Welcome - 1 in Telugu Magazine by SriNiharika books and stories PDF | స్వగతం - 1

Featured Books
  • અભિન્ન - ભાગ 5

    અભિન્ન ભાગ ૫ રાત્રીના સમયે પોતાના વિચારોમાં મગ્ન બની રાહુલ ટ...

  • કન્યાકુમારી પ્રવાસ

    કન્યાકુમારીહું મારા કન્યાકુમારીના  વર્ષો અગાઉ કરેલા પ્રવાસની...

  • હું અને મારા અહસાસ - 119

    સત્ય જીવનનું સત્ય જલ્દી સમજવું જોઈએ. જીવનને યોગ્ય રીતે જીવવા...

  • રેડ 2

    રેડ 2- રાકેશ ઠક્કરઅજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ ને સમીક્ષકોનો મિ...

  • ભાગવત રહસ્ય - 271

    ભાગવત રહસ્ય -૨૭૧   યશોદાજી ગોપીઓને શિખામણ આપે છે-કે- અરી સખી...

Categories
Share

స్వగతం - 1

స్వగతం....

నేను జీవితంలో చాలా మందిని కలిశాను,
కొంత మంది పేర్లు నాకు తెలుసు, కొంత మందివి తెలియవు, కొన్ని మర్చిపోయాను
కొన్ని పరిచయాలు నాకు చేదు అనుభవాల్ని మిగిలిస్తే, మరి కొన్ని ఒక తీపి జ్ఞాపకల్ని వదిలేసి వెళ్లాయి, మరికొన్ని మాత్రం నాలో కలిసిపోయి నా జీవితంలో భాగం అయిపోయాయి. అందుకేనేమో అంతమంది నా చుట్టూవున్నా నాకు కావాల్సిన ఆ కొంత మంది కోసం మనసు ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటుంది. 
అందుకేనేమో నేను ఈ మధ్య మాటలు తగ్గించేసా, నవ్వు తగ్గించేసా అలానే బాధని కూడా తగ్గించేస. అలా అని నా మనసు మొద్దుబారిపోలేదు, అది క్రమంగా తెలుసుకుంటోంది ఏమని అంటే మనవి అన్నవి కొన్నే ఉంటాయి అని. ఏదొక రోజు ఆ కొన్ని కూడా లేవు ఉన్నది నేనే అన్నది అర్థం అవుతుంది. అందుకేనెమో ఒక కవి అన్నాడు జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని.

కానీ నేను చేసిన ఒక మంచి పని ఏంటంటే, గెలవాలన్నప్పుడు గెలిచాను, వొద్దనుకున్న నాడు అసలు ఆటే ఆడలేదు. ఈ మధ్య అర్థమయింది ఏమిటంటే నన్ను గెలిపించారు కొందరు అలానే నన్ను ఆడనివ్వలేదు అప్పుడు అని. కానీ నేను ఎదురుచూసేది మాత్రం........

ఇంతకీ నేను ఎదురుచూసేది దేనికోసం అంటే, ఏమో తెలియదని చెప్పాలి. చిన్నప్పుడు అయితే ఎదురుచూసేవాడిని, అందమైన భవిష్యత్తు కోసం. అప్పుడు కలలు చాలా స్వతంత్రంగా కనే వాడిని. కానీ రాను రాను వాస్తవం తెలుస్తున్న కొద్దీ ఈ విశ్వంలో ఎంత అల్పుడినో అర్థమవుతుంది. చాలా మంది దానినే జ్ఞానం అంటున్నారు. కాదు అది కాదు జ్ఞానం అంటే, జ్ఞానం అంటే ఒక పరిపూర్ణత, ఒక సంపూర్ణత. అవును జ్ఞానం ఉన్న వాళ్ళకి తాము ఎంత అల్పులమో తెలుస్తుంది నిజమే కానీ వాళ్ళకి వాళ్ళ అసక్తత నుంచి ఎవరు కాపడతారో కూడా స్పష్టంగా తెలిసి ఉంటుంది. నాకు అలా తెలియదు. అలా తెలుసుకోవాలని తాపత్రయం లోనో ఏమో కాని రోజు పూజ చెయ్యడం ప్రారంభించా. 

చాలా దేవుళ్ళని చిత్తశుద్ధి లేకుండా ఎన్నో రోజులు పొగిడా, చివరికి మెల్లిగా ఒకరి మీద గురి కుదరటం ప్రారంభించింది. ప్రస్తుతం జీవితంలో ఆ దశలో ఉన్న. ఇప్పుడు అనిపిస్తుంది ఎక్కవలసిన మెట్లు ఎన్నో ఉన్నాయే మరి నా జీవితం సరిపోతుందా అని. చాలా ప్రశ్నలలాగానే దీనికి సమాధానం లేదు......


అవును నేను ఆటలు ఆడాను జీవితంలో మరియు జీవితంతో కూడా. లెక్కలేనన్ని తప్పుడు నిర్ణయాలు, స్వార్ధం, తప్పని తెలిసినా దొరక్కూడదని అబద్ధాలు ఆడాను. అయినా అందరూ నన్ను కాపాడారు, నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, ఉద్యోగంలో నా పై వాళ్ళు కింద వాళ్ళు, ముఖ్యంగా దేవుడు(అందులోనే అమ్మ, నాన్న, అన్నయ్య, భార్య, వొదిన). ఎందుకో నేనంటే అంత ప్రేమ వీళ్ళకి అనిపిస్తుంది. నిజం చెప్పాలి అంటే చిన్నప్పుడు నా ముక్కు సూటితనాన్ని చూసి ముచ్చట పడేవారు. సరే ముచ్చట పడుతున్నారు కదా అని పెంచి పోషించా దాన్ని. కానీ, ముక్కు సూటితనానికి, అవతవాళ్ళని కించపరచడానికి మధ్య ఒక సన్నటి రేఖ ఉంటుంది. అది తెలుసుకోలేక పోయా. కానీ క్రమంగా నేను ప్రపంచంలో ఒదుగుతున్న కొద్దీ నాకు ఎదురయ్యే అనుభవాలు ముఖ్యంగా అవమానాల ద్వారా అర్థం చేసుకుంటున్న. ప్రస్తుతం ఆ దశలో ఉన్నా......

మొన్నకరోజున ఒక్కడినే సోఫాలో కూర్చొని నాలుకని ఆడిస్తూ ఆలోచనల్లోకి వెళ్లిపోయా. అప్పుడు 2 నిమిషాల తరువాత అనిపించింది, మా నాన్నని చిన్నప్పుడు అలానే కూర్చొని ఏదీ పట్టనట్టు సూన్యంలోకి చూస్తుంటే అనుకునే వాడ్ని, ఏందో మా నాన్నకి ఏమి పట్టదని. ఇప్పుడు అర్థం అయ్యింది, ఇద్దరుండే ఇంటిని నడపడానికి నేను నా బుర్రలో ఎదురయ్యే ప్రశ్నలకి సమాధానం చెప్పుకుంటుంటే తెలిసొచ్చింది, ఆయన అలా ఎంత పట్టించుకుంటే మనల్ని ఇంత ఎదగనిచ్చారని. క్రమంగా తండ్రి విలువ తెలుస్తోంది ఈ జన్మకి....


ఎల్లుండి నుంచి మూడు రోజుల సెలవులు దీపావళికి. ఎప్పుడూ ఇంటికి వెళతాం కదా ఈసారీ ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటూ, ఎందుకో గోదావరి మీద పడింది నా మనసు. అప్పుడు ap టూరిజం వాళ్ళు గోదావరి ప్యాకేజీ ఒకటి నడిపేవారు. దానిని తీసుకొని వెంటనే డబ్బు కూడా కట్టేసా. ఇంక దీపావళి రెండు రోజులు అనగా, ఆఫీసులో కొంచెం ముందు బయలుదేరి, ఆ టూరిజం బస్సులో ఎక్కా. అక్కడ నుంచి జరిగినది అంతా ఒక అనుభవం. గోదావరి అందాల్ని నా కన్నా చాలా మంది చాలా బాగా వర్ణనలు చేసేసారు, నేను దాని జోలికి పొదల్చుకోలేదు. కానీ, ఒక్కడినే కనీసం స్నేహితులు కూడా లేకుండా నేను చేసిన ప్రయాణం అది. అందర్నీ నేనే కల్పించుకొని పలకరించుకోవాలి, నేనే కలిసిపోవాలి, నేనే వెతుక్కోవాలి, నేనే కనుక్కోవాలి.

ఒక 24 ఏళ్ల కుర్రవాడ్ని నేనెప్పుడు. ఆ ప్రాంతంలో ఒక చోట మేము ఒక రోజు ఉన్నాము, అక్కడ కనీసం సెల్ సిగ్నల్ కూడా అందదు. కాబట్టి తప్పదు, అవతల వాళ్ళతో మాట్లాడాల్సిందే. అక్కడ అలా ఒంటరిగా వెళ్లిన వాడ్ని కూడా నేనొక్కడినే. కాబట్టి, అవతల వాళ్ళకి నాతో మాట్లాడే అవకాశాన్ని కూడా నేనే కల్పించుకోవాలి. కొన్ని సార్లు ఏదో మాట్లాడపోతే ఒకరిద్దరు, మొహం పక్కకి తిప్పుకున్నారు. నేను అప్పుడూ తక్కువ అనుకోలేదు, అర్థం చేసుకోగలిగా, ఎందుకో తెలియదు, అలా ప్రవర్తించా. ఇంక సగం ప్రయాణం అయ్యేసరికి, టూర్ గైడ్, పడవ నడిపే అతను నాకు స్నేహితులయ్యారు, వాళ్ల అనుభవాలు తెలుసుకున్నా, ఆ చనువుతోనే, తిరుగు ప్రయాణంలో నేను ఒక్కడినే ఆ లాంచీ వెనక కూర్చి వేసుకొని కూర్చోని తనివి తీరా ఆ ప్రకృతి రమణీయతను ఆస్వాదించా.

అప్పుడు తెలిసొచ్చింది ఒంటరి తనం మనకి ఎన్ని నేర్పిస్తోందో అని.ఆ ప్రయాణం తరువాత నాకు వచ్చిన నమ్మకం,నన్ను నేను చూసుకోగలను అని. అప్పుడు దేని మీద అంత ప్రేమ ఉండేది కాదు నా మీద తప్ప, కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయా, ఇప్పుడు మనుషుల మీద, మనసుల మీద ఆధారపడటం అలవాటు అయిపోయింది. ఇది ఒక మార్పు. ఇది కూడా బావుంది. ఏమైనా జీవితం, జీవితం స్వామి🙏.....
(సశేషం)