FIRST NIGHT in Telugu Drama by SriNiharika books and stories PDF | తొలి రాత్రి

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

తొలి రాత్రి


అది ఒక నిజం. అందమైన నిజం. సంవత్సరాలుగా కలలు కన్న కళ్ళకు, జీవితం మరో కొత్త కోణం లో చూపించే నిజమైన రాత్రి. అందరికీ ఉన్నట్టే సాత్వి కి కూడా కొన్ని కలలు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు రెడీ చేస్తుంటే ఎలా సిగ్గుపడాలో తెలియక మురిసిపోతుంది. నవీన్ పేరు తలుచుకున్నప్పుడల్లా బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి తనకి, అలా తనని చూసినప్పుడల్లా పక్కన ఉన్న అమ్మ, అక్క, అప్పుడే ఇంటర్ చదువుతున్న పెదనాన్న కూతురు మహిత కు కూడా నవ్వొస్తోంది. కాసేపు నవ్వాపుకున్నారు గాని , ఇక వాళ్ళ వల్ల కాక ఆటపట్టించడం మొదలుపెట్టారు.

వాళ్ళు ఏం మాట్లాడినా గుండె ఝల్ మని మోగుతోంది. గుండెల్లో రక్తం వేడిగా పారుతోంది. ఏంటో తెలియట్లేదు , ఆ రోజు గురించి సాత్వి ఏవో ఏవో ఊహించుకుంటోంది. ప్రతి కల ఏదో ఒక రోజు నిజమవ్వాలి కదా , తన పరిస్థితి కూడా అంతే.

కాని, స్వాతి మనస్సులో వేరే భయం కుడా ఒకటి తిరుగుతోంది. అక్కడ ఎవ్వరికీ చెప్పకుండా, లోలోపల తానే మధన పడుతోంది. ఒక్క ఫోన్ ఒక్కటంటే ఒక్క ఫోన్ గురించి. తన జీవితం మొత్తాన్ని నాశనం చేసేంత శక్తి ఉంది ఆ కాల్ కి. అదే తనని ఇప్పుడు భయపెడుతోంది.

అదే, తన ఎక్స్ రాజేష్ గాడి గురించి. పెళ్ళికి మూడు రోజుల ముందు నుంచి మొదలయ్యిందా టార్చర్. ఒకప్పుడు తనతో తిరిగిన ఫోటోలు, వాడు అడిగినప్పుడల్లా అమాయకంగా ఇచ్చిన సేల్ఫీ లు అన్నీ తన దగ్గర ఉన్నాయి. డిలీట్ చేశా అన్నాడు కాని . చెయ్యలేదు. అదే ఇప్పుడు తన కొంప ముంచబోతోంది. ఎప్పుడైతే రాజేష్ తనని మోసం చేస్తున్నాడు, ప్రేమ నటిస్తున్నాడు అని తెలిసిందో అప్పటినుండి అతని పై ఉన్న ప్రేమ స్థానంలో అసహ్యం మొదలయ్యింది. కాని, అది ఇప్పుడు హద్దులు దాటింది. నిజంగా అబ్బాయిలు అంతా ఇలా ఉంటారా అనుకునేంత. పెళ్లి ఫిక్స్ అయ్యిందని వాడికి చెప్పొద్దని ఫ్రెండ్స్ అందరి దగ్గరా మాట తీసుకుంది కాని, రాజేష్ గురించి . రాజేష్ మంచోడు, ఇకనైనా మారతాడు అనుకున్న సమయంలో పిడుగు లాంటి మెసేజ్ వేరే నెంబర్ నుండి వచ్చింది( రాజేష్ నంబర్ బ్లాక్ అయ్యింది). అందులో తన ….. ఫోటోలు. రాజేష్ ని గుడ్డిగా ప్రేమించే దిగినవి అవి, డిలీట్ చేసావా అని అడిగితే చేశా అని చెప్పేవాడు. కాని, ఇప్పుడు అదే ఫోటోలు నీ మొగుడు కి చూపిస్తా అని 3 రోజుల క్రితం ఆ మెసేజ్ లో చెప్పడంతో ఏమి చెయ్యాలో తెలియక కుమిలిపోతోంది.

” ఎంటక్కా? ఫేస్ అంత సీరియస్ గా పెట్టావ్ “అని మహి అన్న మాటలకు ఈ లోకంలోకి వచ్చిన సాత్వి తర్వాత ఏమి అనాలో తెలియక., సర్దుకుంది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. “రాజేష్ తనను పూర్తిగా …” అని నవీన్ కి ఎలా చెప్పాలో తెలియడం లేదు. కాని, రాత్రి మొదలయ్యే లోపల చెప్పాలి. లేదా నవీన్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు.

ఇలా ఆలోచిస్తున్న సాత్వి ని మిగతా ఆడపడుచులు అందరూ పంపించారు. ఒక పక్క ఆనందం తో ఉక్కిరి బిక్కిరి. మరొక పక్క నవీన్ తో నార్మల్ గా ఎలా ఉండాలో తెలియదు.సరే, నవీన్ కి చెబితే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. అసలే మద్యాహ్నం సీరియస్ గా ఉన్నాడు. ఇంకో పక్క రాజేష్ గాడి దరిద్రపు మెసేజ్ లు . అవి తట్టుకోలేక ఆఫ్ చేసిన ఫోన్. ఆ ఫోన్ ఎవ్వరికీ కనిపించకుండా పెళ్లి రోజున దాచేసింది. వీటన్నింటి మధ్యలో తలుపు తీసి లోపలికి వెళ్తోంది. అయితే ఒకప్పటిలా తనలో ఉన్న దూకుడు స్వభావం కనిపించడం లేదు. ఇష్టం ఉన్న వాడిని పరిగెత్తుకుని వెళ్లి వాటేసుకోవాలన్న ఫీలింగ్ లేదు. రాజేష్ దెబ్బకు మనిషి చురుకుదనంలో కూడా తేడా వచ్చేసింది.
కాని, అప్పుడే వంద నక్షత్రాలు ముందర వచ్చినట్టు, ఎదురు వచ్చాడు, నవీన్. తన కళ్ళల్లోకి చూస్తున్నాడు. వెంటనే అతన్ని వాటేసుకుని ఏడవాలి అనిపించినా, కదలకుండా అలానే ఉండిపోయింది సాత్వి.

ఆ రోజు నవీన్ తన వైపు చూసే ప్రతి చూపు ఎలా ఉంటుందో తెలుసు తనకి. అతని కళ్ళలో మెరుపు చూసి జీవితంలో మరిచిపోలేని ఆ క్షణాలు కోసం మెల్లగా ఊపిరి పీలుస్తూ చూస్తోంది తనని.

నవీన్ ఓయ్, బుజ్జి. అనే మాట విని మెలుకువ లోకి వచ్చింది. రమ్మని సైగ చేసి మంచం దగ్గర కూర్చోమన్నాడు. పాల గ్లాసు నవ్వుకుంటూ ఇచ్చింది. అయితే నవీన్ కాస్తే తాగి ఆగాడు. తీరా రుచి చూస్తే షుగరు తక్కువైంది.

“సారి రా” అని సిగ్గు పడుతూ చెప్పింది. దగ్గరికి తీసుకుంటాడేమో అని ఆలోచిస్తోంది సాత్వి. కానీ నవీన్ మనసు ఇంకా అర్థం అవ్వట్లేదు. వెంటనే నవీన్ పక్కన వచ్చి అతని భుజం మీద తల పెట్టింది.

“కళ్ళు మండుతున్నాయి” అని నవీన్ అనే సరికి.

” హా! నాక్కూడా”

“ముహూర్తం పెట్టిన పంతులుని అనాలి చూడు. నాన్ స్టాప్ గా రెండు రోజులు నిద్ర లేదు పాడు లేదు. ”

” సీరియస్ గా. కాళ్లు పీకుతున్నాయి. మరీ నిన్న పొద్దున్న 6 నుంచి మొదలుపెడితే, రాత్రి 3 కి పెళ్లి , మధ్యాహ్నం వ్రతం. అస్సలు నిద్ర లేదు” అని సాత్వి అని నాలుక కరుచుకుంది. అసలు ఈ టైం లో ఎవరైనా అలా మాట్లాడుకుంటారా?

అనవసరంగా వాడికి మూడ్ ఆఫ్ చేస్తున్నానా?నిజంగా నవీన్ కి ఏమైనా తెలిసిపోయి అలా మాట్లాడుతున్నాడా? లేదా నన్నేమైనా టెస్ట్ చేస్తున్నాడా అని కంఫ్యూస్ అవుతోంది.

సరిగ్గా అప్పుడే నవీన్ చెయ్యి తన వీపు మీద పడింది. ఒక్క సారిగా అంటే స్ప్రే కొట్టినట్టు బ్లడ్ వెళ్తోంది తనలో. ఫ్రెండ్స్ ఎంత చక్కిలిగింతలు పెట్టినా రాదు తనకి. అలాంటిది ఎదో తెలియని కొత్త గిలిగింత. ” అరేయ్. వచ్చి పడుకో” అని తన తొడ మీద పడుకోబెట్టాడు.

సాత్వి వెంటనే ఒక్క సెకండ్ ఆగకుండా పసి పిల్లలా పడుకుంది. నవీన్ ఆమె బుగ్గపై చెయ్యి వేసి నిమురుతున్నాడు. అప్పటిదాకా ఉన్న టెన్షన్ లు, పాత సమస్యలు అన్నీ ఒక్క సరిగా మర్చిపోయింది. నవీన్ అంటే పిచ్చి ప్రేమ పుట్టుకొస్తోంది. సాత్వి చాలా సార్లు ఫ్రెండ్స్ తో అనేది “వాడు చాలా మంచోడు. చాలా చాలా మంచోడు.” ఇప్పుడు తను చెప్పిన మాట నిజం అవుతుండటంతో, అదో తెలియని ఇగో సాటిస్ఫై అయిన ఫీలింగ్.

ఉన్నట్టుండి అబ్బా అని సాత్వి అనగానే, ఏమైందని అడిగాడు. గుచ్చుకుంటోంది అని పిన్ ని చూపించింది. నవీన్ సైలెంట్ గా నవ్వి కన్నుకొట్టాడు. తల అప్పుడే దించి సాత్వికి మొదటి సారి తలపై ముద్దు పెట్టాడు.

అప్పటి నుండి పెదాల కన్నా గాలి భాష పెరిగింది ఇద్దరికీ. నెక్ట్స్ ఏం చేస్తాడని ఆలోచిస్తున్న సాత్వి, ఎలాగైనా ముందు ఒక విషయం చెప్పాలి అని అనడం మొదలు పెట్టింది.

“ఓయ్. ఇవ్వాళ మాత్రం నేనే రాజుని. మళ్ళా లైఫ్ లో నువ్వే గా కంట్రోల్ చేసేది ” అని సాత్విని అన్నాడు.

“సరే. చెప్పండి. కింగ్ నవీన్ మహారాజా.” అని సెటైర్ గా అడిగింది.

” ఇవాళ ఎన్ని అనుకున్నా తెలుసా” అని నవీన్ అన్నాడు.

” ఏమనుమున్నావోయ్”

” నీ దెబ్బకి పోయెట్రీ రాయడం ఆపేసా రా బాబు. నీ గురించి చెప్పే ఫీలింగ్ ఎందులోనూ ఎస్ప్రెస్ చేయలేను “
సాత్వి మాములుగా అయితే “ఛా” అనేది. కానీ, ఆ రోజు అనలేదు. సిగ్గుపడుతూ నవ్వింది.

“పోజు కొట్టకు . కొన్ని రోజులు అయితే నువ్వేగా మళ్ళీ రాక్షసి అని పిలుస్తావ్.” అంది.

” అలా కాదు రా. ఇవాళ హ్యాపీఎస్ట్ థింగ్ ఏంటో చెప్పనా”

” హ్మ్. నువ్ చెప్పు వింటాను అంది” ఏముందిలే పెద్ద లోకం మొత్తానికి తెలియని కథా అనుకుని.

” ఇటురా చెప్తా.” అని మంచానికి ఒక పక్కన కూర్చున్నాడు కాళ్ళు పైకి పీటలు వేసుకుని.

సాత్వి రెండు చేతులు అతని మోకాలిపై పెట్టి దానిపై తన తల ఆనించి కూర్చుని వింటోంది.

“ఈ కాళ్ళు చూడు. ఆ పాదాలు ఎర్రగా ఎలా ఉన్నాయో. పైగా పారాణి రాసారు. ఎంత ముద్దుగా ఉంది తెలుసా ”

సాత్వి మౌనంగా వింటోంది. ఇప్పుడు దాదాపుగా అన్ని టెన్షన్స్ మర్చిపోయింది. సాత్వికి నుదురు కి మధ్య మధ్యలో తన తల తగిలిస్తూ మాట్లాడుతున్నాడు నవీన్. నవీన్ జుట్టు తన నుదురుకి తగిలినప్పుడల్లా కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంది స్వాతికి.

” బుజ్జి సీరియస్ గా తెలుసా. బొమ్మలా ఉన్నావు. తాళి కట్టేటప్పుడు తెలుసా, ఎర్రగా అయిపోయింది మీ ఫేస్. I was mad. U know”

సాత్వి: ” తెలుసు నీ చేతులు కూడా వణికాయి అప్పుడు”

నవీన్ :” అసలు ఏం తెలియడం లేదు. ఏంటో అసలు ఆ టెన్షన్ లో ఏం జరురుగుతోందో తెలియడం లేదు. జస్ట్ అలా నిన్ను చూస్తున్నా. పంతులు చెప్పినవి వింటున్నా అంతే. ”

“హ్మ్” అని నిట్టూర్చి వింటోంది. తనను ఇంతగా ప్రేమించే నవీన్ కి ఏం చెప్పాలో తెలియడం లేదు. తనలోని పిచ్చి ప్రేమని చూపించాలని ఉంది. కానీ, కుదరడం లేదు. అందుకే ధైర్యం చేసింది.

నవీన్ మాట్లాడే లోపల అతనికి షాక్ ఇచ్చింది. కాసేపు వాళ్లిద్దరూ మాట్లాడలేదు. ఉన్నట్టుండి నవీన్ కి మైండ్ ఇంకోలా మారింది. ఇప్పుడు ప్రేమతో పాటు ఇంకో ఫీలింగ్ బయలుదేరింది. కానీ, అప్పుడే అసలు భయం కూడా మొదలయ్యింది సాత్వికు.

” ఒరేయ్. నీ దగ్గర ఒకటి దాచాను ” అంది.

చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. కానీ, ఇంత మంచి వాడ్ని మోసం చేయకూడదు. ఎలా అని ఆలోచిస్తూ కొత్తగా భయపడుతోంది.

ఏడుపు వస్తోంది. అది చెప్పకూడదు. ఒక వేళ చెప్పకపోతే రాజేష్ గాడు లీక్ చేసేస్తే తన పరిస్థితి ఏంటి? ఇంత కంఫ్యూషన్ లో కూడా చెప్పేద్దామని ఫిక్స్ అయ్యి అనబోతోంది. తను .. కాదని.

” రాజేష్ గురించా”

ఒక్క సారిగా షాక్ అయ్యింది సాత్వి. ఏం చెప్పాలో తెలియక ఏడుపు మొదలుపెట్టబోతోంది. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి తనకి.

” లైట్ తీసుకో. వాడ్ని సైబర్ క్రైం సెక్యూరిటీ ఆఫీసర్లకి అప్పచెప్పా. మొత్తం డిలీట్ కొట్టే దాకా వదిలిపెట్టరు”

సాత్వికి నిజంగా ఏడుపు మొదలయ్యింది.

” అరేయ్ ఇదంతా పిచ్చ లైట్. సగం మందికి ఉన్న అలవాట్లే ఇవి. ఒకళ్ళ లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు జరుగుతున్నవే. నువ్వు దక్కకపోతే నాశనం చేసే అంత వాడికి ప్రేమ ఉంది. నీ ప్రేమను సిన్సియర్ గా నిలుపునే శక్తి ఆడికి లేదు. మిస్ అయ్యాడు. ఒక్కటి మాత్రం చెప్తా. కానీ, నువ్వు ఎలా ఉన్నా నిన్ను నిన్నుగా ప్రేమించేంత పిచ్చి నాకు ఉంది. నువ్వు మొకం పీక్కు పోయిన ముసలి అమ్మాయివి అయినా నా సాత్వి ఎంత అందంగా ఉంటుందో అలానే చూస్తా. అప్పుడు కూడా ఇంతే గట్టిగా కౌగిలించుకుంటా. కాబట్టి వదిలి పారెయ్యి. ”

ఆ మాట విన్నాక నిజంగా నవీన్ ని పట్టుకుని గట్టుగా ఏడ్చేసింది సాత్వి. ఇద్దరూ కలిసి కొత్త లైఫ్ మొదలు పెట్టారు. బయట మొత్తం నిశబ్దం గానే ఉంది. అప్పుడే ఇంకో నిశబ్దం అందంగా మేలుకొంది.

********అయిపోయింది********