Aruna Chandra - 2 in Telugu Moral Stories by BVD Prasadarao books and stories PDF | అరుణ చంద్ర - 2

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

అరుణ చంద్ర - 2

రచయిత : బివిడి ప్రసాదరావు

ఎపిసోడ్ 2

తమ గదిలో, మంచం మీద కుదుట పడి, పక్కనున్న కృష్ణమూర్తితో, "ఉదయం అరుణకు విసెస్ చెప్పి, నాతో మా అన్నయ్య మాట్లాడేడు" అని చెప్పింది లక్ష్మి.
"ఏమైనా విషయం ఉందా" అని అడిగాడు కృష్ణమూర్తి.
"మాటల్లో చెప్పాను, అరుణకు ఈ యేడాది పెళ్లి చేయాలనుకుంటున్నామని. దానికి అప్పటి మీ మాటలు దొర్లించి నొచ్చుకున్నాడు. మరోసారి మీరు ఆలోచిస్తే బాగుంటుందన్నాడు" అని చెప్పింది లక్ష్మి.
"వద్దు లక్ష్మీ. నాకు మేనరికాలు నచ్చవు. కనుకనేగా మా అమ్మాయి కోసం వేచి ఉండక, ఆయన కొడుకుకు బయట సంబంధాలు చూసుకోమని చెప్పింది. అదే ఉద్దేశ్యం ఉంటే, మా అక్క తన కొడుకుకు మన అమ్మాయిని ఇమ్మనమని, మన అమ్మాయి పుట్టినప్పుడే అడిగేసి ఉంది. అప్పుడే నేను కాదనేశానుగా." అని చెప్పాడు కృష్ణమూర్తి, కాస్తా చికాగ్గా.
లక్ష్మి ఏమీ మాట్లాడలేదు.
కొంతసేపు తర్వాత, లక్ష్మే, "నిద్రపోతున్నారా" అని అంది.
"లేదులే చెప్పు" అన్నాడు కృష్ణమూర్తి.
"అమ్మాయి ఆఫీసులోని ఆ అబ్బాయేనే కాదు, మరి కొందరబ్బాయిలునూ చూద్దామండీ" అని చెప్పింది లక్ష్మి.
"తప్పక లక్ష్మి. అందుకేగా మనకు తెలిసిన ఆ పెళ్లి సంబంధాల మధ్యవర్తిని మనల్ని వెంటనే కలవమని ఫోన్ చేసి చెప్పాను" అని చెప్పాడు కృష్ణమూర్తి.
ఆ పిమ్మట వాళ్ళ మధ్య మాటలు లేవు, కొద్ది నిముషాలపాటు.
ఆ తర్వాత, కృష్ణమూర్తి, ''నిద్ర వస్తోంది. గుడ్నైట్" అని అన్నాడు.
"ఉ. గుడ్నైట్" అని అనేసింది లక్ష్మి కూడా.


***


అలారం మోతతో నిద్ర లేచాడు కృష్ణమూర్తి.
ఆ మోతను కట్ చేసి, లక్ష్మిని లేపాడు.
"లేస్తున్నాను, గుడ్మోర్నింగ్" అంటూనే లేచి కూర్చుంది లక్ష్మి.
"గుడ్మోర్నింగ్" అన్నాడు కృష్ణమూర్తి.
ఆ తర్వాత, ఆ దంపతులిద్దరూ, రిప్రెసై తమ ఇంటి చుట్టూ ఉన్న చెట్ల మధ్యకు నడిచారు, మోర్నింగ్వాక్కై.
అలా వారు 60 నిముషాలు పాటు, మౌనంగా, మధ్యస్థ వడితో, తమ ఇంటి చుట్టూ, అక్కడి చెట్లు నీడన నడుస్తారు, నియమంగా, ప్రతి రోజు.
అప్పుడే అక్కడ వారికి ఎదురైన అరుణ, "గుడ్మోర్నింగ్, గుడ్మోర్నింగ్" అంది.
"నైస్మోర్నింగ్తల్లీ" అన్నాడు కృష్ణమూర్తి.
"గుడ్మోర్నింగ్" అంది లక్ష్మి.
అప్పటికే అక్కడ ఒక రౌండ్ నడక పూర్తి చేసేసింది అరుణ, తన మోర్నింగ్వాక్లో.


***

ఆ ముగ్గురూ, మోర్నింగ్వాక్లు కానిచ్చి, లాన్లో, కుర్చీల్లో కూర్చున్నారు, సదాలానే.
అప్పటికే ఆ ఇంటికి వచ్చిన పని వారు, తమ తమ పనుల్లోకి వెళ్లిపోయారు.
ఒక పని వాడు వాళ్ల వద్దకు వచ్చాడు. మూడు వాటర్ బాటిల్స్ను వారి మధ్య ఉన్న టీపాయ్ మీద పెట్టాడు. ఆ రోజు దిన పత్రికనూ ఆ పక్కనే పెట్టి, వాడు నిల్చున్నాడు.
"రామూ, దోశెలు, కొబ్బరి చట్నీ చేయించు మాకు. మీ నలుగురుకూ ఇడ్లీలు దించుకోండి. వీళ్లిద్దరి హాట్ కేరియర్స్లో టమోటా రైస్, ముద్ద కొబ్బరి చెట్నీ, ఉడికించిన తొక్క వలవని చెరో ఎగ్ పెట్టించు" అని చెప్పింది లక్ష్మి.
అప్పుడు వాడు వెళ్ళిపోయాడు, ఆ ఇంట్లోకి.


***

దోశెలు తిని, కాఫీలు తాగుతున్నారు ఆ ముగ్గురు.
డైనింగ్టేబుల్ ముందు ఉన్నారు వారు.
అప్పుడే లక్ష్మి ఫోన్ మోగింది.
లక్ష్మి అటుకు ఫోన్ కలిపి, మాట్లాడి, పిమ్మట ఆ ఫోన్ కాల్ కట్ చేసి, "మా అన్నయ్య బయలుదేరాడట. రాత్రికి మన ఇంటికి చేరుకుంటాడు. మీతో మరోమారు మాట్లాడతాడట" చెప్పింది లక్ష్మి, పొడిపొడిగా, భర్తతో.
"సర్లే. ఆయన ప్రయత్నం వృధే అవుతోంది. ప్చ్. అర్ధం కాడు" అంటూనే, అరుణతో, "తల్లీ నా కారు సాయంకాలంకి తెచ్చి ఇస్తానని మెకానిక్ చెప్పాడు. ఈ రోజుకు నీ కారు ఇవ్వరా నాకు. నువ్వు నీ స్కూటీ మీద వెళ్లు ప్లీజ్" అని అన్నాడు కృష్ణమూర్తి.
అరుణ కూడా లేచి, "డన్. తాళం ఇస్తాను" అంటూనే తన గది వైపు నడిచింది.
"రామూ" అంది లక్ష్మి.
వాడు వచ్చాడు అక్కడకు.
"లంచ్కు పప్పూ టమోటా, బంగాళదుంప ముద్ద కర్రీ, రైస్, పెరుగు చేయించు మిగిలిన మనకు" అని చెప్పింది లక్ష్మి.
వాడు వెళ్లి పోయాడు.


***

డిన్నర్ ఐటమ్స్ను డైనింగ్టేబుల్ మీద సర్దేసి, వాళ్ల వంటకాలును తినేసి, పనివారు వెళ్లిపోయారు, లక్ష్మి అలా చెప్పగా.
కృష్ణమూర్తి, ఊరు నుండి వచ్చిన లక్ష్మి అన్నయ్య సుబ్బారావు, లక్ష్మి డ్రాయింగ్రూంలో మాట్లాడుకుంటున్నారు.
అరుణ తన రూంలో టివి చూస్తోంది.
"ఇద్దరు అమ్మాయిలుకు పెళ్లిళ్లు చేసిన తర్వాత, ఆర్ధికంగా మా ప్రస్తుత స్థితి బాగా క్షీణించింది. ఒక్కగాని ఒక కొడుకు. నా పాట్లు వాడు పడకూడదు. వాడి భవిష్యత్తు కోసమే మళ్లీ అడుగుతున్నాను బావగారు. మీరు పరాయివాళ్లు కాదు కనుకనే ఇలా బయలు పడుతున్నాను" చెప్పాడు సుబ్బారావు, కృష్ణమూర్తితో.
"బాగుంది సుబ్బారావు. నిన్ను అర్ధం చేసుకుంటున్నాను. కానీ, నాకు మేనరికం ఇష్టం కాదు. అందుకే కాదంటున్నాను. మీరు మరోలా అనుకో వద్దు. మీ వాడి భవిష్యత్తే మీ ఆలోచనైతే వాడికై నేనూ ఆలోచిస్తాను. వాడిని మరోలా స్థిరపర్చేలా ఆలోచిస్తాను" అని చెప్పాడు కృష్ణమూర్తి.
"ఐనా అన్నయ్యా నువ్వు మా గురించి ముందు నుండి ఎంతగానో ఊహించు కుంటున్నావు. ఇది నిజమని ఇప్పుడూ నీ మాట్ల బట్టి తేలుతోంది. మాదీ మామూలు కుటుంబమే." అని చెప్పింది లక్ష్మి, అప్పుడే.
"అలా కాదు లక్ష్మి. బావగారు ముందు చూపు నాకు ముందు నుంచి తెలుసు. అరుణకై కూడ తీసింది నాకు తెలుసు. అందుకే కిరణ్ నా కొడుకైనా, వాడి ఫూచర్కై నేను ఇంతగా ప్రాధేయ పడుతున్నాను. నా కష్టం వాడికి రాకూడదు" అని అన్నాడు సుబ్బారావు.
"సుబ్బారావూ చెప్పానుగా. నీ కొడుకై నేను మరోలా ఆలోచిస్తాను. సరేనా. అంతే కానీ అరుణకై పట్టు పట్టకు" అని చెప్పేశాడు కృష్ణమూర్తి.
లక్ష్మి ఏమీ ఇక అనలేదు.
"ఇక లేవండి. ఆకలవుతోంది. భోంచేద్దాం" అని లేచాడు కృష్ణమూర్తి.
లక్ష్మి లేచి డైనింగ్టేబుల్ వైపు కదిలింది.
"సుబ్బారావు రా. నీకు రూం చూపుతాను. డ్రస్ మార్చుకు వద్దావు" అని కృష్ణమూర్తి చెప్పగా, సుబ్బారావు లేచాడు.
తక్షణమే కృష్ణమూర్తి చేతులు పట్టుకున్నాడు, "నీ దయ బావా" అని అన్నాడు.
"సుబ్బారావు నిరుత్సాహ పడకు. వాడ్నీ ఇకపై నా బిడ్డే అనుకుంటాను. సరేనా. మరోలా భావించకు. నిన్ను నేను అర్థం చేసుకున్నాను. నువ్వూ నన్ను అర్థం చేసుకో" అని చెప్పుతూనే కృష్ణమూర్తి, సుబ్బారావు వీపు భాగం వైపు నుండి, అతడి భుజం చుట్టూ తన కుడి చేయిని చుట్టి, అక్కడ నుండి నడిపించాడు అతడిని, అతడికి చూపించబోతున్న రూం వైపుకు.


***

వారం రోజులు గడిచిపోయాయి.
అప్పటికే -
రెండు రోజులు ఉన్న సుబ్బారావు, తన ఇంటికి వెళ్లిపోయాడు, పెద్ద రిలీఫ్తో.
చంద్రతో అరుణ మాట్లాడేసింది, ఎట్టి అరమరికలు లేకుండా. ఆ వివరాలను తన తల్లిదండ్రులుకు చేరవేసింది కూడా.
ఆ ముగ్గురుకూ చంద్ర అనుకూలంగా అనిపించాడు.
దాంతో, ఆ పెళ్లి సంబంధాల మధ్యవర్తి రావడం, ఇక అతని అవసరం లేదని కృష్ణముూర్తి, లక్ష్మిలు అతనితో చెప్పేయడం కూడా జరిగిపోయాయి.
ఇక మిగిలిందల్లా, అరుణ తల్లిదండ్రులు, చంద్ర తల్లిదండ్రులు ముఖాముఖీ. దానికై అనువైన తేదీనీ ఎంపిక చేసుకున్నారు కూడా, ఆ ఇరువురి తల్లిదండ్రులు.


***

(మిగతాది తరువాయి ఎపిసోడ్ లో)