A Women Self Motivation in Telugu Short Stories by M Nagaraj books and stories PDF | ఆత్మ ధైర్యం

Featured Books
Categories
Share

ఆత్మ ధైర్యం

ఓపెన్ చేస్తే... అర్ధరాత్రి పండు వెన్నెల టైంలో... అలా నిండు చంద్రుడిని... అలా ఒక ఇంటి గది కిటికీ లోపల నుంచి వస్తే.... ఆ గదిలో కొన్ని వస్తువులు.. బట్టలు... చిందర వందరగా పడి ఉంటాయి...! అలా బెడ్ పై చూపిస్తే, ఒక ఆమె 27+ బోర్ల పడుకుని... ఏడుస్తూ ఉంటుంది...! అప్పుడు కిటికీలో నుంచి గాలి ఎక్కువగా వీస్తుంది... దాంతో ఆమె తల దగ్గర ఉన్న డైరీ పేజీలు.. (ఇది తనేదే) అలా గాలికి ఊగుతాయి...! అప్పుడు ఆమె చేయి, ఒక పేజీ పై పెడుతుంది... అప్పుడు డైరీలో చూస్తే.. ఆ మాటలు ఇలా ఉంటాయి..!

డైరీలో మాట ; మనల్ని అసహ్యించుకునే వాళ్లతో ఉండే జీవితం.... నరకం...!! 
(సాడ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కొంచెం గ్యాప్ ఇచ్చి) 

డైరీలో ; ఆడదానిగా పుట్టినందుకు మన కర్మ ఇంతే అనుకుని భరించాలా..?
అమ్మ నాన్న పెళ్లి చేశారని వాళ్ళ కోసం సహించాలా...??
సొసైటీ ఏదో అను కుంటుందనే భయంతో బంది గా ఉండి పోవాలా...???
ఇలా సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో, నా మనసు.. ప్రతిక్షణం అడుగుతూనే ఉంది...????

(కొంచెం గ్యాప్ తో.. సాడ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో.. నెక్స్ట్ పేజీలో)

డైరీ లో ; ప్రేమ లేని చోటు, ప్రేమ కోసమై తప్పిస్తూ ఉండిపోయా...??

(గతంలో జరిగిన దాన్ని గుర్తుకు చేసుకుంటుంది...! షాడో షాట్లో.. ఫేసులను క్లియర్ గా చూపించకుండా.)

మేల్ వాయిస్ ; నువ్వంటే నాకు మొదటి నుంచి ఇష్టం లేదు..! ఐ హేట్ యు.. తాళి కట్టాను కాబట్టి ఇంట్లో ఉంచ...!

డైరీలో ; రెస్పెక్ట్ లేని చోటు, చాకిరీ చేస్తూ బందీగా మిగిలి పోయా...!!

మేల్ వాయిస్ ; (గట్టిగా కోపంగా) నువ్వు నాకు పట్టిన దరిద్రానివే...  (మరొక షార్ట్ లో అన్నం ప్లేటు ను విసిరి పారేస్తూ) దీన్ని కుక్కలు కూడా తినవు...!

డైరీలో ; ఓదార్పు లేని చోటు, రాలే కన్నీరుగా పడిపోయా...!!!

(షాడో షాట్ లో ఆమెను కొట్టిన తర్వాత.. ఆమె గోడను ఆనుకుని ఏడుస్తూ కూర్చున్నప్పుడు ఆమె కన్నీటిని  చూపిస్తాం...)

డైరీలో ; కట్టె కాలే దాకా సాగాల్సిన జీవితం.. అద్దాంతరంగా.. ఆగి పోయినట్టుగా ఉంది...!
నాలుగు గోడలా ప్రపంచం... 
మానని గాయాలు... 
ఫలితం లేని వెట్టి చాకిరి... 
వెలుగు చూడని కళ్ళు... 
ఆగని కన్నీళ్లు... 
భరించ లేని హృదయ వేదన... 
ఇదే నా జీవితం...!! 
నా కర్మ ఏంటంటే..? 
ఇదంతా ఇష్టం లేని వ్యక్తి కోసం భరిస్తున్న...!! 
తరచూ నా మది అడిగే ప్రశ్నలు... 
ఇది అవసరమా...? 
ఇలా ఎంతకాలం...?? 
దేనికోసం భరిస్తున్నావ్...??? 

( సాడ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఆమె ఫేస్ ఇంట్రడక్షన్ చూపిస్తాం... వీటిని తలుచుకొని ఇంకా ఏడుస్తుంది.. )

హర్రర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో.. గాలి ఎక్కువగా వీస్తుంది... కిటికీలు బాగా కొట్టుకుంటాయి... అప్పుడు గంభీరమైన వాయిస్ తో... ఆమె ఆత్మ..

ఆమె ఆత్మ ; బ్రెయిన్ లో పాతుకుపోయిన ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోతే అంతరమదిలో అనుక్షణం అను యుద్ధమే...!!!!

ఆమె అటూ ఇటూ తిరిగి చూస్తుంది... అప్పుడు ఆమె ఆత్మ ప్రతిబింబం, అలా కింద నుంచి ప్రత్యక్షం అవుతూ పూర్తిగా కనిపిస్తుంది...! 

ఆత్మ ; యుద్ధంలో గెలవాలంటే సరైన ఆయుధాలు కావాలి... నీ మనసుతో గెలవాలంటే అది అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఉండాలి... లేకపోతే ప్రతిసారి ఓటమి తప్పదు...! ఆ ఓటమితో నువ్వు ఇంకా కృషించగా తప్పదు...!!

ఆమె ; (ఏడుస్తూ) ఏం చేయాలి.. ఇంకేం చేయాలి...?? (ఇంకా ఏడుస్తూ) ఇక నేను ఏమి చేయలేను.. ఎందుకంటే ఇది నా మెడలో ఉంది.. (తాళిని చూపిస్తూ) తెగించి తెగదంపులు.. చేసుకుందామంటే.. మా తల్లిదండ్రులు అడ్డొస్తారు.. మా ఆయన్ని ధైర్యంగా ఎదిరించలేను... ఈ సమాజం నిందిస్తుంది.‌‌.. జీవచ్ఛవంలా కుమిలిపోతూ పడుండడం తప్ప, ఇంకేమీ చేయలేను...!!

ఆత్మ ; నిర్ణయం సరైనదైతే తల్లిదండ్రులతో ఫైట్ చేసిన తప్పులేదు... కానీ.. ఏ కారణాల కైనా వాళ్లను వదిలీ వెళ్లడం తప్పు....! వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రులు చిన్నపిల్లలవుతారు... వాళ్లను సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత మనది..! మనం చిన్నతనంలో మారం చేస్తాం... వాళ్లు ఈ వయసులో మొండి పట్టు పడతారు.... అప్పుడు మనం మారం చేస్తే బుజ్జగించి లాలించి వాళ్ల దారిలో తెచ్చుకున్నారు...!  ఇప్పుడు వాళ్లు మొండి పట్టుపడితే.. ఓపికతో సహనంతో సర్దిచెప్పి మన దారిలో తెచ్చుకోవాలి...! ఇక నీ మొగుడు అంటావా... 'ఎదిరించే వాళ్ళు లేనంత వరకు, భయపెట్టే వాడు బలంగానే ఉంటాడు...! ఒక్కసారి ఎదిరించి చూడు... వాడి ధైర్యం ఏంటో నీకే తెలుస్తుంది'...! 'ఇక సమాజం అంటావా.. డబ్బు ఉంటే పూల వర్షం.. లేకపోతే రాళ్ల వర్షం... డబ్బును చూసి మారే సమాజం కోసం.. నువ్వు మారకుండా ఉండడం చూస్తే నాకు నవ్వొస్తుంది'...!!

ఆమె ; నువ్వు ఎన్నైనా చెప్పు.. ఒక ఆడది మొగుడ్ని వదిలేసి ఒంటరిగా బ్రతకలేదు, ఎందుకంటే చిత్త కార్తీ కుక్కల వేధింపులు భరించలేం...! దానికన్నా ఈ మృగంతో సర్దుకుపోవడం మంచిది...!!!

ఆత్మ ; ముందు ఆలోచన అనేది, ధైర్యానికి పునాది అవ్వాలి, పిరికితనానికి కాదు..! నీకు తెలియకుండానే, నీ చుట్టూ ఒక సర్కిల్ గీసుకున్నావ్... దాన్ని దాటి వెళితే బ్రతకలేనేమోనని బ్రమ పడుతున్నావ్...! నీకు తెలియనిది ఏంటంటే నీ చుట్టూ ఉన్నది సర్కిల్ కాదు... అది భయం వల్ల ఏర్పడిన పద్మవ్యూహం... దాన్ని చేదించకపోతే... అందులోనే ఉండి నలిగిపోతావ్... భరించలేక నీ అంతకు నువ్వే చచ్చిపోతావ్...!!!

ఆమె ; (ఏడుస్తూనే) బాగా ఆలోచించి చూస్తే నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది... (కన్నీళ్లు తుడుచుకుని) నేను సూసైడ్ చేసుకుంటా...!!!

ఆత్మ ; (గట్టిగా ఆవేశంగా) చావడానికి ఉన్న ధైర్యం ఎదిరించడానికి ఎందుకు లేదు...??? ఎలాగో చావాలనుకున్నావు కదా, ఎదిరించి పోరాడి చచ్చిపో... అప్పుడు నేను గర్వంగా పైకి వెళ్తా...!!! చూడు మగాడి ధైర్యం వాడి బలం లో ఉంటుంది. ఆడదాన్ని ధైర్యం తెగింపులో ఉంటుంది. తెగించి ఒక్క అడుగు ముందుకు వేసి చూడు.. నువ్వు చావడం కాదు..... నీ పిరికితనం చస్తుంది....!!! (కొంచెం గ్యాప్ ఇచ్చి) 'ఒకటి గుర్తుపెట్టుకో ఇష్టం లేని వాడితో జీవితమంటే మనసులో అగ్నిపర్వతం పెట్టుకున్నట్టే... దాన్ని నీ కన్నీటి సముద్రంతో ఎంత తడిపిన చల్లారదు'....!!!

ఆత్మ మాయమవుతుంది... ఒక్కసారిగా ఆమెలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.... ఒక్కసారిగా మెడలో ఉన్న తాళిని తెంచేసి... ముందుకు అడుగు వేస్తుంది... అలా ఇంట్లో నుంచి గడప దాటుతుంది...!!! అప్పుడే తెల్లారు జామున సూర్యుడు కాంతి ఆమె ముఖం పై పడుతుంది...!!!! ఆ వెలుగును ఆహ్వానిస్తుంది...!!!!!

కట్ చేస్తే మూడు నెలల తర్వాత.... (సాఫ్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో...) కేవలం ఆమె డైరీలో రాస్తున్న చేతిని మాత్రం చూపిస్తూ.... డైరీలో ఇలా...

డైరీలో ; స్వేచ్ఛ కోసం చేసిన పోరాటం లో ఒక్కసారి తెగించి ముందుకు అడుగు వేస్తే.... 

(ఇన్నర్ కట్ లో ఆమె అడుగు రంజల్ నది గట్టు పైన అలా పడుతుంది..) 

డైరీలో ; ధైర్యం తోడై, అన్నిటిని ఎదిరించేలా చేసింది...!!!

(ఇన్నర్ కట్ లో రాంజల్ గట్టుపై మరో అడుగు పడుతుంది...)

డైరీలో ; ముందు ఏమాత్రం జాలి లేని మా ఆయన్ని, స్వారీ... ఒక మృగాన్ని ధైర్యంగా ఎదిరించాను....!!

(ఇన్నర్ కట్ లో రాంజల్ గట్టుపై మరో అడుగు పడుతుంది...)

డైరీలో ; తర్వాత మా అమ్మ నాన్న కి బాగా నచ్చజెప్పి, ధైర్యం చెప్పి, ఒప్పించాను...!!!

(ఇన్నర్ కట్ లో రాంజల్ గట్టుపై మరో అడుగు పడుతుంది... ఈసారి వెనకనుంచి కొంచెం మోకాళ్లపై దాకా చూపిస్తాం...) 

డైరీలో ; తరువాత ఈ సమాజాన్ని వదిలేశాను....!!!

(ఇన్నర్ కట్ లో రాంజల్ గట్టుపై... వెనకనుంచి చూపిస్తాం. ఆమె ముందుకు అడుగులు వేస్తుంటుంది...) 

డైరీలో ; కోర్టులో నా వాదనను గట్టిగా వినిపించి, గెలిచాను....!!!! 

ఇన్నర్ కట్లో రంజల్ గట్టు పైన.. ఆమెను మొత్తం బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాం... తల ఎత్తి, రెండు చేతులు అలా చాచి ఉంటుంది... ఆమె ముందు నీళ్లు క్లియర్ గా కనబడుతుంది.... స్వచ్ఛమైన గాలి ఆమె కురులను నాట్యమాడేలే చేస్తుంది..!!

డైరీలో ; ఇప్పుడు... పోరాడి గెలుచుకున్న ఈ స్వేచ్ఛను ఆస్వాదిస్తున్న....

(ఇప్పుడు రాంజల్ కట్టు పై రౌండ్ కెమెరా తిప్పుతూ... ఆమె ఫేస్ ను చూపిస్తాం.... ఆమె కళ్ళు మూసుకుని.. ఆ స్వచ్ఛమైన గాలిని బాగా పీల్చుకుంటూ, ఆ స్వేచ్ఛను ఆస్వాదిస్తుంది...!!!  కొద్దిసేపటికి రిలాక్స్ అయ్యి.. మెల్లగా కళ్ళు తెరిచి నీటిని చూస్తూ ప్రశాంతంగా ఇలా....)

ఆమె ; (మనసులో ) ఎదిరించి పోరాడి.. నచ్చిన జీవితాన్ని తెచ్చుకునే దాంట్లో ఉండే కి కే వేరప్ప....!!! (పవన్ కళ్యాణ్ మేనేజర్ తో) ఆ.....!!!! (కొంచెం గ్యాప్ ఇచ్చి రియాక్షన్ చేంజ్ చేస్తూ) ఇదంతా స్వేచ్ఛ కోసమే చేసిన.. ఒక్కోసారి అనిపిస్తుంది.....  ఒంటరిగా మిగిలిపోతున్నాన...???

అప్పుడు ఆమె ఆత్మ, తన ఎదురుగా మరోసారి ప్రత్యక్షమవుతుంది.... 

ఆత్మ ; ఒంటరితనంలో ఎప్పుడు ఒకటి తోడుంటుంది అదే ప్రశాంతత... పీస్ ఆఫ్ మైండ్... ప్రపంచంలో ప్రతి ఒక్కరు మొదట కోరుకునేది ఇదే...! అయినా నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు అని ఎందుకనుకుంటున్నావ్... కాలానికి దేన్నైనా మార్చే శక్తి ఉంది... మనల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది. ఎందరినో పరిచయం చేస్తుంది... అందులో నీ అభిప్రాయాలను.. నీ ఇష్టాలను.. గౌరవించి, నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తి కచ్చితంగా దొరుకుతాడు... ఆ వ్యక్తిని వదులుకోకు... తొందరలోనే ఆ వ్యక్తి నిన్ను కలుస్తాడు (అని మాయమవుతుంది...)

ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు... ప్రశాంతమైన వాతావరణం అంతే ప్రశాంతమైన మనసుతో ఆత్మ సంతృప్తిగా అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంది...!!! 

The End....... Story By Nagraj....!!!