Premaprayanam - 3 in Telugu Love Stories by Surya Prakash books and stories PDF | ప్రేమ ప్రయాణం - 3

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ప్రేమ ప్రయాణం - 3

సంధ్య ప్రణయ్ ఒకే ఏరియా నుండి వచ్చేవాళ్ళు వాళ్ళ పరిచయం కొన్నాళ్లకే ప్రేమగా మారింది. ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా తిరిగేవారు.

నేను, సూర్య ,వర్ష ఒకే ఏరియా నుండి వచ్చేవాళ్ళం. వర్ష అందరితోకన్నా సూర్య తో ఎక్కువగా చనువుగా ఉండేది. ఎందుకంటే వర్ష డిగ్రీ లో జాయిన్ అవ్వక ముందు టైప్ ఇన్స్టిట్యూషన్లో సూర్య పరిచయమయ్యాడు. వర్ష వలనే సూర్య డిగ్రీ జాయిన్ అయ్యాడు. సూర్య జాయిన్ అవుతూ నన్ను కూడా జాయిన్ చేసాడు అందువల్ల వర్ష కు సూర్య అంటే మంచి అభిప్రాయం.

వర్షిత మాత్రం కొంచెం దూరం నుండి వచ్చేది. తాను వర్ష వాళ్ల ఇంటికి వచ్చేది అక్కడ నుండి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం
వర్షిత అందరితోనూ చనువుగా మాట్లాడేది. అందువలనేమో వర్షితని నరేష్ ఇష్టపడ్డాడు. కాని ఈ విషయాన్ని సూర్య ఒక్కడి తోనే చెప్పాడు నరేష్ .తనతో ఎప్పటికప్పుడు మాట్లాడాలని ఎదురు చూసేవాడు. కానీ తాను మాత్రం ఏదో కారణాలు చెప్తూ తప్పించుకొనేది.

అది అర్ధం కాక నరేష్ నాతొ చెప్పుకొని బాధపడేవాడు. అయితే సూర్య ఈ విషయాన్ని వర్ష, సంధ్య లతో చెప్పాడు. వాళ్ళు నరేష్ బాధని అర్ధం చేసుకుని తనకు సహాయపడాలనుకొన్నారు. చివరకీ వర్షిత తో ఈ విషయాన్ని చెప్పారు . కానీ తన మనస్సులోని వేరే అతను ఉన్నడని నరేష్ ని ఒక స్నేహితుడులనే చూశానని చెప్పింది.

ఈ సంగతి వర్ష, సంధ్య సూర్యకి చెప్పారు. సూర్యకి ఎం చెప్పాలో తెలియలేదు. నరేష్ మొదట ఒక అమ్మాయిని ప్రేమించి విఫలమయ్యాడు మళ్ళీ ఇప్పుడు అదేపరిస్తితి ఏంచేయాలో తెలియలేదు.

నరేష్ కి వర్షిత చెప్పిన సంగతి చెప్పకుండా తనకి వేరేవిధంగా సూర్య చెప్పాడు. వర్శితకి చదువు చాలా ముఖ్యమని చదువు పూర్తి అయిన తరువాత తన ప్రేమగురించి చెప్తానని అంతవరకు తనని ఇబ్బంది పెట్టవద్దని చెప్పిందని సూర్య తన ప్రేమని చదువు మీదకు మార్చేలా ప్రయత్నించాడు. మొదట్లో నరేష్ బాధపడినా తన అభిప్రాయానికి కాదనలేక ఒప్పుకున్నాడు మొదటి సంవత్సరం పూర్తి ఐయింది. రెండవ సంవత్సరంలోకి మేము వచ్చాము.

కానీ నరేష్ ని ప్రేమనుండి మార్చే టైమ్ మధ్యలో నేను (సూర్య) ప్రేమలో పడ్డాను. ఆమె ఎవరో కాదు వర్ష వర్షకి ప్రేమ అన్నా ప్రేమికులన్నా చాలా ఇష్టం అని చెప్పేది అయితే విషయాన్ని ఎలా చెప్పాలో తెలియలేదు. ఎందుకంటే నరేష్ ప్రేమ విషయంలో ఎదుర్కున్న అనుభవాలు నన్ను చెప్పకుండా అపాయి.

వర్షిత మాత్రం కొంచెం కొంచెం గా మా స్నేహం నుండి వీడిపోతుండేది. ఎందుకంటే తాను వేరొక అబ్బాయిని ఇష్టపడింది అందువల్ల దూరమైంది. అది మాకు మొదట్లో అర్ధం కాలేదు ఒక సారి వర్ష నేను బుక్ షాప్ కి వెళ్తుండగా వర్షిత అబ్బాయితో వెళ్లడం చూసాము. ఆ మరుసటి రెండు రోజులూ తాను ట్యూషన్కి రాలేదు. ఏమైందని నేను ,వర్ష వర్షిత వాళ్ళ ఇంటికి వెల్లి అడుగగా తాను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నసాని అతనినే పెళ్లి చూసుకొంటానని ఇంట్లొచి వెళ్ళిపోయి ప్రేమ పెళ్లి చేసుకొందని తెలిసింది. అది వాళ్లకు ఇష్టంలేదని తాను ఇంట్లొచి వెళ్ళిపోయింది అని చెప్పారు. మాకు ఒక్కసారిగా చాలా భయం మరియు భాద రెండూ వచ్చాయి. ఈ సంగతి నరేష్ కి ఎలా చెప్పాలో తెలియలేదు.

మేము ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ నిజం నరేష్ కి తెలిసింది. అయితే నరేష్ భాద పడినా మేము తన గురించి పడుతున్న బాధను చూసి వాళ్ళు నాగురించేగా నాతో అబద్దం చెప్పారు అని తన బాధని దిగమింగుకొన్నాడు.

నరేష్ ఆలోచించి నా లాంటి పరిస్థితి వర్షకి , సూర్యకి రాకూడదని సూర్యకు తెలియకుండా సంద్యని వర్షతో సూర్యమీద అభిప్రాయం తెలుసుకున్నాడు. అయితే సంధ్య మాత్రం ఈ విషయాన్ని సూర్యకి చెప్పి వాళ్ల ఇద్దరిని గుడి రమ్మని చెప్పింది. మా ఫ్రెండ్స్ అందరం గుడికి వెళ్ళాము అక్కడ వర్ష నిర్ణయం మీద సూర్య జీవితం ఆధారపడివుంది
( సూర్య జీవితం ఎటువంటి మలుపు తిరిగిందో వర్ష తన ప్రేమను అంగీకరించిందో లేక తిరస్కరించిందో ప్రేమ ప్రయాణం 1 అనే రచనను చూడగలరు )

మొత్తానికి నరేష్ ప్రేమ విఫలమై తన చదువుని మానేసి తనకు నచ్చిన ఫోటోగ్రఫీని వదిలి చిన్న ఉద్యోగం చేసుకొంటూ పవిత్ర అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని తన గత జీవితాన్ని మర్చిపోలేక ప్రస్తుత జీవితాన్ని సంతోషంగా గడపటానికి ప్రయత్నిస్తున్నాడు.

ఇందులో మీకు నరేష్ , వర్షిత ల ప్రేమ మరియు
సూర్య , వర్ష ల ప్రేమ ఎటువంటి మలుపు తిరిగాయో మీకు తెలుసు.

కానీ ఇక్కడ ఇంకొక ప్రేమ జంట మిగిలి పోయింది.

ఎవరో తెలుసా సంధ్య, ప్రణయ్

త్వరలో మీముందుకు రాబోతుంది మారోక జంట ప్రేమ గాధ sandya ప్రణయ్ ల ప్రేమ గాధ willl l comeee sooo ooo oo oon .. ...........?