అది ఉత్తరఖాండ రాష్ట్రం లోని నైనితల్ నగరం. రాత్రి 10 గంటలు. ఒక బంగళాలొ
"ఆమ్మా తాతయ్య ఎందుకు ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు?" అని 7 ఏళ్ళ తనూజ్ వాళ్ళ అమ్మ ఊర్మిళ ని అడిగాడు.
ఇది విని నివ్వెర పోయిన ఊర్మిళ "అలా అని నీకు ఎవరు చెప్పారు..?"
ఆవలిస్తు " తాతయ్యా చెప్పాడు ఇందాక తన గదికి వెళ్ళి బయట ఉద్యాన వనం (Garden) లొ మనం ఆడుకుందాం రా తాతయ్యా అని అడిగితె అలా చెప్పాడు."
"ఎందుకు అమ్మా తాతయ్యా ఒక వారం రోజుల నుంచి బయటికి నాతొ ఆడుకోడానికి రావడం లేదు..?"
కొడుకు అడిగిన దానికి ఏం చెప్పాలొ తెలియక "అలా ఏం లేదు రా తాతయ్యకు ఆరోగ్యం బాగోలేక రావడం లేదు అంతె. నువ్వు ఇంక పొడుకొ" అని చెప్పి నిద్రపుచ్చింది.
పిల్లాడు నిద్రపోయాక ఊర్మిళ తన తండ్రి గదికి వెళ్ళింది. అప్పుడు నీరజ్ కళ్ళు మూసుకోని మంచం మీద పొడుకున్నాడు. ఇంకా నిద్రలోకి జారుకోలేదు.
అది గమనించి "నాన్న ఇంకా ఎన్ని రోజులు అని ఆ కట్టు కధని నమ్ముతు ఇలా భయపడుతు లోపలే ఉంటావు?"
కూతురి మాటలకు కళ్ళు తరిచి. నీరజ్ లేచి కూర్చున్నాడు.
"లేదు అమ్మ అది కట్టు కధ కాదు నిజం నన్ను నమ్ము. ఇప్పుడు నేను నా జివితపు చివరి దశ లొ ఉన్నాను చనిపోయి మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నా. నన్ను ఇలా వదిలెయ్యి" అని చెప్పి తిరిగి మంచం పై వాలి కళ్ళు మూసుకున్నాడు
ఇంక ఎంత చెప్పిన తండ్రి వినడు అని అర్ధం అయ్యి తన గది వెళ్ళింది.
ఊర్మిళ చిన్నప్పుడె తల్లి చనిపోయింది. తండ్రే తనని పెంచి పెద్ద చేశాడు.
అనాధ అయిన మంచి వాడు అని మరియు కూతురు ప్రేమించిందని మిలిటరి (Military) లొ మేజర్ (Major) గా పనిచేస్తున్నా కిషోర్ కిచ్చి పెళ్ళి చేశాడు.
2 ఏళ్ళ క్రితం నీరజ్ కు ఆరోగ్యరిత్య తనకు ఉపిరితిత్తులలొ సమస్య రావడంతొ. వైద్యులు (Doctors) తనకి స్వచ్ఛ మైన గాలి (fresh air) కావాలి అని .కాబట్టి కాలుష్యం తక్కువ గా ఉండె ప్రాంతం లొ ఉండాలని చెప్పడంతొ. ఊర్మిళ తండ్రి కొడుకు ని తీసుకుని నైనితల్ నగరానికి మారుతుంది.
కాని గత కొన్ని రోజులు గా తండ్రి ప్రవర్తనలొ మార్పు వచ్చింది. దేన్నో చూసి భయపడుతున్నాడు. బయటకి రావడం లేదు.
మందులు వేసుకోవడం లేదు.
వైద్యులు (Doctors) రోజు కొంచెం సేపు బయట తాజా గాలి (fresh air) లొ తిరగాలి అని చెప్పారు కాని తను బయటకు రావడం లేదు.
ఒకరోజు తండ్రిని నిలదీసింది. అప్పుడు నీరజ్ అసలు విషయం చెప్పడం మొదలు చేశాడు.
"తాను పెళ్ళి కాకమునుపు పాత ఢిల్లి (Old Delhi) లోని ఒక హోటల్లొ సర్వరు గా పనిచేశేవాడు. పేదరికం. తనకి వచ్చే జీతం పెద్దగా సరిపోయేది కాదు. అలా బ్రతుకు ఈడుస్తుండగా ఒకరోజు ఆ హోటల్ ప్రక్కన ఉన్న బార్ (Bar) లొ ఒకడు తగిలాడు.
మాటల్లొ వాడి ఊరు ఉత్తరాఖాండు లోని సీతల్ ఖేత్ అని. ఆ ఊరి దగ్గర ఉన్న ఉడైల్ ఘాటి అనె కొండ గురించి చెప్పాడు.
"అక్కడ పెళ్ళి కాకుండా చనిపోయిన అమ్మాయిలు మరియు అబ్బాయిల ప్రేతాత్మలు గా ఆ కొండ పై తిరగుతారట బ్రతికి ఉన్న వారు ధైర్యం చేసి ఆ కొండ మీద కు వెళ్ళి ఆ ప్రేతాత్మ ను పెళ్ళి చేసుకుంటె. వాళ్ళు కోరుకున్న జీవితం వాళ్ళకి దక్కుతుందట. కాని దానికి భారి మూల్యం చెల్లించుకోవాలి..."
నీరజ్ ఇలా ప్రతి రోజు ఆ తాగబోతు వాడి దగ్గర ఉడైల్ ఘాటి కొండ గురించి మరెన్ని విషయాలు అడిగి తెలుసుకునె వాడు. రాను రాను నీరజ్ కి ఆ తాగబోతు వాడి మాటలు పై నమ్మకం పెరగసాగింది.
దాంతొ తను ఆ ఉడైల్ ఘాటి కొండ పైకి వెళ్ళాలి అని నిర్ణయంచు కొని. ఒకరోజు బయలు దేరి పెళ్ళి బట్టల తొ ఆ కొండపైకి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి ఆ కొండపై పెళ్ళి కొడుకు లా తయ్యారు అయ్యి ఎదురు చూడసాగాడు.
అలా నీరజ్ ఆ ఉడైల్ ఘాటి కొండపై ఎదురు చూడసాగాడు. తాను ఆ కొండ కి వచ్చె మార్గ మద్యలొ ఎంతొ మంది ఆ కొండ వైపుకు వెళ్ళడం చూసి వెళ్ళద్దని హెచ్చిరించారు.
కాని నీరజ్ వాళ్ళ చెప్పేవి విని అది నిజమో కాదో తెలుసుకునేందుకె వెళుతున్నాను అని అందరికి చెప్పాడు.
అందరు చెప్పేది ఒకటె ఆ పెళ్ళి కాని ప్రేతాత్మల గురించి.
ఇలా ఆ కొండపై నీరజ్ జరిగినదంతా గుర్తుచేసుకున్నాడు. అర్ధ రాత్రి అయ్యింది. నిండు పౌర్ణమి కావడంతొ చీకటి లేదు.
ఇంతలొ తనికి ఒక చిన్న గొంతు వినిపించింది. చుట్టూ చూశాడు కాని ఎవరు కనబడలేదు. తన భ్రమ అనుకున్నాడు.
కాసేపటి తరువాత ఈసారి గాజులు మరియు గజ్జల చప్పుడు వినిపించాయి. మళ్ళి ఎవరా అని చుట్టూ చూస్తున్నప్పుడు తన భుజం పై ఒక చెయ్యి పడింది.
ఉలిక్కిపడ్డాడు కాని అరవలేదు. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు.
పెళ్ళి బట్టల్లో ఉన్న ఒక స్త్రీ కనిపించింది ఎదురుగా. తన ఒంటి పై చర్మం ఎండిపోయి ఉంది. తన ముఖం తెల్లగా పాలిపోయి ముడతలి పడి ఉంది. తన కళ్ళ కి కనురెప్పలు లేవు అందుకె కను గుడ్లు బయట కి ఉబ్బి ఇంకా పెద్దవి గా తన కళ్ళు కనిపించాయి.
సగం ఊడిపోయిన జుట్టు తొ విరబోసుకొని తన ముందు నిలబడి ఉన్న ఆ ప్రేతాత్మ ను చూసి బిగుసు కు పోయాడు నీరజ్.
"నన్ను పెళ్ళి చేసుకుంటావా...?" అని ప్రేతాత్మ నీరజ్ ని అడిగింది.
"చేసుకుంటాను" అన్నాడు వణుకుతున్న గొంతుతొ.
"అయితె రా " అని తనని లాక్కు వెళ్ళింది ఆ ప్రేతాత్మ.
అలా ఆ కొండపై ఒక పాడుబడిన మండపానికి తీసుకు వెళ్ళింది. ఆ మండపంలొ ఆ ప్రేతాత్మ ని పెళ్ళి చేసుకున్నాడు నీరజ్.
పెళ్ళి జరిగిన మరు క్షణం ఆ ప్రేతాత్మ మాయం అయి పోయింది.
తెల్లవారబోతోంది నీరజ్ ఆ కొండ పై నుంచి క్రిందకి వచ్చి ఢిల్లి వెళ్ళిపోయాడు.
అలా కొన్ని రోజుల తరువాత తనకి అనుకోకుండా లాటరీ (Lottery) లొ 10 లక్షలు వచ్చాయి. ఆ డబ్బుతొ చిన్న వ్యాపారం పెట్టాడు. తరువాత తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. వ్యాపారం లొ బాగా లాభాలు పొంది అనతి కాలంలోనె ధనవంతుడి గా ఎదిగాడు.
ఇలా నీరజ్ తన కూతురు ఊర్మిళ కి తన గతాన్నంతా చెప్పాడు. కాని అసలు విషయం చెప్పే లోపల మనవడు తనూజ్ ఏడుపు వినబడింది. దాంతొ ఊర్మిళ తన గదిలోకి వెళ్ళ బోతు వెనక్కి తిరిగి తన తండ్రి వైపు చూసింది.
నీరజ్ తిరిగి మంచం పై వాలి కళ్ళు మూసుకున్నాడు.
నీరజ్ కి వయసు మీద పడతున్న కొద్ది తను చెల్లించాల్సిన భారి మూల్యం గుర్తుకు రాసాగింది. తనలొ భయం పెరగసాగింది. భార్య మరణం తన ఆరోగ్యం క్షీణించేలా చేసింది.
అందుకె ఇంతలాగా తను భయపడుతున్నాడు.
మరుసటి రోజు తన మనవడు తనూజ్ పుట్టిన రోజు. ఆ రోజు సాయంత్రం తన ఇంట్లొ పుట్టిన రోజు విందు (Birthday party) జరిగింది కాని నీరజ్ మాత్రం బయటకి రాలేదు.
ఆ రోజు రాత్రి మనవడు తనూజ్ నీరజ్ గదికి వచ్చాడు. మనవడిని చూసి తన దగ్గరికి తీసుకున్నాడు.
ఊర్మిళ తన గది లొ తాను నిద్రపోతుంది.
"తాతయ్యా ఇవ్వాళ నా పుట్టిన రోజు కదా మరి నేను అడిగంది చేస్తావా" అని మనవడు నీరజ్ ని అడిగాడు.
"ఓ తప్పకుండా చేస్తాను రా మనవడా అడుగు"
"నా మీద ఒట్టు" అని తనూజ్ తన తల చూపాడు.
"ఒట్టు. చెప్పు ఏం చెయ్యాలి"
"నాతొ Garden లొ ఆడుకోడానికి రా తాతయ్య" అని అడిగాడు.
నీరజ్ తన భార్య ఫొటొ (photo) వంక చూసి చిన్న నవ్వు నవ్వి
" పద రా మనవడ" అని ఉద్యాన వనం (Garden) లోకి వెళ్ళారు.
కాసేపటిి కి పెద్ద అరుపు వినిపించి ఉలిక్కి పడి లేచింది ఊర్మిళ.
"అది ఆ అరుపు తనూజ్ గొంతు లా ఉందె" అని ఊర్మిళ ఉద్యాన వనం (Garden) లోకి పరిగెట్టింది.
అక్కడ ఆకాశంలొ చూస్తు తనూజ్ "తాతయ్యా తాతయ్యా" అని అరుస్తున్నాడు.
ఆ ప్రేతాత్మ వచ్చి నీరజ్ ని తీసుకొని వెళ్ళి పోయింది.
నీరజ్ ఊర్మిళ కి చెప్పాలి అనకున్న భారి మూల్యం ఇదె. తనని ఆ ప్రేతాత్మ శాశ్వతంగా తనతొ పాటు ప్రేతాత్మ గా మార్చి ఉంచుకుంటుంది.
ఆ ప్రేతాత్మ ఇంట్లో కి రాలేదు. అందుకె నీరజ్ బయటకు వచ్చేంత వరకు ఎదురు చూసింది. రోజు కిటికి దగ్గర కి వచ్చి నీరజ్ ని రమ్మని పిలిచేది.
అందుకె నీరజ్ భయపడి ఇంతకాలం బయటకు రావడం మానేశాడు.