మీ అమ్మ నిన్ను కని అది చచ్చింది... నిన్ను నేను చేర తీసి తీసుకువచ్చి నువ్వు చావకుండా చూసుకున్నందుకు ఇప్పుడు నీకు రుణం తీర్చుకునే అవకాశం దొరికింది..!
అదైనా నిలబెట్టుకొని ఏడువు అని కచ్చితంగా చెప్తారు కనుక మహాలక్ష్మి గారు....
మరి నానమ్మ నేను అక్క ఒకటి కాదని తెలిస్తే అని భయంగా అడుగుతుంది సహన...
*************
1 గంట తర్వాత....
పూజారి గారు మంగళ వాయిద్యం వాయించండయ్యా అని... పెళ్లి కొడుకు చేతికి తాళిని ఇచ్చి పెళ్లికూతురు మెడలో కట్టయ్యా అంటారు....
ఆ పెళ్ళికొడుకు ఎంతో సంతోషంగా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అని సహనా మెడలో తాళిని కట్టి ఆమె మెడపై గట్టిగా గిల్లుతాడు....
సహన ఉలిక్కిపడి అమ్మ... అని చిన్నగా అంటూ ఉంటే కనకమహాలక్ష్మి గారు మండి పడిపోతూ వీడికి అస్సలు ఆగట్లేదు కదా..! అంటే
అయ్యో బంగారం లాంటి నా కూతురు చేసుకోవలసినది వాడిని ఇది చేసుకుంది అని కావేరి గారు ఇద్దరూ తిట్టుకుంటారు నవ దంపతుల్ని....
ఇక్కడ ఇంత జరుగుతున్నా కావేరి భర్త అరుణ్ గారు మాత్రం ఏది పట్టించుకోకుండా దేనిని లెక్కచేయకుండా జరిగిన తంతు అలా చూస్తూ ఒక బుద్ధ విగ్రహంలా నిలబడి పోతారు ఒక పక్కకి....
మరొక అరగంట సమయం తర్వాత ఆ పెళ్లి తతంగం అంతా పూర్తయ్యి పెళ్ళికొడుకుని పెళ్లికూతురుని బయటకు తీసుకొచ్చి అరుంధతి నక్షత్రం చూపించమని పూజారి గారు చెప్తారు...
ఆ అబ్బాయి ఆ అమ్మాయి భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఆ తర్వాత తన నడుము మీద చేయి వేసి... ఆకాశం లోని నక్షత్రాన్ని చూపిస్తూ
బంగారం నువ్వు ఎప్పుడూ నాతో ఇలాగే క్లోజ్ గానే ఉండాలి.... నేను నిన్ను ఎంత ప్రేమించానో తెలుసా..? ఎంత ఇష్టపడ్డానో తెలుసా.!?
నీతో మాట్లాడనివ్వలేదు వీళ్ళు మాట్లాడదామని కూడా చూశాను... పోనీలే లైవ్ లో కాకపోయినా కనీసం కాల్ లో అయినా మాట్లాడదాం అనుకున్నాను....
అలా కూడా మాట్లాడకూడదు మాకంటూ కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు , వ్యవహారాలు ఉన్నాయన్నారు పోనీలే సరే అని ఊరుకున్నాను....
కనీసం ఇప్పుడైనా నీ అందమైన మొహాన్ని చూద్దాం అనుకుంటే ఇలా మేలిముసుగుతో తీసుకువచ్చారు...
అసలు ఏంటి బంగారం మీ ఆచారాలు..!? నాకు ఏమి నచ్చలేదు.! మనం తర్వాత అబ్రాడ్ వెళ్ళిపోతాం...
అక్కడేమి నువ్వు ఇటువంటి చెత్త ఆచారాలు అన్ని పాటించక్కర్లేదు... చాలా ఫ్రీగా నార్మల్ గా ఉండొచ్చు అని అతను అలా ఫ్లో లో చెప్పుకుంటూ వెళ్లిపోతాడు...
ఇక్కడ సహన కంగారుపడుతూ దేవుడా మేలు మూసుకు తీస్తే నేను అక్కను కాదు అని తెలిసిపోయి... ఇప్పుడు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు ఇతను అప్పుడు చంపినా చంపేస్తాడేమో.!? అని వణికి పోతూ ఉంటుంది...
తను అలా వనకడం గమనించిన పెళ్ళికొడుకు ఎందుకు అలా చివరి అవుతున్నావ్ ఏమైంది అని కంగారుగా అడుగుతాడు...
సహన కవర్ చేస్తూ అది..! అది..! నా... నా... నడుము... మీ.. మీద... చెయ్యి... అని తడబడుతూ చెప్తే...
ఓహ్ నడుం మీద చెయ్యి వేసానని అందరిలో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా.!?
ఒకే ఒక్కసారి అంటాడు అతను...
సహనకి అర్థం కాక ఏంటి..!? అని కంగారుగా అడుగుతుంది
అతను ఆమె నడుము పై గట్టిగా ప్రెస్ చేసి సరేలే అని చెయ్యి తీసేస్తాడు....
అతను అలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయని సహన గుండె వేగం పెరిగి ఒక్కసారిగా డబల్ స్పీడ్ లో కొట్టుకుంటూ ఉంటుంది....
తనకి తన మీదే అసహ్యం కలుగుతూ..! " అమ్మ తెలిసి చేసిందో... తెలియక చేసిందో.. ఏదో తప్పు చేసేసింది.! నేను పుట్టాను.!"
కానీ ఇక్కడ జరిగింది ఏంటి నేను తెలిసే అక్క జీవితంలోకి వెళ్తున్నానా.!? ఇప్పుడు అతను నన్ను చూస్తే ఏం గొడవ అవుతుందో.. ఏంటో.!? నాకు ఏమీ అర్థం కావట్లేదు.
భగవంతుడా ఈ గండం నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలి...
ఇంత ప్రేమగా చూసుకునే వాడు మొగుడుగా వస్తే వదిలేసుకుని ఇదెక్కడికి పోయి చచ్చిందో... అని తన కళ్ళ వెంట నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి....
ఆ తంతు కూడా పూర్తి కావడంతో ఆ తర్వాత వాళ్ళ ఇద్దరిని తీసుకువెళ్లి పెళ్లికూతురుని ఒక గదిలో పెళ్ళికొడుకుని మరొక గదిలో కూర్చోబెడతారు...
30 మినిట్స్ అయినా తర్వాత....
అప్పుడే షణ్ముఖ్.. షన్ను.... అనుకుంటూ వస్తారు పెళ్ళికొడుకు తల్లి రేవతి గారు...
షణ్ముఖ్ చెప్పమ్మా ఏంటి అని అడుగుతాడు...
ఏమీ లేదు నాన్న ఇంకా అప్పగింతలు అయిపోతే మనం మన ఇంటికి బయలుదేరాలి అంటారావిడ....
ఆ అలాగే పదమ్మ అని షణ్ముఖ్ , రేవతి గారు ఇద్దరు కూడా బయటకు వెళ్తారు....
అప్పుడే అరుణ్ గారితో మాట్లాడుతూ ఉంటారు షణ్ముఖ్ తండ్రి శివ గారు...
రేవతి గారు "శివ గారి దగ్గరికి వెళ్లి ఏవండీ మనకి టైం అవుతుంది వెళ్లాలి కదా "అంటారు.
దాంతో అరుణ్ గారు వెంటనే కావేరి గారి దగ్గరకు వెళ్లి అప్పగింతలు ఇస్తే వాళ్ళు బయలుదేరిపోతారు మన అమ్మాయి ఎక్కడ ఉంది అని అడుగుతారు...
1. ఆ మెలిముసుగు వెనుక రహస్యం
బయట పడితే...!?
షణ్ముఖ్ రియాక్షన్ ఎలా ఉంటుంది..!?
2. సహన జీవితం ఏ మలుపు తిరగనుంది..!?
3. సహస్ర ఎక్కడికి వెళ్లిపోయింది...!?
నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం....