Quotes by Yamini in Bitesapp read free

Yamini

Yamini Matrubharti Verified

@luckyvicky2615
(151)

నాన్నే నా ధైర్యం

నాన్న చెయ్యి పట్టుకొని
నడిచేటప్పుడు తెలియదు
నాన్నే నా ధైర్యం అని......

నా అడుగులు తడబడుతే
నా వెన్నుతటి నన్ను
ముందుకు నడిపించాడు...

నీడలా నా వెంటే ఉంటూ
ఓడిన ఫర్లేదు మళ్లీ ప్రయత్నించు అని నన్ను ప్రోత్సహించి
నిశీధి లో చిరుదీపమై
నాకు ఏళ్ళప్పుడు మార్గనిర్దేశం చూపించే నాన్న ......

ఇకపై లేడని,

ఇక మరల తిరిగి రాడని ,
నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలని,
ఏలా నా మనసుకు నచ్చచెప్పుకోవాలి ?
వింటదా… ఆయన లేడని!

- Yamini

Read More

నాన్నా నీ జాడ ఎక్కడ?

నింగి లోని జాబిల్లి ని అడిగా,
మబ్బుల చాటున నువ్వు ఉన్నావేమో అని...
ఉబికి వస్తున్న కన్నీళ్ళ ను అడిగా,
కను రెప్పల మాటున నువ్వు దాగి ఉన్నావేమో అని...


నువ్వు రోజు నడిచే దారిలో వెతికా,
నీ పాద ముద్రలు అయినా కాన వస్తాయోమో అని...
నా తనువును తాకుతున్న చల్లని గాలిని అడిగా,
నువ్వు ఎక్కడైనా కనబడినావా అని...
నిత్యం పూజించే దీపంను అడిగా,
నిన్ను చేరే మార్గం చూపమని....

నిన్ను తలవని క్షణం,
నిన్ను పిలవని ప్రాణం,
నిన్ను కొలవని దేహం,
నిన్ను చూడలేని నయనం వ్యర్థం!

- Yamini

Read More

నాన్నా,

నాకు ఓనమాలు నేర్పడానికి బెత్తం పట్టిన గురువుగా మారినావు,

నాకు మంచి చదువు అందించడానికి విద్యాలయాలు ఎన్నో వెతికావు,

నా అభ్యున్నతి కోసం నీ శ్రమను, రక్తాన్ని చిందించావు,

నేను ఎక్కడ ఉన్నానా గెలుపు కోసం చెప్పులు అరిగేలా తిరిగావు,

నా జీవితంలో స్థిర పడే వరకు నువ్వు కొవ్వొత్తిలా కరిగిపోయావు,

చివరికి నేను విజయం సాధించే సరికి నువ్వు నన్ను వదిలి వెళ్ళి పోయావు !

Read More

నాన్న జ్ఞాపకాలు

నాన్నా !

చల్లని వెన్నెలను కురిపించే చందమామలో నీ మనసును గమనిస్తున్నా...

ఎగిసిపడే సాగరపు అలలలో నీ పోరాట పటిమను గమనిస్తున్నా...

చీకట్లును చీల్చుకుని వచ్చె భాణుడిలో నీ ధైర్యాన్ని గమనిస్తున్నా...

పరిమళాలను వెదజల్లే పూల మొక్కలలో నీ సద్గుణాలను గమనిస్తున్నా....

అందనంత ఎత్తులో ఉన్న నింగిలో నీ ఔదార్యాన్ని గమనిస్తున్నా...

నేను తలచే ప్రతి జ్ణాపకంలో,
నేను నిరీక్షించే ప్రతి క్షణంలో,
నేను కార్చే ప్రతి కన్నీరులో,
నేను గెలిచే ప్రతి సందర్భంలో నీ రూపాన్ని దర్శిస్తున్నా..

Read More

నాన్న జ్ఞాపకాలు

నా కన్నులను ప్రమిదలుగా చేసుకొని,
ఆశలనే వత్తులు వేసి నీ రాకకై ఎదురు చూస్తున్నా...
నా పెదవులను వేణువుగా చేసుకొని,
నీ గొప్పతనం గురించి పాటగా ఆలపిస్తున్నా...

నా మనసును వనంగా చేసుకొని,
నీ జ్ఞాపకాల సుగంధాల పరిమళాలలో విహరిస్తున్నా...

నా యదను కోవెలగా చేసుకొని,
నీ ప్రతిమను ప్రతిష్టించి నిత్యం ఆరాధిస్తున్నా...
కరుణించి దర్శనం ఇవ్వు నాన్నా,
అరుదెంచి నన్ను నీలో ఐక్యం చేసుకో నాన్నా !!

Read More

నాన్న కవితలు

నాన్న !
నీకు నడక నేర్పించాడు,
నలుగురిని నీతో నడిపించమనే నడవడిక నేర్పించాడు.
నీకు మొదట రాత నేర్పించాడు,
అది నీ తలరాత మార్చేందుకు ప్రోత్సాహాన్నిచ్చాడు.

నీకు భయం వేస్తే ధైర్యాన్ని ఇచ్చాడు,
అతనికి భయం కలిగితే నిన్ను తలచుకున్నాడు.
నువ్వు తప్పు చేస్తే ఆవేశం చూపించాడు,
అసలు తప్పే చేయకుండా ఆరాటం చూపించాడు.
అతడు అస్తమిస్తూ నిన్ను అలరారింపచేశాడు.
ఓపిక లికపోయినా ఓదార్పు కోరుకోడు.
సత్తువ సన్నగిల్లినా సహనం కోల్పోడు.

అంతటి నాన్నకు నడమంత్రపు సిరి కాదు,
నిటారుగా నిల్చునే శక్తినివ్వు.
భుజం మీద వేసుకొని నిద్రపుచ్చిన నాన్నకు,
భుజం నువ్వై ధైర్యాన్నివ్వు.
అలుపెరుగని పోరాటం చేస్తున్న నాన్నకు,
ఆకలి తెలియనంత ఆనందాన్నివ్వు.

Read More

నాన్న విలువ - నాన్న కోసం

నిన్ను యెదన ఎత్తుకొని ఆరాటపడ్డ ఆ నాన్నకి…
నీ యెదుగుదల కోసం,
తన దేహాన్ని రాయిగా మలచిన ఆ నాన్నకి…

నీ చిరునవ్వు కోసం,
తన కన్నీళ్లని దాచుకున్న ఆ నాన్నకి…
నీ మర్యాదకోసం,
తన స్థానాన్ని పణంగా పెట్టిన ఆ నాన్నకి…

నీవు తిరిగి ఇచ్చే విలువ అనంతం అయ్యి ఉండాలి.
అంతే తప్ప ఆవేదన అయ్యి తనని కరిగించకూడదు…

-Yamini

Read More

నాన్న, ఈరోజు మీ పుట్టినరోజు మరియు ఈ ప్రత్యేక రోజున, మీరు ఎల్లప్పుడూ నాపై కురిపించిన ప్రేమకు నా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పుట్టినరోజు శుభాకాంక్షలు!

నాకు అన్నీ నేర్పించి, జీవితంలో నేను వేసిన ప్రతి అడుగులోనూ నాకు మద్దతు ఇచ్చిన ఆ వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నా జీవితంలో ఉన్నందుకు నేను మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు.

నువ్వే నా హీరో, నా ప్రాణ స్నేహితుడు, నా గురువు, నువ్వే నా బలానికి అతిపెద్ద మూలం. మీ పుట్టినరోజు ప్రేమతో నిండి ఉండాలని ఆశిస్తున్నాను.

నాన్న, ప్రేమ మరియు బలం యొక్క అర్ధాన్ని మీరు నాకు నేర్పించారు. మీతో గడిపిన సమయానికి నేను కృతజ్ఞురాలినని. మీకు రాబోయే రోజు చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. మీరు నా తండ్రిగా ఉండటం నా జీవితంలో నాకు లభించిన గొప్ప వరం. మీ రోజు ఆనందంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను.

నువ్వు నా తండ్రిగా ఉండటం నా అదృష్టం. నా కష్టసుఖాలలో నువ్వు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నావు, దానికి నేను నీకు కృతజ్ఞురాలినని నీకు తెలియజేయాలని కోరుకుంటున్నాను.

నాన్న, నేను మీ నుండి అన్నీ నేర్చుకున్నాను. మంచి మనిషిగా ఎలా ఉండాలో, ప్రేమకు, కుటుంబానికి ఎలా ప్రాముఖ్యత ఇవ్వాలో, నా లక్ష్యాలను చేరుకోవడానికి ఎలా కష్టపడి పనిచేయాలో. మీ బిడ్డగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను.

జీవితంలో ధైర్యం అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న. ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్న....ఎటువంటి సమస్య వచ్చినా సరే… ధీటుగా ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నది నిన్ను చూసే నాన్న.. తండ్రిగా మీరు చూపిన బాట మాకు పూల బాట. నాన్న....

నిజాయితీగా బ్రతకడమంటే ఏంటో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అలాంటి నిజాయితీ నాకు నేర్పిన నాన్న....గెలవాలంటే ముందు ప్రయత్నించాలి అని ఎప్పుడు చెబుతూ ఉండే మా నాన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Love you "NANNA"💖💞💕

Miss you "NANNA"😥😥

Read More

మార్పు చాలా విలువైనది

జీవన భారాన్ని నవ్వుతూ తలకెత్తుకోవాలి.
మార్గంలోని బాధలను చిరునవ్వుతో ఎదుర్కోవాలి మిత్రమా.
ముందుకు సాగే వారిని బాధలేనాడు ఆపగలిగినవి ?
మార్గం వెంట నడిచే వారిని ఆపదలేన్నడు ఆపలేవు మిత్రమా.

బాధలతో కన్నీరు కార్చక, నవ్వడం నేర్చుకో
జీవితంలో ఎవ్వరికైనా సరే ఉపయోగపడటం నేర్చుకో ,
చెమట చిందించి కష్టపడి కంటి నిండా నిద్రపో మిత్రమా.
ఈ నావ ఊగుతూ పోతుంది, నిశ్చింతగా ఉండు మిత్రమా.
అన్ని తలరాతలకు అతీతంగా నిన్ను నువ్వు మలచుకో మిత్రమా.

- Yamini

Read More

నీకు ఎవరూ లేరని బాధపడకు,
నీ మనస్సే నీకు తోడు…

చేయూతనిచ్చేవారు‌ లేరని ‌‌కృంగిపోకు,
చక్కని ‌‌ఆలోచనే నీకు విజయాలు తెచ్చు…
ఎవరూ ‌‌‌‌‌‌‌‌పట్టించుకోలేదని‌‌ పలుచన ‌‌అవకు,
నీవే ‌పలుకరించి గుర్తింపు ‌పొందచ్చు…
నడిపించే ‌‌వారు లేరని కలతపడకు,
నీవే నడిపే సూత్రధారిగా‌ ఉండు…
నవ్వ లేదని‌ ముడుచుకొని ఉండకు,
నీ నవ్వు ‌‌చూపి ఉత్సాహ పరుచు…
దారి కనపడలేదని‌‌ చతికిలపడకు ,
నీ అడుగుజాడలే‌ నీకు రాజమార్గం కావచ్చు…
ఎండిపోయిన ఆకులు చూసి బాధపడకు,
వచ్చిన చిగురు చూసి ఆనందించ‌వచ్చు…
‌‌‌‌చిన్న‌ చిరునవ్వుతో‌ పలకరింపుతో,
ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించు…
- Yamini

Read More