YOUR THE ONE - 06 in Telugu Fiction Stories by Chaithanya books and stories PDF | జతగా నాతో నిన్నే - 06

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

జతగా నాతో నిన్నే - 06












“ మీరు ఒక్క మాట చెప్తే నేనే వచ్చేవాడిని కదా! మీకు ఇక్కడ పని ఏంటి యువ రాజా ” అంటూ వినయంగా అడిగాడు .


ఏం లేదు .నాన్నగారు ఒక పని అప్పచెప్పారు. అందుకే వచ్చాను .ఇంతకీ ఈ అమ్మాయి ఏ క్లాసులో చదువుతుందో నీకు తెలుసా? అంటూ తన చేతిలోని ఫోటోని చూపించాడు .


“ హో తనా? తెలుసు . తను సెకండ్ ఇయర్ సైన్స్ గ్రూపులో చదువుతుంది .తన పేరు అన్వేషణ. కుటుంబం గురించి ఎప్పుడూ చెప్పదు. ఇంకా ఆ అమ్మాయి చూడ్డానికి ” అంటూ ఏదో చెప్పబోతున్న అతని ఆపేయి అన్నట్టు చెయ్ చూపించాడు.


“ నాకు అమ్మాయితోనే పని ఉంది. నన్ను ఆ అమ్మాయి గదిలో వదిలిపెట్టండి ” అంటూ ఆర్డర్ వేస్తున్నట్టుగా చెప్పి బయటికి నడిచాడు .


తన వెనకే నడిచిన ప్రిన్సిపాల్ ,అప్పటికే క్లాస్ స్టార్ట్ అవ్వడంతో నేరుగా ఆ అబ్బాయిని లోపలికి పంపి వెళ్ళిపోయాడు. విచిత్రంగా ఆ అబ్బాయి కూడా వెళ్లి అన్వి పక్కనే కూర్చున్నాడు . అదంతా చూస్తున్న క్లాస్ అమ్మాయిలకి పిచ్చి పట్టినట్టు అయింది.


వాళ్ళ దృష్టిలో హీరోలా ఉన్న ఇద్దరికీ ఏ మాయ చేసి తను ,తన పక్కన కూర్చోబెట్టుకుందో, వాళ్లకు అర్థం కాలేదు.


ఆ తర్వాత ఇద్దరు ఏమీ మాట్లాడుకోలేదు. కానీ తను మాత్రం అమ్మాయి వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. నెమ్మదిగా మాటలు కలపడానికి ప్రయత్నించింది అన్వి.

“ చాలా థాంక్స్ అండి .ఆ రోజు యాక్సిడెంట్ నుండి కాపాడారు . ఈరోజు అతడి నుంచి కూడా కాపాడారు” అంటూ కాస్త తడబడుతూనే చెప్పింది .


ఆ మాటలను అసలేం పట్టించుకోకుండా తన వైపు ఒకసారి చూస్తాడు. అప్పటికే ఏడ్చి ఏడ్చి అలసిన కళ్ళతో అతడు తనపై కప్పిన, ఆ షర్టును వేసుకొని....దాన్ని గట్టిగా పట్టుకుంటూ.....ఇంకా భయంగానే కనిపించింది .


దాంతో ఆ అబ్బాయి మాట్లాడకుండా నోట్ బుక్ లో ఏదో రాస్తూ ఉన్నాడు. మరొకసారి తనతో మాట్లాడాలని ప్రయత్నించింది .మళ్ళీ నిరాశనే ఎదురు అయింది అన్వికీ.


పేరుకి తను తన పక్కనే కూర్చున్న, ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది .తర్వాత భూషణ్ గారు లెక్చర్ చెప్పడానికి వచ్చినప్పుడు తెలిసింది అతడి పేరు రాహుల్ అని! ఆరోజు అతని గురించి ఆ ఒక్క విషయం తప్ప మరేది తెలియలేదు .


సాయంత్రం గ్రౌండ్లో అభిషేక్ తన క్లాస్మేట్స్ ఇంకా తనకి తెలిసిన రౌడీలందరినీ ,రాహుల్ ని కొట్టడానికి ఉంచాడు .అదంతా తెలుసుకున్న అన్వి చాలా భయపడుతూనే రాహుల్ ని హెచ్చరిద్దాం అన్నట్టుగా చెప్పడం మొదలు పెట్టింది.


“ చూడండి. మీరు ఏమైనా అనుకోండి .కానీ అభిషేక్ చాలా డబ్బు కలిగిన వ్యక్తి . మీరు నా కోసం వచ్చి ఈ ప్రాబ్లం లో చిక్కుకున్నారు.మిమ్మల్ని కొట్టడానికి చాలామందితో గ్రౌండ్లో సిద్ధంగా ఉన్నాడు. కాలేజ్ అవ్వగానే మీరు మాతోపాటు వచ్చేయండి. మిమ్మల్ని ఎవరికి కనపడకుండా మేము తీసుకొని వెళ్ళిపోతాం ” అంటూ జాలిగా చెప్పింది.


ఆ మాటలు వినగానే ,వెంటనే తన బ్యాగ్ తీసుకొని పైకి లేచాడు . అన్వి చేయి పట్టుకొని బయటికి తీసుకుని వచ్చాడు రాహుల్ .


అదేంటో ఏ అబ్బాయితో మాట్లాడాలన్నా భయపడే అన్వి, అతడు చెయ్యి పట్టుకొని తీసుకేలుతుంటే , కుక్కపిల్లల తన వెంట వెళ్ళిపోయింది .తను నేరుగా గ్రౌండ్ లోకి వెళ్ళాడు.


అప్పటికే చాలామంది రాహుల్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో ఒకడు కోపంగా , “ ఏంట్రా నువ్వు, బతకాలని ఆశ లేదా ? నీకు ఎంత ధైర్యం ఉంటే మావాడుతోనే పెట్టుకుంటావు? ”అంటూ రాడ్లు తీసుకుని పరిగెత్తుకుంటూ కొట్టడానికి వచ్చాడు .


రాహుల్ అన్వికి తన బ్యాగ్ ఇచ్చి, వస్తున్న వాళ్ల వైపు వేగంగా పరిగెత్తాడు .అదంతా చూస్తున్న అభిషేకి ఫ్యూజ్ ఎగిరిపోయాయి. “ ఎవరైనా చంపడానికి వస్తుంటే పారిపోతారు .వీడేంటి తెగించినట్టుగా ఇలా వస్తున్నాడు .చాలా డేంజర్ గా ఉన్నాడు ” మనసులోనే భయపడుతూ, చుట్టూ ఇంత మంది ఉన్నారు కదా నాకేం అవుతుంది అనే ధైర్యంతో అలాగే చూస్తూ ఉన్నాడు.


ముందుగా వచ్చిన ఒక రౌడీని అమాంతం గాల్లో లేపి ఎదురుగా వస్తున్న అయిదుగురు రౌడీలపైకి విసిరేశాడు. ఆ దెబ్బకి అందరూ బోర్లా బొక్క పడ్డారు. అప్పుడే వేగంగా తన పైకి వస్తున్న ఒక రాడ్ని చేత్తో పట్టుకొని ,మరో రౌడి కాళ్ళకి వేసి కొట్టాడు .


వాడు కూయ్యే....మోర్రో అంటూ అరూస్తూ, తన కాలనీ పట్టుకొని అక్కడే పడిపోయాడు .ఇదంతా చూస్తున్న ఇంకొకడు కత్తితో రాహుల్ ని పొడవడానికి వచ్చాడు .వెంటనే పక్కకు తప్పుకొని ,అతడి చేతితో అతనికి కడుపులోనే పొడిచాడు. దెబ్బకి రక్తం బయటకొచ్చింది. వాడు వాడి రక్తాన్ని చూసుకొని భయంతో అలాగే పడిపోయాడు.


అదంత చూసిన స్టూడెంట్స్ భయంతో అభిని కాపాడటం మానేసి పరిగెత్తడం మొదలుపెట్టారు. “ రేయ్ మీరంతా నా ఫ్రెండ్స్ రా! అలా వదిలేసి వెళ్ళిపోతారు ఏంట్రా ?” అంటూ భయపడుతూ వాళ్ళని ఆపడానికి ట్రై చేశాడు .కానీ వాళ్ళు అప్పటికే సగం దూరం పరిగెత్తి వెళ్ళిపోయారు .



తను కూడా పారిపోవడానికి కదిలాడు. రాహుల్ ఒక్క గెంతులో ఎగిరే ముఖం పైన గట్టి పంచ్ ఇచ్చాడు. ఆ దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మినట్టు అలాగే కింద పడిపోయాడు అభిషేక్ .


“ ఇంకోసారి ఆ అమ్మాయి జోలికి కానీ, నా జోలికి కానీ వస్తే ఏం చేస్తానో తెలుసనుకుంటా?” అంటూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి, అన్వి దగ్గరికి వచ్చాడు .


అప్పటిదాకా జరుగుతున్నది నమ్మలేనట్టుగా కళ్ళు రెండు పెద్దవి చేసి నోరు తెరుచుకొని చూస్తూ ఉంది అన్వేషణ. మొదటిసారి ,తనని రెండు ప్రమాదాల నుంచి ఒక వ్యక్తి కాపాడటం .


ఆ వ్యక్తికి సరిగ్గా తను ఎవరో కూడా తెలియదు. కానీ తన కోసం ఇంత రిస్క్ చేస్తున్నాడు అనే ఊహ రాగానే మనసంతా గాలిలో తేలినట్టు అనిపించింది.



నెమ్మదిగా తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లిపోయాడు రాహుల్ .


అప్పటిదాకా దూరం నుంచి చూస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ భయంగా తనని చేరుకొని నీకేం కాలేదు కదా! అయినా వాడేంటి అలా కొట్టేసాడు అందరిని అంటూ కంగారుగా అడిగింది గీత.


“ నాకైతే లైఫ్ లో మొదటిసారి ఒక యాక్షన్ మూవీ లైవ్లో చూసినట్టు అనిపించింది ” అంటూ తన కళ్ళను తానే నమ్మలేనట్టుగా చెప్పింది సంజన .



సాయంత్రం వేళలో సూర్యుడు అస్తమిస్తున్న ఆ క్షణాన, వెలుగు అతడి పైన పడింది. తన నీడ ఒక సైనికుడిగా అమాంతం పెరిగింది. సూర్యకాంతి కారణంగా అతడు అసలైన హీరోల ప్రకాశించాడు.



అటూగా వెళుతున్న రాహుల్ వైపే ముగ్గురు చూస్తూ ఉండిపోయారు.



——— ***** ———