Who is he....??? - 2 in Telugu Fiction Stories by Neelu The sky books and stories PDF | అతడు ఎవరు....??? - 2

Featured Books
Categories
Share

అతడు ఎవరు....??? - 2












"మిస్... మీరు బాగానే ఉన్నారా?"

ఆ స్వరం వినగానే అనన్య ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టు తేరుకుంది.

ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తి ముఖం మీద నుంచి ఆమె చూపు మాత్రం మరలలేదు.

"అర్జున్..." అని మరోసారి నిదానంగా పిలిచింది.

అతను ఆశ్చర్యంగా ఆమెను చూశాడు.

"క్షమించండి... మీరు ఎవరినో పొరబడుతున్నారు. నా పేరు ఆర్యవ్ సింగ్."అని అతను అనగానే,,

"అబద్ధం!" అనన్య గొంతు వణికింది. "నాలుగేళ్లు ప్రేమించిన మనిషిని నేను గుర్తుపట్టలేనంటావా?"నువ్వు అబద్దం చెప్తున్నావ్ అని అంది ఆమె..


ఆర్యవ్ కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డాడు. తర్వాత టేబుల్ మీద ఉన్న బెల్ నొక్కాడు.

"కావ్య... ఒక గ్లాస్ నీళ్లు తీసుకురండి."అని చెప్పాడు అతను..




అప్పుడే అతని అసిస్టెంట్ కావ్య వచ్చి నీళ్లు ఇచ్చింది.
.


అనన్య చేతులు వణుకుతుండడంతో గ్లాస్‌ను కూడా సరిగా పట్టుకోలేకపోయింది.

"ప్లీజ్... కూర్చోండి," అన్నాడు ఆర్యవ్.

"నువ్వు నిజంగా నన్ను గుర్తుపట్టలేదా?" అని ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.

"లేదు."అని అన్నాడు అతను..


ఆ ఒక్క మాట ఆమె గుండెను మళ్లీ ముక్కలు చేసింది.

అప్పుడే ఆర్యవ్ ఫైల్ తీసుకోవడానికి చేయి ముందుకు చాచాడు.

అనన్య చూపు అతని మణికట్టు మీద పడింది.

ఒక చిన్న చంద్రవంక ఆకారంలోని మచ్చ...

ఆమె ఊపిరి బిగబట్టుకుంది.

"ఈ మచ్చ..."అంటూ ఆమె అంటుండగా,,

.

"ఏమైంది?"అంటూ ఆర్యవ్ వెంటనే చేయి వెనక్కి తీసుకున్నాడు..

"ఈ గాయం నీకు కాలేజ్ రోజులలో బైక్ నుంచి పడినప్పుడు అయింది. గుర్తుందా? నేను హాస్పిటల్‌కు తీసుకెళ్లాను..."అని అంది అనన్య..

ఆర్యవ్ ముఖంలో క్షణం పాటు చిన్న మార్పు కనిపించింది. కానీ వెంటనే తనను తాను సర్దుకున్నాడు.

"క్షమించండి. ఈ మచ్చ చిన్నప్పటి నుంచే ఉంది."అని అన్నాడు అతను..

"లేదు... నువ్వు అబద్ధం చెబుతున్నావు."

"మిస్ అనన్య..." అతని స్వరం గంభీరంగా మారింది...


"ఇది ఆఫీస్. దయచేసి మీ వ్యక్తిగత విషయాలను ఇక్కడికి తీసుకురావద్దు."అని సీరియస్ గా చెప్పాడు అతను..

ఆ మాటలు విన్న అనన్య నిశ్శబ్దంగా నిలబడిపోయింది.

ఏమీ మాట్లాడకుండా ఫైల్ తీసుకుని బయటకు వచ్చింది.

---

కారిడార్‌లో నడుస్తున్నా, ఆమె మనసు మాత్రం ఇంకా ఆ కేబిన్‌లోనే ఉంది.

లిఫ్ట్ దగ్గరకు వెళ్లి గోడకు ఆనుకుని నిలబడింది.

"అతను అర్జునే... కానీ ఎందుకు అలా మాట్లాడాడు?"అని అనుకుంటూ,,

ఆమె వెంటనే తన ఫోన్ తీసి గ్యాలరీ ఓపెన్ చేసింది.

పాత ఫోటోలు ఒక్కొక్కటిగా స్క్రీన్‌పై కనిపించసాగాయి.

బీచ్‌లో దిగిన సెల్ఫీ...

కాలేజ్ ఫేర్‌వెల్...

కాఫీ షాప్‌లో నవ్వుతూ తీసుకున్న ఫోటో...

ప్రతి ఫోటోలో ఉన్న అర్జున్ ముఖం, ఇప్పుడే చూసిన ఆర్యవ్ ముఖంతో అచ్చం ఒకేలా ఉంది.

"ఇది యాదృచ్ఛికం కాదు."తను కచ్చితంగా అర్యవ్ నే అని అనుకుంటూ,,

ఆమె మెల్లగా కళ్లను తుడుచుకుంది.

"ఏదో పెద్ద నిజం దాగి ఉంది. అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంది ఆమె..

అంతలో హెచ్‌ఆర్ మేనేజర్ ఆమె దగ్గరకు వచ్చాడు.

"మేడమ్... మీరు కొత్త సర్‌ను ఇంతకు ముందే తెలుసా?"అని అతను అనగానే,,

అనన్య ఒక్కసారిగా తేరుకుంది.

"ఎందుకు అలా అడుగుతున్నారు?"

"మీరు ఆయనను చూసిన వెంటనే చాలా ఎమోషనల్ అయ్యారు."అందుకే అడిగాను అని అన్నాడు
 అతను..


"అంతేం లేదు."

"సర్ రెండు రోజుల క్రితమే లండన్ నుంచి వచ్చారు. చాలా ప్రైవేట్ పర్సన్. ఆయన గురించి కంపెనీలో కూడా చాలా మందికి తెలియదు."అనీ అతను అంటుండగా,,

"మరి ఫ్యామిలీ?"

"దాని గురించి కూడా ఎవరితోనూ మాట్లాడరు."

ఆ మాటలు అనన్యలో మరిన్ని ప్రశ్నలు రేపాయి.

---

అదే సమయంలో...

ఆర్యవ్ తన కేబిన్ తలుపు లాక్ చేశాడు.

నెమ్మదిగా కుర్చీలో కూర్చుని కళ్లను మూసుకున్నాడు.

కొద్దిసేపటి తర్వాత టేబుల్ డ్రాయర్ తెరిచాడు.

అందులో పాత బ్రౌన్ కవర్ ఉంది.

దాన్ని తెరిచిన వెంటనే ఒక ఫోటో బయటకు జారింది.

ఆ ఫోటోలో...

అనన్య నవ్వుతోంది.

ఆమె పక్కనే అర్జున్ నిలబడి ఉన్నాడు.

ఆ ఫోటోను చూస్తూ ఆర్యవ్ కళ్లలో నీళ్లు మెరిశాయి.

"సారీ... అనన్య..." అని మెల్లగా అన్నాడు.

"నిన్ను బాధ పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు."అని అనుకున్నాడు..

అప్పుడే అతని ఫోన్ మోగింది.

స్క్రీన్‌పై నంబర్ మాత్రమే కనిపిస్తోంది.

వెంటనే లిఫ్ట్ చేసి 

"హలో..."అని అతను అనగానే,,

అవతలి వైపు నుంచి గంభీరమైన స్వరం వినిపించింది.

"ఆమె నిన్ను చూసింది."

ఆ మాట విని అర్యవ్ మౌనంగా ఉన్నాడు.

"జాగ్రత్తగా ఉండు. నిజం బయటపడకూడదు."

"నాకు తెలుసు."

"ఆమె ఏదైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే..."అని చెబుతూ,,

ఆ వ్యక్తి మాట మధ్యలోనే ఆపేశాడు.

కొన్ని క్షణాలు నిశ్శబ్దం.

"అవసరమైతే ఆమెను కూడా ఆపేయాలి."

ఆ మాట వినగానే ఆర్యవ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది.

"లేదు!" అని అతను గట్టిగా అన్నాడు.

"ఆమెకు ఏ హాని జరగకూడదు."

కాల్ వెంటనే కట్ అయిపోయింది.

ఆర్యవ్ గట్టిగా నిట్టూర్చి ఫోటోను తన గుండెలకు హత్తుకున్నాడు.

మరోవైపు, ఆఫీస్ భవనం బయట నిలబడ్డ అనన్య ఆకాశం వైపు చూసింది.

"నువ్వు ఎవరివైనా సరే... నీ నిజం తెలుసుకునే వరకు నేను ఆగను."

అని మనసులోనే ప్రమాణం చేసుకుంది ఆమె.

ఆమెకు ఆ సమయంలో తెలియదు...

దూరంగా పార్కింగ్ ఏరియాలో నిలబడ్డ ఒక నల్ల కారు లోపల నుంచి ఎవరో ఆమెనే గమనిస్తున్నారని..

ఆ కారులో కూర్చున్న వ్యక్తి పెదవులపై ప్రమాదకరమైన చిరునవ్వు మెరిసింది.

"ఆట ఇప్పుడే మొదలైంది..."అని అనుకుంటూ కార్ ను అక్కడ నుండి స్పీడ్ గా పోనిచ్చాడు...

కొనసాగుతుంది...


To be continued..

Tag your comments and do follow me 💕 💕 💕.


మీకు నా కథ నచ్చితే నన్ను ఫాలో చేసి కామెంట్స్ చేసి ప్రోత్సహించండి..



ఈ ప్లాట్ఫారం లో నేను కొత్తగా ఈ కథను రాస్తున్నాను.. అందరిలాగే నన్ను,నా కథలని ప్రోత్సహించి ఆదరిస్తారని కోరుకుంటున్న.......


మీ నీలు..♥️♥️♥️