Human trafficking and clearing the debt.. - 2 in Telugu Short Stories by Madhu books and stories PDF | మానవ అక్రమ రవాణా మరియు రుణం తీర్చుకోవడం.. - 2

The Author
Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

మానవ అక్రమ రవాణా మరియు రుణం తీర్చుకోవడం.. - 2




Chapter----2


ఆ మాఫియాలకు మా నాన్న సమాధానం చెబుతాడా ???అనిఎదురుచూస్తూ ఉంటే నా హృదయం మెలికలు తిరిగిపోయింది....అమ్మలేను అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు...???నేను భయంతో నిలబడి చూస్తున్నాను...నా గుండె వేగంగా కొట్టుకుంటుంది... నా కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి ...మద్యానికి బానిస అయిన నా తండ్రి చేసిన తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి.....



మా నాన్న ముఖం భావరహితంగా ఉంది....అతని కళ్ళలో ఆప్యాయతలను వెతకాలి అని నేను తీవ్రంగా ప్రయత్నించాను...కానీ అది మరుగున సూదిని వెతికినట్లు ఉంది... అతను గోళ్ళు కొరుకుతూ ఏదో ఆలోచిస్తూ తన ప్రాణాన్ని కాపాడుకోవాలా? లేక కూతురి జీవితాన్ని నాశనం చేయాలా? అని ఆలోచిస్తున్నాడు...అతని ఒక్క నిర్ణయం నా జీవితాన్నే మార్చేస్తుంది... క్షణం నిశ్శబ్ధం తర్వాత మరియు ప్రతిపాదనను జాగ్రత్తగా పరిశీలించి అతను మాట్లాడినాడు ....


సరే ఆమెను తీసుకుని వెళ్లి ఆమె ను ఏమైనా చేసుకోండి.... కానీ నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి... అని అన్నాడు మా నాన్న.... అతని కళ్ళలో కాస్తంత కూడా పశ్చాత్తాపము లేదు......నేను నోరు తెరుచుకుని మా నాన్న నీ అలానే చూస్తూ వుండిపోయాను ...అతను తన జీవితం కోసం సొంత బలి ఇస్తున్నాడు...అతను ఇంతలా దిగజారిపోతాడు... అని నేను కలలో కూడా ఊహించలేదు.... అతన్ని ఇంక జీవితంలో క్షమించను,అతడు చెడ్డ వాడు అని తెలిసినా కూడా నేను చేరదీసి చాలా తప్పు చేశాను....అతను పూర్తిగా కాలి నుండి తల వరకు చెడిపోయాడు ...



లేదు....నేను మాంసం ముక్కలాగా అమ్ముడుపోవడాన్ని నిరాకరిస్తున్నాను.....నువ్వు అసలు మనిషి కాదు, క్రూర మృగానివి నువ్వు చచ్చిపోయిన బాగుండేది... అని అరిచాను... అందుకు అతను నీకు నాతో మాట్లాడడానికి ఎంత ధైర్యం అని నన్ను కొట్టాడు ....


స్వార్థపరురాలా ?మీ తండ్రి ప్రాణాలను కాపాడలేవా !అని అతను నా మీద అరుస్తూనే ఉన్నాడు....నేను స్వార్థపరురాలినా??? అందరూ నిన్ను విడిచి పెట్టినప్పుడు నీకు తోడుగా ఎవరు ఉన్నారో గుర్తు చేయాలా????రోజు నన్ను కొట్టినా కూడా నేను నీతోనే ఉన్నాను... నీ ఆకలి తీర్చడం కోసం నేను ఎన్నో రోజులు ఆకలితో ఉండిపోయాను...కానీ ఈరోజు నీలాంటి సాతానికి ఇచ్చిన భక్తికి నన్ను నేను ద్వేషించుకుంటున్నాను ....
మా నాన్న నన్ను కొట్టడానికి చేతులు ఎత్తాడు,ఆ నల్ల వ్యక్తి మా నాన్న నీ నెట్టి వేశాడు ...ఆమెను ముట్టుకోవద్దు.. అని మా నాన్నను హెచ్చరించాడు....


అప్పుడు అతను "అలీసియా "నువ్వు వర్జినా అని అడిగాడు కామంతో.....అవన్నీ ఎందుకు అడుగుతున్నారు మీరు , అయినా నేను మీతో రావడం లేదు,మా నాన్న చేసిన అప్పు కోసం నేను రావడానికి సిద్దంగా లేను అన్నాను,నా కళ్ళలో కన్నీళ్లు నిండిపోయాయి...


ష్!!! ఏడవకు నీ మొకం అందంగా కనిపించడం లేదు...నేను నిన్ను ఒక సాధారణ ప్రశ్న అడిగినాను ...నువ్వు సమాధానం చెప్పగలవా???అంటూ అతడు నన్ను పట్టుకోడానికి ప్రయత్నించాడు... నేను అతడి చేతులను గట్టిగా కొరికేశాను...నా గదిలోనికి పరిగెత్తాను... నేను సహాయం కోసం అరుస్తూ వేడుకున్నాను.... నన్ను ఎవరూ రక్షించలేరని నాకు అర్థం అయింది.... మా ఇల్లు కూడా ఊరి చివరలో ఉంది ,మా ఇంటి దగ్గర ఇల్లు కూడా లేవు...


అతడు నా గదిని తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ...నాకు ఏమి చేయాలో అర్థం కాక లోపల నుంచి డోర్ ని లాక్ చేశాను....నా కృతజ్ఞతలు లేని తండ్రి డూప్లికేట్ తాళాలతో డోర్ తలుపులు తెరిచాడు...ఒక బిడ్డకు ప్రాణం పోసిన వ్యక్తి ,ఆ బిడ్డకే ఎలా అన్యాయం చేస్తాడు...





దయచేసి నన్ను వెళ్ళనివ్వండి ....అని నల్లవాడిని వేడుకున్నాను..ప్రతి అమ్మాయి ఎందుకు దయనీయంగా ప్రవర్తించాలి......

నా ప్రశ్నకు ఎందుకు సమాధానం ఇవ్వలేదు... చూడు నేను నీకు అవకాశం ఇస్తున్నాను... నా ప్రశ్నకి సమాధానం నువ్వు చెప్తావా ?లేకపోతే నన్ను తనిఖీ చేసి తెలుసుకోమంటావా? అని నన్ను బెదిరించాడు...నువ్వు మంచిగా చెబితే వినేలా కనిపించడం లేదు కాబట్టి నేనే రంగంలోకి వెళ్తాను అన్నాడు....




తన భారీ చేతులతో నన్ను పైకి ఎత్తుకున్నాడు... నేను అతని చేతులను గట్టిగా కొరికానును... నా గోళ్ళతో బలవంతంగా అతని ముఖం మీద రక్తం వచ్చేలా గా గోళ్ళతో గాయం చేశాను... నేను భయంతో పారిపోసాగాను,ఆమెను పట్టుకోండి ....అని అవతలి వాళ్ళకి ఆదేషించాడు... మా నాన్న మరియు అతని భాగస్వామి ఇద్దరూ నా చేతులు మరియు కాళ్ళను పట్టుకున్నారు....



నేను మానభంగానికి గురి అవుతున్నాను, మరియు మా తండ్రి నా శారీరక వేధింపులలో పాలు పంచుకుంటున్నాడు.. ఈ రెండింటిలో ఏది బాధాకరమైనదొ తేల్చుకోలేక పోతున్నాను.... అతడు అతని భాగస్వామి సహాయంతో నాకు ఏదో మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు,నా కళ్ళు మసక బారినట్లు ఉన్నాయి ....కానీ నేను మెలుకువ లోనే ,నాకు తీవ్రమైన తలనొప్పితో మెలుకువ వచ్చింది... అంతా మసక మసక గా ఉంది,నాకు ఏమి గుర్తు రావడం లేదు,మా నాన్న తలుపులు తీయడం ,కొందరు వ్యక్తులు లోపలికి రావడం గుర్తుకు వచ్చింది,ఆ తర్వాత ఏమి జరిగిందో కూడా తెలియడం లేదు... ఒక యువతి అరుపు నాకు వినిపించింది...నేను ఎక్కడ ఉన్నాను... అని అడిగాను....ఆ అమ్మాయి నీకు ఏమీ గుర్తు లేదు కదా,అంటూ నా పక్కన వచ్చి వాలింది...నాకు చాలా తల నొప్పిగా ఉంది,ఏమీ మాట్లాడాలి అనిపించడం లేదు అన్నాను... అందుకు ఆమె అది వాళ్ళు నీ శరీరంలో నింపిన మందు వల్ల అయి ఉండవచ్చు అన్నది...ఏం మందు అని అడిగాను.....




నాకు ఒక్కొక్కటిగా అన్ని గుర్తుకు వచ్చాయి... నేను శారీరక వేదింపులకు గురి అయ్యానని,అందుకు మా తండ్రి కూడా గుర్తు వచ్చింది,...నేను ఒక గదిలో బంధింపబడ్డాను బయటకు వెళ్లడానికి మార్గం కూడా లేదు ..........




🌹 Please fallow for next episodes
Thanks for reading🙏🙏🙏