I love you - Episode 2 in Telugu Drama by SriNiharika books and stories PDF | నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 2

Featured Books
Categories
Share

నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 2




'నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక ప్రారంభం




జరిగిన కథ:


పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీ గా ఉంటాడు. పద్మ చాలా ఓర్పు, నేర్పు ఉన్న ఇల్లాలు. కొడుకు వంశీ బాగా చదివే తెలివైన కాలేజీ స్టూడెంట్. 


చిన్నప్పటి నుంచి ఆడవారితో అసలు మాట్లాడే వాడు కాదు వంశీ. అలాంటి వంశీ కాలేజీ లో ఒక అమ్మాయిని చూసిన తర్వాత.. లవ్ లో పడతాడు. బస్ స్టాప్ లో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకుంటాడు. కాలేజీ సెలవుల్లో కంప్యూటర్ ల్యాబ్ లో వారి పరిచయం బాగా పెరిగింది. 

నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 2 చదవండి. 


"జోకులు కాదు.. నేను నీ అంత తెలివైన దానిని కాదు. ఏదో అలా చదువుతాను అంతే!" అంది స్వాతి. 


"పవర్ ఎలాగో లేదు. ఇంకా కాసేపు మాట్లాడొచ్చు కదా స్వాతి.. ఇంతకి మీ ఇంట్లో వారి గురించి చెప్పనే లేదు.. !" అన్నాడు వంశీ. 


"మా అమ్మ హౌస్ వైఫ్, మా నాన్నగారు బిజినెస్ చేస్తారు. ఎప్పుడు చాలా బిజీ గానే ఉంటారు.. నన్ను చాలా అల్లారు ముద్దుగా పెంచారు. మా ఇంట్లో మా నాన్న మాట అందరూ వినాల్సిందే.. ” 


ఇలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటుంటే.. ఇంతలో పవర్ వచ్చింది. కంప్యూటర్ ల్యాబ్ లో వర్క్ చేసారు ఇద్దరు. వంశీ సీనియర్ అవడం చేత.. స్వాతి తనకున్న డౌట్స్ అన్నీ అడిగింది. వంశీ అన్ని విధాల సహాయం చేసాడు. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదని వంశీకి తెలుసు. 


ఇలాగే రోజులు గడుస్తున్నాయి. క్లాసులు అయిపోయిన తర్వాత, బస్సు స్టేషన్ లో చాలా సరదాగా మాట్లడుకునే వారు. కంప్యూటర్ ల్యాబ్ కు అనుకోకుండా వారం సెలవిచ్చారు. వారం రోజుల పాటు స్వాతి ని చూడకుండా వంశీ ఉండాలి. ల్యాండ్ ఫోనులో మాట్లాడాలి అంటే రిస్క్ అని.. స్వాతి నెంబర్ ఇవ్వలేదు. అందులో స్వాతి వాళ్ళ నాన్నగారికి ఇలాంటివంటే అసలు ఇష్టం ఉండదు. 


ఈ టైం లో స్వాతి ఏం చేస్తుందో అని వంశీ ప్రతి రోజు ఆలోచించేవాడు.. స్వాతి కి ఇష్టమైన బెండకాయ కూర చెయ్యమని వంశీ అమ్మతో చెప్పేవాడు. వంశీ బెండకాయ కూర ఇష్టం లేకపోయినా.. ఇష్టం చేసుకున్నాడు. స్వాతి కి బ్లాకు కలర్ అంటే చాలా ఇష్టమని చెప్పింది.. అందుకే ఎప్పుడు బ్లాకు జీన్స్ వేసుకునేవాడు వంశీ.. 


సెలవులు అయిన తర్వాత.. మర్నాడు నీట్ గా డ్రెస్ చేసుకుని వంశీ కాలేజీకి వెళ్ళాడు. అక్కడ తన అందాల రాణి ఇంకా రాలేదు. స్వాతి ఫ్రెండ్ కనిపించింది. స్వాతి ఎక్కడని ఆ అమ్మాయిని అడిగాడు. తనకి జ్వరమని, అందుకే కాలేజీ కి వాళ్ళ మమ్మీ పంపలేదని చెప్పింది. పది రోజుల వరకు స్వాతి కాలేజీకి రాలేదు. వచ్చిన వెంటనే విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. 


"హాయ్ స్వాతి! నువ్వు ఇన్ని రోజులు కాలేజీ కు రాలేదు.. నాకు ఏమి తోచలేదు. నీ ఫోన్ నెంబర్ కుడా నువ్వు ఇవ్వలేదు. నాకు ఫోన్ లో మాట్లాడడానికి లేదు"


"అబ్బాయిలు ఫోన్ చేస్తే, ఇంట్లో తిడతారు.. అందుకే ఇవ్వలేదు.. " అంది స్వాతి. 


"ఇంతకీ నీ జ్వరం తగ్గిందా.. ?"


"మలేరియా ఫీవర్ అంట.. చాలా టైం పట్టింది తగ్గడానికి.. ఇప్పుడు ఇంకా చాలా నీరసంగా ఉంది.. క్లాసులు మిస్ అవుతానని వచ్చేసాను.. "


"నువ్వు ఏం కంగారు పడకు స్వాతి! నేను నువ్వు మిస్ అయిన క్లాసులు అన్నీ చెబుతాను.. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే, నన్ను అడుగు.. "


"ఓకే వంశీ!.. నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నోట్స్ తీసుకుంటాను.. ఏమైనా డౌట్స్ ఉంటే, అడుగుతాను"


మర్నాడు కాలేజీ కి వచ్చిన స్వాతి.. వంశీ కోసం 'ఫైవ్ స్టార్' చాక్లేట్ కొన్నది. అది వంశీ కి ఇచ్చింది. దాన్ని వంశీ తినకుండా అలానే దాచుకున్నాడు. ఎంత భద్రంగా దాచాడంటే, లోపల పదార్ధం అంతా పోయినా.. కవర్ మాత్రం రోజు చూస్తూ మురిసిపోయేవాడు. ఇది వంశీ మనసు లోపల ఉన్న తన ప్రేమ కు నిదర్శనం. ప్రతిరోజూ దానిని చూసుకుంటూ, దానిలో స్వాతి రూపాన్ని ఉహించుకుంటూ.. మురిసిపోయేవాడు పిచ్చి వంశీ.. 


ఒకసారి కాలేజీ కి వెళ్ళడానికి ఇద్దరు బస్ స్టాప్ లో బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు ఒకే బస్సు ఎక్కారు. బస్సు డ్రైవర్, కండక్టర్ టీ తాగుతున్నారు. వంశీ స్వాతి పక్కన వెళ్లి కూర్చున్నాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నారు.. 


"స్వాతి! నీకు ఏ చాక్లేట్ అంటే ఇష్టం.. ?" అని అడిగాడు. 


"కిట్ కాట్ " అంది స్వాతి. 


పక్కన ఉన్న స్వాతి చాలా దగ్గరగా.. ఇలా మాట్లాడుతుంటే, మనసులో ఎంతో ఆనందం ఉన్నా.. డ్రైవర్ ఇంకో వంద కప్పుల టీ తాగి వస్తే.. బాగున్ను అనుకున్నాడు వంశీ. కానీ.. డ్రైవర్ వెంటనే వచ్చేసాడు. బస్సు స్టార్ట్ చేసాడు డ్రైవర్. చుట్టూ ఉన్న జనాలు ఆనందంతో ఉన్నారు.. వాళ్ళ గమ్యానికి డ్రైవర్ శ్రీకారం చుడుతున్నందుకు. కానీ వంశీ కు మాత్రం ఆనందం లేదు. ఎంత సేపు చూసినా తనివి తీరని స్వాతి రూపం.. కొద్ది నిమిషాలలో దూరం కానుంది. ఒక్క నిమిషం స్వాతి దూరం అయినా.. ఏదో లాగ ఉండేది వంశీ కి. కొంత సేపటికి కాలేజీ స్టాప్ వచ్చింది. వంశీ వెనుక నుంచి.. స్వాతి ముందు నుంచి బస్ దిగారు. 


ఆ సమయంలో ఆకుపచ్చ చిలక లాగ.. ఆమె బస్సు దిగుతుంటే చూడడానికి రెండు కళ్ళు చాలవు. వంశీ స్వాతి ని ముందు నడవమని.. పక్కన ఉన్న షాప్ కు వెళ్లి కిట్ కాట్ కొని తెచ్చాడు. కాలేజీ కి వెళ్ళగానే, స్వాతి కిచ్చి 'బై' చెప్పాడు. కిట్ కాట్ అందిచేటప్పుడు ఆమె చేతి వేళ్ళు తనకి తాకినప్పుడు వంశీ కి మల్లెపూలు తాకిన భావన కలిగింది. 


"ఇప్పుడెందుకు ఇది వంశీ.. ?”


"నీకు ఇష్టమని చెప్పవు కదా.. తీసుకో.. "


స్వాతి దానిని తీసుకుని తన హ్యాండ్ బ్యాగ్ లో వేసేసింది. ఇద్దరు ల్యాబ్ లోకి అడుగు పెట్టారు. కొత్త జంట మొదటసారి ఇంట్లోకి అడుగు పెడుతున్నట్టు గా.. దిష్టి, హారతి తక్కువగా తోచాయి వంశీకు. స్వాతి కి 'బై' చెప్పి.. ఇప్పుడే వస్తానని వెళ్ళాడు వంశీ.. 


వంశీ స్వాతి ఆనందంగా ఉండడం చూసి.. తాను కుడా ఎంతో సంతోషపడేవాడు. కొన్ని రోజుల కిందట స్వాతి గుర్తుకొచ్చింది వంశీ కి.. 


****


స్వాతి పరిచయమైన కొత్తలో.. ఒక రోజు.. ఎంతో దీనంగా.. కంట్లో నీళ్ళు నింపుకుని.. వంశీకి కనిపించింది. అమాయకంగా ఉండి.. కాంతి తో ప్రకాశించే ఆమె కళ్ళలో నీరు చూసి వంశీ చాలా బాధ పడ్డాడు. 


"ఏమిటి విషయం స్వాతి.. !.. "


స్వాతి ఏమీ మాట్లాడకుండా.. సమాధానం చెప్పకుండా.. వెళ్లిపోయింది. మళ్ళీ.. కొన్ని గంటల వరకు వంశీని కలవలేదు. ఆ తర్వాత గంటలో కలిసింది. వంశీ ఎంతో రిలీఫ్ పొందాడు. 


"వంశీ! నాకు ఒక అబ్బాయి లవ్ లెటర్ రాసాడు. నాకు చాలా భయంగా ఉంది.. ! మా ఇంట్లో ఇలాంటివి అసలు నచ్చవు. మా నాన్నకు తెలిసిందంటే, చాలా ప్రమాదం.. "


ఇది విని.. వంశీ షాక్ అయ్యాడు. "ఇదిగో లెటర్.. " అని వంశీ కి ఇచ్చింది స్వాతి. అందులో అంతా కోడ్ లెటర్స్ లో రాసి ఉంది. కొంతవరకు 'ఐ లవ్ యు' అనే అనిపించింది. ఆ అబ్బాయంటే స్వాతి కి ఇష్టం లేదని తెలిసింది వంశీ కి. 


"స్వాతి! నువ్వు ఇలా భయపడకూడదు. అందంగా ఉన్న అమ్మాయిలకి ఇటువంటి లెటర్స్ రావడం కామన్. వీటిని పట్టించుకోవద్దు.. నీకు నచ్చకపోతే, వెళ్లి ఆ అబ్బాయికి చెప్పు.. అంతే!” అని చెప్పాడు వంశీ. 


"నేను అంత అందంగా ఉంటానా వంశీ.. ?" అడిగింది స్వాతి. 

 

"నీకు ఏం తక్కువ స్వాతి! చాలా బాగుంటావు.. నీ డ్రెస్సింగ్ స్టైల్ ఇంకా బాగుంటుంది.. "


తన మాటలకు ఆమె బాగా స్పందించిందని.. ఆ లెటర్ ని తిడుతూ ఆ అబ్బాయికి ఇస్తునప్పుడు తెలిసింది.. వంశీ కి.. 



=====================================================================


నేనే నీవు ,నీవే నేను..
నాతో నువ్వు, నాలోనే నువ్వు..
నువ్వు లేని నేను...
నిమిషం నిలువలేను , నాలా నేను...

అందమైన జీవిం
నాది కాదు కానీ...
అందులో నీ పరిచయం ఒక అద్భుతమే..

అందరిలాంటి బంధం 
మనది కాదు కానీ...
మన మధ్య అనుబంధం మాత్రం 
ఎప్పటికీ అపురూపమే..

అవరోధలేన్ని ఎదురైనా
ఆశ విడువక , ఆగకనే సాగుమా..
నాతో నా ఆకరి మజిలీ వరకూ..

చితి మీద చేరినా , చింతించినా..
నువ్వు చివరి వరకూ తోడుండి..
సాగనంపు తానంటే ...

ఎదురు చూపులు మాత్రం ఆపాను..
మరు జన్మలో ,తోడు అవుతానంటే..

ప్రియా...
 ని ప్రేమకు

కొందరికి నిజం చెప్పిన ఎప్పటికి నమ్మరు 
నమ్మకం లేనప్పుడు ఎన్ని సార్లు నిజం చెప్పిన నమ్మనప్పుడు మౌనంగా ఉండడమే మంచింది, 
లేదంటే మానసిక ఆరోగ్యం క్షినిస్తుంది 
వీలైతే మనలను నమ్మలేని వారికీ దూరంగా వుండండి లేదా మౌనంగా ఉండండి... ✍️
నేను ప్రేమ కోసమే పుట్టాను 
ప్రేమ కోసమే బ్రతుకుతున్నను 
ప్రేమ కోసమే చనిపోతాను,
ప్రేమ నన్ను బ్రతికిస్తుంది 
ప్రేమ శాశ్వతమైనది 
ప్రేమలో భయం ఉండదు 
ప్రపంచంలో నిజమైన ప్రేమ వుంది 
నిజమైన ప్రేమని కొందరు మాత్రమే చూడగలరు 

నిజమైన ప్రేమని మరి కొందరు జీవితకాలమైన చూడలేరు...... ✍️
నాకు ఈ క్షణమే తెలిసింది 

నాలో ప్రాణం వుంది కానీ జీవము లేదని 

ఎప్పుడు నాతో మాట్లాడే నా మనసు కూడా మౌనంగా వుంది 

నా కనుల నుండి వచ్చే కన్నీళ్లు చెప్తున్నాయి 
నీలో ఏదో తెలియని భాద ఉందని 
ఇంకా వుంది.. 

నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 3 త్వరలో..