ఇది నిజంగా ఒక ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన. దాన్ని ఆధారంగా ఈ కథ రాయడం జరిగింది.
అనగనగా ఒక అందమైన గోదావరి నది తీరాన ఒక ఊరు. ఆ ఊరి పేరు అస్గుల్ . ఇది మహారాష్ట్ర బోర్డర్ కు తెలంగాణ బార్డర్ కు దగ్గరలో ఉంటుంది.
ఊరు తెలంగాణ బార్డర్ లో ఉన్న అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలుగు సరిగా రాదు.
ఆ ఊరిలో ఆడవారు మొత్తానికి బయట కనిపించరు.
కేవలం అక్కడ మగవాళ్ళు మాత్రమే బయట కనిపిస్తారు తప్ప ఆడవాళ్లు బయటికి రారు.
ఆ ప్రాంతంలోని వారందరూ మాంసాహారం అసలే తినరు.
కేవలం ఆకుకూరలు మాత్రమే తింటారు వారు అందరూ పూర్తిగా శాకాహారులు మాత్రమే.
మన తెలంగాణ ప్రజలతో పోలిస్తే అక్కడ ప్రజల భాషా తీరు విధానం అంతా తేడాగా ఉంటుంది.
అది ఆ ఊరు గోదావరి ఒడ్డున ఉన్నందువలన ఆ వాతావరణం ఊరు వాన కాలం లో చాలా అందంగా ఉంటుంది .
ఆ ఊరి వారందరూ గోదావరి నదిని "గంగాదేవి రూపంలో" కొలుస్తారు.
ఇటు పక్కా మన హీరో కథకు వస్తే. హీరో పేరు శ్రీరామ్ తన ఒక్క పట్నంలో పుట్టి పెరిగి ఇంజనీరింగ్ ఉద్యోగంలో స్థిరపడిన వ్వక్తి .
తనకు పెళ్లి అయి ఇద్దరూ బాబులు కూడా ఉన్నారు.
వారి పిల్లలు చిన్నవాళ్లు ఒకరికి మూడు సంవత్సరాలు..తన చిన్న బాబుకి నాలుగు నెలలు మాత్రమే ఉన్నాయి.
వారి వివాహ జీవితం చాలా సంతోషంగా గడుస్తూ ఉన్న సమయంలో తను ఉద్యోగం పర్పస్ లో గోదావరి నది తీరానికి వెళ్లాల్సి వస్తుంది.
గోదావరిలో ఒక ఇసుక క్వారీ నడుస్తూ ఉంటుంది అక్కడ ఆ పనులు చూసుకోవడానికి ప్రభుత్వం వాళ్ళు ఇతనిని అక్కడికి పంపిస్తారు.
తన పిల్లలు చిన్నవాళ్లు కావడం వలన తన భార్య పిల్లల్ని కూడా అక్కడికి తీసుకొని వెళ్ళాలి అనుకుని తనతో పాటు వారిని కూడా గోదావరి నది తీరానికి తీసుకొని వెళ్తాడు.
చూడడానికి ఆ ఊరు ఆ వాతావరణం చాలా అందంగా సైలెంట్ గా అనిపిస్తుంది. చుట్టుపక్కల వెళుతున్న దారిలో నెమలిలు, కుందేలు వాళ్ళ కనులకు కనిపిస్తూ ఉంటాయి.
అస్గుల్ ఊరిలో ఒక ఇల్లు కిరాయి తీసుకొని వీళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంటుంది.
వీళ్ళు కిరాయికి ఉన్న ఇంటిలో ఇద్దరు దంపతులు కూడా ఉన్నారు. ఆ ఇల్లు వాళ్ళదే.
ఆ ఇంట్లో కేవలం ఆ వృద్ధ దంపతులు మాత్రమే ఉంటున్నారు.
అ ఇంట్లోకి శ్రీరామ్ మరియు మహి అదే ఇంట్లోకి దిగారు.
శ్రీరామ్ పని చూడడానికి గోదావరి నది తీరానికి వెళ్తాడు.
అక్కడ ట్రాక్టర్లలో ఇసుక నింపడానికి కొంతమంది వలస కార్మికులు వారి కుటుంబాలతో వచ్చి ఉంటారు.
ఆ వలస కార్మికులలో అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు.
అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
ఒక అమ్మాయి గర్భవతిగా ఉంది. ఇంకా ఇద్దరు పెళ్లి కాని అబ్బాయిలు ఉన్నారు.
మొత్తం మీద పదిమంది వరకు పని కోసం అక్కడికి వెళ్లారు.
వూరిలో ఉంటే పని చేసుకొని రావడం పోవడం ఇబ్బంది అవుతుంది అని ..వాళ్ళు గోదావరిలోనే గుడిసెలు(డెర )వేసుకొని ఉండేవారు.
ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క డేరా ఐదు డేరాలు వేసుకున్నారు.
వారికి అలా ఉండడం కొత్తేమీ కాదు.
ఆ గోదావరి లో ఒక ప్లేస్ ఉండేది అక్కడ కొన్ని నీళ్లు గుంటలో ఎప్పుడు ఆగి ఉండేవి.
గోదావరి నదిలో కేవలం అక్కడ మాత్రమే ఎక్కువ నీళ్లు ఉండేవి. అవి చాలా మురికిగా పచ్చ కలర్లో ఉండేవి.
అనీల్ల పక్కకు అన్ని తాయితలు, కొబ్బరికాయలు నిమ్మకాయలు అన్నీ కనిపించేవి.
ఆ ఊరి వాళ్ళు ఎవరికీ గాలి సోకిన ఇక్కడికి తీసుకొని వచ్చి బాగు చేసే వారు అంట.
కానీ ఈ విషయం కొత్తగా వచ్చిన వీరికి ఎవరికీ తెలియదు.
శ్రీరామ్ భార్య పేరు మహి .. మహి ఇంటి యజమాని వాళ్ళతో కొంచెం కొంచెంగా స్నేహం పెంచుకుంది.
వారికో కూతురు.. కొడుకు ఉన్నారు .కానీ కొడుకు జాబ్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు. తన కూతురు ఏదో జబ్బు చేసి చనిపోయిందని వారు చెప్పారు.
చిన్నపిల్లలతో మహి రోజు ఇబ్బంది పడుతుంటే ఆ ఇంట్లో ఉండే దంపతులు తనకెప్పుడు సహాయంగా ఉండేవారు.
శ్రీరామ్ డ్యూటీ టైం లో బయటికి వెళ్లినప్పుడు మాహి ఈ ఇంట్లో వాళ్లతో గడుపుతూ వారిని సొంత అమ్మానాన్న లాగా ఫీల్ అవుతూ బాగా చూసుకోనేది.
ఆ ఇద్దరు దంపతులు కూడా వాళ్ళ కూతురు లేని లోటును తనలో చూసుకునేవారు.
తన కూతురు బ్రతికి ఉంటే ఇలాగే తన పిల్లలతో కూడా మేము ఆడుకునే వాళ్ళము అని బాధ పడుతూ వుంటే.. మహి వాళ్లకు ధైర్యం చెప్పేది.
ఇప్పుడు వీళ్లు ఉంటున్న ఇంటి పక్కకు ఇద్దరు భార్యాభర్తలు వారి ఇద్దరి యుక్త వయసు పిల్లలు కూడా ఉండేవారు. వాళ్ళు చూడడానికి ఏదోలా కనిపించేవారు. వారి చూపులో ప్రవర్తనలో తేడాగా అనిపించేవి మహికి.
మహిని ఎప్పుడూ అదేలా చూసేవారు. కానీ మహి వాళ్లని సింపుల్గా తీసుకునేది.
ఒక రోజు మహి రాత్రి సమయంలో వాళ్ళ చిన్న బాబు పాల కోసం ఏడుస్తున్నాడు అని లేచి తన కోసం పాలు వేడి చేస్తూ వుంటుంది..
ఆ సమయంలో తన ఇంటి వెనుక భాగం నుంచి ఏది సౌండ్స్ వచ్చినట్టు ...ఎవరో మాట్లాడినట్టు అనిపిస్తుంది.
మహి ఇంటి వెనుక భాగం లో వున్న తలుపు తిస్తూ ఒకసారి కళ్ళు పెద్దగా చేసి చూస్తుంది.
వెనుక అంతా చీకటిగా ఉంటుంది అక్కడ ఒక అబ్బాయి.. కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతూ వుండాడు.
తన ముందు అంతా ముగ్గు వేసి వుంటుది.
మహి అతని చూసి చేతిలో వున్న పాల డబ్బా కింద పడేస్తుంది.
పాల డబ్బా కింద పడివెయ్యడం తో మంత్రాలు చేసే అతను ఒక సరిగా కళ్ళు తెరుస్తాడు.
ఇంతలో మహి వెనుక నుంచి ఆ ఇంటి యజమాని అయిన ఆడమనిషి ఒక్కసారిగా మహిని వెనక్కి లాగుతుంది.
వెనుక నుంచి లాగి సైలెంట్ గా ఉండు అంటుంది.
నెమ్మదిగా తనని లోపలికి తీసుకువెళుతుంది.
"ఎవరూ తను అలా ఎందుకు చేస్తున్నాడు అని మహి ఆ మహిళను అడుగుతుంది".. కానీ ఆ విషయాలన్నీ నీకు వద్దు అని ఆ మహిళా చెబుతుంది.
కొన్ని రోజులు ఇలా గడిచిన తర్వాత ఇసుక క్వారీలో ఇసుక నింపే వలస కార్మికులు కొన్ని రోజులు వాళ్ళ ఊరిలో జాతర ఉండడంతో వాళ్ళు గుడిసెల నుండి వెళ్లిపోయారు.
దానితో శ్రీరామ్ క్వారీలో ఎక్కువ సమయం ఉండాల్సి వచ్చేది. అందువలన ఒకరోజు తన భార్యను కూడా అక్కడికి కాలక్షేపం కోసం ఒక రోజు అక్కడికి తీసుకుని వెళ్ళాడు.
ఆరోజు అమావాస్య.
తన ఇద్దరు కొడుకులను తీసుకొని మహి అక్కడికి వెళ్ళింది. గోదావరి తీరంలో జరుగుతున్న పనులు చూస్తూ ఉన్నారు. అలాగే ఇటుపక్క ఇసుక పని కూడా నడుస్తుంది.
తన ఇద్దరు పిల్లలలో పెద్దవాడు అయినా రాహుల్ ఆ నది లో ఉన్న దెయ్యాలను వదిలించే ప్లేస్ లో నీరు చూసి ఆ ప్లేస్ దగ్గరికి తను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.
అప్పుడు కొంచెం కొంచెంగా చీకటి అవుతుంది.
ఆ వాటర్ ని ముట్టుకోవాలని చూశాడు. కానీ ఇంతలో మహి వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చావు.
వాటర్లో పడిపోయే వాడివి కదా అని బెదిరించి తనను తీసుకొని అందరూ కలిసి ఇంటికి వెళ్లారు.
ఇంటికి వెళ్లిన తర్వాత ఆరోజు రాత్రి పిల్లలను పడుకోపెట్టి తలుపు పెడదామని బయటకు వచ్చింది.
అప్పుడు చల్లగా గాలి వేస్తుంది ..అప్పుడు ఎదురుగా ఒక చెట్టు మీద గుడ్లగూబ తననే చూస్తున్నట్టు అనిపించింది.
ఆ గుడ్లగూబను అలాగే చూస్తూ నిల్చుంది ఇంతలో ఆ గుడ్లగూబ ఒకసారి "గూబ్ గుబ్" అంటూ సౌండ్ చేసింది.
మహి ఒక్కసారిగా ఉలికి పడింది. కతం ఇంతలో ఒక ఆత్మ మహిలోకి ప్రవేశించింది.
ఇంకొక పక్క సొంత ఊరికి వెళ్ళినా వలస కార్మికులు జాతరను చూసుకొని మళ్లీ పని కోసం గోదావరి కి వచ్చారు.
వారు గోదావరికి వస్తూ ఉండగానే వారికి ఒక చావు ఎదురైంది.
వారు ఉంటున్న గుడిసెలకు ఎదురుంగానే ..ఆ ఊరిలో ఎవరు చనిపోయిన ఇక్కడే పాతి పెడతారంట.
వారికి ఆ విషయం ఇన్ని రోజులు తెలియదు. తెలియక వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు .కానీ అది చూసిన తర్వాత వాళ్లకి కొంచెం భయంగా అనిపించింది.
ఊరి నుంచి వచ్చిన రాత్రి ఎవరీ గుడిసెలో వాళ్ళు పడుకున్నారు.
కడుపుతో ఉన్న అమ్మాయి తన భర్త ఇద్దరు కలిసి ఒక గుడిసెలో పడుకున్నారు. పడుకున్న కాసేపటికి తనకు కొద్దిగా దాహం వేసినట్టాయి కళ్ళు తెరిచి లేచి కూర్చుంది.
పక్కకున్న నీళ్లు తీసుకుని తాగి పడుకుంది. తను మళ్ళి పడుకొని ఒకసారి పైకి కళ్ళు తెరిచి చూసింది.
ఏదో ఆకారం గుడిసె మీద చేతులు పెట్టినట్టు అనిపించింది. తను గట్టిగా ఒక్కసారి అరిచింది.
తన భర్త ఇంకా మిగతా గుడిసె వాళ్ళందరూ ఏమైంది అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు.
గుడిసె మీద ఏదో ఉంది.. ఏదో ఆకారం కనిపించింది అని తను చెప్పింది... భయపడకు అక్కడ ఏమి లేదు అది గుడిసె నీడ కావ్వచ్చు అని తనకు ధైర్యం చెప్పారు.
వాళ్ళ అత్త" దెయ్యం లేదు ఏం లేదు అన్ని మీకే కనిపిస్తాయి నాకెందుకు అనిపియ్యవని" గట్టిగా బెదిరిచ్చినట్టు మాట్లాడింది.
దానితో ఆ అమ్మాయి భయపడుతూనే పడుకుంది.
ఇంకోపక్క మహిలోకి ఆత్మ రాగానే ఇంట్లో పడుకున్న దంపతుల దగ్గరికి వెళ్లి ప్రేమగా వాళ్లను చూసింది . ఆరోజు అమావాస్య కావడంతో ఆ ప్రాంతం అంతా చాలా చీకటిగా ఉంటుంది.
వాళ్లని చూసిన తర్వాత గేటు తీసుకుని బయటికి వెళ్ళింది.
అలా చీకట్లో ఒక్కతే నడుకుంటూ వెళ్తూ ఒక మామిడి తోటలోకి వెళ్ళింది.అక్కడ ఒకతను మంత్రాలు చేస్తున్నాడు.
అతని దగ్గరికి కోపంగా వెళ్తూ తనని గోరంగా చంపేసింది.
ఆ చనిపోయిన అతను ఎవరో కాదు మహి ఉంటున్న ఇంటి పక్కనా వున్న అతనే.
ఉదయం తెల్లారింది మహి ఎప్పటిలాగే నిద్ర లేచి ఇంట్లో పనులు చేస్తూ ఉంది.
ఇక గుడిసెలో ఉన్న అమ్మాయి నైట్ జరిగిన దాన్ని గురించి ఆలోచిస్తూ ఉంది ఇంతలో మళ్ళీ చీకటి అయింది.
అక్కడ ఏలాంటి లైట్లు లేవు కేవలం కిరసనలతో వెలిగే దీపాలు మాత్రమే ఉన్నాయి అవి కూడా వారు తినే వరకే ఉంచుకొని తర్వాత ఆర్పేసేవాళ్ళు.
రాత్రి సమయం తొమ్మిది అవుతుంది. పెళ్లి కానీ ఇద్దరు అబ్బాయిలు గుడిసెలలో చేరి ఒక ఫోన్ పట్టుకొని.. ఒకళ్ళు పాటలు వింటున్నారు ..ఒకరు తన గర్ల్ ఫ్రండ్ తో చాట్ చేస్తున్నారు.
అ స్థలం అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఈ అబ్బాయిలు పడుకున్న గుడిసెకు డోర్ లాక కట్టటానికి పరదా ఒక్కటి పక్కకు కట్టి ఉంది.
ఆ పరదా ఒక్కసారిగా పైకి లేచి నిమ్మలంగా కిందికి పడింది.
అ పరదను ఇద్దరు అబ్బాయిలు చూశారు కానీ ఎవరికి వారు భయపడుతున్నారు కానీ మాట్లాడుకోవడం లేదు.
కాసేపటి తర్వాత ఒక అబ్బాయి ధైర్యం చేసుకొని లేచి బయటకి వచ్చి టాయిలెట్ పోసి అటు ఇటు చూసి నిలిచోనీ ఉన్నాడు.
ఇంకో అబ్బాయి బయటకు వచ్చి "ఇంతక ముందు జరిగింది నువ్వు కూడా చూసావు కదా ఏమైంది అసలు "అని ఇద్దరు అనుకుంటున్నారు.
ఏమీ లేదు కానీ పడుకుందాం పద అంటూ లోపటికి వెళ్లి పడుకున్నారు.
తెల్లవారిన తర్వాత ఆ విషయం గుడిసెల్లో ఉండే మిగతా వారికి చెప్పారు కానీ వారు ఎవరు నమ్ముతలేరు.
గర్భవతి అమ్మాయి అత్త ఇలా అంటుంది. "దెయ్యాలు లేవు ఏమి లేవు అన్ని మీకే కనిపిస్తాయి మాకు ఎందుకు కనిపించవు" అని అంది.
ఆరోజూ పొద్దున దాకా పనిచేసుకొని మళ్ళీ సాయంత్రం వండుకొని తిని అందరూ పడుకున్నారు.
ఉదయం మాట్లాడిన ఆమె గుడిసె చుట్టూ రాత్రి అంతా ఎవరో గజ్జలు కట్టుకొని చుట్టూ తిరుగుతున్న శబ్దాలు ఆ ఆడ అమెకు వినిపించాయి.
రాత్రి అంతా తనకు అసలు నిద్ర లేదు. ఉదయాన్నే అందరికీ ఆ విషయం చెప్పింది.
మిగతా వాళ్ళు కూడా అవును ఇక్కడ ఏదో ఉంది అని అన్నారు.
ఆరోజు సాయంత్రం అక్కడి మగవాళ్ళు అంతా పక్కకు వున్న అడవి లాంటి ప్లేస్ లో కుందేళ్ళకు ఉచ్చులు పెట్టారు .
రాత్రి సమయంలో ఆ ఉచ్చల దగ్గరికి వెళ్ళాలి అనుకున్నారు .
కానీ గర్భవతి తో ఉన్న అమ్మాయి మాత్రం తన భర్తను ఇక మిగతా వాళ్ళను వెళ్ళనీయలేదు.
ఉదయం తెల్లవారిన తర్వాత మగవాళ్ళు అందరూ వెళ్లి కుందేళ్ళకు పెట్టిన ఉచ్చల దగ్గరకు వెళ్లి చూస్తే 3 కుందేళ్లు ఉచ్చులో పడి చనిపోయాయి.
వాటిని కొంచం కుక్కలు తిన్నాయి.
అ సగం తినిపడి ఉన్న కుందేళ్ళను గుడిసెల దగ్గరికి తీసుకొని వచ్చి... తన భార్య ముందు వేసి "చూడు నీ వల్ల మూడు కుందేలు పాడైపోయాయని" తన భార్యతో గొడవ పెట్టుకున్నాడు.
మళ్లీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఉచ్చలు పెట్టిన స్థలం దగ్గరికి ముగ్గురు మగవాళ్లు కలిసి వెళ్తున్నారు.
అప్పుడే కొద్ది కొద్ది గా చీకటి పడుతుంది.
ఇంతలో ఏదో ఒక ఆకారం తెల్ల పొగ మంచుల కొంత దూరం నుంచి పెద్ద ఎత్తున వారి వైపుగా వస్తున్నట్లు ఒక అబ్బాయి గమనించాడు.
అది చలికాలం కావడం వల్ల అది పొగమచ్చు అనుకున్నాడు.
కానీ అది కొద్ది కొద్దిగా రెండు తాడిచెట్ల ఎత్తు అయ్యి వారి వైపుగా వస్తుంది.
పక్కన ఉన్నవారికి అదేంటి ఇటువైపుగా వస్తుంది అని చూపించాడు.
వారు దాన్ని చూసి అది దెయ్యం అని చాలా భయపడుతున్నారు.
మొదట చూసిన అతను కొంచెం ధైర్యం చేసుకొని వాళ్ళ ఇద్దరిని గట్టిగా చేతులతో పట్టుకొని గుడిసెల వరకు లాక్కొచ్చాడు.
జరిగిన విషయం అంతా ఆ గుడిసెలలో వున్న తన వాళ్లకు చెప్పాడు.
దానితో వారు అందరూ భయపడి మనం ఈక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం పదండి ..అని శ్రీరామ్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు.
శ్రీరామ్ వాళ్లకి ఎంతో నచ్చ చెప్పాలని చూసాడు కానీ వాళ్ళు శ్రీరామ్ మాట వినలేదు.
వారికి వచ్చే డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ఇంట్లో మహి ప్రవర్తన చూసి శ్రీరామ్ కి కూడా కొద్దిగా అనుమానంగా అనిపించేది .కానీ వీళ్ళు చెప్పిన దానిని బట్టి ఇక్కడ ఏదో ఉందని శ్రీరామ్ కి పూర్తిగా అర్థం అయింది.
ఇంటిదగ్గర మహి కొత్తగా ప్రవర్తించడం.. ఇంట్లో ఉన్న దంపతులను అమ్మానాన్న అని పిలవడం వాళ్ళను సొంత కూతుర్ల చూసుకోవడం శ్రీరామ్ కి అనుమానంగా అనిపించేది.
పనిచేసే వాళ్లు వెళ్లిన తర్వాత శ్రీరామ్ ఇంటికి వచ్చి ఏదో పని చేస్తున్న మహి దగ్గరికి వచ్చి నిల్చోని ఉన్నాడు.
మహి ఇక్కడ వాతావరణం అంతా మంచిగా అనిపించడం లేదు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని మహితో చెబుతున్నాడు.
దానితో మహీ కోపంగా కండ్లు పెద్దవి చేస్తూ నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి రాను అని గట్టిగా శ్రీరామ్ కి చెప్పింది.
దానితో మహీకి దెయ్యం పట్టింది అని శ్రీరామ్ కి అర్ధమైంది.
ఇంక వుంది.