YOUR THE ONE - 05 in Telugu Fiction Stories by Chaithanya books and stories PDF | జతగా నాతో నిన్నే - 05

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

జతగా నాతో నిన్నే - 05














నెమ్మదిగా కారుచీకట్లు అన్ని తొలగిపోయి వేకువ కిరణాలు అందరిని నిద్రలేపాయి. ప్రశాంతంగా పడుకున్న అన్వి ఫోన్ లోని రింగ్టోన్ , “ హేయ్ .....డూమ్ ....డూమ్...డా...ఏ ...ఏయ్ ...ఏ ” అంటూ శబ్దం చేస్తూ అందర్నీ నిద్రలేపేసింది.


“ అబ్బా ఏంటి? కాసేపు పడుకున్న తర్వాత నన్ను లేపొచ్చుగా! ఎదవ గోల వేసుకుని ఆ ఫోను ఒకటి ” అంటూ కసిరినట్టుగా అరిచి మళ్లీ పడుకుంది సంజన.

“ చాలు చాల్లే ! మళ్ళీ లేట్ అయిందని ఏడుస్తావు. టైం కి మనల్ని నిద్ర లేపుతున్న ఈ ఒక్క ఫోన్ నన్న జాగ్రత్తగా చూసుకుందాం ” అంటూ పగిలిపోయిన స్క్రీన్కి ఒక మూడు రబ్బర్ బ్యాండ్ లేసి మరి వాడుతుంది అన్వి.


“ థాంక్స్ రా బుజ్జి ,టైం కి లేపావు ” అంటూ ముందు దానికి గుడ్ మార్నింగ్ చెప్పి బాత్రూంలోకి దూరింది .


తను పూర్తిగా రెడీ అయిన తర్వాత వచ్చి మన డిటెక్టివ్ గీతను లేపింది .తను కూడా బద్ధకంగానే వెళ్లి రెడీ అయి వచ్చింది. ఇక చివరిగా అత్యంత బద్ధకస్తురాలైన మన యాంకర్ సంజన వెళ్లి రెడీ అయి వచ్చింది .

ఆ హాస్టల్లో పెట్టే ఫుడ్డుని పరమాన్నంగా తినేసి మళ్లీ కాలేజీకి ప్రయాణమయ్యారు. కాలేజీ ఎంట్రన్స్ లోకి వెళ్ళగానే , “ ఈరోజు కచ్చితంగా ఆ అబ్బాయి రాకూడదు .ఆ అభయ్ గాడి వల్ల అంతా గొడవలే ” అంటూ తిట్టుకుంటూ దేవుని బలంగా కోరుకుంది అన్వి.

“ అవును దేవుడా ! కాస్త దీని మొరాలకించి ఈ రోజు రానివ్వకు ” అంటూ జాలిగా పైకి చూస్తూనే యాంకర్ సంజన అడిగింది .


“ ఏంటే వెటకారంగా ఉందా? ” అంటూ చూపు ఇటు తిప్పి కన్నింగ్గా చూసింది.


లేదు చాలా సీరియస్ అంటూ ఒక కన్ను పైకెత్తి వింతగా చూసింది. వీళ్ళిద్దరి సంభాషణ ఇలా జరుగుతూ ఉంటే , “ మీరు ఇలాగే చేస్తూ ఉండండి. మళ్లీ మనం మన క్లాస్ అమ్మాయిలకు దొరికితే చిత్తు చిత్తుగా కొడతారు ” అంటూ భయపెడుతూ ముందుకు నడిచింది మన డిటెక్టివ్ గీత .


అమ్మె....వాళ్లకి దొరికితే అంతే ! త్వరగా వెళ్ళిపోదాం అంటూ వాళ్ళ క్లాస్ లోకి వచ్చి కూర్చున్నారు .


అప్పటికే తన ప్లేసుని ఎవరో కబ్జా చేసేసారు. ఎందుకంటే ముందు రోజు ఆ అబ్బాయి అక్కడే కూర్చున్నాడు .అందుకే ఒక అమ్మాయి అక్కడ కూర్చుంది. ఇక చేసేది ఏమీ లేక వాళ్లకోసం ముందు రెండు బెంచీలు ఖాళీగా ఉంటే అక్కడ కూర్చున్నారు.


దాంతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు సార్ ముందే కూర్చున్నారు . వాళ్లు కూర్చున్న ప్లేస్ కి పక్కనే కిటికీ ఉంది .సార్ లేకపోవడంతో వాళ్ళు ముగ్గురు పిచ్చపాటి కబుర్లు చెప్పుకుంటూ ఆ కిటికీలోంచి బయట చూస్తూ నవ్వుకుంటున్నారు.


ఇంతలో అక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు. అతని నుదురు చాలా విశాలంగా, ఒక నార్మల్ వ్యక్తి లాగా టీ షర్ట్ పైన షర్ట్ వేసుకొని వాటికున్న చొక్కా బోత్తలు అన్ని తీసేసి, పాయింట్ జోబులో చేతులు పెట్టుకొని తన భుజం నుంచి నడుము దాకా క్రాస్ గా ఉండే ఒక బ్యాగ్ ని కట్టుక్కొని వాళ్లకి కనిపించాడు.


అతని చూపుల్లో ఉన్న కనుపాప ఎరుపు రంగులో ఉంది .అది మూడో అంతస్తుల కూర్చున్న వీరికి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది .తన చేతికి వేలాడుతున్న బ్రాస్లైట్ అతడికి మొత్తం శరీరానికి అందం తీసుకొచ్చింది .


వీళ్ళ ముగ్గురు సైలెంట్ అయిపోయి ఆ అబ్బాయి వైపే చూస్తూ ఉన్నారు .అప్రయత్నంగానే , “నన్ను కాపాడింది తనే ” అంటూ తనవైపే చూస్తూ చెప్పింది అన్వి.


ఆ మాటలకి గీత ఇంకా సంజన ప్రొఫెషనల్ లాగా ఒకరు క్యూస్షన్, ఇంకొకరు ఆధారము వెతుకుతున్నట్టుగా తనని ఇరికాటంలో పెట్టారు .ఇక తప్పదు అన్నట్టుగా మొత్తం వివరించింది .


“ ఇదేం బాగోలేదు. తను నీకు అంత పెద్ద హెల్ప్ చేస్తే నువ్వు కనీసం థాంక్స్ కూడా చెప్పలేదు ” అంటూ కోపంగా అరిచింది డిటెక్టివ్స్ గీత .

అంత హ్యాండ్సం అబ్బాయికి థాంక్స్ కూడా చెప్పాలనిపించలేదా నీకు? కఠినాత్మురాల అంటూ శపాలు పెట్టింది సంజన.


“ ఈ అబ్బాయి మన కాలేజీలో ఏం చేస్తున్నాడు ” అని అడగాల్సింది పోయి పిచ్చి పిచ్చి క్వశ్చన్ లు అన్ని వేస్తారేంటి ? కోపంగా చూస్తూ చెప్పింది అన్వి.


అవును కదా అని అందరూ మళ్లీ కిటికీలోంచి అబ్బాయి వైపు చూడడం మొదలుపెట్టారు .


ఇంతలో క్లాసులోకి వచ్చిన ఒక సీనియర్ అన్వి చేయి పట్టుకొని బలవంతంగా , “ నిన్ను అభిషేక్ పిలుస్తున్నాడు రా ” అంటూ ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు .


“ నేనేం చేశాను సీనియర్ ,ఏదైనా చేస్తే క్షమించండి! ” అంటూ అతని చేతిలో నుంచి తప్పించుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది .కానీ ఒక్కటి కూడా ఫలించలేదు. నేరుగా అభిషేకం ముందు నిలబెట్టాడు.


కిటికీలో నుంచి భయంతో చూస్తున్న వీళ్ళిద్దరూ వాళ్ళ వెనకే పరిగెత్తుకుంటూ వచ్చారు .


“ ఏంటి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ లాస్యని ఏదో ఇబ్బంది పెట్టావంట .నిన్న పారిపోయావు అంట కదా? ” అంటూ దగ్గరగా వచ్చి తన భుజంపై చేతులు వేస్తూ అన్నాడు.


అతని చేతులు తగలగానే కంపరంగా ఫీల్ అవుతూ అట్నుంచి తప్పించుకుంటూ, “ అదేం లేదు సీనియర్ .నేను అసలు ఏం చేయలేదు ” అంటూ ఏదో చెప్పబోతున్న అన్వి మాటలు ఆపేశాడు.

నెమ్మదిగా అన్వి దగ్గరగా వచ్చి, తన చుట్టూ చిన్నగా తిరుగుతూ తన చేతిలోని కత్తితో భుజాలపై ఉన్న డ్రెస్ ని అక్కడక్కడ కోసేసాడు.

చినిగిన డ్రాస్ ని తన చేతితో బలంగా లాగి పక్కకు పడేసాడు. కత్తిని అన్వి మెడ పై పెడుతూ, చిన్నగా దానిని రుద్దుతూ, ఇంకా ఇంకా భయపెడుతున్నాడు.


అన్వికి ఏం చేయాలో అర్థం కాక చూట్టూ చూసింది. తనకి సహాయం చేయడానికి ఒక్కరు కూడా లేరు .తన ఊపిరి భారంగా మారుతుంది .అందరి ముందు ఒక అమ్మాయి అనీ చూడకుండా అవమానిస్తున్న తన్ని ,చంపి పగ తీర్చుకోవాలని ఉంది. కానీ ఏమీ చేయలేని నిస్సయిరాలుగా మారింది.


“ అవునా! అయితే నా గర్ల్ ఫ్రెండ్ తప్పు చేసిందని చెప్తావన్నమాట ” అంటూ కోపంగా చంప పైన పీకడానికి చెయ్యి పైకి ఎత్తాడు. ఇంతలో అభిని అడ్డుకుంటూ ఒక అబ్బాయి వచ్చి నిలబడ్డాడు .


ఆ వ్యక్తి రావడంతోనే తన షర్టు తీసి అన్వికి కప్పాడు . ఊహించిన సంఘటనకి అతనిని చూస్తూ ఉండిపోయింది . అప్పుడు చూసింది అతని ముఖం వైపు, అతడు ఏమి మాట్లాడలేదు .కానీ అతని కళ్ళు సమాధానం పరుస్తున్నాయి.


తను చూపులో “ నీకేం కాదు. నేనున్నాను....” అని ధైర్యం చెబుతున్నట్టు అనిపించింది .అప్పటికే కన్నీళ్లతో నిండిపోయిన తన కళ్ళు ,వాటి ఆరాటాన్ని ఆ వ్యక్తి వైపు మళ్ళించాయి.


అన్విని తన వెనుకగా జరుపుతూ అభిషేక్ వైపు కోపంగా చూశాడు.


చాలా డబ్బున్న అభిషేక్ మామూలుగానే తను ర్యాగింగ్ చేస్తాడు .అదేం పట్టించుకోని ఆ అబ్బాయి అభి చేతిని ఒక గడ్డి పోచలగా పోల్చి చేత్తో పక్కకి విసిరాడు.


ఊహించినటువంటి ఆ పరిణామానికి చూస్తున్న వీళ్ళు ఆశ్చర్యపోయారు . ఆ పరిస్థితుల్లో ఉన్న అభిషేక్ ,అతని గ్యాంగ్ కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడే అటుగా వస్తున్న కొంతమంది అమ్మాయిలు ఈ సంఘటనన్ని చూసి విస్తూ పోయారు. ఎందుకంటే తనని ఎదిరించి ఇప్పటివరకు సంతోషంగా ఎవ్వరు లేరు .అలాంటిది కొత్తగా ఇప్పుడే కనిపించిన ఒక వ్యక్తి అలా ప్రవర్తించడంతో ఆశ్చర్యంగా అతన్ని గమనిస్తున్నారు .

“ చూడు బాస్.... అమ్మాయిలపై చేయి చేసుకోవడం తప్పు”.

నువ్వు ఏవడ్రా నీతులు చెప్పడానికి?.

“ తప్పుని తప్పు అని చెప్పడానికి కూడా ఒక స్టేటస్ ఉండాలా బాస్ ” అన్నాడు నవ్వుతూ.

చాలా ఎక్కువగా చేస్తున్నావు రా అంటూ మీదికి రాబోయడు.


ఇంతలో అభిషేక్ అతడిని తోయడంతో కిందపడ్డాడు. దాన్ని అవమానంగా భావించి మళ్లీ పైకి లేచి తనని కొట్టడానికి వెళ్ళాడు అభిషేక్ .


అలాంటిది ఏదో చేస్తాడని ముందే ఊహించిన ఆ వ్యక్తి పాకెట్ నుంచి ఒక చెయ్యి తీసి తన ప్రతి కదలికను ఒక్క చేతను అడ్డుకొని మళ్లీ తోసేసాడు. తనే బాక్సింగ్ లో ఛాంపియన్ అని వెర్రిగా ఉండే అభిషేక్ అతడు ఒక్క చేత్తో , అంత బలంగా కొట్టడంతో ఆశ్చర్యపోయి నొప్పిని పంటి బిగువకి పట్టుకున్నాడు.


“ రేయ్ నువ్వు ఎవడైనా సరే ,ఈరోజు సాయంత్రం కల్లా నువ్వు నా చేతిలో చస్తావు ” అంటూ వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి తన బ్యాచ్ తో వెళ్ళిపోయాడు. అదంతా చూసిన అమ్మాయిలకి అతడు ఒక హీరో అయిపోయాడు .

అతను మాత్రం చలించకుండా ఒకసారి అన్వి వైపు చూశాడు . తను థ్యాంక్స్ అని చెబుదామనుకునే లోపు పట్టించుకోకుండా ముందుకు నడిచాడు .అన్వి మాత్రం ఒక ఆరాధన భావంతో అతడి వైపే చూస్తూ ఉండిపోయింది .గీత ఇంకా సంజన తనని క్లాస్ కి తీసుకొని వెళ్ళిపోయారు.



అప్పటికే నిన్న వచ్చిన ఒక వ్యక్తికి సగం మంది అమ్మాయిలు పడిపోయారు. ఇక ఆ అబ్బాయిని కాదని ఈ అబ్బాయికి లైన్ వేయడం స్టార్ట్ చేశారు.



వాళ్ల చూపులు పట్టించుకోకుండా డైరెక్ట్ గా ప్రిన్సిపాల్ ఛాంబర్ లోకి వెళ్ళాడు ఆ అబ్బాయి. ఊహించని రీతిలో తన ఎదురుగా ఒక అబ్బాయి నిలబడటంతో ఆశ్చర్యపోయిన ప్రిన్సిపాల్, వెంటనే తేరుకొని తన సీట్లో కూర్చొమని భయపడుతూ అన్నాడు.



——— ***** ———