ఊరి చివర....
ఒక అమ్మవారి ఆలయం...
అక్కడ ఒక అమ్మాయి....
తనకోసం ప్రాణం కాదు...
తినను ప్రేమించిన వాళ్ళ ప్రాణం కోసం....
" నాన్న కావాలంటే నన్ను చంపేయండి....!"
" వాళ్ళని ఎం చెయ్యకండి అంటుంది....!"
ఆయన " ఏంటే బజారుదాన....! నీలాంటిది నా కూతురు అని చెప్పుకోవడానికే అసహ్యంగా ఉంది....!" నా కడుపునా చెడబుట్టావు కదే...! అంటాడు...
ఆ అమ్మాయి " అవును నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను అని వాళ్ళతో అని..! మనసులో నీకు.! నీ వాళ్లకి..! నా వల్ల ఎం కాకూడదు...! అని అనుకుంటున్న మరుక్షణం...
తను నేలపై పడిపోతుంది... తన ఒళ్ళంతా రక్తం....
అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వచ్చి తనని చూసి... " నిక్కీ.." అని గట్టిగా అరుస్తాడు....
సీన్ కట్ చేస్తే....
ఆ అబ్బాయి నిక్కీ ని హాస్పిటల్ కి తీస్కొని వెళ్తాడు...
అతని వైట్ షర్ట్ మొత్తం బ్లడ్ తో తడిచి పోతుంది....
డాక్టర్స్ అటూ... ఇటూ... కంగారుగా తిరుగుతూ ఉన్నారు....
ఆ అబ్బాయియి అక్కడే " ఒక వినాయక ( మై హీరో గణి ) విగ్రహం ఉంటే.... అక్కడికి వెళ్తాడు....!"
వెళ్లి " నిన్ను చిన్నప్పటినుంచి ఎప్పుడూ ఏది అడగలేదు..! "
" నీకు ఎలా దన్నం పెట్టుకోవాలో కూడా నాకు తెలియదు.!? "
" కానీ నా నిక్కీకి మాత్రం ఏం కాకుండా కాపాడు... " అని అనుకోని.....
" తనకి నిక్కీ ఎలా పరిచయం అయ్యిందో..! తలచుకుంటూ గతం లోకి వెళ్తాడు....!"
.............
అది ఒక పెద్ద కళ్యాణ మండపం...
అక్కడ ఒక ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు....
వాళ్ళు ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ... నానా హడావిడి చేస్తూ.... పెళ్లి మొత్తం వాళ్ళ ఇంట్లోదే అన్నట్టుగా గోలగోల చేస్తున్నారు....
అప్పుడే పెళ్లి కొడుకు తండ్రి వాళ్ళ దగ్గరకు వచ్చి బాబు మీరు ఎవరు తాలూకా అని అడుగుతారు...
వాళ్లు మేము పెళ్ళికొడుకు తరుపున అండి అని ఆయన ఎవరో తెలియక నోటికి వచ్చింది అనేస్తారు....
దాంతో ఆయన పెళ్ళికొడుకును చూసి రేయ్ వీళ్లు నీ ఫ్రెండ్స్ ఏనా అని అడుగుతాడు...
ఆయన అలా అడగడంతో అక్కడున్న ముగ్గురు కూడా షాక్ అయ్యి అంకుల్ మీరేమవుతారు ఆ పెళ్లి కొడుక్కి అని అడుగుతారు...
ఆయన కొంచెం వెటకారపు మనిషి దాంతో నేను ఆ అబ్బాయికి తండ్రి వరుస అవుతాను నాన్న..! అని అంటాడు...
ఆ ముగ్గురిలో ఒక అబ్బాయి అదేంటండీ తండ్రి వరుసవ్వడం ఏంటి అని మిగిలిన ఇద్దరినీ అడుగుతాడు...
ఆయన మరి లేకపోతే ఏమని చెప్పాలి మీకు..!?
ఆ నా కొడుకు... నా కొడుకే...!? నేను వాడికి బాబునని మీకు తెలియకుండా... మీరు వాడి ఫ్రెండ్స్ ఎప్పుడయ్యార్రా అని నా అనుమానం వచ్చి అంటాడు...
ఆ ముగ్గురు అబ్బాయిలు వీడికి కొంచెం మెంటల్ ఏమో..? అని తిట్టుకుంటూ అలా కాదు అంకుల్.... అంటే మిమ్మల్ని ఇప్పటివరకూ మేము ఎప్పుడు చూడలేదు అయినా మాది ఈ ఊరు కూడా కాదు లెండి అని అంటారు...
ఆయన ఓ అవునా అని వాళ్ళ వైపు దీర్ఘంగా చూస్తారు....
" ఆ ముగ్గురు అబ్బాయిలు కూడా బ్రాండెడ్ డ్రెస్సెస్ తో..! బ్రాండెడ్ వాచ్ తో..! మెడలో గోల్డ్ చైన్... హ్యాండ్ కి గోల్డ్ బ్రాస్లెట్స్... గోల్డ్ రింగ్స్.... ఉండడం చూసిన ఆయన ఓ వీళ్ళు బాగా రిచ్ అనుకుంటా....
మనకెందుకు వచ్చిందిలే మన వెటకారంతో వీళ్ళ చిరాకు తెప్పించాను అనుకో ఇక్కడి నుంచి గిఫ్ట్ ఇవ్వకుండా పారిపోతారు వెదవలు...! అని సైలెంట్ అయిపోతాడు ఆయన...
అప్పుడే పెళ్లి కూతురిని తీసుకు వస్తున్నారు....
పెళ్లికూతురిని చుసిన వీళ్ళ ముగ్గురిలో " ఒక అబ్బాయి గబగబా పెళ్లి మండపం పైకి ఎక్కి.... పెళ్లి కూతురి చేతిని పట్టుకొని... తన మీదకి లాక్కొని... ఒక్కసారిగా ఆమె పెదవులు అందుకుంటాడు...
ఇదండి ఇవాళ్టి ఎపిసోడ్...
Happy New Year to all my readers....
ఈ మెంటల్ ది ఇప్పటి వరకు ఉన్న స్టోరీస్ కంప్లీట్ చేసి చావలేదు.! మళ్ళీ దీనికి ఇది అవసరమా అని తిట్టుకోకండి....
అవి కూడా కంప్లీట్ చేస్తాను....
పూజ అనే నేను..! హామీ ఇస్తున్నాను....!
సంక్రాంతి అయిన తర్వాత డైలీ ఎపిసోడ్ ఇస్తాను...
అప్పటి వరకు నా గోల మీకు త.......
పెళ్లికూతురిని చుసిన వీళ్ళ ముగ్గురిలో " ఒక అబ్బాయి గబగబా పెళ్లి మండపం పైకి ఎక్కి....
పెళ్లి కూతురి చేతిని పట్టుకొని... తన మీదకి లాక్కొని...
ఒక్కసారిగా ఆమె పెదవులు అందుకుంటాడు...
ఆ అబ్బాయి అలా చేయడంతో అక్కడున్న....
" పెళ్లి కూతురు తరపు వాళ్ళు.... పెళ్ళికొడుకు తరపు వాళ్లు కూడా షాక్ అయ్యి.... వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు...!"
ఆ అబ్బాయి తో వచ్చిన మిగిలిన ఇద్దరూ వీడేంట్రా ఇంతసేపు కిస్ చేస్తున్నాడు అనుకుంటూ.....
వాళ్ళల్లో ఒకరు... నేను చెప్పిన టాస్క్ " జస్ట్ అమ్మాయిని అలా ముద్దు పెట్టి వచ్చేయ్ అనే కదరా అంటాడు.!" వినయ్.....
మరొకడు.... " వీడేంట్రా ఏకంగా డీప్ లిప్ లాక్ పెట్టేస్తున్నాడు. అప్పుడే 15 మినిట్స్ అయిపోయింది అని షాక్ అయ్యి కంగారుగా అంటాడు..! " అభయ్...
అప్పుడే పెళ్లికి వచ్చిన బంధువులు అందరూ... పెళ్లికూతురుని కిస్ చేస్తున్న అతన్ని కొట్టడానికి వెళ్తుంటే......
వినయ్ వెంటనే పరుగు పరుగున వెళ్లి..! వాడిని ఒక్క లాగులాగి.... తనతో పాటు తీసుకువెళ్లిపోతూ....
రేయ్ అభయ్ రా త్వరగా అని అంటాడు.....
షాక్ లో ఉన్న అభయ్ ఏమి మాట్లాడకుండా అలాగే ఉండిపోతే....
అతని దగ్గరికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతారు కొట్టడానికి ఆ పెళ్లి గల వాళ్ళు.....
వినయ్ ఇప్పుడు వీడు ఇలా ఉండిపోతే వాళ్ళు వచ్చి చంపేస్తారు..!
అని గబగబా వెళ్లి.... అభయ్ చేతిని కూడా పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతాడు.....
జస్ట్ మిస్..... వినయ్ లాగకపోతే ఒక్క ఏటుకీ చచ్చిపోయేవాడు అభయ్...!
అభయ్ మనసులో " మరణ దేవతకి హాయ్ చెప్పి చెప్పింది ప్రపంచంలో నువ్వే అయ్యుంటావురా.!? "
" నువ్వు మరణ దేవతకి హాయ్ చెప్తే...! మళ్ళీ నా దగ్గరకి రాకు...! చూసావ్ గా నన్ను క్లోసప్ లో.... ఇక దొబ్బెయ్ అని చెప్పి పంపించేసింది రా...!"
లేకపోతే " నీ ఫోటో కి దండ..!"
" నీ డెడ్ బాడీ కి పాడే..! " రెడీ అయిపోయేవి.... అని తనని తనే అనుకోని కంగారు పడిపోతున్నాడు.... అభయ్
వాళ్ల వెనకే అందరూ కూడా పడుతూ ఉండడంతో వినయ్..... అక్కడినుంచి బయటకి ఎగ్జిట్ కనిపిస్తుంటే.... అటు వైపుగా వీళ్ళని తీసుకువెళ్తాడు.....
అక్కడినుంచి బయటికి వస్తారు ముగ్గురు....
అది పెళ్లి మండపం బ్యాక్ సైడ్....
వీళ్లే తెలివైన వాళ్లు అనుకుంటే... ఆ మండపం బుక్ చేసుకున్న వాళ్లకి ఎక్కడ ఎం ఉంటాయో తెలియదా....
దాంతో వాళ్లు వీళ్ళ కంటే ముందే వేరే రూట్ నుంచి
" అభయ్... వినయ్.... " మన అఖిల్ ..!"
( అదే నండోయ్ మన హీరో ...! " ) దగ్గరకి వచ్చేస్తారు....
దాంతో వీళ్ళు ముగ్గురు లాక్ అయిపోతారు....
ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉండగా....
మన అఖిల్.. వెంటనే వాళ్ళ ఇద్దరికీ.....
మన ముందు ఉన్నవాళ్ళని " హాండ్స్ తో పుష్ చెయ్యండి వీళ్ళని..!" అని సైగ చేసి చెప్తాడు....
అఖిల్ చెప్పినట్టే మనవాళ్లు విని వాళ్లని గట్టిగా పుష్ చేస్తారు....
అలా పుష్ చేయడంతో వాళ్ళ ముందు ఉన్న సగం మంది కింద పడిపోతారు.....
అలా పడిపోయిన వాళ్ళని తొక్కుకుంటూ....!
వీళ్ళ ముగ్గురు అక్కడే ఉన్న ఒక పెద్ద వాల్ ఎక్కి అక్కడి నుంచి దూకి ఒక్కసారిగా కింద పడిపోతారు....!
వీళ్లు ఏదో ఎస్కేప్ ప్లాన్ వేసి గోడ దూకితే....! మరొకపక్క ఆ పెళ్లి గల వాళ్ళు వీళ్ళకంటే ముందుగానే బయటికి వచ్చేస్తారు....
............. .........