My dear life... - 1 in Telugu Short Stories by amani reddy books and stories PDF | ప్రాణమా... - 1

Featured Books
Categories
Share

ప్రాణమా... - 1

అర్జున్ హైదరాబాద్ లో హాస్టల్ లో ఉండి ఇంటర్ చదివే రోజులు అవి..


డైలీ కాలేజ్.. అది అవ్వగానే హాస్టల్ కి వచ్చి తన ఫ్రెండ్స్ తో కబుర్లు..కాలక్షేపానికి వారానికి ఒక సినిమా.. అదే అతని జీవితం..


రోజు లాగానే కాలేజ్ కి వెళ్ళే హడావిడిలో ఉండగా అర్జున్ ఫోన్ రింగ్ అయ్యింది..ఎవరా అని చూడగా స్క్రీన్ మీద నాన్న అని కనిపించగానే ఆతృతగా కాల్ లిఫ్ట్ చేసి పలకరించ్చాడు.


అక్కడ నుంచి ఎలా ఉన్నావు అంటూ కుశల ప్రశ్నలు అడిగి వచ్చేవారం ఊర్లో జాతర ఉందని చెప్పి స్నేహితులతో కలిసి ఊరికి రమ్మని చెప్పాడు తండ్రి.


తండ్రి మాటలకు ఏం చెప్పాలో అర్థం కాక అప్పటికి అప్పుడు ఏదో చెప్పాలి కాబట్టి సరే నాన్న అని చెప్పాడు అర్జున్.


అర్జున్ సరే అనగానే కాల్ కట్ అయిన శబ్దం వచ్చింది..


అర్జున్ ను గమనిస్తున్న అతని ఫ్రెండ్స్ అతని మొహం లో దిగులు చూసి ఏమైంది అంటూ అడిగారు.


ఊర్లో జాతర అంట నాన్న గారు రమ్మన్నారు అని చెప్పాడు అర్జున్.


మరి వెళ్ళడానికి ఏం రోగం రా ..ఈ వంక తో వారం రోజులు ఎంజాయ్ చేయొచ్చు...అన్నాడు తన ఫ్రెండ్స్ లో ఒకడు రవి.


వెళ్ళొచ్చు రా..కాకపోతే వచ్చిన చిక్కల్లా...మా మామయ్య వాళ్ళతోనే అన్నాడు అర్జున్.


వాళ్ళతో నీకేంటి రా ప్రాబ్లం అడిగాడు రవి.

ఏమి లేదు లేరా...చెప్పిన అర్థం కాదు మీకు..నాన్న మిమ్మల్ని కూడా తీసుకుని రమ్మన్నాడు..మీరు కూడా రావాలి అన్నాడు అర్జున్..


అర్జున్ మాటలకు అందరు సంతోషంగా...హుర్రే...అన్నారు.


ఆ రోజుకి అందరు కాలేజ్ కి వెళ్ళి తర్వాతి రోజు ఊరికి ప్రయాణం అయ్యారు..


అర్జున్ ఊరు హైదరాబాద్ కి నలభై కిలోమీటర్ల దూరం లోనే ...దాంతో అర్జున్ ఒక క్యాబ్ బుక్ చేసాడు.


ఫ్రెండ్స్ అందరు వారి లగేజ్ తో కారు ఎక్కగానే రయ్యిన హై వే ఎక్కి వేగం పెంచింది ...



క్యాబ్ లో సాంగ్స్ వినిపిస్తుంటే ఫ్రెండ్స్ అందరు కోరస్ ఇస్తూ ఎంజాయ్ చేస్తూంటే..అర్జున్ మాత్రం ముభావంగా ఉన్నాడు...


అర్జున్ ముభావంగా ఉండడానికి ఒక కారణం ఉంది.

అతనికి నలుగురు మామయ్యలు.

అందులో చిన్న మామయ్య అంటే అర్జున్ కి ప్రాణం.

కానీ అతని భార్య డెలివరీ అయినపుడు చనిపోయింది.

అతనికి ముందు ఒక బాబు.తర్వత ఒక పాప.

పాప పుట్టినపుడు అతని భార్య చనిపోవడం వల్ల...పాపను బాబుని అతని తల్లి దండ్రులు గారాబంగా పెంచుతున్నారు..

అంటే అర్జున్ అమ్మమ్మ తాతయ్యలు అనమాట.

ఎంతో మంది మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పిన అర్జున్ చిన్న మామయ్య మళ్ళీ పెళ్లి చేసుకోలేదు...


కరణం లేకపోలేదు సవతి తల్లి పిల్లల్ని సరిగ్గా చూడదనే భయం అతనికి.


కానీ భార్య లేని లోటు అతని జీవితం లో స్పష్టంగా కనిపిస్తోంది...అతని తల్లి దండ్రులు ఎంత బాగా చూసుకున్న...వారి వయసుల ప్రభావం తో వాళ్ళ తర్వత తమ కొడుకుని ఎవరు చూసుకుంటారు అని వారు బాధ పడుతూ ఉండేవాళ్ళు...


అర్జున్ తల్లి తన తమ్ముడు ఇంటికి వచ్చిన ప్రతిసారి తన తమ్ముణ్ణి పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేస్తూ..ఉండేది.

ఆమె ప్రయత్నించడం ..అతను ఆమె మాటను తిరస్కరించడం ఎప్పుడూ జరిగేవే.


మామయ్య అత్త పోయినప్పటి నుంచి ముందులా సంతోషంగా కనిపించడం లేదు.

ఈ సారి అయిన మామయ్య పెళ్ళికి ఒప్పుకుంటే బాగుణ్ణు అనుకున్నాడు అర్జున్.


తన మామయ్య పెళ్ళికి ఒప్పుకుంటే అతను సంతోషం గా ఉంటాడు అనుకున్నాడు అర్జున్.అంతేకాని తర్వత జరిగే పరిణామాల గురించి అతను ఆలోచించలేదు..


తన మామయ్యకు ఆరేళ్ల పాప.పన్నెండేళ్ల బాబు ఉన్నారు..


మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎవ్వరు ఆలోచించలేక పోయారు..కేవలం తన మామయ్య సంతోషం కోసం అర్జున్.

కొడుకు సంతోషం కోసం అర్జున్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు.

తమ్ముని సంతోషం కోసం అర్జున్ అమ్మ....

కానీ తన పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచన తో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు..అర్జున్ మామయ్య.


అర్జున్ ఆలోచనలో ఉండగానే కార్ సడెన్ బ్రేక్ వేసేసరికి ఆలోచనలో నుండి బయటకు వచ్చి చుట్టూ చూసిన అర్జున్ కి తన ఇల్లు వచ్చిందని అర్థం అయ్యి...


రండిరా.... అని తన ఫ్రెండ్స్ ను పిలిచి..తను దిగి కార్ కి డబ్బులు ఇచ్చి కాంపౌండ్ లోకి అడుగు పెట్టిన అర్జున్ కి తన చిన్న మామ కనిపించగానే మొహం లో తేలిక పాటి నవ్వు...రా .. అల్లుడు.

మీ ఇంటికి మేము ముందు వస్తే నువ్వు తర్వత వస్తున్నావా ...అని అడిగాడు .


ఎప్పుడొచ్చావ్ మామయ్య..అని అర్జున్ అడగగా.మేము నిన్నే వచ్చాం..నేను అలా బయటకు వెళ్లిస్తాను మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు అతను.


తండ్రి వెనకాలే అతనితో వెళ్ళడానికి పరుగున వస్తున్న అతని కూతురు..అర్జున్ ను చూడగానే భయం తో డోర్ వెనక్కి నకింది...


లోపలికి వెళ్ళిన అర్జున్.

డోర్ వెనకాల తన మరదలు దాక్కుంది అని తెలిసి..

కావాలనే ఆ పాప నీ బయటకు లాగి.. ఏయ్ ఎక్కడికే ఎగేసుకుని పోతున్నావ్..అని అడిగాడు.


అర్జున్ మొహం లో కోపం చూసి బెదిరి పోయి చూసింది. ఆ పాప.


పాప అలా మొహం పెట్టగానే అర్జున్ ఫ్రెండ్స్ కి పాపం అనిపించి.. అరేయ్ వదిలేయ్ రా...చిన్న పాప.

భయపడుతుంది..అని రవి అర్జున్ దగ్గర నుంచి ఆ పాపను తీసుకుని ఎత్తుకున్నాడు.



ఎంత క్యూట్ గా ఉన్నావే...ఏం పేరు నీ పేరు అని అడిగాడు రవి 

భయపడుతూ అర్జున్ మొహం చూసింది ఆ పాప.


ఏం నా మొహం చూస్తున్నావ్.నీకు నీ పేరు తెలియదా అని అడిగాడు అర్జున్.

తెలుసు అన్నట్టుగా తల ఆడించింది..

మరి ఏం రోగం చెప్పు అని గదిమడు..

ఏడుపు ఆపుకుంటూ...పింకీ అంది ఆ పాప.



కొనసాగుతుంది...