What happens at what moment of death? in Telugu Fiction Stories by SriNiharika books and stories PDF | మరణచిత్రం ఏ నిమిషానికి ఏమి జరుగునో?

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

మరణచిత్రం ఏ నిమిషానికి ఏమి జరుగునో?


చెత్త ఏరుకునే ఇద్దరు కుర్రాళ్ళు ఆ బాక్సుల చుట్టూ తిరిగి చూస్తున్నారు. ఒక బాక్సులోంచి కొయ్యబారిన చెయ్యి ఒకటి బయట వేలాడుతోంది. భయంతో అరుస్తూ పరుగుతీశారు. పోలీసు లొచ్చారు. డంప్‌యార్డ్‌లో రెండు బాక్సుల్లో రెండు అర్ధనగ్న శవాలు. ఒక శవం చిత్రకారిణి హేమది, రెండో శవం ఆమె లాయర్‌ హరీష్‌ది... ముందు రోజే వీళ్ళిద్దరి మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి.ముంబయి చిత్రకళా ప్రపంచం హాహాకారాలు చేసింది ఈ అకృత్యానికి...

ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌ దాల్వీ కాండివిలీలోని లాల్జీపద బయల్దేరాడు. ఇంకోవైపు ఇక్కడికి దూరంగా వారణాసి రైల్వే స్టేషన్‌ దగ్గర, అనుమానాస్పదంగా కన్పిస్తున్న ఒకణ్ణి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఎస్పీ అమిత్‌ పాఠక్‌ పట్టేసుకున్నాడు. వాడి దగ్గర ఏటీఎం కార్డులు, సిమ్‌ కార్డులు చూసి, ‘‘ఎక్కడివిరా ఇవీ?’’ అని రెండు పీకాడు.ఇన్‌స్పెక్టర్‌ దాల్వీ లాల్జీపద చేరుకుని ఒక ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌ దగ్గర ఆగాడు. యూనిట్‌ తాళం వేసి వుంది. శవాలు దొరికిన కార్డు బోర్డు బాక్సుల మీద వాటి తయారీ వివరాలు ఈ అడ్రసువే వున్నాయి. చిత్రకారిణి హేమ చివరి కాల్‌ ఈ ఏరియాలోని విద్యాధర్‌కే వచ్చింది.

విద్యాధర్‌ ఈ యూనిట్‌ ఓనర్‌. ఫోన్‌ పలకడం లేదు.చుట్టుపక్కల ఇళ్ళల్లో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించడం మొదలెట్టాడు దాల్వీ. ఒక ఫుటేజీలో గతరాత్రి యూనిట్‌లోంచి ఒక వ్యాను బయటికి పోతూ కన్పించింది. గంటలో ఆ వ్యాను డ్రైవర్‌ విజయ్‌ దొరికాడు.‘‘తెలీదు సార్‌, వాటిలో శవాలున్నాయని తెలీదు. లోపలేం జరిగిందో నాకు తెలీదు!’’‘‘ఎక్కించిందెవరు, దింపిందెవరు బాక్సుల్ని? అది చెప్పు!’’‘‘యూనిట్‌ వర్కర్స్‌ సార్‌... ఆజాద్‌, ప్రదీప్‌, సాధు...’’వారణాసిలో ఎస్పీ పాఠక్‌కి సాధు చెప్పేస్తున్నాడు. అంతా విని, ‘‘హేమ గార్ని చంపేశారా?’’ అని పై అధికారులకి సమాచారమందించసాగాడు పాఠక్‌.‘‘ఓనర్‌ ఎక్కడ?’’ అడిగాడు విజయ్‌ని దాల్వీ. దాల్వీ దగ్గర అప్పటికే సమాచారముంది. ఫ్యాబ్రికేషన్‌ యూనిట్లో హేమ తన చిత్రకళకి సంబంధించిన పనులు చేయిస్తుందనీ, ఈ చనువుతో హేమ దగ్గర విద్యాధర్‌ ఐదు లక్షలు అప్పు తీసుకున్నాడనీ, దీని గురించి ఇద్దరి మధ్యా గొడవలున్నాయనీ.

పోలీస్‌స్టేషన్‌ వెనుక నుంచీ షాక్‌తో పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇన్‌స్పెక్టర్‌ పార్ధ సింగ్కోన్‌. రాత్రి పదిన్నరవుతోంది. నోట మాట రాక చూస్తున్నారు సిబ్బంది. చూస్తూంటే బోధపడ సాగింది ఇన్‌స్పెక్టర్‌కి - మొన్న జరిగిందానికి ఇదా సమాధానం - అని. ‘మంచి నీళ్లేదో తాగొస్తానని కదా వెళ్ళాడు... ఎవరొచ్చారు వెంట?’ అనడిగాడు. తెలీదని తలూపారు సిబ్బంది. ‘మళ్ళీ అల్లర్లు. ఇప్పటికే కిష్కింధకాండ అయిపోయింది. కమాన్‌ కాల్‌ ది అంబులెన్స్‌!’ అంటూ తన ఛాంబర్‌లోకి వెళ్లాడు, పై అధికారులకి రిపోర్టు చేయడానికి.

మూడురోజుల క్రితం రాత్రి...‘‘తినడూ సైలెంట్‌గానూ ఉండడు వీడు!’’‘‘పేపర్‌కి రాస్తాడేమో, అది చూడు!’’‘‘కాళ్ళ దగ్గరి కొస్తాడులే ...’’‘‘ఐతే నేషనల్‌ పార్కు గుర్తు చెయ్యి - నువ్వో తన్నుతన్ను, మేమూ నాల్గు తంతాం!’’‘‘ఇంకొంచెం పొయ్యి!’’‘‘పోస్తే పోసుకుంటావ్‌ గా!’’‘ఈ తాగుబోతులు ఇంటికెళ్ళరా?’... బయట గేటుదగ్గర కాపలా కాస్తున్న చౌకీదారు హరేన్‌ విసుక్కుంటూ పక్కకి చూశాడు. బెంచి మీద అప్పుడే గుర్రు పెడుతున్నాడు మోరన్‌. హెడ్‌ మాస్టర్‌ జుగెన్‌, టీచర్లు రబీంద్రనాథ్‌, మునీంద్ర మద్యం మత్తులో ఊగుతూ, ఇంకా ఇంకా తాగేస్తున్నారు. అసోం, తీన్‌ సుకియా జిల్లాలోని బాగ్జన్‌ తరంగ్‌ హైస్కూల్‌ మినీ బార్‌లా మారింది.మర్నాడు రాత్రి పదిన్నర, బ్రహ్మచారి రబీంద్రనాథ్‌ ఇంట్లో... ‘‘రండి రండి లచిత్‌ సాబ్‌! ప్రఖ్యాత కవి, రచయితా, రిపోర్టర్‌, ఇంకేంటదీ... పర్యావరణ కార్యకర్త!!....తమకి సుస్వాగతం...’ వ్యంగ్యంగా అన్నాడు రబీంద్రనాథ్‌ పేకలు వేస్తూ.

‘‘ఇంకోటి మరిచావ్‌, అసలైంది- కమిటీ మెంబర్‌!’’ వచ్చి కూర్చుంటూ అన్నాడు లచిత్‌. ‘ప్లస్‌... మీ తోటి టీచర్ని కూడా...’‘ఇంకేంటి సంగతులు, మాట్లాడు కుందామా?’... పేకలు పేర్చుకుంటూ కొంటెగా చూశాడు హెడ్‌మాస్టర్‌ జుగెన్‌. అందరికీ మరోసారి మందు పోశాడు టీచర్‌ మునీంద్ర. లచిత్‌ తీసుకోలేదు- ‘ఇక్కడుండను, చెప్పేసి పోతా. ఎమౌంట్‌ అకౌంట్‌లో వేసేస్తే, కొత్త కమిటీ వేసుకుంటాం!’‘ఓహో, లేకపోతే?’‘ఫైనల్‌గా రెండు జరుగుతాయ్‌. సైన్స్‌ లాబ్‌ కట్టుకోమని ప్రభుత్వం మంజూరు చేసిన 22 లక్షల్లో నాలుగు లక్షలు ఒకసారీ, ఆరు లక్షలు ఇంకోసారీ బొక్కిన అవినీతిని పేపర్‌కి రాసేస్తా, ఆర్టీఐకి యేసేస్తా!’

‘‘మమ్మీ’’గబుక్కున వచ్చి వెనుకవాటుగా సుభద్రను గట్టిగా వాటేసుకుంది సుమ.‘‘అబ్బబ్బ వదలవే తల్లీ! పిండి తడపనీ’’ వంటింట్లో చపాతీలకు పిండి తడుపుతున్న సుభద్ర చిన్నగా విసుక్కుంది.‘‘సరే! సరే! సరే! సారీ సారీ సారీ. ఒక్కసారి ఇలా చూడు’’.

అమిత ఉత్సాహంగా ఉంది సుమ గొంతు.వెనక్కి తిరిగి చూసింది సుభద్ర ‘ఏమై ఉంటుందబ్బా’ అనుకుంటూ.చూసిన వెంటనే కెవ్వుమంది.‘‘ఏమిటే సుమా! మళ్ళీ సెల్‌ కొన్నావా? ఒకటి ఉందిగా?’’‘‘ఉంటే ఏం! ఇది ఇంకోటి. మా ఫ్రెండ్స్‌ అందరి దగ్గర రెండేసి మొబైల్స్‌ ఉన్నాయి. అయినా ఒక సెల్‌ ఆఫీసు పనికి, ఇంకోటి నా సరదాకి’’ కళ్ళెగరేస్తూ అరచేతిలోని సెల్‌ని ముచ్చటగా చూస్తూ జవాబిచ్చింది.‘‘ఏమిటో బాబూ ఈ పిచ్చి! ఆఫీసు వాళ్ళతో ఒకదాంట్లోంచి మాట్లాడుతూ, ఇంకో సెల్‌ నుండి మీ ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేస్తూ, లేదా వాట్సప్‌లు, ఫేస్‌బుక్కులు వీటితో కనెక్ట్‌ అవుతుంటే, ఇంక ఇంట్లో నాతో గానీ, నాన్నతో గానీ ఎప్పుడే నువ్వు మాట్లాడేది’’ కయ్యిమంది సుభద్ర.

ఒకవైపు కూతురుమీద కోపం ముంచుకొస్తోంది.‘‘పోదూ మమ్మీ! నీది మరీ చాదస్తం. మీ ఇద్దరితో రోజూ రాత్రిపూట వసపిట్టలా వాగుతూనే ఉంటాగా? అయినా అన్నిటికీ నువ్వు అంత ఫీలయితే కష్టం మమ్మీ’’.‘‘ముందా మమ్మీ అన్న పిలుపు మాను. చక్కగా అమ్మా అని పిలవ్వే. మా అమ్మవు కదూ’’ కూతురు గడ్డం పుచ్చుకు బతిమిలాడింది సుభద్ర.‘‘సరేలే! రేపట్నించి పిలుస్తాగా’’ కొంచెం గ్యాప్‌ యిచ్చి.‘‘గుడ్‌నైట్‌ మమ్మీ’’ అని తుర్రుమంది సుమ.‘‘అయ్యో! అన్నం తిని వెళ్ళవే నా తల్లివిగా’’.‘‘ఓ గంటాగి వస్తా! అయినా డాడీ ఇంకా రాలేదుగా వస్తే పిలువ్‌’’ గది లోపలినుంచే ఓ గావుకేక పెట్టింది సుమ.

 సినీనటి హేమశ్రీ హఠాన్మరణం చాలా సంచలనం రేకెత్తించింది.బెంగళూరు నుంచి ఆమె తన భర్త సురేంద్రబాబుతో కలిసి అనంతపురంలోని ఒక ఫామ్‌హౌస్‌కు వెళ్లింది. అక్కడ హఠాత్తుగా స్పృహ కోల్పోయింది. అపస్మారకస్ధితిలో ఉన్న హేమశ్రీని హుటాహుటిన కర్ణాటక రాష్ట్రంలోని హెబ్బాల సమీపంలో ఉన్న ఒక చర్చి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అప్పటికే హేమశ్రీ మరణించిందని వైద్యులు నిర్ధారించడంతో హెబ్బాల పోలీసుస్టేషన్లో జరిగిన విషయాన్ని చెప్పారు సురేంద్రబాబు. ఆ సమయంలో ఆయనతో పాటు హేమశ్రీ తల్లి లీలావతి కూడా ఉంది.మరుసటి రోజు పత్రికల్లో రకరకాల కథనాలు...బెంగళూరులో ఉండాల్సిన హేమశ్రీ అనంతపురం జిల్లా రెడ్డిపల్లిలోని ఫామ్‌హౌస్‌కు ఎందుకు వెళ్లింది? అక్కడ భర్తతో గొడవపడిందా? అసలా ఫామ్‌హౌస్‌ ఎవరిది? భర్తతో కలిసి హైదరాబాద్‌ వెళ్తున్నానని స్నేహితులకు చెప్పిన హేమశ్రీ విగతజీవురాలుగా తిరిగి రావడానికి కారణాలేమిటి? ఇలాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తుతూ పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి.ఇంతలో హేమశ్రీ మాజీ ప్రియుడు మంజునాథ్‌ తెర మీదకు వచ్చాడు.

హేమశ్రీకి సురేంద్రబాబును పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఆమె తల్లి బలవంతం మీద ఈ పెళ్లి జరిగిందని, తన కన్నా 20 ఏళ్ల పెద్దవాడిని తనకు కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేక హేమ తనతో పలుమార్లు ఆ విషయం చెప్పి బాధపడిందని చెప్పి సంబంధిత ఆడియో టేపులను మంజునాథ్‌ మీడియాకు విడుదల చేశాడు. దాంతో హేమశ్రీ మరణం మరింత మిస్టరీగా మారింది.

***********************************

అదే సమయంలో తెలుగు దినపత్రికల్లోనూ హేమశ్రీ మరణం వెనుక దారుణమైన నిజాలున్నాయని, పెద్దల హస్తముందని, ఆమెపై అత్యాచారయత్నం జరిగిందని కథనాలు వచ్చాయి. అనంతపురం జిల్లాకు చెందిన ఒక మంత్రి వద్దకు హేమశ్రీని పంపడానికి ఇద్దరు కార్పొరేటర్లు ప్రయత్నించారని, ఆమె ప్రతిఘటించడంతో మత్తుమందు ఇచ్చారని, ఆ క్రమంలో జరిగిన ఘర్షణలో హేమ మరణించిందని కూడా వార్తలు వచ్చాయి.రకరకాల కథనాలు రావడంతో బెంగళూరు నగర కమిషనర్‌ జ్యోతిప్రకాష్‌ స్వయంగా కేసును సమీక్షించారు. హెబ్బాల పోలీసుల నుంచి వివరాలు తెలుసుకోవడంతో పాటు, రాయలసీమ పోలీసు ఐ.జి. గోవింద్‌సింగ్‌తోనూ మాట్లాడారు. పోస్టుమార్టం రిపోర్టులను పరిశీలించారు. హేమశ్రీ ఎక్కువ మత్తుమందు పీల్చడం వల్ల మరణించిందని పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేయడంతో ఆమెతో పాటు చివరివరకు ఉన్న వారిని తీసుకొచ్చి విచారణ ప్రారంభించాలని హెబ్బాల పోలీసులను కమిషనర్‌ ఆదేశించారు.

 వేలిముద్ర

‘అందరూ నేనే హత్య చేసేనని నమ్ముతున్నారు. నన్ను దోషిగా కూడా ప్రకటించేశారు. కానీ నేను నేరస్తుడిని కాదు. నేను నిరపరాధిని. నేను ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు ఆమె సజీవంగా ఉంది. నన్ను ఎవ్వరూ నమ్మటం లేదు. మీరే నా చివరి ఆశ. నేను నా భార్యను హత్య చేయలేదు. నేను నిరపరాధినని నిరూపించి, అసలు నేరస్తుడిని పట్టుకోవాలి. దాదాపుగా అరుస్తూ, ఏడుస్తూ చెప్తున్న విశ్వనాథ్‌ వైపు పరిశీలనగా చూస్తూ విన్నాడు డిటెక్టివ్‌ శరత్‌.

అతని ఏడుపు ఉధృతం. ఆవేశ ఉధృతి తగ్గిన తరువాత అడిగాడు మృదువుగా.‘ఆ రోజు ఏం జరిగిందో, జరిగింది జరిగినట్టు చెప్పండి’ అడిగాడు శరత్‌.‘నేను, సరోజ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. స్నేహితుల సహా యంతో పెళ్ళి చేసుకున్నాం. ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. స్నేహితుల సహాయంతో పెళ్ళి చేసుకున్నాం. హైదరాబాదు వచ్చాం. అతికష్టం మీద నాకు ఉద్యోగం దొరికింది. సరోజకు సులభంగా దొరికింది ఉద్యోగం. తను ప్రొద్దున్న ఏడింటికి వెళ్తే రాత్రి పదింటికి ఇంటికి వచ్చేది. నాది ఊళ్ళు తిరిగే ఉద్యోగం. నెలకి మూడు వారాలు టూర్లలోనే ఉంటాం. మా మధ్య ఎలాంటిగొడవలు లేవు. వాదోపవాదాలు లేవు. ఉన్నంతలో సంతోషంగా, హాయిగా ఉంటు న్నాం. ఇంతలో నాకు ఒక భయంకరమైన సత్యం తెలిసింది’ చెప్పటం ఆపి కళ్ళు తుడుచు కున్నాడు విశ్వనాథ్‌.మళ్ళీ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు.

గొంతు పెగలటం లేదు. చివరికి అతికష్టం మీద చెప్పటం ప్రారంభించాడు.‘ఆ రోజు నేను టూర్‌ నుంచి వచ్చేటప్పటికి తను ఆఫీసుకు వెళ్ళిపోయింది. నేను ఏం తోచక కంప్యూటర్‌ ‘ఆన్‌’చేశాను. ఆమె ఫేస్‌బుక్‌, మెయిల్‌ ‘లాగ్‌ ఔట్‌’ అవటం మరిచి పోయి నట్టుంది. నేను కంప్యూటర్‌ ‘ఆన్‌’ చేయగానే అవి ఓపెన్‌ అయ్యాయి. నేను వద్దనుకుంటూనే ఏవో మెసేజెస్‌ ఉండటంతో చాటింగ్‌ ఓపెన్‌చేశాను. ఎవరో ‘రఘువరన్‌’ అనే వాడితో భయంకరమైన రీతిలో చాటింగ్‌ చేస్తోంది. అది చూస్తుంటే వాళ్ళు ఎంతసన్నిహితులో అర్థమయింది. వాళ్ల చాటింగ్‌ను బట్టి వాళ్లు కొలీగులనీ అర్థమయింది. నా ప్రపంచం కూలి పోయింది. ఏం చేయాలో నాకు తెలియలేదు. రాగానే అడిగేయాలనుకున్నాను. కానీ ఏమని అడుగుతాను? అందుకే ముభావంగా ఉన్నాను. రాత్రి వచ్చింది. నేను ఎలా ఉన్నానో కూడా గమనించలేదు. నేను తెల్లారే వెళ్ళిపోతాను ఊరికి అని చెప్పాను.
          *********************************