ట్రావెలర్ గారు ఎన్నో దేవాలయాల విశేషాలు మీతో పంచుకుంటాను
నా పర్యటనలో భాగంగా కాశీ క్షేత్రం బయలుదేరదామా...
కాశీ క్షేత్రం ప్రతి హిందువు తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకునే అపూర్వమైన క్షేత్రం
పార్వతీ పరమేశ్వరులు స్వయంగా కొలువుదీరిన ప్రదేశం.
కాశి క్షేత్రం వెళ్లాలి అనుకునేవాళ్లు తప్పకుండా 5 రోజుల
సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం.
ఎందుకంటే...
ప్రయాణానికి రెండు రోజుల సమయం పడుతుంది
అంటే వెళ్లడానికి ఒక్కరోజు రావడానికి ఒక రోజు..
మిగతా రోజులు అక్కడ ఉన్న అన్ని దేవాలయాలు సందర్శించవచ్చు..
కాశి క్షేత్రంలో మనం చూడవలసిన ప్రదేశాలు...
కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయం...
కాశి అన్నపూర్ణమ్మ తల్లి దేవాలయం..
విశాలాక్షి అమ్మ దేవాలయం...
వారాహి అమ్మవారి దేవాలయం
కాలభైరవ స్వామి దేవాలయం..
సంకట మోచన దేవాలయం..
కాశి గంగా ఘాట్లు...
గవ్వలమ్మ తల్లి దేవాలయం...
దుర్గమ్మ దేవాలయం..
మృత్యుంజయ మహదేవ్ మందిర్...
ఇస్కాన్ టెంపుల్...
వీటితో పాటు గంగాహారతి....
కాశీ క్షేత్రానికి దగ్గరలోనే బౌద్ధులకు ఎంతో పవిత్రమైన క్షేత్రం సార్నాథ్ కూడా ఉంది.
ఇది మాత్రమే కాకుండా ప్రయాగ రాజ్ లో త్రివేణి సంగ
మం కూడా ఉంది
కాశి క్షేత్రానికి ఎలా చేరుకోవాలి.
ప్రయాణంలో కలిగే ఇబ్బందులు ఏమిటి...
అన్ని ప్రధాన పట్టణాలలో నుంచి కాశి క్షేత్రానికి
డైరెక్ట్ ట్రైన్ సౌకర్యం కలదు.
రైల్వే స్టేషన్ పేరు .... వారణాసి
ఐతే డైరెక్ట్ వారణాసికి ట్రైన్ టికెట్ మీకు
లేనపుడు బెనారస్ రైల్వే స్టేషన్ అలాగే
ptt దీనదయల్ రైల్వే స్టేషన్...
ఈ రెండు రైల్వే స్టేషన్లు కూడా చాలా ప్రాముఖ్యమైనవి.
వీటి నుంచి కాశి ఒక గంట ప్రయాణం.
వారణాసి కి డైరెక్ట్ గా టికెట్ మీకు అందుబాటులో లేనప్పుడు ఈ రెండు రైల్వే స్టేషన్ కి వచ్చే ట్రైన్లను
చెక్ చేసుకుని రావడం బెటర్.
ప్రయాణం చేసేవారు ముఖ్యంగా ఏసీ కంపార్ట్మెంట్ కి
మీ మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.
ఎందుకంటే..
స్లీపర్ కంపార్ట్మెంట్లో చాలామంది టికెట్ తీసుకోకుండా కూడా ప్రయాణం చేస్తారు
ముఖ్యంగా బల్లార్షా స్టేషన్ దాటిన తర్వాత నుంచి
ప్రయాగరాజ్ వరకు
జనరల్ టికెట్ తీసుకున్న వాళ్ళు చాలామంది కూడా
స్లీపర్ క్లాస్ లో ప్రయాణం చేస్తారు.
దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది
అలాగే స్లీపర్ కంపార్ట్మెంట్ అస్సలు శుభ్రంగా ఉండవు.
ముఖ్యంగా ఫ్యామిలీతో వెళ్లే వాళ్ళు ఈ విషయాన్ని గమనించగలరు.
బల్లార్షా... నాగపూర్... సేవగ్రామ్... ఇటార్సీ... జబల్పూర్ ఇలాంటి ప్రధాన స్టేషన్లో కేటరింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది
మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినే
వెసులుబాటు కూడా ఉంది.
బాల్లర్ష స్టేషన్ చేరుకోగానే..
చాలామంది పాంప్లెట్స్ పంచుతూ ఉంటారు
ఫుడ్ ఎలా ఆర్డర్ పెట్టాలో అందులో రాసి ఉంటుంది
దాని ప్రకారం మనము ఫుడ్ ఆర్డర్ చేసి
నెక్స్ట్ స్టేషన్ లో తీసుకునే వెసులుబాటు ఉంది.
ఇక వారణాసిలో దిగిన తర్వాత చాలామంది
ఆలోచించే మరొక విషయం తెలుగు హోటల్స్
తెలుగు ఆశ్రమాల గురించి...
నేను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో
అలాగే డిసెంబర్ నెలలో అంటే...
సంవత్సరానికి రెండు సార్లు కాశి వెళ్తూ ఉంటాను
నా అనుభవం ప్రకారం ....
కాశీలో నాకు పరిచయం అయిన
చాలామంది తెలుగు వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం
తెలుగు హోటల్స్ తెలుగు ఆశ్రమాలు అస్సలు
నీటుగా ఉండవు.
వ్యక్తిగతంగా మనం రూమ్ తీసుకున్నప్పటికీ..
కొన్ని సందర్భాలలో వేరే ఫ్యామిలీ వాళ్ళని కూడా
మనతో కలిపి స్టే చేయాల్సిందిగా చెప్తూ ఉంటారు
ఇక్కడికి హోటల్ ఓనర్స్.
మీరంతా కూడా తెలుగు వల్లే కదా అడ్జస్ట్ అవ్వండి అని
చెప్తారు.
ఇక శుభ్రత విషయం అస్సలు బాగుండదు.
వారణాసిలో హోటల్లో చేయాలి అనుకుంటే
ఇక్కడ హోటల్ రూమ్ ధరలు
సీజన్ బట్టి మారుతూ ఉంటాయి.
అంటే....
శ్రావణమాసం కార్తీక మాసం దీపావళి టైంలో
500 రూపాయల రూమ్ ధర సుమారు 1000 1500 కూడా ఉంటుంది
ఇది నాన్ ఏసీ రూమ్ ధర.
కార్తీక మాసంలో రూమ్ ఛార్జ్ లు చాలా ఎక్కువగా ఉంటాయి.
శివరాత్రి రోజు అలాగే కార్తీక పౌర్ణమి రోజు
మనం చెల్లించే రూమ్ రెంట్ తో పాటు
అదనంగా కూడా కొంత డబ్బులు వసూలు చేస్తారు ఇక్కడ హోటల్ యజమానులు.
కొంతమంది డైరెక్టుగా వసూలు చేస్తారు
ఇంకొంతమంది 500 రూపాయల రూమ్ కి ముందుగానే 1000 1500 చెప్పి ఆ విధంగా డబ్బులు తీసుకుంటూ ఉంటారు
కాబట్టి దీనిని గమనించగలరు.
కాశీలో రూమ్లో ఉండడానికి సౌకర్యాలు అన్ని ఏరియాలలో చాలా బాగా ఉంటాయి
మినిమం 300 రూపాయల నుంచి 3000 4000 ఇలా
మన ఇంట్రెస్ట్ ని బట్టి చాలా బాగుంటుంది
నేను చూసినంతవరకు దశ అశ్వమేధ ఘాట్ సమీపంలో
ఉన్న చాలా హోటల్స్ కాస్త నీటుగా...
ధర కూడా మనకి అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది
ముఖ్యంగా అక్కడ ఉన్న హోటల్ వాళ్లకి తెలుగు వచ్చు.
అది మాత్రమే కాకుండా గౌడోలియా ఏరియాలో కూడా
చాలా హోటల్లో ఉన్నాయి
మినిమం ధర 500 నుంచి 2000 లోపే ఉంటుంది.
అక్కడ కూడా చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉంటారు.
హోటల్లో దిగే సమయంలో తీసుకోవలసిన
ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే...
కొన్ని హోటల్స్ వాళ్ళు 12 గంటలకి మాత్రమే మనకి
రూమ్ రేట్ చెప్తారు
మనం ఒక రోజుకు అనుకొని దాన్ని కట్టేస్తాము
తర్వాత పన్నెండు గంటలు అయ్యాక..
మళ్ళీ వచ్చి మిగతా డబ్బులు కట్టండి అని అడుగుతారు
మరి కొంతమంది 24 గంటలకి రేట్ చెప్తారు
కాబట్టి మనం ముందుగానే కరెక్ట్ గా కనుక్కోవాలి
లేదంటే మోసపోయే అవకాశం ఉంది.
గౌడలియ ఏరియాలో అంటే ఈ ఏరియా నుంచి మనం సోనాపూర్ కి కూడా వెళ్లగలం
ఆ మార్గంలో చాలా హోటల్స్ ఉన్నాయి
సోనాపూర్ లో కూడా చాలావరకు తెలుగు తెలిసినవాళ్ళ హోటల్లు ఉన్నాయి.
చుట్టూ పక్కల వాళ్లకు కూడా తెలుగు వచ్చు
కాస్త కాస్ట్లీగా ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాలి అనుకునేవారు.... కాలభైరవ స్వామి టెంపుల్ సమీపంలో
అలాగే బెనారస్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న హోటల్లో స్టే చేయడం చాలా బెస్ట్.
బెనారస్ యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న హోటల్స్ మినిమం 2000 నుంచి ఐదు... పదివేలు కూడా ఉంటాయి. చాలా నీటుగా ఉంటాయి ఈ హోటల్స్.
అయితే...
దశఅశ్వమేధ ఘాట్ సమీపంలో కనుక మీరు
హోటల్లో ఉంటే అక్కడ నుంచి గంగా హారతి కేవలం
ఐదు నిమిషాల నడకదారి.
అలాగే కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ కూడా
పది నిమిషాల నడక దారి
విశాలాక్షి అమ్మవారి మందిర్ కేవలం ఐదు నిమిషాలలో చేరుకోగలం
ఇలా అన్నింటికీ సౌలభ్యంగా ఉంటుంది ఈ దశ అశ్వమేధ ఘాట్ ప్రదేశం.
అయితే సాధారణంగా కాశి ప్రయాణానికి సన్నద్ధం అయ్యే
టైంలో తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఏంటంటే ..
కాశీలో ఏవైనా ప్రోగ్రామ్స్ జరుగుతున్నా లేదా
ఏవైనా సంగమం అంటే ప్రతి డిసెంబర్ మాసంలో
తమిళ సంఘమం అని జరుగుతుంది
అలాగే బౌద్ధులకు సంబంధించిన ఎన్నో
సంఘమ సమయాలు కూడా ఉంటాయి
లేదా ఎవరైనా మంత్రులు దర్శనానికి వస్తున్న కూడా
కాశి లో హోటల్ రూమ్ ధరలు అమాంతం పెరుగుతాయి
అలాగే చాలా రూల్స్ కూడా కొత్తగా చేరుతాయి
దీన్ని బాగా గమనించగలరు
లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

హోటల్ రూమ్ కి మీరు చెల్లించే డబ్బులు
ఫోన్ పే ద్వారా చెల్లిస్తే చాలామంది దానికి GST కూడా
కలిపి తీసుకుంటున్నారు
అదే మీరు డైరెక్టుగా డబ్బులు చెల్లిస్తే
దానికి జీఎస్టీ తీసుకోవడం లేదు.
అలాగే కొన్ని హోటల్స్ వాళ్ళు...
కేవలం రెండు రోజులు మాత్రమే ఉండడానికి
అనుమతి ఇస్తారు
అంతకంటే ఎక్కువ రోజులు ఉండడానికి
వాళ్లు అనుమతించరు
రెండు రోజులు గడిచాక ఖాళీ చేయాల్సి ఉంటుంది
కాబట్టి మీరు ఎన్ని రోజులు ఉంటారో ముందుగానే చెప్పడం మంచిది.
అలాగే కొన్ని హోటల్స్ వాళ్ళు భార్య భర్తల ఇద్దరి
ఆధార్ కార్డు కూడా జిరాక్స్ తీసుకుంటారు.
కొన్ని హోటల్స్ వాళ్ళు మాత్రమే ఒక్కరిదే తీసుకుంటారు.

ఇక భోజనం సంగతులు.....మిగితా సంగతులు
పిండ ప్రధాన కార్యక్రమ సంగతులు...
అక్కడి టెంపుల్స్ అన్ని ఎలా తిరగాలి....
గంగ తటాక యాత్ర ఎలా చేయాలి...
అన్నింటికంటే ముఖ్యమైనది భక్తి చాటున జరిగే మోసాలు
నెస్ట్ అప్డేట్ లో చెప్తా....