What if the girl is not a mother? in Telugu Women Focused by PRINCE PREMKUMAR books and stories PDF | ఆడపిల్ల అమ్మ కాకపోయి ఉంటే?

Featured Books
Categories
Share

ఆడపిల్ల అమ్మ కాకపోయి ఉంటే?

సృష్టికి మూలం స్త్రీ 

సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే.

కానీ స్త్రీ లేని అతడి జీవితం అర్థరహితం. 

మగవారి జీవితంలో మగువ తన ఊపిరి...

మగువ మానవ మనుగడలో మాధుర్యం నింపి

వెలుగునిస్తుంది. 

మగాడికి జన్మ ఇచ్చి

అతడి వెనక  నిలబడి తగు సలహాలను ఇచ్చి

విజయపథంలో నడిపిస్తుంది.

ఆమె మార్గదర్శిగా ఉండి బతుకును 

ఇంపుగా సరిదిద్దుతుంది.


ప్రపంచంలో మరే ఇతర దేశం స్త్రీకి ఇవ్వని

సమున్నత స్థానాన్ని మనదేశం ఇచ్చింది. 

ప్రకృతి వనరులు, దేశం, పశుపక్ష్యాదులు, పరిసరాలు... ఇలా అన్నింటినీ స్త్రీ మూర్తిగా గౌరవించి నమస్కరించే సంస్కారం

కేవలం మనదేశంలోనే ఉంది. 

గంగానదిని గంగామాత అని, దేశాన్ని దేశమాత అని, 

భూమిని భూమాత అంటూ... తల్లిగా, స్త్రీ మూర్తిగా

గౌరవించే సంస్కారం భారతీయసంస్కృతికి ప్రత్యేకం.

అలాంటి ఈ దేశంలో రోజుకొక కల్చర్ అవతరిస్తుంది

ఇప్పుడు ఎంతోమందికి నచ్చిన కల్చర్ 

ఎంతోమంది ఫాలో అవుతున్న కల్చర్ 
ముఖ్యంగా సిటీలలో బాగా అభివృద్ధి చెందిన కల్చర్...
ఎంతోమంది ఆడపిల్లలు స్వేచ్ఛ స్వాతంత్రం పేరుతో
జీవితాలను నాశనం చేసుకోవడానికి
పునాదిగా ఏర్పడిన కల్చర్..... రహస్య భార్య
ఎందుకు కలిసి ఉంటున్నారు తెలియదు
ఏది ఆశించి ఉంటున్నారో తెలియదు
కానీ చాలామంది అమ్మాయిలు మాత్రం సీక్రెట్ వైఫ్ గా
ఉంటున్నారు 
ఇక్కడ భార్యా అనే పవిత్ర మాట వాడను 

పెళ్లి కాకుండానే భార్యాభర్తలు గా ఒకే ఇంట్లో
కలిసి ఉండటం.
అలా అని మెడలో తాళి ఉండదు. 
నుదుటన సింధూరం ఉండదు
భార్య భర్తలు గా చెప్పుకోవడానికి ఏ ఆధారం ఉండదు. కేవలం అలా చెప్పుకు తిరుగుతారు అంతే
అవసరం కోసమా.. ప్రేమ కోసమా తెలియదు కానీ
భార్యాభర్తలు అనే ఆ బంధంలో ఎంతోమంది ఆడపిల్లలు
తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఇక్కడ వారిద్దరిని కలిపే బంధం ఏదీ లేదు
కోరిక ఇష్టం ప్రేమ తప్ప.
లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న కొద్ది రోజులు ఎక్కువ ప్రేమ
ఎక్కువ కేరింగ్ చూపిస్తారు
మరి మోజు తీరిపోయాక అవి ఏవి ఉండవు.

పెళ్లి కాకుండా తల్లి అవుతున్న ఆడపిల్లలు
ఎంతోమంది ఉన్నారు.
మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఎంతో కోల్పోతున్న
వాళ్ళు ఉన్నారు
ఎవరికి చెప్పుకోలేరు ఏది చేయలేరు 
తమలో తాము బాధపడడం తప్ప

ఒక విధంగా ఈ  రిలేషన్ అనేది తెలిసి చేస్తున్న
తప్పు అనేది నా ఉద్దేశం
ఎందుకంటే
భవిష్యత్తులో ఒకరంటే ఒకరికి ఇష్టం పోయాక విడిపోయిన కూడా ఏమీ చేయలేము

సమాజం  కూడా ఇలాంటి బంధాలను 
ఎంకరేజ్ చేస్తున్నారంటే పరిస్థితి మరి ఎంత దారుణంగా
ఉందో అర్థం చేసుకోవచ్చు
ఇంకా అందరూ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే
కాంట్రాక్టు పద్ధతిన కూడా ఇలా రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నారు
అంటే మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం భార్యాభర్తలుగా కలిసి ఉండడానికి కొంత డబ్బు
చెల్లించి విధానం అన్నమాట
ఇలాంటి దాన్ని కూడా సోషల్ మీడియాలో అందిస్తున్నారు.
చాలా వెబ్సైట్లో ఇలాంటి రిలేషన్షిప్ ని అందిస్తున్నాయి
ఎంతోమంది పెళ్లి కాని ఆడపిల్లలు ఇలాంటి దానికి
తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు

మతం ఏదైనా కావచ్చు కులం ఏదైనా కావచ్చు
భార్య అనే ఆ బంధం ఎంతో గొప్పది పవిత్రమైనది అలాంటి
పవిత్రమైన బంధాన్ని రహస్యంగా ఉంచుతున్నారు 
అంటే..
అది కేవలం తప్పు చేసే ఉద్దేశం కోసం మాత్రమే ఎందుకంటే..
ప్రతి మగాడి జీవితానికి భార్య దిశ నిర్దేశం

ఏంతో మంది ఆడపిల్లలు తమ సరదా కోసం అమ్మ అయ్యే అదృష్టాన్ని కోల్పోతున్నారు
ఇంకా కొందరు భర్తలేమో భార్య అందం తగ్గింది అని పక్క చూపులు చూస్తున్నారు

ప్రతి ఆడపిల్లకి జీవితంలో తల్లి అవడం ఒక అదృష్టం.
అయితే అదృష్టం మాత్రమే కాదు అందం పరంగా
అదే శాపం కూడా.
ఎందుకంటే...
తల్లిగా మారిన  ఆడపిల్ల ఆలోచనల్లో శరీరంలో ఎన్నో మార్పులు
అవి మానసికంగా శారీరకంగా ఆ ఆడపిల్లని ఎంతగానో బాధపెడతాయి.
ఒకప్పటి అందం పూర్తిగా కోల్పోతుంది.
ఇక నాలుగు గోడల మధ్య భర్త నుంచి వచ్చే 
కొన్ని మాటలు ఆమెను మానసికంగా ఇంకా వేధిస్తాయి

భర్త సంతోషం కోసం ఆనందం కోసం అందించే 
తన శరీరంలోని మార్పులనీ ఆ  భర్త అవహేళన చేస్తూ చులకనగా మాట్లాడుతూ ఉంటే ఆ బాధని మౌనంగా భరిస్తుంది...
భర్తకు ఒకప్పటిల తగిన సంతృప్తి ఇవ్వలేకపోతున్నాను అనే బాధ తను తల్లి అయ్యాను అనే సంతోషాన్ని కూడా దూరం చేస్తుంది

గర్భం దాల్చిన 12 వారాల నాటికి, గర్భాశయం విస్తరించడం వల్ల స్త్రీ పొట్ట భాగం 
కొద్దిగా బయటకు వస్తుంది.
ఈ సమయంలో గర్భాశయం అనేది 
గర్భం అంతటా విస్తరిస్తుంది.
ఫలితంగా అందంగా నాజూకు గా ఉండే
ఆ నడుము పైవచ్చేవే....... స్ట్రెచ్ మార్క్స్ 

ప్రసవo అయ్యక  వెన్ను నొప్పి, తుంటి నొప్పి, 
పొత్తి కడుపులో నొప్పి పెరుగుతాయి. 
వీటితో పాటు తరుచూ కండరాల్లో తిమ్మిరి, నొప్పులు కూడా ఉంటాయి.
ఇక
అందరికీ అని చెప్పలేము కానీ
కొందరిలో ప్రసవం అయ్యాక ఈ విరోచనాల సమస్య మొదలవుతుంది
నార్మల్ డెలివరీ చేయించుకున్న వారిలో 
మూత్ర విసర్జన ఎక్కువ అవుతుంది.
యోని కండరాలు వదులుగా అవుతాయి
స్థనాల పరిమాణంలో మార్పులు..
ఉన్నపలంగా శరీరం లావుగా అవడం..
సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల 
గ్యాస్ ప్రాబ్లం ఏర్పడి పొట్ట కూడా ఉబ్బినట్టుగా కనిపిస్తుంది...
నిద్రలేమి సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది

ప్రసవం తర్వాత మునుపటి చురుకుదనం ఉండదు
కావున తల్లికి మానసిక ప్రశాంతత అవసరం
ఒక వేళ సిజేరియన్ ఆపరేషన్‌ అయితే 
తల్లి ఆరోగ్య పరిస్థితిని బట్టి 2-3 నెలల తర్వాత వ్యాయామాలు చేయడం మంచిది. 
వ్యాయామం చేయడం వల్ల పెల్విక్‌ కండరాలు దృఢమవుతాయి, నడుము నొప్పి తగ్గుతుంది.

ప్రసవానికి ముందు... తర్వాత ఒకే విధమైన
శరీర ఆకృతి ఉండడం అనేది ప్రతి 1000 మందిలో ఒకరిద్దరికి మాత్రమే సాధ్యం. 
మిగతా వారికి తప్పకుండా శరీరంలో మార్పులు సంభవిస్తాయి.
.

వీటన్నింటి ప్రభావం అందమైన శరీరాకృతి మీద చూపిస్తుంది
కాబట్టి మునుపటి అందం రావడానికి కొంత టైం పడుతుంది
లేదంటే మునుపటి అందం దూరం కావచ్చు కూడా

ప్రతి ఒక్కరూ మార్పులను అంగీకరించాలి స్వాగతించాలి
అంతే తప్ప అందమే ఇద్దరికీ సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుంది అని ఆలోచిస్తూ....
ఆలోచనల్ని తప్పుడు మార్గంలో పెట్టుకోవడం 
ఎట్టి పరిస్థితుల్లో సరైనది కాదు
ఈ విషయంలో మగవారు కూడా కాస్త ఆలోచించడం మంచిది ముఖ్యం కూడా...
ఎందుకంటే భర్తకి సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చేది
కేవలం
భార్య శరీరం మాత్రమే కాదు కదా...

ఆడపిల్ల అమ్మ కాకుంటే..... మగాడికి నచ్చే ఆ అందం అలాగే ఉండేది గా