Dynamic Director Puri Jagannath in Telugu Short Stories by SriNiharika books and stories PDF | డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్

Featured Books
  • Do you Love Me - 1

    Episode 1: The First QuestionThe college campus was full of...

  • Beyond His Memory

    Once upon a time, in a small village, lived a young woman na...

  • Parents

    The Two LampsIn a small village near an ancient temple, ther...

  • Lakshmi Amma - 2

    Sumit had gradually accepted the strange comfort of being ca...

  • Specialz - 3

    S- Such a b- big amount!W- Why would master g- give me?This...

Categories
Share

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ 

పూరి జగన్నాథ్ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రసిద్ధ దర్శకుడు, రచయిత మరియు నిర్మాత. ఆయన తన ప్రత్యేకమైన దర్శకత్వ శైలికి, వేగవంతమైన చిత్రీకరణకు మరియు శక్తివంతమైన సంభాషణలకు ప్రసిద్ధి చెందారు. 

పూరి జగన్నాథ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు:

పుట్టుక మరియు విద్య:

ఆయన 1966 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ లోని, పలాసలో జన్మించారు. 

సినీ ప్రస్థానం:

1996లో 'గోకులంలో సీత' సినిమాకు సహాయ దర్శకుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత, 2000లో 'బద్రి' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. 

ప్రత్యేకతలు:

ఆయన చిత్రాలలో వేగవంతమైన సంభాషణలు, స్టైలిష్ విజువల్స్ మరియు పవర్-ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సులు ప్రత్యేక ఆకర్షణ. 

ప్రముఖ సినిమాలు:

'బద్రి', 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం', 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి', 'శివమణి', 'నేనింతే', 'బిజినెస్ మాన్', 'ఇడియట్', 'పోకిరి', 'టెంపర్' వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. 

అవార్డులు:

ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నారు. 

ఇటీవలి చిత్రాలు:

'లైగర్' మరియు 'ఇస్మార్ట్ శంకర్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. 

మనం Reality కి దగ్గర గా...ఉంటున్నామా!...


డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ వరుస హిట్ సినిమాలతో దూసుకుపోవడం మనం చూసాం. తరువాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ఇచ్చిన తరువాత వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.కానీ పూరీలో ఉన్న టాలెంట్ ని తక్కువ అంచనా వెయ్యలేము ఎందుకంటే పూరి చేసిన ఇడియట్, బద్రీ, లే ఒక ఉదాహరణ.
ఇక తాజాగా పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా ‘రీప్లేసబుల్‌’ అనే అంశంపై మాట్లాడారు. అది నాకు చాలా బాగా నచ్చింది. 
ఎందుకంటే ఈ మధ్య ఈ నాకు తెలిసిన చాలా మంది ఆఫీసర్స్, స్టాఫ్, రిలేటివ్స్ రిటైర్మెంట్ అయ్యారు. వీళ్ళందరికీ ఇది అర్ధం అవ్వాలని, రియాలిటీ కి దగ్గరగా ఆలోచించాలని కోరుకుంటున్నా.... 
ఆయన మాట్లాడుతూ.. ”ఒక సిస్టమ్‌, ఆర్గనైజేషన్‌, రిలేషన్‌షిప్‌ ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకరితో రీప్లేస్‌ చేయొచ్చు. ‘నేను లేకపోతే ఈ కంపెనీ.. ఆఫీస్‌.. ఇల్లు.. రాష్ట్రం.. దేశం.. ఏమైపోతుందో’ అని చాలా అనుకుంటారు. ఏం నష్టం లేదు. అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి.
ఏం నష్టం లేదు. అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి. మీలో ఉన్న ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో ఉండవచ్చు. మీకున్న అనుభవం, మీరు ఆలోచించే విధానం, మీరు ఆఫీస్‌కు వచ్చినప్పుడు మీతో వచ్చే ఎనర్జీ ఇలా ఎన్నో మంచి లక్షణాలు మీలో ఉండవచ్చు. ఆ విషయంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అయినా, మీ టైమ్‌ బాగుండకపోయినా, దగ్గర పడినా అందరూ పక్కన పెడతారు”
”ఎన్నో ఏళ్లు పనిచేసిన ఆఫీస్ లో మీ రిటర్మైంట్‌ రోజున బాగా భావోద్వేగానికి గురవుతూ మాట్లాడుతూ ఉంటారు.

”ఎన్నో ఏళ్లు పనిచేసిన ఆఫీస్ లో మీ రిటర్మైంట్‌ రోజున బాగా భావోద్వేగానికి గురవుతూ మాట్లాడుతూ ఉంటారు. అప్పటివరకూ సాధించిన వాటి గురించి చెబుతూ ఉంటారు. కానీ, ఇటు మీ స్పీచ్‌ నడుస్తుంటే, మీ యాక్సిస్‌కార్డును ఇంకొకడు డి-యాక్టివేట్‌ చేస్తుంటాడు. మరొకడు మీ అఫీషియల్‌ మెయిల్‌ ఐడీ పాస్‌వర్డ్‌ మార్చేస్తాడు. మీకు కాఫీ ఇచ్చే బాయ్‌ అప్పటికే మీ డెస్క్‌ ఖాళీ చేసి, అన్నీ మీ కారులో పెట్టేసుంటాడు. 

మీ సహచర ఉద్యోగులు మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతున్నామని కన్నీళ్లతో చప్పట్లు కొడుతూ ఉంటారు. అదే సమయంలో మీ తర్వాత ఆ కుర్చీలో కూర్చొనేవాడు మీ పక్కనే బాధగా నిలబడి, మీ స్పీచ్‌ అయిపోగానే ఓ పెగ్‌ వేద్దామని చూస్తుంటాడు. వీడ్కోలు పార్టీ అయిపోగానే అందరూ మిమ్మల్ని మర్చిపోతారు. ఆ తర్వాత జీవితం అంతా ఇంట్లోనే”
”ఆఫీస్‌ నుంచి ఎవరైనా వచ్చి మీ సలహాలు, సూచనలు తీసుకుంటారని ఎదురు చూడొద్దు. ఎవడూ రాడు. ఏదైనా సలహా కావాలంటే చాట్‌-జీపీటీని అడుగుతాడు.

”ఆఫీస్‌ నుంచి ఎవరైనా వచ్చి మీ సలహాలు, సూచనలు తీసుకుంటారని ఎదురు చూడొద్దు. ఎవడూ రాడు. ఏదైనా సలహా కావాలంటే చాట్‌-జీపీటీని అడుగుతాడు. ప్రపంచం ఎంతో వేగంతో పరిగెడుతోంది. కళ్లు మూసి తెరిస్తే అన్నీ మారిపోతాయి. మనం అందరూ మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా? స్టీవ్‌జాబ్స్‌ను అతని సొంత కంపెనీలోనే రెండు సార్లు మార్చారు. జీవితమంతా నిరూపించుకుంటూ బతకలేం. మంచి పొజిషన్‌.. సక్సెస్‌లో ఉన్నప్పుడే అందరికీ గుర్తుంటాం. తర్వాత అందరూ మర్చిపోతారు. 

‘నేనే లేకపోతే’ అని ప్రతి అత్తగారు అనుకుంటుంది. కానీ, కొత్త కోడలు వస్తుంది. ఆమెకంటే ఇల్లు బాగా చూసుకుంటుంది”
”ఒకరి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం అనేది అవమానించడం కాదు. మీరు చేయాల్సిన పనులు అక్కడ పూర్తయ్యాయని అర్థం. మిగిలిన జీవితం హాయిగా బతకండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. కొత్త సవాళ్లను ఎదుర్కోండి. మిమ్మల్ని వీరు గౌరవించుకోండి. ఇంకా ఆఫీస్‌ను నెత్తిమీద పెట్టుకుని మోయద్దు. హాలీడేకు వెళ్లండి. మీ పెంపుడు జంతువుతో సరదాగా ఆడుకోండి

 మిమ్మల్ని వీరు గౌరవించుకోండి. ఇంకా ఆఫీస్‌ను నెత్తిమీద పెట్టుకుని మోయద్దు. హాలీడేకు వెళ్లండి. మీ పెంపుడు జంతువుతో సరదాగా ఆడుకోండి. పవర్‌.. మనీ.. సక్సెస్‌.. జీవితాంతం ఉండవు. అవి లేనప్పుడూ బతకడం నేర్చుకోవాలి. ‘నేనే లేకపోతే..’ అనే ఆలోచన వస్తే, ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీరే లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఈ లోకంలో అమ్మ, ఆమె చేసిన వంట తప్ప, మిగతావాటిని అందరూ మార్చవచ్చు” అని పూరి జగన్నాథ్‌ చెప్పుకొచ్చారు.
👍👍👍 సమాప్తం 👌👌👌