Let's meet... in Telugu Magazine by SriNiharika books and stories PDF | కలుసుకుందాం రా...

Featured Books
  • జనతా కర్ఫ్యూలో

    జీవితంలో మూడేళ్ళు మాయం .. అసలేం జరిగింది ?రీల్ లైఫ్ లో గతాన్...

  • తొలి అడుగు

    స్వప్న, సంధ్య... ఇద్దరు మంచి స్నేహితులు... ఇరుగు పొరుగు వారవ...

  • కలుసుకుందాం రా...

    "కలుసుకుందాం రా"అంటూ వనజకుమారి నుండి పిలుపు.ఫోన్ పెట్టేయగానే...

  • మృగం - 3

    అధ్యాయం 3 కాలం   చీకటి   భావోద్వేగ   పట్టుకోవడం   కలవరపెడుతో...

  • గోదారి గోరింటాకు!!!

    2041 వ సంవత్సరం....తెల్లవారుజామున 4 గంటల సమయం.శుభోదయాన్ని సూ...

Categories
Share

కలుసుకుందాం రా...




"కలుసుకుందాం రా"

అంటూ వనజకుమారి నుండి పిలుపు.

ఫోన్ పెట్టేయగానే 

క్షణాలతేడాతో ...దాదాపు యాభైపిలుపులు!!

ఆనందంతో ఉబ్బితబ్బిబ్చయ్యాడు దాసు .


ఆ కలయిక దాదాపు ఇరవైరోజుల తరవాత అని నిశ్చయ మయ్యాక .........

గడియారాలు చెడిపోయినట్లు..  

అదనపుజీతభత్యాలకు ఆశపడి ఆ

సూర్యుడు తనడ్యూటీటైంలో వోవర్ డ్యూటీ చేస్తున్నట్లూ..

చీకటిరాత్రి..వేకువఝాములు ..టీవీసీరియల్ లలా సాగిసాగి గుండెల్ని తొలుస్తున్నట్లూ అనిపిస్తోంది దాసు మనస్సుకి.


***     ***  ***  *** 

కలుసుకోవలసిన వారిని తలుచుకుంటూ తీపిజ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ..

ఇరవైరోజుల్లో  దాదాపు పదిదాకా నిదురలేని రాత్రుల్ని  భరించాడు దాసు.


నత్తలా నడుస్తున్న కాలపు నిర్లక్ష్యపువైఖరిపై..

మనస్సులోనే దుమ్మెత్తిపోసుకుంటూ ..

బీ పీ పెంచుకుంటూ ...మాత్రలతో కంట్రోల్ చేసుకుంటూ తల్లడిల్లిపోయాడు ఉత్కంఠతో.

**         **        **

ఎలాగైతేనేం.....

అర్ధరాత్రికీ అర్ధరాత్రే ఇంగ్లీష్ డేట్ మారటంతోపాటే....

సెల్ ఫోన్ లో అతను సెట్ చేసుకున్న అలారం మ్రోగటంతో ..

ఆ రోజు రానే వఛ్చింది దాసు గుండెల్లోకి!!


ఏమాత్రం ...అతని ప్రమేయం లేకుండా అనియంత్రితంగా అతని మనసుతో పనిలేకుండా...

ఊపిరితిత్తుల్లో ఉచ్ఛ్వాసనిశ్వాసలు నడుస్తున్నాయ్ ..

గుండెలో హృదయస్పందనలు కలుగుతున్నాయ్ 

ఐతే..

అతని మనస్సు మాత్రం ..

ఉదయం జరుగబోయే కలయికల కార్యక్రమం గురించి ఆలోచించటంలో తన శరీరాన్నే తాను మరచిపోయింది.


కానీ ......

కాలకృత్యాలను మాత్రం అతనిశరీరం....యాదృచ్ఛికంగా అనియంత్రితంగా తీర్చుకుంటోంది.


సమయం

ఉదయం ఏడు గంటలైంది.

టిఫిను అయిందనిపించుకొని..కాఫీ తాగేసి గడపదాటి బయటికి అడుగులేశాడు.


షెడ్డులో వున్నకారుని బయటకు తీసి, 

మెదడులోంచి ప్రవహిస్తున్న జ్ఞాపకాల ప్రవాహాలవేగంతో దీటుగా కారువేగాన్ని సరిచెేస్తూ

సంగయ్యపేట నుండి సాయిబాబాకాలనీ మీదుగా..

తన కాలేజీ ..గాంధీమెమోరియల్ గవర్ణమెంట్ కళాశాల వైపుగా నడిపించాడు హుషారుగా.


***      **      ****

అప్పటికే చాలా మంది పూర్వవిద్యార్థులు విద్యార్థినులు అక్కడికి చేరుకొని ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు.


అది ..

పంతొమ్మిదివందలడెబ్బది ఏడు డెబ్బది ఎనిమిది సంవత్సరాలకు చెందిన ఇంటర్మీడియట్ పూర్వవిద్యార్థుల అపూర్వ సంగమ సంరంభం.


నలభయ్యేళ్ళ తర్వాత కలుసుకుంటున్న మనసున్న మనుషుల స్నేహానుబంధాల ఔన్నత్య మహోత్సవం.


వైద్యులు ,న్యాయవాదులు,విద్యాబోధకులు,పోలీసులు,అన్నదాతలు,ప్రజానేతలు, ఆదర్శగృహిణులు,సంపన్నులు, అపూర్వ వ్యక్తులు ..వ్యాపారవేత్తలు ,ఆధ్యాత్మిక జ్ఞానసంపన్నులు.ప్రతిభల్లో అన్నింటిలోనూ మిన్నగా నిలిచిన వాళ్ళు అక్కడ ఒక్కటయ్యారు.


తమ పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.

తమతమ జీవితానుభవాలను పరస్పరం పంచుకున్నారు.


అట్లే భవిష్యత్తులో కూడా స్నేహానుబంధాలను

నిలుపుకోవాలని నిర్ణయించుకున్నారు.

మనస్ఫూర్తిగా ఒకరికి ఒకరు అన్నట్లుగా మాటల్లో మునిగిపోయారు

అలా.. అలా..


"ప్రక్కప్రక్క ఇళ్ళల్లో వుంటూ చదువుకున్నా..అన్నా చెల్లెళ్ళలా ఏడేళ్ళు కలిసిమెలిసి కాలం గడిపాం కదూ దాసూ "

"అవును పార్వతీ"

"మరీ..కనీసం..నా పెళ్ళికైనా రాలేకపోయావ్ "

" అప్పుడు నేను ముంబాయ్ లో ట్రైనింగులో వున్నాను. అందుకే రాలేక పోయాను. సారీ"

"ఛిఛీ సారీ ఎందుకు? లీవిట్ "

"అప్పటికి ఇప్పటికీ నీవు ఎప్పుడూ కరుణామయివే ..సులభంగా క్షమించేస్తావ్ "


" మరి నా కూతురు పెళ్ళికైనా వచ్చావా?

అప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యిందినాకు.అందుకే రాలేక పోయాను సారీ"


" కాళ్ళు రెండూ ఫ్రాక్చరటకదా..మీ డాడీ మా డాడీకి చెప్పాడట.పాపం!"


" జాలి చూపటం లో నా చెల్లి పార్వతి దేవతేమరి"


" రేపు నెలలో నా మనవరాలి నామకరణం వుంది .వస్తావుగా దాసన్నా?"


"తప్పకుండా బంగారూ"

**       **    **


"గెట్ టుగెదర్ లో మనం కలుసుకొని రెండేళ్ళయింది కదూ దాసన్నయ్యా"

" ఔను బంగారు చెల్లీ"

"మొన్న నా మనవడి బర్త్ డేకి రాలేదు"

అంటూ బుంగమూతి పెట్టిందిపార్వతి.

"నేను ఆ రోజు చెన్నై కాన్ఫరెన్సులో ఇరుక్కుపోయా. సారీ"


"పర్లేదులే దానూ.. మా నాన్న గుండెఆపరేషన్ జరిగినప్పుడు ..హాస్పిటల్ లో రోజులతరబడి కాపలాగావున్నావ్ .ఎన్నో విధాల ఆదుకున్నావ్ ..కదా మరి"


"నా చెల్లి బంగారు కదూ అన్న ప్రేమను అర్థంచేసుకుంటుంది"


"నా కోడలు డెలివరీ అయినప్పుడు ..నీవు రాలేదు కదూ దానూ"

"వస్తూంటే..కారు రిపేరు కొచ్చింది..బెంగుళూరులోనే ఆగిపోయాను. సారీ"

" చెట్టుకు గుద్దేశావని అన్నారే? అబద్ధాలుకూడా చెప్పడం నేర్చుకున్నావ్ నీ చెల్లి పార్వతితోనే"


"నీవు బాధపడతావని అబద్ధంచెప్పాను బంగారూ"


"కారు మాత్రమే పాడైందట కదా! నీకేం కాలేదని చెప్పారు.మా నాన్నగారితో మీ నాన్నగారు.లీవిట్ దేవుడు మా అన్నయ్య ను చల్లగా కాపాడాడు"


"నా బంగారు చెల్లివి నీవు.నీవెప్పుడూ నా మేలే కోరతావు.

అందుకే బంగారూ!ఈ రోజు మా అబ్బాయి ఈ టైం లో ఇటలీకి వెళ్ళేందుకు ఎయిర్ పోర్టులో ఫ్లైట్ ఎక్కబోతున్నాడు.

అయినా నీ మనవరాలి బర్త్ డే అంటే వచ్చాను"


"దాసన్నా !నీవు తెచ్చిన బంగారు గొలుసు కన్నా.. బంగారంలాంటి నీ మనసే మిన్న! మా ఆయన రిటైర్మెంటప్పుడు నీవు ఇచ్చిన బంగారు ఉంగరం కూడా చాలా బావుంది!"


*****         ***   ****  ***** ......

"హల్లో హెరాల్డుగారూ "

"చేయివిరిగినా ఏ మాత్రం హుషారు తగ్గలేదు దాసూ"

"ఏడుస్తూ కూర్చోటాన్కి నేనేమైనా చిన్న పిల్లాడినా?

అరవైయ్యేళ్ళయోధుణ్ణిమరి !!"

అంటూ విరక్కుండా పదిలంగావున్న కుడిచేతిపిడికిలి బిగించి పైకిలేపిచూపాడు దాసు .


"  అబ్బో!గెట్ టుగెదర్ లో కలిసిన మిత్రులంతా వచ్చివెళ్ళినట్లున్నారు"

అన్నాడు బాలాజీ బెడ్ ప్రక్కన పెరిగిన బొకేలగుట్టల్ని నిండిన పండ్లబుట్టల్ని చూస్తూ .


"అంతా ఆనాటి అన్నలూ తమ్ముళ్ళే వచ్చారన్నయ్యా..

అలనాటి అక్కలూచెల్లెళ్ళెవరూ రాలేదు"

అంటూ నవ్వుతూ ఫ్లాస్కులోంచి కాఫీలు వంచి అందించింది దాసుగారి సతీమణి వచ్చిన మిత్రులిద్దరికీ.


"పాపం!పార్వతికి షుగరెక్కువై ఇబ్బందిగా వుందట !ఆమె కూతురు ఫోన్ చెసింది"

అంటున్న దాసు మాటలు పూర్తి కాక ముందే...


"బంగారుచెల్లిపార్వతికి షుగరు,ముద్దులచెల్లి కనకదుర్గ కి విరేచనాలు, చిట్టి చెల్లి వసుంధరకి వాంతులు..పది మంది సోదరీమణులకి పదిరకాల ఇబ్బందులట"

చిరునవ్వులోనే నిరసనలు తొణికిసలాడిస్తూ వివరించింది దాసు గారి శ్రీమతి,హాజరైన అన్నయ్యలిద్దరికీ.

"అయ్యో పాపం వాళ్ళ పరిస్థితిని అర్థంచేసుకోవే!"

అంటున్న శ్రీవారి వైపు జాలిచూపులు చూసి..


"చాల్లేండి మీ మమతానురాగాలు, ఆ చెయ్యికాస్తావిరక్కుండావుంటే..పావం నా చెల్లెళ్ళకు షుగరువిరేచనాలంట అంటూ ఈ పాటికి వాళ్ళున్న హాస్పెటళ్ళకి పరుగెత్తే వారేమీరు"

అంటూ తలక్రింది దిండుసవరించింది నెమ్మదిగా.


"మీకూ ఆ మహాచెళ్ళెమ్మలు క్లాస్ మేట్లేకదా? మీరూ

గెట్ టుగెదర్ లో కలుసుకున్నారుకదా! మీరూ మా ఆయనలా ఆపద్బాంధవుల అవతారాలెత్తుతున్నారా

పిచ్చోళ్ళలా?"

అంటూ హెరాల్డు బాలాజీ లవైపు దృష్థిసారించిందామె.

"ఏమీ తీసిపోడు వదినా మా ఆయన గారు! ..ఆపదలట్లుంచి.. గెట్ టుగెదర్ చెల్లెళ్ళ ఇంట్లో కుక్కపిల్లలబర్తుడేలు జరిగినా పరిగెత్తి హాజరైపోతారు...ఇంట్లో పండగున్నా పట్టించుకోకుండా!!"

అంటూ హాస్చిటల్ గదిలో అడుగుపెట్టింది హెరాల్డుగారి సతీమణి ఆకస్మికంగా.


"మా ఆయన మరీనూ ..ఇంట్లోఫంక్షన్లున్నా పాతస్నేహితురాళ్ళఫంక్షన్లకే పరుగులు"

రాగాలు తీసింది అక్కడే నిలుచున్న బాలాజీగారి శ్రీమతి. శ్రీమతిహెరాల్డుగారి మాటలకి సృతికలుపుతూ.


పతులకూపిచ్చాపాటీ మాట్లాడుకునేందుకు స్వేచ్ఛనిస్తూ.. వారిని గదిలో వదిలేసి

అలా నడుస్తూ వసారాలోకి వచ్చారు ముగ్గురుశ్రీమతులూ సరదాగామాట్లాడుకుంటూ.


"మన మగ మహారాజులు.. మా క్లాసుమేట్లంటూ పిలిచినా పిలవకపోయినా ఆపదలకు శుభకార్యాలకు వెళుతున్నారుకానీ...వాళ్ళు మన ఫంక్షన్లకు రావటంచూసిందేలేదు"


"అవునువదినా! వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారని మన పురుషోత్తములకు అర్థంకావట్లేదు"


"అవును వదినా! అందరం చదువుకున్నవాళ్ళం! ఈ యాభయ్యేళ్ళప్రాయంలో పాత స్నేహాలు కలుపుకోవటం తప్పనలేము. 

ఏమిటో ఈ మగబుద్ధులు ?పరోపకారంలో హీరోయిజం ఫీలవుతూ వెంపర్లాటలు!!"


" పరోపకారం చేసే మంచి స్నేహితులుండటం ఆనందదాయకమే కానీ...ఆ మంచి వారు మన వారైతే మాత్రం ఇబ్బందికరమే!"


" అన్నట్లు నేనూ గెట్ టుగెదర్ కెళ్ళా మా టెన్త్ క్లాస్ వాళ్ళు మా ఊర్లో పెట్టారు"


"మా డిగ్రీకాలేజీ బ్యాచ్ వాళ్ళూ పెట్టారు. వెళ్ళాను నేనుకూడా.. వెళ్ళకుంటే బావుండదని"


" మా హైస్కూల్ మేట్స్ పిలిస్తే నేనూ వెళ్ళాను వదినా"


"నా టెన్త్ క్లాస్ అన్నయ్యలందరూ మనసున్నమనుషులు వదినా మా ఆయనకి చెయ్యివిరిగిందని తెలియగానే అందరూ వచ్చారు.

అక్కలూచెల్లెళ్ళేరాలేదు.ఎంతఅహంభావమోవాళ్ళకి"


"మా నాన్నకి గుండెనొప్పి వచ్చినప్పుడు నా డిగ్రీబ్యాచ్ బ్రదర్సూ అంతే! అందరూ వచ్చి సాయమందించారు. స్నేహం విలువలు తెలిసిన ధర్మమూర్తులువాళ్ళు.సిస్టర్ కొలీగ్సే ఒక్కరూ రాలేదు..ఛి..ఛీ"

"మా హైస్కూల్ సోదరులుకూడా బంగారు కొండలే వదినా..మంచికీ చెడుకీ దేవదూతల్లా ప్రత్యక్షమౌతారు, సొంతఅన్నదమ్ముళ్ళకన్నా ముందుగానేవచ్చి,నాకూ మా ఆయనకూ అండగా నిలబడతారు"

*****      ******   ****

"ఊరినుంచి అమ్మాయి వచ్చే టైం అయ్యింది.షెడ్డులోంచి కారుతీసి రైల్వేస్టెషన్ కి బయలు దేరండి"

ఆజ్ఞాపించింది ఓ సగటు ఇల్లాలు కారుతాళాలు శ్రీవారికి అందిస్తూ....


ఇంతలోనే ఫోన్ రావటంతో..

" హల్లో..

అయ్యో! కాళ్ళువిరిగాయా? ఆపరేషన్ చేశారా?

అపోలో హాస్పిటల్లోనా" 

అంటూ కంగారుపడుతున్న ఇల్లాలి చేతిలోని ఫోన్ అందుకుని స్విచ్ ఆఫ్ చేశాడు సగటు భర్త గోవర్దన్ .

"అయ్యో! పాపం రవి అన్నయ్యకి యాక్సిడెంటయిందటండీ! మాట్లాడనీయండీ!"

ఏడుస్తూచేయిచాచింది.

"ఎవడో నీ క్లాస్ మేట్ గెట్ టుగెదర్ లో కలిసితగలడ్డాడు. అంతేకదా"


"మీ నాన్నకు గుండె ఆపరేషన్ జరిగినప్పుడు మీక్కూడా అన్నివిధాలా సాయపడ్డాడు కదండీ."


"ఔను..మన ఇంట్లోప్రతిఫంక్షనుకీ వచ్చి అన్నిట్లో తలదూర్చాడు కూడా ...లేదు ..కాదు అనటంలేదు.

అంతమాత్రాన వున్నఫళంగా పరుగెత్తుకెళ్ళటానికి నీవేమైనా విష్ణుమూర్తివా?

కొంచెం ఆలోచించు..

కాసేపట్లో నీ కూతురు అల్లుడు మనవళ్ళు వస్తున్నారు. ఇది ముఖ్యమా? ..ఆ దౌర్భాగ్యున్ని పరామర్శించటం ముఖ్యమా? ఏది ముఖ్యం నీకు?"

అంటూ కారును రివర్స్ చేసి రైల్వేస్టెషన్ వైపు దూసుకెళ్ళాడు గోవర్దన్ నిర్దాక్షిణ్యంగా


సానుభూతికి ఆత్మీయతకు వశమైన ఆడమనసు...అన్నయ్య ఆరోగ్యంగూర్చి ఆరాటపడుతూంటే.....  


కడుపుతీపి మమకారానికి అధీనమై అల్లకల్లోలమైన

అమ్మమనసుమాత్రం.....సందిగ్ధంలో పడి.. ఆవేదనతో అల్లాడిపోయి..చివరకు అక్కడే నిస్సహాయంగానిలిచిపోయింది అలవాటైన మౌనరోదనతో గుండెనుపిండుకుంటూ.

**   ***  ***  ***

"చూడటానికి రాలేదని మా చెల్లెమ్మలను అపార్ధం చేసుకోవద్దు శ్రీమతిగారూ

వాళ్ళూ నీలాంటి బాధ్యతలున్న ఇల్లాళ్ళే కదా! ఎటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారో ?....


స్త్రీ హృదయం పరిధుల్లేని జలధిలాంటిది. 

ఆ తత్త్వం అంచనాలకు అందనిది.

అర్థంచేసుకోవాలంటే వేలాదిసార్లు మళ్ళీమళ్ళీ ఆమె కడుపున పుడుతూపుడుతూ జస్మకో అధ్యయనం చేసుకోల్సిందే!!"

అంటూ  ఆసుపత్రి గదిలో రుసరుసలాడుతున్న సగటు ఇల్లాలిని శాంతపరిచే ప్రయత్నం చేస్తున్నాడు ఆపద్బాంధవుడైన సగటు అన్నయ్య అలవాటైన మాటలతో...

---

పెళ్ళోపదేశం

...పెళ్ళోపదేశం...

.............................

ఏవండోయో...మిమ్మల్నే అబ్బా..కాస్థయినా చురుకు లేకుంటే ఎలాగండి..

ఆ బెజవాడ సంబంధం వాళ్ళు ...మన సంబంధం ఖాయం చేసామని కబురు చేశారని,పిన్నిగారు ఫోన్ చేసి చెప్పారు..

అంది సూర్యకాంతం అరిచినట్లుగా..

ఆ ..ఆ.. వినపడిందే...కేబుల్ టీవీ వాణ్ణి రిచార్జి చేయమని.. డబ్బులిచ్చాను,ఇవ్వాళ సీరియల్ మిస్సవదులే..,

నువ్వేమి దిగులుపడకు..

అయిపోతుందిలే..

అన్నాడు ..సుందరామయ్యా.

అబ్బ.. బ్బా..చెవిటి మేళo మీరును,చెప్ప లేక చస్తున్నానురా దేవుడా..తలుపు పెట్టి చెపితే కొలుపు పెట్టి ఆడిగినట్లుంది మీ వాలకం..

అది కాదండి...ఆ బెజవాడ సంబంధం ఖాయం అయ్యిందట అంది... సూర్య కాంతం.

ఆ..ఆ..వినపడిందోయ్.....

అబ్బా...ఇన్నాళ్లకు నీ నోటినుండి ఒక శుభ వార్త విన్నానోయి.. కాంతం అన్నాడు సుందరామయ్యా సంతోషంగా.

చాల్లేoడి...సంబడం, శుభం పలకరా పెళ్లి కొడకా అంటే..పెళ్లి కూతురు ముండేది అన్నాడట అలా ఉంది మీ మాట.. అంది నిట్టూర్చుతూ..

సరే గాని పంతులు గారికి కబురు పెట్టండి..మంచి రోజు చూసి.. నిశ్చయ తాంబూళాలకు ఏర్పాటు చేసుకుందాము అంది సూర్య కాంతం.

ఆ..ఆ..అలాగే..సాయంత్రం వచ్చేటప్పుడు లీటరు పాలు తెమ్మనేగా..అలాగే తెస్తాను లేవోయ్ అన్నాడు సుందరరామయ్య..

అయ్యా మహానుభావా ఆ చెవిటి మిషన్ కాస్త చెవిలో పెట్టుకోండి మహా ప్రభో.. అరవలేక చస్తున్నా..అంది కసురుకుంటున్నట్లు సూర్యకాంతం.

ఆ..ఆ.. ఇప్పుడు చెప్పఁవోయ్...

అదేనండి పంతులు గారిని అడిగి ముహూర్తం పెట్టండి అన్నాను.

అలాగే..చేద్దాం. ఇంతకు మన వరాలేమంటుంది ఆడిగావా..అన్నాడు సుందరామయ్య.

ఆ..చిన్న పిల్ల దాని మొఖం దానికేం తెలుస్తుంది, మనమెంతoటే అంతా..అంది కాంతం.

సరే శుభస్య శీగ్రo.... అలాగే కానిద్దాం..అంటూ బైటికి నడిచాడు సుందరరామయ్యా.

అమ్మా..వరలక్ష్మి.. విన్నవా అంతా...

కలిసొచ్చే రోజొస్తే నడిచొచ్చే కొడుకొస్తాడంటే ఇదే నే తల్లి..

బంగారం లాంటి సంబంధం...

అదృష్ట వంతురాలివి తల్లి..

అని అమ్మాయి తలపై చేతులు పెట్టి మెటికలు విరిసింది కాంతం.

అమ్మా..మరేమో..మరేమో...

చెప్పవే... పిచ్చితల్లి

చల్లకొచ్చి ముంత దాచడమెందుకు ..చెప్పమ్మా..అంది కాంతం

అమ్మా.. మొన్న పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు కు పళ్ళు వంకరగా ఉన్నాయి, నాకు నచ్చ లేదే..అంది వరలక్ష్మి.

అయ్యోరామా....అదేంటమ్మా పుసుక్కున అంత మాటన్నావు, నవ్వితేనేగా... పళ్ళు బైటికి కనిపించేవి, నిన్ను పెళ్లి చేసుకున్నాక జీవితంలో ఇంకా నవ్వుతాడoటావా.. ...అలా ఎన్నటికీ జరగదు ఆ నమ్మకం నాకుంది... ఏంకాదులేమ్మా ..వదిలేయి అంది కాంతం.

మరి..పెళ్లి కొడుకు కు తల మీద జుట్టే సరిగా లేదు బట్టతలే... ఎలాగమ్మా.. అంది వరలక్ష్మి

చాల్లే సంబడం...పిచ్చి కుదిరింది రొకలి తెచ్చి తలకు చుట్టమన్నాడట వెనుకటికెవరో...అలా ఉంది నీ వరుస...

బట్ట తలట.. బట్ట తల

జుట్టు వున్నా...అది ఎప్పటికైనా మన చేతిలో రాలాల్సిందేనే..

మీ నానకు కూడా ముందు తల జుట్టు వత్తుగా వుండేది...

ఇప్పుడు చూడు జుట్టేమైన మిగిలిందా..

ఎలాగూ పొయేదేగా...

పోయే జుట్టు ఉంటే ఎంత లేకుంటే ఎంత చెప్పు..

ఇది అంతేనే..నువ్వేం.. బాదపడకు తల్లి అంది కాంతం..

మరి... అమ్మా..

ఆ అబ్బాయికి అమ్మ నాన్న ఒకచెల్లి తమ్ముడు నానమ్మ ఇంటి నిండా సంతలా ఉన్నారు కదే..అంది వరలక్ష్మి.

ఓసి పిచ్చి మొఖమా.. ఎవరుంటే నీకెంటే.... పెళ్ళైన రెండు రోజుల్లో...నా అనుభవాన్నంతా రంగరించి కొంప కొల్లేరు చేసి ఇంటిని రెండుముక్కలుచేసి నిన్ను బైట కాపురం పెట్టిస్తానుగా..ఆ పూచి నాది నన్ను నమ్ము అంది కాంతం.

మరి అమ్మా...అబ్బాయి వట్టి అమాయకంగా.... మరీ మెతకలా వున్నాడు..కదే అంది వరలక్ష్మి.

వెతకబోయిన ...తీగ కాలికి తగిలి నట్లు..

వెతికి వెతికి ఏరి కోరి ఈ సంభందం తెచ్చింది అందుకేనే పిచ్చి తల్లి ...మీ నానలా..తానా అంటే తందాన అంటూ గంగిరెద్దుల ఉండాలనే కదమ్మా.. ఇంత కష్టపడి సంబంధం వెదికింది అంది కాంతం.

అమ్మా...పెళ్లంటే నాకు భయమేస్తుందమ్మా..అంది వర లక్ష్మి.

ఓసి మోద్దా ..నీకెందుకే  భయం,.. పెళ్లంటే భయపడాల్సింది , బాదపడాల్సింది నిన్ను చేసుకున్న తరువాత పెళ్లికొడు కైతేను.. మీ నానను చూడటం లేదా..

భర్తoటే ...భరించేవాడే...తల్లి అంది కాంతం.

అమ్మ పెళ్ళైతే..పొద్దు పొద్దున్నే.. లేవడాలు, వంటా వార్పు..అంట్లు బట్టలు ఈ పనులన్నీ ఎలాగే నాకు భయమేస్తుందే...అంది వరాలు.

పిచ్చి తల్లి ఇవన్నీ కొద్ది రోజులేనే, మెల్లగా ఇంటి పెత్తనం అంతా నీ చేతికే వస్తుంది నాలాగా..

తరువాత ఆ పనులన్ని ..చాక చక్యoగా భర్తకు నేర్పించి నేర్పుగా ఎలా చేయించాలో, ఆ వైనం నేను చెపుతానుగా , నానను చూడటం లేదు... అలా అన్నమాట. ఆ తరువాత మన పని హాయిగా...టీవీలో సీరియళ్లు చూడటం ,ముచ్చట్లు పెట్టడం షాపింగులు చేయడం అంతేనే....

నన్ను చూడటం లేదా..అంది కాంతం.

అమ్మా... పెళ్లిలో అమ్మాయి అబ్బాయి వెనకాల నడవాలటగా...ఎందుకే అంది..వరం.

అవునమ్మా..అదే..ఆ అబ్బాయికి ఇక జీవితంలో చివరిసారి గా నడిచే  ముందు నడక, ఇక జీవితాంతం ఉండాల్సింది,నడవాల్సింది నీ వెనకాలేగా..అందు కే కాస్త ఓపిక పడితే చాలు తల్లి....అంది కాంతం.

అమ్మా...పెళ్లిలో అబ్బాయి పొగరుగా తల ఎత్తుకొని నవ్వుకుంటూ ఉంటాడు ..అమ్మాయేమో తల దించుకొని సిగ్గుపడుతుంది.. ఎందుకే అంది వరలక్ష్మి.

ఓహ్...అదా పెళ్లి చేసుకున్నాక అబ్బాయికి ఇక జీవితంలో తలెత్తుకోవటం,నవ్వడం జరగదని..తెలియదుగా.. అందుకే ...మనమే ఆ చాన్స్ అబ్బాయికి ఇస్తామన్నమాట,ధమాకా ఆఫర్లాగా.. అండి కాంతం.

అమ్మా.. పెళ్లిలో అమ్మాయిలు అబ్బాయి కాళ్ళు పట్టాలటగా....అంది వరం.

అవునమ్మా..నువ్వు ముందు ఎలా కాళ్ళు పట్టాలో అబ్బాయికి చూపిస్తావన్నమాట అదే ట్రైనింగలా..ఆ తరువాత ఆ అబ్బాయి జీవితాoతం చేయాల్సింది అదేపనేగా అంది కాంతం.

మరి అమ్మా... ఉంగరాలటలో..ఎప్పుడు అబ్బయిలే. గెలుస్తారెందుకే..అంది వరం.

అవునమ్మా.నువ్వు ఆటలో ఎలా ఓడిపోవాలో అబ్బాయికి చక్కగా నేర్పిస్తావన్న మాట అదే రెహార్సల్ లాగా...జన్మలో ఇక ఏ ఆటోలో నీతో పోటీ పడి గెలవడు గాక గెలవడు ఇది నా గ్యారెంటీ తల్లి అంది కాంతం.

మరేమో...అమ్మా... అబ్బాయి..అమ్మాయికి నక్షత్రాన్ని చూపిస్తాడెoదుకే..అంది వరం.

అవునమ్మా..అది అరుంధతి అని మన ఆడ నక్షత్రమే అంటే మనమే నన్నమాట ...ఇక జీవితాంతం ఎటు చూసినా అది పగలైనా రాత్రైనా మనం అబ్బాయికి పట్టపగలే చుక్కలు చూపిస్తాముగా ...అందుకన్నమాట అంది కాంతం.

అమ్మా..పిల్లలను కనడం వాళ్ళను..పెంచడo అబ్బ..చిరాకమ్మా..అంది వరం.

నీ మోఖం...టీవీ లో సీరయల్ పెట్టుకున్నామంటే చాలు,ఇక కన్నామో లేదో తెలియకుండానే డెలివరీ అయిపోతుంది...ఆ తరువాత బాధ్యతంత...మీ ఆయనో, వాళ్ళమ్మో..లేదా పనిమనిషో చూసుకుంటారే..ఇంత మాత్రానికి భయమెందుకు..తల్లి అంది కాంతం.

అమ్మా... మొగుళ్లు తాగొచ్చి పెళ్లాలను కొడతారటగా..అంది వరం.

ఎంత ధైర్యమే..మన చేతిలో అప్పడాల కర్ర,వంటి oట్లో గిన్నెలు చెoబులు.. చూస్తూ ఊరుకుంటాయా, మనిoట్లో సొట్టలుపడ్డ గిన్నెలు చెంబులు చూడలేదా...అవన్నీ అనుభవాలన్న మాట,,ఆ డోస్ చాల లేదనుకో.. గృహ హింస,వరకట్న వేధింపుల చట్టాలు అన్ని మన చుట్టాలేగా.. వాటి కింద కేసులు పెట్టి,ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించి తాట తియ్యము...ఇక మన మహిళా సంఘాలు ఊరుకుంటాయనుకున్నావా..మనకు కష్టమొస్తే చాలు కాకి తో కబురు పంపకున్నా వాలిపోతాయి ఏకి ..ఏకి..వదిలి పెట్టవు....,నీకేం భయం లేదమ్మా.. ఆ సంగతి నా కొదిలేయి అంది కాంతం.

అమ్మా...అదిగో నాన్నా వస్తున్నారే....ఇంకా వంటకూడా చెయ్యలేదు తిడతాడేమోనే ..భయమేస్తుందమ్మా..ఎలాగే..అంది వరం.

ఆహా..హా...భయమా...నాకా..

నువ్వు చూస్తూవుండు...మీ నాన్నతో ఎలా వంట చేయిస్తానో..అంది వరం...

అమ్మ..దేవుడా...రాముడా తలా పగిలిపోతుంది రా నాయనా....ఒకటే తల నొప్పి అమ్మా.. అమ్మా..

ఏవండి..పాపిష్టి దాన్ని మొగుడికి ఒక ముద్ద అన్నం వండలేకపోయాను..ఎలా రా దేవుడా దేవుడి లాంటి మనిషికి అన్యాయం చేస్తున్నాను..

మా ఆయన బంగారం ..పల్లెత్తి మాటనడమ్మా..మాయదారి నొప్పి..ఇవ్వాళే రావాలా...చక్కగా వడియాల పులుసు,ముద్దపప్పు,గుత్తి వంకాయ కూర వండి పెట్టాలనుకున్నానమ్మా ..నా దేవుడికి...హమ్మ..నాయనా ఏంచేద్దునురా దేవుడా...అంటూ..నటనతో జీవించింది కాంతం.

అమ్మోయ్... నువ్వు సూపర్...నిజంగానేనే నాన మారు మాట్లాడకుండా వంట మొదలు పెట్టాడు అంది వరం.

అదేనమ్మా కిటుకు తలకు గుడ్డకట్టుకొని మూలగటం..రాకున్నా ఏడ్వటం... ముక్కు చీదటం,అలక పాన్పులు ఎక్కడం..ఇవి నేర్చుకుంటే చాలమ్మా మనం మహా రాణులమే. ఎంతటి మొగవాడైనా కుక్కపిల్లలా మన వెనుక తోక ఊపుకుంటూ తిరగాల్సిందే అంది కాంతం.

ఏవండి కాస్తా ఆ బట్టలు కూడా ఆరేయ్యండి..నా కసలే.. నడుము నొప్పి..పాపిష్టి దాన్ని ఎవరైనా చూస్తే మొగుడితో పని చెయిస్తుందని ఆడిపోసుకుంటారు, ..నా బాధ మీకు తప్ప ఎవరికి తెలుస్తుంది చెప్పండి..అయ్యో...అమ్మా..హా.. అబ్బా ..ఏవండి..మీరు మరీనూ..సిగ్గు లేకపోతే సరి ..ఆ లంగా పక్కన లుంగీ అరేయకండి నా కసలే.. సిగ్గు, ఎవరైనా చూస్తే బుగ్గలు నొక్కుకోరు,రోజు రోజు కు చిలిపితనం పెరుగుతుంది మీకు..అంది కాంతం.

అమ్మా..

మరి త్వరగా నా పెళ్లి చేయ్యావే...ఇవన్ని విన్నాక ఎగిరి గంతెయ్యాలని ఉంది అంది వరలక్ష్మి సంతోషంగా..

నా బంగారం అచ్చం నా పోలికే ..అండి కాంతం.

....

సుందరరామయ్యగారు..మంచి మనిషి...ఆఫీసులో చాలా సిన్సియర్.. అనే పేరున్న తెలివైన వ్యక్తి.

కానీ సూర్యకాంతం తన అక్క కూతురు...చిన్నప్పుడు సుందర రామయ్య అక్క దగ్గరే పెరిగి ప్రయోజకుడయ్యాడు....అక్క కోరిక మేరకు సూర్యకాంతాన్ని పెళ్లి చేసుకున్నాడు.

సూర్యకాంతానికి పుట్టుకతోనే...హార్ట్లో చిన్న రంద్రంఉందని..తనను ఉద్వేగానికి లోను కానివ్వకుండా.. గాజుబొమ్మలా పెంచుకోవాలని డాక్టర్లు చెప్పారు..

ఆ విషయం ..సుందరరామయ్యకు చెప్పి సూర్యకాంతాన్ని సుందర రామయ్య చేతిలో పెట్టి కను మూసింది వారి అక్క..

కాంతానికి తన జబ్బు సంగతి తెలయకపోవడం...

అక్క కు ఇచ్చిన మాటను నిలబెట్టు కోవడం కోసం ...

సుందర రామయ్య...అన్ని భరిస్తూ...

కాంతాన్ని కంటి పాపలా చూసుకుంటున్నాడు.. భార్య ఏది చెప్పినా సరేననడం..ఆమె చెప్పిన పనులన్నీ చేయడంతో భార్య దృష్టిలో చులకన అయినాడు... 

కానీ...అక్క కిచ్చిన మాట కోసం..కాంతం ఆరోగ్యం కోసం అన్నీ ..తెలిసినా ఏమి తెలియనట్లు..గరళ కంఠునిలా ..భార్యను భరిస్తున్న ... మనసున్న..మంచి మనిషి సుందర రామయ్య.

కానీ కాంతం ఇదంతా తన ఘనతేనని.. పగటి కలలు కంటూ..బిడ్డకు కూడా అవే చెపుతుంది..కానీ జీవితంలో ఇవన్ని సాధ్యం కానివని ...వరాలుకైనా త్వరలో తప్పక తెలియ వస్తుంది.

పెళ్లంటే..ఇద్దరు వ్యక్తులను,రెండు కుటుంబాలను ఏకం చేసే ఒక పవిత్ర బంధం...సంసారం అంటే భార్య భర్తల ప్రేమ, అనురాగం అన్యోన్యత.. ఒకరి కోసం ఒకరు చేసే త్యాగం, ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకొని గౌరవిస్తూ..సాగించే ప్రయాణం అంతే కాని ఒకరి లోపాలను మరొకరు వెతుక్కుంటూ .. ఒకరి నొకరు....కించ పరుచుకోవటం...కానే కాదు కదా..


...పెళ్లి ఆగిపోయింది...


ఆరాధ్య పెళ్లి ఏర్పాట్లన్నీ 

ఘనంగా జరుగుతున్నాయి..


ఖరీదైన శుభ పత్రికలు,పట్టుపీతాoబ్రాలు,

ముత్యాలు పొదిగిన బంగారు ఆభరణాలు,

మిరిమిట్లు గొలిపే విద్యుత్ వెలుగులు, రంగు రంగుల పూలతో అందంగా అలంకరించిన కళ్యాణమంటపం..

అతిధులకు పసందైన విందు ఏర్పాట్లు... బ్రాహ్మoడoగా..పదుగురు పదికాలల పాటు చెప్పుకునేలా శ్రద్ధగా దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేయిస్తున్నాడు ప్రసాద్.


ఇక సరస్వతి విషయం చెప్పనవసరం లేదు, 

పెళ్లికి సంబంధించిన ప్రతి ఘట్టాన్ని సాంప్రదాయ బద్దంగా ఏ లోపం రాకుండా చేసే ఏర్పాట్లలో తల మునకలైంది. 


ఇదిగో..మిమ్మల్నే.. ఏవండి..బ్యాoడ్ మేళం వద్దనుకున్నాముగా, ఆ సన్నాయి మేళం సంగతి చూడండి..అలాగే..,


ఆ విడిది ఏర్పాట్లు కాస్త ఖరీదైన హోటల్లో చేయండి, అసలే ఫారిన్ పెళ్ళికొడుకు వసతులన్ని స్పెషల్ గా వుండేలా చూడండి,

మళ్ళీ మాటొస్తుంది సమా.....,


అన్నట్లు మరిచి పోయాను, ఒంటి బ్రాహ్మణుడు శొంఠికొమ్ములా కాకుండా...జంటగా మరో బ్రాహ్మణుణ్ణి తెచ్చుకోమని పంతులు గారికి చెప్పండి, సoభావన మనమే యిస్తామని, కాస్తా శాస్త్రం తెలిసిన వారిని  చూడమని మరీ చెప్పండి అంది సరస్వతి. 


సరే అలాగే కాని,...ఆ పసుపు కొట్టే రోలు, రోకళ్ల సంగతి చూడు మళ్ళీ అది దొరకలేదు,ఇది కుదర్లేదని ప్రాణాలు తోడేస్తావు, అన్నాడు ప్రసాద్.


ఆ...ఆ..అలాగే లెండి అంది.. సరస్వతి.


పెళ్లంటే నూరేళ్ళ పంట అంటారు,ప్రతి విషయoలో ఎంతో జాగ్రత్త వహించే తల్లిదండ్రులు.. అసలు పిల్లలు ఏమనుకుంటున్నారు ముఖ్యాoగా ఆడపిల్ల మనసులో ఏముంది..తాను మనస్ఫూర్తిగా పెళ్లికి సిద్ధమైందా..లేదా,తన ఆలోచన ఏమిటి ?అని తెలుసుకునే ప్రయత్నం చాలా తక్కువమంది మాత్రమే చేస్తారు.


కానీ దీనిని తల్లిదండ్రుల తప్పని అనలేము, తమ బిడ్డల మీదున్న విపరీతమైన ప్రేమ కారణం చేతనో,తమ పిల్లలకు తాము చేసేదంతా మంచిననే నమ్మకమో.. గాని,పిల్లలెoత ఎదిగినా.. ఇంకా వారిని చిన్న పిల్లలుగానే చూస్తూ వాళ్లకేం తెలుసునని, వాళ్ళను తేలికగా తీసుకుంటారు.


కానీ ...అన్ని విషయాల్లోను చాలా గొప్పగా వుండే సంబంధం చూడాలని..

తమ తాహతుకు మించి కట్న కానుకలిచ్చయినా సరే ,తమ పిల్లలకు  మంచి సంబంధం తేవాలని తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు.


కానీ ఒక్కోసారి తల్లిదండ్రుల ఈ విపరీతమైన ప్రేమే పిల్లల పాలిట శాపంగా మారినట్లే, తల్లిదండ్రుల పట్ల పిల్లల కున్న భయమో..భక్తో... లేదా వారి దూకుడుతనమో తల్లిదండ్రుల పాలిట శాపంగా మారుతుందన్నది వాస్తవం. 


ఈ పరిస్థితులే..ఈ పెళ్లి కథను ఊహించని మలుపు తిప్పాయి.


పెళ్లికోసం కన్నె పిల్ల ఎన్నో కలలు కoటుంది,కాబోయే భర్త గురించి, ఆ తరువాత అతనితో గడపబోయే జీవితం గురించి..కానీ ఆరాధ్య ఈ పెళ్లంటేనే భయపడుతుంది.ఇష్టం లేదని చెప్పలేదు..అలా అని ఇష్టoగా ఈ పెళ్లి చేసుకోలేదు. మనసులోని భావాన్ని బాధను ముఖంలో కనపడనీయకుండా...ఎంత జాగ్రత్త పడ్డా.. దాచలేకపోతుంది అందుకే కాబోలు "ఫేస్ ఈజ్ ఇండెక్స్  ఆఫ్ ది మైండ్" అంటారు.


తన భావాలన్ని..డైరీగా రాయడం అలవాటున్న ఆరాధ్య...గత వారం నుండి మనసు బాగోలేక రాయలేని డైరీని రాయడం మొదలు పెట్టింది.

బహుశా ఆ తరువాత ఇక డైరీ రాయడం కుదరక పొవచ్చనుకుంది కాబోలు.


"ఎప్పటికి నా హీరో నాన్నే...చిన్నప్పటినుండి నా సంతోషం లోనే నాన్న తన ఆనందం చూసుకున్నాడు.నాకింత వయసొచ్చిన నాన్న పక్కన ఆయన చేతిపై తలపెట్టి నిద్రపోతే..అదో ఆనందం అదో భరోసా..ఈ ప్రపంచంలోని సంతోషాలన్ని నాన దగ్గరే నాకు లభిస్తాయనిపిస్తుంది. నాన కూడా అంతే పనులన్నీ పక్కన పెట్టి నాకేం కావాలి..నా ఆనందం కోసం ఏం చేయాలి అని చూస్తూవుంటాడు...నిద్ర లేవగానే నా మొఖం చూడటం నుదుటిపై ముద్దుపెట్టడంతో నాన్న దినచర్య మొదలవుతుంది.


ఇక అమ్మ...ఇప్పటికి ఇంటిదగ్గర ఒక్కనాఁడు నా చేత్తో అన్నం తిననివ్వదు .. 

అమ్మ చేతి గోరు ముద్దలంటేనే నాకు కూడా చాలా ఇష్టం. 

పనులన్ని పక్కన పెట్టి కొసరి కొసరి

నాకు అన్నం తినిపిస్తుంది అమ్మ...ఇంకా చాలమ్మానా కడువు నిండిపోయింది అంటే..

ఇదిగో ఇది నాన ముద్ద,

ఇది అమ్మ ముద్ద..

ఇదిగో ఇదే ఆఖరుది దేవుడి ముద్ద అంటూ..సెంటిమెంట్ తో నా పొట్ట నిండా అన్నం తినిపిస్తుంది అమ్మ.


అంత మంచి తల్లిదండ్రులకు..ఒక్కగానొక్క కూతుర్నవ్వటం నా అదృష్టం..నా మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందో అని అమ్మా నాన మరో సంతానానికి కూడా అవకాశం ఇవ్వలేదు అది నా పై వారి కున్న ప్రేమ.


అలాంటి నాన్న తో నాకీ పెళ్లి ఇష్టం లేదని,నాకు సుదీప్ అంటే ఇష్టమని ఎలా చెప్పగలను..


నేను లేకుండా బ్రతకలేనని..కావాలంటే అoకుల్తో నేను మాట్లాడతానని..సుదీప్ ఎంత చెప్పినా ససేమీరా అన్నాను...

ఎందుకంటే ..?

నాకు నా సంతోషం కంటే నాన్న సంతోషమే ముఖ్యం కనుక.


మన ప్రేమను బలిచేయొద్దు.. 

ఆరాధ్య .....బాగా ఆలోచిoచు,ఇది జీవితం,జీవితమంటే బొమ్మలాట కాదు,మనసొకచోట ....మనువొకచోట నరకం లా ఉంటుంది తెలుసా..అని ఎన్ని రకాలుగా చెప్పినా..


నేను నిన్ను ప్రేమిoచిన దానికి వందరేట్లు ఎక్కువగా నానను ప్రేమించాను..

ప్రేమిస్తూనే ఉంటాను..

నా జీవితంలో నరకం అంటూ ఉంటే అది నానకు బాధ కలిగించి నప్పుడు మాత్రమే...

అందుకే నా ప్రాణం ఉన్నంత వరకు నాన్న ఎలా చెపితే అలా నడుచుకుంటాను..

నానను బాధపెట్టే రోజంటూ నా జీవితంలో వస్తుందంటే అది నా చావు మాత్రమే,

నా ఊపిరున్నoతవరకు నాన్న కోసం ప్రపంచాన్నయినా ఎదిరిస్తాను తప్ప, నాన్న ను బాధపెట్టను అని నిక్ఖచ్చగా సుదీప్ కు చెప్పాను.


ఈ ఒక్క రోజు దాటితే నీతో మాట్లాడే అవకాశం కూడా ఉండదు అని ఎంత చెప్పినా నో..అన్నాను.


నా నిర్ణయం మారదని సుదీప్ కు తెలుసు,


నీలా నాన్న ను ఇంతగా ప్రేమించే కూతురు దొరకడం మీ నాన్న అదృష్టం..

అలాగే నీలాంటి గొప్ప సంస్కారం ఉన్న అమ్మాయి లభించక పోవటం నా దురదృష్టం అంటూ బాధపడ్డాడు సుదీప్.


సుదీప్ ఆలోచనలు మనసులోకి రాగానే నా హృదయంలోని ప్రేమ కన్నీటి బిందువుల్లా నన్ను ఓదార్చటానికి బైటికి వచ్చింది..రాస్తున్న డైరీలోని అక్షరాలు కన్నీటి బిందువులతో నా మనసులా చేదిరిపోయాయి.  


డైరీని మూసి..అలాగే పడుకున్నాను .


తెల్లవారితే పెళ్ళి..ఇల్లంతా సందడిగా వున్నా నా మనసు ఒంటరితనంతో బాధపడుతుంది.


తెల్ల వారేసరికి..నాన్న చేతిపై నిద్రపోతున్నాను.


నాన కళ్లనుండి కారుతున్న వెచ్చని కన్నీళ్లు..నా బుగ్గలపై పడటంతో..మెలకువ వచ్చింది.


నాన్న అన్నాను..నాన్న చేతిలో నా డైరీ ఉంది.


నాన్న నన్ను పొదవి పట్టుకొని..తప్పు చేశాను నాన నన్ను క్షమించరా..నీ మనసు తెలుసుకోలేక పోయాను అంటూ పొంగివస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నాడు.


సరే... ఇక చేసేదేమీ లేదురా,సమయం చెయ్యిదాటింది, నేను చెప్పినట్లు చేస్తావా నాన్న అన్నాడు నాన్న..


తప్పకుండా నాన్నా అన్నట్లు తలా ఊపాను..నాన్న గుండెల్లో తలదాచుకుంటూ..


నువ్వెళ్ళి పెళ్లి కూతురులా చక్కగా ముస్తాబవ్వు తల్లి అన్నాడు నాన్న..


సరే నాన్నా అన్నాను.


పెళ్లికి మరో గంట సమయం ఉంది...అంత రెడీ అయి మంటపానికి బయలు దేరాము.


మేల తాళాలతో, ముత్తైదువుల మంగళ హారతి తోడురాగా,బంధు మిత్ర సకుటుంభ సపరివార సమేతంగా,

సాంప్రదాయ బద్దంగా కళ్యాణ మంటపం చేరుకున్నాము..


బరువెక్కిన నా హృదయం..బాధతో కుండపోత వర్షానికి ముందు మేఘంలా భారంగా అనిపించింది.


కారు దిగగానే..పెళ్లి మండపంలో ..


బంగారు బొమ్మ రావేమీ..పందిట్లో పెళ్లి జరిగెనే పాట..వినిపించగానే అప్రయత్నంగా నా కళ్ళవెంట నీళ్లు జల జలా రాలాయి...


నాన్న నన్ను గమినించినట్లున్నాడు..దగ్గరగా వచ్చి నా తలపై చెయ్యి పెట్టి భయపడకు బిడ్డా..అన్నట్లు నన్ను దీవించి,నా చేయిపట్టుకొని..కళ్యాణ మంటపంలోకి నడిపించాడు. ఆయన చేతి స్పర్శ నన్ను ఓదార్చుతున్నట్లనిపించింది..కాని నా మనసును నేను ఓదార్చుకోలేక పోతున్నాను.


మంటపంలోకి చేరగానే...నేను రెడీ అవ్వడానికి పక్క గదిలోకి వెళ్ళాను..నాకోసం సిద్దంగా ఉన్న సుదీప్..నా చేతిలో ఒక ఉత్తరం పెట్టాడు.


అది నాన చేవ్రాలు...


"తల్లీ... ఈ పరిస్థితిలో పెళ్లి ఆపలేను.. అలా అని నా చిట్టి తల్లి బాధను చూడలేను, అందుకే..నువ్వు సుదీప్ తో 

సంతోషంగా వెళ్ళు..

ఇక్కడి విషయాలు నేను చూసుకుంటాను.


మీ..

నాన్న


పెళ్లి కొడుకు కారు కళ్యాణ మంటపంలోకి వచ్చింది.


నా చేయి పట్టుకొన్న  సుదీప్ పక్కదారి గుండా నన్ను కళ్యాణ మంటపం నుండి బైటికి తీసుక వెళ్లాడు..


దూరంగా నిలబడి నాన చిరునవ్వుతో నన్ను వెళ్ళమని చేతులతో సైగ చేస్తున్నాడు.


ధైర్యంగా సుదీప్ తో ముందడుగు వేసాను.


ఆ తరువాత నేను లేచిపోయానని నాన్నను అందరూ నానా రకాల మాటలన్నారు..నాన మౌనంగా అన్ని నా కోసం భరించాడు.


కాల చక్రం గిర్రున తిరిగింది.. నాన్న మా పాపను చేతిపై పడుకోబెట్టుకొని నిద్ర పుచ్చుతున్నాడు.


నేను నాన్న వడిలో నా బిడ్డను చూసి మురిసిపోయాను.


ఆయన మంచి నాన్న తో పాటు 

మంచి తాత అయినందుకు.


మీ ఆయన్ని అమ్మేశావా?

అయినా నా మొగుడిని నేనమ్ముకుంటే మీకెందుకు అన్నావ్ కదే ఆరోజు అంది రాధ వాళ్ళ అమ్మ. అమ్మా. నాకు నా మొగుడు కావాలి. నా బతుకు నాకు కావాలి అని ఏడ్చింది రాధ.


నీకు పిచ్చి పట్టిందే. అప్పుడు వద్దంటే లతని పెళ్లి చేసుకొమ్మన్నావ్. ఇప్పుడు మళ్లీ లతని వెల్లిపోమ్మంటున్నావ్. నీకు పెళ్లంటే ఆటలుగా ఉందా? అన్నాడు మధు.


చూడక్కా. ఆయనతో కలిసి ఉండాలి అంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి అంది లత.

ఏమమ్మా. డబ్బులు ఇవ్వగానే సరిపోతుందా. ఇప్పుడు నేనే ఇచ్చేస్తా నీ డబ్బులు. తీసుకుని ఇంటికి వెళ్లిపో అంది రాధ.

ఏమిటమ్మా నువ్విచ్చే బోడి డబ్బులు. రెండు కోట్లు ఇవ్వగలవా. నాలుగు కోట్లు ఇవ్వగలవా. నా కూతురు మధు మీద ప్రేమతో అతడిని పెళ్లి చేసుకుంది. నీలా డబ్బుకు ఆశపడి అమ్ముకునే రకం కాదు అన్నాడు లత తండ్రి.


అయ్యో. అయ్యో. ఈ పిచ్చి మనసుకి అర్థం కాదు. జీవితం చేజారిపోయిందని. ఏమిటో. వెళ్లిపోండి అంటూ అందర్నీ పంపించేసింది రాధ.


ఈ వ్యథ నేను భరించలేను. డబ్బు కోసం ఆశ పడ్డాను. కానీ ఆ అత్యాశ నన్ను బలి తీసుకుంటుందని అనుకోలేదు.


రాధ నిద్ర మాత్రలు తీసుకుంది. టక్ టక్ అంటూ తలుపు చప్పుడైంది.





...సమాప్తం....




****** *** *** ****  ****