kalki avatar in Telugu Science-Fiction by Ravi chendra Sunnkari books and stories PDF | K A.U

Featured Books
  • आखिरी कोशिश

    धूप ढल चुकी थी। शहर की भीड़ में हर कोई अपनी मंज़िल की तरफ़ भ...

  • अनोखी यात्रा

    अनोखी यात्रा **लेखक: विजय शर्मा एरी**---सुबह की पहली किरण जब...

  • ज़िंदगी की खोज - 1

    कुछ क्षण के लिए ऐसा प्रतीत हुआ जैसे वक्त ने खुद को रोक लिया...

  • Veer-Zaara

    Veer Zara“मैं मर भी जाऊँ तो लोग कहेंगे कि एक हिंदुस्तानी ने...

  • अतुल्या

                    &nbs...

Categories
Share

K A.U

💥 చార్మినార్ రక్తపాతం (The Bloodbath of Charminar) 💥దృశ్యం 1: చార్మినార్ సాక్షిగాసూర్యుడు అప్పుడే ఆకాశం మధ్యకు చేరుతున్నాడు. పాతబస్తీ గుండెకాయ, హైదరాబాద్ చార్మినార్ పరిసరాలు ఉదయం సందడితో నిండి ఉన్నాయి. వీధి వ్యాపారుల అరుపులు, పువ్వుల పరిమళం, పండ్ల రంగులు, అడుక్కునేవారి దీన స్వరాలు... ప్రతి ఒక్కరూ తమ దైనందిన వ్యాపారంలో మునిగి ఉన్నారు. ఒక పక్క మసీదులో ఏదో పూజ జరుగుతున్నట్టు నిశ్శబ్ద ప్రార్థనలు వినిపిస్తున్నాయి.అంతలో, ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆకాశాన్ని తాకేంత ఖరీదైన నలుపు రంగు లగ్జరీ కారు ఒకటి హుందాగా చార్మినార్ ముందు ఆగింది. దాని వెనుక భద్రతా సిబ్బందితో నిండిన మరికొన్ని నల్లటి బండ్లు వచ్చి నిలిచాయి. బ్లాక్ సూట్‌లు ధరించిన మనుషులు, వారి చేతుల్లో మెరిసే ఆయుధాలు... వాతావరణం క్షణంలో మారిపోయింది.ఆ కారులోంచి దిగింది ఒక మహిళ. ఆమె చూపుల్లో అచంచలమైన అధికారం, దర్పం. ఆమె పేరు శాలిని. అక్కడున్న జనమంతా భయంతో వెనక్కి తగ్గారు. వ్యాపారాలు ఆగిపోయాయి. చార్మినార్ ప్రాంగణం నిశ్శబ్దంగా మారింది.శాలిని దర్జాగా చార్మినార్ లోపలికి అడుగుపెట్టి, ఒక్కసారి చుట్టూ చూసింది. పెదవులపై చిన్న నవ్వు మెరిసింది. ఆమె అక్కడినుంచి నేరుగా పక్కనే ఉన్న ఒక పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం వైపు నడిచింది.దృశ్యం 2: గంగోలి పిలుపుగుడి తలుపులు తెరిచి ఉన్నాయి. ప్రధాన పూజారి హారతి ఇస్తుండగా, శాలిని గుడి మెట్లు ఎక్కింది. ఆమెను చూడగానే పూజారి గుండె ఆగినంత పనైంది. అతని చేతిలో ఉన్న హారతి పళ్లెం భయంతో నేలపాలైంది. చుట్టూ ఉన్న భక్తులు చెమటలు తుడుచుకుంటూ, అప్రయత్నంగా నాలుగు అడుగులు వెనక్కి వేశారు.శాలిని విగ్రహం ముందు నిలబడింది.> "వెంకటేశ్వరా... నిన్ను ఎన్ని సంవత్సరాలుగా అడుగుతున్నాను? మళ్లీ వాడిని రమ్మని చెప్పు. వాని కోసం ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి? వాడిని రప్పించడానికి... నాకు తప్పు చేయాలనిపిస్తుంది. తప్పు చేస్తే నన్ను కూడా ఒక్కడు అని చిన్నగా నవ్వుకుంది.> ఆమె నేల మీద పడిన హారతి పళ్లెం వైపు చూసింది. ఆ పళ్లెంలోని మంటను ఆమె తన చేతిలోకి తీసుకుంది. మంట ఆమెను ఏమీ చేయలేదు. దేవుడికి హారతి ఇచ్చి, మళ్లీ ఆ అగ్నిని పళ్లెంలోనే పెట్టి, హారతిని తీసుకుని... నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది.దృశ్యం 3: భయానక గుసగుసలుశాలిని గ్రూప్ వెళ్లగానే, ప్రజల్లో గుసగుసలు మొదలయ్యాయి.> "శాలిని గ్రూప్ వచ్చింది అంటే... మళ్ళీ ఏదో జరగబోతోంది."> "అసలు గంగోలి గ్యాంగ్ రాదు కదా? ఆ గ్యాంగ్ వస్తే... దేవుడి విగ్రహాన్ని కూడా దొబ్బుకుపోతారు."> "వాడు రాకూడదు! గంగోలి గ్యాంగ్ ఇంక రంగంలోకి దిగకూడదు. ఎప్పుడైతే గంగోలి గ్యాంగ్ తన శక్తిని ప్రదర్శిస్తుందో... అప్పుడే వాడు వస్తాడు. మళ్లీ రక్తపాతం జరుగుతుంది."> అక్కడే ఉన్న ఒక వృద్ధుడు కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ, గుండెను గట్టిగా పట్టుకున్నాడు. అతని కళ్ళలో ఎరుపు... చార్మినార్ మొత్తం రక్తంతో తడిసినట్టుగా అనిపించింది. వాడు మళ్ళీ తిరిగి రాకూడదు అని గట్టిగా అనుకున్నాడు.దృశ్యం 4: ఆదిత్య నివేదిక (పోలీస్ హెడ్ క్వార్టర్స్)అధికారిక కార్యాలయంలో, పటిష్ఠమైన పోలీస్ బృందం ముందు, ఏజెంట్ ఆదిత్య నిలబడి ఉన్నాడు.> "సార్... ఎవరికి తెలియకుండా గంగోలి గ్యాంగ్ మళ్లీ మొదలు పెడుతోంది. డ్రగ్స్ సంపాదించడం... పిల్లలకు అందించడం. కనీసం స్కూల్, కాలేజీలను కూడా వదలడం లేదు. వాళ్లకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. డైరెక్ట్‌గా కాలేజీల్లోనే అమ్ముతున్నారు సార్! ప్రతి ఒక్కరి గుండెల్లో భయంగా నిలిచిపోయిన ఆ పాత రోజులు మళ్లీ తిరిగి వస్తున్నాయి."> మిగతా పోలీస్ ఆఫీసర్లు చెమటలు తుడుచుకుంటూ:> "అది జరగనివ్వకూడదు! వెంటనే ఈ కేసును టేకప్ చెయ్యి. ప్రజలకు అనవసరమైన కష్టాలు, వస్తువులు అసలు ఉంచకండి. వాడు అజ్ఞాతంలో ఉండడమే మంచిది. లేదంటే మనం ఆర్మీ మొత్తం వెళ్లి వాడిని అంతం చేయాల్సి వస్తుంది."> గంగోలి గ్యాంగ్కు చెందిన కొన్ని ఫోటోలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వారి యజమాని... గ్యాంగ్‌కు ఓనర్‌గా వ్యవహరించే వ్యక్తి ఫోటో కూడా కనిపిస్తుంది.> ఆదిత్య: "సార్... ఇతడే భాస్కర్. గంగోలి గ్యాంగ్‌లో అసలైన విలన్. తన సొంత నీడను కూడా నమ్మడు. అతని కంప్యూటర్, ల్యాప్‌టాప్ డీటెయిల్స్ అన్నీ తన మైండ్‌లోనే ఉంటాయి. బయటికి ఒక్క ఆధారం కూడా ఉంచడు."> ఆదిత్య కొత్త రకం డ్రగ్స్ గురించి వివరించాడు.> "దీని పేరే 'ఈ బ్రేవ్'. పిల్లల మెదడును షార్ప్ చేస్తాయి, తెలివితేటలు పెంచుతాయో లేదో తెలియదు కానీ, బుక్‌లో చదివిన ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకునేలా చేస్తాయి. అలాగే లైట్‌గా మత్తును కూడా ఇస్తాయి."> అతను ఒక అబ్బాయి ఫోటో చూపించాడు.> "వీడి పేరే రాజా. పెద్దగా చదువు అబ్బలేదు. కానీ డ్రగ్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత నుంచి టాపర్‌గా ఉన్నాడు. కానీ ఆ మందు లేకపోతే అతనికి చదువు రాదు, గుర్తుపెట్టుకోలేడు. చివరికి డ్రగ్స్‌కు బానిసగా మారి... గంగోలి గ్యాంగ్ చెప్పింది చేయడం మొదలు పెట్టాడు. కిడ్నాప్‌లు, రేప్‌లు, డబ్బులు తీసుకురావడం... ఇలా మెల్లమెల్లగా ఒక్కొక్క పిల్లవాడు ఆ డ్రగ్స్‌కు బానిసగా మారుతున్నాడు. ఇదే కంటిన్యూ అయితే... వాడు వస్తాడు సార్!"> దృశ్యం 5: శాశ్వత ఎలివేషన్ (SCENE - PERMANENT ELEVATION)> "సరే సార్!" అన్నాడు ఆదిత్య.> మరుసటి రోజు, ఆదిత్య కాలేజీకి వెళ్లి డ్రగ్స్ ఇస్తున్న వ్యక్తిని పట్టుకొని స్టేషన్‌లో బంధించాడు. ఎవరు ఇస్తున్నారు? ఎలా జరుగుతోంది? అని అడుగుతుండగానే...సడన్‌గా ఒక కారు పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. కానిస్టేబుల్స్ అంతా భయంతో పారిపోయారు. ఒక వ్యక్తి... నలుపు రంగు సూట్‌తో, చేతిలో గన్‌తో, చుట్టూ మనుషులతో బయటికి దిగాడు. గాలి నిశ్శబ్దం. చుట్టూ ఉన్న ప్రజలు పారిపోయారు.ఒక్కసారిగా బుల్లెట్ల వర్షంతో పోలీస్ స్టేషన్ ధ్వంసం అవ్వడం మొదలైంది.లోపలికి వచ్చింది భాస్కర్ కాదు... అతని లెఫ్ట్ హ్యాండ్. వాడు ఒక పక్క గుట్కా నములుతూ, మరో పక్క సిగరెట్ వెలిగిస్తూ ఆదిత్యతో మాట్లాడటం మొదలుపెట్టాడు.> "ఏంటి ఆఫీసర్! చిన్న చిన్న పనులు చేసుకుంటూ కడుపు నింపుకుంటుంటే... మా కడుపుకు అడ్డం వస్తావా? చేతికి అడ్డు వస్తే పట్టించుకోమేమో కానీ, మా కడుపుకు అడ్డం వస్తే ఏం చేస్తామో తెలుసు కదా?"> ఆదిత్య చిన్నగా నవ్వుతూ:> "తెలుసు. ఏం చేస్తారు? మహా అంటే చంపేస్తారు. ఇంతకుముందు పారిపోయి బతికి వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని బెదిరించడమేనా? ఒకసారి గుర్తుకు చేసుకో! చార్మినార్ మధ్యలో అడ్డంగా నరికిన వ్యక్తి వాడు! వాడు మళ్లీ రాకూడదని, మీ అందరి ప్రాణాలు బాగుండాలని ఇదంతా చేస్తున్నాం."> వెంటనే కోపం వచ్చిన ఆ లెఫ్ట్ హ్యాండ్ కుర్చీని నేలకేసి కొట్టి:> "ఎవడ్రా వాడు? ఇప్పుడు రమ్మను! ఈసారి వాడి అంతమే! ఇప్పుడు చేస్తుంది కూడా వాణ్ణి రప్పియ్యడానికి. వాడు వచ్చిన మరుక్షణం యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో మీరందరూ కూడా జ్యోతులుగా మారతారు!"> > ఆదిత్య: "జ్యోతులుగా మారేది మేము కాదు! నువ్వే ప్రళయానికి ఆద్యం పోస్తున్నావు. అది ఒక్కసారి చెలరేగితే... గంగోలి గ్యాంగ్, శాలిని గ్రూప్ అంటూ ఏమీ ఉండవు."> > లెఫ్ట్ హ్యాండ్: "నీకు మందు పెట్టి పోయాడా? పెద్ద పెద్ద ఎలివేషన్ ఇస్తున్నావు? ఇక్కడ ఎలివేషన్ ఇవ్వాలన్నా మేమే! ఎలివేషన్ తీసుకోవాలన్నా మేమే!" అని క్రూరంగా నవ్వాడు.>