All that remains are memories. in Telugu Anything by divya books and stories PDF | మిగిలింది జ్ఞాపకాలే

The Author
Featured Books
Categories
Share

మిగిలింది జ్ఞాపకాలే

సమయం 5:30 సమయాన్ని సూచిస్తోంది. ఒక పాత రైల్వేస్టేషన్జ కానీ నసంచారం లేక ఆ ప్రాంతమంతా వెలవెలబోతోంది....


చుట్టూ వీస్తున్న జోరు గాలికి ఎండిన ఆకులు రాలి, అక్కడ ఉన్న ఒక పాత బెంచ్ పైన కూర్చున్న అతడి కాళ్ళ దగ్గర పడ్డాయి. రాలిపోయిన ఆ ఆకులను చూస్తుంటే అతనికి తన పరిస్థితి కూడా అలాంటిదే అని అర్థమైంది...


తన కెరీర్ కోసం తను తీసుకున్న కఠిన నిర్ణయం వల్ల, వాళ్ళ బంధం కూడా ఆ ఆకుల్లాగే రాలిపోతుందని అతనికి తెలుసు. కానీ అతని దృష్టి, ధ్యాస అంతా తన లక్ష్యం మీద మాత్రమే ఉంది....

అంతలో అతనికి అడుగుల శబ్దం వినిపించింది. ఆమె వచ్చి అతని ముందు నిలబడింది. తను వచ్చిందని తెలిసినా రఘు తల పైకి ఎత్తలేదు. అ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆమె గొంతు వినిపించింది. "కనీసం నా వైపు కూడా చూడాలని అనిపించడం లేదా రఘు..?" అని అడిగింది....


ఆమె మాటల్లోని వేదన అతనికి అర్థమవుతోంది. రఘు నెమ్మదిగా తల ఎత్తి చూశాడు. ఆమె కళ్ళలో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. అయినా రఘు మాత్రం తన మనసుని రాయి చేసుకున్నాడు.....ఇక ​జానకి తట్టుకోలేక అతన్ని గట్టిగా హత్తుకుంది......


"రఘు... ఒక్క మాట చెప్పు. నేను ఎవరినీ పట్టించుకోను, నీ వెంటే ఉండిపోతాను. మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం, ప్లీజ్.." అని వేడుకుంది....


కానీ రఘు ఆమె చేతులను విదిలించుకుని దూరం జరిగాడు. "జానకి, ఎందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు? ఎన్ని సార్లు చెప్పిన అర్తం కావడం లేద?అయినా సరే ఇంకోసారి చెబుతాను విను...


నాకు ఈ ఊరు, ఈ బంధాలు ఏవి ముఖ్యం కాదు. నేను ని కోసం ఇక్కడ ఉండిపోయి నా భవిష్యత్తును నాశనం చేసుకోలేను," అన్నాడు నిష్కర్షగా....


రఘు మాటలకూ ​జానకి మాత్రం షాక్‌తో ఒక్క క్షణం స్తంభించిపోయింది...


"అంటే... నాకంటే నీకు డబ్బు, హోదానే ముఖ్యమా? మన పదేళ్ళ ప్రేమకి నీ దృష్టిలో అస్సలు విలువే లేదా?" అని
ఏడుస్తూ అడిగింది....


​రఘు కళ్ళలోకి కళ్లు పెట్టి చూస్తూ, "ప్రేమతో కడుపు నిండదు జానకి. రేపు నేను ఒక సామాన్యుడిగా ఉండిపోతే నిన్ను సరిగ్గా చూసుకోలేను...


అప్పుడు నాలో ఉండే అసంతృప్తి నిన్ను కూడా అసలు ప్రశాంతంగా ఉండనివ్వదు. నేను ఎదగాలి, అది నా స్వార్థం అనుకున్నా సరే. నాకు నా లక్ష్యమే ముఖ్యం," అని ఖచ్చితంగా చెప్పేశాడు.....


​"మరి నాలో ఉన్న నీ జ్ఞాపకాల సంగతి ఏంటి రఘు? వాటిని ఏం చేయాలి నేను?" అని జానకి గట్టిగా ఏడ్చేసింది....


ఆమె బాధ చుసిన రఘులో మాత్రం ఎలాంటి చలనం లేదు. "జ్ఞాపకాలు మనిషిని బ్రతికించవు జానకి.. అనుక్షణం కుళ్ళిపోయేలా చేస్తాయి. వాటిని పట్టుకుని కూర్చుంటే నేను ముందుకు వెళ్లలేను. ఇక నుండి నువ్వు కూడా నన్ను మర్చిపోయి నీ దారి చూసుకో," అని తన బ్యాగ్ సర్దుకొని అక్కడి నుండి వెళ్లబోయాడు....


​జానకి గుండె ఆగినంత పనైంది. పరుగున వెళ్లి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. "ప్లీజ్ రఘు.. వద్దు.. వెళ్ళకు. నువ్వు వెళ్ళిపోతే నేను ఉండలేను. ఈ ఒక్కసారికి నీ మొండితనం వదిలేయ్. నీ కెరీర్ ఇక్కడే చూసుకోవచ్చు కదా?" అని బ్రతిమాలింది....


​రఘు విరక్తిగా చూస్తూ, తన చేతిని విడిపించుకున్నాడు. "ఇక్కడ ఉండి ఏం చేయాలి? నీ నీడలో, మీ తండ్రి ఇచ్చే అవకాశాల మీద బ్రతకాలా? అది నా వల్ల కాదు. నాకంటూ ఒక ప్రపంచం ఉంది, కొన్ని కలలు ఉన్నాయి. అవి నీవల్ల ఆగిపోవడానికి నేను ఏ మాత్రం ఒప్పుకొను జానకి అవి నేను నెరవేర్చుకోవడానికి వెళ్లాల్సిందే."... దయచేసి నన్ను మాత్రం ఆపకు నా దారికి అడ్డు రాకు...


​"అంటే నీ దృష్టిలో నేను ఇక మన ప్రేమ ఒక అడ్డంకి మాత్రమేనా? నేను నీకు అంత భారం అయిపోయానా? రఘు..ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు రఘు.. నీ కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను," అని ఆఖరి ప్రయత్నం చేసింది జానకి...


ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు నన్ను నా లక్ష్యం వైపు వెళ్లానివ్వు చాలు...


​"జీవితం అంటే కేవలం ప్రేమ మాత్రమే కాదు జానకి....


ప్రేమ.. ప్రేమ అనుకుంటూ కూర్చుంటే నేను ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది... అది నాకు ఇష్టం లేదు...నా హోదా, సక్సెస్ ముఖ్యం.. అందుకే వెళ్తున్నా," అన్నాడు రఘు. జానకి ఆవేశంగా, "ఇంత స్వార్థం ఎలా వచ్చింది నీకు? నీ ఎదుగుదల కోసం నన్ను బలి ఇస్తున్నావు. కనీసం ఒక్కసారి కూడా నా మనసు గురించి ఆలోచించడం లేదు," అని నిలదీసింది....


​"అవును, నేను స్వార్థపరుడినే. నా కెరీర్ కోసం దేన్నైనా వదులుకుంటాను.. చివరికి నిన్నైనా సరే. ఇక చాలు, ఆపు ఈ ఏడుపు. గుడ్ బాయ్. ఇంకెప్పుడూ నన్ను కలవాలని చూడకు," అని మొహం తిప్పుకుని వేగంగా స్టేషన్ బయటకు నడిచి వెళ్ళిపోయాడు....
 

జానకి అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉండిపోయింది. స్టేషన్ నిశ్శబ్దంలో ఆమె ఆర్తనాదం ప్రతిధ్వనిస్తోంది, కానీ రఘు మాత్రం వెనుదిరిగి చూడలేదు....