Secret… - 3 in Telugu Motivational Stories by Madhu books and stories PDF | రహస్యం.. - 3

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

రహస్యం.. - 3

2. 🌹రహస్యం తేటపరచబడింది🌹
(Part -1)


మైకెల్ బెర్నార్డ్ బెక్ విత్:--- మనం జీవిస్తున్న ఈ విశ్వంలో భూమ్యాక్షణ సిద్దాంతం లాంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి.... మీరు ఒక భవనం మీద నుంచి కింద పడితే మీరు మంచివారా? చెడ్డవారా? అనేది లెక్కలోకి రాదు... మీరు నేల మీద పడతారు... సిద్ధాంతం అనేది ఒక ప్రకృతి నియమం ... భూమ్యాకర్షణ సిద్ధాంతం ఎంత నిష్పక్షపాతమైనదో ,వ్యక్తి ప్రమేయం లేనిదో ఇది అంతే ...అది కచ్చితం అయినది, నిర్దిష్టమైనది....

డాక్టర్ జో విటాల్ :----ఈ క్షణంలో మీ జీవితంలో మీ చుట్టూ ఉన్నదంతా మీరు వేటి గురించి ఫిర్యాదు చేస్తున్నారు ...వాటితో సహా మీరు ఆకర్షించినవే... మొదటిసారి ఈ మాట విన్నప్పుడు అది మీకు నచ్చకపోవచ్చు. అని నాకు తెలుసు... మీరు వెంటనే నేనా కారు ప్రమాదాన్ని ఆకర్షించలేదే ?నన్ను ముప్పు తిప్పలు పెట్టే ఈ వినియోగదారునీ నేను ఆకర్షించలేదే? నేను కావాలని అప్పుని అంగీకరించలేదే? అంటారు అయినా నేను మీ మొహంలోకి చూసి అవును మీరే ఆకర్షించారు అంటాను... అన్నిటి కన్నా అర్థం చేసుకోవటానికి కష్టమైన భావనలలో ఇది కూడా ఒకటి ...కానీ ఒకసారి దీన్ని మీరు ఒప్పుకోగలిగితే అది జీవితాన్నే మార్చేస్తుంది. ..తరచూ అందరూ రహస్యంలోని భాగాన్ని విన్నప్పుడు వీళ్ళకి వేలు ప్రాణాలని పోగొట్టుకున్న వాళ్ల గురించి చరిత్రలో తాము విన్న వాటిని గుర్తు తెచ్చుకుంటారు ....అన్ని వేలమంది ఆ సంఘటనలకి తమని తాము ఆకర్షించుకున్నారని విషయాన్ని వాళ్లు అర్థం చేసుకోలేరు.... ఆకర్షణ సిద్ధాంతం దృష్ట్యా వాళ్ళు ఆ సంఘటన తాలూకు ఫ్రీక్వెన్సీ తో సమానంగా ఉండి ఉండాలి... అంటే వాళ్ళందరూ తప్పకుండా ఆ సంఘటన గురించే ఆలోచించారని అర్థం కాదు.... కానీ వాళ్ళ ఆలోచనల ఫ్రీక్వెన్సీ ,సంఘటన ఫ్రీక్వెన్సీ కి సమానంగా ఉన్నాయి.... మనుషులు తాము ఉండకూడని చోట, ఉండకూడని సమయంలో ,ఉన్నామని అనుకుంటే బాహ్య పరిస్థితుల మీద వాళ్ళకి ఎటువంటి అదుపు లేనట్లయితే ,భయం విడిపోవడం, అసంతత అని ఆలోచనలు విడవకుండా మనసులోకి వస్తూ ఉంటే, వాళ్లని ఉండకూడని చోటికి, ఉండకూడని సమయంలో ఆకర్షిస్తాయి .....

మీ కు ఈ క్షణాన ఎంచుకునే అవకాశం ఉంది... జీవితం ఒక లాటరీ లాంటిదని మీకు ఎప్పుడైనా చెడు జరగవచ్చని, మీరు నమ్మాలని అనుకుంటున్నారా ?మీరు ఉండకూడని చోట ,ఉండకూడని సమయంలో ఉండవచ్చని నమ్మాలని అనుకుంటున్నారా? పరిస్థితులు మీ ఆధీనంలో ఉండవని అనుకుంటున్నారా? లేక మీ జీవితాను భావాలు మీ చేతిలోనే ఉన్నాయని ,మీరు మంచి గురించి ఆలోచిస్తారో కాబట్టి మీకు జీవితంలో అంతా మంచే జరుగుతుందని నమ్మాలని, ఆ సంగతి మీకు తెలుసని అనుకుంటున్నారా ?మీకు ఎంచుకునే విసులుబాటుంది... మీరు ఏ విషయాలని ఆలోచించాలని ఎంచుకుంటారు? అదే మీ జీవితం తాలూకు అనుభవాలు అవుతాయి....

ఎడతెగనిఆలోచనలతో మీరు రమ్మని పిలిస్తే గాని ఏది మీ అనుభవంలోకి రాదు.....



బాబ్ డయల్:----మనలో చాలామంది అప్రయత్నంగా ఆకర్షించుకుంటాం? దానిమీద మనకి అదుపులేనే లేదని అనుకుంటాం.... మన ఆలోచనలు ,భావాలు వాటి అంతటవే కలుగుతూ ఉంటాయి.... అందుచేత మన జీవితంలో సంభవించేవన్నీ అప్రయత్నం గానే, జరుగుతాయి... ఎవరూ కూడా అక్కర్లేని వాటిని ,కావాలని తమకేసి ఆకర్షించుకోరు... రహస్యం తెలుసుకున్నాక మీ జీవితంలో కానీ, ఇతరుల జీవితాల్లో కానీ ,అక్కర్లేని సంఘటనలు ఎలా జరిగాయో సులభంగా అర్థం చేసుకోవచ్చు ....మన ఆలోచనలకు ఉన్న గొప్ప సృజనాత్మక శక్తి గురించి అవగాహన లేకపోవడం వల్లే ఇవన్నీ జరిగాయి....



డాక్టర్ జో విటాల్ :---ఒకవేళ దీన్ని వినటం మీకు మొదటిసారి అయితే మీరు ఇలా అనుకుంటారు ..."ఓ నేను నా ఆలోచనల మీద నిఘా ఉంచాలన్నమాట? అదే అది... చాలా పెద్ద పని ముందు మీ కద అనిపిస్తుంది... కానీ అక్కడే అసలు మజా మొదలవుతుంది ....మజా అయినా విషయం ఏమిటంటే రహస్యానికి చాలా దగ్గర దారులు ఉన్నాయి ...మీకు అన్నిటికన్నా బాగా పనికొచ్చే దగ్గర దారిని మీరు ఎంచుకోవటానికి అవకాశం ఉంటుంది .....చదువుతూ పొండి అది ఎలాగో మీకు అర్థమవుతుంది.....


మార్సీ షిమోష్:--- (రచయిత అంతర్జాతీయ వక్త, ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్)
మన మనసులోకి వచ్చే ప్రతి ఆలోచన మీద నిఘా ఉంచటం అనేది అసంభవం....మనకి రోజుకి 60 వేల ఆలోచనలు వస్తాయని, పరిశోధకులు అంటారు... ఈ 60 వేల ఆలోచనల మీద అదుపు ఉంచాలంటే మీరు ఎంతగా అలసిపోతారో ఊహించగలరా? అదృష్టవశాత్తు దానికి ఒక అవకాశం ఉంది ...అవే మన భావాలు ....మన భావాలు మనం ఏం ఆలోచిస్తున్నామో మనకి తెలియజేస్తాయి... భావాల ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ....మీ జీవితాన్ని సృష్టించుకునేందుకు సహాయపడే పరికరాలలో మీ భావాలే అన్నిటికైనా మెరుగైనవి ...మీ ఆలోచనలే అన్నిటికీ మూల కారణం.... ఈ ప్రపంచంలో మీరు చూసే అనుభవించే మిగతాదంతా ఆ కారణం తాలూకు ప్రభావమే... వాటిలో మీ భావాలు కూడా ఒక భాగమే... కారణం మటుకు ఎప్పుడు మీ ఆలోచనలే.....




బాబ్ డయల్:----మనం ఆలోచించేది ఏమిటో తెలియజేయగల ఆశ్చర్యకరమైన వరం మన బాగోదురేఖాలు మీ భావాలు చాలా త్వరగా మీరే ఆలోచిస్తున్నారు మీకు తెలియజేస్తాయి మీ భావాలు ఒక్కసారిగా తలకిందులైన సందర్భాలని గుర్తు చేసుకోండి చెడు వార్త విన్నప్పుడు ఒక్కోసారి అలా జరుగుతుంది మీ కడుపులో నరాలు వెంటనే వెలితిప్పి నట్లు అవుతాయి అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారో దాన్ని నేను వెంటనే సూచించేవి మీ భావాలు మీ భావాలు ఎలా ఉన్నాయని దాన్ని మీరు జాగరుకతతో గ్రహించాలనుకుంటారు మీ భావాలతో మమేకం అవ్వాలనుకుంటారు ఎందుకంటే మీ ఆలోచనలు ఏమిటో తెలుసుకునేందుకు అదే అన్నిటికైనా శీఘ్ర మార్గం


లీసా ని కోల్స్:--- మీ దగ్గర రెండు రకాల భావాలు ఉంటాయి... మంచి భావాలు ,చెడు భావాలు... ఒక రకమైనవి మీకు బాగా అనిపిస్తే ,రెండో రకం వి బాగున్నట్లు అనిపించవు... అందువల్లే మీరు రెండిటికీ తేడా తెలుసుకోగలుగుతారు ...నిస్పృహ, కోపం ,కసి, అపరాధభావం ఇవి మీకు అధికారం ఇచ్చే భావాలుగా కనిపించవు.... అవి చెడు భావాలు ....మీకు బాగా అనిపిస్తోందా ?అనిపించడం లేదా అనే విషయం ఎవరూ చెప్పలేరు... ఎందుకంటే ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి భావం కలుగుతోందని చెప్పగలిగింది మీరు ఒక్కరే... ఒకవేళ మీకు ఎలా అనిపిస్తోందో తెలియటం లేదనిపించినప్పుడు, నాకు ఎలా అనిపిస్తుంది అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ....రోజులో ఎన్నిసార్లు అయినా మీరు ఆగి ఈ ప్రశ్న వేసుకోవచ్చు...
అలా చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తోందనేది మీరు మరింత స్పష్టంగా తెలుసుకుంటారు ....


అన్నిటికన్నా ముఖ్యంగా మీకు తెలియవలసింది ఏమిటంటే ,ఒకే సమయంలో మంచి ఆలోచనలు చేస్తూ ,చెడు భావాలకి లోను కావటం అసంభవం .. అది నియమోల్లంఘనే అవుతుంది.... ఎందుకంటే మీ ఆలోచనలే భావాలని కలిగిస్తాయి... మీకు బాధగా అనిపిస్తుందంటే మీరు బాధ కలిగించి ఆలోచనలే చేస్తున్నారన్నమాట.... మీ ఆలోచనలే మీ ఫ్రీక్వెన్సీని నిర్ధారిస్తాయి... మీ భావాలు మీరే ఫ్రీక్వెన్సీ లో ఉన్నారో వెంటనే తెలియజేస్తాయి.... మీకు బాధ కలిగినప్పుడు మీరు ఉన్న ఫ్రీక్వెన్సీ మరిన్ని చెడు విషయాలని ఆకర్షిస్తుంది.... ఆకర్షణ సిద్ధాంతం తప్పక ప్రతిస్పందించి, మీకు మరిన్ని చెడు విషయాల్ని ప్రసారం చేసి మీకు మరింత బాధ కలిగిస్తుంది....

మీకు బాధ కలిగినప్పుడు ఆ బాధని తగ్గించుకునేందుకు, మీరు మీ ఆలోచనలని మార్చుకునేందుకు ,ఎటువంటి ప్రయత్నం చేయనట్లయితే," నాకు మరింత బాధ కలిగించే పరిస్థితులని మరిన్ని తీసుకురండి.



లీసా నికోల్స్:---- దీనికి మరో పార్శ్వం, మీలో మంచి భావోద్రేకాలు, భావాలు ఉన్నాయి ...అవి ఎప్పుడు బయటికి వస్తాయో మీకు తెలుసు... ఎందుకంటే అప్పుడు మీకు సంతోషంగా ఉంటుంది... ఉత్సాహం, ఉల్లాసం ,కృతజ్ఞతా ,ప్రేమ, ప్రతిరోజు ఇటువంటి భావాలే కలగటం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించి చూడండి.... మీరు ఈ మంచి భావాలని పండగలా జరుపుకుంటే, మరిన్ని మంచి భావాలని మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాలని మీ వైపుకి ఆకర్షించుకుంటారు.....



బాబ్ డయల్:----అది నిజంగా చాలా సులభం ..."నేను ఈ క్షణంలో దేని ఆకర్షిస్తున్నాను" ఊ.. మీకెలా అనిపిస్తోంది... నాకు ఆనందంగా ఉంది ..అయితే మంచిదే... అలాగే కొనసాగించండి...


ఒకపక్క ఆనందంగా ఉంటూ, అదే సమయంలో వ్యతిరేకత గల ఆలోచనలు చేయటం అసంభవం... మీరు ఆనందంగా ఉన్నారంటే మీరు మంచి ఆలోచనలు చేస్తున్నారన్నమాట ...చూడండి! మీరు జీవితంలో ఏది కావాలనుకుంటే అది పొందవచ్చు... దానికి హద్దు అంటూ ఏదీ లేదు ...కానీ ఒక చిక్కుముడి మాత్రం ఉంది.... మీరు సంతోషంగా ఉండాలి దాన్ని గురించి ఆలోచిస్తే మీకు జీవితంలో కావలసినది అదేనని అనిపించడం లేదు..... ఈ సిద్ధాంతం నిర్దిష్టమైనది అనటానికి ఎటువంటి సందేహము లేదు.....


మార్సి షిమోష్:---- మీరు సంతోషంగా ఉన్నట్లయితే ,మీ కోరికలకి అనుగుణంగా ఉన్న భవిష్యత్తునే మీరు నిర్ణయించుకుంటున్నారన్నమాట .....అదే మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ,మీ కోరికలకి అనుగుణంగా లేని భవిష్యత్తుని నిర్ణయించుకుంటున్నారని అర్థం ...మీరు మీ రోజు వారి పనులు చేసుకుంటూ ఉన్నంతసేపు ఆకర్షణ సిద్ధాంతం అనుక్షణం పనిచేస్తూనే ఉంటుంది ...మనం ఆలోచించే ప్రతిదీ భావాల రూపంలో, అనుభవించే ప్రతిదీ మన భవిష్యత్తుని సృష్టిస్తోంది ...మీకు ఆందోళనతోనో, భయంగానో ఉన్నప్పుడు రోజంతా మీకు అలాంటి బావాలే మీ జీవితంలోకి తెచ్చుకుంటున్నారని, అనుకోవాలి ...మీకు సంతోషంగా ఉన్నప్పుడు మీరు మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలి.... మీరు సరైన దారిలోనే ఉన్నారు ...ఒక బలమైన ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తున్నారు... అది మరిన్ని మంచి విషయాలని మీ వైపుకి ఆకర్షించటం వల్ల మీరు మరింత సంతోషాన్ని అనుభవిస్తారు... మీరు ఆనందంగా ఉన్న క్షణాలని సొంతం చేసుకోండి ....వాటి నుంచి లాభం పొందండి... మీరు సంతోషంగా ఉండటం వల్ల మరిన్ని మంచి విషయాలని బలంగా ఆకర్షిస్తున్నారన్న, విషయాన్ని తెలుసుకోండి
... రండి మరో అడుగు ముందుకు పోదాం! మీ భావాల రూపంలో మీరేం ఆలోచిస్తున్నారన్న సందేశాన్ని ఈ విశ్వం మీకు అనిపించటం గాని చేయటం లేదు కదా!!!




🌹ధన్యవాదములు 🌹