Quotes by Writer raguvaran in Bitesapp read free

Writer raguvaran

Writer raguvaran

@writerraguvaran636233
(19)

ది ప్యారడైజ్

ది ప్యారడైజ్ చూసినప్పుడు నాకు మొదట వచ్చిన feeling — సినిమాలో మాస్ ఉంది, యాక్షన్ ఉంది, హింస ఉంది, థియేటర్‌లో audienceని రెచ్చగొట్టే moments ఉన్నాయి. కానీ కథ మొదలైన విధానం మాత్రం నాకు ఏదో మిస్ అయినట్టు అనిపించింది.

హింసను ఎంత పెంచినా అది ఒక్కటే emotion కాదు. ప్రేక్షకుడికి ముందు ఎవరిపై కోపం రావాలి, ఎవరిని కాపాడాలని అనిపించాలి, ఎవరి కోసం హీరో పోరాడుతున్నాడో అర్థం కావాలి. అప్పుడే hero ఒకరిని కొడితే audienceలో కూడా ఆ కోపం బయటకు వస్తుంది. అదే నిజమైన mass elevation.

అందుకే నేను ఈ కథను కేవలం rewrite చేయడం కాదు — మొత్తం rebuild చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాను.

OPENING — కథ మొదలయ్యే ముందు కథను వెతకడం

సినిమా నేరుగా హీరో తల్లి జీవితంతో ప్రారంభం కాకుండా, ముందుగా ఒక కాలేజ్‌తో ఓపెన్ అయితే నాకు ఇంకా ఆసక్తికరంగా అనిపించేది.

ఐదుగురు students — ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు.

వాళ్ల professor ఒక project ఇస్తాడు.

మన చరిత్రలో ఒకప్పుడు ఉన్న, ఇప్పుడు దాదాపు మర్చిపోయిన ఒక community/legendary group గురించి పూర్తి documentary తయారు చేయాలి. పాత documents, photographs, records, వాళ్ల గురించి ఉన్న నిజమైన ఆధారాలు సేకరించి పూర్తి documentation submit చేయాలి.

ఎవరైతే best documentary చేస్తారో వాళ్లకు వచ్చే placement driveలో కొన్ని companies నుంచి preference ఉంటుందని professor చెబుతాడు.

అక్కడినుంచి వాళ్లు project కోసం వెతకడం మొదలుపెడతారు.

వాళ్లు మొదట వెతుకుతున్నది ఒక historical subject.

కానీ ఆ researchలో మొదటగా బయటపడేది హీరో తల్లి కథ.

ఆమె తన జాతిని బయటకు తీసుకురావడానికి ఎలా పోరాడింది?

వాళ్లకు గుర్తింపు ఎందుకు కావాలి?

తన ప్రజల కోసం ఆమె ఏం చేసింది?

చివరికి తన ప్రాణాలు ఎలా కోల్పోయింది?

అలా ప్రేక్షకుడికి హీరోని పరిచయం చేసే ముందు హీరో తల్లి పోరాటాన్ని పరిచయం చేస్తే, తర్వాత హీరో చేసే ప్రతి పని వెనుక ఒక emotional weight ఏర్పడుతుంది.


---

హీరోయిన్ — కేవలం ప్రేమకథ కోసం కాదు

ఇక్కడ నాకు హీరోయిన్ పాత్ర కూడా పూర్తిగా వేరేలా ఉండాలి.

ఆమెను ఒక చీకటి, అసహ్యకరమైన angleలో పరిచయం చేయడం కంటే, ఆ కాలంలో పనిచేసే journalist / writer / researcherలా చూపిస్తే నాకు వ్యక్తిగతంగా చాలా బాగా కనెక్ట్ అయ్యేది.

ఆ community గురించి రాయడానికి, వాళ్ల కథను తెలుసుకోవడానికి ఆమె ఆ ప్రాంతానికి వస్తుంది.

అక్కడే పరిస్థితుల్లో ఇరుక్కుపోతుంది.

మొదట వాళ్లను బయటివాళ్లలా చూస్తుంది.

తర్వాత వాళ్ల బాధను చూస్తుంది.

తర్వాత హీరోని చూస్తుంది.

తర్వాత హీరో తల్లి ఏం కోసం పోరాడుతుందో అర్థం చేసుకుంటుంది.

అలా హీరోతో ఆమె ప్రేమ కూడా కేవలం romance కోసం కాకుండా, ఒక మనిషి వెనుక ఉన్న చరిత్రను తెలుసుకున్న తర్వాత వచ్చిన attachmentగా మారుతుంది.

ముఖ్యంగా ఆమె సేకరించే documents, photographs, notes, videos — ఇవి తర్వాత కథలో చాలా ముఖ్యమైనవి అవుతాయి.

అవి కేవలం heroine చేతిలో ఉన్న వస్తువులు కాదు.

ఆ ప్రజల చరిత్రకు ఆధారాలు.


---

FIRST HALF — హీరో vs తల్లి

ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోకి, అతని తల్లికి మధ్య ఉన్న గొడవతో emotionalగా నడిపించవచ్చు.

తల్లి తన జాతి కోసం పోరాడుతుంది.

హీరో మాత్రం తన జీవితంలో ఉన్న సమస్యలతో, తన తల్లితో ఉన్న విభేదాలతో ఉంటాడు.

అతనికి ఆమె పోరాటం పూర్తిగా అర్థం కాదు.

కానీ heroine మాత్రం ఆ పోరాటాన్ని బయట నుంచి చూస్తూ, document చేస్తూ ఉంటుంది.

ఇలా చేస్తే ప్రేక్షకుడు కూడా హీరోతో పాటు ఆ నిజాన్ని నెమ్మదిగా తెలుసుకుంటాడు.

ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం — సినిమా మొదటి నుంచే వరుసగా బాధ, హింస, అవమానం మాత్రమే చూపిస్తే ప్రేక్షకుడిపై బరువు పడుతుంది.

అందుకే “ఏసు నాగుల” పాటను openingలోనే పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

ఆ పాట మొదట్లోనే ఒక energy, entertainment, atmosphere ఇస్తుంది.

ప్రేక్షకుడు ఆ ప్రపంచంలోకి దిగుతాడు.

తర్వాత కథ serious అవుతుంది.

అంటే పాట కథను ఆపడం కాదు.

ప్రేక్షకుడికి ఊపిరి ఇవ్వడం.


---

INTERVAL — వ్యక్తిగత గొడవ నుంచి ప్రజల పోరాటానికి

కథ ముందుకు వెళ్లే కొద్దీ హీరో తల్లి మీద విలన్ వర్గం చేసే అవమానాలు, దాడులు మరింత తీవ్రమవుతాయి.

అప్పటివరకు తల్లితో గొడవపడుతున్న హీరోకి ఒక్కసారిగా ఆమె అసలు పోరాటం అర్థమవుతుంది.

ఆమె తన కోసం కాదు.

తన ప్రజల కోసం పోరాడుతోందని తెలుసుకుంటాడు.

ఇక్కడ హీరోయిన్ ఇప్పటివరకు సేకరించిన documentary material కూడా ముఖ్యమవుతుంది.

ఆమె రాసిన papers, తీసిన videos, సేకరించిన records — ఇవన్నీ వాళ్ల communityకి జరిగిన అన్యాయానికి ఆధారాలుగా ఉంటాయి.

ఇదే సమయంలో విలన్ కొడుకు హీరో తల్లిని అవమానించే స్థాయికి వెళ్తాడు.

అక్కడ హీరోలో ఉన్న personal anger, తల్లి మీద ఉన్న ప్రేమ, తన ప్రజల మీద పెరుగుతున్న కోపం — మూడు ఒకేసారి కలుస్తాయి.

హీరో హీరోయిన్‌తో కలిసి విలన్ కొడుకును ఎదుర్కొంటాడు.

అతన్ని చంపేస్తాడు.

ఇక్కడే నాకు “ఆయా షేర్” పాట రావాలి అనిపిస్తుంది.

హీరో తన వాళ్లకు భోజనం పెట్టించే సమయంలో.

ఎందుకంటే ఆ పాట openingలో వస్తే entertainment.

కానీ ఇక్కడ వస్తే earned celebration.

ఇంతకాలం ఆకలి, అవమానం, భయంతో ఉన్న వాళ్లు మొదటిసారి ఒక victoryని అనుభవిస్తున్న క్షణం.

అదే పాటకి అప్పుడు ఇంకో meaning వస్తుంది.


---

VILLAIN — వ్యక్తిగత ప్రతీకారం కాకుండా చరిత్రను చెరిపేయడం

విలన్ కొడుకు చనిపోయిన తర్వాత విలన్ reaction మొదలవుతుంది.

తన కొడుకు మరణం ఒక personal loss.

కానీ అతని ప్రతీకారం మాత్రం మొత్తం community మీద పడుతుంది.

హీరోయిన్ ఇంతకాలం సేకరించిన documentation — వాళ్ల చరిత్ర, వాళ్ల బాధ, వాళ్ల హక్కుల ఆధారాలు — అన్నీ విలన్ చేతిలో నాశనం అవుతాయి.

కాలిపోయిన papers.

పాడైన recordings.

సగం నాశనం అయిన CDs.

ఇక్కడే conflict ఇంకా పెద్దదవుతుంది.

ఎందుకంటే విలన్ హీరోని కొట్టాడు అనే కోపం మాత్రమే కాదు.

“మా ప్రజల కోసం నేను సేకరించిన చరిత్రనే నాశనం చేశాడు.”

అనే కోపం హీరోలో పెరుగుతుంది.

అదే సమయంలో విలన్ తన కొడుకు అంత్యక్రియలు పూర్తి చేయడానికి అతని అవశేషాలను తీసుకెళ్తాడు.

ఇక ఒక వైపు వ్యక్తిగత దుఃఖం.

మరో వైపు community మీద మరింత దాడి.


---

COMMUNITYని పూర్తిగా అణచేయడం

విలన్ తన కొడుకు చంపబడ్డాడనే కోపంతో హీరో వాళ్లను పట్టుకుంటాడు.

హీరో, హీరోయిన్, వాళ్ల వాళ్లు దాడికి గురవుతారు.

వాళ్లను కట్టేస్తారు.

వాళ్లపై కేసులు పెట్టడానికి పోలీసులు, లాయర్లు రంగంలోకి వస్తారు.

“ఇక ఈ జాతి వాళ్లు బయట తిరగకూడదు.”

“వాళ్లకు ఇప్పటివరకు ఉన్న హక్కులు కూడా ఉండకూడదు.”

అనే స్థాయికి విషయం వెళ్తుంది.

ఇంతకాలం వాళ్లు “మాకు హక్కు కావాలి” అని అడిగారు.

ఇప్పుడు వాళ్ల పరిస్థితి:

“మాకు స్వేచ్ఛగా బ్రతికే హక్కు కూడా ఉండకూడదా?”

అనే స్థాయికి చేరుతుంది.


---

HERO TRANSFORMATION

హీరో స్నేహితులు అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి ఒక ప్రత్యేకమైన చోటికి తీసుకెళ్తారు.

అక్కడ హీరోయిన్ కూడా గాయాలతో ఉంటుంది.

హీరో ఆమెను చూసి తన తల్లి గురించి అడుగుతాడు.

ఆమె చెబుతుంది:

“అమ్మ ఇక్కడ లేదు… ఇంకా తన ప్రజల దగ్గరే ఉంది.”

అది విన్న హీరోలో బాధ, కోపం రెండూ పెరుగుతాయి.

తర్వాత heroine కాలిపోయిన documents, సగం నాశనం అయిన recordings చూపిస్తుంది.

“అంతా పోయింది. మన మీద కేసులు పెట్టారు.”

అని చెబుతుంది.

అక్కడ హీరోకి ఒక్కసారిగా అర్థమవుతుంది:

ఇప్పటివరకు వాళ్లు హక్కు కోసం పోరాడారు.

ఇక వాళ్లను హక్కు అడిగినందుకు నేరస్తులుగా మార్చారు.

“మనల్ని దేశద్రోహులుగా, terroristsగా ముద్ర వేస్తున్నారు.

ఇక మనం దేనికోసం ఆగాలి?”

అని అతను తన ప్రజల ముందు నిలబడతాడు.

**“ఇంతకాలం వాళ్లు పోరాడారు.

ఇప్పుడు మనం పోరాడితే ఎలా ఉంటుందో వాళ్లకు తెలుస్తుంది.”**

అని చెబుతాడు.

ఆ మాటతో యువకులు ఒక్కొక్కరుగా లేస్తారు.

హీరో ఒక్కడే కాదు.

ఒక community లేస్తుంది.


---

THE UPRISING

ఇక్కడ నాకు hero ఒక్కడే అందరినీ కొట్టే fight కాకుండా, మొత్తం communityకి ఒక collective elevation కావాలి.

ఇంతకాలం వాళ్లను అణచిన వాళ్లు, అదే ప్రజలు తమకు ఎదురు నిలబడటం చూస్తారు.

వాళ్లు తమ దగ్గర ఉన్న సాధారణ పనిముట్లతోనే ప్రతిఘటిస్తారు.

ఇప్పటివరకు వాళ్లను అణచడానికి ఉపయోగించిన వ్యవస్థకు ఎదురు నిలబడతారు.

అక్కడే power balance మారుతుంది.

హీరో మధ్యలో నాయకుడిగా నిలబడతాడు.

కానీ ఇది ఒక్క హీరో విజయం కాదు.

అతని ప్రజల విజయం.


---

VILLAIN vs HERO

ఇక్కడ విలన్‌ని వెంటనే హీరో చేతిలో ఓడించకూడదు.

ఎందుకంటే విలన్ అంటే వాళ్లకు ఇప్పటికీ భయం.

తరతరాలుగా వాళ్లను భయపెట్టిన మనిషిని ఒక్కసారిగా ఎదుర్కోవడం కూడా వాళ్లకు సులభం కాదు.

ఆ భయమే fightకి tension ఇస్తుంది.

విలన్ హీరోని అవమానిస్తూ, తరతరాలుగా తమ కాళ్ల కింద బ్రతికిన వాళ్లు ఇప్పుడు స్వేచ్ఛ గురించి మాట్లాడటానికి ఎంత ధైర్యం వచ్చిందని ప్రశ్నిస్తాడు.

హీరోను మానసికంగా కూడా రెచ్చగొడతాడు.

అతని జుట్టు పట్టుకున్నప్పుడు హీరోకి తన చెల్లి గుర్తుకు వచ్చేలా ఒక emotional trigger ఉంటుంది.

అక్కడ fight కేవలం ఇద్దరు మనుషుల మధ్య కాదు.

తరతరాలుగా అణచిన శక్తి vs మొదటిసారి ఎదురు నిలబడిన శక్తి.


---

NEWSPAPER — నిజం బయటకు రావడం

ఇంతలో హీరో ఫ్రెండ్ ఎప్పుడో తప్పించుకుని బయటకు వెళ్లిన విషయం payoff అవుతుంది.

అతను హీరోయిన్ పనిచేసే newspaperకి మొత్తం విషయం చేరుస్తాడు.

వాళ్లు దాన్ని ప్రచురిస్తారు.

విషయం బయట ప్రపంచానికి తెలుస్తుంది.

ఎమ్మెల్యేకు సమాచారం చేరుతుంది.

“మన areaలో ఇంత జరుగుతుందా?”

అంటూ అధికారులు అక్కడికి వస్తారు.

పోలీసులు విలన్ సైన్యంలో మిగిలిన వాళ్లను పట్టుకోవడం మొదలుపెడతారు.

విలన్ తన సైన్యం అంతమైపోతున్నదని చూస్తాడు.

అతని కోపం మరింత పెరుగుతుంది.


---

MOTHER'S DEATH

ఆ కోపంలో విలన్ హీరోపై కాల్పులు జరుపుతాడు.

కానీ ఆ కాల్పు హీరో తల్లికి తగులుతుంది.

హీరో ఆమె దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తాడు.

ఆమె చనిపోతూ అతనితో చెబుతుంది:

“ఇన్నాళ్లు నేను చేసిన పోరాటం నా చావుతో ఆగకూడదు. దాన్ని పూర్తి చేయాలి.”

ఆమె చివరి కోరిక revenge మాత్రమే కాదు.

తన జాతిని తరతరాలుగా శాసించిన వాడి అహంకారం ముగియాలి.

హీరోకి ప్రపంచం ఒక్కసారిగా మసకబారుతుంది.

కళ్లలో నీళ్లు.

చేతులు వణుకుతాయి.

చుట్టూ ఉన్న వాళ్ల బాధలు కనిపిస్తాయి.

తన చెల్లి చనిపోయిన జ్ఞాపకం.

తల్లి బాధ.

తల్లి చావు.

తన ప్రజల బాధ.

విలన్ చేసిన ప్రతిదీ.

అన్నీ ఒకేసారి అతని మనసులోకి వస్తాయి.

కొద్దిసేపటి తర్వాత అతను నెమ్మదిగా పైకి లేస్తాడు.


---

VILLAIN'S END

హీరోయిన్, హీరో ఫ్రెండ్ ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నారు.

“థాంక్స్ సార్… మీరు ఇంత త్వరగా స్పందిస్తారని అనుకోలేదు.”

అని మాట్లాడుతున్న సమయంలో—

ఒక sudden sound.

అందరూ తిరిగి చూస్తారు.

విలన్ కూలిపోతాడు.

హీరో చేతిలో కత్తి.

అతను కదలకుండా నిలబడి ఉంటాడు.

ఆ తర్వాత మాత్రమే ప్రేక్షకుడికి కాసేపటి క్రితం జరిగినది reveal అవుతుంది.

హీరో లేచాడు.

చుట్టూ చూశాడు.

పక్కనే ఉన్న ఆయుధాన్ని తీసుకున్నాడు.

విలన్ మాత్రం ఇంకా అహంకారంగా అధికారులతో మాట్లాడుతున్నాడు.

ఒక్క క్షణంలో హీరో తన నిర్ణయం తీసుకున్నాడు.

విలన్ కూలిపోయాడు.

హీరో వెంటనే ఆ ఆయుధాన్ని వదిలేసి, రెండు చేతులు కట్టుకుని నిలబడతాడు.

చుట్టూ ఉన్న వాళ్లు షాక్.

ఇది హీరోకి కేవలం revenge కాదు.

తల్లి చివరి మాటకు ఇచ్చిన సమాధానం.


---

FINAL — DOCUMENTARY తిరిగి కథలోకి వస్తుంది

ఇంతవరకు జరిగిన మొత్తం కథను documentaryగా సేకరించిన ఆ ఐదుగురు students చివరికి ఒక ప్రశ్న అడుగుతారు:

“ఆ తర్వాత ఏమైంది?”

వాళ్లకు చెబుతారు:

“హీరోకి ఉరిశిక్ష పడింది.”

వాళ్లు షాక్ అవుతారు.

“ఎందుకు?”

“హత్య చేశాడు కదా.”

కొంతసేపు నిశ్శబ్దం.

తర్వాత వాళ్లలో ఒకరు అడుగుతాడు:

“మరి ఆ జాతి?”

జవాబు:

“ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఇంకా బ్రతికే ఉంటారు.”

వాళ్లు మళ్లీ అడుగుతారు:

“వాళ్లకు గుర్తింపు వచ్చిందా?”

అప్పుడు వాళ్ల చేతుల్లోకి గుర్తింపు కార్డులు వస్తాయి.

వాళ్ల పేర్లు.

వాళ్ల ఫోటోలు.

వాళ్ల identity.

వాళ్లు ఆ కార్డులను చూస్తారు.

మొదట నమ్మలేక చూస్తారు.

తర్వాత ఒకరి ముఖంలో ఆనందం.

మరొకరి కళ్లలో కన్నీళ్లు.

ఆ కన్నీటి బొట్టు ఆ గుర్తింపు కార్డు మీద పడుతుంది.

వాళ్లు ఒకరినొకరు హత్తుకుంటారు.

ఎన్నో తరాలుగా అడిగిన ప్రశ్నకు చివరికి సమాధానం దొరికింది.

“మేము ఉన్నాం.”

వాళ్ల పోరాటం పూర్తిగా ముగియలేదు.

వాళ్ల జీవితం కూడా ముగియలేదు.

కానీ వాళ్లకు ఒక గుర్తింపు వచ్చింది.

కెమెరా నెమ్మదిగా వెనక్కి వెళ్తుంది.

వాళ్లు ఒకరినొకరు హత్తుకుని నిలబడి ఉంటారు

Read More

again… Try again…
Daily one challenge…
One day… one challenge…
again… Try again…
“Feel the emotion…
But don't let the emotion break your heart.”
ఒక క్యూట్ పాపకు లవ్ యు చెప్పు ఒప్పుకుంటే చప్పుడు చేయకు
Breakup… Don't break your heart, just feel it
just feel it
again… Try again…
Daily one challenge…
One day… one challenge…
టైం గివ్ ఎ చాలెంజ్ విన్న ఫెఎల్ జస్ట్ ఫీలిట్
again… Try again…
again… Try again…
Daily one challenge…
One day… one challenge…
again… Try again…
Take a breath… just relax…
A new acceptance… a new challenge…
Day by day… failure, success…
Again… try again…
Success coming… new failure…
Again… try again…
Big thinking is a big problem…
Big, big problem…
A big success…
Take a breath… just relax…
Again… Try again…
Daily one challenge…
One day… one challenge…
Again… Try again…
gain… try again…
Success coming… new failure…
Again… try again…
Life… life… isA…
Big story… one villain… one… but big Joker…
Who you are is determined by what you do and what you think.
Again… try again…
Who are you?
youar just a synopsis?
Your life is a big story.
I want success.
Just deliver your narration.
Take a breath.
Have you failed in your life?
Get a new challenge.
Your homework is your success.
Thinking…

Take a breath… just relax…
A new acceptance… a new challenge…
Day by day… failure, success…
Again… try again…
Success coming… new failure…
Again… try again…

Thinking… something… many things…
You are The main thing
You are fail… don't stop…
Just running…
Past is past…
Just thinking something…

Big thinking is a big problem…
Big, big problem…
A big success…
Take a breath… just relax…
Again… try again…
Success coming… new failure…
Again… try again…
again… Try again… Daily one challenge… One day… one challenge… again… Try again… “Feel the emotion… But don't let the emotion break your heart.” ఒక క్యూట్ పాపకు లవ్ యు చెప్పు ఒప్పుకుంటే చప్పుడు చేయకు Breakup… Don't break your heart, just feel it just feel it again… Try again… Daily one challenge… One day… one challenge… టైం గివ్ ఎ చాలెంజ్ విన్న ఫెఎల్ జస్ట్ ఫీలిట్ again… Try again… again… Try again… Daily one challenge… One day… one challenge… again… Try again… Take a breath… just relax… A new acceptance… a new challenge… Day by day… failure, success… Again… try again… Success coming… new failure… Again… try again… Big thinking is a big problem… Big, big problem… A big success… Take a breath… just relax… Again… Try again… Daily one challenge… One day… one challenge… Again… Try again… gain… try again… Success coming… new failure… Again… try again… Life… life… isA… Big story… one villain… one… but big Joker… Who you are is determined by what you do and what you think. Again… try again… Who are you? youar just a synopsis? Your life is a big story. I want success. Just deliver your narration. Take a breath. Have you failed in your life? Get a new challenge. Your homework is your success. Thinking…

Take a breath… just relax… A new acceptance… a new challenge… Day by day… failure, success… Again… try again… Success coming… new failure… Again… try again…

Thinking… something… many things… You are The main thing You are fail… don't stop… Just running… Past is past… Just thinking something…

Big thinking is a big problem… Big, big problem… A big success… Take a breath… just relax… Again… try again… Success coming… new failure… Again…

Read More

A NEW AGE LOVE STORY

“ప్రేమించినవాడు ఆమె కోసం ఏదైనా చేస్తాడు…
కానీ ఆమెను కాపాడాలని తండ్రి, ప్రియుడు చట్టాన్నే దాటితే?”

రుద్రకు అంజు అంటే ప్రాణం.
కానీ అంజు జీవితంలోకి శ్యామ్ వస్తాడు. పెళ్లి జరుగుతుంది. కొంతకాలానికే శ్యామ్ ఒక కారు ప్రమాదంలో చనిపోతాడు.

భర్తను కోల్పోయిన అంజు జీవితంలోకి మళ్లీ రుద్ర వస్తాడు.
ఆమె కన్నీళ్లకు అండగా నిలుస్తాడు.
ఇక్కడివరకు చూస్తే ఇది ఒక సాధారణ ప్రేమకథ.

కానీ… అసలు కథ అప్పుడే మొదలవుతుంది.

శ్యామ్ ప్రమాదంలో చనిపోలేదు.

అతను ఒక సైకో.
తన భార్య జీవితాన్ని నరకంగా మార్చిన శాడిస్ట్.
ఆమె వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా రికార్డ్ చేసి, అదే వీడియోలతో ఆమెను బ్లాక్‌మెయిల్ చేసిన మనిషి.
అంజు ప్రాణ స్నేహితురాలు శైలూ ఆత్మహత్య వెనుక కూడా శ్యామ్ నీడ ఉంది.

తన కూతురి జీవితం నాశనం అవుతోందని తెలుసుకున్న రామరాజు, ఒక తండ్రిగా తీసుకున్న నిర్ణయం… శ్యామ్ మరణాన్ని ప్రమాదంలా కనిపించేలా చేస్తుంది.

కానీ ఆ రహస్యం అక్కడితో ఆగదు.

శ్యామ్ ఫోన్ ఒక కానిస్టేబుల్ చేతికి చేరుతుంది.
అందులో ఉన్న రహస్యాలు బయటపడితే అంజు జీవితం మళ్లీ నాశనం అవుతుంది.

అప్పుడు రుద్ర ముందుకు వస్తాడు.

ప్రేమ కోసం కాదు…
అంజు తన గతం నుంచి బయటపడటానికి.

అతను చట్టాన్ని నమ్ముతాడా?
లేక అంజు జీవితాన్ని కాపాడటానికి తానే చట్టంగా మారతాడా?

ఒక తండ్రి చేసిన నేరం…
ఒక ప్రియుడు చేసిన నేరం…
ఒక అమ్మాయి కోసం దాచబడిన నిజాలు…
మరియు బయటపడితే అందరి జీవితాలను మార్చేసే ఒక ఫోన్.

“మంచి మనిషిని కాపాడటానికి చెడ్డ పని చేస్తే…
ఆ మనిషి నిజంగా మంచివాడేనా?”

ఇదే A NEW AGE LOVE STORY.

A Love Story With A Dark Secret.
A Thriller Built On Love, Guilt & Redemption.

Written by

WRITER RAGHUVARAN

Read More

Writer Raghuvaran - Crafting Words, Connecting World
hii 🫂 He is coming with new stories, let's see new worlds together👍🏽