Panchapranas in Telugu Human Science by SriNiharika books and stories PDF | పంచప్రాణాలు

Featured Books
Categories
Share

పంచప్రాణాలు


‘‘యువరానర్‌... ఎంత కిరాతకంగా నేరానికి పాల్పడ్డాడో, అంతే కఠినశిక్ష విధించాలని విజ్ఞప్తి చేస్తున్నాను...’’‘‘యువరానర్‌.. నేరం చేసినప్పుడు వయసుని కూడా దృష్టిలో పెట్టుకుని తక్కువశిక్ష విధించాలని కోరుతున్నాను. ఇప్పటికే ఆరేళ్లుగా తీవ్ర మానసిక క్షోభకి లోనయ్యాడు...’’ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దేశాయ్‌, డిఫెన్స్‌ న్యాయవాది అనక్‌ లెటోలు చెబుతున్నది వింటూ, ‘‘వయసుని దృష్టిలో పెట్టుకునే ఇంత నేరంచేశాడంటారా, మిస్టర్‌ అనెక్‌ లెటో?’’ అని ప్రశ్నించాడు జడ్జి.ముగ్గురి మొహాలూ చూస్తూ బోనులోనిలబడ్డాడు డయాజ్‌...

స్నేహాల్‌ డయాజ్‌... గంపెడు బట్టలు ఉతుకుతూంటే చేతులు నొప్పెడుతున్నాయి. బకెట్లో వేసి పిండుతూంటే ఆ నీళ్ళల్లో తల్లి రూపమే కన్పిస్తోంది. తల్లి తల పట్టుకుని నీళ్ళలో ముంచుతూ చంపడానికి ప్రయత్నిస్తున్న తండ్రి... ఒకసారి కాదు, చాలాసార్లు. ‘‘ఏరా? ఏంటీ?’’ అని వీపు పగిలేలా కొట్టింది సవతి తల్లి వచ్చి, ‘‘ఉతుకు! ఉతికితేనే నీకు బతుకు!’’ జుట్టుపట్టుకుని కసిదీరా వంగదీసింది. బాధతో అరిచాడు.‘‘అవన్నీ ఉతికాకే తిండి పెట్టాలి!’’ ఇంట్లోంచి తండ్రి అరుపు.ఉదయం నుంచీ మధ్యాహ్నం దాకా ఇంటెడు బట్టలుతికితేనే ఇంత తిండి పెడతారు. ఏడేళ్ళ వయసుకి ఇది పెద్ద కష్టమైపోయింది. బయటపడే మార్గం కన్పించడం లేదు- తల్లి కన్పించనట్టే. తల్లి ఎలా చనిపోయిందో అర్ధం గావడం లేదు. లంచగొండి తండ్రి గోవా షిప్‌ యార్డులో ఉద్యోగం పోగొట్టుకున్నాడని తెలుసు.

అప్పుడామె ఆత్మహత్య చేసుకుందని కొందరు, విషమిచ్చి చంపాడని కొందరూ చెప్పుకున్నారు. ఆమెకి విషమిచ్చి తర్వాత నిప్పంటించాడని కూడా కొందరు చెప్పుకున్నారు. ఏమైనా పోలీసులు పట్టుకోలేదు. వెంటనే ఈ పెళ్లి చేసుకున్నాడు. ఇది వచ్చిన కాడ్నించీ చంపుకుతింటోంది. దీనికి వంత పాడుతున్నాడు యెదవ తండ్రి ...

******** 

‘‘వెరీ సారీ బ్రో, నీకింత వుందని తెలీదు’’‘‘ఇంకా చాలా వుంది, నా ఫాదర్‌ ఒక గాడిద! ఈ గాడిద వెంట అది వుంది చూశావూ- అదొక గాడిదన్నర గాడిద!’’19 ఏళ్ల స్నేహాల్‌ డయాజ్‌, పాతికేళ్ళ నరేష్‌ డురాడోలు ఫ్లాట్‌లో మందుకొడుతూ మాట్లాడుకుంటున్నారు. పక్కన లాప్‌టాప్‌లో అల్ర్ఫెడ్‌ రోజ్‌ కొంకణి పాట వస్తోంది.

పదిహేను రోజుల క్రితం పరిచయమైన డయాజ్‌ బాగా క్లోజ్‌ అయిపోయాడు. గోవా పోర్టు సిటీ వాస్కో సమీపంలోని చిన్న గ్రామం చికలింలో నరేష్‌ ఫ్లాట్‌కి తరచూ వచ్చి కాలక్షేపం చేస్తున్నాడు. ‘‘నేనైతే పిచ్చిపట్టి తిరుగుతా రోడ్లమీద!’’ అని నరేష్‌ ఉద్వేగంగా అనడం చూసి, ‘‘నాకూ అప్పుడ ప్పుడూ పిచ్చెక్కుతూనే వుంటుంది బ్రో, నాగురించి తల్చుకుంటే’’ అంటూ బాటిల్‌ మొత్తం లేపేశాడు డయాజ్‌. మత్తులో తూలుతూ జేబులోంచి తీశాడు... ‘‘ఏ ? ఏ మిటవి?’’ కళ్ళు విప్పార్చుకుని చూస్తూ అన్నాడు నరేష్‌.

నాకు 22 ఏళ్లు, ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. నాకు మా క్లాస్‌లో ఒక అమ్మాయంటే.. చాలా ఇష్టం. నిజానికి, మా ఇద్దరికీ స్కూల్‌ డేస్‌ నుంచి పరిచయం ఉంది. మేము టెన్త్‌ క్లాస్‌లో ఉన్నప్పుడు, ఆమెకు ఒక బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు. అతను మా స్కూల్లోనే చదివేవాడు. వాళ్లిద్దరూ మూడేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే, ఆ కుర్రాడు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయడానికి.. విదేశాలకు వెళ్లిపోయాడు. వాళ్లిద్దరి బ్రేక్‌అప్‌.. చాలా విషాదంగా జరిగిందని ఆమె స్నేహితుల ద్వారా నాకు తెలిసింది. ఇది మాత్రమే కాదు, ఆమె ఎక్స్‌ బాయ్‌ ఫ్రెండ్‌, తనకు ఫోన్‌ చేయడం మానేశాడు. ఆ తర్వాత, అతను ఇండియాకు రాగానే వారి మధ్య చాలా గొడవలు జరిగాయి.
ఇదంతా అయిన తర్వత.. ఆమె మా కాలేజ్‌లో జాయిన్‌ అయ్యింది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌ అయ్యాం. అయితే ఆ తర్వాత కూడా నా ఫీలింగ్స్‌ తనకి చెప్పలేకపోయాను. ఆమె బ్రేకప్‌ నుంచి బయటపడకపోవడమే దీనికి కారణం. మా ఇద్దరికీ ఒకే యూనివర్సిటీలో సీటు వచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను. కాస్‌లు మొదలైన కొన్ని నెలల తర్వా, నేను ఆమెకు ప్రపోజ్‌ చేశాను. అ ప్రపోజల్‌ విని, తను చాలా ఆశ్చర్యపోయింది.
నా గురించి నీకు అన్నీ తెలుసు కదా అని అడిగింది. నేను ఇప్పటికీ.. నా బాయ్‌ ఫ్రెండ్‌ ప్రేమిస్తున్నాను చెప్పింది. కావాలంటే ఫ్రెండ్‌ ఉండు, లేకపోతే మాట్లాడటం మానేయ్‌ అని కచ్చితంగా చెప్పేసింది. అది విని నా గుండె పగిలిపోయింది. ఆమెను నేను ఫ్రెండ్‌ మాత్రమే, కానీ, నేను ఇప్పటికీ తనను ప్రేమిస్తున్నాను. నిజంగా.. ఒక అమ్మాయి, తన మొదటి ప్రేమను మర్చిపోవడం అంత కష్టమా..?
ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లోని మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ విభాగం హెడ్ కామ్నా ఛిబ్బర్ దీనికి సమాధానం చెప్పారు. మీ గర్లఫ్రెండ్‌.. తన బ్రెక్అప్‌ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది, కానీ బ్రేక్‌అప్‌ తర్వాత జీవితం ముగుస్తుందని దాని అర్థం కాదు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఇష్టపడే వ్యక్తిని మర్చిపోవడం చాలా కష్టమని నాకు తెలుసు. కానీ, ఆమె ఇంకా రిలేషన్‌షిప్‌కి సిద్ధంగా లేదని, మీ గర్లఫ్రెండ్‌ మాటల బట్టి అర్థం అవుతుంది.
ఆ అమ్మాయి.. ఫ్రెండ్‌ షిప్‌కు సిద్ధంగానే ఉంది. మీరు ప్రేమ ప్రస్తావన తీసుకొస్తే.. మీతో మాట్లాడటం మానేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో.. మిమ్మల్ని మీరు పదే పదే బాధించకుండా ఉండటం సరికాదు. ఏదో ఒక రోజు ఆమె మీతో ప్రేమకు అంగీకరిస్తుందనే ఆశతో మీరు జీవించవద్దు. బహుశా ఆమెకు లైఫ్‌ పార్టనర్‌ విషయంలో అభిరుచి భిన్నంగా ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, మీరు మంచి, చెడుల గురించి ఆలోచించండి. ప్రేమ వ్యవహారం కారణం, ఫ్రెండ్‌షిప్‌ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
మీ మాటలన్నీ విన్న తర్వాత.. నేను ఇచ్చే సలహా ఒక్కటే.. మీరు మీ జీవితంలో ముందుకు వెళ్లండి. కొత్త విషయాలు నేర్చుకోండి. బహుశా ఆమె కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మీకు దొరికే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, మీ సమయాన్ని వృథా చేయకుండా, ప్రస్తుతం జీవితంలో ఏమి జరుగుతుందో దానిపై దృష్టి పెట్టడం మంచిది.
'నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..
హాయ్..నా పేరు కోమలి. మాది విశాఖపట్నం. అమ్మానాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. నాన్న ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పని చేస్తుంటారు. నాకు ఐదేళ్ల వయసు వచ్చేటప్పటికే మా అమ్మ మమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్లిపోయింది. అప్పట్నుంచి నాకు అన్నీ నాన్నే అయి పెంచారు. అమ్మ లేని లోటు తెలియకుండా అల్లారుముద్దుగా చూసుకుంటూ వచ్చారు. బహుశా.. అందుకేనేమో.. ఎంత అల్లరి చేసినా ఒక్క మాట కూడా అన్నది లేదు. మా ఇంటికి దగ్గర్లో ఉన్న ఒక స్కూల్లోనే నేను పదో తరగతి వరకు చదువుకున్నా. అదిగో.. అక్కడే కలిసింది నా ప్రియనేస్తం.. లిఖిత. తను ఏడో తరగతిలో మా స్కూల్లో చేరింది. అప్పటి వరకు రాజమండ్రిలో ఉండేవారట! వాళ్ల నాన్నగారు ఒక ప్రమాదంలో చనిపోవడంతో వైజాగ్‌లోని వాళ్ల అమ్మమ్మ ఇంటికి వచ్చేశారు.లిఖిత చాలా అమాయకంగా ఉండేది. అందుకేనేమో.. తొలిచూపులోనే తను నాకు బాగా నచ్చేసింది.. ఎంత అంటే.. కోరి కోరి తనతో స్నేహం చేయాలనిపించేంత! అందుకే నాకు నేనుగా తన దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకున్నా. కానీ తన నుంచి ఎలాంటి స్పందన లేదు. 'కొత్తగా చేరింది కదా.. అంతా కొత్తగా ఫీలవుతోందేమో' అనుకుని నేనంత పట్టించుకోలేదు. స్కూల్లో చేరి పది రోజులు దాటుతున్నా తన వరస అలానే ఉంది. ఎవరితోనూ పూర్తిగా కలవదు. చదువుకోవడం.. పలకరిస్తే నవ్వడం.. అడిగిన దానికి సమాధానం చెప్పడం.. ఇది మాత్రమే లిఖిత చేసే పని. ఇక లాభం లేదని నేనే తనతో స్నేహం చేసేందుకు రకరకాలుగా ప్రయత్నించేదాన్ని. కలిసి చదువుకోవడం, ఆడుకోవడం, వాళ్ల ఇంటికి వెళ్లడం.. వంటివి చేసేదాన్ని. అలా ఓసారి లిఖిత ఇంటికి వెళ్లినప్పుడు 'తనకు వాళ్ల నాన్న అంటే చాలా ఇష్టం.. ఆయన చనిపోయిన తర్వాత ఎవరితోనూ సరిగ్గా మాట్లాడట్లేదు.. ఎందుకు అని అడిగితే.. వాళ్లను ఇష్టపడిన తర్వాత వాళ్లు కూడా నాకు దూరమైతే నేను తట్టుకోలేను' అంటోందంటూ వాళ్లమ్మగారు నాతో చెప్పుకొని బాధపడ్డారు. అప్పటివరకు లిఖితను నేను ఫ్రెండ్‌గానే చూశా. కానీ ఇష్టపడిన వారిని వదులుకోవాల్సి వస్తుందని ఇష్టాన్నే దూరం పెడుతుంటే బాధనిపించింది. అందుకే ఎలాగైనా స్నేహంతో తన బాధని మరిపించాలని అనుకున్నా.ఓసారి లిఖితను మా ఇంటికి తీసుకెళ్లా. నాన్నకు తనను నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ పరిచయం చేశా. ఈలోగా లిఖిత మా అమ్మ కోసం ఇల్లంతా కలియచూస్తుంటే నా గదిలోకి తీసుకెళ్లి అమ్మ ఫొటో చూపించా. నేను కూడా తనలానే బాధపడుతున్నానని లిఖితకు అర్థమైంది. ఆ క్షణం నన్ను గట్టిగా హత్తుకొని నీకు నేనున్నా.. అన్న ధైర్యాన్ని నాకు అందించింది. అప్పట్నుంచి మా స్నేహం ఒక గాఢమైన బంధంగా మారింది. స్కూలు, ఇల్లు.. ఎక్కడైనా ఇద్దరం కలిసి ఉండాల్సిందే! ఏం చేసినా సరే.. కలిసే చేయాలి..! ముచ్చటగా సాగిపోతున్న మా స్నేహబంధం పంచిన మాధుర్యంలోనే ఇద్దరం డిగ్రీ పూర్తి చేసేశాం. ఆ తర్వాతే మొదలైంది అసలు చిక్కు.. ఎంబీఏలో చేరేందుకు ఇద్దరం పరీక్ష రాశాం. నాకు హైదరాబాద్‌లో సీటు వచ్చింది. లిఖితకు బెంగళూరులో వచ్చింది. విడివిడిగా ఉండేందుకు మాకు ఇష్టం లేదు. అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో కాలేజీల్లో చేరాల్సి వచ్చింది.
కాలేజీలో చేరిన తర్వాత నెల రోజులు అసలు మనసు మనసులో లేదు.. ఎప్పుడూ లిఖిత జ్ఞాపకాలే! తను కూడా అంతే.. గుర్తొచ్చిన ప్రతిసారీ సమయంతో సంబంధం లేకుండా మెసేజ్ చేయడం, ఫోన్ చేసి మాట్లాడడం వంటివి చేసేది. అలా దూరాన్ని కూడా దగ్గరగా మార్చేసిన లిఖితకు మానసికంగా నాకు తెలియకుండానే దూరం జరిగా. దీనికి కారణం హవీష్. కాలేజీలో నాకు పరిచయమైన వ్యక్తి. క్లాసులు ప్రారంభమైన కొద్దిరోజులకే మా పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా మారింది.. ఇంకేముంది.. అప్పటివరకు లిఖితకు ఇచ్చిన ప్రాధాన్యం హవీష్‌కు ఇవ్వడం ప్రారంభించా. తను చేసే ఫోన్‌కాల్స్, మెసేజెస్‌కు స్పందించడం కూడా తగ్గించేశా. కాలేజ్ స్టడీస్, తర్వాత హవీష్‌తో కలిసి షికార్లు.. వీటికే ఉన్న సమయం సరిపోయేది కాదు. ఇలాంటి సందర్భంలో కూడా లిఖిత నన్ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండేది. చదువును అశ్రద్ధ చేయొద్దని పదే పదే గుర్తు చేసేది. కానీ ప్రేమ మత్తులో ఆ మాటలు నా చెవికి ఎక్కేవి కావు.
ఎంబీఏ మొదటి సంవత్సరం పూర్త్తెంది. అత్తెసరు మార్కులతో ఎలాగోలా గట్టెక్కేశా. లిఖిత మాత్రం మంచి మార్కులు తెచ్చుకుందని చెప్పడంతో సంతోషించా. తనని కలిసేందుకు హవీష్‌తో కలిసి బెంగళూరుకు వెళ్లా. నన్ను చూడగానే గట్టిగా హత్తుకుంటుందని అనుకున్నా. కానీ పట్టించుకోనట్లుగానే వ్యవహరించింది. దాంతో నాకు కోపం వచ్చి కాస్త గట్టిగా మాట్లాడా. 'కాసేపు నిన్ను పట్టించుకోకపోతేనే ఇంతగా కోపం తెచ్చుకున్నావు.. మరి, నేను, అంకుల్ (మా నాన్న) ఇన్ని రోజులుగా నీకు ఎన్ని మాటలు చెబుతున్నా నువ్వు పట్టించుకోలేదు.. అసలు నీ లక్ష్యం ఏంటి.. ఎటుగా నువ్వు అడుగులు వేస్తున్నావు..' అంటూ తను నన్ను నిలదీస్తుంటే దిమ్మతిరిగిపోయింది. 'నిజమే కదా!' అనిపించింది. వెంటనే తనను క్షమాపణ కోరి తప్పును సరిదిద్దుకుంటా అని మాట ఇచ్చా. దానికి అనుగుణంగానే తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత చదువుపై దృష్టి సారించా. హవీష్‌ను కూడా కెరీర్‌పై దృష్టి పెట్టేలా ప్రోత్సహించా. తనను లిఖితకు కూడా పరిచయం చేశా. అందుకే మా ఇద్దరితోనూ తను రోజూ మాట్లాడేది.
భవిష్యత్తు, ఉద్యోగం, కెరీర్.. మొదలైన వాటి గురించి ప్రణాళికలు వేసుకోవాల్సిన విధానం, వాటిని అమలుచేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇలా ప్రతి విషయం ఒక తల్లిలా/తండ్రిలా మాకు చెప్పేది. అలా తను అందించిన ప్రోత్సాహంతోనే ఎంబీఏ పరీక్షలు రాసి మంచి మార్కులతో పాసయ్యాం. అంతేకాదు.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా ప్రముఖ ఎమ్మెన్సీల్లో ఉద్యోగం కూడా సంపాదించాం. అయితే లిఖిత మాత్రం ఎంబీఏతో పాటు సివిల్స్‌కు కూడా సన్నద్ధమై అందులో విజయం సాధించింది.
'కేవలం మా కెరీర్ విషయంలో మాత్రమే కాదు.. ప్రేమ విషయంలోనూ తనే పెద్దగా వ్యవహరించింది. మా నాన్నని మా పెళ్లికి ఒప్పించింది. అలాగే హవీష్ వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్లని కూడా మా ప్రేమను అంగీకరించేలా చేసింది. అలా వయసులో చిన్నదైనా మా పెళ్లికి పెద్దగా వ్యవహరించింది. ప్రస్తుతం మా పెళ్త్లె ఆరేళ్లు కావస్తోంది. మాకు మూడేళ్ల కూతురు కూడా ఉంది. తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? నా ప్రాణానికి ప్రాణమైన లిఖితే! ఇలాంటి మంచి స్నేహితులు చాలా అరుదుగా మనకు తారసపడుతూ ఉంటారు. వీరిని ఒక్కసారి వదులుకున్నామా?? ఇక మళ్లీ వారి స్నేహం తిరిగి రాదు. అందుకే.. ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మా జీవితాలను చక్కదిద్దిన లిఖితకు ధన్యవాదాలు తెలుపుతూ తనలాంటి స్నేహితులనుదేనికోసమైనా సరే.. అస్సలు వదులుకోవద్దని చెప్పడానికే ఇలా మీ ముందుకు వచ్చా. బెంగళూరుకు వెళ్లిన మాకు లిఖిత ఆ రోజు అలా చెప్పి ఉండకపోతే అసలు ఈ రోజు మీ ముందుకు నేనిలా వచ్చేదాన్ని కాదేమో! స్నేహం అంటే అడుగడుగునా మన వెంట ఉండడమే కాదు.. మనల్ని సన్మార్గంలో నడిపించడం కూడా!'ఇట్లు,
కోమలి.