ఇదంతా గమనిస్తున్న వృద్ధ సలీం, "ఇక ఇతని వల్ల కాదు. అసలు ఇతన్ని ఎలా ఎన్నుకున్నారు? ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడు?" అని ఆలోచిస్తూ ఆలోచనల్లో పడ్డాడు. నిస్సహాయంగా, "సరే, ఇక రేపటి నుంచి నువ్వు క్లాసులకు వెళ్తావులే. అప్పటికెనా ధ్యానం లేకుండా అందరినీ చూస్తూ నేర్చుకుంటారు," అని అంటూ వెళ్లిపోతాడు.
అదే సమయంలో, అక్షర అక్కడికి చేరుకుంటుంది. అక్షర రుద్రను చూస్తూ దూరంగా నిలబడి ఉంటుంది. తన తాతయ్య దగ్గర కూర్చుని ఉంటుంది అక్షర. తాతయ్య చిన్నగా నవ్వుతూ, "ఏంటమ్మా, నిజంగా ఇతను రాజుగా మారగలడా?" అని అడుగుతాడు.
"నీకు తెలియనిదేముంది తాతయ్య? రుద్ర ఎప్పటికీ రాజు కాదు. ఎందుకంటే ఈ రాజ్యానికి రాజు ఎప్పుడో ఉన్నాడు, ఎప్పుడో పుట్టాడు. కేవలం సరిగా లేడు," అని చెప్పడంతో తాతయ్య, "తెలుసుకున్నావే నా మనవరాలు అనిపించుకున్నావు," అని అంటూ చిన్నగా భుజం మీద తడుతూ, "సరే తల్లీ, ఇక నేను పడుకుంటాను. నీ ధ్యానం నువ్వు చేసుకో, లేదా నీ రాజును నువ్వు చూసుకో," అని చిన్నగా నవ్వుతూ పడుకుంటాడు.
అక్షర తాతయ్య ఆ రోజు నైట్ గెస్ట్ హౌస్‌లో నిద్రపోయాడు. రుద్రకు ఏమీ అర్థం కాకపోయినా, "ఇక్కడి నుంచి వెళ్లేదాకా చెప్పేది చేయాలి," అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు. కొద్దిసేపటికి కొంతమంది అమ్మాయిలు వచ్చి ఫుడ్ ఇచ్చి వెళ్లిపోతూ ఉంటారు. వెళ్తూ గుసగుసలాడుకుంటూ ఉంటారు, "మానవులు ఎంతైనా మానవులు. ఎంత అందంగా ఉన్నారు!" "ఎత్తి చూడు, ఎంత స్టైల్‌గా ఉన్నాయో బట్టలు! అతను నడక, అన్నీ భలే ఉన్నాయి. ఇక ఇతను శక్తులు గనుక ఉపయోగిస్తే, మనలో ఎవరో ఒకరికి మన పెద్దయ్యలు, తండ్రులు ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తారేమో," అని గుసగుసలాడుకుంటున్నారు.
అక్షరకు, "ఏంటి ఇక్కడ ఇంత కామం ఉన్నారా? చూసి చూడగానే పెళ్లి దగ్గరికి వెళ్లిపోయారు అందరూ. ఇంతేనా? అయినా మానవులు చాలా స్టైల్‌గా ఉంటారు. కానీ రుద్ర అందరికంటే స్టైల్‌గా ఉంటాడు," అని అనుకుంటుంది.
ఇక రుద్ర ఫుడ్ తిని, కళ్ళు మూసుకునే సమయంలో తన లాకెట్ మిస్ అవ్వడం అప్పుడు గమనిస్తాడు. ఎక్కడికి వెళ్లిందని అంత వెతుకుతాడు. కానీ ఎక్కడా కనిపించదు. "ఇక దీని పోయింది కాబట్టి నాకు ఏదైనా మంచి జరుగుతుందేమో," అని అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. ఆ అమ్మాయిల మాటలు, కలలు పొడిచి పొడిచి చూస్తున్నట్టు నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాయి. "నేను అంత అందంగా ఉన్నానా?" అని అనుకుంటున్నాడు.
ఆ మరుసటి రోజు రుద్ర నిద్ర లేచి బయటికి వస్తాడు. క్లాసులకు సిద్ధం అవ్వమని సలీం చెబుతాడు: "ఈరోజు నీకు మూడు ఎలిమెంట్ పవర్స్‌ని ఒకేసారి ఎలా చేయాలో, ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలి. మీ మాస్టర్ చాలా డేంజరస్ వేగంతో నిన్ను పడేస్తాడు కాబట్టి జాగ్రత్త. లేదంటే ఒకటేసారి భూమికి వెళ్లిపోతావు," అని హెచ్చరిస్తాడు వృద్ధ సలీం.
ఇక రుద్ర క్లాసుకు వెళ్తాడు. అక్కడ చిన్న చిన్న చేప పిల్లలు స్పీడ్‌గా తిరుగుతూ నీటిని అల్లకల్లోలం చేస్తూ, ఒకరి నుంచి ఒకరు తప్పించుకుంటూ అలా చేస్తూ ఉన్నాయి. ఒక సుడిగాలి వేగంగా వచ్చి మాస్టర్ కుర్చీ దగ్గర ఆగుతుంది. అది బురద మట్టిలా కనిపిస్తుంది, మొహం మీద ఏదో రెండు అటూ ఇటూ ఊగుతూ మీసాల మాదిరిగా ఉన్నాయి. నెత్తి పైన ఒక చుక్క ఉంది, అది మొత్తం చూడడానికి చేపలా కనిపిస్తుంది. కానీ విచిత్రంగా చూస్తూ రుద్ర మనసులో ఇలా అనుకుంటున్నాడు: "ఇదే చేప భూమి మీదకి దొరికితే వండుకొని తినేసేవాళ్ళు, ఏడాది టీచర్ అయిపోయింది, ఇదే వింత!" అని చిన్నగా నవ్వుతూ చూస్తున్నాడు.
ఆ చేప టీచర్ చెప్పడం మొదలుపెట్టింది: "చూడండి స్టూడెంట్స్, మీకు కొన్ని రోజులుగా మూడు ఎలిమెంట్స్ – ఒక్కో ఎలిమెంట్ గురించి ఒక్కో రోజు చెప్తూ వచ్చాను. ఇప్పుడు ఈ రోజు మూడు ఎలిమెంట్లను ఒకేసారి ఎలా ఉపయోగించాలో చూపిస్తాను," అని అంటూ, "ప్రతి ఎలిమెంట్, ప్రతి శక్తి ఒకదానిని ఒకటి తాకుతూ కొత్త ఎలిమెంట్‌గా రూపాంతరం చెందాయి. అలాగే ఒక ఎలిమెంట్ లేకపోతే ఇంకో ఎలిమెంట్ పనికిరాదు. అర్థమవుతుందా?" అని చెప్పడం మొదలుపెట్టింది చేప టీచర్.
"మొదటిగా మీరు స్పీడును అందుకోవాలి. దానికి మీరు గాలిని ఉపయోగించాలి," అని చెబుతూ, చిన్నగా తిరుగుతూ గాలిలోనే స్పీడును అందుకుంటూ, ఆ నీటి లోపల సుడిగుండం అనే సృష్టిస్తూ, నీటి టోర్నడోను తయారు చేస్తూ, గాలిని ఉపయోగిస్తూ, "ఇప్పుడు గాలి లేకపోతే ఆ నీటి టోర్నడో ఎందుకు పనికిరాదు," అని చెబుతుంది. అలాగే, "ఇక ఆ నీటిలో ఉన్న ఇసుకను చేస్తూ ఆ నీటిని ఒక పంచ్లా విసురుతూ అటాక్ చేయడం మొదలుపెట్టింది గాలిలో." దానికి అడ్డు అదుపు లేకపోవడంతో ఏది తగిలినా పిండి అయిపోతున్నాయి. ఎదురుగా ఒక స్తంభం ఏర్పడింది, అది ఇనుముతో చేసిన స్తంభం. అది దెబ్బకు పిండి అయిపోయింది. "మూడు ఎలిమెంట్స్ వర్కౌట్ అవుతాయి. దీంతో పాటు ఫైర్ కూడా వస్తుంది, కానీ దానిని ఇప్పుడు నేను చెప్పాలనుకోవడం లేదు," అని చెబుతూ, "ఓకే, ఇక మీరు ప్రాక్టీస్ చేయండి, చూశారు కదా?" అని చెప్పింది చేప టీచర్.
రుద్ర అయోమయంగా వినడానికి, చూడడానికి బాగానే ఉంది, కానీ "నేను ఎలా చేయాలి? వీళ్లు చేపలు కాబట్టి గిరగిరా తిరుగుతున్నారు, నేనెలా తిరగాలి? నా చుట్టూ నేను తిరగాలా?" అని అయోమయంగా, తింగరిగా ఆలోచిస్తూ ఉన్నాడు రుద్ర.
ఇక ఒక్కో చేప వచ్చి గాలిలో స్పిన్ చేస్తూ, సొగం సొగం చేస్తూ, కొన్ని ఇసుకతో బాగానే ట్రై చేస్తున్నాయి కానీ పంచ్ పడడం లేదు. కొన్ని పంచ్‌ను బాగానే ఇస్తున్నాయి కానీ శక్తి లేదు. ఇంకొన్ని బలంగా విసురుతున్నాయి, పంచులు పడుతున్నాయి, దాంట్లో ఏదో మిస్ అయింది అదే వేగం.
ఇలా చివరికి రుద్ర టైం వచ్చింది. రుద్ర ఓకే రెండు మూడు బెంచీలు ఎత్తుగా పెట్టుకొని దాని మీదికి ఎక్కి ఒక్కసారిగా ఆకాశంలో ఎగిరినట్టు గిరగిరా తిరుగుతూ భూమి మీదకి సడన్‌గా పడిపోవాలనుకున్నాడు. కానీ వేగం సరిపోవడం లేదు. అవి నీళ్లు కాబట్టి, నీటిలో శ్వాస తీసుకున్నంత మాత్రాన స్పిన్ అవ్వాలని స్పీడ్ సరిపోవాలి. స్పీడ్, బలం లేకుండా ఏమీ చేయలేరు. ఆ నీటిలో మానవులు స్పీడ్‌గా తిరగలేరు. ఎంతసేపు ఉన్నా నిదానంగానే ఉంటారు. ఇది పెద్ద కష్టానికి రుద్రకు వచ్చింది.
రుద్ర కిందపడి దెబ్బలు తింటాడు. మెల్లగా మళ్లీ లేస్తాడు. ఆ నీటిలో పెద్దగా దెబ్బలు తగలకపోయినా, చుట్టూ ఉన్నవాళ్లు వెక్కిరిస్తున్నారు. మరోసారి దీక్షగా చూడడం మొదలుపెట్టారు. రుద్ర కళ్లు మూసుకున్నాడు. చేపలు ఎలా తిరుగుతాయి? తన వేగం ఎలాంటిది? బలం ఎలాంటిది? నీటిలో ఎలా తిరుగుతాయి? అని ఆలోచిస్తూ ఉంటాడు. అతని మెదడులో, చేప ఎప్పుడు నీటికి ఎదురుగా వేచి ఉంటుంది, తన బలాన్ని నమ్ముకుంటుంది. అదే టైమింగ్. తర్వాత, అక్కడ గెలిచిన తర్వాత, వెంటనే తన ఫైట్ మొదలు పెడుతుంది. నీటి వాళ్లకు అనుగుణంగా తన కాళ్లు, చేతులను అలియాస్తో కనురెప్పపాటులో కదుపుతూ, నీటిని చెదరగొడుతూ, తన బలం ని చూపిస్తూ, ఆ బలానికి ఎలాంటి నీటి హాట్ షాట్ అయినా చేపను ఆపలేదు.
ఇప్పుడు రుద్ర ఆలోచిస్తున్నాడు, "అంటే ఇప్పుడు నేను ఫస్ట్ స్విమ్ చేయాలి, తర్వాత స్పీడ్ పెంచాలి," అని ఆలోచించడం మొదలుపెట్టాడు.రుద్ర ఫస్ట్ టైం శక్తి గ్రహించే సీన్ – క్లియర్ వెర్షన్
ఈసారి రుద్ర ఎలాగైనా తన శక్తిని బయటకు తేవాలని నిశ్చయించుకున్నాడు. పైకి లేచి, చేతులు కాళ్లు కదిలించడం మొదలు పెట్టాడు. కొద్దిదూరం సాఫీగా నడిచాడు. కానీ అంతే… మళ్లీ అదే – రెండు మూడు సార్లు బొంగరం లా తిరుగుతూ అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. కానీ ముందుకు మాత్రం అడుగు పెట్టలేకపోయాడు.
ఇంతలో క్లాస్ అయిపోయింది. పిల్లలు నవ్వుతూ, "నీకు రాదు… ఇక నీకు రాదు," అని టీచర్‌తో కలసి చెప్పడం రుద్రని తల్లడిల్లేలా చేసింది. అతని కళ్లు నెమ్మదిగా నీళ్ళతో నిండసాగాయి.
ఆ క్షణంలో రుద్ర మోకాళ్ల మీద కూర్చున్నాడు. ముసలివాడు (లింగయ్య) అన్న మాటలు అతనికి గుర్తొచ్చాయి:
> "శక్తి ఎక్కడైనా ఉండదు. నువ్వు నమ్మిన పనిలోనే ఉంటుంది. ఆంజనేయుడు రాముని నమ్మాడు, అందుకే అతడిని పరీక్షించాడు. అంతే కాదు, రాముని కోసం అద్భుత శక్తులు ప్రదర్శించగలిగాడు. నువ్వు కూడా ఏదో ఒకదాన్ని నమ్మావు అంటే అదే నీ శక్తి అవుతుంది. అది ఆంజనేయుని కావచ్చు. లేదా నినే నువ్వు నమ్మిన శక్తి కావచ్చు."
ఈ మాటలు గుర్తొచ్చిన వెంటనే రుద్ర మనసులో ఆంజనేయ స్వామిని తలచుకున్నాడు. అందరూ వెళ్లిపోయిన తరవాత, ఒక్కసారిగా రుద్ర శరీరంలోంచి బ్లూ కలర్ రేడియన్స్ వెలువడింది. గాలి, నీరు, మట్టి వంటి ప్రకృతి శక్తులన్నీ అతని వైపు లీనమయ్యాయి. అవి రుద్ర శరీరంలోకి కలిసిపోయాయి.
ఈ మార్పును గమనించి ప్రకృతి శక్తులు బాసులుగా అంగీకరించాయి. వెంటనే రుద్ర కళ్లు తెరిచాడు. అతను ఇప్పుడు 'గాలోల్లో' ఉన్నట్టు అనిపించింది. తనకు అసాధారణమైన శక్తి తలెత్తినట్టు తెలిసింది. అతడు ఇక సాధారణ బాలుడు కాదు.
ఇప్పుడు అతడు ఏ వస్తువునైనా సృష్టించగలడు. గదనైనా… కత్తినైనా… అవసరమనుకున్న ఏ శక్తివంతమైన వస్తువునైనా.
ఇదే సమయంలో క్లాస్‌కి మళ్లీ కొంతమంది పిల్లలు వచ్చారు. వారితో పాటు ఒక కొత్త టీచర్ వచ్చాడు. అతను స్టైలిష్‌గా, తలక్రిందుగా నిలబడిన తోకతో నడుస్తూ వచ్చాడు. కళ్లలో తెల్లటి పులుసులతో అలౌకికంగా కనిపించాడు. అతడి పేరు "ష
సారోక్ ఫైర్ ఎలిమెంట్ టీచర్.