unexpectedly one day in Telugu Biography by Bk swan and lotus translators books and stories PDF | అనుకోకుండా ఒక రోజు

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

అనుకోకుండా ఒక రోజు

ఓంశాంతి నా పేరు బీకే సాయి శ్యాం మనోహర్ కనగాల. డిగ్రీ వరకూ చదువుకున్నాను.వయసు ముప్పైఆరు.
నా స్నేహితుల్లో చాలామంది నన్ను శ్యాం అని పిలుస్తారు.ఈ మధ్యనే అందరూ మనోహర్ అని పిలుస్తున్నారు
సాయి అని ఎవరూ పిలిచినట్లు గుర్తు లేదు. ఖాళీ సమయాల్లో వ్రాయడం నా అలవాటు. నా ప్రవర్తన వలన ఎవరికీ ఇబ్బంది కలగ కూడదనేది నా సిద్ధాంతం. ప్రపంచానికి మంచి చేయాలనేది నా ఆశయం....ఈ ఆశయానికి ఊతమిచ్చింది ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం..స్వయంగా భగవంతుడే స్థాపించిన ఈ విశ్వ విద్యాలయం అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం రాజస్థాన్ రాష్ట్రం మోంట్ ఆబూ లో వుంది... మానవుల్లో దివ్య గుణాలు నింపి దుర్గుణాలను తొలగించి  ప్రతీ ఇంటినీ దేవాలయంగా... మొత్తం ప్రపంచాన్ని ..మరీ ముఖ్యంగా, భారత దేశాన్ని స్వర్గంగా మార్చాలన్నది ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సర్వోన్నత ఈశ్వరీయ సంస్థను గురించిన మరిన్ని వివరాలు నా తరువాతి రచనల్లో తెలియజేస్తాను
  కానీ ప్రస్తుతం మీ అందరికీ నా జీవితంలో జరిగిన ముఖ్య సంఘఠనను తెలియజేస్తున్నాను
అది రెండు వేల పద్దెనిమిది...ఏప్రెల్ నెల ఎండలు భగభగ మండుతున్నాయి.
నేను ఒక ఆధ్యాత్మిక సంస్థ గురించి ఇందాకే తెలియజేశాను.. అందులో నేను పదహారు సంవత్సరాలుగా సభ్యునిగా ఉన్నాను..ఇక్కడికి వచ్చేవారిని బ్రహ్మాకుమార్ బ్రహ్మాకుమారీ అని పిలుస్తారు... నా పేరు ముందున్న బీకే పదానికి అర్ధం అదే బ్రహ్మాకుమార్
ఈ సంస్థకు సంబంధించిన భవంతి నిర్మాణం సత్ నారాయణ పురంలో జరుగుతోంది. అక్కడ జరిగే నిర్మాణ కార్యక్రమాలు పర్యవేక్షించే సేవాధారుల్లో నేను ఒకడిని. వృత్తి పరంగా హెర్బల్ ప్రోడక్ట్స్ మార్కెటింగ్ చేస్తున్నాను ఉదయం సాయంత్రం సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం మిగతా సమయం మార్కెటింగ్ చేయటం నా దినచర్యగా మారింది
ఆ రోజు ఏప్రెల్ నాలుగు బుధవారం
సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోంది..ఒక అన్ నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది..అన్నట్టు చెప్పడం మరిచాను... నాకు అనువాదం చేసే అలవాటు వుంది... ఆ పని మీదనే ఎవరైనా ఫోన్ చేశారేమో అనుకుని లిఫ్ట్ చేశాను... అవతలి వైపునుంచి ఒకతను ఇలా మాట్లాడుతున్నాడు...
"హలో... మనోహర్ గారాండి"
"అవునండీ"
"మేము కాపీకో' చక్లెట్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం...కంగ్రాట్సండీ... మీరు మా లక్కీ డ్రాలో రెడ్ మీ నోట్ ఫొన్ గెలుచుకున్నారు...రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా ఐరా హోటలుకు వచ్చేయండి"
అవాక్కయిన నాకు ముందు ఏం మాట్లాడాలో అర్ధంకాలేదు..."చాలా థ్యాంక్సండీ...మీకు డబ్బులేమైనా కట్టాలా"అని అడిగాను
"ఏమీ అక్కర్లేదండీ...రేపు వచ్చేటప్పుడు ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ తెచ్చుకోండి..." "ఓకే...థ్యాంక్సండీ"అని ఫోన్ పెట్టేశాను...మనసులో ఆలోచనలు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తున్నాయి
రెండువేలపదిహేడు అక్టోబరులో అనుకుంటా 'కాపీకో' చాక్లెట్ కంపెనీ వాళ్ళు ఒక కాంటెస్ట్ పెట్టారు
ఐదు చాక్లెట్లు కొంటే ఒక స్క్రాచ్ కార్డు ఫ్రీగా ఇచ్చేవారు.. అది స్క్రాచ్ చేయగా వచ్చిన నెంబరును వారు సూచించిన మొబైల్ నెంబరుకు ఎస్ ఎం ఎస్ చేయాలి.. లక్కీ డ్రాలో గెలిచిన వారికి
ఫస్ట్ ప్రైజ్ కారు.. సెకండ్ ప్రైజ్ బైక్...
థర్డ్ ప్రైజ్ మొబైల్... నేను కూడా ప్రయత్నిద్దామని ఒక పాతిక ముప్పై చక్లెట్లు కొని ఎస్ ఎం ఎస్ చేశాను. ఎన్ని రోజులు ఎదురు చూశినా ఎటువంటి స్పందనా రాలేదు...దాంతో నేనుకూడా ఆశలు వదులుకున్నాను...కొన్ని నెలలక్రితం కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి నా వివరాలు అడిగి తీసుకున్నారు...మళ్ళీ స్పందన లేదు...అలాంటిది మళ్ళీ ఇన్ని రోజులకు ఫోను...నమ్మకానికీ అపనమ్మకానికీ మధ్య నా మనసు ఊగిసలాడుతోంది.. సరే వెళ్దాం గిఫ్ట్ వస్తే తీసుకుందాం అనే నిర్ణయానికి వచ్చాను
తెల్లవారింది మళ్ళీ కంపెనీ వాళ్ళనుండి ఫోను.."మనోహర్ గారు వస్తున్నారా" "వస్తున్నానండీ" "సరే హోటలు చేరుకున్నాకా ఫోన్ చేయండి" "అలాగేనండి"
త్వరగా తయారయ్యి రోడ్డెక్కాను...బస్టాపులో నిలబడ్డాను 'నువ్వు ఎక్కవలసిన బస్సు ఒక జీవిత కాలం మిస్సు 'అని మహాకవి ఆత్రేయగారు అన్న మాటలు గుర్తుకొచ్చాయి...మనసులో ఒక మూల ఆనందం మరో వైపు సమయానికి చేరుకోలేనేమో అన్న భయం... ఈ హడావిడిలో మొబైల్ ఛార్జ్ చేయటం మర్చిపోయాను...పదహారు శాతం ఛార్జింగు తో రెడ్ సిగ్నల్ చూపిస్తోంది...ఏదో తెలియని ఉత్కంఠ నిలవనివ్వడంలేదు...కూర్చోనివ్వడంలేదు.. ఇంతలో మళ్ళీ ఫోన్ "బయలుదేరారా" అని "దార్లో ఉన్నానండీ" సరే చేరుకోగానే ఫోన్ చేయండి"..
అప్పటికే రెండు బస్సులు వచ్చి వెళ్ళాయి..అడుగు పెట్టే చోటు లేదు బస్సంతా నిండిపోయి జనం గుంపుగా గమ్మం దగ్గర వేలాడుతున్నారు. ఎవరు ఎవర్ని పట్టుకున్నారో దేన్ని పట్టుకుని వేలాడుతున్నారో అర్ధం కావటంలేదు
ఇంతలో ఇంకో బస్సు వచ్చింది మరీ అంత రద్దీగా లేదు ఎలాగోలా ఎక్కి ఇరుక్కని నుంచున్నాను. బస్సు క్షణాల్లో గమ్య స్థానం చేర్చింది.
రద్దీగా ఉన్న ట్రాఫిక్ దాటుకుని ఐరా హౌటల్ చేరుకున్నాను.. రిసెప్షన్ వారిని కలసి విషయం చెప్పాను. వారు ఒక చిరునవ్వు నవ్వి 'కూర్చోండి'అన్నట్లు ఒక వైపుకు సైగ చేశారు...మూడు పెద్ద సోఫాలు ఖాళీగా ఉన్నాయి..వెళ్ళి ఒకదాంట్లో కూర్చున్నాను..ఫోన్ చేద్దామని మొబైల్ తీశాను..ఛార్జింగ్ నైన్ పర్సెంట్ అని చూపిస్తోంది...ఏం చేయాలో అర్ధం కాలేదు..ధైర్యం చేసి ఫోన్ చేశాను.."సార్..నేను మనోహర్ని...హోటలుకు చేరుకున్నాను...మీ గురించే వెయిట్ చేస్తున్నాను..."
"అక్కడే ఉండండి ఒక పది నిమిషాల్లో వచ్చేస్తున్నాము.."అని అవతలి వైపునుంచి సమాధానం...మరిత ఉత్కంఠ...కొండెక్కుతున్న దీపంలా ఉన్న ఫోనునే తదేకంగా చూస్తూ కూర్చున్నాను...ఛార్జింగ్ పర్సంటేజ్ మూడు...మళ్ళీ ఫోన్ చేస్తే మధ్యలోనే స్విచ్ ఆఫ్ అయిపోతుందనే భయం
క్షణం ఒక యుగంలా గడుస్తోంది..ఇంతలో ఫోన్ రింగయ్యింది... తడబడుతూనే ఫోన్ ఎత్తి "హలో"అన్నాను "హలో...ఇటు చూడండి ఇటు.." అని అనడంతో తలెత్తి చూశాను... ఒక వ్యక్తి చేయి ఊపుతూ కనిపించాడు పోయిందనుకున్న ఊపిరొచ్చినంత పనయ్యింది...
అతణ్ణి చూడగానే పలకరింపుగా నేనూ చెయ్యి ఊపాను..అతను నా దగ్గరకు వచ్చి "మనోహర్ అంటే మీరేనా అని అడిగారు.."అవునండి"అని బదులిచ్చాను... "ఆధార్ కార్డ్ తెచ్చారా"
"తెచ్చానండి" అని చూపించాను..ఒక ఫార్మ్ ఇచ్చి సంతకం పెట్టమన్నారు...సంతకం పెట్టాను...
రెడ్ మీ నోట్ సీల్డ్ ప్యాక్ బయటకి తీశాడు.. అది నా చేతిలో పెడుతూ...వేరే అతనితో ఫొటో తీయించుకుని ..అభినందించి వెళ్ళిపోయాడు... అంతా కలలా అనిపించింది ...ఇది నా జీవితంలో జరిగిన ఒక అరుదైన సంఘఠన ...మార్కెట్ లో ఏడు వేల ఐదు వందలు ఉన్న ఫోను అనుకోకుండా బహుమతిగా రావడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా వుంది...అదృష్ఠం అంటే ఇదేనా...??!!