పీఠిక: దేహాన్ని అమ్ముకున్న వాళ్ళకన్నా.. మనసుని అమ్ముకున్న మనుషులే ప్రమాదకరం
ఒక ఊరిలో ఒక స్త్రీ ఉండేది. బతుకు తెరువు కోసం ఆమె చీకటి వ్యాపారాన్ని (దేహ విక్రయం) ఎంచుకుంది. ఆ పని ఆమెకు ఇష్టం లేకపోయినా, గతి లేని పరిస్థితుల్లో తప్పక చేయాల్సి వచ్చింది. ఆమె దగ్గరకు వచ్చే వారెవరూ ఆమెకు కూడా ఒక మనసు ఉంటుందని, భావాలు ఉంటాయని ఆలోచించే వారు కాదు. కేవలం తమ అవసరం తీర్చుకుని వెళ్లిపోయేవారు.
అలాంటిసమయంలోఒకరోజు ఒక కొత్త వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. మొదట ఆమెను దగ్గరకు తీసుకున్నప్పటికీ, వెంటనే ఏదో తెలియని పశ్చాత్తాపంతో "ఇది తప్పు.. నేను ఈ పని చేయలేను" అనుకుంటూ ఒక మూల కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తన దగ్గరకు వచ్చిన వారు ఎవరూ ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. అతనిలో ఏదో మంచితనం కనిపించి, అతని దగ్గరకు వెళ్లి "ఏమైంది?" అని అడిగింది
అప్పుడు ఆ వ్యక్తి "నన్ను క్షమించు, నేను ఇలా ప్రవర్తించకూడాల్సింది" అని అన్నాడు. అతని మాటల్లోని నిజాయితీ ఆమె మనసును తాకింది. ఆమె అతన్ని లేపి మంచం మీద కూర్చోబెట్టింది. ఇద్దరూ ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఆ రాత్రి వారి మధ్య కలిగిన అనుబంధం శారీరకమైనది మాత్రమే కాదు, మనసులకు సంబంధించినది. తన జీవితంలో అంతటి గొప్ప అనుభూతిని ఆమె ఎప్పుడూ పొందలేదు. ఎంతోమంది వచ్చి వెళ్లినా, మొదటిసారి ఒక మనిషిగా గౌరవం, ప్రేమ దక్కడం ఆమెకు ఒక మరువలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఆ రాత్రి గడిచిన తర్వాత, ఆమె ఆ వ్యక్తికి కొంత డబ్బు ఇచ్చి, "ఈ డబ్బుతో నీ ఇంట్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకో" అని చెప్పింది. దానికి అతను ఆశ్చర్యపోయి, "నిజానికి నేను కదా నీకు డబ్బులు ఇవ్వాలి!" అన్నాడు. కానీ ఆమె సున్నితంగా తిరస్కరిస్తూ, "వద్దు, ఇప్పుడు నీకు ఈ డబ్బు చాలా అవసరం. వెళ్లి మీ నాన్నగారిని ఆసుపత్రిలో చూపించి, మందులు కొనుక్కో" అని చెప్పిఅతన్ని పంపించివేసింది.
ఆ తర్వాత రోజుల్లో ఎంతోమంది ఆమె దగ్గరకు వచ్చారు, కానీ ఆ వ్యక్తి ఇచ్చిన ఆత్మీయతను, గౌరవాన్ని ఆమె మరెక్కడా పొందలేకపోయింది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. అతడిని చూడగానే ఆమెలో తెలియని ఉత్సాహం.. ఒక భార్య తన భర్త కోసం ఎలాగైతే ముస్తాబవుతుందో, అంత అందంగా తయారై అతని ముందు నిలబడింది.
ఈసారి అతను ఆమెను ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు. ఆమె చేతులు పట్టుకుని ముద్దుపెట్టుకుంటూ, నెమ్మదిగా చెంపలపై నిమురుతూ తన కౌగిలిలో బంధించాడు. ఆమెపై ముద్దుల వర్షం కురిపిస్తూ తన ప్రేమను వ్యక్తపరిచాడు. వారిద్దరూ ఒకరినొకరు మైమరిచి అన్యోన్యంగా కలిసిపోయారు. రెండోసారి అతను కలిసినప్పుడు ఆమెకు అంతకు మించిన మధురానుభూతి కలిగింది. ఆ రాత్రి వారిద్దరి జీవితాల్లో ఒక మరువలేని, మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది.
ఆ రాత్రి గడిచిన తర్వాత, వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. "మా నాన్నకు ఇప్పుడు ఆరోగ్యం బాగుంది, కానీ ఇప్పుడు మా చెల్లి పెళ్లి చేయాలి" అని తన బాధ్యతల గురించి ఆ వ్యక్తి చెప్పాడు. అది విన్న ఆమె, "ఈసారి నీ చెల్లి పెళ్లి కూడా అయిపోతే నీ బాధ్యతలన్నీ తీరిపోతాయి, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు" అని అంటూ అతనికి కొంత ఆర్థిక సాయం చేసింది. ఈసారి ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా, కృతజ్ఞతతో ఆ డబ్బు తీసుకుని, ఆమెను ఆత్మీయంగా కౌగిలించుకుని నుదుటిపై ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు
ఆమె బయటకు వచ్చి అతడిని సాగనంపింది. లోపలికి వచ్చాక అద్దంలో తన రూపాన్ని చూసుకుని ఆమెకు తనపై తనకే సిగ్గు కలిగింది. అతను తనను ఎంత ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడో, తనపై ఎలా ముద్దుల వర్షం కురిపించాడో గుర్తు చేసుకుంటూ మురిసిపోయింది. ఆ మధుర జ్ఞాపకాల్లో మునిగిపోయి ఎప్పుడు నిద్రపోయిందో ఆమెకే తెలియదు.
మళ్ళీ చీకటి పడింది.. ఆమె వృత్తి ధర్మం ప్రకారం పని మొదలుపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కానీ ఈసారి ఆమె మనసు వికలమైంది. "ఇకపై ఈ చీకటి పని చేయకూడదు" అని దృఢంగా నిశ్చయించుకుంది. ఎవరు వచ్చినా సరే తన శరీరాన్ని తాకనివ్వకూడదని అనుకుంటున్న తరుణంలో.. మళ్ళీ అదే వ్యక్తి వచ్చాడు. కానీ ఈసారి అతనిలో చలనం లేదు, మౌనంగా ఉండిపోయాడు. అది గమనించిన ఆమె, అతని దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేసి, "ఏమైంది?" అన్నట్టుగా ఆందోళనతో చూసింది.
అతను ఒక్కసారిగా ఆమె మీద పులిలా విరుచుకుపడి, మంచం మీదకు తోసేశాడు. తలుపు వేయలేదని, లైట్ ఆర్పలేదని ఆమె చెబుతున్నా అతను వినిపించుకోలేదు. ఉడుం పట్టు పట్టినట్టు ఆమెను గట్టిగా బంధించాడు. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. మొదటిసారి అమాయకత్వం, రెండోసారి ప్రేమ.. మరి ఈ మూడోసారి ప్రవర్తనను ఏమనాలి? అని ఆమె మనసులో ప్రశ్నించుకుంది.
అతను శృతి మించుతున్నాడు, ఆమెను విపరీతంగా గాయపరుస్తున్నాడు. అతని ప్రవర్తన చాలా విచిత్రంగా, కసిగా ఉంది. ఎంత నొప్పి కలిగినా ఆమె మౌనంగా భరించింది. కాసేపటికి అతను శాంతించాడు. ఆమె నీరసంగా, నెమ్మదిగా లేచి కూర్చుని అతని వైపు చూసింది. ఆమె పరిస్థితి చూసి అతనే నివ్వెరపోయాడు. ఆమె పెదవి వాచిపోయింది, ముఖం ఎర్రబడింది, జుట్టు చెల్లాచెదురైపోయింది. కనీసం మాట్లాడలేని స్థితిలో ఆమె ఉంది.
అతను నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి, చేతులు పట్టుకుని "నన్ను క్షమించు" అని వేడుకున్నాడు. ఆమె ఎంతో సంయమనంతో, "నువ్వే కదా.. ఎందుకు అంత బాధపడుతున్నావు?" అని అతడిని ఓదార్చింది. ఓపిక తెచ్చుకుని లేచి, బీరువా దగ్గరకు వెళ్లి తన దగ్గర మిగిలి ఉన్న డబ్బులన్నీ తీసి అతనికి ఇచ్చింది. కానీ ఈసారి అతను "ఇవి నాకు సరిపోవు" అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఆమె కాసేపు ఆలోచించి, "నాకు నాలుగు రోజులు సమయం ఇవ్వు, సర్దుబాటు చేస్తాను" అని చెప్పింది.
అతను ఆ డబ్బులు తీసుకుని మౌనంగా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక ఆమె ఆ గదిలో ఒంటరిగా ఉండిపోయింది. ఆమె కళ్ళలో నీళ్లు లేవు, మనసులో సంతోషం లేదు.. కేవలం ఒక రకమైన దిగ్భ్రాంతి (Shock). తనని ఇంతలా ప్రేమించిన మనిషిలో ఈ మార్పు ఏమిటో ఆమెకు అర్థం కాక నిర్వేదంలో మునిగిపోయింది.
మరుసటి రోజు ఆమె శరీరంసహకరించకపోయినా, అతనికి ఇచ్చిన నాలుగు రోజుల గడువు గుర్తొచ్చి పట్టుదలతో లేచింది. వేరే వ్యక్తులు తనను తాకుతుంటే అసహ్యం వేస్తున్నా, తన శరీరాన్ని పువ్వు నల్లిపినట్టు నలుపుతున్న కేవలం అతని మీద ప్రేమ, అతనికి డబ్బు అందించాలనే ఆశతో మళ్లీ ఆ వృత్తిలోకి దిగింది. ఇదివరకు రాత్రిపూట మాత్రమే చేసే పనిని, ఇప్పుడు మూడు పూటలా చేస్తూ తన శక్తికి మించి కష్టపడింది. వచ్చేవాడు శాడిస్ట్ అయినా, పెట్టే టార్చర్ భరించరానిదైనా.. ఆమె మౌనంగా భరించింది. తన ఓపిక నశిస్తున్నా, అతనికి ఇచ్చిన మాట మాత్రమే ఆమెకు గుర్తొచ్చింది.
నాలుగు రోజులు గడిచాయి. అతను రానే వచ్చాడు. కానీ, ఈ నాలుగు రోజుల్లో ఆమె రూపురేఖలే మారిపోయాయి. నీరసించిపోయిన ఆమెను చూస్తే 'ఈమె ఆమేనా?' అనే సందేహం కలిగేలా ఉంది. ఆమె కష్టపడి సంపాదించిన డబ్బును అతనికి ఇచ్చింది. అతను అది తీసుకుని వెళ్ళిపోయాడే తప్ప, కనీసం "ఎలా ఉన్నావు?" అని కూడా అడగలేదు. ఆమె పిచ్చి మనసు మాత్రం "అతను ఏదో తొందరలో ఉండి ఉంటాడు" ఎంత కష్టం లో ఉన్నాడో ఏమిటో అని అతడిని సమర్థించుకుంది. చెల్లి పెళ్లి అయిపోయింది, నాన్న ఆరోగ్యం బాగుంది.. మరి ఇప్పుడు ఇంత డబ్బు ఎందుకు? అని కనీసం అడగాలని కూడా ఆమెకు అనిపించలేదు. అతనిపై ఆమెకు ఉన్నది అంతటి అగాధమైన ప్రేమ!
రెండు వారాలు గడిచాయి. ఒకరోజు అతను ఎంతో సంతోషంగా, చేతిలో స్వీట్స్ పట్టుకుని వచ్చాడు. అతడిని కాసేపు కూర్చోమని చెప్పి.. ఆమె అతనికి నచ్చిన ఎరుపు రంగు చీర కట్టుకుని, తలనిండా మల్లెపూలు పెట్టుకుని, ఒక పెళ్లికూతురిలా ముస్తాబై అతని ముందుకు వచ్చింది.
లక్ష్మి పెళ్లికూతురిలా ముస్తాబై అతని ముందుకు రాగానే, అతను ఆనందంతో ఆమెను ఎత్తుకుని గాల్లో తిప్పుతూ "లక్ష్మీ!" అని గట్టిగా పిలిచాడు. అతని సంతోషమే తన సంతోషం అనుకున్న లక్ష్మి, "ఏమిటి ఇంత సంతోషం? అసలు ఏం జరిగిందో చెప్పండి" అని అడిగింది. అతను ముందుగా ఒక స్వీట్ తీసి ఆమె నోట్లో పెట్టి, "లక్ష్మీ, ముందు నన్ను క్షమించు" అన్నాడు.
ఆమె వెంటనే అతని నోటిపై చేయి వేసి, "అలా అనకండి, నేను తట్టుకోలేను. అసలు మీరు ఏం చేశారని క్షమాపణ అడుగుతున్నారు?" అని అమాయకంగా అడిగింది. అప్పుడు అతను తలదించుకుని నిజం ఒప్పుకున్నాడు. "ఆ రోజు నీ దగ్గర డబ్బులు తీసుకుని ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాను కదా.. చెల్లి పెళ్లి అయిపోయాక నాకు జూదం ఆడటం వ్యసనంగా మారింది. ఒకరోజు జూదంలో నా దగ్గర డబ్బులు లేవని పక్కన ఉన్నవాడు హేళన చేసేసరికి, ఆ కోపంలో నీ దగ్గరకు వచ్చి అలా కసిగా ప్రవర్తించాను" అని బాధపడ్డాడు.లక్ష్మి అతడిని ఓదార్చుతూ, "నేనే కదా.. దానికే అంత బాధ ఎందుకు?" అని అంది. అతను ఆత్మీయంగా ఆమెను తన ఒడిలోకి తీసుకుని, "ఇప్పుడు నేను ఆ జూదం మానేశాను, మళ్ళీ ఎప్పుడూ ఆ పని చేయను" అని మాట ఇచ్చాడు. ఆ రాత్రి వారిద్దరి మధ్య దూరం కరిగిపోయింది. శ్వాసే కాదు శరీరం కూడా ఇద్దరు వ్యక్తులు కాక, ఒక్కటే ప్రాణం అన్నట్టుగా ఆ మధుర క్షణాలను గడిపారు. అక్కడ ఒకరిని మించి ఒకరు యుద్ధం చేయడం మొదలుపెట్టారు లక్ష్మీ తనని ఎంత ఇష్టపడుతుందో ఆ ప్రేమను మొత్తం ఆ రాత్రి అతని మీద కురిపించింది.
కాసేపటి తర్వాత అతను ఆమెకు కొంత డబ్బు ఇవ్వబోయాడు. లక్ష్మి వద్దు అంటున్నా వినకుండా, "ఉంచుకో లక్ష్మీ.. నాన్నకు ఆరోగ్యం కుదుటపడింది, చెల్లి పెళ్లి అయింది, ఇల్లు కూడా మరమ్మతులు చేయించాను. ఇక మనకు ఎలాంటి ఇబ్బందులు లేవు" అని చెప్పాడు. అప్పుడు లక్ష్మి అతని కళ్లలోకి చూస్తూ, "అయితే నేను ఇకపై ఈ వృత్తి చేయను. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా?" అని అడిగింది.