om saravana bhava 11 in Telugu Mythological Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | ఓం శరవణ భవ - 11

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ఓం శరవణ భవ - 11

సుందరవల్లి తన సోదరిలా కాక  మనసు కుదిరినప్పుడు తపోధ్యానములో కూర్చునేది . 

లోక కల్యాణ కారకుడైన  నారదమహర్షి తరుణం చూసి  శివ తనయుని  స్కందగిరి లో దర్శించాడు .  నారాయణ పుత్రికల మనో వాంఛితమును  షణ్ముఖునికి వివరిస్తాడు .  యుక్తవయస్కుడైన కార్తికేయుడు  విష్ణుకన్యల  రూపురేఖలను, మనసును నారదుని కథనం  ద్వారా  గ్రహించి వారిని అనుగ్రహించాలని సంకల్పిస్తాడు . 


పై ఉదంతం శివకేశవుల అభేదాన్ని  ఆవిష్కరిస్తుంది .  శివశక్తి విష్ణుశక్తి వైపు మొగ్గు చూపటం చాల సహజమైన పరిణామం. ‘ జగతి లో ఏ మహత్కార్యానికైనా  శివకేశవులు ఏకం కానిదే  పరిపూర్ణ సిద్ధి లభించదు’ పైగా  జ్ఞానశక్తికి  ఇచ్ఛా క్రియా శక్తులు  సోపానములై ,  సాధనా విశేషములై  అలరారుట  ఒక ‘ క్రమ పరిణామం.’   ఇదొక సహజగతి ‘  HYPOTHESIS, OBSERVATION, EXPERIMENTATION AND INFLUENCE  అనే      SCIENTIFIC PROCESS  కు ఇదొక ప్రతిరూపం వల్లీ దేవసేనా  సమేతుడైన  షణ్ముఖుడు ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తుల  సంగమం.  ఇహలోక సౌఖ్యము , పరలోక సిద్ధికై  కర సాధన, సాధన సిద్ధించిన పిదప పరిపూర్ణ జ్ఞాన చైతన్యం తో  పరాత్పరునిలో ఐక్యమై , అద్వైత సిద్ధిని పొందుట  జీవునకు అతి సహజమైన  పరిణామమే కదా ! 


శివకుమారుడు ముందు అమృతవల్లిని గ్రహిస్తాడు .  ఆమె నిశ్చల్ ధ్యానం , నిర్మలాంతరంగం, షణ్ముఖుని మురిపిస్తాయి .  అంబ తనయుడు అమృతవల్లికి కనిపించి కనువిందు చేస్తాడు .  మనసు, తనువు  పరిపక్వత పొండనిదే తన పొందు లభించిందన్న పరమ సత్యం ఆమెకు తెలియ చేస్తాడు .  కార్యసిద్ధికి వైకుంఠం అనువైన క్షేత్రం కాదని , కారభూమిపై కాలు మోపి  పవిత్ర మానస సరోవరం  చెంత తపమాచరించామని హితవు చెబుతాడు . 


    “ అమృతవల్లీ !  మన ఇరువురి సమాగమము  అతి సహజమైన పరిణామం.  నీ జనకుడు నారాయణుఁడు స్థితి కారకుడు . నా తండ్రి నిటలాక్షుడు , లయకారకుడు, విశుద్ధ జ్ఞాన స్వరూపుడు . నేను జ్ఞాన శక్తిని . నీవు క్రియాశక్తివి . సాధన లేనిదే సిద్ధి లభించదు .  క్రియాశీలి కానిదే  జీవుడు జ్ఞాన స్వరూపుడు కాలేదు . జగతి లో ఈ పరమ సత్యం మన ఇరువురి అన్యోన్యత వల్లే  ఆవిష్కరింపబడుతుంది . సతిగా  మేను  చాలించిన నా తల్లి —- పర్వతరాజు పుత్రికగా పంచాగ్నుల నడుమ తనూ లతికను  తపింప  జేసి  , నా తండ్రికి శివ తత్వాన్ని  సహేతుకంగా , సుందరంగా వివరించిన  పుణ్యభాగిని .  ఆ తదేక ధ్యానమే , ఆ తత్పరతే నీకూ ఆదర్శం కావలి .  ఏ హిమశైలములపై  శైలజ ఉగ్రరూపం తో  శివుని ప్రసన్నం చేసుకుందో  ఆ కర్మ క్షేత్రం లో , పవిత్ర మానస సరోవర తీరాన  నీవూ అకుంఠిత దీక్షతో  పదివేల సంవత్సరాలు  పరమ ధ్యానం లో  గడపాలి .  నా జన్మ లక్ష్యం శూర పద్మాది  రాక్షస కోటి సంహారం .  దుష్ట శిక్షణ పూర్తి కాగానే  తరుణం చూసి చేస్తాను . అంతవరకూ తపస్సోక్కటే నాకు తరుణోపాయం”.  

ఇలా సుబ్రహ్మణ్యుని ఆనతి  మేరకు అమృతవల్లి పవిత్ర మానస సరోవర తీరాన తపస్సమాధి లో  లీనమైపోతుంది . 


సుందరవల్లికి సైతం  సుందరేశ్వరుడి తనయుడు దర్శనమిచ్చాడు .  షణ్ముఖుని దివ్యమంగళ రూపం సుందరవల్లిని  అమితంగా ఆకర్షిస్తుంది . ‘ లత లాంటి తన  దేహం  స్కందుని అల్లుకు పోతే  ఆ దివ్యస్పర్శ  అనిర్వచనీయము కదా ‘!  — ఈ భావన ఆమె మనోభూమిలో బీజమై నాటుకొని చంచల  చిత్త ను గావిస్తుంది . 

అమృతవల్లిని ఆదేశించినట్లు సుందరవల్లిని సైతం షణ్ముఖుడు తపోమార్గం లోనే ముందుకు సాగమంటాడు .   కానీ, ఆమె మనోగతం  గ్రహించిన  అంబ తనయుడు సూచన మాత్రంగానే తన ఉద్దేశ్యం వెల్లడి చేస్తాడు .  సౌంద ర్యాతిశయము గల  సుందరవల్లిది  స్పర్శాజనితమైన సుఖలాలస . పరిపూర్ణ సిద్ధి సాధించుటకు ఆమె కింకా సమయమున్నదని సుబ్రహ్మణ్యుని భావన 

 

 

ఇలా సుబ్రహ్మణ్యుని ఆనతి  మేరకు అమృతవల్లి పవిత్ర మానస సరోవర తీరాన తపస్సమాధి లో  లీనమైపోతుంది . 


సుందరవల్లికి సైతం  సుందరేశ్వరుడి తనయుడు దర్శనమిచ్చాడు .  షణ్ముఖుని దివ్యమంగళ రూపం సుందరవల్లిని  అమితంగా ఆకర్షిస్తుంది . ‘ లత లాంటి తన  దేహం  స్కందుని అల్లుకు పోతే  ఆ దివ్యస్పర్శ  అనిర్వచనీయము కదా ‘!  — ఈ భావన ఆమె మనోభూమిలో బీజమై నాటుకొని చంచల చిట్టాను గావిస్తుంది . 

అమృతవల్లిని ఆదేశించినట్లు సుందరవల్లిని సైతం షణ్ముఖుడు తపోమార్గం లోనే ముందుకు సాగమంటాడు .   కానీ, ఆమె మనోగతం  గ్రహించిన  అంబ తనయుడు సూచనా మాత్రంగానే తన ఉద్దేశ్యం వెల్లడి చేస్తాడు .  సౌంద ర్యాతిశయము గల  సుందరవల్లిది  స్పర్శాజనితమైన సుఖలాలస . పరిపూర్ణ సిద్ధి సాధించుటకు ఆమె కింకా సమయమున్నదని సుబ్రహ్మణ్యుని భావన