I loved only you. - 1 in Telugu Love Stories by sharanya books and stories PDF | ప్రేమించా నిన్నే... - 1

Featured Books
Categories
Share

ప్రేమించా నిన్నే... - 1

అది ఒక పెద్ద కళ్యాణమండపం అక్కడ పెళ్లి జరగడానికి కావలసినవన్ని  సిద్ధం చేసి పెళ్ళికొడుకుపిలిపించారు. 


అతను వర పూజ చేస్తూ ఉండగా అతని మొహంలో కళాకాంతులు వెలిగిపోతూ కనిపిస్తున్నాయి... అతను చాలా సంతోషంగా ఉన్నాడు 


ఎప్పుడెప్పుడు  తను ప్రేమించిన అమ్మాయి వచ్చి అతని పక్కన నిలబడుతుంది..! ఎప్పుడు తనకి సొంతమవుతుంది..  అని అనుకోని


నా ప్రేమ నీకు మన ఫస్ట్ నైట్ రోజు చూపిస్తాను..  పెళ్ళికి ముందు నిన్ను టచ్ చేస్తే...  అది పవిత్ర బంధం అవ్వదు...


అలా నువ్వు దేని దగ్గర కూడా తక్కువగా ఫీల్ అవ్వకూడదు....   అని తనని తలుచుకుంటూ చాలా సంతోషపడుతూ పూజ చేస్తూ ఉన్నాడు....


అప్పుడే అక్కడికి పెళ్లికూతురు అమ్మ అయినా కావేరి గారు గబగ వచ్చి అత్తయ్య... అత్తయ్య... అది మరి అని నానుస్తూ ఉంటే...


దవడ పగిలిపోద్ది త్వరగా చెప్పకపోతే అని కసురుకుంటారు  కావేరి అత్త కనక మహాలక్ష్మి గారు....


అది అత్తయ్య ఏంటంటే మన సహస్ర కనిపించట్లేదు... అని కుండ బద్దలు కొట్టినట్టుగా ఆవిడ చెప్పడంతో  ,

కనకమహాలక్ష్మి గారు బాబోయ్.!  ఎంత పని చేసింది పనికిమాలింది..! ఇది ప్రేమించిన వాడితో లేచిపోయినట్టుంది....

ఇదేంటే ఇలా చేసింది..  ఈ పిల్లోడు చక్కగా చదువుకున్నాడు..  సొంత కంపెనీ ఉంది ,ఎంత అందంగా ఉన్నాడు.!  బంగారంలాంటి కుటుంబం... 


ఇలాంటి వాడిని వదిలేసి ఆ ఆటో వాడితో లేచిపోవడమేంటే  ఇది.!?  అయినా చెప్పుకోవడానికి చండాలంగా కూడా ఉంటది అసలు ఏం చేస్తుంది అది..!? అని కంగారుపడుతూ కనక మహాలక్ష్మి గారు కావేరిని పిచ్చ తిట్లు తిడుతున్నారు...


అది లేచిపోతే నన్ను తిడతావేంటి అత్తయ్య ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించడం పోయి అని ఆవిడ కొంచెం కోపంగా అనేసరికి...  


ఏంటే నోరులేస్తుంది మేనకోడలు వి అని కూడా చూడకుండా పడుకోబెట్టి తొక్కుతాను ఏమనుకుంటున్నావో.!? 

భగవంతుడా  ఏం చెయ్యాలి దారి చూపించవయ్య అని అనుకుంటూ ఉండగా....  

ఆహ్.. ముందు ఇప్పుడు ఆ సహాన ఎక్కడ చచ్చిందో వెతుకు అని అంటుంది కనక మహాలక్ష్మి గారు...


ఇప్పుడు అది ఎందుకు అత్తయ్య దానికి గాని చేస్తావేంటి పెళ్లి..! అసలే మంచి కుటుంబం ఇదేమోమీ అబ్బాయ్ ఉంచుకున్న దానికి పుట్టిన కూతురు... 

వాళ్ళకి కులం , గోత్రం పట్టింపులు ఉన్నాయి... దీనిని వాడికి ఇచ్చి ఎలా చేస్తావు అత్తయ్య అని కావేరి అంటే ఇప్పుడు పరువు పోగొట్టుకునే కంటే 


ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో అదే మంచి దారి నువ్వు మూసుకొని చెప్పింది చెయ్ లేకపోతే నిన్ను చంపేస్తాను అని కఠినంగా చెప్తారావిడ....



ఈ ముసల్ది చెప్పినట్టు వినడమే మంచిదిలే అనుకొని ఒసేయ్ సహన..   సహన...   ఎక్కడ చచ్చావ్ అని కోపంగా అరుచుకుంటూ మొత్తం ఆ పెళ్లి మండపం అంతా తిరుగుతుంది కావేరి గారు...


అదే మండపంలో వెనకాల పెళ్ళికి వచ్చిన బంధువులందరికీ వంట చేస్తూ ఉండగా అక్కడ ఒక పెద్ద కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని ఆ పొగకి దగ్గు వస్తూ ఉంటే ,  ఏంటో నా బ్రతుకు అని బాధగా అనుకుంటూ ఉంటుంది సహన. 


ఆవిడ సహనాని చూసిన వెంటనే ఏయ్ సహన అర్జెంటుగా నువ్వు ఇలా రా అని పిలుస్తారు....


సహన ఏంటండీ అని భయం గా అడుగుతుంది....

నిన్ను మా అత్తయ్య గారు పిలుస్తున్నారు నువ్వు అర్జెంటుగా ఇలా రా నాతో అని తన చేతిని పట్టుకొని నడువు ముందు అని కోపంగా అంటారు కావేరి గారు....


సహన ఎందుకు పిలుస్తుంది నానమ్మ అని మనసులో అనుకొని అలాగేనండి.!  పదండి.!  అని ఆవిడ వెనకాలే వెళ్తుంది...


అది ఆ కళ్యాణ మండపంలోని పెళ్లికూతురికి ఇచ్చిన రూమ్ కనకమహాలక్ష్మి గారు అక్కడ ఉండి సహన రాగానే ఏయ్ సహన నువ్వు అర్జెంట్గా ఈ చీర అది కట్టుకొని పెళ్లికూతురులా ముస్తాబవ్వవే.! అని అంటారు...


నేనెందుకు అవ్వాలి నానమ్మ ఇప్పుడు పెళ్లి కూతురిలా అది అక్కకి వచ్చిన సంబంధం కదా నాకు చేస్తాను అంటారేంటి.!?  అని భయపడిపోతూ అడుగుతుంది సహన.


ఆహా...! అవునా... అక్కకి వచ్చిన సంబంధమా అమ్మ నువ్వు చేసుకోకూడదా.!  అలా అయితే పెళ్లయిందని తెలిసి కూడా మీ అమ్మ నా కొడుకుతో ఎందుకే పడుకుంది...  ఎందుకే నిన్ను కన్నది.!  అని తిడుతుంది కనుక మహాలక్ష్మి గారు....


ఆ ఒక్క ముక్కతో సహన గుండె విలవిలలాడిపోతూ అలాగే నానమ్మ చేసుకుంటాను ఇంకా మా అమ్మని ఏమీ అనకు అని కళ్ళలో నీళ్ళు తెచ్చుకుని బాధగా చెప్తుంది.... 


అబ్బో పెద్ద అమ్మని అంటే పౌరుషం పొడుచుకుని వచ్చేస్తుంది పిల్లకి...   అని గబగబా రెడీ అవ్వవే పెళ్లి ముహూర్తానికి టైం అయిపోతుంది....


ఇదిగో ముందే చెప్తున్నాను పెళ్లి చేసుకున్నాను కదా అని ఆ అబ్బాయి కాలి గోటి దగ్గర కూడా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు.....


అది ఎప్పటికైనా మీ అక్క స్థానం నువ్వు టెంపరరీగా వాడి దగ్గరికి వెళ్తున్నావ్ అంతే... 


తర్వాత అక్క రాగానే నీ తాళి అలా తీసి దాని మెడలో వేసేయవలసిందే....



మీ అమ్మ నిన్ను కని అది చచ్చింది...   నిన్ను నేను చేర తీసి తీసుకువచ్చి నువ్వు చావకుండా చూసుకున్నందుకు ఇప్పుడు నీకు రుణం తీర్చుకునే అవకాశం దొరికింది..!  

అదైనా నిలబెట్టుకొని ఏడువు  అని కచ్చితంగా చెప్తారు కనుక మహాలక్ష్మి గారు....  


మరి నానమ్మ నేను అక్క ఒకటి కాదని తెలిస్తే అని భయంగా అడుగుతుంది సహన...



1. మరి ఈ పెళ్లి జరుగుతుందా..!? 

2. పెళ్లి కూతురు మారిపోతే... 
    పెళ్ళికొడుకు ప్రేమ ఏం అవుతుంది...!?

3. ఈ బంధం నిలబడుతుందా..!?