అభయ్ ఫెయిల్ అయ్యాడు అని తెలియగానే రాహుల్ కూడా ఎందుకో చాలా బాధపడతాడు. మిగిలిన వారి సంగతి చెప్పనక్కర్లేదు . 
         ఎంతైనా మన తోటి వారు మనలాగే సంతోషంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. వాళ్లకి చిన్న కష్టం వచ్చినా మన కష్టంగానే భావించమని తత్వాలు చాలామందికి ఉంటాయి. 
         ఇన్ని రోజులు వాళ్ళని నవ్విస్తూ .....కష్టాల్ని పంచుకున్న అభయ్ ఒక్కడికి మాత్రమే అలా అవ్వడంతో అందరూ నిరాశగానే ఉన్నారు . దాంతో వాళ్ళ స్థాపించిన ఆర్గనైజేషన్ ని కొన్ని రోజులు నడపకూడదు అని నిర్ణయించుకున్నారు. 
       ఆ మరుసటి రోజు కూడా రాహుల్ నిరాశగానే కాలేజీకి వచ్చాడు. కానీ అమ్మాయిలు చూపు మాత్రం తన నుంచి దూరంగా వెళ్లలేదు . వాళ్ళకి పాస్ హా? ఫెయిలా ? అని కాదు , అబ్బాయి ఎలా ఉన్నాడు అన్నదే ముఖ్యం . 
          ఆ విషయం కొంచెం ఉపశమనం కలిగించిన, మనసు మాత్రం మొండిగా ప్రవర్తిస్తూ ఉంది .
         “ జీవితంలో ఫెయిల్ అవ్వటం అన్నది చాలా మామూలు విషయం . నువ్వు కేవలం ఒక్క పరీక్షలోనే కదా ఫెయిల్ అయింది. ఇంకా రెండు మూడు రోజుల్లో దానికి సప్లమెంటరీలు ఉంటాయి కదా? అవి రాయి....అంత సర్దుకుంటుంది ” అంటూ ఏదో ధైర్యం చెప్పడానికి వచ్చింది అన్వి. 
       కానీ అభయ్ మాత్రం నిశ్శబ్దము పాటించాడు. 
   “ పర్లేదు , నువ్వు చేయగలవు. యు కెన్ డూ థిస్” అంటూ  కళ్ళల్లో తనపైన చాలా ఆత్మవిశ్వాసం కనపడేలా మాట్లాడుతుంది. 
       “ నీకు తెలీదు అన్వి, నాకు చదువు అసలు రాదు . నేను ఎంత చదివినా సరే కచ్చితంగా ఫేల్ అవుతాను ” అంటూ చాలా నీరాశగా మాట్లాడుతూ తన భుజం పైన ఉన్న అన్వి చేతిని చిన్నగా పక్కకి తీసాడు .
           వెళ్ళిపోతున్నా రాహుల్ అక్కడ జరిగే సన్నివేశాన్ని చూసి అర్థం చేసుకున్నాడు . అభయ్కి మాట్లాడటం ఇష్టం లేక అన్వి నుంచి దూరంగా వెళ్ళిపోదామని , లేచి ఒక మూడడుగులు ముందు వేశాడు. 
        వెంటనే తన ఎదురుగా వచ్చిన రాహుల్ భుజం పైన చెయ్యి వేస్తూ , “ కేవలం నీ ఒక్కడి వల్ల అయితే కాదు . మన అందరం కలిసి ప్రయత్నిస్తే ఎందుకు కాదు? ” అన్నాడు సూటిగా చూస్తూ .
    “ అంటే మీరు నాకు సహాయం చేస్తారా? ” అంటూ ఏ మూలనో  చిన్న ఆశ కిరణం వినిపించింది అతని గొంతులో!.
          అవునన్నట్టుగా కళ్ళతోనే సమాధానం చెప్పాడు రాహుల్ . 
         ఆ తర్వాత రెండు రోజులు అభయ్ ని ఆ ఆర్గనైజేషన్లను కూర్చోబెట్టుకొని ....అన్వి, సంజన, డిటెక్టివ్ గీత, రాహుల్ చదివించడానికి విపరీతంగా కృషి చేశారు. కానీ  పురోగతిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు .
        ఇలా అయితే కాదనుకున్న  రాహుల్ క్యూస్షన్ పేపర్ కొట్టేద్దామని ఆరోజు రాత్రి బయలుదేరాడు. 
        కాలేజీ మొత్తం ప్రశాంతంగా ఉంది . అక్కడక్కడ వెలుగుతున్న చిన్న విద్యుత్ దీపాలు మాత్రం ప్రకాశవంతగా కనిపిస్తున్నాయి . అన్ని గదులకి తలుపులు మూసి ఉన్నాయి. 
          అక్కడి వరకు నడుచుకుంటూ వచ్చి, ఒక్క క్షణంలో గబ్బిలంలా మారి గది మొత్తం చూడటం మొదలుపెట్టాడు . 
         అంతకుముందే దానికి ఎవరో చెప్పినట్టుగా గుర్తొచ్చింది . క్వశ్చన్ పేపర్లు అన్ని ఎగ్జామ్ ముందు రోజు వరకు ప్రిన్సిపల్ సార్ రూమ్ లోనే ఉంటాయి అనీ! .
         ఇక ఆలస్యం ఎందుకని సగం తెరిచిన కిటికీలో నుంచి లోపలికి దూకేశాడు రాహుల్. అంతా నిశ్శబ్దంగా ఉంది. 
        రాహుల్ అనుకున్నట్టు అది కేవలం ప్రిన్సిపల్ రూమ్ మాత్రమే కాదు. కంబైన్డ్ రూమ్! 
          అందువల్ల లోపల చటర్జీ గారు నిద్రపోతున్నారు అని రాహుల్ కి తెలియటానికి ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు. కానీ వచ్చిన పని ముఖ్యం కదా బిగిలు అనీ మనుస్సులో అనుకుంటూ నత్తలాంటి నడకతో , చిన్నగా ఒక్కొక్క దాన్ని వెతుకుతూ ఉన్నాడు. 
        “ ఇలా వెతికితే నీకు ఎప్పుటకి దొరుకుతాయి? ఆ బీరువా తెరిచి లోపల ఉన్న చిన్న లాకర్లో చూడు! ” అంటూ వెనక నుండి కాస్త గంభీరమైన శబ్దం వినిపించింది .
       “  నువ్వు ఆగావయ్య బాబు. మళ్ళీ ప్రిన్సిపాల్ చూస్తే ఇక్కడ గొడవ అవుతుంది”  అని  అంటూ చిన్నగా ఆ బీరువా దగ్గరికి వెళ్ళాడు. 
         ఆ బీరువా తీరుద్దామని చేయి పెట్టగానే , “ అవును! ఇక్కడ నేనొక్కడినే కదా ఉన్నాను. మరి మాటలు ఏక్కడ నుండి వచ్చాయి? ” అంటూ చిన్నగా తల తిప్పి చూసాడు. 
            చేతిలో మెన్షన్ హౌస్ మందు బాటిల్ పట్టుకొని , ఒక చిన్న గ్లాస్ తో టేబుల్ పైన ఉన్న కూల్ డ్రింక్ వైపు చూస్తూ కూర్చున్నాడు చటర్జీ !.
         ఆయనను చూడగానే తెలియకుండా ఒక క్షణం తను చేస్తున్న తప్పు అన్నట్టుగా భయంగా బిత్తర చూపులు చూడటం మొదలుపెట్టాడు రాహుల్. 
    “ అదేంటి ప్రభు! నేను మిమ్మల్ని చూసి భయపడాలి . మీరేంటి నన్ను చూసి భయపడుతున్నారు? ” అన్నాడు చిన్నగా నవ్వుతూ. 
   “ అవును అది కూడా నిజమే . ఈ మనుషులతో ఉండి నేను కూడా ఒక మనిషిలా ప్రవర్తించడం మొదలుపెట్టాను”  అని తల కొట్టుకుంటూ, వెళ్లి అతని పక్కన కూర్చున్నాడు .
          " నేను అది ..........???" అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న రాహుల్ ని  ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని చటర్జీ; “  మీకు ఏది కావాలన్నా తీసుకొని వెళ్లొచ్చు”  అంటూ స్వాగతం పలికాడు. 
       “ నాకు ఏమీ వద్దు . కేవలం పాస్ అయ్యేలాగా ఒక ఐదు క్వశ్చన్ లు చెప్పండి . అభయ్ చాలా నిరాశగా ఉన్నాడు . అతన్ని అలా చూస్తూ ఉంటే నాకు కూడా మనసు ఉండబట్టడం లేదు” అన్నాడు వినయంగా .
      ఏం చేస్తాము అవసరం  మనది కాబట్టి , తగ్గడంలో తప్పులేదు. 
    “ అయ్యో మీరు భలే వారే? ” అంటూ బీరువా తెరిచి అందులోని ఒక క్యూస్షన్ పేపర్ ని రాహుల్ చేతిలో పెట్టాడు .
   “ అవును మీరు ఇంత అర్ధరాత్రి పూట పడుకోకుండా ......ఈ మందు తాగుతున్నారు ఏంటి? ” 
    “ కొన్ని విషయాలు మర్చిపోవాలంటే , ఇది తప్పదు మరి !” అన్నాడు చిన్న చిరునవ్వు చిందిస్తూ. తరువాత మందు గొంతులో నింపాడు. ఆయన ఏకాంతానికి భంగం కలిగించకుండా......తను వచ్చిన పని విజయవంతం అవ్వడంతో మారు మాట్లాడకుండా గబ్బిలంలా మారి ఎగురుతూ వెళ్లిపోయాడు రాహుల్. 
         ఇక రూమ్ కి వెళ్ళిన తర్వాత అదేపనిగా తను చూసిన ఆ కొషన్లకి ఆన్సర్లు నేర్పించే పనిలో పడ్డాడు. క్వశ్చన్ తక్కువ అవడంతో అభయ్ కూడా చాలా శ్రద్ధగా నేర్చుకున్నాడు. 
         చూస్తూనే తేల్లవారింది. అతను సప్లిమెంటరీ ఎగ్జామ్ కి రాయడానికి వెళుతూ ఉంటే, అదేదో అమ్మోరు జాతరకి బలిచ్చే మేకలాగా.......ప్రసాదం, కుంకుమ పెట్టారు మన లేడీ ఫ్రెండ్స్. 
         తన అవతారాన్ని చూసిన రాహుల్ పడి పడి నవ్వుకున్నాడు . రాహుల్ ని చూడగానే మొఖం చిట్లిస్తూ.......ముఖం కడుక్కొని మరీ వెళ్ళిపోయాడు అభయ్. 
      సమయం గడిస్తోంది . పరీక్ష సమయం ముగింసేసరికి అభయ్  సంతోషంగా బయటికి వచ్చాడు . 
     బయటికి రావడంతోనే “ నేను చాలా బాగా రాసాను పరీక్ష తెలుసా ? ” అంటూ రాహుల్ని కౌగిలించుకున్నాడు . 
       అలా వాళ్ళిద్దరి కౌగిలించుకోగానే ఏదో చిన్న విద్యుత్ షాక్ తగిలినట్టుగా ఇద్దరి శరీరాలు కంపించాయి. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత మాట్లాడుతూ మాటల మధ్యలో అడిగేసాడు. 
  “  అయినా అదే ప్రశ్నలు వస్తాయి మీకెలా తెలుసు? ” అంటూ ఆశ్చర్యంగా! 
     “ ఎగ్జామ్ కి నేను అవే చదివాను. అందుకే నీకు ఇలా చెప్పాను ” అంటూ అసలు నిజాన్ని దాచేశాడు రాహుల్ . 
       అభయ్ పరీక్షల విషయంలో, రాహుల్ సహాయం చేయడంతో వాళ్ళిద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. 
#####
        అన్వి వాళ్ల కాలేజీలో ఫ్రెండ్స్ ఇచ్చిన సహాయనితో పెద్దపెద్ద వాళ్లు కూడా గొడవలు పడ్డప్పుడు, అక్కడికి వచ్చేవాళ్ళు. 
         ఆ పవిత్ర వృక్షాల కారణంగా వాళ్ళు ఆ బాధలన్నీ మర్చిపోయి, సంతోషంగా కలిసిపోయేవారు. అలా ఒక్కొక్కరిగా రావడంతో వాళ్ల ఆర్గనైజేషన్ చాలా ఫేమస్ అయిపోతుంది . 
      దాంతో ఆ కంపెనీని అన్వి పేరు పైన రిజిస్ట్రేషన్ చేయిస్తారు. అందులో షేర్లు హోల్డర్స్ గా వీళ్లు కూడా ఉంటారు. 
#####
        అన్ని మంచి విషయాలు జరగడంతో రాహుల్ చాలా సంతోషంగా  అర్ధరాత్రి రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నాడు . తనకి ఏదో వింతగా శబ్దాలు వినిపించడం మొదలుపెట్టాయి. 
         ఒక్క క్షణం తన ముఖం పైన ఉన్న చిరునవ్వు కాస్త మాయం అయ్యి ఒక సీరియస్ లుక్ తో అటుగా చూశాడు . అది ఒక ట్రంప్ యాడ్. 
         అందులో ఆర్తనాదాలు మరియు మూలుగులు వినిపిస్తున్నాయి. రాహుల్ తనొక్కడే ఉండటం వల్ల అటుగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 
       తను అడుగులు అటువైపు పడటం మొదలవగానే , ఆ శబ్దం మరింత గట్టిగా వినిపిస్తుంది. తన ఎదురుగా పడేసిన ఒక పెద్ద చెత్త కుప్ప  కనిపించింది. దాని వెనుక నుంచి ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి. 
        నెమ్మదిగా అడుకులు ....వెనక వైపుకు వెళ్లాయి. తన కంటి ముందు కనిపిస్తున్న దృశ్యానికి ఒక్క క్షణం కడుపులో దేవేసింది రాహుల్ కి! 
       బ్రతికున్న ఒక మనిషినీ, దాదాపు మృగంలా ఉన్న ఒక్క రాక్షసి చంపకు తింటుంది . వాడి పొట్టని సగానికి కొరికేసి ......అందులో ఉన్న పేగులను ఒక్కొక్కటి చేతుల్లో పట్టుకుని .....నలుపుతూ, లోపల ఉన్నా రక్తాన్ని  తాగుతుంది .
        చేతి వేళ్ళకి చుట్టుకున్న ఆ పేగులు చిక్కుముడిలాగా శరీరం నుండి పైకి తేలుతున్న సరే, నా ఆకలి తీరడమే ముఖ్యమైనంతగా ప్రవర్తిస్తుంది .
     మనిషి ఇంకా బ్రతికే ఉండటంతో , ఆ నొప్పిని తాళలేక గట్టిగా అరుస్తూ తప్పించుకోవడానికి  పోరాడుతున్నాడు. 
   “ విడుంబిక.........” అంటూ గట్టిగా అరిచాడు రాహుల్ .
          తనని పిలుస్తున్నారు అన్నంత కోపంతో ఒక్కసారిగా తలతిప్పి చూసింది. కళ్ళు పూర్తిగా ఎరుపు రంగులో ఉన్నాయి . శరీరం అంత పీక్కుపోయి తనో జాంబీలా తయారయింది. 
         ఒక్క క్షణం కోపంగా చూసిన అది, మళ్లీ తిండం మొదలు పెట్టింది. 
   “ నీ ప్రభువు మాటని  నువ్వు అతిక్రమిస్తావా? ” అంటూ  కోపంగా ట్రాకులాగా మారాడు రాహుల్. 
             తన చేతుల నుండి ఒక మెరిసే జ్వాల ప్రత్యక్షమై విడుంబిక పై విరుచుకుపడింది .దెబ్బకి దూరంగా ఎగిరి పడింది .
          పరుగు పరుగున ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన రాహుల్ , ఆ వ్యక్తి ఇక బ్రతికే స్థితిలో లేడని అర్థమై ప్రశాంతమైన చావు కోసం వెంటనే తలను కోరికేశాడు. 
         నోటికి అంటుకున్న  రక్తాన్ని నాలుకతో చప్పరిస్తూ , కోపంగా దాని వైపు చూశాడు. 
         అప్పటిదాకా ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తించిన విడుంబిక ; “ ప్రభూ........” అంటూ చివరి శ్వాసగా దగ్గరగా పిలుస్తుంది .
           ఇదేంటి ఇలా ప్రవర్తిస్తుంది అంటూ పరుగు పరుగున దాని దగ్గరికి వెళ్ళాడు .
   “ మీరు తొందరగా మన రాజ్యానికి వెళ్ళండి ......” అంటూ తడబడుతున్న మాటలతో అక్కడే అది మరణించింది. 
         నేను ప్రయోగించిన శక్తి చాలా తక్కువది. అయినా కూడా ఎందుకిలా చనిపోయింది . తను చాలా శక్తివంతురాలు. అసలు ఏం జరుగుతుంది? అంటూ ఒక్క క్షణంలో  అక్కడినుండి ఆ మనిషి శరీరం........ఇంకా విడంబక శరీరాన్ని తీసుకొని గాల్లో మాయమయ్యాడు రాహుల్!. 
                ———   *****   ———