I love you - Episode 1 in Telugu Drama by SriNiharika books and stories PDF | నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 1

Featured Books
Categories
Share

నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 1





'నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం




అది విశాలమైన విశాఖ సాగర తీరం. అక్కడే ఉన్న కాలేజీ లోనే వంశీ డిగ్రీ చదువుతున్నాడు. వంశీ చాలా తెలివైనవాడు. ఎప్పుడు చదువు పైనే ధ్యాస ఉండేది. ఎప్పుడు మంచి మార్కులే వచ్చేవి. చిన్నప్పటి నుంచి ఆడవారితో అసలు మాట్లాడే వాడు కాదు. 


వంశీ చదువుతున్న కాలేజీ.. చాలా పేరున్న కాలేజీ. సిటీ లో ఉన్న వాటిల్లో చాలా పేరున్న కాలేజీ. ఐదంస్తుల పెద్ద భవనం. అన్నీ సౌకర్యాలు ఉన్న కాలేజీ అది. 

ఎవరికీ ఏ కాలేజీ లో సీటు ఎందుకు రాసిపెట్టి ఉన్నదో ఎవరికి తెలుసు. 


"ఏవండీ! మన అబ్బాయి బాగా చదువుతున్నాడు. పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ అయిపోతాడేమో.. "

"మన అబ్బాయిని కంప్యూటర్స్ లో బాగా చదివిస్తాను పద్మ! ఇప్పుడు కంప్యూటర్స్ కు బాగా డిమాండ్ ఉంది.. "

"ఏమండీ! ఇంకో విషయం.. ఇంట్లో ఫోన్ లేకపోతే ఎలా చెప్పండి.. అబ్బాయి పెద్దవాడు అయ్యాడు కదా.. ఆ ల్యాండ్ లైన్ ఫోన్ కాస్త పెట్టించండి.. దేనికైనా ఉపయోగ పడుతుంది.. "

"అలాగే పద్మ.. !"

"ఆ డబ్బా టీవీ ఎప్పుడూ రిపేర్ వస్తుంది.. దానిని కాస్త బాగు చేయించండి. కేబుల్ వాడు ఇచ్చే ఆ నాలుగు ఛానల్స్ అయినా చూడాలి కదా.. ఇంతకుముందు ఒక్క దూరదర్శన్ ఒక్కటే ఉండేది.. మేడ మీదకు పోయి ఎప్పుడూ ఆ యాంటెన్నా తిప్పుకుంటూ, వచ్చే ఆ ఒక్క ఛానల్ చూసేవాళ్ళం. వారానికి వచ్చే ఆ ఒక్క తెలుగు సినిమా కోసం ఎదురు చూసేవాళ్ళం కదండీ! ఇప్పుడు కొత్తగా ఈ కేబుల్ టీవీ రావడం.. రోజుకు రెండు సినిమాలు వస్తున్నాయి. ఆ టీవీ కి రిమోట్ కుడా లేదు. ఒక వెయ్యి కడితే.. రిమోట్ పెడతారంట.. అది కుడా పెట్టించండి. 


పద్మ అండ్ పద్మానాభం ది ప్రేమ వివాహం. అందుకే.. ప్రేమ పెళ్ళికి ఎప్పుడూ వారు అడ్డు చెప్పేవారు కాదు. పద్మనాభం ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఉదయం వెళ్లడం.. సాయంత్రం ఇంటికి రావడం.. మొత్తం ఇల్లంతా మేనేజ్ చేసేది పెళ్ళాం పద్మ మాత్రమే. ఇంటికి వచ్చిన భర్త అలా.. టీవీ పెట్టుకుని కుర్చీ లో కూర్చోవడం.. లేకపోతే న్యూస్ పేపర్ చదువుకోవడం. అప్పట్లో గవర్నమెంట్ జాబ్ అంటే, పిలిచి పిల్లని ఇచ్చేవారు. అలా.. పద్మనాభం కి పద్మని ఇచ్చి పెళ్ళి చేసారు. ఇంతా చేస్తే, ఇద్దరు కాలేజీ లో క్లాసుమేట్స్. బాగా పరిచయం ఇద్దరికీ. అదే వారి ప్రేమ వివాహానికి దారి తీసింది. 


పద్మ చాలా ఓర్పు నేర్పు ఉన్న ఇల్లాలు. భర్త ఇంటి పనిలో సాయం చెయ్యక పోయినా.. తానే అన్ని పనులు చేసుకుంటూ.. సంసారం నెట్టుకుంటూ వస్తుంది. సరుకులు తెచ్చుకోవడం దగ్గర నుంచి.. ఇంట్లో వంట పని.. అన్నీ తానే చేసేది. వంశీ పుట్టినప్పటి నుంచి స్కూల్ కు తీసుకుని వెళ్లడం.. అన్నీ తానే చుసుకునేది. అత్తగారు ఉన్నా.. ఎప్పుడు ఆరోగ్యం బాగుండేది కాదు. అత్తగారికి సేవలు చెయ్యడం ఒక పని అయిపోయింది పద్మ కు. 


వంశీ కాలేజీ లో చేరిన తర్వాత.. టీనేజ్ భావాలకు లోనై, అమ్మాయిలతో మాట్లాడాలని అనిపించేది. ప్రేమంటే అసలు నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు వంశీ సెకండ్ ఇయర్ లోకి వచ్చాడు. అలాంటి సందర్భంలో.. డిగ్రీ మొదటి సంవత్సరం అమ్మాయిలు కాలేజీ కు రావడం జరిగింది. అందులో అతనికి నచ్చిన ఊహా సుందరి కనిపించింది. చూసిన మొదటి చూపు లోనే నచ్చేసింది. రేయి పగలు ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. ఆ అమ్మాయితో ఎలాగైనా స్నేహం చెయ్యాలని.. ఎంతో మాట్లాడాలని అనిపించేది. వంశీ తగిన టైం కోసం ఎదురు చూస్తున్నాడు. 


వంశీ కి ఫ్రెండ్స్ కుడా చాలా తక్కువే. ఎప్పుడు ఫ్రెండ్స్ తో అమ్మాయిల విషయాలు ఏమి చెప్పేవాడు కాదు.. 


మర్నాడు, ఆ అమ్మాయిని తన ఫ్రెండ్స్ తో బస్టాప్ లో చూసాడు. ఆ మనోహర రూపం, అందమైన ఆమె చిరునవ్వు.. అతని మనసుని కట్టేసింది. ఆమె పై చెప్పలేని ప్రేమ, అభిమానం పుట్టించింది. కాలేజీ లో సీనియర్ స్టూడెంట్స్.. జూనియర్ స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చెయ్యడం కామన్ అయిపోయింది. వెల్కమ్ పార్టీ అయ్యే వరకు సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేస్తారు. 


వంశీ ఇప్పుడు సెకండ్ ఇయర్ సీనియర్ కావడం చేత.. ర్యాగింగ్ చెయ్యడం ఇష్టం లేకపోయినా.. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ని పరిచయం చేసుకోవడానికి అదే మంచి మార్గం అని అనిపించింది. సీనియర్ స్టూడెంట్స్ అందరూ ర్యాగింగ్ చెయ్యడం మొదలు పెట్టారు. తనకీ మంచి అవకాశం కలిసొచ్చింది.. ర్యాగింగ్ వరమిచ్చింది. ర్యాగింగ్ ని అవకాశంగా తీసుకుని.. బస్ స్టాప్ లో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు. మనసార ఆమె పేరు కనుక్కుని.. తనని పరిచయం చేసుకున్నాడు. ఈ లోపు ఎన్నడు టైం కు రాని బస్సు రానే వచ్చింది. ఆ అమ్మాయి కాస్త బస్సు ఎక్కి వెళ్లిపోయింది. అబ్బాయి మనసు విలపించింది. ఆ అమ్మాయి పేరు చెప్పినప్పుడు వంశీ ఆనందానికి హద్దులు లేవు. ఇలా రోజూ ర్యాగింగ్ చెయ్యడం.. ఆ అమ్మాయికి తొందరగా దగ్గర అయ్యాడు వంశీ.. 


మర్నాడు కాలేజీ లో జూనియర్స్ కు వెల్కమ్ పార్టీ ఉంది. దానికి ఆ అమ్మాయి వస్తుందని తెలుసు. ఎంతో దర్జాగా డ్రెస్ చేసుకుని, ఆనందంగా ప్రేయసి చిరునవ్వే హారతిగా తలచుకుని.. పార్టీ కి వచ్చాడు. కానీ, విధి ఎంత విచిత్రమైనది. వంశీ కుర్చున్న చాలా వరుసల ముందు ఎక్కడో ఆమె కూర్చొని వుంది. తళ తళ లాడే ముఖ వచ్చస్సు తో, అప్పుడే విచ్చిన కలువ లాగ మెరిసే ఆమె అందం.. దాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆ పంజాబీ డ్రెస్. ముందుకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు. అమ్మాయిల దగ్గరకు వెళ్ళడానికి అసలు లేదు. 


కొంతసేపటికి ఆ అమ్మాయి మళ్ళీ కనిపించలేదు. ఈ అందాన్ని మొత్తం అంతా వెతికాడు మన వంశీ. పార్టీ లాస్ట్ లో ఆ అమ్మాయి కనిపించింది. అంత మంది జనాలలో.. ఆమెను కనులారా చూసి.. మాట్లాడే అవకాశం లేకపోయింది. ఇంటికి చేరిన వంశీ విలపించిన తీరు చెప్పలేనిది. 


మర్నాడు కాలేజీ లో ఆ అమ్మాయి వచ్చే టైం కు బయల్దేరాడు వంశీ. బస్సు దిగి కాలేజీ వైపు పరుగులు తీస్తున్నాడు. బస్ స్టాప్ కి, కాలేజీ కి ఒక అర కిలోమీటర్ దూరం ఉంటుంది. అప్పుడు కనిపించింది ఆ అమ్మాయి. తన ఫ్రెండ్స్ తో ముందు నడుస్తోంది. వంశీ ఆ అమ్మాయి పక్కకు వెళ్లి అందరికీ 'హాయ్' చెప్పాడు. 


"నీ పేరు తెలుసుకున్నాను లే స్వాతి! నా పేరు తెలుసా?" అని అడిగాడు 

"గుర్తు లేదు.. " అని చెప్పింది 


"నా పేరు వంశీ.. గుర్తు పెట్టుకో.. " అన్నాడు వంశీ.. 


మర్నాటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం బాగా బలపడింది. రోజూ ప్రేమతో పలకరించుకుంటూ.. మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు. స్నేహానికి పునాది పడింది. ఈ తరుణంలో కాలేజీ కు ఒక నెల రోజులు సెలవులిచ్చారు. కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ అవకపోవడం చేత.. కంప్యూటర్ ల్యాబ్ మాత్రం ఓపెన్ చేసే ఉంచారు. ప్రాక్టీసు చేసుకోవల్సిన వారు ల్యాబ్ స్లాట్ బుక్ చేసుకుని.. వెళ్ళచ్చు. నెలలో మొత్తం అన్నీ స్లాట్లు ఇద్దరూ బుక్ చేసుకున్నారు. సెలవుల్లో కలుసుకోవడానికి ఇంతకన్నా మంచి మార్గం లేదని అనుకున్నాడు వంశీ.. 


మొదటి రోజు ల్యాబ్ లో కలిసినప్పుడు.. విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన వంశీ కు జీవితాంతం గుర్తుండి పోయే విషయం. అదే రోజు వంశీ కన్నా, స్వాతి ముందుగా వచ్చి ల్యాబ్ బయట నిల్చొని ఉంది. వంశీ మెట్లు ఎక్కి వచ్చేసరికి స్వాతి తన అందమైన చిరునవ్వుతో " హాయ్.. వంశీ" అని అంది. 

"హాయ్ స్వాతి!.. ఎప్పుడు వచ్చావు.. ?" అని వంశీ అడిగాడు 

"ఇప్పుడే వచ్చాను.. "

"బయట ఉన్నావేమిటి.. ?"

"పవర్ లేదు.. లోపల గాలి లేదు.. " అంది స్వాతి


ఐనా.. వంశీ లోపలికి వెళ్దామంటే, ఇద్దరు లోపలికి వెళ్లారు. స్వాతి పక్కనే వంశీ కూర్చొని ఉన్నాడు. ఇద్దరికీ స్నేహం ఉన్నా, ఒకరి పర్సనల్ విషయాలు ఒకరికి తెలియవు. లోపల వెలుతురు తక్కువుగా ఉన్నా.. స్వాతి ముఖంలో వెలుగు.. రూమ్ కి మరింత వెలుగు తెచ్చింది. 


"మీ ఇంటి పేరేమిటి.. ?" అడిగింది స్వాతి

"వంశీ తన బుక్ మీద రాసి చూపించాడు.. "

"ఓకే.. గ్రేట్.. "

"ఫస్ట్ ఇయర్ లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది.. ?" అడిగింది స్వాతి

" డిస్టింక్షన్ వచ్చింది.. "

"నాకైతే చూడు.. సెకండ్ క్లాసు వస్తుందేమో.. " అని మూతి తిప్పుతూ.. అంది స్వాతి

"జోకులు వద్దు స్వాతి!"

=====================================================================
❤️ నవ్వే నీ కళ్ళలో వుంది అ జాబిలి ❤️

❤️ నవ్వే నీ ముంగీళ్లలో వుంది దీపావళి ❤️

❤️ నీ నవ్వు ఒక సంగీతం హాయిగా నవ్వు ❤️ 

❤️దీపావళి వెలుగుల సందడిగా నవ్వు ❤️

❤️ పౌర్ణమి రోజు నిండు వెలుగుల నవ్వు ❤️

❤️ చీకటిని తరిమె వెలుగు నువ్వు నవ్వుతు ఉండాలి మరల మరల నువ్వు ❤️
చెలియా చిన్న నాటి స్నేహంల వస్తవ నా చెంతకి 

మన అల్లరి ఆటలు అందమైన తీయని జ్ఞాపకాలు 

చెలియా నిత్యము నీతో బ్రతకాలని ఆశల వైపు అడుగులు వేస్తున్నాను 

✍️
❤️ కనులు తెరచిన కనులు ముసిన ని ఆలోచనలే ❤️
❤️ మదిలో ఏదో తెలియని అలజడి ❤️
❤️ స్వప్నంల విడిపోకుమ సఖీయా ❤️

❤️ ఛాయాల వచ్చి వెళ్ళిపోకుమ చెలియా ❤️

❤️ నువ్వు పక్కనుంటే కన్ను చూడలేన్నని కొత్త రంగులు ❤️
ఇంకా వుంది.. 

నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 2 కోసం చూరండి