ఒక తోటలో ఒక పూట-2(ముగింపు) - ఒక తోటలో ఒక పూట -2(ముగింపు) in Telugu Drama by Bk swan and lotus translators books and stories PDF | ఒక తోటలో ఒక పూట-2(ముగింపు) - ఒక తోటలో ఒక పూట -2(ముగింపు)

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ఒక తోటలో ఒక పూట-2(ముగింపు) - ఒక తోటలో ఒక పూట -2(ముగింపు)

శ్యాం: ఎందుకేంటి...మీలాగే చచ్చిపోవడానికి...ఎందుకూ పనికి రానివాడని అందరూ అంటున్నారు.నేను మాత్రం ఎంతకాలం భరించగలను,ఎందుకు బ్రతకాలని నాకూ అనిపించింది... అందుకే చనిపోవాలని అనుకున్నాను
కానీ ఎందుకనో ధైర్యం చేయలేక పోతున్నాను..ఇలా ఐతే ఎలా అని ఆలోచిస్తున్నాను...ఇంలోనే చద్ది పెరుగన్నంలో ఆవకాయ బద్దల్లా చచ్చిపోవడానికి తోడుగా మీరు దొరికారు...రండి అందరం కలిసే ఈ ఘనకార్యం చేద్దాం" అంటూ మాత్రలు అందరికీ పంచుతాడు
అందరూ కలసి నిద్ర మాత్రలు ఇంతలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి వారిని వద్దని వారిస్తూ ఇలా అంటాడు..

వచ్చిన వ్యక్తి: ఆగండి...ఆగండి ...ఒక్క క్షణం ఆగండి నా మాటలు వినండి..మీరు చేస్తోంది ఎంత పెద్ద పొరపాటో గ్రహించండి..
తమకు ఏమాత్రం పరిచయంలేని ఒక అజ్ఞాత వ్యక్తి హఠాత్తుగా వచ్చి అన్న ఆ మాటలకు ఆశ్చర్యపోయిన ఆ మిత్రులు... ఆ వ్యక్తికేసి తదేకంగా చూశారు చూడడానికి సామాన్య వ్యక్తిలా ఉన్నా ముఖంలో దివ్య తేజస్సు ప్రస్ఫుటంగా గోచరిస్తోంది.. కొన్ని క్షణాలు అందరూ మౌనంగా ఉండిపోయారు... కాసేపటి  తరువాత ఉమేష్ ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు
ఉమేష్ : నమస్తే సార్. మిమ్మల్ని చూస్తుంటే ఎవరో గొప్ప వ్యక్తిలా ఉన్నారు...పైగా మాకు బాగా కావలసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు...ఇంతకీ మీరు ఎవరు

వచ్చిన వ్యక్తి: నా పేరు బీకే పీయూష్ . ప్రజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీ లో లెక్చరరుగా చేస్తున్నాను.ప్రజా పిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో రాజయోగం అభ్యసిస్తున్నాను . చూడండీ...ఇందాకటినుంచి మీ మాటలను వింటున్నాను .మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను... ఏదో ఆవేశంతో మాట్లాడుతున్నారు ...కాసేపటికి అంతా సద్దుకుంటుందనుకున్నాను...కానీ పరిస్థితి చేయిదాటుతుంటే...చూస్తూ ఊరుకోలేక పరిగెత్తుకుని వచ్చాను ...నేను రావడం కాస్త ఆలస్యం అయ్యి ఉంటే ఎంత అనర్ధం జరిగేది...
.... పీయూష్ ఇంకా ఏదో అనబోతుండగానే మధ్యలో అందుకున్న ఉమేష్ ఇలా అన్నాడు...

ఉమేష్ : కానీ..ఏం చేయమంటారు మా పరిస్థితి అలాంటిది...

పీయూష్: అందుకని తెలసీ తెలియక తప్పులు చేయడమేకాక..ఆ తప్పుల్ని ఒప్పుకునే ఓర్పు లేక .. వాటిని సరిదిద్దుకునే నేర్పులేక...తప్పించుకోవాలనే ప్రయత్నంలో చావాలని నిర్ణయం తీసుకుని ఇంకా పెద్ద తప్పిదం చేస్తున్నారు..... ఒక్కసారి ఆలోచించండి...ఒకప్పుడు దివ్య గుణాలతో దేవతలుగా వెలుగొందిన మనం ఈనాడెందుకిలా అయిపోయాం...నైతిక విలువలు లోపించటమే దీనంతటికీ కారణం...నిజానికి ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక విశేషత కచ్ఛితంగా ఉండితీరుతుంది...వాటిని సరైన రీతిలో వినియోగిస్తే... ఆ వ్యక్తి తననూ తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఉద్ధరించగలరు....

సతీష్: మాకు తెలుసు మాలోనూ టాలెంట్ వుంది...
వీడు మంచి క్రికెటర్...ఈ శ్యాం మంచి రైటర్ ...నేను బొమ్మలు బాగా గీస్తాను...

పీయూష్: మరి ఇన్ని విశేషతలు ఉన్న మీరు వాటిపై శ్రద్ధ పెట్టక.. సాంగత్య దోషంలోకి వచ్చి అనవసర విషయాల జోలికి వెళ్తున్నారు...ఇప్పటి వరకూ జరిగిన దానిని మర్చిపోండి...ఇకనైనా మీరనుకున్న రంగాల్లో ప్రతిభ చూపించే ప్రయత్నం చేయండి

ఉమేష్ : అలా చేయాలని మాకూ వుంటుంది కానీ ఏంచేయం.....మా మనసు స్థిరంగా వుండదు..మమ్మల్ని ఏం చేయమంటారు.. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందా పీయూష్: లేకే...ఈ సమస్యకు చక్కని పరిష్కారం రాజయోగ అభ్యాసం..ఇందులో మనస్సు ఇంకా బుద్ధిని ఒక్క పరమపిత పరమాత్మతో జోడించడం వలన వారిని సర్వ సంబంధాలతో జ్ఞాపకం చేయడం వలన వారి వద్దవున్న దివ్య గుణాలు శక్తులు గ్రహించి ధారణ చేయటం ద్వారా జీవితంలో సఫలత సాధించటమే కాకుండా...అతి త్వరలో ఈ భూమి మీద ఏర్పడనున్న స్వర్గంలో దేవతలుగా జన్మ తీసుకుంటాం

రమేష్: చాలా బాగుంది..మీరు చెబుతున్న ఈ విషయాలు వింటుంటే.. చాలా ఆనందంగా వుంది..మాకు జీవితం మీద మళ్ళీ ఆశ కలుగుతోంది
ఇంతకీ మీకు ఈ విషయాలు ఎవరు చెప్పారు ఈ యోగాన్ని ఎవరు నేర్పిస్తారు

పీయుష్: ఇంకెవరూ...సర్వాత్మల పిత పరమాత్మ... ప్రజాపిత బ్రహ్మా తనువులో అవతరించి వారి పావన ముఖ కమలం ద్వారా ..రాజయోగాన్ని నేర్పించి దివ్య గీతా జ్ఞానాన్ని అందించి..మానవులను దేవతలుగా తీర్చిదిద్దుతున్నారు..ఈ పరమాత్మనే అన్ని ధర్మాలవారు శివ అల్లాహ్ యహోవా ఖుదా గాడ్ అని తమ తమ భాషల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు... వారు స్థాపించినదే ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం..దీని ప్రధాన అంతర్జాతీయ ముఖ్య కార్యాలయం మన భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని ఆరావళి పర్వత శ్రేణుల్లోవున్న ఆబూ గిరి పై కొలువై వుంది...ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కొన్ని వేల శాఖలతో విస్తరించి వుంది
ఇక్కడ కొన్ని లక్షల మంది వస్తారు వీరిని బ్రహ్మాకుమారీ బ్రహ్మాకుమారులని పిలుస్తారు...వీరు నిత్యం రాజయోగ అభ్యాసంతో తమ జీవితాన్ని వజ్ర తుల్యంగా మార్చుకుంటున్నారు

రమేష్: ఎంతో అద్భుతంగా వుంది...నిజంగా జన్మ ధన్యమైంది.. మరి మమ్మల్ని ఎప్పటినుంచి రమ్మంటారు

పీయూష్: ఎప్పటి నుంచో ఎందుకు...మిమ్మల్ని ఈ క్షణం నుంచే ఈ ఈశ్వరీయ పరివారంలోకి ఆహ్వానిస్తున్నాను

శ్యాం:పీయూష్ అంటే అమృతమని అర్ధ మని ఎక్కడో చదివాను మీరు మా జీవితంలోకి అలాగే వచ్చారు..ఇక నుంచి మేముకూడా పరమాత్మ అందిస్తున్న ఈ జ్ఞానామృతాన్ని తాగుతూ అందరికీ పంచుతాం

పీయూష్: చాలా సంతోషం ఏదీ అందరు ఒక సారి మనస్పూర్తిగా ఓంశాంతి అని అనండి..ఎందుకంటే శాంతి మన స్వధర్మం


..................................0................................