Quotes by santhoshi Vadlamani in Bitesapp read free

santhoshi Vadlamani

santhoshi Vadlamani

@santhoshivadlamani034682


గతాన్ని తవ్వి కన్నీళ్లు తెచ్చుకోకు
రేపటిని చెక్కి చరిత్రను నిర్మించు

గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు
అవసరం తీరాక సహాయం
చేసినవారికి మర్చిపోకు

బలగం ఎంత పెద్దదైనా
కష్టాల్లో మనతో నిలబడేవారే
నిజమైన బంధువులు

Read More

✨ మంచి మాట ✨
మనిషి విలువ అనేది ఖరీదైన
బట్టల్లోనూ బైకుల్లోనూ
వస్తువులోనూ ఉండదు

మన పేరు వినగానే ఎంతమంది
ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందో
అదే నిజమైన గొప్పతనం

Read More

అమ్మను గౌరవించండి
ఆమె ప్రేమకు ప్రపంచంలో ధర లేదు

నాన్నను ఆదరించండి
అతని త్యాగం జీవితాంతం నిలుస్తుంది

కుటుంబాన్ని ప్రేమించండి
అదే నిజమైన ఆనందం

పిల్లలతో సమయం గడపండి
ఆ లక్షణాలే జీవిత సంపద

Read More

పుట్టడం గొప్ప కాదు బతకడం గొప్ప
ముంచి బతకడం గొప్ప కాదు
మంచిని పంచి బతకడం గొప్ప
నీకు నువ్వే గొప్ప అనుకోకు
నీ గురించి నలుగురు గొప్ప
చెప్పుకుంటే అప్పుడు గొప్ప.

ఎదురు తిరగడం పెద్ద విషయం కాదు
ఎవరికీ ఇబ్బంది రాకూడదని అణిగిమనిగి
ఉంటున్నాను.కానీ నా సహనాన్ని పరిక్షిస్తే
వాళ్ళకే నష్టం.....✨

Read More

సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయు
గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది.
స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతోంది.
అందుకే అంటారేమో ఏది జరిగినా అంతా మన మంచికే అని.

Read More

అర్ధానికి అపార్ధానికి తేడా కేవలం ఒకే ఒక అక్షరం
కానీ ఆ ఒక్క అక్షరానికి రెండు జీవితాలను బలి తీసుకునే శక్తి ఉంది

అనవసరం అనుకుంటే ఆ పని ఎంత సులువైన చేయకు
అవసరం అనుకుంటే ఆ పని ఎంత కష్టమైన వదలకు

ఇతరులతో పోల్చుకోవడం అనే వ్యాధి మన ఆనందాన్ని
హరించేస్తుంది.. మనకున్నది చూసి అనదించటం చూసి
నేర్చుకుంటేనే నిజమైన సంతోషం దొరుకుతుంది

Read More

మార్గమధ్యంలో
తెగిన చెప్పు విలువ

మధ్య రాత్రిలో
ఆగిన ఫ్యాన్ విలువ

కుళాయి చెడిన తర్వాత
రాని నీటి విలువ

ఉద్యోగం పోయిన తర్వాత
ఆదాయం విలువ

తోడు కోల్పోయిన తర్వాత
భార్య విలువ

జోడు పోయిన తర్వాత
భర్త విలువ...

ఇలా ఏదైనా సరే
పోయిన తర్వాత కానీ
వాటి విలువ తెలియదు!

అందుకే మనకు సేవ చేసే వస్తువులనైనా,మనుషులనైనా అందుబాటులో ఉన్నప్పుడే కాపాడుకోవాలి...!!

*🙏🌹శుభోదయం 🌹🙏*

Read More

జీవితంలో ముఖ్యమైనది ఒక్కటి--1
ఆరోగ్యం ఒక్కటే ఆ ఒక్కటే లేకుంటే
మిగతావి ఎన్ని ఉన్నా సున్నా తోనే
సమానం.ఆరోగ్యం బాగుంటే అన్నీ ఉన్నట్టే

Read More

మనం ఎక్కడ పుట్టినా మంచిగా బతకడం ముఖ్యం
బురదలో పుట్టిన కమలం అందంగా బయటకి
వస్తుంది....మన పుట్టుక సాధారణంగా ఉన్నా మన
లక్ష్యం మాత్రం గొప్పగా ఉండాలి...✨

Read More

🌼 ప్రకృతి పిలుపు 🌼
పచ్చని పూల గాలిలో పరిమళం వెదజల్లే వేళ,
పక్షుల గానంలో జీవితం సాగే వేళ…
ప్రకృతి మనసుకు మాటలు చెబుతుంది,
మనసులోని మౌనాన్ని మెల్లగా తాకుతుంది.
పర్వతాల నడుమ గాలి ఊపిరి,
నదుల ప్రవాహంలో కాలం నడక…
చెట్టుల నీడలో శాంతి దొరుకుతుంది,
పచ్చని లోకంలో నిజమైన సుఖం కనిపిస్తుంది.
సూర్యోదయం ఆశల రంగులు పూయగా,
సంధ్యారాగం మనసుకు నిద్ర పాడగా…
ప్రకృతి ప్రతి క్షణం ఒక పాఠం చెప్తుంది,
జీవితం అంటే అందాన్ని ఆస్వాదించడమే అంటుంది.
మనిషి దూరమైనా ప్రకృతి దగ్గరే ఉంటుంది,
మనసు బాధలో ఉన్నా దాన్ని ఆప్యాయంగా ఆదరిస్తుంది…
ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తు,
అదే మన జీవితానికి నిజమైన సత్యం.

Read More