాయా.?
అర్జున్ : లేదు.
పోలీస్ : మరి తన ముఖం మీద ఆ గాయాలు ఏంటి?
అర్జున్ : అవి ఎలా వచ్చాయొ నాకు తెలీదు. నేను తనపై ఎప్పుడు చెయ్యి చేసుకోలేదు.
ఇలా ఉండగా ఆ విచారణ చేస్తున్న పొలీసు అధికారికి తన పై అధికారి నుంచి కాల్ వస్తుంది.
పై అధికారి: ఎంటయ్య ఎంత వరకు వచ్చింది విచారణ?
పోలీస్ : ఇంకా అవుతున్నాది సార్.
పై అధికారి : ఇంకా అవ్వడం ఎంటయ్యా. ఆధారాలన్ని పక్కాగా అతనే తప్పు చేసాడు అని చూపిస్తుంటె.
పోలీస్ : అవును సార్ కాని నా ఉద్ధేష్యం ప్రకారం అర్జున్ బ్యాక్ గ్రౌండ్ బట్టి చూస్తె అతను మంచివాడు అనిపిస్తుంది.
పై అధికారి : ఇక్కడ నీ ఉద్ధేష్యాల తొ పని లేదు. అసలె బయట మీడియా, పబ్లిక్ మరియు మహిళా సంఘాల నుంచి తీవ్ర ఒత్తడి వస్తుంది. త్వరగా తేల్చేయి.
పోలీస్ : సరే సార్.
సాక్ష్యాలు మరియు ఆధారాలు అన్నీ అర్జున్ మరియు అతని కుటుంబానికి వ్యతిరేకంగా ఉండడంతొ. కోర్టు అర్జున్ కి 7 సంవత్సరాలు శిక్ష విధిస్తుంది. కాని తన తల్లిదండ్రులకి మరియు తన చెల్లి కి ఎటువంటి సంబంధం లేదు అని అర్జున్ వాళ్ళ వకీల్ (Lawyer) కోర్టు లొ వాధించడం తొ వాళ్ళ కి ఎటువంటి శిక్ష పడలేదు.
ఇదే వార్త ని తమ ఇంట్లొ నుంచి టీవి లొ చూస్తున్నారు మీరా తల్లిదండ్రులు.
అలా చూస్తు మీరా తండ్రి తన భార్య ఉన్న వైపు కి తిరిగి " మనం అనుకున్నట్టె అర్జున్ కి శిక్ష పడింది. ఇప్పుడు తరువాత ఏంటి? " అని అంటాడు. తన భార్య కూడా భర్త చూస్తున్న వైపుకి తిరిగుతుంది.
" తరువాత ఏంటి అనేది సమయం వచ్చినప్పుడు చెబుతాను నాన్న " అని మీరా అంటుంది.
దాంతొ వాళ్ళిద్దరు సంతోషంగా ఊపిరి పీల్చుంటారు.