పరగుల జీవితం కష్టంలో బ్రతుకుతూ ఇస్టాల్ని వదిలేసి ఒత్తిడి తో ఊరేగుతున్న సమాజం.
మనసారా నవ్వి కళ్ళారా ప్రకృతి అందాలను చూసి ఎంత కాలం అయ్యిందో కదా. పసిపాపల బోసినవ్వులా ఎంత నిచ్చలంగా వుంది ఆ నదిప్రవాహం.
నేలతల్లికే పచ్చని చిగురు అద్ధినట్టు ఎంత కలగా వుంది ఆ దృశ్యం. పిల్ల లేగదూడల లేలేత పాదాలతో తన తల్లికై ఎగబాకే ఆ సందడి ఎంతటి నయనానందం. అంటూ తన భావాల్ని రాసుకుంటూ ఉంది. ఇంతలో తన స్నేహితురాలు అక్కడికి రావడం చూసి వచ్చావా నీ కోసమే చూస్తున్నా అని అంది ఆరాధన."
సౌస్టి" ఏమి లేదు ఆరు మెంటల్ హాస్పిటల్ బెడ్ బుక్ చెయ్యాల అని ఆలోచిస్తున్న" అని అంది
ఎమ్ నువ్వు చెరతావా హాస్పిటల్ లో ఎప్పుడు పట్టింది పిచ్చి నీకు నాకు చెప్పనేలేదు ఐ హర్టు పో.
అది విని సౌస్టీ గుర్రుగా చూసి నాకు పట్టలేదే నీకు పట్టిన పిచ్చి నీ వదిలించుకోవడానికి నీకోసం ఏంటి నీకోసం మెంటల్ హాస్పిటల్ లో బెడ్ బుక్ చేస్తున్న అంది.
ఏడ్చావులే వేపకాయ అంత వుంది అనుకున్నా అబ్బే పనస కాయ అంత వుంది వెర్రి అంది ఆరు (ఆరాధన).
ఆ మాటలకు పిచ్చి మొహం వేసి చూసింది సౌస్టీ.
ఎంటే ఆ చూపు మేక మొహం వేసుకుని.
ఎంటి నాది మేక మోహామా నువ్వే భూమికి బెత్తెడు వుంటావు. మళ్ళీ నన్ను అంటున్నావ్ పెహ్.
ఆ తమరు ఆకాశానికి అరడగు దూరంలో వున్నారు మరి. నా మీద ఒక అరంగుళం ఉంటావ్.
సర్లే ఏడవకు అక్కడ చూడు ఆ పొట్టేలు నీకు లైన్ వేస్తున్నాడు.
పొట్టెలా ఎవడాడు పక్కన చూసిన సౌస్టికి నిజంగానే ఒక పొట్టేలు ఆకులు తింటూ తననే చూస్తూ కనిపిస్తుంది. యూ పోవే అని ఏడుపు మొహం వేసింది.
ఇంతలో ఆరు అమ్మ గారు కవిత గదిలోకి వచ్చి అబ్బబ్బ ఎంటి ఆరు నీ అల్లరి ఎందుకు సౌస్టీ నీ అంటున్నావ్.
మళ్ళీ మొదలు పెట్టారా మీ యిద్దరూ ఎప్పుడు చూడు తనని ఏడిపిస్తావ్. పాపం సౌస్టీ కదా.
ఎవరు అమ్మ పాపం ఈవిడ పైకి కనిపించేంత సాప్ట్ కాదు కంచు.
కాలేజ్ లో దీన్ని చూస్తే అందరికీ హడల్. ఇది వస్తేనే కుర్రోళ్ళ గుండెల్లో దడల్.
అమ్మని అమాయకత్వానికి అమ్మలా వుండే నన్ను
అన్ని మాటలు అంటావా చూడండి ఆంటీ.
ఆరు అల్లరి ఆపి ఎక్కడికో వెళ్ళాలి అన్నారుగా రెఢీ అవ్వు అని వాష్ రూమ్ కి తోసింది కవిత.
శత్రువులు ఎక్కడో వుండరు అమ్మలు,ఫ్రెండ్స్ రూపంలో తిరుగుతుంటారు. అని డ్రెస్ తీసుకుని రెడీ అవ్వడానికి వెళ్ళింది ఆరు.
చెప్పమ్మా ఎంటి విశేషాలు సడెన్ గా ఈ ప్రయాణం ఎంటి అని అడిగింది కవిత.
చిన్న గేట్ టూ గేదర్ ఆంటీ ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేసుకున్నాం.
ఒకే అమ్మ చూస్తూ వుండు తనని అది ఇలా మిగిలింది అంటే నీ వల్లనే ఒకప్పుడు బయం వేసింది. నా కూతురు నాకు దక్కకుండా పోతుందని. మళ్ళీ మా ముందు ఇలా నవ్వుతూ తిరుగుతుందని ఊహించలేదు.అని కన్నీళ్లు పెట్టుకుంది కవిత.
ఊరుకోండి ఆంటీ మార్పు మొదలు అయ్యింది గా
ఇక మన ఆరు మనకి ఎప్పుడు దూరం కాదు.మీరిలా బాధపడి తనని వీక్ చెయ్యకండి.
అంకుల్ చూస్తే ఇంకా కృంగిపోతారు. ఆయన కూడా ఇప్పుడిప్పడే కోలుకుని మామూలు మనిషిలా తిరుగుతున్నారు.
హా అలాగే మా నన్ను నేను సంబాలించుకుంటాను. కాస్త జాగ్రత్తగా చూస్కో తనని అని సౌస్టీ చేతిలో చెయ్యివేసి చెప్పింది కవిత.
సరే ఆంటీ ఐనా తను ఇదివరకటి ఆరు కాదు రెబల్ లా తయారయ్యింది. అందరినీ చూసి భయపడేది. ఇప్పుడు రివర్స్ అయ్యింది.
ఓయ్ ఎంటి పాప చెప్తున్నావ్ మా అమ్మకి నాగురించి చాడీలు చెప్తున్నావా. అంటూ అప్పుడే స్నానం చేసి తల తుడుచుకుంటూ వచ్చింది ఆరు.
తల్లి నీకో దండం త్వరగా వస్తే పోదాం ఇప్పటికీ వంద కాల్స్ వచ్చాయి. ఫోన్ సైలెంట్ లో పెట్టా ఇప్పుడు ఎత్తాను అనుకో అమ్మనా బూతులు తిడతారు.
రావమ్మా దార్లో పోట్లడుకుందాం.
సరే ఏడవకు వస్తున్న అమ్మ నాన్న ఎక్కడ ఇంకా రాలేదు.
ఇక్కడే వున్నా చిట్టితల్లి. నువ్వొస్తే టిఫిన్ చేద్దాం మళ్ళీ ఊరు వెళ్తున్నావుగా ఒక వారం వుండవు ఎలా వుండాలో ఎంటో. అన్నారు ఆరు తండ్రి ప్రకాష్.
నాన్న నువ్వింకా టిఫిన్ చెయ్యలేదు టైమ్ ఎంత అయ్యిందో తెలుసా నీకు. నేను తింటానుగా వచ్చి తినేసి కూడా ఎదురు చూడొచ్చు.
అందరిలా నువ్వు కూడా బాధపెడతావా నన్ను. ప్లీస్ నాన్న నేను లేని టైమ్ లో మీరు మీ ఆరోగ్యం చూస్కోండి. నేను ఇంక ఎవర్నీ కొల్పొదలచుకొలేదు. ఇంక నాకు ఏడ్చే ఓపిక, ఎదురిదే సత్తువ రెండూ లేవు అని కంటతడి పెట్టుకుంది ఆరు.
లేదు లేదు బంగారం ఈ రోజు నీతో కలిసి తిందామని ఆగాను అంతే. నిన్ను బాధ పెట్టాలని కాదురా. నేను నా ఆరోగ్యం చుస్కుంటా నా కోసం కాకపోయినా నా చిట్టితల్లి కోసం సరేనా ఏడవకు తల్లి అని కన్నీళ్లు తుడిచి నుదిటి మీద ముద్దు పెట్టుకున్నారు ప్రకాష్.
ఓయ్ ఇంకా చాలు ఊరుకుంటే ఊరినే ముంచేస్తావ్. పద పద తొందరగా అని హడావుడి చేసింది సౌస్టీ. స్నేహితురాలు బాధ చూడలేక.
హా పదండి టిఫిన్ పెడతా అని ముందుకు కదిలింది కవిత.
మొత్తం అందరూ కలిసి టిఫిన్ చేసి ఆరు కి సౌస్టీ కీ బోలెడు జాగ్రత్తలు చెప్పి పంపించారు.
ముందుగా క్యాబ్ బుక్ చేసుకోవడం తో దాన్లో బయలుదేరారు రైల్వే స్టేషన్ కి.
ఆ ప్రయాణం ఆరు జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పబోతుందో మరి.
సౌస్టీ కి ఇంకెన్ని అగచాట్లు వస్తాయో ఈ ఆరు తో.
ఇద్దరు తమ ప్రయాణం మొదలు పెట్టారు. ఈ ప్రయాణం ప్రేమకు నాంది అవుతుందా.పగకు పునాది అవుతుందా.