The Endless - 4 in Telugu Mythological Stories by Ravi chendra Sunnkari books and stories PDF | అంతం కాదు - 4

Featured Books
Categories
Share

అంతం కాదు - 4

అంతం కాదు సిరీస్: రుద్ర పవర్ ఆఫ్ రుద్రమణులు

ఎపిసోడ్ 8: గతం నుండి వచ్చిన శక్తులు

సీన్ 1: బ్లూ ఎనర్జీ రహస్యం వెల్లడి

శివ ప్రశ్నలకు సమాధానంగా, ముసలి వ్యక్తి (తాత) వివరించడం ప్రారంభించాడు: "ఆ రాళ్ళలో చెప్పలేనంత ఎనర్జీ ఉంది. ఆ బ్లూ ఎనర్జీని నేను తీసుకున్నాను. అలాగే, అక్కడ ఎర్రగా ఉన్న 'లిఫ్టింగ్' కూడా ఒక శాంపిల్‌గా తీసుకున్నాం. అది ఎప్పుడైతే బయటికి వచ్చిందో, అది నీలి రంగులోకి మారిపోయింది. నీకు అప్పుడు ఇచ్చాను కదా, అదే! అలాగే, ఈ స్టోన్స్‌తో ఎనర్జీ ఫామ్ చేయవచ్చని మేము తెలుసుకున్నాం. నీకు ఇచ్చిన సూట్ కూడా అలాంటిదే. నీ మెడ దగ్గర ఉన్న స్టోన్ ఎప్పటికప్పుడు ఛార్జ్ చేస్తూ నీకు పవర్‌ను అందిస్తూ ఉంటుంది. ఇది సంగతి."

శివ ఆశ్చర్యంగా, "అయితే ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకని దూరం చేసింది? ఈ స్టోన్స్ గురించి ఎందుకు చెప్పలేదు? అసలు నాకే ఎందుకు ఇచ్చారు?" అని అడిగాడు.

"ఇది మీ నాన్న, మీ అమ్మ కష్ట ఫలితం మీదనే నీకు ఇవ్వబడింది," అని తాత చెప్పగానే శివ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "మా అమ్మ నాన్న ఎక్కడున్నారు?" అని అడిగాడు.

"అప్పుడు జరిగిన బ్లాస్ట్‌లో మీ అమ్మ నాన్న..." అని తాత ఆగిపోయాడు. (ఇక్కడ తాత పూర్తి వాక్యం చెప్పకుండా ఆగిపోవడం శివ తల్లిదండ్రుల విధి గురించి ఉత్కంఠను పెంచుతుంది.)

సీన్ 2: సిరీస్ కంపెనీ – రుద్ర దర్యాప్తు

రుద్ర తన ల్యాప్‌టాప్‌లో 'సిరీస్' కంపెనీపై దృష్టి సారించాడు. ఒకప్పుడు చాలా బలమైన కంపెనీ అది. ఆ కంపెనీ ఓనర్ పేరు భాస్కర్. అతను ఎన్నో విభిన్న ప్రాజెక్టులు చేసేవాడు. గవర్నమెంట్‌కు ఒకసారి ఏదో ప్రాజెక్ట్ ఇచ్చాడు. దానికోసం 'బ్లూ ఎనర్జీ టీమ్' అని ఒక గ్రూపును ఫామ్ చేశాడు. దాన్ని గవర్నమెంట్‌కి ఇచ్చి "మా పని చేయమని" చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న సీఎం కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరో దాని కోసం గవర్నమెంట్‌ని సరిగా రాసి, గ్రూపును ఫామ్ చేసి పంపించారు. అందులోనే లింగయ్య, శివ వాళ్ళ నాన్న, అమ్మ ఉన్నారు.

ఆ తర్వాత జరిగింది లింగయ్య ఎప్పుడో చెప్పాడు. అంటే శివ వాళ్ళ అమ్మ నాన్న మిషన్ సక్సెస్ అయిందని గవర్నమెంట్‌కు చెబుతుంది. ఆ తర్వాత అది తిరిగి మళ్ళీ 'సిరీస్' కంపెనీ MDకి తెలుస్తుంది. దాన్ని ఇమ్మని వాళ్ళ మీద దాడి చేస్తాడు. కానీ లింగయ్య తప్పించుకొని ఏమీ ఇవ్వకుండా, కంపెనీని పేల్చి వచ్చేశాడు. ఇలా అన్నీ తెలుసుకున్న రుద్ర, ఆ మిషన్ పేరు అలాగే ఏం జరిగిందన్నది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఇది రుద్రకి కూడా తెలియడం లేదు. ఇలా సీన్ కట్ అవుతుంది.ఎపిసోడ్ 9: ప్రతినాయకుడి లక్ష్యం

సీన్ 1: జాన్ - ప్రతినాయకుడి ఆక్రోశం

రుద్ర తన కంప్యూటర్ ముందు నుంచి లేచి మళ్ళీ తన రూమ్‌ కి వెళ్తాడు. ఇలా సీన్ కట్ చేస్తే, ఎక్కడో మళ్ళీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఒక వ్యక్తి ఒక ఫోటో ముందు నిలబడి ఉన్నాడు. అతని వెనుక గోడపై 'సిరీస్' కంపెనీ లోగో స్పష్టంగా కనిపిస్తుంది. అతను కోపంగా ఆ ఫోటోలోని వ్యక్తిని చూస్తూ, "నాన్న, నీ కోరిక నేను ఎప్పటికీ తీరుస్తాను. నాకే తెలియడం లేదు, కానీ నీ కోరిక కచ్చితంగా తీరుస్తాను. నేను బతికున్నంత వరకు దాన్ని వదలను!" అని ఆవేశంగా అంటున్నాడు.

అక్కడ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూపించారు. అది మొదటి సీన్‌ లో, ఒక ముసలి వ్యక్తి, ఒక చిన్న పిల్లవాడు ఉన్న ఫోటో. ఒక త్రిశూలం వచ్చి ఆ పిల్లవాడి నాన్నను చంపేసి ఉంటుంది కదా – ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, జాన్ యొక్క తండ్రి. ఇలా సీన్ కట్ అవుతూ అక్కడే ఉన్న ఒక బ్లూ కలర్ స్పేస్ షిప్‌ ను చూపిస్తుంది.

అప్పుడే అక్కడున్న ఆ అబ్బాయికి (జాన్) ఫోన్ కాల్ వస్తుంది. "హలో జాన్ సార్! ఎవరో మన డబ్బును కొట్టేశారు. అతని పేరు తెలుసుకున్నాం, కానీ అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోలేకపోయాం. అతని పేరు రుద్ర!" అని చెప్పగానే, "ఆ రుద్రా? నా రుద్రా?" అని ఆలోచిస్తూ, "అతన్ని మీరు కొన్ని రోజుల్లోనే పట్టుకోండి. కుదిరితే రేపే అతను నాకు కావాలి! అతన్ని ఎలాగైనా పట్టుకోండి!" అని ఆర్డర్ వేయడంతో వాళ్ళు "సరే సార్" అని అంటూ ఉన్నారు.

అంతం కాదు సిరీస్ రుద్ర పవర్ ఆఫ్ రుద్రమను లు

ఎపిసోడ్ 10 : పెళ్లి హడావిడి, కొత్త శత్రువులు, పాత జ్ఞాపకాలు

(సీన్ 1: శివ పెళ్లి మరియు రుద్ర జాతకం)

శివ దగ్గరకు సీన్ కట్ చేయగా, అక్కడ ముసలి వ్యక్తి (తాత) ఒక్కసారిగా కింద కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. "ఆసన్నమైంది, ఇంకా ఏదో జరగాలి" అని అనుకుంటూ ఉండగా, శివ కనిపించాడు.

శివుని చూస్తూ, "రేపే మీ పెళ్ళి, శ్వేతకు చెప్పు!" అని తాత చెప్పడంతో శివ ఆశ్చర్యపోయాడు. "రేపా? నాకెందుకు?" అని అడగ్గా, తాత నవ్వి, "పెళ్లి నీకే, కానీ రుద్ర జాతకం ఈరోజే మారబోతుంది" అని అంటూ "రేపే మీ పెళ్ళి" అని నొక్కి చెప్పాడు.

శివ ఆ విషయాన్ని శ్వేతకు ఫోన్ చేసి చెప్పాడు. శ్వేత కొంచెం సిగ్గుగా, "ఏంట్రా? ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా పెళ్ళి?" అని అంటూ, "రేపేనా? అంత అర్జెంట్ ఎందుకు?" అని అడిగింది.

"ఏం లేదు ఊరికే మూడ్ వస్తుంది" అని శివ అన్నాడు. శ్వేత సిగ్గుగా ఫోన్ కట్ చేసి, "సరే మళ్ళీ చేస్తా" అని అంది.

ఆ పక్కనే ఉన్న అక్షరను చూస్తూ శ్వేత, "నాకు ఇప్పుడే న్యూస్ తెలిసింది, రేపే నా పెళ్ళి! నువ్వు కూడా రా! నీ ఫ్రెండ్ అంటివి కదా? రుద్రను కూడా తీసుకురా!" అని చెప్పింది. ఇలా అందరూ ఒకచోటికి చేరతారు.

(సీన్ 2: జాన్ లక్ష్యం రుద్ర)

అదే క్షణంలో, జాన్ (బ్లూ స్పేస్‌షిప్ సృష్టిస్తున్నవాడు) చెప్పిన మనుషులు రుద్రను వెతుకుతూ రేపు అతన్ని పట్టుకోవడానికి రెడీ అవుతారు. అందరూ "రేపు కలుసుకుందాం" అని అన్నట్టు సీన్ కట్ అవుతుంది.