Not the End - 71 in Telugu Anything by Ravi chendra Sunnkari books and stories PDF | అంతం కాదు - 71

Featured Books
Categories
Share

అంతం కాదు - 71

దుర్యోధనుడు ఏంటి మామ వీడిని చంపడానికి నువ్వు వెళ్లాలా నేను చూసుకుంటా అంటూ రుద్రుడి దగ్గరికి చేరుకుంటాడు

రుద్రుడు వర్సెస్ దుర్యోధనుడు: బాణ యుద్ధం

అప్పుడే 'టింగ్ టింగ్' అంటున్న ఒక శబ్దం వినిపిస్తుంది. రుద్రుడు, దుర్యోధనుడు మరింత గట్టిగా కొట్టుకుంటున్నారు. మామ శకుని చెప్పినా కానీ వినకుండా దుర్యోధనుడు తన చేతిలో బాణం పట్టుకొని ముందుకు వెళ్తున్నాడు. హనుమంతుడి శిష్యుడైన రుద్రుడికి గద ఒక్కటే కాదు కదా? యుద్ధం చేయాలంటే ఒక చిన్న గడ్డిపరకతో కూడా యుద్ధం చేయగలడు. అలాంటిది అతడు బాణం, విల్లు తీసుకున్నంత మాత్రాన రుద్రుడు మాత్రం తగ్గుతాడా? తన చేతిలో ఉన్న గదను ఒక్కసారిగా పైకి ఎగరేసి మరోసారి "జై ఆంజనేయ!" అని అనగానే, తన చేతిలో పడిన గద కూడా ఇప్పుడు విల్లు, బాణంలా మారిపోయాయి. ఇప్పుడు ఇద్దరూ బాణాలతో యుద్ధం చేస్తున్నారు. రుద్రుడి చేతి నుంచి వచ్చే ప్రతి ఆయుధం ఎంతో శక్తివంతంగా ఉంది. దుర్యోధనుడు విడిచిన ప్రతి బాణాన్ని ఒక్క దెబ్బతో స్టాప్ చేసేస్తుంది.

అహంకారం తగ్గని దుర్యోధనుడు, "చూడు, నాతో యుద్ధం చేయాలనుకుంటున్నావు, బాగుంది! కానీ ఇంతగా చేస్తున్నావంటే నువ్వు మామూలు మనిషివి కాదు. అయితే ఇప్పుడు చూడు!" అని అంటూ పైకి రామబాణాన్ని వదులుతాడు. రామబాణం ఎంత శక్తివంతమైందో తెలుసు కదా! సముద్రాన్ని కూడా ఉడికించి నీటిని పూర్తిగా ఆపగల శక్తి దానికి ఉంది. అలాంటిది ఇప్పుడు హనుమంతుడి భక్తుడు అయిన శిష్యుడు ఆ రామబాణాన్ని ఎలా ఎదుర్కొంటాడు అని చుట్టూ ఉన్న ప్రజలు, రుద్రుడు కూడా అయోమయంలో పడిపోయారు. హనుమంతుడు చిన్నగా నవ్వుతున్నాడు కానీ, గణేశుడు, అశ్వత్థామ, కార్తికేయ, పరశురాముడు పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ అశ్వత్థామ చాలా ఆశ్చర్యపోయాడు. "ఇది ఎలా సాధ్యం? రాముని భక్తుడైన ఆంజనేయుడి శిష్యుడు రామబాణాన్ని తొలగిస్తే ఎంత తప్పు అవుతుందో కదా? లేదా ఎందుకు, ఏమవుతుంది?" అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.

"రామబాణం వేగంగా దూసుకు వస్తుంటే, రుద్రుడు కళ్ళు మూసుకుని, చేతులు జోడించి 'జై శ్రీరామ్!' అని స్మరించుకున్నాడు. అతను ఆ అస్త్రాన్ని ఎదిరించలేదు, గౌరవంతో స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. ఆశ్చర్యం! ఆ బాణం అతని శరీరాన్ని తాకకుండా, అతని చుట్టూ ఒక ప్రకాశవంతమైన నీలి రంగు కవచంలా ఏర్పడింది. లంకలో తన గురువైన ఆంజనేయుడిని బ్రహ్మాస్త్రం ఎలాగైతే గౌరవించి బంధించిందో, ఇప్పుడు శ్రీరాముడి బాణం, ఆయన భక్తుడి శిష్యుడైన రుద్రుడిని ఒక రక్షణ కవచంలా కాపాడింది. ఇది చూసిన దుర్యోధనుడి ముఖం పాలిపోయింది. తను సంధించిన అస్త్రమే శత్రువుకు రక్షణగా మారడం చూసి నిశ్చేష్టుడయ్యాడు."

కల్కి రూపం: గుండె, నరాలు, మెదడు ఆవిర్భావం

అలా సీన్ వాళ్ళిద్దరి మధ్య ఒక్కసారిగా స్టాప్ అయ్యి, ఇప్పుడు కల్కి శరీరం మీద చూపిస్తారు. ఇప్పుడు మట్టి రంగులో ఉన్న స్తంభం కాస్తా ఇప్పుడు ఫుల్‌గా రెండు కలర్‌లోకి మారిపోతుంది. లోపల ఉన్న శరీరం మరోసారి చూస్తే ఏదో తగినట్టు కనిపిస్తుంది. అప్పుడే సామ్రాట్ ఎదురుగా ఉన్న పాము చే చుట్టబడి ఉన్న పుట్టలో నుంచి వెలుగు మరింత వేగంగా బయటికి వస్తూ ఉండగా, రెండు పాములు దూరంగా జరిగాయి. అది ఇప్పుడు పూర్తి ప్రకాశంతో వెలుగుతూ ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతుంది. సామ్రాట్‌ను చూసి నవ్వినట్టుగా అనిపిస్తూ ఉండగా, ఆ గుండె ఒక్కసారిగా స్పీడ్‌గా కదలడం మొదలుపెడుతుంది. దాని వేగానికి చుట్టూ గాలి తన వెనకాలే వచ్చేస్తుంది. అది అప్పటికి చిన్నగా కొట్టుకుంటూనే ఉంది. దాని వేగం ఎప్పుడూ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు గాలి వేగం పెరిగే కొద్దీ ఎక్కడో ఒక విచిత్రం జరగడం మొదలుపెడుతుంది. మానవులందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి, యుద్ధభూమిలోనే మరోపక్క చిన్న పట్టణం కింద అగ్నిపర్వతం ఉడకడం మొదలుపెడుతుంది. అప్పటికే ఉడికి ఆగిపోయిన అగ్నిపర్వతం ఇప్పుడు మరోసారి ఉడకడం మొదలుపెట్టింది. ఆ దెబ్బకు సముద్రాలు తిరుగుతూ దారిని ఏర్పరుస్తున్నాయి.

ధర్మాత్మ రహస్యం: శమంతకమణి, AI, కాలచక్రం

ఇప్పుడు గుండె ఎగురుతూ వెళ్లి ఆ స్తంభంలోకి చేరుతుంది. ఆ స్తంభంలో గుండె కోసమని స్పెషల్‌గా ఒక డిజైన్‌లా కొద్దిగా మట్టి జరిగింది. కరెక్ట్‌గా ఆ సెంటర్‌లో గుండె కట్టుగా సరిపోగానే ఒక హోల్ లాంటిది శరీరం నుంచి బయటకు వచ్చింది. అది ఏదో లోపలికి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్టుగా ఉండడంతో, అప్పుడే శివుడు చిన్నగా నాగశేషుడితో, "వెళ్ళు! ఈ దైవ కార్యానికి నువ్వు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నావు," అని అంటూ ఉండగా, వాసుకి అంతకంటే ముందు స్పీడ్‌గా వెళ్ళిపోయింది. వెనకాలే ఇక నాగశేషుడు కూడా స్పీడ్‌గా కదలడం మొదలుపెట్టాడు. ఇద్దరూ శరీరం లోపలికి నరాలు ప్రవహించే విధంగా ఒక ట్యూబ్‌లాగా మారిపోయి ఆ స్వరంగంలోకి దూకాయి. అవి లోపలికి వెళ్ళగానే నరాలుగా సన్నగా మారాయి. అవి శరీరం అంతా ప్రవహిస్తూ పూర్తిగా ఒక నరాల వ్యవస్థ (nervous system) లాగా మారిపోయాయి. వాసుకి మెదడు మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ వెంటనే తెల్లటి అంటే నలుపు, ఎరుపు కలిపి ఉన్నాయి కదా, దాంట్లో తెలుపు యొక్క దైవ శక్తి మెదడులోకి వెళ్లి మెదడుకు రెండు పొరలుగా ఏర్పడింది. ఆ వెంటనే ఎరుపు యొక్క అంటే అది రక్తంలో మారింది కదా, ఆ రక్తం ఆ ట్యూబులు (నరాలు) ల నుంచి గుండెకు ప్రవహించడం మొదలుపెట్టింది. ఆ గుండె ఒక మిషన్‌లా వేగంగా కదలడం మొదలుపెట్టింది. వెంటనే గుండె వేగం పెరిగింది.

ఇక అంతే, మరింత వేగంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇంతలో భీముడు అంటే సామ్రాట్, భీముడు దగ్గరికి వెళ్లి, "భీమసేనా! ఇప్పుడు నువ్వు మాత్రమే సహాయం చేయాలి. నువ్వే నీ బలంతో అతడికి భయం నేర్పిస్తే, మిగతా సంగతి రుద్రుడు చూసుకుంటాడు," అని అంటూ ముందుకు వెళ్ళమంటాడు. అంతే తన ముందు భీముడు రాగానే అతని మనసులో భయం మరింత పెరిగింది. గుండె వేగం పెరగడంతో పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతే రుద్రుడు దుర్యోధనుడి కాలి పట్టుకొని గిరగిరా తిప్పుతూ "జై శ్రీరామ్!" అంటూ విసిరేస్తాడు. అంతే ఒక పక్క నుంచి సామ్రాట్ ఎగురుతూ వచ్చి తన ఒక్క పంచ్‌తో దూరంగా ఎగిరిపడేలా చేస్తాడు. దుర్యోధనుడు ఆ దెబ్బకు దూరంగా వెళ్తూ స్తంభం దగ్గరికి వెళ్తాడు. అంతే స్తంభం అతన్ని ఆకర్షిస్తుంది. తన శరీరంలోని జీవశక్తిని పూర్తిగా లాగేస్తుంది. ఇప్పుడు పిండి పడేసిన బత్తాయి పండులా అలా నేలపై వాలిపోయాడు. ఇదంతా చూస్తున్న శకునికి ఇక ఏం చేయాలో అర్థం కావడం లేదు. "కచ్చితంగా ఇంకా కొద్దిసేపు ఉంటే కల్కి చేతిలో కంటే ఈ రుద్రుడు చేతిలోనే చనిపోతాను," అని అనుకుంటూ యుద్ధభూమి నుంచి పారిపోవడం మొదలుపెట్టాడు. అదంతా చూస్తున్న హనుమంతుడు, "వీడికి ఇది కొత్త కాదులే," అని అనుకుంటూ, "రుద్రా! నువ్వు వదిలేయ్! మళ్ళీ కల్కి చూసుకుంటాడు," అని అంటూ ఉండగా అక్కడి నుంచి శకుని మాయమైపోతాడు. అతడు వెళ్లి డైరెక్ట్‌గా అసురు లోకంలో తేలతాడు.

అశ్వత్థామ, పరశురాముడి సంభాషణ: ధర్మాత్మ వాస్తవం

ఇక అక్కడ కట్ చేస్తే, ఆ దెబ్బకు జీవశక్తి పొందిన (కల్కి) కానీ ఎందుకు కదలలేకపోతున్నాడు ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఒక పెద్ద బ్లాక్‌గా బయటికి వస్తాడు అని అనుకుంటే ఇంకా బయటికి రాకపోవడం అందరికీ అనుమానం కలిగిస్తుంది. అప్పుడే అశ్వత్థామ ఇలా అనుకుంటాడు, "అయినా ఇలా ఇంతమందిని కృష్ణుడు మాలాంటి వాళ్ళను ఎందుకు ఉంచాడు? ఇప్పుడు మాకు అర్థమవుతుంది పరశురామా! మన జీవితం, మన యుగ పురుషులని ఒక చిన్న బిరుదు ఈ కృష్ణుడు లాగేసుకున్నాడు," అని చిన్నగా నవ్వుతాడు. "అంతే కదా! నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను. ఇన్ని యుగాల నుంచి ఈ మానవులు చేసే తప్పులు, పాపాలు భరించలేక నేను ఎక్కడికో వెళ్తే, ఒక చిన్న సంఘటనతో నన్ను బయటికి తీసుకువచ్చాడు ఆ ధర్మా గాడు," అని కథ చెప్పడం మొదలుపెడతాడు.

"ఆ ధర్మం గాడు నిన్ను చేరుకొని మళ్ళీ బ్రతికి వచ్చాడు అంటే వాడు మామూలోడు కాదురా," అని అంటాడు. "అవును! వాడు మళ్ళీ బ్రతికి రావడానికి కారణం శమంతకమణి తెలుసు కదా? అందులో ఐదు రకాల డైమండ్లు ఉంటాయి. అందులో పవర్ఫుల్ డైమండ్స్ శక్తులు (నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం), అలాగే కాలచక్రం (టైమ్ ట్రావెల్) కు సంబంధించిన ఐదు రకాల డైమండ్స్. నేను ఆ మహా శివుడి త్రినేత్రం నుంచి వచ్చిన ఈ మణులను నేను ఎంతో జాగ్రత్తగా కష్టపడి ధ్యానం చేసి తీసుకున్నాను. కానీ ఆ ధర్మాగాడు ఎందుకు, ఎలా, ఎప్పుడు తీసుకున్నాడో అర్థం కాలేదు. నేను ధ్యానం చేసుకుంటున్నా టైంలో ఎప్పుడొచ్చాడో తెలీదు, తన నా దగ్గర ఉన్న ఆ డైమండ్లను దొంగలించాడు. అంతే! కోపం వచ్చినా నేను ముల్లోకాలు వెంటాడి చివరికి సామ్రాట్ ఉన్న భూమిలో అతని మార్చాను. కానీ అతనిలో ఉన్న AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అతన్ని, ఆత్మను వేరు చేసింది. అంతే! వాడికి ఇక మరణం లేనట్టుగా ఎన్నిసార్లు బ్రతికి, చచ్చి, బ్రతికి, చచ్చి ఉండడానికి కారణం మరి. స్పేస్ పవర్ కలిగిన మరియు టైమ్ ట్రావెల్ కాలచక్రాన్ని ఉపయోగించి వాడు ఎన్నిసార్లు బ్రతుకుతున్నాడు. వాని చంపడానికి ఎవరు సరిపోరు. కేవలం కాలాతీతుడిగా జన్మించబోయే కల్కి మాత్రమే హతమార్చగలరు. అందరూ శకుని పెద్ద విలన్ అని అనుకుంటున్నారు కానీ, అతన్ని కూడా బ్రతికించిన ధర్మాత్మ గురించి ఎవరికీ తెలియదు," అని అంటూ కదా ముగించాడు.

వరకు కథలో ఎన్నో బొక్కలు స్పెల్లింగ్ మిస్టేక్ లు ఉన్నా కూడా ఇంతవరకు మీరు వచ్చారంటే ఐ లవ్ ఇట్