Nuli Vechani Vennela - 3 in Telugu Detective stories by sivaramakrishna kotra books and stories PDF | నులి వెచ్చని వెన్నెల - 3

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

నులి వెచ్చని వెన్నెల - 3

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

ఒళ్ళు భగ్గుమని మండింది సమీరకి. తను ఆ బిజినెస్ అంతటికి సోల్ ఓనర్. అయినా అంత అహంకారంగా మాట్లాడుతూ వున్నాడు. తమ ఎంప్లొయీస్ అందరిలో తనని ఏకవచనంలో సంభోదించేది వీడొక్కడే. 

"నా బిజినెస్, నా ఆఫీస్, నా ఇష్టం. నాక్కావాలంటే వస్తాను, లేకపోతే లేదు. అయితే ఏంటి?" తను కోపంగా అడిగింది.

"నేనేం అది కాంట్రడిక్ట్ చెయ్యదలుచుకోలేదు. కాకపోతే నేనూ ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో వున్నాను. కంపెనీకి ఇంకా ఇందులో పనిచేసే వాళ్ళకి ఇబ్బంది కలక్కుండా చూడాల్సిన బాధ్యత నామీద వుంది. అందుకనే నీ బాధ్యత నీకు గుర్తు చేస్తూ వున్నాను. అయినప్పటికీ నన్నే విషయాలలోనూ కల్పించుకోవద్దంటే నాకే అభ్యంతరం లేదు."

వెంటనే కోపంగా ఇంకేదో అనబోయి చటుక్కున ఆగిపోయింది. ఎంత తను అనురాగ్ అంటే ఇరిటేషన్ ఫీల్ అవుతూవున్నా, తను చెప్పిన దాంట్లో రీజన్ వుంది. "ఇవాళ చాల తలనొప్పిగా వుంది. అందుకనే రాలేదు. ఇవాళ్టివన్నీ రేపటికి పోస్టుపోన్ చెయ్యి."

ఇంకా ఎదో చెప్తాడని ఎక్స్పెక్ట్ చేస్తూ అంది సమీర కానీ తను ఇలా చెప్పడం పూర్తయ్యిందో లేదో ఫోన్ కట్ చేసాడు అనురాగ్. అదింకా వొళ్ళు మండించింది తనకి. వెంటనే ఆఫీస్ కి వెళ్లి వాడిని వుద్యోగంలోంచి పీకి పారెయ్యాలనిపించింది. కానీ తను అలా చెయ్యలేదు. పద్దెమినిదేళ్ళుగా అనురాగ్ ఇరిటేట్ చేస్తూవున్నా, తన డాడీయే అలా చెయ్యలేక పోయారు. తన డాడ్ చేయలేకపోయిన పని తను చెయ్యలేదు.

కేవలం తన డాడ్ మీద గౌరవంతోటే తను అనురాగ్ ని ఊస్టింగ్ చెయ్యకుండా ఆగలేదు. అలాగే తన డాడ్ కూడా అనురాగ్ ని వేరే ఎదో బలహీనతతో తనని అప్పుడప్పుడు ఇరిటేట్ చేస్తూ వున్నా అలా అట్టేపెట్టుకోలేదు. అనురాగ్ తమ సంస్థకి నిజంగానే పెద్ద అసెట్. ఎన్నోసార్లు, ఎన్నో రకాలుగా తనని ప్రూవ్ చేసుకున్నాడు. తమ బిజినెస్ ఇంతగా డెవలప్ అవ్వడం వెనక అనురాగ్ కూడా వున్నాడు.

ఇరవై రెండేళ్ల వయసులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తమ సంస్థ లోకి వచ్చాడు అనురాగ్ ఫైనాన్సియల్ మేనేజర్ గా. తన తెలివితేటలు తో, చాకచక్యంతో ఒక సంవత్సరకాలం లోనే తన డాడ్ దృష్టిలో పడ్డాడు. మంచి సలహాలు ఇస్తూ కొద్దీ కాలంలోనే తన డాడ్ కి సన్నిహితం గా మారి పోయాడు. ఒక పెద్ద పొజిషన్ లోకి వచ్చి, కంపెనీ సి.ఈ.ఓ కాగలిగాడు.  

అయితే కొన్ని సందర్భాలలో తన డాడ్ తీసుకొనే సలహాలని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉండేవాడు. ఎంతగా అపోజ్ చేసే వాడు అంటే, ఆ సలహాలు అమలులో పెడితే తమ సంస్థని వదిలేసి వెళ్ళిపోతాననేవాడు. అనురాగ్ ని వదులుకోవడం ఇష్టం లేకపోవడం మాత్రమే కాదు, ఎంతోమంది తమ కాంపిటీటర్స్ ఎదురుచూస్తూ వున్నారు అనురాగ్ బయటకు వచ్చేస్తే తమ సంస్థలో రిక్రూట్ చేసుకోవడానికి. తెలివితేటలు మాత్రేమే కాదు, తమ బిజినెస్ గురించి పూర్తిగా తెలిసివున్న అనురాగ్ తమ కాంపిటీటర్స్ సంస్థలలో చేరితే, వాళ్లెలా అడ్వాంటేజ్ తీసుకుంటారో తన డాడ్ కి తెలుసు. అందుకనే ఎప్పుడూ అనురాగ్ ని వెళ్లనివ్వలేదు. ఇక్కడ మోస్ట్ ఐరానికాల్ థింగ్ ఏమిటంటే, అనురాగ్ ఎవ్విరి ఆక్షన్ కరక్ట్ అని ప్రూవ్ అయ్యింది. అనురాగ్ వ్యతిరేకించిన తన డాడ్ సలహాలు అమలులో పెట్టివుంటే తమకి చాలా నష్టం వచ్చివుండేది. ఆ విషయం తన డాడ్ తన దగ్గర చాలా సార్లు ఒప్పుకున్నారు. అయినప్పటికీ అనురాగ్ అడాసిటీ, తనతో ఆ ప్రవర్తించే తీరు తనకెప్పుడూ వళ్ళు మండిస్తూనే ఉంటుంది. ఇంకా ఎదో ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ ఫోన్ మోగింది. ఈ సరి వీడియో కాల్. తన ఫ్రెండ్ మల్లిక దగ్గర నుంచి.

ఒక్కసారిగా చిరాకంతా పోయి మనసు ఆనందంతో నిండిపోయింది సమీరకి. ఎందుకో తన గురించి ఆలోచించినా కూడా చాలా ధైర్యంగా, ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. తనతో తనకున్న ఫ్రెండ్షిప్ అలాంటిది. పన్నిండేళ్ల వయసులో తన పేరెంట్స్ ని కోల్పోయి, తమ ఇంటికి వచ్చిన దగ్గరనుంచి కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు తామిద్దరూ. అంతకుముందునుంచి కూడా తనకి మల్లిక తెలిసి ఉన్నప్పటికీ కూడా, తనతో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది మాత్రం తను తన ఇంటికి వచ్చి తన డాడ్ మీద పూర్తిగా ఆధార పడ్డ తర్వాతే.

"హలొ ఎలా వున్నావ్?" కాల్ అటెండ్ అవ్వగానే పలకరించింది సమీర చాలా రిలీఫ్ ఫీలవుతూ.

"నీకు దూరంగా …………....నిన్నే మిస్సవుతూ…………......" నవ్వుతూ అంది మల్లిక. "………….........నువ్వు అమెరికాలో వున్నప్పుడు నాకు అలా అనిపించదు. కానీ నువ్వు ఇండియా లోనే వున్నప్పుడు మాత్రం నాకు నీ దగ్గర లేకపోతే అదోలా వుంటుంది."

"నాక్కూడా నీతో ఉండాలనే వుంది. నిన్నెంతగానో అడిగాను. కానీ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ అంటూ వెళ్ళిపోయావు." నిష్టూరంగా అంది సమీర.

"నా మీద నీకు ఎంతో ఫీలింగ్ వుంది అని తెలుసు సమీరా. అందుకనే నా ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ అన్నీ ఇక్కడ పూర్తిచేసుకుని, నీతో సాధ్యమైనంత కాలం కలిపి గడపాలనే అక్కడనుండి వచ్చేసాను. అదే విషయం నీకు చెప్పాను కూడా."

"చెప్పావు. గుర్తుంది." సమీర నవ్వింది. "కానీ ఎప్పటికి నీ కమిట్మెంట్స్ అన్నీ అక్కడ పూర్తయి ఇక్కడికి వస్తావు అన్న విషయమే నాకు అర్ధం కావడం లేదు."

"ఆ విషయం చెప్దామనే నేను ఇప్పుడు ఫోన్ చేసింది." మల్లిక అంది. "ఒక వారం రోజుల్లో నా కమిట్మెంట్స్ అన్నీ పూర్తయి ఫుల్ గా ఫ్రీ అవుతాను. అప్పుడు నేనక్కడికి  వచ్చి, నీకెంతకాలం కావాలంటే అంతకాలం నీతోనే వుంటాను. నిజానికి నా ఐడియా ఏమిటంటే, అక్కడే నీకు దగ్గరగా ప్రాక్టీస్ పెట్టుకోవాలని."

"నిజంగా......నిజంగా అదే ఐడియాతో వున్నావా?" ఆనందంతో అరిచినంత పనిచేసింది సమీర.

"నీకన్నా నాకే ఎక్కువ ఆనందం కలిగించే విషయం ఇది. అందుకనే పూర్తిగా మెటీరియలైజ్ అయ్యేవరకూ నీకు చెప్పకుండా ఆగాను. నేను పని చేసే మెంటల్ కేర్ లో కూడా రిజైన్ చేసేసాను. ఒక్కవారంలో ఇక్కడ నా బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని నీ దగ్గరకి వచ్చేస్తాను. ఆ తర్వాత ప్రతీదీ నువ్వు ఎలా అంటే ఆలా."  

"థాంక్ యు, థాంక్ యు వెరీ మచ్." ఇంకా అదే మెజర్ లో హ్యాపినెస్ ఫీలవుతూ అంది సమీర. "నువ్వు నా గురించి చాలా పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నావు. నువ్వెందుకిలా చేస్తున్నావో కూడా నేను అర్ధం చేసుకోగలను."

"షట్ యువర్ బ్లడీ మౌత్." సడన్గా మల్లిక మోహంలో ఎక్స్ప్రెషన్ కోపంగా మారిపోయింది. "నువ్వు మీ డాడ్ నాకు చేసిందానితోటి పోలిస్తే, నేను చేసేదెంత అసలు? నిన్ను అలాంటి డిప్రెషన్  లో వదలి ఇలా దూరంగా రావాల్సి వచ్చినందుకే చాలా గిల్టీగా ఫీలవుతూ వున్నాను. ఇప్పటికైనా నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు వుంది. ఎప్పుడూ నాకు దేనికీ థాంక్స్ చెప్పే ప్రయత్నం చెయ్యకు. ఫ్రెండ్స్ మధ్య థాంక్స్ ఉండకూడదు."

"ఐ యామ్ సారీ. నేనెప్పుడూ దేనికీ నీకు థాంక్స్ చెప్పను." నవ్వుతూ అంది సమీర.

"ఫ్రెండ్స్ మధ్య సారీలు కూడా వుండకూడదు." అదే సీరియస్ ఎక్స్ప్రెషన్ తో అంది మల్లిక.

"అలాగే. దేనికీ సారీ కూడా చెప్పను." చిరునవ్వుని కంటిన్యూ చేస్తూ అంది సమీర.

"ఈరోజు ఇంకా ఆఫీస్ కి వెళ్లలేదా? ఇంకా బెడ్ మీదే వున్నావేమిటి?"

"కొంచెం హెడేక్ గా వుండి ఆఫీస్ కి వెళ్ళలేదు. ఎస్, బెడ్ మీదే రిలాక్స్ అవుతున్నాను." నిట్టూరుస్తూ అంది మల్లిక.

"నువ్వింకా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నావు కదా?  డాక్టర్ మనోహర్ కూడ ఏం చెప్పలేక పోయారా?"

"ఎస్, నేను అదే విషయం గురించి ఆలోచిస్తూ వున్నాను." మరోసారి నిట్టూర్చింది సమీర. "డాక్టర్ మనోహర్ కూడా ఏం చెప్పలేక పోయారు. కాకపోతే నేనది ఎక్స్పెక్ట్ చేసిందే. నీతోటి, ఆంటీ తోటి ఇంకా సంజయ్ తోటి కూడా షేర్ చేసుకొని విషయం, మనోహర్ అంకుల్ తోటి షేర్ చేసుకుని వుండి ఉంటారని నేను అనుకోలేదు."

"ఆల్రైట్. త్వరలోనే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను కాబట్టి, నువ్వా విషయం గురించి పెద్దగా తల బద్దలుకొట్టుకోకు. మనిద్దరం కలిసి ఆ విషయం ఏమిటో జాగ్రత్తగా ఆలోచిద్దాం."

"బెస్ట్ ఐడియా ఇన్ మై ఒపీనియన్." మరోసారి నవ్వింది సమీర.

"ఆల్రైట్. టేక్ కేర్ అఫ్ యువర్ సెల్ఫ్. ఆంటీ ని సంజయ్ ని అడిగానని చెప్పు. వుంటా మరి."

&&&

డైనింగ్ టేబుల్ దగ్గర లంచ్ చేస్తూ ఉండగా, మల్లిక రాబోతూన్న విషయం చెప్పింది సమీర తన ఆంట్ నిర్మలకి ఇంకా కజిన్ సంజయ్ కి.

"చాలా సంతోషం. ఇక్కడ నీతోపాటుగా తను కొన్నిరోజులు ఉండగలిగితే చాలా బాగుంటుంది. నిన్ను సంతోషంగా వుంచగలిగే శక్తి తనకి మాత్రమే వుంది." విషయం వినగానే చాలా హ్యాపీగా ఫీలవుతూ అంది తన ఆంట్

అప్పుడు మల్లిక తీసుకున్న నిర్ణయం గురించి కూడా చెప్పింది సమీర.

"అది చాలా మంచి నిర్ణయం నా అభిప్రాయంలో. నిజంగా తను నీ గురించి చాలా ఆలోచిస్తుంది అనడంలో ఇంతకన్నా రుజువు ఇంకా ఏం కావలి." తన ఆంటీ అంది

"అఫ్ కోర్స్, ఎస్.............కానీ సంజూ............." తన కజిన్ సంజయ్ మొహంలోకి చూస్తూ అంది సమీర. "...............నువ్వు తనని కొంచం బేర్ చెయ్యాలి. నాకు తెలుసు. చాలా విషయాల్లో మీ ఇద్దరికీ డిఫరెన్స్ అఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి." 

"ఏంటది సమీ……......నువ్వు నాకీ విషయం ఇలా చెప్పాలా? నీకు హప్పినెస్స్ కలుగుతుంది అంటే నేనే విషయం అయినా బేర్ చేస్తాను. అసలు అంకుల్ పోయిన డిప్రెషన్ నుండి నిన్నెలా బయటకి తీసుకు రావాలా అని ఆలోచిస్తూ వున్నాను. ఆ పని మల్లిక చేయ గలుగుతుంది అంటే, హార్టీ వెల్కమ్ టు హర్." సంజయ్ అన్నాడు.

"ఒకే ఆంటీ. రేపటినుండి నేను రెగ్యులర్గా ఆఫీస్ కి వెళ్లాలనుకుంటున్నా. ఆ రాస్కేల్ అనురాగ్ చేతుల్లో వ్యవహారాలన్నీ పూర్తిగా ఉంచడం నాకిష్టం లేదు." తింటూనే మధ్యలో అంది సమీర.

"నువ్వు ఆఫీస్ కి రెగ్యులర్ గా వెళ్లి విషయాలన్నీ చూసుకోవడం చాలా సంతోషించాల్సిన విషయం. కానీ నువ్వు అనురాగ్ గురించి ఆలోచించే విధానమే నాకు నచ్చడం లేదు." తన  ఆంటీ అంది.

"ఏంటి ఆంటీ నువ్వు కూడా ఆలా అంటావు? డాడ్ ని ఎన్ని సార్లు ఆ అనురాగ్ ఎలా ఇరిటేట్ చేసాడో నీకు తెలియదా?" చిరాకుగా అడిగింది సమీర.

"మరయితే నువ్వు నాకొక విషయం చెప్పు. అంకుల్ తనని ఆఫీస్ లో ఎందుకు కొనసాగించినట్టు? కావాలంటే తనని రిమూవ్ చెయ్యగల పవర్ అంకుల్ కి వుంది కదా." సంజయ్ అన్నాడు తన ఆంటీకి బదులుగా.

"డాడ్ ఆ అనురాగ్ మన సీక్రెట్లన్నీ మన కాంపిటీటర్స్ దగ్గర బయట పెట్టేస్తాడేమోనని భయపడ్డారు. అందుకనే ఆలా కొనసాగనిచ్చారు."

"నో సమీ. బిట్రయల్ లైక్ దట్ ఈజ్ ది లాస్ట్ థింగ్ అనురాగ్ వుడ్ డు." సంజయ్ దృఢస్వరం తో అన్నాడు. "నాకు అనురాగ్ గురించి నీ అంతగా, ఇంకా అంకుల్ అంతగా తెలియదు. కానీ ఈ విషయం మాత్రం స్పష్టం గా చెప్పగలను. అయినా ఆలా భయపడి అంకుల్ ఎవర్నీ బేర్ చెయ్యరు. తనకి సరిపడరు అనుకుంటే ఎవర్నైనా బయటకి పంపించేస్తారు."

"నిజమే సమీ. నాకూ మీ డాడ్ స్వభావం గురించి చాలా బాగా తెలుసు. ఆయన దేనికీ భయపడే మనిషి కాదు. తను మీ బిజినెస్ అంటే ప్రాణం పెడతాడని డాడ్ కి తెలుసు. అందుకనే కొన్ని సందర్భాలలో తనని బాగా ఇరిటేట్ చేసినా కూడా అనురాగ్ ని బయటికి వెళ్లనివ్వ లేదు." తన  ఆంటీ అంది.

"మీరే నాకన్నా డాడ్ ని బాగా అర్ధం చేసుకున్నట్టుగా వున్నారు." నవ్వింది సమీర. "ఎనీహౌ, రేపటినుండి నేను రెగ్యులర్గా ఆఫీస్ లో వుంటాను. డాడ్ నా నెత్తిమీద పెట్టిన భారాన్ని సక్రమంగా మొయ్యాలి కదా."

"ఆల్ ది బెస్ట్ టు యు సమీ. మేము నీకు ప్రతి విషయంలోనూ అండగా ఉంటాం అని ప్రత్యేకంగా చెప్పాలా ఏం?"తన  ఆంటీ అంది

ఆలా ఆనందంగా మాట్లాడుకుంటూనే లంచ్ ముగించారు ముగ్గురూ.

&&&

"ఐ యామ్ సారీ. నిన్న ఎదో అవుట్ ఆఫ్ మూడ్ లో వుండి అలా మాట్లాడాను." మర్నాడు ఆఫీస్ లో తన ఛాంబర్ లో అనురాగ్ తనని వచ్చి కలవగానే, అంది సమీర. "నిన్న చాలా ఇంకన్వీనియన్స్ పేస్ చేసి ఉంటావు కదా."

"నెవర్ మైండ్." కుర్చీలో వెనక్కి జరగిలబడుతూ నవ్వాడు అనురాగ్. "డాడ్ చనిపోయాక నువ్వు చాలా డిప్రెస్ అయిపోయావని నాకు తెలుసు. అందుకనే నువ్వు చాలా రోజులుగా సరిగ్గా ఆఫీస్ కి రాకపోతూ వున్నా నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యలేదు. కాకపోతే అల్టిమేట్ గా ఇదంతా చూసుకోవాల్సింది నువ్వేకదా. నువ్వు కచ్చితంగా దీనికంతటికీ ప్రిపేర్ అయ్యే తీరాలి."

"ఆ ఒక్క ఆలోచన నన్ను ఇంకా టెన్షన్ కి గురి చేస్తూంది. అంతమంది లైవ్స్ నా మీదే ఆధార పడి వున్నాయంటే నాకు చాలా భయం గా వుంది." తనూ కుర్చీలో వెనక్కి జరగిలబడింది భయాన్ని ఫీలవుతూ.

"ఆలా భయం కలిగినప్పుడల్లా నువ్వు వర్ధన్ రావు గారి కూతురివన్న విషయం గుర్తు చేసుకో. నీకు చెప్పలేనంత ధైర్యం వస్తుంది. ఆయనెప్పుడూ ఆలా భయం ఫీల్ అయ్యేవారు కాదు. ఎంతో రిలాక్సడ్ గా చేసేవారు ప్రతివిషయం. నేను అయన దగ్గరనుంచి నేర్చుకున్నది చాలానే వుంది."

"ఓహ్, గాడ్. అందరికి డాడ్ గురించి నాకన్నా ఎక్కువే తెలుసనిపిస్తూంది." మరోసారి అందంగా నవ్వింది సమీర. "బట్..............." సడన్గా సమీర మొహం సీరియస్ గా మారిపోయింది. "...................డాడ్ నువ్వు చాలా సార్లు గొడవ పడ్డారు. నువ్వు కొన్ని సందర్భాల్లో మమ్మల్ని వదలి వెళ్లిపోతానని కూడా బెదిరించావు."

"ఐ ఫెల్ట్ రియల్లీ బాడ్ దెన్ అండ్ నౌ అల్సొ ఐ ఫీల్ బాడ్ ఫర్ దట్." అనురాగ్ మోహంలో ఎక్స్ప్రెషన్ చాలా జెన్యూన్ గా వుంది. "కానీ కొన్ని సందర్భాల్లో నాకలా చెయ్యక తప్పలేదు. అప్పుడు మీ డాడ్ నిర్ణయాలు అమల్లో పెట్టివుంటే చాలా నష్టం జరిగివుండేది. అప్పుడు నా బిహేవియర్ కి డాడ్ కి సారి చెప్పలేక పోయాను. కానీ ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడు నా బిహేవియర్ వల్ల నువ్వూ చాలా హర్ట్ అయ్యేవని నాకు తెలుసును. ఐ యామ్ వెరీ సారీ ఫర్ దట్."

నిజంగా ఇది ఒక షాక్ సమీరకి. అనురాగ్ ఇలా మాట్లాడతాడని అనుకోలేదు. అనురాగ్ విషయంలో  ఆంట్ ఇంకా కజిన్ చెప్పింది పూర్తిగా నిజం. తనకి అనురాగ్ మీద వున్న నెగటివ్ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకోవాలి.

"ఆల్రైట్ అనురాగ్. నువ్వు మా బిజినెస్ కి చాలా డెడికేటెడ్ అని నాకు తెలుసు. ఆఫ్ కోర్స్ నేనూ, డాడ్ కొన్ని సార్లు హర్ట్ అయినా విషయం నిజమే, కానీ డాడ్ కూడా అదే చెప్పేవారు." రెండు మోచేతులతో మధ్యలో వున్న బల్లమీద బాలన్స్ అవుతూ, అనురాగ్ మొహంలోకి చూస్తూ అంది సమీర. "నేను డిసైడ్ అయ్యాను. ఇకనుండి బిజినెస్ మీద పూర్తిగా దృష్టి పెడతాను. డాడ్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తాను."

"ఐ యాం వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ కంగ్రాట్యులేషన్స్ టు యు." ఆ సమయంలో అనురాగ్ మోహంలో సంతోషం కూడా చాలా జెన్యూన్ గా అనిపించింది సమీరకి. "మీ డాడ్ కి ఎలా అయితే హెల్ప్ ఫుల్  గా ఉన్నానో నీకూ అలాగే అన్ని విషయాల్లోనూ హెల్ప్ ఫుల్ గా వుంటాను."

"ఒకే అనురాగ్. బిఫోర్ గోయింగ్ ఇంటూ ది బిజినెస్.............." సమీర సడన్గా ఆ విషయం అనురాగ్ కి చెప్పాలన్న నిర్ణయానికి వచ్చేసింది. తామెవరితోనూ షేర్ చేసుకొని ఆ విషయం అనురాగ్ తో తన డాడ్ షేర్ చేసుకుని ఉంటారని అనయితే అనిపించడం లేదు. కానీ కొంతవరకూ అనురాగ్ కి దాని మీద ఐడియా వుండివుండొచ్చు. ".................ఒక్క విషయం నీతో చెప్పాలి." కుర్చీలోనుంచి లేచి నిలబడి అంది

"నువ్వే విషయం అయినా నాతొ షేర్ చేసుకోవచ్చు. అది పెర్సనల్ కావచ్చు లేదా అఫిషియల్ కావచ్చు. నాకు చేతనయినంత సహాయం నేను చేస్తాను." కుర్చీలో అలా కూర్చునే సమీర వంక చూస్తూ అన్నాడు అనురాగ్. 

"నేను మన బిజినెస్ పనుల మీద తరచూ అమెరికా కి వెళ్లి వస్తున్నా." అనురాగ్ వైపు టర్న్ అయి చెప్పడం మొదలు పెట్టింది సమీర. అనురాగ్ కూడా తల సమీర వైపు తిప్పి తననే చూస్తూ వున్నాడు. "అలాగే నేను సిక్స్ మంత్స్ బ్యాక్ త్రి మంత్స్ ప్రోగ్రాంతో అమెరికాకి వెళ్ళాను. ఆ విషయం నీకు గుర్తుండే ఉంటుంది. అక్కడ నేనా పనులు చూస్తూ వుండగా డాడ్ ఫోన్ చేసారు.." అప్పుడు తన డాడ్ తనని ఇంటికి వెంటనే రమ్మని ఆదుర్దాగా ఎలా అడిగిందీ సమీర వివరంగా చెప్పింది. "నేనెంత అడిగినా ఆ విషయం ఏమిటో డాడ్ నాకు ఫోన్ లో చెప్పలేదు. సరే ఇంటికొచ్చాక తెలుస్తుందిలే అనుకుని వెంటనే బయలుదేరి వచ్చేసాను. నేనొచ్చేసరికే హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. నా ఆంటీ తో కానీ, కజిన్ తో కానీ ఇంకా డాక్టర్ మనోహర్ తో కానీ ఏమైనా ఆ విషయం గురించి చెప్పి వుంటారేమోనని అడిగి చూసాను. ఎవరికీ ఏమీ చెప్పలేదు. కనీసం చిన్న క్లూ కూడా ఆ విషయం గురించి ఏమీ విడిచిపెట్టలేదు. మా డాడ్ లేరన్న బాధ ఒకవైపు అయితే, ఆయన అంతగా నాతో చెప్పాలనుకున్న విషయం చెప్పకుండానే చనిపోయారన్న బాధ ఇంకోవైపు నన్ను పీడిస్తున్నాయి. అసలు అంత ఆదుర్దాగా అయన నాతొ ఏం మాట్లాడాలనుకున్నారో నాకు బోధపడడం లేదు. దానిగురించే ఆలోచిస్తూ నాకు పిచ్చి పడుతున్నట్టుగా వుంది."

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)