Project T in Telugu Adventure Stories by SriNiharika books and stories PDF | ప్రాజెక్ట్ T

Featured Books
Categories
Share

ప్రాజెక్ట్ T

టైటిల్ :ప్రాజెక్ట్  " T"                       

అది 2027జూలై 5

ఉదయం 11 గంటలు

.
. ప్రజ్ఞ దేవ్ ఒక పార నార్మల్ ఇన్వెస్టిగేటర్ అంటే దయ్యాలతో మాట్లాడే అనుభవమున్న వ్యక్తి.  అయితే ఈ మధ్య పది సంవత్సరాల పరిశోధనలు ఫలితంగా ఒక కొత్త టెక్నాలజిని డెవలప్ చేశాడు .
.
.
.
.
.అదేమిటంటే దయ్యాలతో మాట్లాడటమే, కాదు చనిపోయిన వ్యక్తులతో కూడా మాట్లాడి వారు చెప్పకుండా చనిపోయిన విషయాలను తన డివైస్ ద్వారా ఆ చనిపోయిన వ్యక్తుల ఆత్మతో కాంటాక్ట్ ఎన్నో విషయాలు తెలుసుకునే ఒక గొప్ప డివైస్ను  ప్రజ్ఞ దేవ్ కనిపెట్టాడు...
.
.
. ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్ అయినటువంటి తన ఫ్రెండ్ సూర్య ఒక జర్నలిస్ట్ హత్య కేసును చేదించలేక ఆ జర్నలిస్ట్ ఎలా చంపబడ్డాడు?
అని తెలుసుకోవడానికి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు తీసుకొచ్చి ప్రజ్ఞ దేవ్ దేవ్ కు ఇచ్చాడు..
.
.
.
‌ ఎందుకంటే ఈ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మతో మాట్లాడేటటువంటి ఈ ప్రాసెస్ లో ఆ చనిపోయిన వ్యక్తి కి సంబంధించినటువంటి వస్తువులు కానీ అతను యుజ్ చేసుకున్నటువంటి బట్టలు కానీ అత్యంత కీలక పాత్ర వహిస్తాయి .
.
..
.
అందుకే తన ఫ్రెండ్ అయినటువంటి ఆఫీసర్ సూర్య, ఆ చనిపోయిన జర్నలిస్టు ఒక బట్టలు తీసుకొచ్చి ఇచ్చాడు .
.
.రెండు నెలల క్రితం చనిపోయిన ఆ జర్నలిస్ట్ గౌతమ్ యొక్క వివరాలు తెలియజేయవలసిందిగా తన ఫ్రెండ్ అయినటువంటి ప్రజ్ఞ దేవ్ కు ఇచ్చాడు.
.
..
..
. తర్వాత ఆ బట్టల సహాయంతో ప్రజ్ఞ దేవ్ చనిపోయిన జర్నలిస్ట్ యొక్క ఆత్మతో మాట్లాడగలిగాడా మాట్లాడితే ఏం జరిగిందనేది ఇకపై మీరే చదవండి.....

హాయ్ గౌతమ్ ......
ఆ మాటలు విన్న గౌతమ్ కు ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలినట్టు అయింది .చనిపోయి రెండు నెలల అవుతున్న నాతో ఎవరు మాట్లాడుతున్నారు ??అని ఆశ్చర్యం భయం కలిగాయి గౌతమ్ కు.......
.
..
.

నేను పరనార్మల్ ఇన్వెస్టిగేటర్ ను, నా పేరు ప్రజ్ఞాదెవ్ అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు ప్రజ్ఞ దేవ్.....
.
.
.పారనార్మల్ ఇన్వెస్టిగేటర్ అంటే ఏంటో తెలియదు అన్నట్టు మొహం పెట్టాడు గౌతమ్ అది గమనించిన ప్రజ్ఞ దేవ్ వెంటనే....
.
.అంటే చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడే వాడ్ని.. అని క్లారిటీ ఇచ్చాడు ప్రజ్ఞా దేవ్ .
.
‌.
‌.
.

గౌతమ్ ఆశ్చర్యపోతూ.....
అసలు చనిపోయిన వారి ఆత్మలతోఎలా మాట్లాడతారు అది అసలు ఎలా మీకు సాధ్యం సార్?? అన్నాడు

బదులుగా ప్రజ్ఞదేవ్... సాధ్యమే గౌతమ్, ఈ ప్రాసెస్ మొత్తమ్ బ్రెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది .

ఏం అర్థం కానట్టు మొహం పెట్టి  బ్రెయిన్ మీద నా? నాకర్ధం కాలేదు సార్.. అన్నాడు గౌతమ్.
.
.
ఆత్మలతో మాట్లాడడానికి , బ్రెయిన్ కి చాలా దగ్గరి సంబంధం ఉంది. అని బదులిచ్చాడు ప్రజ్ఞ దేవ్..

గౌతమ్ ఆశ్చర్యపోతూ,ఎలా సార్? అన్నాడు

ఈ విషయం తెలుసుకునే ముందు మనిషి చనిపోయినపుడు ఏం జరుగుతుందో తెలియాలి? అంటూ తన కళ్ళజోడు తీశాడు ప్రజ్ఞ దేవ్..

గౌతమ్ మరింత ఆశ్చర్యంగా..ఎంటి సార్ అది? అన్నాడు.
.
.
ప్రజ్ఞాదెవ్: మనిషి చనిపోయినపుడు 21 నుంచి 24 గ్రాముల బరువు తగ్గుతాడు ఎందుకో తెలుసా? అని గౌతమ్ ను ప్రశ్నించాడు.

తెలియదు సార్? అని బదులిచ్చాడు గౌతం..

ప్రజ్ఞాదెవ్ మళ్లీ మొదలు పెడుతూ...
.
ఎందుకంటే అప్పటివరకు శరీరాన్ని కదిలించే శక్తి శరీరాన్ని వదిలేసి పోతుంది కాబట్టి . ఆ శక్తి నే ఎనర్జీ అంటుంది సైన్స్, దానినే సామాన్య ప్రజలు ఆత్మ అని అంటారు.

గౌతమ్ శ్రద్ధగా వింటున్నాడు...

ప్రజ్ఞాదెవ్, ఈ ఆత్మ లేదా ఎనర్జీ ని చూడాలన్న మాట్లాడాలన్న సాధారణ స్థితిలో పనిచేసే బ్రెయిన్ సరిపోదు, దానికి అసాధారణంగా పని చేసే బ్రెయిన్ కావలి. 

గౌతమ్ ఇంకా ఆశ్చర్యపోతూ..

సాధారణ, అసాధారణ బ్రెయిన్ అంటే ఎంటి సార్ అని ప్రశ్నించాడు..

ప్రగ్య దేవ్: మనిషి బ్రెయిన్ సాధారణంగా 10 శాతం మాత్రమే పనిచేసేస్తుంది. మిగతా 90 శాతం బ్రెయిన్ ఎందుకు పనిచేయకుండా అలా ఉండి పోయిందో ఇప్పటివరకు ఎవరికీ తెలీదు.10 శాతం పనిచేసే బ్రెయిన్ ను 70 శాతం పనిచేసే అసాధారణ బ్రెయిన్ గా మార్చేస్తే మనం ఆత్మ తో మాట్లాడొచ్చు చూడొచ్చు నేను అదే చేసా.

గౌతమ్ కు ఆశ్చర్యపోవడం అలవాటైపోయింది... 10 శాతం పనిచేసే బ్రెయిన్ ను 70 శాతం పనిచేసే బ్రెయిన్ గా ఎలా మార్చారు సార్?


ప్రజ్ఞాదెవ్: అదే ప్రాజెక్ట్ triangle,నా 10  సంవత్సరాల కష్టానికి ఫలితమే ఈ ప్రాజెక్ట్ triangle 


ప్రతిగా గౌతమ్ ,...
ఈ ప్రాజెక్ట్ triangle ద్వారా ఎలా మాట్లాడవచ్చు సార్? అసలు ఈ ప్రాజెక్ట్ triangle అంటే ఏంటి సార్?


ప్రజ్ఞాదెవ్ మళ్లీ....
.
.ఈ ప్రాజెక్ట్ triangleలో ప్రధానంగా 3 దశలు ఉంటాయి అవి initiation ఫేజ్,  యాక్షన్ ఫేజ్, termination ఫేజ్. Initiation  ఫేజ్ అంటే 10 శాతం పని చేసే బ్రెయిన్ ను 70 శాతం పనిచేసే బ్రెయిన్ గా మార్చే ప్రాసెస్ నే Initiation ఫేజ్ అంటారు . దీనికి 5 నిమిషాల టైమ్ పడుతుంది ఇది నేను తయారు చేసిన క్యాప్సుల్ తోనే సాధ్యమవుతుంది . ఇక రెండవ దశ స్టేట్ ఆఫ్ రియాక్షన్ , ఈ దశలో ఆత్మ లేదా ఎనర్జీ మనకు కనిపించడం, మనతొ మాట్లాడటం జరుగుతుంది, ఇది 10 నిమిషాలు . సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఒక్కసారిగా ఆత్మ తో సంబంధం కట్ అయి ఆత్మ కనిపించకుండా పోతుంది. చివరి దశను termination.70 శాతం పనిచేస్తున్న బ్రెయిన్ మెల్లిగా మెల్లిగా తన పనితనాన్ని తగ్గించుకుంటూ 10 శాతం పనిచేసే బ్రెయిన్ గా మారే ప్రాసెస్ ను termination అంటారు ఇది పదినిమిషాలు . మొత్తమ్ ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి 25 నిమిషాల టైమ్ పడుతుంది మధ్యలో మనం ఎంతలేపిన లేవడు . ఇంకోవిషయం ఏమిటంటే  సరిగ్గా 25 నిమిషాలు కంప్లీట్ అయిన తరవాత వెంటనే లేపాలి లేకపోతే ప్రాజెక్ట్ z స్టార్ట్ అవుతుంది. అది ఒక్కసారి స్టార్ట్ అయితే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే.


గౌతమ్ మధ్యలో కలుగజేసుకుంటూ "
.
..
."ఇంతకీ ప్రాజెక్ట్ zఅంటే ఏంటి సార్"? నిజంగా అది అంతా డేంజర్ రా? ప్రజ్ఞ దేవ్  కొద్ది క్షణాలు ఆలోచించి..


70 శాతం బ్రెయిన్ పనిచేయడం ప్రాజెక్ట్ triangle అయితే, 100 శాతం బ్రెయిన్ పని చేయడం ప్రాజెక్ట్z. 

మళ్లీ మధ్యలో గౌతమ్ కలుగజేసుకుంటూ....
..
..
.
100 శాతం బ్రెయిన్ పని చేయడం మంచిదే కదా సార్?అది ఎలా డేంజర్? అని అమాయకంగా అడిగాడు గౌతం..
.
.
.
ప్రజ్ఞ దేవ్ మొహం కొంచెం సీరియస్ గా మారి.

ఎందుకంటే మన  బ్రెయిన్70 శాతం పనితనాన్ని మాత్రమే తట్టుకుంటుంది. అంతకు మించి okka శాతం పెరిగిన నర్వ్ సెల్స్ మీద ఒత్తిడి పెరిగి  యాక్షన్ దశ నుంచీ initiation  దశకు రాకుండా బ్రెయిన్ డెడ్ చనిపోవడం దీన్నే ప్రాజెక్ట్z అంటారు. 

గౌతమ్ కనులు భయంతో పెద్దవి అయ్యాయి"ఓహ్ గాడ్ వింటేనే భయమేస్తుంది సార్,  మరి 25 నిమిషాల తరవాత ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్నీ ఎవరు లేపుతారు. ??

ఇంట్లో ఎవరూ లేరు కదా సార్? గౌతమ్ అడిగిన ప్రశ్నకు  ప్రజ్ఞ దేవ్ కొంచెం చిన్నగా నవ్వి...ఎవరు అవసరం లేదు కప్సూల్ వేసిన తర్వాత సరిగ్గా 25 నిమిషాల తర్వాత అలారం మోగేటట్లు సెట్ చేసాను. ఎవరు లేపనవసరం లేదు అలారమ లేపుతుంది. గౌతమ్ ఓహో అని కొంచెం తల ఊపి కొన్ని క్షణాలు ఆగి మళ్ళీ మొదలుపెట్టాడు....
ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు కాని, వ్యక్తుల్ని కాని మీరు చూడగలరా సార్? ప్రజ్ఞ దేవ్ కొంచెం బాధగా నిట్టూర్చి..

"లేదు. నాకెవరూ కనిపించరు, జరుగుతున్న విషయాలు కూడా ఏవి నాకు కనిపించవు వాటితో అస్సలు సంబంధం ఉండదు. వస్తువులను తాక గలుగుతాను కాని వాటితో ఏ చిన్న పని అయిన చేయలేనునేను మాట్లడుతున్న ఆత్మ ,బెడ్ మీద ఉన్న నా బాడీ తప్ప ఏవి నాకు కనిపించవు. ఇంకో విషయం ఏమిటంటే ఈ 25 నిమిషాలు నీకు  తప్ప మరి ఎవరికి నేను కనిపించను."


మళ్లీ గౌతమ్ అందుకుంటు .....
.
మరి చుట్టూ ఎన్నో ఆత్మలు ఉన్నాయి కదా? నా ఆత్మ తోనే ఎందుకు మాట్లాడుతున్నారు? వేరే ఆత్మలతో కూడా మాట్లాడే అవకాశం ఉంది కదా? చాలాసేపటి తర్వాత ఒక మంచి ప్రశ్న గౌతమ్ అడిగాడన్న ఆనందంతో మనసులోనే గౌతమ్ ను అభినందిస్తూ ప్రజ్ఞ దేవ్ మొదలుపెట్టాడు..

.
.
..
వేరే ఆత్మలతో ఖచ్చితంగా మాట్లాడలేను, కేవలం మీతో మాత్రమే మాట్లాడగల లుగుతను. ఎందుకంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీ బట్టలను స్మెల్ చేశాను కాబట్టి. నా బ్రైయిన్ మీ ఆత్మ ను మాత్రమే గుర్తుపడుతుంది.



కొన్ని క్షణాలు ప్రజ్ఞ దేవ్ ఆగి గౌతమ్ వైపు చూసి...

చెప్పండి గౌతమ్ మీరెలా చనిపోయారు?
.
రెండు నెలలు అవుతున్న మీరెలా చనిపోయారో ఇప్పటివరకు పోలీస్ వాళ్లకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. నా ఫ్రెండ్ సూర్య నీ బట్టలు పంపించి నీ తో మాట్లాడి కనుక్కో అన్నాడు? చెప్పు గౌతమ్ అసలు మీరెలా చనిపోయారు?
.
.
. ఊహించని ప్రశ్న ఎదురు కావడంతో గౌతమ్ చిన్నపాటిగా అసౌకర్యానికి గురై మళ్ళీ తేరుకొని చెప్పడం మొదలుపెట్టాడు
.........
.
.
.
.


"చిన్నప్పటనుంచీ జర్నలిస్ట్ కావాలన్న కసి తో ఎవ్వరికి తెలియకుండా ఒక రాజకీయ నాయకుడి అవినీతి అక్రమాలను షూట్ చేశాను. 
అది తెలిసి నన్ను కారుతో సహా సజీవ దహనం చేశాడు. ఆ మాటలు విన్న ప్రజ్ఞ దేవ్ కు గౌతమ్ మీద బాధ, జాలి కలిగాయి...

మళ్లీ గౌతమ్ మొదలు పెడుతూ.. నాతో పాటు పెన్ డ్రైవ్ కాలిపోయింది అనుకున్నాడు కాని కలిపోలేదు నా ఇంట్లో బీరువా లోని నా డైరీలో ఉంది సార్.
ఓకే గౌతమ్ గారు. ఆ పెన్ 
డ్రైవ్ పోలీస్ వాళ్లకు చేరెలగ నేను చూస్తాను అన్నాడు ప్రజ్ఞ దేవ్.
.
.
.


ప్రతి గా గౌతమ్,థాంక్స్ సార్ అంటూనే టైమ్ చూశాడు...
.
.
"సార్ ఇంకో 2 నిమిషాలు అయితే నాతో సంబంధం కట్ అవుతుంది సార్ రెండవ దశ అయిన  యాక్షన్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది సార్..". 

ఓ అలాగా...ఓకే గౌతమ్ బాయ్ 
నేను మెల్కోవలంటే ఇంకా 10 నిమిషాల టైమ్ పడుతుంది. ఇక నువ్వు వెళ్లొచ్చు బై.. బై  అని ప్రజ్ఞ దేవ్ అంటుండగా

గౌతమ్ ఒక్కసారిగా ......
.
."సార్ మీ ఇంట్లో ఎవరో వచ్చారు ? మీరు సెట్ చేసిన అలారం ఆఫ్ చేశారు సార్?

ఆ మాటలు విన్న ప్రజ్ఞ దేవ్ కు గుండెలు ఆగినంత పని అయింది...

వాట్ అలారం ఆఫ్ చేశారా? అన్నాడు ప్రజ్ఞా దేవ్ భయంగా.....

గౌతమ్, ప్రజ్ఞ దేవ్ ఇద్దరు గబగబా మేడ దిగి ఇంట్లో కి వచ్చారు....

..

Termination ఫేజ్ అయిపోయింది,కాని లేపడానికి ఎవరు లేక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకా కొద్దిసేపటికి ప్రాజెక్ట్ z స్టార్ట్ య్యే అవకాశం ఉంది..
.
. ఒక్కసారి ప్రాజెక్టు z స్టార్ట్ అయితే ఇక ప్రాణాల మీద ఆశ వదులుకోవడమే.
.

మరి నిజంగానే ప్రాజెక్ట్ z స్టార్ట్ అయిందా ,??లేకుంటే ప్రజ్ఞ దేవ్ ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు?? తర్వాత ఏం జరిగింది?? అనేది తర్వాత భాగంలో చూద్దమ్...                                             


       Written by 

SriNiharika