ఇక్కడ మీరు చదివే వ్యక్తుల పేర్లు, ప్రదేశాల పేర్లు సన్నివేశాలు అన్నీ కల్పితాలే ఒకవేళ అవి మీ నిజ నీవితం లో ఉన్న పేర్లతో లేదా జరుగుతున్న సన్నివేశాలతో పోలి ఉంటే అది కేవలం యాదృచ్ఛికం ఎవ్వరినీ ఉద్దేశించినవి కాదు.
SPECIAL thanks to my friend C. SATHYAM
ఇక మిమ్మల్ని ఆపను వచ్చేయండి కధ చెప్తా ........!
వైజాగ్ , కొంచెం మబ్బులుగా ఉంది చూస్తుంటే వర్షం పడేలా ఉంది. ఉదయం 10:00 గం. “కూల్ కేఫ్” లో కి ఎర్రగా ఐదున్నర అడుగులు ఉండి, షూస్, వైట్ టీ షర్ట్ అండ్ కాటన్ పాంట్ లో టాప్ క్లాస్ హెయిర్ స్టైల్ (ఫేస్ కు బాగా సూట్ అయ్యే హెయిర్ స్టైల్ ) తో సూపర్ కూల్ లుక్ తో నారాయణ దాస్ అనే 27 యేళ్ళ అందమైన కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు అతని శరీరం తన పొడవుకు తగ్గట్టే ఉంది సరైన ఆకారం. కేఫ్ లో విండో దగ్గర ఉన్న టేబుల్ లో కూర్చుని తనకు జరగ బోయే అన్ అఫిషియల్ పెళ్లి చూపుల కోసం వెయిట్ చేస్తున్నాడు. అన్ అఫిషియల్ ఎలా అయ్యిందంటే...... వాళ్ళు ఇంట్లో అందరి ముందు అఫీసియల్ గా కలవక ముందే ఒకసారి ఇలా పర్సనల్ గా కలుద్దామనుకున్నారు. సో అలా అన్నమాట. నారాయణ దాస్ టైం కి వచ్చేశాడు ఇదే టైం కు ఆ అమ్మాయి కూడా రావాలి కానీ ఇంకా రాలేదు. తను కూర్చున్న టేబుల్ నుంచి తల పక్కకి తిప్పాడు విండో లోంచి బయటకు చూశాడు,బయట ఒక “చిన్న గార్డెన్” చిన్న చిన్న మొక్కలతో అందంగా ఉంది ఆ కేఫ్ వాళ్ళది తరువాత టూ వే రోడ్డు వాహనాలు విరివిగా వెళ్తూ వస్తూ ఉన్నాయి ఆ రోడ్డు ను దాటాకా “బీచ్” చాలా బాగా కనబడుతుంది మంచి ధృశ్యం అనుకున్నాడు నారీ. తను కేఫ్ లో వెయిట్ చేస్తున్నట్టు మెసేజ్ పెట్టాడు తనకి.
బయట చినుకులు పడడం మొదలయ్యింది , విండో లోంచి నారీ కు బయట చాలా మంచి వ్యూ కనబడుతుంది. దాన్ని అలాగే చూస్తున్నాడు , చినుకులు చిన్న చిన్న చెట్ల మీద మొక్కల మీద పడి ఆకులు మీదగా కిందకు రాలుతున్నాయి.
10:15 అయింది ఇంకా రాలేదు ఆ అమ్మాయి . ఇక నారి కాఫీ ఆర్డర్ చేసాడు. తనకు రెండేళ్ల క్రితం జరిగినది , గతం తన ముందుకు వచ్చింది . ఒకప్పుడు తను ఎలా ఉండేవాడు అమెరికా లో, రెండేళ్ల క్రితం ఎలా మారాడు , కౌశిక్ , వైశాలి , వైజాగ్ అన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు కాదు తనే రెండేళ్ల వెనక్కి వెళ్ళిపోయాడు ఆ జ్ఞాపకాల్లోకి.
“ఒక టూ ఇయర్స్ ముందు వరకు అమెరికా లో నేను , ఇలా ఉండేవాడిని కాదు నా పద్ధతులూ, ప్రవర్తన మొత్తం వేరు. ఎలా అంటే నాకు తెలిసిన వారెవరైనా లవ్ లో పడితే వాళ్ళది ట్రూ లవ్ కాదని నేను వాళ్ళ మధ్య జోక్యం చేసుకునేవాడిని ఇంకా నిజమైన ప్రేమ కాదని రుజువు చేసే వాడిని దాంతో వాళ్ళు విడిపోయేవారు. వాళ్ళని విడగొట్టడం నా ఉద్దేశ్యం కాదు. కేవలం వాళ్ళ మధ్య ఉంది ప్రేమ కాదనేదే నా వాదన. ఇక ఇందువల్లే నేను ఇండియా కి రావలసి వచ్చింది ఆ తరువాత నేను లవ్ లో పడడమూ తరువాత తిరిగి అమెరికా కు వెళ్ళడమూ జరిగింది.
అవును , చాలా మంది నా వల్ల విడిపోయారు. నా కసిన్స్ , నా క్లాస్ మేట్స్,నా బెస్ట్ ఫ్రెండ్. అలాగే రెండేళ్ల ముందు ఇండియా కు వచ్చేటప్పుడు కూడా ఫ్లయిట్ లో ఒక జంట ను డిస్టర్బ్ చేశా వాళ్ళూ…. విడిపోయారు!.
నేను అలా ఉండడానికి కారణం మా అమ్మా నాన్నే. కాదు నేనే, నేనే కారణం. మా అమ్మానాన్న ఇండియా నుండి అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యారు. (మాది చాలా పెద్ద ఇల్లు అమెరికా లో ఇండియా లో కూడా కాకపోతే ఇండియా లో మా బాబాయిలు , పిన్నిలు , ఇంకా ఇలా నాకు వరసలు కూడా తెలియని చాలా మంది భందువులతో తో నిండి ఉంటుంది. అదే అమెరికా లో డ్రైవర్స్ , వాచ్ మెన్స్ ,పని చేసే వాళ్ళు తప్పితే , నేనూ అమ్మా నాన్నా మాత్రమే ఉంటాం . నా చిన్నప్పుడు మా పేరంట్స్ చాలా హ్యాపీ గా ఉండేవారు వాళ్ళ మధ్య ఎప్పుడూ ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ నా టెన్త్ క్లాస్ లో మా ఇంట్లో జరిగిన విషయాలే నేను అలా మారాడానికి కారణమయ్యాయి. అప్పుడు కొద్ది రోజులుగా మా అమ్మ వింతగా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. మా నాన్న అయితే ఎప్పటిలాగే చాలా కూల్ గా ఎనర్జిటిక్ గా నార్మల్ గానే ఉండేవారు. కానీ మా అమ్మ అలా లేరు కొద్ది రోజులకే పూర్తిగా మారిపోయారు, నాతో అంతకముందు ఉన్నట్టు ఎప్పటిలాగే బిహేవ్ చేసేవారు కాదు .
ఎలా అంటే మా ఇద్దరితో ఫ్రీ గా ఉండేవారు కాదు కనీసం సరిగ్గా మాట్లాడేవారు వారు కారు , పూర్తిగా మారిపోయారు . నార్మల్ గా అయితే నన్ను దగ్గరకు తీసుకుని నన్ను అన్నీ అడిగి నాతో ఎంతో ప్రేమగా మాట్లాడేవారు , నాతో ఇలా ఉండే మా అమ్మ మారిపోయాక కనీసం నా మొహం చూడడం కూడా మానేసింది ఏదో జీవచ్ఛవం లా ఉండేవారు . నాన్న తో కూడా ఇలానే ఉండేవారు మా అమ్మ . నాన్న అమ్మను చాలా సార్లు నా ముందే అడిగారు, ఎందుకిలా ఉంటున్నావ్ , ఇలా ఉండొద్దు అని కూడా చెప్పారు. మా అమ్మ ఏం మాట్లాడకుండా తల దించుకుని నిలబడేవారు లేదా తన రూమ్ లోకి వెళ్లిపోయేవారు . ఇది చూసినప్పుడు నాకనిపించింది మా అమ్మ నాన్న మధ్య లవ్ లేదని. కనీసం నవ్వడం , మాట్లాడడం కూడా లేదు ఎప్పుడూ ఏదో బాధలో ఉన్నట్టు మౌనంగా ఉండేవారు అమ్మ . నిర్జీవంగా కనబడేది .... నేనేదైనా మాట్లాడుదామని ట్రై చేస్తే అడిగినదానికి సమాధానం చెప్పడం తప్ప ఇంకేం మాట్లాడరు. ఇక అమ్మకేదో ప్రాబ్లం ఉందని పెద్ద వాళ్ళు (అమ్మ నాన్న) వాళ్ళే చూసుకుంటారని ,చిన్న పిల్లాడిని నేనేం చేయగలను అని అనుకునే వాడిని . ఇదిలా ఉండగా ఒక రోజు సాయంత్రం నేను స్కూల్ అయిపోయి ఇంటికి తిరిగి వచ్చే టైమ్ కు ఏదో సౌండ్ వస్తుంది అమ్మ నాన్న గది లోంచి. నేను భయపడుతూ మెల్లగా వెళ్ళి చూసా తలుపు తెరిచే ఉంది . అమ్మ నెల మీద కూర్చుని ఉంది అమ్మను నాన్న కొడుతున్నారు . అమ్మ మౌనంగానే ఉంది గాని నాన్న ఆపకుండా కొడుతున్నారు అమ్మను చెంపల మీద . నేను వచ్చినట్టు కూడా నాన్న గమనించ లేదు అమ్మ కింద మౌనం గా కూర్చుని ఉంది నాన్న అయినా అమ్మను కొడుతూనే ఉన్నాడు. నాకు భయం పెరిగి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయా .... కాసేపు ఆగి తిరిగి ఇంట్లోకి వెళ్దామని.
సుమారు ఒక గంట తరువాత అనుకుంట తిరిగి ఇంటికి వెళ్ళా , అయితే ఈ గంట సేపూ నాన్న ఎందుకు అమ్మను అలా కొడుతున్నారు , అసలు నాన్న కోప్పడడం నేను ఎప్పుడూ చూడనేలేదు అటువంటిది మరీ ఇంత దారుణంగా అమ్మను కొట్టడమేంటి ఇలా ఎన్నో ఆలోచనలు , ప్రశ్నలు నాలో వెళ్ళు వెత్తాయి............
నేను తిరిగి ఇంటికి వెళ్ళే సరికి నాన్న ఎప్పటిలాగే ఆయన స్టైల్ లో నాకు ఎనర్జిటిక్ గా వెల్కమ్ చెప్పారు, ఏమి జరగనట్టు అంతా మామూలుగానే ఉన్నట్టు. ఇది నన్ను పెద్దగా ఆశ్చర్యపరచలేదు కానీ తరువాత ఏదో అధ్బుతం జరిగినట్టు మా అమ్మ కూడా మామూలుగా నవ్వుతూ ఎదురొచ్చింది నా ముందుకు. గంట ముందు నేను చూసింది గంట సేపూ నేను ఆలోచించింది ఇప్పుడు ఇక్కడ చూసిందానికి ఎక్కడా సంబంధం లేదు,మైండ్ దొబ్బింది నాకు అది చూశాక.
ఇది ఎలా జరిగింది ఎందుకు జరిగింది నాకు తెలియదు , కానీ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ నా చిన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. ఫేక్ రిలేషన్లో ఉంటూ అలా ఉంటే నేనెలా పేరుగుతానో అని నా ముందు వాళ్ళ మధ్య ఏ ప్రాబ్లం లేనట్టు ఉండేవాళ్లు. అది మాత్రం నాకు చాలా క్లియర్ గా అర్ధమైంది. వాళ్ళు ఎందుకు అలా మారారో తిరిగి ఎందుకు ఇలా మామూలయ్యారో నేను వాళ్ళని అడగలేదు ఎందుకో నాకు వాళ్ళను అడగాలని అనిపించలేదు. ఏదో జరిగింది ఇప్పుడేదో జరుగుతుంది సరే కానీ జస్ట్ గో విత్ ది ఫ్లో అనుకున్నా. మళ్ళీ మా ఇల్లు పాత స్థితికి,వాతావరణానికి వచ్చి చేరుకుంది. కొద్దిరోజుల్లోనే ఇంత జరిగింది మా ఇంట్లో. ఈ కొద్ది రోజుల్లో జరిగిన విషయాలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. ట్రూ లవ్, అది మా అమ్మ నాన్న మధ్య లేదు అండ్ ట్రూ లవ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది చిన్న చిన్న విషయాలకు చీలిపోదు.
ఇక మన చుట్టూ ఉన్నది అంతా ఫేక్ లవ్ అని .
ఆరోజు తర్వాత మా అమ్మ నాన్న నాతో ఎప్పటిలాగానే ఉండేవారు ఉన్నారు కానీ నాకు ఎందుకో వాళ్ళ మీద ఈ ఒపీనియన్ వచ్చేసింది. అలా అని వాళ్ళ మీద చులకన భావం ఏమి లేదు , నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ,గౌరవ మర్యాదలు , కేర్ అండ్ ఎఫ్ఫెక్షన్ ఏదీ తగ్గలేదు. ఇవే మా ఇంట్లో జరిగినవి నన్ను మార్చినవి (నేను లవర్స్ ను డిస్టర్బ్ చేసేలా).
మా అమ్మ నాన్న ల మీద నాకున్న ఆలోచనలు , అభిప్రాయాలు తప్పని అర్ధమవ్వడానికి నా టీనేజ్ దాటి ఇంకో ఐదేళ్లు ఖర్చయ్యింది .
ఆ తరువాత నా స్కూల్ లైఫ్ అయిపోయింది, కాలేజీ లైఫ్ కూడా పూర్తయ్యింది. కానీ ఈ గ్యాప్ లో మా ఇంటికి నా మీద చాలా కంప్లాంట్స్ వెళ్లాయ్ మా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ దగ్గరనుండి. నేను వాళ్ళ రిలేషన్షిప్స్ ను డిస్టర్బ్ చేస్తున్నానని అండ్ ఇంకా ఏమో చేస్తున్నానని. ఇంకా ఏమో అంటే వాళ్ళు లవ్ చేసే గర్ల్స్ అందంగా ఉంటే నేను వాళ్ళతో రొమాన్స్ చేసేవాడిని. అఫ్కోర్స్ వాళ్ళతో రొమాన్స్ చేయడం నా లక్ష్యం కాదు ఇంకా ప్రతి ఒక్క అమ్మాయితో నేను అలా చెయ్యను కానీ, వన్స్ వాళ్ళది ట్రూ లవవే కాదు అని ప్రూవ్ చేశాక వాళ్ళతో అడ్వాంటేజ్ తీసుకోవడమా , లేనిదా అనేది నా పర్సనల్ విషయం.
ముందు నేననుకున్న జంట లో ని అమ్మాయికి ప్రపోస్ చేస్తా తన లవర్ తో కాకుండా ఒంటరిగా ఉనప్పుడు లేదా తన లవర్ కు దూరంగా ఉన్నప్పుడు. ఆ తరువాత ఆ అమ్మాయితో కొద్దిరోజులు ట్రావెల్ చేస్తా అఫ్కోర్స్ ఆ ఆమ్మాయి ఎలానో యాక్సెప్ట్ చేస్తుంది ఆ తరువాత కుదిరితే రొమాన్స్ చేస్తా లేదా మొహం మీద చెప్పేస్తా నీది ట్రూ లవ్ కాదని ప్రూవ్ చేయడానికే నీతో ఇంతవరకు ట్రావెల్ చేశా అని. కానీ ఒక ఒకవేల ఆ అమ్మాయి కానీ డిస్టర్బ అవ్వకపోతే ఇక అబ్బాయిని డిస్టర్బ్ చేసేవాడిని, అక్కడే ఉన్న ఎవరైనా అమ్మాయిని రిక్వెస్ట్ చేసో లేదా మనీ ఇచ్చో డిస్టర్బ్ చేయించే వాడిని లైక్ ఫ్లర్టింగ్. అంటే ఇటు నుండి కాకపోతే అటునుండి నరుక్కు రమ్మన్నారు గా అలా అన్నమాట. అయినా రొమాన్స్ చాలా మంది అమ్మాయిలతో చేశా కానీ అంతకు మించి చేసింది మాత్రం అమెరికాలో మా నేబర్ ఆంటీ ఎమిలి తోనే. శాన్ ఫ్రాన్సిస్కో లో నా స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే ఎమిలి ఆంటీ నా క్రష్. మా ఫ్రెండ్స్ తో కూడా అప్పుడప్పుడూ చెప్తూ ఉంటా పేరుకే ఆంటీ కానీ నిజానికి తను కాదు అని తన గురించి , ఫ్రెండ్స్ మధ్య ఇవన్నీ కామనే కదా!.. తను చాలా అందగత్తె అందులో నో డౌట్, తన కోసం ఏం చేసినా తప్పు లేదు. తను,వాళ్ళ ఆయన మాత్రమే ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళ హస్బండ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎప్పుడు నా లోని ఈ ఫీలింగ్స్ గురించి చెప్పాలనుకున్నా వాళ్ళ హస్బండ్ పోలీస్ అనే భయం తో ఆగిపోయేవాడిని. ఎప్పుడు కనబడినా “హై” లు “బై” లు మాత్రమే చెప్పుకునేవాళ్ళం. అయితే నా ఆటిట్యూడ్ ఇలా చేంజ్ అయిన తరువాత ఒక రోజు మార్నింగ్ తను ఇంటి బయట పూలు కోస్తుండగా నా ఫీలింగ్స్ చెప్పాలని నిశ్చయించుకుని భయపడకుండా వెళ్ళి మామూలుగా అందరికీ చెప్పే లాగే “ఐ లవ్ యు” అని చెప్పేసా.
ఆ మాట విన్న ఎమిలి టూ సెకండ్స్ తరువాత నేనన్నది అర్ధమై టక్కున నా వైపు తిరిగింది ఫేస్ లో కోపం తప్ప నాకు ఇంకేమీ కనబడలేదు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఆ క్షణానికి తన చేతిలో బలవ్వకుండా ఉన్నందుకు బ్రతికానురా అని ఫీల్ అయ్యా!. నీరసం గా ఇంటికి వెళ్ళా జరిగిందంతా తలచుకుంటూ. కానీ తరువాత భయం మొదలైంది వాళ్ళ హస్బండ్ కి చెప్పేస్తుందేమో అని ఎందుకంటే అలా ఇంతకముందు జరిగింది కూడా. ఎవడో ఒక కాలేజీ కుర్రాడు ఎమిలి ని చూస్తూ ఉండేవాడట . ఎమిలి బయట ఎక్కడ కనబడినా వాడు చూస్తూ ఉండేవాడట. ఈ విషయం తన హస్బండ్ కు చెప్పిందట ఆ తరువాత ఆ కుర్రాడు ఆ స్ట్రీట్ లో ఎప్పుడూ కనిపించలేదంటా పాపం, ఇదంతా నా ఫ్రెండ్ నాతో చెప్పాడు. ఇప్పుడు ఎమిలి తన హస్బండ్ తో ఏమని చెప్తుందో , ఇప్పుడేం జరుగుతుందో అని టెన్షన్ పీక్స్ కు చేరింది.
సాయంత్రం 7:00 అయ్యింది నేను ఇంట్లోనే ఉన్నా. తన నుంచి కాల్ వచ్చింది , అది తన కాల్ అని తెలిసిన వెంటనే గొంతు ,కాళ్ళు వణకడం మొదలయ్యాయి తను ఇంటికి రమ్మని చెప్పింది కాల్ లో. ఇక ఇంట్లో కంబైన్ స్టడీస్, ఫ్రెండ్స్ తో నైట్అవుట్స్ అని చెప్పి తన ఇంటికి బయలుదేరా. రెండు నిమిషాల్లో తన ఇంటి ముందు ఉన్నాను. నేనూ నాతో పాటు నా భయం. కాలింగ్ బెల్ నొక్కాను డోర్ ఓపెన్ అయ్యింది ఎదురుగా....... ఎమిలి, ఇద్దరం కలిసి ఇంట్లో కి వెళ్ళాం. నేను అంకుల్ కోసం వెతుకుతున్నా దిక్కులు చూస్తూ ఎమిలి కు తెలియకుండా. ఇంట్లో ఎమిలి తప్ప ఇంకెవరూ లేనట్టున్నారు “అంకుల్ ఎక్కడ?” అని అడిగాను. అంకుల్ ఏదో కేసు ఇన్వెస్టిగేషన్ మీద వేరే టౌన్ వెళ్ళాడంటూ, టూ డేస్ పడుతుంది రావడానికి అని చెప్పింది.
తను నన్ను తిన్నవా? అని అడిగింది , ఇంకా లేదు అని చెప్పా నా చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకు వెళ్ళింది ఇద్దరం కలిసి డిన్నర్ చేస్తున్నాం కానీ నేను కొంచెం ఇబ్బంది గానే ఫీల్ అవుతున్నా అంతా ఫ్రీ గా ఉండలేక పోతున్నా , తనని నేను తలెత్తి చూడడం కూడా లేదు. డిన్నర్ తినడం పూర్తి చేశా. హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి తిరిగి అదే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న . తల దించుకుని అటూ ఇటూ చూస్తున్నా ఏమితోచట్లేదు. ఎందుకు తను నన్ను పిలించిందో ఇంకా చెప్పలేదు నేనే అడుగుదామంటే ఇబ్బంది గా ఉంది. తనూ నాకు ఎదురుగా ఇంతక ముందు కూర్చున్న అదే ప్లేస్ లో కూర్చుంది . ఇద్దరం డిన్నర్ పూర్తి చేశాం నేనంటే ఇక ఏం చెయ్యాలో తెలియక ఏం తోచక మళ్ళీ వచ్చి అక్కడే కూర్చున్న కానీ తనెందుకు వచ్చి అక్కడే కూర్చుంది మళ్ళీ... అనే ఆలోచన నా బుర్రలో తిరుగుతూనే ఉంది నేను కనీసం నా తల కూడా తన వైపు కు తిప్పట్లేదు అటు ఇటు దిక్కులు చూస్తున్నా . హాలు లో కొద్ది దూరంలో ఉన్న టి.వి ను డెకరేషన్ కోసం పెట్టిన చిన్న చిన్న బొమ్మలను, క్లాక్ ను సీలింగ్ ను విండో ను టైల్స్ ను చూస్తున్న . హాలు లో మొత్తం నిశ్శబ్ధం నిండి ఉంది గత పది నిమిషాలుగా అంటే మేం తినడం పూర్తయిన తరువాత నుండి, తింటున్నప్పుడు కూడా నిశ్శబ్ధం గానే ఉన్నాం.
టైమ్ చూసా ఇంకా పది నిమిషాలు గడిచింది కానీ నేను ఇంకా అలాగే కూర్చున్న “తను అసలు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచింది , నేను అసలు ఇక్కడ ఏం చేస్తున్నా , ఇంకా అసలు ఇక్కడ ఎందుకు ఉన్నాను” అని రకరకాల ప్రశ్నలు, సందేహాలు నా బుర్రను తినేస్తున్నాయి తను నా ముందు కూర్చుంది అని తెలుసు కానీ తను ఏం చేస్తుంది ఏ స్థితిలో ఉంది అనేది నాకు తెలియదు ఎందుకంటే నేనసలు తనని చూస్తే గా . నాకు ఇక ఓపిక నశించిపోయింది అక్కడి నుండి వెంటనే వెళ్లిపోవాలని ఉంది పారిపోవాలని ఉంది . ఇంకా రెండు నిమిషాలు గడిచింది నా మొహంలో క్లియర్ గా కనిపిస్తుంది చిరాకు , అసహనం. బంధించినట్లుగా నేనక్కడ కూర్చున్న అక్కడి నుండి ఎలా బయటపడాలో తెలియకుండా ఉన్నా. ఏం మాట్లాడకుండా ఈ నిశ్శబ్ధం లో ఉంటే మెంటల్ ఎక్కుతుంది నా చేతులు పిసుక్కుంటున్నా జుట్టు సరిచేసుకుంటున్నా నోరు మూసుకుని పళ్ళు కొరుకుతున్నా కాళ్ళతో నేలను తడుతున్నా. ఇక ఏదైతే అది అయ్యింది వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నా , “నేను వెళ్తాను” అని చెప్పడం కోసం తన మొహం చూడడానికి తల ఎత్తాను తనని చూశాను తను నన్నే చూస్తూంది .
ఒక్క సెకండ్ నిజం గా నాకేం అర్ధం కాలేదు అంటే తను ఇంత సేపూ నన్నే చూస్తూ ఉందా? అని కానీ ఎందుకు అంత ప్రేమగా?.. కాసేపటికి నేను నా బుర్రలో ప్రశ్నలను పక్కకు తోసి నేనూ తనని చూడడం మొదలుపెట్టాను . నాకు తెలిసి తను కళ్ళు కూడా ఆర్పకుండా నన్నే చూస్తుంది ఇద్దరం ఒకరి కళ్ళల్లో ఒకరం మునిగిపోయాం. మేమిద్దరం అలా చూస్తూండగా నాకు గడిచే ప్రతీ సెకండూ థ్రిల్లవుతూనే ఉన్నా ఆ ఫీలింగ్ పెరుగుతూనే ఉంది . తను నాతో చెప్పని చాలా విషయాలు ఆ కళ్ళే చెప్తున్నాయి మా ఇద్దరి మొహాల్లో చిన్న చిరునవ్వు , ఆ ఫీలింగ్ పెరిగే కొధ్ధీ నా నవ్వు పెరుగుతూ ఉంది తనూ నవ్వును ఆపుకుంటుంది నేను ఒక్కసారి బిగ్గరగా నవ్వేసి ఆగిపోయా. ఆ తరువాత తను నా చేయి పట్టుకుని నేరుగా తన బెడ్ రూమ్ లోకి తీసుకు వెళ్ళింది.
నన్ను బెడ్ మీద పడుకోబెట్టింది ఆ రూమ్ అంతా కూడా డిమ్ లైట్ నిండి ఉంది ఆ వెలుగు లోనే తన బట్టలు విప్పింది. తన గురించి నాకు ముందే తెలుసు చాలా అందగత్తె అని కానీ తన అందాలను చూపించాక అర్ధమైంది తను ఎంత అందగత్తో అని! . నేను చూస్తున్నది కళా నిజమా అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి . కాలేజ్ డేస్ లో ముద్దులు , కౌగిలింతలు నడిపాను అమ్మాయిలతో అంతవరకే కానీ ఎమిలి నాతో హద్దులు దాటేసింది.
తరువాత ఇక టూ డేస్ నాకు స్వర్గం చూపింది ,అంతే!. మళ్ళీ నేను ఆ వైపు వెళ్లలేదు మంచి అనుభూతి డిస్టర్బ్ అవుతుందనో లేదా ఇంకేంటో తెలియదు ఆ వైపు మళ్ళీ వెళ్లాలని అనిపించలేదు. ఆ తరువాత మేము ఎప్పుడూ మాట్లాడుకోలేదు. తనూ నాకు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు తను అనుకుంటే నన్ను కలవడం పెద్ద విషయం ఏమి కాదు . తను ఆ ప్రయత్నం చేయలేదంటే తనూ నన్ను కలవాలని అనుకోవట్లేదనే కదా అర్ధం!. నేను కావాలనే కలవ లేదు. అంటే!...... అంటే తన మీద నాకు మోజు తీరిపోయిందని,ఒకసారి కలిశాక మొత్తం అయిపోయాక తనంటే అసభ్యం కలిగిందని అంటే నేను ఒప్పుకోను. తనమీద నాకు ఇష్టం ఇప్పుడూ ఉంది ఎప్పుడూ ఉంటుంది.. కానీ ఇది ఒక్కప్పుడు ఉండే ఇష్టం కాదు , తను నాకు ఒక ఫ్రెండ్ లాగా నా మనిషి లాగా అనే ఇష్టం తను నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు. కానీ మా మధ్య జరిగిన ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఎక్కడో లోపల చాలా చిన్న తప్పు చేశానేమో అనిపిస్తుంది దానికి నా మనసు ఎప్పుడూ “అవును” అనే సమాధానమిస్తుంది. దాని తర్వాత చిన్న గిల్ట్ అయితే ఉంది ,ఇంకా అది జాలో లేక ఏంటో నాకు తెలియదు కానీ నాకలా అనిపిస్తుంది తన మీద . అందుకే ఇప్పుడు ఇండియా వచ్చేముందు తనని (ఎమిలి) కలిసి మాట్లాడే వచ్చాను.
తన ఇంటికి వెళ్ళిన వెంటనే నన్ను ఇంట్లో కి ఆహ్వానించింది అసలు తను నన్ను చూసిన వెంటనే నవ్వుతూ పలకరించింది , ఎలా ఉన్నావు? ఏంటి? అని కాసేపు అడిగి తెల్సుకున్నాం ఒకరి గురించి ఒకరం. తన లైఫ్ చాలా బాగుంది అని చెప్పింది . తరువాత నాకు తన మీద ఉన్న గిల్ట్ ఫీలింగ్ గురించి కూడా చెప్పాను. “అందులో నా తప్పు కూడా ఉంది కదా నా ప్రోత్సాహం లేకుండా అది జరిగి ఉండదు కదా అని సర్ది చెప్పింది. నువ్వేం ఫీల్ అవ్వకు జరిగిందేదో జరిగింది” (అని చాలా నెమ్మదిగా చెప్పింది) నా చేతులు పట్టుకుని దించుకున్న నా తలను పైకి ఎత్తి కళ్ళలోకి చూస్తూ మాట్లాడింది. అయినా ఒకప్పుడు తన స్పర్శ తగిలితే చాలు అనుకున్నవాడిని, ఎప్పుడెప్పుడు ఆ అదృష్టం కలుగుతుందా అని తనని ఊహించుకుంటూ ఉండేవాడిని అటువంటిది ఇప్పుడు తను నన్ను ముట్టుకుని మాట్లాడుతున్నా నాకా భావనలు లేవు, తను నా ఇంట్లో మనిషి నాకు బాగా కావలసిన మనిషి గా అనిపించింది . ఇది నా లైఫ్ లోనే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ ది వే.
ఇక స్టడీస్ లో నాకున్న ఇంట్రెస్ట్ తో గ్రాడ్యుయేషన్ లో సింపుల్ గా ఎక్సామ్స్ పాస్ అయిపోయా, మా నాన్న సంపాదించిన డబ్బు వల్లో లేక నాకే డబ్బు మీద ఇంట్రెస్ట్ లేకో కానీ మార్క్స్ మీద పెద్దగా శ్రధ్ధ పెట్టలేదు . ఎందుకంటే చాలా మంది లాగా గ్రాడ్యుయేషన్ తరువాత నాకు జాబ్ చెయ్యాలనే తాటూ లేదు అఫ్కోర్స్ చెయ్యాల్సిన అవసరం కూడా నాకు లేదు మా నాన్న గారి వల్ల. ఇక నా స్టడీస్ అయిపోయాయి దాంతో పాటు నా మీద కంప్లైంట్స్ కూడా బాగా ఎక్కువయ్యాయి, మా అమ్మ , నాన్న దీని గురించి ఏమిటి? అని అడిగారు నన్ను, అప్పుడు ఆ గదిలో మేము ముగ్గురం మాత్రమే ఉన్నాం వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు.
అమ్మా నాన్నా ఒకవైపు నుంచున్నారు నేను ఒకవైపు నుంచున్నాను అమ్మ ఏం మాట్లాడరు నాకూ నాన్నకే ఈ చర్చ. వాళ్ళడిగిన ప్రశ్నకు నా నుంచి సమాధానం ఎదురుచూస్తున్నారు. “నేనలా చెయ్యకుండా ఉండలేక పోతున్నా లవర్స్ అంటూ ఎవరైనా కనబడితే అందులోనూ తెలిసిన వాళ్లయితే అస్సలాగలేను.” నా సమాధానం. “ఎందుకని?” నాన్న ప్రశ్న. “మీవల్లే” అని చెప్పాలని ఉంది కానీ ధైర్యం సరిపోలేదు నేల చూపులు చూసా. “ఎవ్వరెలా పోతే నీకెందుకు వాళ్ళ చావు వాళ్ళని చావని నువ్వెళ్ళి వాళ్ళని ఉద్దరించాల్సిన అవసరం లేదు వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. దె నో వాట్ దెయార్ డూయింగ్”. “దె డోంట్ నో డాడ్. (తల అడ్డం గా ఊపుతూ అన్నాను) నిజంగా వాళ్ళకి తెలియదు , వాళ్ళు అసలు నిజంగా లవ్ లో నే ఉన్నారు అనుకుంటున్నారు అది నిజమైన ప్రేమ కాదని వాళ్ళకి తెలియదు. ఒకరికొకరు ఆకర్షితులవుతారు ఇంకా దాన్నే ప్రేమనుకుంటున్నారు అలాగే కంటిన్యూ అయిపోతున్నారు వాళ్ళని చూస్తూనే........!(నేను ముగించేలోపే మా నాన్న)
“అసలు నీ బాధేంట్రా ఎందుకిలా చేస్తున్నావ్?”, నాన్న ప్రశ్న.
“నాన్న ప్రేమంటేనే చాలా స్ట్రాంగ్ బాండ్ నాన్న చాలా స్ట్రాంగ్, నాలాంటి వాళ్ళు మధ్యలో వస్తే కళ్ళలో నలత పడినట్టు తీసి పక్కన పారవెయ్యాలి , అంతేకానీ అదీ జీవితం లో ఒక భాగమే అన్నట్టు దాంతో కలిసి జీవించకూడదు.” నా సమాధానం.
“నీకు వయసు వచ్చిందని నాకు గుర్తు చేస్తున్నావ్ కదూ..! నీ వయసులో ప్రేమ,అమ్మాయిలు అని మాట్లాడడం తప్పు కాదు కానీ నువ్వు ఇప్పుడు చేస్తున్నది మాత్రం తప్పు అది నువ్వు ఆపేయ్యాలి........”.
“నావల్ల కాదని ముందే చెప్పా......”.
“నేను మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు (నేను సైలెంట్ అయ్యాను) నిన్ను ఇండియా కు పంపిస్తున్నా”.
“అక్కడా మనుషులే ఉంటారు “ప్రేమ” అనే ముసుగులో తిరుగుతుంటారు, అక్కడా నేను ఇలానే ఉంటా”.
“నువ్వు మారుతావు, నాకు నా ప్రేమ మన ఇండియాలోనే దొరికింది నీకు దొరుకుతుంది అనుకుంటున్నా, కాదు కచ్చితంగా దొరుకుతుంది.” నాన్న ఆ మాట అన్నప్పుడు నేను అప్రయత్నంగా అమ్మ ముఖం చూసా ఒకసారి వీరిద్దరి మద్య నిజంగా ప్రేమ ఉందా అనిపించింది కానీ బయటకు చెప్పలేదు. “ఈ రాత్రికే నీ ఫ్లయిట్” అన్నారు నాన్న. అంతే అక్కడితో ముగిసింది ఆ చర్చ.
ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతాన “సెర్ జాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు”లో......
“యావన్ ఏర్లైన్స్ , న్యూ జెర్సీ టు దుబాయ్ ” కనెక్టింగ్ ఫ్లయిట్ ఒక్క స్టాప్ దుబాయ్ లో ఫ్లయిట్ మారాలి “దుబాయ్ టు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు” , ఇరవై ఎనిమిది గంటలు ప్రయాణం. డిపార్చుర్ టైమ్ తొమ్మిదిన్నర గంటల కు.
“ఏదో మూడ్ లేకున్నా , నేను ఇంట్లో వాళ్ళు చెప్పారుగా అని బయలు దేరాను ఇంకా నైంటీ మినేట్స్ ఉంది ఫ్లయిట్ కు కాఫీ తాగుతూ ఎయిర్పోర్టు అంతా తిరిగా చాలా సేపు ఇక నాకు ఓపిక లేక వెయిటింగ్ ఏరియా లో కుర్చున్నా మళ్ళీ ఒక కాఫీ తో, అలా దిక్కులు చూస్తున్నాను మైండ్ లో ఏ థాటూ లేకుండా, అటువంటిది వాడెవడో గుండు గాడు. చూడడానికి బానే హైటు వెయుటూ ఉన్నాడు నా అంత కాకపోయినా కొంచెం అందగాడే , నన్ను చూసి వెక్కిరించాడు నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది ఎందుకిలా చేస్తున్నాడు అని...... ఎందుకంటే మాకు అసలు పరిచేయమే లేదు అయాం షూర్. నన్ను చూసి నవ్వాడు కూడా నేను సైలెంట్ గానె ఉన్నాను ఎందుకో పెద్దగా రియాక్ట్ అవ్వాలనిపించలేదు మే బి ఈ జర్నీ వల్లేమో. లైట్ తీసుకున్నా. వాడు రెండు కూల్ డ్రింక్స్ కొని, తీసుకు వెళుతున్నాడు ఎవరికోసమో. అలా చూస్తూవున్నా అది తీసుకు వెళ్ళి ఒక అమ్మాయికి ఇచ్చాడు వాడి గర్ల్ ఫ్రెండ్ తను. బ్ల్యూ జీన్స్ , అండ్ వైట్ షర్ట్ లో టక్ చేసి ప్రాపెర్ ఫిట్ గా ఉంది తను. ఏమాటకు ఆ మాట ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. తనని నేను చూడకుండా ఉండాల్సింది పాపం వాడి కర్మ, నేను చూసేశా.
వాడు పక్కకు వెళ్ళాడు మళ్ళీ ఏదో కొనడానికి నేను ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి మాట్లాడాను . వాళ్ళు దుబాయ్ కి వెళ్తున్నారు అంట! అదే వాళ్ళ స్వంత దేశం అంట. పాపం వాడు నన్ను చూసి ఇందాక అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. ఇందాక నేను హర్ట్ అవ్వలేదు కానీ ఈ అమ్మాయిని చూశాక కాస్త హర్ట్ అయ్యాను ఒకే ఫ్లయిట్ కాబట్టి ఇంకా బాగా హర్ట్ అయ్యాను. మరి తప్పదు గా , వాడు నన్ను చాలా హర్ట్ చేశాడు . సో , ఇప్పుడు నా చేతిలో నైంటీ మినేట్స్ ఇంకా ఫ్లయిట్ టైమ్ పదిహేను గంటలు కూడా ఉంది. వెంటనే తనకు ప్రపోస్ చేశాను కానీ నో అంది నేను తగ్గలేదు, నేను తనని లవ్ చేస్తూ ఉన్నట్టే నటించాను. ఇక తొమ్మిదిన్నర అయ్యింది ఫ్లయిట్ టైమ్ అయ్యింది అందరం ఫ్లయిట్ ఎక్కేసాము వాడు నన్ను క్రాస్ చేసుకుంటూ డాష్ ఇచ్చి వాడి సీట్ దగ్గరకి వెళ్ళాడు అయితే వెళ్ళే ముందు మళ్ళీ నన్ను వెక్కిరించాడు నేను ఫుల్ హర్ట్ అయిపోయాను మెల్లగా ఎయిర్ హోస్టెస్ దగ్గరకు వెళ్ళి మనీ ఇచ్చి ఆ గుండోడిని తగులుకోమన్నా ఫ్లయిట్ లో ఉన్నంతవరకు.తను చాలా డెడికేటెడ్ చెప్పిన వెంటనే ఆ ఎయిర్ హోస్టెస్ తన పనిని మొదలు పెట్టింది.
చూపులతోనే వాడిని తినేసింది వాడి గర్ల్ఫ్రెండ్ ను కూడా పట్టించుకోలేదు వాడు . టైమ్ దొరికినప్పుడల్లా ఫ్లర్ట్ చేస్తూంది. తన పని తను చాలా చక్కగా చేస్తుంది. నాకు ఫ్లయిట్ లాండ్ అయ్యేంతవరకు టైమ్ ఉంది నేను ఇంకా తనను లవ్ చేస్తున్నట్టు నటిస్తున్నాను. తనను అప్పుడప్పుడూ చూస్తూ ఉన్నాను. ఆ అమ్మాయి కాస్త నిద్ర పోయింది మూడు/నాలుగు గంటల సేపు. ఆ గ్యాప్ లో ఎయిర్ హోస్టెస్ వాడితో బాగా మింగిల్ అయిపోయిందనే చెప్పాలి.తను నిద్ర లేచి చూస్తే తన పక్కన ఆ గుండోడు లేదు తను అటు ఇటు చూసింది వాడు ఎయిర్ హోస్టెస్ కు ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాడు వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు ముసిముసి నవ్వులతో. తనని చూసి వీళ్ళు కాస్త సైలెంట్ అయ్యారు.. తను వాష్ రూంకు వెళ్ళింది తిరిగి వచ్చే టైమ్ కు వీరిద్దరూ ఇంకా మాట్లాడుకుంటున్నారు. తనకు విషయం అర్ధమయింది వాళ్ళని ఏమీ అనలేదు, కానీ గుండోడి మీద కోపం వచ్చినట్టుంది. నేను ఇంకా పడుకోలేదు తను నన్ను చూసింది నేనూ చూసా. అలా కాసేపు తను నన్ను చూడడం నేనూ తనని చూడడం జరిగింది. తరువాత తను తన సీట్ లో నుంచి లేచి నా దగ్గరకు వచ్చింది నాకు చాలా హ్యాపీ గా ఉంది. తను అలా రావడం. నా పక్కన ఉన్న పాసింజర్ ను తన సీట్ లోకి వెళ్ళమని రిక్వెస్ట్ చేశాము అతను అలానే వెళ్ళాడు . కాసేపు తను నేను ఏవో మాట్లాడుకున్నాం . ఏం మాట్లాడుకున్నామో నాకు గుర్తులేదు బహుశా తన డ్రస్ బాగుందనో లేక తన డిన్నర్ ఏం తింటుందనో అడిగి ఉంటాను తను సమాధానం చెప్పి ఉంటుంది లేదంటే యువర్ సో క్యూట్ , బ్యూటిఫుల్, అయాం లక్కీ టు సీ యు అని ఏవేవో చెప్పి ఉంటా ఒక రెండు మూడు నిమిషాలే మేం మాట్లాడుకుంది నాకు తెలిసి, తరువాత నేను సైగ చేసి వాష్ రూమ్ లోకి వెళ్ళాను నా వెనకే తనూ వచ్చింది . వాష్ రూమ్ లో తనని ముందు నా చేతులతో తన చెంపలు పట్టుకుని అలా మెల్లగా చాల దగ్గరకు తీసుకున్నాను . తను ఏమైనా కోప్పడుతుందో ఏమో అని జంకుతూనే ముట్టుకున్నాను తనని. అలా దగ్గరకు తీసుకుని తీసుకుని ఒక ముద్దు పెట్టడానికి ముందుకు జరిగాను అప్పటికీ తను ఏమైనా అంటుందేమో అనే బిడియం అయితే ఉంది కానీ , తనూ ముందుకు వచ్చి తన పెదాలను అందించింది. ఇక అంతే, అది వాష్రూమ్ అన్న విషయం కూడా మరిచిపోయి ఇద్దరం ముద్దులతో తడిసి ముద్దాయ్యాము. ఆ తరువాత మేము ఇద్దరం మా సీట్లలో (పక్క పక్కనే) కూర్చుని, తన చేతిని నా చేతిలోకి తీసుకుని అలాగే కూర్చున్నాం. ఇదంతా చూసిన ఆ గుండోడు మాత్రం ఇంకేం మాట్లాడలేదు పాపం ఏమనుకున్నాడో ఏమో సైలెంట్ అయిపోయాడు ఆ ఎయిర్ హోస్టెస్ తో కూడా ఏం మాట్లాడలేదు. కానీ నేను , తనూ మాత్రం మిగిలిన ఆ 9 అవర్స్ లో చాలానే మాట్లాడుకున్నాం తనకు నేను స్టేట్స్ లో ఉంటాను అని మాత్రమే చెప్పాను ఇక అంతా నోటికొచ్చిన అబద్దాలు చెప్పాను పాపం తను నమ్మింది. ఇక నా ఆ జర్నీ మెమోరబుల్ అయింది మాత్రం తన వల్లే , కాదు కాదు ఆ గుండోడి వల్లే. వాడు తలను చేతిలో పట్టుకుని కూర్చున్నాడు ఫ్లయిట్ దిగేంతవరకు భోజనం కూడా చెయ్యలేదు మధ్యలో పాపం, బాగా హర్ట్ అయినట్టున్నాడు.........
ఇక దుబాయ్ లో మా ఫ్లయిట్ అయితే లాండ్ అయ్యింది నేను ఇక ఫ్లయిట్ చేంజ్ అవ్వాలి. ఇక ఫ్లయిట్ లాండ్ అయిన తరువాత నేను తనని అవాయ్డ్ చేశాను కావాలనే . కానీ తను నన్ను గేట్ కూడా దాటానివ్వలేదు అడ్డంగా నిలబడిపోయింది నేను అవాయ్డ్ చేస్తున్నానని . పాపం బాగా నమ్మినట్టు ఉంది. కాస్త ఏడవడం కూడా మొదలెట్టింది. ఇక నేను చెప్పాను ఇదీ జరిగింది నేను ఇలాంటివాడిని అని. తను కాసేపు నా కళ్ళలోకి అలాగే చూసింది అంతే, ఇక అలాగే తిరిగి వెళ్ళిపోయింది ఒక్క మాట కూడా మాట్లాడకుండా. నేను ఇలాంటి ఏడుపులు చాలా చూశాను , అస్సలు పట్టించుకోను కూడా. ఫ్లయిట్ చేంజ్ అయ్యాను ఇండియా కు రావడం కోసం. సో అలా ఇండియా విజయవాడ లో (రాజీవ్/ఇందిరా గాంధీ ఎయిర్పోర్టు లో) లాండ్ అయ్యాను .
ఆ తరువాత టాక్సి పట్టుకుని కృష్ణా జిల్లా లోని మచిలీపట్నం లో మా బంధువులను కలవడానికి వెళ్ళాను. చూస్తూ చూస్తూ సాయంత్రం అయిపోయింది. నిజానికి నాకు వాళ్ళ దగ్గరకు వెళ్లాలని లేదు ఎందుకంటే మా నాన్న నన్ను ఇండియా కు వెల్లమన్నారు కానీ మా బంధువులతో ఉండమనలేదు. రెండోది నాకు సిటీ చూడాలని ఉంది ,అదీ అసలు విషయం అంటే బంధువులు దగ్గరే ఉండి బయట తిరగడం కన్నా నేను ఒంటరిగా ఉండి ఊరు చూడాలనుకున్నా . ఎంతైనా ఇంట్లో ఉంటే టైమ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అదే హోటల్ లో అయితే మనకు నచ్చిన టైమ్ లో రావచ్చు వెళ్ళవచ్చు నా ఈ ప్రవర్తన కానీ ఇంకా దేని వాళ్ళైనా వాళ్ళు (బంధువులు) ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు . ఇక వాళ్ళ దగ్గరకు వెళ్ళేది మాత్రం సిద్దార్థ్ కోసమే . మా బాబాయి కొడుకు , నాకన్నా ఒక సంవత్సరం చిన్నవాడు. ఎప్పుడూ ఫోన్ లోనే మాట్లాడుకుంటూ ఉంటాం. ఇద్దరం ఒకరిని ఒకరం పేరు పెట్టి పిలుచుకుంటాం.
కాస్త చీకటి పడింది. బంధువుల ఇంటికి చేరుకున్నాను ఆ తరువాత సిద్దును కలిశాను. అసలు సిద్దూ ని కలిసిన వెంటనే నాకైతే చాలా సంతోషం గా అనిపించింది. చూడడానికి హీరో ల ఉన్నాడు. కొంచెం తెల్లగా , సిల్కీ హెయిర్, మంచి పర్సనాలిటీ ను మైన్టైన్ చేస్తున్నాడు అనిపించింది చివరి సారి చూసినప్పటికీ ఇప్పటికీ పెద్దగా ఏం మారలేదు కొంచెం కలర్ వచ్చాడు అనిపించింది. ఇక వాడిని వెంట పెట్టుకుని సిటీ మొత్తం తిరిగెద్దామనుకున్నాను. కానీ ముందు వాడు ఒప్పుకోవాలి కదా నాతో వస్తాడో రాడో !. సిద్దార్థ్ కూడా నాలాగే చదువు పూర్తి చేశాడు, ఉద్యోగం గురించి ఏ బెంగా లేదని తెలిసిన విషయమే!.
ఇంట్లో బంధువులు అందరినీ కలిశాను బాబాయి, పిన్ని, అత్తయ్య వాళ్ళ పిల్లలు. కాసేపు కబుర్లు కూడా చెప్పుకున్నాం . సో , ఎలాగో అందరినీ కలిసేశాను, కలవడాలు అయిపోయాయి కాబట్టి ,సరదాగా ఒక రైడ్ అలా కార్ లో వెళ్దామని చెప్పాను సిద్దూ తో. సిద్దూ సరే అని బ్లాక్ క్రిస్లర్ కార్ తీశాడు,కానీ నేను డ్రైవింగ్ చేశా. ఇక కాస్త దూరం వెళ్ళాక నేననుకున్నది (సిటీ అంతా తిరిగడం గురించి) అడిగాను . “ఇక్కడ నాకూ పెద్ద పొడిచే పనులు ఏమీ లేవు పోదాం పదా!” అన్నాడు.
అంతే అప్పటికప్పుడే అనుకుని , ఆ క్షణాన్నే ఇద్దరం హైదెరాబాద్ కు జర్నీ స్టార్ట్ చేశాం కార్ లో. అస్సలు లగేజ్,బట్టలు లాంటివి ఏమీ లేవు అంతా బాబాయి ఇంట్లోనే ఉన్నాయి మేము అనుకోలేదు ఇలా ఉన్నట్టుండి బయలుదేరతాము అని, ఆలోచన రావడం ప్రయాణం కట్టేశాం ఏమీ ఆలోచించకుండా. కేవలం మా ఫోన్స్ అండ్ వాలెట్స్ మాత్రమే మాతో ఉన్నాయి. కనీసం ఇంట్లో చెప్పలేదు ఇలా బయటకు వెళ్తున్నాం అని. దారిలో వెళ్తుండగానే ఇంటికి ఫోన్ చేసి చెప్పమన్నాను సిద్దార్థ్ కు. సిద్దార్థ్ అలానే చెప్పాడు బాబాయి బాగా కోప్పడ్డారు , వచ్చి రాగానే రెస్ట్ తీసుకోకుండా ఏంటిది? కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా ఇలా ప్రయాణమేంటి? అని . “అందుకే ఇప్పుడు చెప్తున్నా కదా నాన్న” అన్నాడు సిద్దార్థ్ నెమ్మదిగా. “ఏంటి ఇప్పుడా ? ఒకసారి ఫోన్ వాడికి ఇయ్యిరా”అన్నాడు బాబాయి. నాకు మొత్తం వినిపిస్తున్నాయి బాబాయి మాటలు ఫోన్ స్పీకర్ లో ఉంది. “లేదు నాన్న వాడు కార్ తోలుతున్నాడు , ఫోన్ మాట్లాడితే యాక్సిడెంట్స్ అవుతాయి కదా” అన్నాడు సిద్దు . “రే సిద్దూ వాడు నాలుగు రోజులే ఉంటాడు మళ్ళీ నువ్వు ఇంటికే వస్తావు అప్పుడు చెప్తా”, అన్నాడు బాబాయి. “అయితే ఇప్పుడు వెళ్లనిచ్చినందుకు థాంక్స్ బాబాయి” అని ఇద్దరం గట్టిగా ఉత్సాహంతో అరిచి ఫోన్ పెట్టేశాము.
నైట్ రైడ్ కాబట్టి కావాలనే స్లో గా వెళ్ళాము . ఇద్దరం కార్ డ్రైవ్ చేశాం మార్చి మార్చి నేను అలసిపోయా. దార్లోనే హైదరాబాద్ లో గ్లోరీ హోటల్ లో రూమ్ బుక్ చేశాడు సిద్దార్థ్ . ఇక డైరెక్ట్ గా అక్కడే మా స్టాప్ . ఆల్మోస్ట్ ఆరు/ఏడు గంటలు అనుకుంటా ఆ జర్నీ. నేను ఆ రోజంతా ట్రావెల్లింగ్ లో నే ఉన్నా కాబట్టి నేను కొంచెం అలసిపోయా అది తప్పితే. నైట్ రైడ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇక ఆ రైడ్ కూడా నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. నైట్ రైడ్స్ ఎంత అధ్బుతంగా ఉంటాయో మీకు వేరే చెప్పాలా , మా ఇద్దరికీ అది ఒక స్లో పాయ్ సన్ లా ఉంది. మ్యూజిక్ ఒక లూప్ లో డీసెంట్ సౌండ్ పెట్టి ఏదో మత్తులో ఉన్నట్టు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం ఏమి మాటలు లేవు మా మధ్యలో , మౌనం గా అలా తేలుతూ మా హోటల్ కు రీచ్ అయ్యాం. ఇక హోటల్ కు రీచ్ అయ్యాక నేనేం తినలేదు వెళ్ళి నిద్రపోయా, సిద్దూ కూడా.
[ప్రస్తుతం : కూల్ కేఫ్ లో కూర్చుని ఉన్న నారీ కిటికీలోంచి చూస్తుంటే అలానే చూస్తుండాలని పిస్తుంది. వర్షం ఇంకొంచెం పెద్దదయ్యింది. కాఫీ అయిపోయింది మళ్ళీ బేరర్ ను పిలిచి ఏదో హాట్ డ్రింక్ ఆర్డర్ చేశాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు వెనక్కి.]
నెక్స్ట్ డే మధ్యానం కు కానీ నేను నిద్ర లేవలేదు , సిద్దూ నేను కలిసి లంచ్ చేశాం. ఇక రెడీ అయ్యి షాపింగ్ కు వెళ్ళాం ఆ రోజంతా షాపింగ్ తోనే సరిపోయింది. నెక్స్ట్ డే నుండి హైదరాబాద్ లో మాదే హవా.. మేం బ్లాక్ క్రిస్లర్ కార్ లో , మా చేతులు స్టీరింగ్ మీద , స్టీరింగ్ ఎలా తిరిగితే మేం అలా పోతున్నాం . గల్లీ లో ఛాయ్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్ లో దొరికే రిచ్ ఫుడ్ దాకా అన్నీ టేస్ట్ చేస్తున్నాం ప్రతి రోజు. ఫేమస్ అని ఫేమస్ కానివి అని లేకుండా ఎక్కడ ఎమున్నా వెళ్ళి చూసేయడమే . మ్యూజియంలు, ఫోర్ట్ లు, పాత కట్టడాలు ఇంకా అడవులు. మేమేమి టూర్ కి రాలేదు మంచి మంచి ప్లేసెస్ మాత్రమే చూడడానికి , జస్ట్ టైమ్ పాస్ కు కాబట్టి ఏది పడితే అది చూస్తున్నాం అది ఎలా ఉన్నా.
అలా చూసి చూసి బోర్ కొట్టింది కొద్దిరోజులకి , ఇక వేరే ఊరుకు వెళ్దాం అని అన్నాను సిద్దూ తో. వైజాగ్ కు వెళ్దాం అక్కడ చాలా బీచెస్ ఉంటాయ్ అన్నాడు. నీకూ కొంచెం రిఫ్రెష్ గా ఉంటుంది అన్నాడు . బీచ్ అన్నాడు కాబట్టి నాకూ కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ సారి నిద్రలేని బాధ ఉండకూడదు అని కాసేపు నిద్ర పోయాము ఆ జర్నీ కోసం. ఆ తరువాత వెంటనే ప్రయాణం కట్టాం విశాఖ పట్టణానికి అప్పటికి మధ్యాహ్నం మూడు గంటలు అవుతుంది . మా కార్ రైడ్ మళ్ళీ నైట్ రైడ్ అయ్యింది . ఆన్ ది వే లోనే హోటల్ మిర్త్ లో రూమ్ బుక్ చేశాం. సిద్దూ నేనూ చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేం చేసే చేసే ప్రతీ పనిని. కార్ లో మేం అలా ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ రైడ్ లోనే సిద్దు అడిగాడు “నువ్వు ఇంతవరకు చాలా మందికి ప్రూవ్ చేశావ్ కదా వాళ్ళది నిజమైన ప్రేమ కాదని ఒక వేల నిజమైన ప్రేమికులని కలిసి వాళ్ళ ముందు ఒడిపోతే అప్పుడేం చేస్తావు ?. జస్ట్ అడుగుతున్నా తెలుసుకోవాలని ఉంది ,ఇంతక ముందు ఎప్పుడూ అలా జరగ లేదా?”అని . “ఒక వేల నిజంగా అలాంటి జంటలు కనబడితే నేను వాళ్ళ మధ్య జోక్యం చేసుకున్నందుకు సారీ చెప్తాను,ఇంకా హ్యాపీ గా వాళ్ళ లైఫ్ కి నా బెస్ట్ విషెస్ చెప్తాను. అలాంటి జంటలు కనబడాలనే కోరుకుంటా వాళ్ళకి నా సారీ చెప్పాలనే అనుకుంటాను, కానీ కనబడరు.
[ప్రస్తుతం : కూల్ కేఫ్ లో హాట్ డ్రింక్ తాగుతూ “అప్పటివరకు నాకు అలాంటి జంట కనబడలేదు. తనని చూశాక ఇంకెవ్వరి మధ్య నేను జోక్యం చేసుకోలేదు”అనుకున్నాడు నారీ మనసులో]
వైజాగ్ లో మా హోటల్ చేరే టప్పటికి మార్నింగ్ 4:30/5:00 అయింది. ఎందుకంటే మధ్యలో ఏదో బీచ్ కనబడితే, అక్కడే కాసేపు ఆగి ఆ బీచ్ ని నైట్ తో కలిసి చూసి కాసేపు అక్కడే గడిపాం, ఆ తరువాత హోటల్ కు చేరుకున్నాం.
ఆ నెక్స్ట్ డే కాస్త లేట్ గా నిద్ర లేచాము ఉదయం పది అయ్యింది అయ్యిందనుకుంటా. ఇక ఫ్రెష్ అయ్యి టిఫ్ఫెన్ చేసి బయటకు వెళ్ళాం. ఈవెనింగ్ బీచ్ కు వెళ్దాం అని ఫిక్స్ అయ్యాం. ఏమైనా కానీ సిద్దు నాకు బెస్ట్ కంపనీ ఇస్తున్నాడు. సో, ఈవెనింగ్ వరకు వెయ్ ట్ చేశాం. బీచ్ కు వెళ్ళటానికి. నేను ఇలా తిరిగినంత మాత్రాన నేను మారిపోలేదు. కాస్త తగ్గా అంతే.
సో ,వైజాగ్ లోనే ఫేమస్ బీచ్ ల లో ఒకటి అది ఒకటంటా. అక్కడకు వెళ్ళాం, అక్కడ ఉన్న స్టాల్స్ లో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ బీచ్ వ్యూ చూశాం ఒక రెండు గంటలు అటు ఇటు తిరిగి తరువాత మా హోటల్ కు బయలుదేరాం. సరిగ్గా అప్పుడే ఒక అమ్మాయిని చూసా. అక్కడే ఆగిపోయా ముదుకు ఒక్క అడుగు కూడా వేయలేక పోయా. నా పరిస్థితి చూసి సిద్దు అర్ధం చేసుకున్నాడు. నన్నేమీ అడగలేదు. నాకు నచ్చిన విషయం అదే సిద్దూ లో, పరిస్థితికి తగ్గట్టుగా ఉంటాడు.
సిద్దూ కి చెప్పా “నేను ఎంతో మంది కుర్రాల నుంచి గొప్ప గొప్ప కవుల దాకా ఎంతో మందిని చూశాను వారు ఎన్నో విధాలుగా అమ్మాయిల అందాలను వివరించారు, పొగిడారు. నేను అవి విని వాళ్ళను ఎంతో మెచ్చకున్నా నా మనసులో, కానీ ఫస్ట్ టైమ్ నాకు వాళ్ళందరి మీద కోపం వస్తుంది.”
“ఏ”? అడిగాడు సిద్దు .
ఎందుకంటే నేను ఆ అమ్మాయిని చూశాక నా మనసులోనే ‘తను ఎల్లోరా శిల్పం ,దివి నుంచి భువికి వచ్చిన దేవత , తనను ఈ భూమికి అందించి చాలా గొప్ప పని చేశాడు ఆ బ్రహ్మ , బాపు గీసిన బొమ్మ. అందానికే ఓ అమ్మాయి రూపం ఉంటే అది తనేనేమో. అని ఎన్ని విధాలుగా పొగడాలనుకున్న అన్నీ వాళ్ళు చెప్పేసినవే. కొత్తగా తనని వర్ణించడానికి మాటలు లేవు. అయినా అందరూ గొప్పగా అనుకునే 36-24-36 కాదు తను, కానీ అలాంటి ఒక గొప్ప ఆకారమే తనకు ఉంది. తనని చూస్తే ఆ నంబర్స్ మార్చేసి కొత్త నంబర్స్ వాడుకలోకి తీసుకువస్తారు ఇంక అదే నంబర్స్ ఫాలో అవుతారు కూడా. నిజంగా నే ఎవరో తనని చాలా శ్రధ్ధ తీసుకుని ఇంచు ఇంచు జాగ్రత్త గా చెక్కి నట్టు గా ఉన్నాయి తన కొలతలు. ఒక 5 అడుగుల ఎత్తు. ఉండి లేనట్టు ఉండే సన్నని పెదాలు. ఇక మిగిలిన వాటి గురించి మాట్లాడే పనే లేదు దేనికదే సాటి. బొద్దు గా ఉంది ఆ పొడవుకు తగ్గ పుష్టి , కానీ ఒక విషయం తను ఈ బీచ్ కి రావడం వల్ల ఈ బీచ్ అందం వంద రెట్లు పెరిగినట్టు ఉంది. ఇవన్నీ నేను కేవలం తనను చూసిన రెండు క్షణాలలో నా మనసు ఆలోచించినవి. రెండు క్షణాల తరువాత నేను కంగుతిన్నా!.”
ఏమైందంటే తన పక్కనే ఎవడో ఉన్నాడు. బహుశా బాయ్ఫ్రెండ్ ఏమో కానీ మనం అలా అనుకోకూడదు. తన తమ్ముడు అనుకోవాలి. లేకపోతే కష్టం. సో, రూమ్ కెళ్ళి పోతే తనని మళ్ళీ కలవలేను. కాబట్టి, వెయ్ట్ చేసి తరువాత తనను ఫాలో అయ్యి తన ఇంటి అడ్రస్ తెలుసుకుందాం అన్నా సిద్దూతో. కొంచెం విసుగ్గానే చూశాడు కానీ సరే ఉన్నాడు. వాళ్ళు ఒక గంట తరువాత బయలు దేరారు కానీ అక్కడున్నంత సేపూ తన తో పాటు వాడిని కూడా చూడాల్సి వచ్చింది. అదే కొంచెం బాధ, కొంచెం కాదు చాలా. అయితే తరువాత వాళ్ళకు తెలియకుండా తనను ఫాలో అయ్యి తన అడ్రసు కూడా తెలుసుకున్నాం. కర్మే , కానీ తప్పదు అని వాడి అడ్రసు కూడా తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ డే నుండి తన ను ఫాలో అవ్వడమే పని అయిపోయింది.
రోజూ మార్నింగ్ లేవడం, ఫ్రెష్ అవ్వడం ,తనని ఫాలో అవ్వడం ఇదే.. ఇదే పనైపోయింది. ఎంతో సేపు పట్టలేదు తను ఎంబిఏ ఫైనల్ ఇయర్ చేస్తుంది అని , ఒక మంచి కాలేజీ లో చదువుతుంది అని. మెరిట్ లో పాస్ అయ్యి ఫ్రీ గా చదువుకుంటోంది. తనది మిడిల్ క్లాస్. వాళ్ళ నాన్న ప్రభాకర్ ఓ చిన్న గవర్నమెంట్ ఉద్యోగి. రిజిస్ట్రేషన్ ఆఫీసు లో ఉద్యోగం చేస్తూండేవాడు. ఇక వాళ్ళ అమ్మ నా వల్ల తన కూతరు పడబోయే బాధ చూడలేకో ఏమో కానీ తన చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళకు ఉన్నది అల్లా ఒక చిన్న ఇల్లు కానీ ఆ ఇల్లు చూడడానికి చాలా ముచ్చటగా ఉంది , మే బి అది కూడా తనవల్లే ఏమో. తనే అంత బాగా తన ఇంటిని చూసుకుటుందేమో. ఇక పోతే వాడు నాకు అన్న అవుతాడు.
అదే ఆరోజున బీచ్ కు తన తో పాటు వచ్చిన మన తమ్ముడు. వాడి పేరు కౌశిక్. పదవతరగతి తరువాత స్టడీస్ కు పుల్ స్టాప్ పెట్టి. గ్రాఫిక్స్ సంబంధించిన కోర్స్ నేర్చుకుని ప్రస్తుతం ఒక పెద్ద కంపనీ లో మంచి స్థాయి లో ఉన్నాడు. కౌశిక్ కూడా ఆర్దికంగా వెనుక బడిన కుటుంబం నుంచే వచ్చాడు అయితే ప్రస్తుతం ఫైనాన్షియల్ గా తను మంచి స్థాయిలో నే ఉన్నాడు. వారిద్దరూ హై స్కూల్ చదివేటప్పుడు క్లాస్ మేట్స్ అంట. సొ ఆ పరిచయమే ఈ దారుణానికి కారణం అంట. అదే వాళ్ళ ప్రే........మకు. ఇది ఒప్పుకోవలనసిన విషయం, కౌశిక్ కూడా కాస్త అందగాడే ఆరడుగుల ఎత్తు. చామంచాయ , పద్దతి గా దువ్వే తల. కొద్దిగా పొట్ట సామాన్యం గా ఉండేదే.
మేం ఈ విషయాలు అన్నీ తెల్సుకున్న తరువాత మాకు తన పేరు తెలిసింది. తన పేరు “వైశాలి” అని నిజంగా విచిత్రంగా ఉంది కదా మేం తన పేరు తప్ప అన్నీ ముందు కనుక్కున్నాం. నేనూ నమ్మలేక పోయా ఈవిషయం కానీ ఇది నిజం.
ఇక రోజూ తనను ఫాలో చేయడం తన కాలేజ్ వెళ్ళడం తన ఆక్టివిటీస్ తనకు తెలియకుండా గమనించడం ఇదే పని. వైశాలి ఆ కౌశిక్ గాడితో కలిసి బయటకు వెళ్ళేది నేను అక్కడకూ వెళ్ళే వాడిని వాళ్ళకు తెలియకుండా. వాళ్ళ ఇద్దరినీ ఇలా ఫాలో అయ్యేవాడిని.కానీ ఒక వారం తరువాత రియలైజ్ అయ్యా. నేను ఎప్పుడూ ఏ అమ్మాయి విషయం లోనూ ఇంత లాగ్ చేయలేదు. కానీ వైశాలి విషయంలో ఎందుకో తెలియదు.
ఇక అప్పటినుండి తనని దూరం నుండి చూడడం మానేసి దగ్గరకు వెళ్ళి మాట్లాడాలని ట్రై చేశాను. చాలా సార్లు భయమేసి ఆగిపోయా. ఎందుకో ఏమో తనకు నామీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందనేమో. కానీ ఈ ప్రయత్నం లో తను నన్ను గమనించేసింది. రోజూ నాతోనే సిద్దూ కూడా వస్తాడు నేను వైశాలి కోసం ఎక్కడకు వెళ్ళినా.
ఒక రోజు మధ్యానం మేం తన కోసం తన కాలేజ్ కు వెళ్ళాం. ఊరికే చూద్దామని, పార్కింగ్ ప్లేస్ లో చెట్లు నీడ చాలా బాగుంది మేం అక్కడే ఉన్నాం నిజానికి తన బైక్ కూడా అక్కడే పార్క్ చేసి ఉంది !. మేం కాసేపటి తరువాత బయలుదేరాము అక్కడినుంచి. తనే మాకు ఎదురు వచ్చింది. మేం సైడ్ ఇచ్చాం కానీ మాకు అడ్డుగా నిలబడింది. అర్ధం కాలేదు తనెందుకు అలా నిలబడిందని కానీ వైశాలి అలా నిలబడడం నాకు చాలా నచ్చింది. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కనబడకుండా దాచేందుకు చాలా ట్రై చేశాను. ఎక్స్క్యూస్ మి అని మొదలెట్టేలోపే “మీరు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు?” అని చాలా గట్టిగా నే అడిగింది. చాలా కోపం గా కూడా. తను ఇద్దరినీ ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడుతుంది. చాలా డేరింగ్ గా. తను అంత కోపం గా ఉన్నప్పుడు చాలా ముద్దొచ్చింది. ఆ విషయం అక్కడే చెపుతామనుకున్నా కానీ నా చెంపలు ఎక్కడ ఎరుపెక్కుతాయో అని ఆలోచించి ఆ ఆలోచన అక్కడే వదిలేశా.
సిద్దూ మాత్రం కొంచెం టెన్షన్ గా ఉన్నాడు. నన్నే చూస్తున్నాడు , తనకు తెలుసు నేను ఇటువంటి సిట్యుయేషన్స్ ను హ్యాండిల్ చెయ్యగలనని. సో , అందుకే వెయ్ ట్ చేస్తున్నాడు నేను ఇంకా ఏం మాట్లాడలేదేంటా అని. “మైండ్ పోయిందా లేదా నోరు పోయిందా? ” అని అడిగింది. మేమింకా తను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. నేనొక కూల్ లుక్ ఇచ్చా సిద్దూ కి నేను చూసుకుంటా అని. “హలో మేడమ్. మీరు చాల అందంగా ఉన్నారు” అన్నాను.
“ఆ విషయం నాకూ తెలుసు , నేను అది అడగలేదు” – వైశాలి
“నేను మీరడిగిన దానికే సమాధానం చెప్తున్నాను , మీరు పూర్తిగా వినడం లేదు”
వైశాలి కొంచెం తగ్గింది కానీ కోపంగానే ఉంది.
“ఇలా చెప్పడం నాకు కొత్తేమీ కాదు గానీ , ఈసారి నాకు ఎందుకో చాలా కొత్తగా ఉంది. మీరు నాకు నచ్చారు. ఐ థింక్ నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను.” అన్నాను.
“కూల్”అని నాకు నేనే చెప్పుకున్నా ఈ సంఘటనకు.
నేనేం అంత ఈసీ గా చెప్పలేదు తనకి, భయం తో తడపడుతూనే చెప్పాను. వైశాలిని మాత్రం సూటిగా చూడలేకపోయా ఆ టైమ్ లో. కానీ సిద్దూ ని చూసా , పాపం వాడు వనికి పోతున్నాడు. మామూలుగానే వాడు అమ్మాయిల విషయం అంటే కొంచెం భయపడతాడు. ఇక నేను ఈ అమ్మాయికి భయపడడం వాడిలోని భయాన్ని ఇంకా పెంచింది. నాకు అది బాగా నచ్చింది.
“నన్ను ఫాలో చేస్తున్నప్పుడే నేను ఎంగేజెడ్ అని తెలియదా?” -వైశాలి
“తెలుసు” అనే అన్నాము మేము, కాస్త నేల చూపులు చూస్తూ. “నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నాని తెలిసికూడా మీరు నన్ను ఫాలో చేయడం,అసలు కొంచెమైనా మీనింగ్ ఉందా. కనీసం మైండ్ ఉందా మీకు?” అంది. “హలో,హలో,.......ఎక్స్క్యూస్ మి! నేను మిమ్మల్ని హర్రాస్ చేయలేదు,ప్రపోస్ చేయలేదు. నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను అంతే” అన్నాను.
కూల్ గా మాట్లాడడం మొదలెట్టింది “నేను చూసా మీరు నన్ను ఫాలోఅవ్వడం. కొద్దిరోజులు చూసి తరువాత ఆపేస్తారనుకున్నా. అయినా, మీరు చూస్తూ ఉంటే పట్టించుకోకుండా ఉండే మనిషిని నేను కాదు. సో, నన్ను ఇలా ఫాలో చెయ్యకుండా ఉంటే మీకే మంచిది, కనీసం మీ టైమ్ అయినా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా” అంది. “మాకు ప్రజలను పాలించే అంత పెద్ద పెద్ద పనులు ఏమీ లేవు. మేం చాలా కాలియే.” అన్నాను కూల్ గా. “అంటే నన్ను వేధించకుండా వదలనంటారు” అంది. నేను,సిద్దు ఒకరిని ఒకరం చూసుకున్నాం. తనెందుకు అలా అందో అర్ధం కాక. టక్కున నవ్వేసింది. అప్పుడు చల్లబడ్డాం తను తమాషాగా అందని అర్ధమై. తను ఎంత కలివిడి మనిషో నాకు అప్పుడే అర్ధమయింది.
తనే మళ్ళీ “బహుశా మీరు బాగా ఉన్నోళ్ళే అయ్యుండొచ్చు. అయినంత మాత్రాన నేను మీకు లొంగుతానని అనుకోకండి”అంది. తను అలా మాట్లాడుతుండగా నేను బ్రేక్ వేసి.“బై” అని చెప్పి అక్కడినుండి బయలుదేరాము.“ఒక్క సెకండ్, నేను మాట్లాడుతున్నా” అంది.“మాకు పనుంది,మేం వెళ్ళాలి” అని చెప్పి వెనుదిరిగాం. “ఇంకోసారి నా వెంట పడకండి” అంది నవ్వుతూనే. మేం అది వింటూనే ముందుకు నడిచాం.
సిద్దూ అడిగాడు “ఎందుకురా నువ్వు ఇప్పుడు వచ్చేశావ్?. తనతో మాట్లాడాల్సింది.” అన్నాడు. తనకు ముందు నా గురించి చెప్పి, తరువాత మళ్ళీ ప్రయత్నిద్దామని. తను అలా మాట్లాడడం నాకు చాలా బాగుంది. అలా అని తను నా గురించి ఏం తెలియకుండా మాట్లాడడం నాకసలు నచ్చలేదు. చెప్పాలంటే కొంచెం పోసు కొడుతుంది అందుకే అక్కడినుండి బయలుదేరి పోయా.
నెక్స్ట్ డే నుండి నేను ఒక్కడినే వెళ్ళాను అప్పుడప్పుడూ సిద్దూ కూడా వచ్చేవాడు. నాతో రాకపోయిన నాకు అందుబాటులోనే ఉండేవాడు ఎప్పుడూ. ఇండియా లో నేను ఎన్నిరోజులు ఉండాలో తెలియని నాకు, తనని చూశాక తను నాతో ప్రేమలో పడే అంత వరకు నేను ఇండియా లోనే ఉండాలని అర్ధమైంది. ఇక నేను తనను కలిసిన నెక్స్ట్ టైమ్ నా గురించి చెప్పా. అది కూడా ఏమి అంత ఈసీ గా జరగలేదు. నేను తనని కలిసి నా గురించి ముందు తెలుసుకోవాడానికి ఫైవ్ మిన్స్ నాతో రమ్మన్నాను, కుదరదు అంది. రిక్వెస్ట్ చేశా నో అంది. అలా ఒక రెండు మూడు రోజులు తన వెంట పడ్డాక తను సరే అంది.
ఒక మంచి రోడ్డు అది కొండ పక్కన ఉంటుంది చాలా తక్కువ బండ్లు తిరుతాయి అక్కడ, ఆ లుక్ కోసమే చాలా మంది అక్కడకు వస్తూ ఉంటారు. చాలా నీడ గా కూడా ఉంటుంది. ఆరెంజ్ రంగు పువ్వులు రోడ్డుకు ఇరువైపులా పడి ఉంటాయి ఆ దారికి అందాన్ని పెంచుతూ చెట్లు, నీడ ఆ గాలి,తేలుతూ వెళ్తున్న తెల్లని మబ్బులు,అక్కడ ఆపాను కార్. ఇద్దరం కారు దిగాము. అప్పుడు చెప్పా నా అమెరికా భాగవతం ఆ తరువాత నా ఇండియా రాక గురించి.
నేను తనకు చెప్పా . “నేను మామూలుగా ఏ అమ్మాయికయినా ముందు ప్రపోస్ చేసి తరువాత డిస్టర్బ్ చేసే వాడిని. కానీ మీ విషయం లో నాకు నా గురించి మొత్తం చెప్పాలనిపించింది. అందుకే ఇదంతా చెప్తున్నా. ఏ అమ్మాయికి ఇంత వరకు నా గురించి ఇదంతా చెప్పింది లేదు” అన్నాను.“ఏమో అనుకున్నా నువ్వు చాలా టాలెంటెడ్ ఏ!” అంది నవ్వుతూ. సో,లవ్ అంటే స్ట్రాంగ్ గా ఉండడం మీ ధృష్టి లో అంతేనా”అంది.
“అంటే ఎవ్వరొ.........” అని ముగించేలోపే.
“అదే మధ్యలో ఎవ్వరు వచ్చినా సరే డిస్టర్బ్ అవ్వకూడదు అంతేగా?, సో ఇప్పుడు నువ్వు నన్ను టెస్ట్ చేయడానికే నా లైఫ్ లోకి వచ్చావు కదూ.” అంది నవ్వు ముఖం తో.
“లేదు నేను నిజం గా నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే నీ లైఫ్ లోకి వచ్చా”.
“నేను ఆల్రెడీ ప్రేమ లో ఉన్నాను, తనకు తప్ప నా మనుసులో ఆ చోటు ఇంకెవ్వరికీ లేదు నువ్వింకా నా వెంట పడి తరువాత నీ టైమ్ వేస్ట్ అయ్యిందని నన్ను మాత్రం తిట్టుకోవద్దు”.
“లేదు నాకు నమ్మకం ఉంది నువ్వు నన్ను కచ్చితంగా ప్రేమిస్తావు”.
“ఆ నమ్మకం పిచ్చి నమ్మకం అయితే కాదు కదా?, మే బి ఇంతవరకు నీ జీవితం లో అందరూ అలాంటి వాళ్ళే నీకు ఎదురుపడి ఉంటారు. కానీ నేను అలా కాదు ఇంకో విషయం ఇంకోసారి కానీ నేను నిన్ను చూస్తే కౌశిక్ కు చెప్పేస్తాను. ఇంత వరకు చెప్పలేదు కానీ ఇక ఆలస్యం చేయను.” అని చెప్పింది అంటే వార్నింగ్ ఇచ్చింది చాలా నార్మల్ గా.
ఆ తరువాత ఇద్దరం బయలుదేరాం, తనని తిరిగి కాలేజ్ లో డ్రాప్ చేశా. నేను రూమ్ కి వెళ్ళా, సిద్దూ కూడా రూమ్ లోనే ఉన్నాడు. వాడికి చెప్పా నేను వైశాలి తో మాట్లాడడం గురించి. “తన ఫోన్ నెంబర్ తీసుకున్నావా?” అని అడిగాడు సిద్దు. నిజమే నేను ఇంకా తన నెంబర్ తీసుకోలేదు . ఎందుకు తీసుకోవాలి తనని తరచూ వెళ్ళి స్వయంగా కలిసి మరీ వస్తుంటే ఇక ఫోన్ నెంబర్ తో పనేంటి? అనుకున్నా . ఇక నెక్స్ట్ టైమ్ తనని కలిసినప్పుడు తన నెంబర్ తీసుకుందాం లే అనుకున్నా.
వైశాలికి నేను చాలా గట్టిగా చెప్పా (నాకు నమ్మకం ఉంది మీరు నన్ను ప్రేమిస్తారు అని ) కానీ , తను చాలా హ్యాపీ గా ఉంది ఆ కౌశిక్ గాడితో. వాళ్ళిద్దరూ కలిసి బయటకు వెళ్తుంటారు ఇంకా చాలా రొమాంటిక్ గా కూడా ఉంటారు.
ఆ తరువాత మా నెక్స్ట్ మీటింగ్ అంటే నేను తనని కలిసింది , కూడా తన కాలేజ్ పరిసరాల్లోనే. అదేంటో మేం కలుసుకోవడానికే చెట్లు ఉన్నా ఏమో అనిపించేది. నేను సుబ్బన్న సర్కిల్ లో కారు చెట్టుకింద ఆపి, దిగి దిక్కులు చూస్తూ ఉన్నాను ఎవరైనా వస్తారేమో అని , నిజానికి తన కోసమే ఎదురుచూస్తున్నా. తన కాలేజీ నుండి ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నా ఆ సర్కిల్ దాటే వెళ్ళాలి . మధ్యాహ్నం రెండవుతూ ఉంది ఎండ బాగా కాస్తుంది . నేను చెట్టు కింద తన కోసం ఎదురుచూస్తున్నా ఎవరో బైక్ మీద వచ్చి నా ముందు ఆగారు.తరువాత చూస్తే అది తనే తను తన బైక్ లో వచ్చింది. నేనే గమనించలేదు. తను నాతో నార్మల్ గా నే మాట్లాడింది ఒక ఫ్రెండ్ లాగా పరాయి మనిషి లా కాదు.
ముందు “నన్ను మళ్ళీ కలవద్దు అన్నాగా, ఎందుకు వచ్చావ్?” అని అడిగింది.
“నేను నిన్ను వదలనని చెప్పాగా” అన్నాను.
“అయితే నన్ను ప్రశాంతంగా బ్రతకనియ్యవన్న మాట” అంది.
నా ఉద్దేశ్యం అది కాదు నువ్వు నన్ను ప్రేమించేలా చేయటమే. అని ఏదో చెప్పే లోగా తను,“ఈ సోది తరువాత మాట్లాడుకుందాం. ఒక్కదాన్నే సినిమాకు వెళ్తున్నా వస్తావా,అంటే కౌశిక్ నేనూ ఇద్దరం వెళ్దామనుకున్నాం కానీ వాడికి వెంటనే ఏదో పని ఉందని హ్యాండ్ ఇచ్చాడు.” అంది. నేను పిచ్చ హ్యాపీ అయిపోయా .
ఇద్దరం కలిసి బయలుదేరాం నా కార్ లో కాకుండా తన స్కూటీ లో నే ఎక్కమంది, తనే డ్రైవ్ చేస్తూంది.
“ఊరికే అడుగుతున్నా మీ ఫ్రెండ్స్ లో ఎవరినైనా తీసుకు వెళ్ళి ఉండవచ్చు గా నన్నే ఎందుకు?” అని అడిగాను.
“ఒక్కరిని తీసుకు వెళితే మిగిలిన అందరూ నా శత్రువులు ఐపోతారు నన్నెందుకు తీసుకు వెల్ల లేదు అని అడుగుతారు. అదే నువ్వైతే నేను చెప్పింది చేస్తావు, నోరు మూసుకో మంటే మూసుకుని ఉంటావు అందుకే.” అని జవాబు ఇచ్చింది.
“అ !?” అన్నాను
తను ఒక నవ్వు నవ్వి “ఊరికే అన్నా , నువ్వు కనబడ్డావు కాబట్టి నువ్వు ఎలాగో కాళీ గానే ఉంటావు కాబట్టి రమ్మన్నా. లేదు రాను అంటే చెప్పు, ఇప్పుడే బండి దిగి వెళ్లిపో” అంది.
“లేదు లేదు నేను వస్తా” అన్నాను. అనవసరంగా అడిగానేమో అనిపించింది. ఇక కామ్ గా ఉన్నా.
“ఇప్పుడంటే వదిలేశా కానీ, పెళ్లి అయ్యాక కూడా ఇలానే హ్యాండ్ ఇవ్వాలి అప్పుడు వాడి పని చెప్తా” అంది దార్లో. ఆ మాటకు నాకు నవ్వు వచ్చింది. అఫ్కోర్స్ కావాలనే గట్టిగా నవ్వాను. తను వెంటనే బైక్ ఆపేసింది. ఎందుకు ఇప్పుడు నవ్వావు అని అడిగింది. మరి ఇప్పుడు కౌశిక్ తో పెళ్లి అని ఏదో పెద్ద జోక్ వేశావ్ కదా. నవ్వకపోతే ఎలా అన్నాను.
“అంటే ఇప్పుడు కౌశిక్ కు నాకు పెళ్లి అవ్వదంటావా ?” అని అడిగింది.
అది నాకేలా తెలుస్తుంది. నాకేమి జోశ్యం తెలియదు తెలిసి ఉంటే చెప్పింటా అన్నాను. “చూడు మనమిద్దరం ఇలా కలిసి సినిమాకి వెలితేనే కాదు ప్రతి రోజు మార్నింగ్ నుండి నైట్ వరకు మనం కలిసే ఉన్నా నీ మీద నాకు ప్రేమకాదు కదా కనీసం ఆ టైపు ఫీలింగ్ ఏది కూడా రాదు” అంది. కానీ నేను నిన్ను ఏమి అడగలేదే , నువ్విలా చెప్తున్నావంటే కౌశిక్ గురించి నాకు తెలియదు కానీ మీ రిలేషన్షిప్ లో నువ్వు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. పదే పదే నా లవ్ లో పడను పడను అంటుంటే అలానే ఉంది ,అన్నాను. “నేను నీకోసం చెప్తే నువ్వు నన్నే ఇన్సల్ట్ చేస్తావా” అని మూతి ముడుచుకుంది. మళ్ళీ స్టార్ట్ అయ్యాం సినిమాకి. ఆ తరువాత కాసేపటికి సినిమా స్టార్ట్ అయ్యింది. బెట్టర్ తన మూడ్ చాలా నార్మల్ అయిపోయింది సినిమా స్టార్ట్ అయ్యేటప్పటికి. సో నేనూ కొంచెం కూల్ అయ్యా. షో అయిపోయింది. బయటకి వచ్చాం.
బైక్ లో వెళ్తున్నాం , ఈవెనింగ్ అయ్యింది కదా, సో బీచ్ వ్యూ బాగుటుంది అని అటు తిప్పమన్నా బైక్ ను. తను అలానే తిప్పింది. బైక్ దిగి అలా సముద్రం దగ్గరకు మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇద్దరం. పిల్లలు, జనాలు, ఫుడ్ స్టాల్స్, ఎప్పటిలానే ఉంది బీచ్ కానీ నాలో ఉత్సాహం వాల్కెనోలా బద్దలై పొంగుతుంది, నేల మీద లేనంటే అది నిజమే. ఈ వాతావరణం ఆ బీచ్ వ్యూ నాకు అడ్వాంటేజ్ అవుతుందేమో అనుకున్నా కానీ తనకు అడ్వాంటేజ్ అయ్యింది.
తనతో టైమ్ స్పెండ్ చేయవచ్చు అనుకున్నా కానీ తను, “నేనిప్పుడు అడగబోయేదానికి నీ దగ్గర సమాధానం ఉందనే అనుకుంటున్నా” అని అంది. నేను ఒక్క క్షణం ఆగి అడగమన్నాను. “కాసేపు కౌశిక్ ను పక్కన పెట్టేద్దాము...........” అంది. నేనొప్పుడో పెట్టేశా ! అన్నాను పళ్ళు ఇకిలించుకుంటూ. “ప్లీజ్ లిసెన్” అంది గుర్రుమంటూ. ఇక సైలెంట్ అయ్యా తను కంటిన్యూ చేసింది. “ఒక వేల నేను కానీ నిజం గా నీకు పడిపోయానే అనుకుందాం (బయటకి మామూలుగానే ఉన్నా ఈ ఒక్క మాటకే నేను స్తంభించిపోయా నా ఉత్సాహం ఎవరెస్ట్ పీక్స్ లోకి వెళ్ళి నిలుచుంది) అప్పుడు ఇక నువ్వు నాతోనే లైఫ్ లాంగ్ ఉంటావా ?లేదా అందరి లాగే నాది కూడా ట్రూ లవ్ కాదని ప్రూవ్ చేయడానికే నా లైఫ్ లోకి వచ్చా అని సారీ చెప్పి ఇంకో అమ్మాయి కోసం వెళ్లిపోతావా? ఐ మీన్ నీ లైఫ్ లో ఉన్న అమ్మాయిల ఛాప్టర్లలో నాదే చివరి చాప్టర్ ఆ ? లేదా ఆ అందరిలో నాదీ ఒక చాప్టర్ ఆ? ఆలోచించి చెప్పు” అంది. తనడిగినది చాలా మంచి ప్రశ్న. కాసేపు ఆలోచించా అప్పుడు రియలైజ్ అయ్యా. వైశాలి నాలైఫ్ లో ఉండాలనుకున్నా కానీ అది లైఫ్ లాంగ్ ఆ? లేదా పెళ్లి చేసుకుని మరీనా? నాకు తెలియదు కానీ నిజంగా తను చెప్పినట్టు గా వైశాలి మాత్రం లాస్ట్ చాప్టర్ నా లైఫ్ లో, ఇంకో అమ్మాయి కోసం నేనైతే ఇక పోను అది మాత్రం కచ్చితంగా తెలుసు. ఇదే విషయం తనకు చెప్పా “అబ్బో”అంది. తనివ్వదని తెలుసు అయినా అడిగాను, తన ఫోన్ నెంబర్. నెంబర్ ఇవ్వనంది. దీన్నే నిద్ర పోతున్న దాన్ని లేపి మరీ తన్నించుకోవడం అంటారు. ఇక తన బైక్ ఎక్కి ఇద్దరం బయలుదేరాం అప్పుడు సాయంత్రం ఏడవుతుంది అనుకుంటా.
ఇక రూమ్ కు వెళ్ళా, సిద్దూ ఏదో పనిలో ఉన్నాడు . మా అమ్మకు కాల్ చేశా,ఏవో పిచ్చా పాటి మాట్లాడుకున్నాం. మా అమ్మ మాత్రం పిచ్చ హ్యాపీ ఫోన్ చేసినందుకు నేను కూడా. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే నేను ఇండియా లో ఉన్న అన్నీ రోజుల్లో కేవలం రెండు సార్లు మాత్రమే మా ఇంటికి ఫోన్ చేశా అందులో ఇదే మొదటి సారి,సో అందుకే .
అయితే ఆరోజు వైశాలి తో కలిసి ఈవెనింగ్ బీచ్ కు వెళ్ళిరావడం. నాకు మంచి ఎక్స్పీరియన్స్ యే , ఒక మంచి మెమరీ యే కాకపోతే దాని వల్ల ఆ నెక్స్ట్ డే మార్నింగ్. ఇష్టం లేకుండా బలవంతంగా భారి మూల్యాన్ని చెల్లించా. నేను ఆ మూల్యాన్ని చెల్లించింది కౌశిక్ కు. అది ఆ పేరే. నేనేదో అలా నడుస్తూ వెళ్దామనుకొని మా హోటల్ నుంచి బయటకు వచ్చి రోడ్డు క్రాస్ చేసి జస్ట్ పదడుగులు వేశా. మనోడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడో లేక నా టైమ్ బ్యాడ్ అయ్యి మేం కలిశామో, కలవడం కాదు కనబడ్డాను అంతే , పరిగెత్తుకుంటూ వచ్చి నా కాల్లర్ పట్టుకుని ముక్కు మీద గుద్దాడు. నాకేం అర్ధంకాలేదు వాడేందుకు నన్ను కొడుతున్నాడో. కింద పడిపోయా అయినా కూడా లేపి నులుచోబెట్టి నన్ను పట్టుకుని మరీ కొట్టాడు. నేను కళ్ళు మూసుకుని భయంతో లోపల కొట్టొద్దు కొట్టొద్దు అనుకుంటున్నా కానీ అది నోరు దాటి బయటకు రావట్లేదు . వైశాలి ఏమన్నా నన్ను కావాలనే వీడి దగ్గర బుక్ చేసిందా లేదా వీడే ఏమైనా మిస్అండర్ స్టాండ్ చేసుకున్నాడా లేదా ఇంకెవరినో కొట్టబోయి నన్ను కొడుతున్నాడా ఇలా చాలా ఆలోచనలొచ్చాయి ఆ టైమ్ లో. చుట్టూ హోటల్ లో స్టే చేసే వారు, రోడ్డు మీద వచ్చి పోయే వారు జనాలు చూస్తున్నారు నేను తన్నులు తినడం. కొట్టడం ఆపి “వైశాలి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, తనని కలవడం మానేయ్” అన్నాడు మొహం లో మొహం పెట్టి.
నేను ఏ స్థితిలో ఉన్నానో తెలిసి, ఇంకా ఏమవుతుందో తెలిసి కూడా నా మాటలను నేను అదుపులో ఉంచుకోలేక పోయా. “పెళ్ళా..! కంగ్రాచులాషన్స్ కానీ వైశాలి తో అంటున్నావ్, అదే కొంచెం డౌట్ గా ఉంది” అన్నాను. నాకు లోపల భయం గానే ఉంది వాడు ఇంకా గట్టిగా కొడతాడేమో అని ఈ మాటలకు. కానీ నా ఫ్లో ని నేను ఆపుకోలేక పోయా. వాడికి బాగా కాలింది నాకు ఇంకో రెండు సార్లు చెంపలు ఎరుపెక్కాయ్. “నేను తనని ప్రేమిస్తున్నాను” అన్నాడు. “అయితే ? నేనూ తనని ప్రేమిస్తునాను” అన్నాను ఏమాత్రం భయమూ బెదురూ లేకుండా ఎందుకంటే అవన్నీ లోపల ఉన్నాయ్. ఇంకో రౌండ్ వేసుకున్నాడు. లోపల కొట్టొద్దురా కొట్టొద్దురా అని వాడిని రిక్వెస్ట్ చేస్తున్నా కానీ అది వాడికి తెలియదు. “మేం చాలా హ్యాపీ గా ఉన్నాం ,ఉంటాం నువ్వు మా మధ్య వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యకు” అన్నాడు ఇంకా నా కాల్లర్ వదల్లేదు. “నేనూ అదే అంటున్నా నువ్వు మా మధ్య నుంచి వెళ్లిపోతే మేం చాలా హ్యాపీ గా ఉంటాం” అన్నాను.
కౌశిక్ గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చి వదిలాడు. కోపం లో నన్ను పిచ్చ పిచ్చ గా కొట్టాడు. జనాలు మా చుట్టూ గుమి గూడడం మొదలైంది. కౌశిక్ ఇంకా సీరియస్ గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. “తను విషయంలో నన్ను లైట్ తీసుకోవద్దు, నేను తనని నా లైఫ్ లో ఉండాలనుకుంటున్నాను కచ్చితంగా ఉంటుంది లైఫ్ లాంగ్”. అన్నాడు సీరియస్ గా నా కాల్లర్ వదిలేసి. “నన్నూ తన విషయం లో టైమ్ పాసర్ గాడిని అనుకోవద్దు, చాలా సీరియస్. తను నాకు లైఫ్ పార్టనర్ అనుకుంటున్నాను” అన్నాను. “వైశాలి నేనూ ఆల్రెడీ లవ్ లో ఉన్నాం రా” అన్నాడు గొంతు పెంచి. “వైశాలి నన్ను కచ్చితంగా ప్రేమిస్తుంది” అన్నాను. గొంతు తగ్గించే కానీ బలంగా అన్నాను. నాతో మాట్లాడడం వేస్ట్ అనుకున్నాడో ఏమో ఇక కౌశిక్ అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఈ మాత్రం దానికి మాట్లాడుకుంటే సరిపోదా? నన్ను కొట్టాలా? అనుకున్నాను. చుట్టూ ఉన్న జనాలలోంచి, మమ్మీ డాడీ అనుకుంటూ పక్కనే ఉన్న మా హోటల్ రూమ్ కి వెళ్ళాను. సిద్దు ఉన్నాడు నన్ను చూసి కొంచెం కంగారూ పడ్డాడు. ముందు క్లినిక్ కు తీసుకువెళ్ళమన్నా. అక్కడక్కడా దెబ్బలు తగిలాయి కింద పడడం వల్ల కూడా, వొళ్ళు నొప్పులు కూడా వచ్చాయ్. కనీసం నాలుగు రోజులు పట్టింటుంది నాకు తెలిసి నేను మొత్తం రికవరీ అవ్వడానికి. సిద్దు అయితే నన్ను అసలు అలా చూసినప్పటినుండి ఎవరు చేశారు,ఏమైంది ,ఎందుకు అని నానా రకాలుగా అడిగాడు. సిద్దూ కు అసలు గొడవలంటే చాలా ఆసక్తి. వాడు నా పక్కన ఉండి ఉంటే నాకు అసలు అలా దెబ్బలు తినే అవసరమే ఉండి ఉండదు. ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసన్స్ తో ఆరోజంతా గడిపాను. అప్పుడు నాకనిపించింది నేను నిజంగా అంత వీకా లేదా ఆ కౌశిక్ గాడు అంత స్ట్రాంగ్ గా అని.
ఇక ఆ నెక్స్ట్ డే టైమ్ అటూ ఇటూ పన్నెండవుతుంది అనుకుంటా నేను చూడడానికి బాగున్నా నాకు లోపల నొప్పులు నీరసం పూర్తిగా తగ్గలేదు అప్పటికి. బయటకు వెళ్ళాను సిద్దు నాతో వస్తా అన్నాడు వద్దని వారించి మరీ నేను వెళ్ళాను. వైశాలి ని కలవడానికి కాదు. కాస్త రిఫ్రెష్ గా ఫీల్ అవ్వడానికి అప్పుడు నాకు నిజంగా తనని కలవాలని లేదు కూడా. ఎందుకంటే నేను ప్రేమించే అమ్మాయి దగ్గరకు పేషెంట్ లాగా వెళ్ళి సానుభూతి పొందడం నాకిష్టం లేదు.
అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి బస్ స్టాప్ లోని బెంచ్ మీద కూర్చున్నాను. ఆ బెంచ్ పైన మిడిల్ లో నేను,ఇంకొక పెద్దాయన ఆ చివర కూర్చున్నారు. అటూ ఇటూ ఒక వంద మీటర్ల దూరంలో ఒక సిగ్నల్ కూడా ఉంది. సొ, అక్కడ ఆగిన వెహికల్స్ ను నేను చూస్తూ వాళ్ళు నన్ను చూస్తూ ఉన్నారు. అయితే మేం కూర్చున్న బస్ స్టాప్ పక్కనే ఒక చిన్న సందు ఉంది. ఆ సందులో ఒక హోటల్ కూడా ఉంది. మరీ అంత చిన్న హోటల్ కాదు గాని చెప్పుకోదగ్గ హోటల్ యే . అయితే మేం కూర్చున్న బస్ స్టాప్ నుండి అయితే మేం వెనక్కి చూస్తే చాలు కనబడుతుంది ఆ హోటల్, పేరు “అనూష హోటల్”.
మాకు ఆ హోటల్ కు మధ్య బస్ స్టాప్ గోడ మాత్రమే అడ్డు. ఆ హోటల్ లో పని వాళ్ళు ఐదారు మంది మగవారు ఆ హోటల్ ను కడుగుతుంటే నలుగురు ఐదుగురు ఆడవారు సామనులనన్నింటిని తోముతున్నారు. వాళ్ళంతా చాలా కష్టపడి పని చేస్తున్నారు అనుకున్నా కానీ అటుగా వెళ్తున్నా ఒక పెద్దాయన చెప్పేంతవరకు నేనా విషయం గమనించలేదు. అక్కడ పని చేస్తున్న వాళ్ళంతా కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుంటూ పనిచేస్తున్నారు ఒక అమ్మాయి తప్ప ఆ అమ్మాయి ముభావంగా పనిచేస్తుంది . వాళ్ళందరూ చాలా ధుఃఖం లో ఉన్నారని నాకప్పుడు అర్ధమైంది. ఆ పెద్దాయన నా పక్కన కూర్చున్న ముసలాయనతో చెప్పాడు “మనం ఇక ఇక్కడ తినలేం ఈ హోటల్ మూసేస్తున్నారంట అంతా ఆ వెధవ వల్లే , పాపం అందరూ ఏడుస్తున్నారు” అన్నాడు ఆ పెద్దాయన. వాళ్ళను ఏం జరిగిందని అడుగుదామనుకున్నా కానీ వాళ్ళు లేచి వెళ్లిపోతున్నారు కనుక నేను ఆపలేదు.
అయితే ఆ హోటల్ లో పనిచేసే ఒకడు బయటకు వచ్చాడు చెత్త పారవేయడానికి , ఎందుకో నేను టక్కున అతని దగ్గరకు వెళ్ళి ఏం జరిగుతుంది ఇక్కడ అని అడిగాను. మా బాధలు మీకెందుకు సార్ అన్నాడు విసుగ్గా. నేను ఇంక సైలెంట్ అయిపోయా కానీ అతనే మళ్ళీ చెప్పాడు. “అక్కడ ఉన్న ఆమె పేరు అనూష మా ఓనర్ సార్, ఆమెకింకా పెళ్లి కాలేదు. ఆమె మాలా ఏడవట్లేదు కానీ లోపల చాలా బాధ పడుతుంది. మా అందరికీ ఈ హోటల్ పోతుందని భాద ఉంది కానీ అంతకన్నా ఎక్కువ ఆమె చేతుల్లోంచి ఆమె జీవితమే పోతుందని బాధ గా ఉంది సార్. వాళ్ళకి ఉన్నదల్లా ఒక ఇల్లు. అనూష అమ్మనే నే వాళ్ళ కుటుంబాన్ని పోషించాలి వాళ్ళ ఇంట్లో అంతో ఇంతో చదువుకున్నది అంటే అది ఆమెనె. ఇక వాళ్ళ తమ్ముడు చదువుకుంటున్నాడు. ఆమె చదువు తరువాత పనికిపోతే వాళ్ళ జీవితాలు బాగుపడవని తెలిసి ఒకడి దగ్గర అప్పు చేసింది ఈ హోటల్ పెట్టాడానికి . రమేష్ వాడి పేరు, వాడు చాలా డేంజర్ అని కొంత మంది చెప్పారు కూడా కానీ మాకు అప్పు ఇచ్చే దిక్కు వాడే అయ్యాడు. ఇచ్చేటప్పుడు వాడి నటన కు అనూష అమ్మ లొంగిపోయింది . ఎవరైనా అంతే వాడు అంత జాదూ గాడు. ఈ హోటల్ అనూష అమ్మ ఇంటిని, మా ఇళ్ళని కూడా ఒక రకం గా పోషిస్తుంది. ఇంతకాలం బాగానే నడిచింది హోటల్. కానీ ఈ మధ్య ఏమైందో కానీ వ్యాపారమే లేదు. దాంతో వాడికి మానుంచి వడ్డీ డబ్బులు కూడా ఆగిపోయింది. “ఇక ఇప్పటికే లేట్ అయ్యింది మీ వల్ల కాదు అప్పుతీర్చటం , హోటల్ ను నాకు హ్యాండ్ ఓవర్ చేయండి” అన్నాడు. మేము దానికి సరే అన్నాం కానీ ఇంకా అప్పు తీరలేదు మీ ఇల్లు కూడా రాసి ఇవ్వాలి అన్నాడు. వాడి అప్పు మేం తీర్చలేం అది నిజమే అలాగని అనూషమ్మ ఇల్లు ఇచ్చేస్తే అమ్మా నాన్న తమ్ముడు ఎక్కడుంటారు.? అందుకే కుదరదు అంది అయితే అనూషను వాడికి ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. వాళ్ళ అమ్మా నాన్నలు వద్దన్నారు వేరే దారి లేదని వాళ్ళని అనూషమ్మే ఒప్పించింది. వాడితో పెళ్లి ఎవ్వరికీ ఇష్టం లేదు. అదే ఛానా బాధ గా ఉంది. మీరేందుకు అడిగారో తెలియదు నేను అపుకోలేక చెప్పేసా అని కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు.
అతను చెప్పింది విన్న తరువాత అనూషను చూసా.కొంచెం నలుపు, సన్నగా ఉంది. ఒళ్ళంతా చెమటలతో విసుగు లేకుండా పని చేస్తుంది ముభావంగా ఉంది. జుట్టు ముడి వేసుకుని, చీరలో చాలా చక్కగా ఉంది. రెండు నిమిషాలు ఆగి నేను నా స్టైల్ లో హోటల్ లోకి ఎంటర్ అయ్యా. నా స్మైల్, ఆటిట్యూడ్ ఏదీ తగ్గకుండా నాకు ఎందుకు అలా చెయ్యాలనిపించిందో తెలియదు. ఇంతవరకు నేను ఆ మాట చాలా మందికి చెప్పా మొన్న మొన్న వైశాలికి కూడా చెప్పా కానీ ఈ స్థితిలో ఉండే ఏ అమ్మాయికి నేను చెప్పలేదు ఆ మాట అనూషకు చెప్తే ఏమంటుందో వినాలని అనుకున్నా ఏమన్నా వినాలని అనుకున్నా. గేట్ తీసుకుని లోపలికి వెల్లాను తను నేల తుడుస్తూ ఉంది కిందకు వంగి తన ముందు నుంచున్న రెండు క్షణాల తరువాత నన్ను గమనించింది తల పైకెత్తి నన్ను చూసి లేచి నుంచుంది. “మీరెవరు?” అని అడిగింది. చుట్టూ ఉన్న తన వాళ్ళు పనులు ఆపేసి మా వైపే చూస్తున్నారు. నేను చిరునవ్వుతో మీరు నాకు చాలా నచ్చారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పా నాకు బాగా గుర్తు.
చుట్టూ ఉన్న వాళ్ళు లేచి నిలబడ్డారు. అనూష కాసేపు నన్ను అలానే చూసి మళ్ళీ ముభావంగా తన పని తను చేసుకుంటుంది. నేను తన రిప్లై అదే అని అర్ధం చేసుకుని మళ్ళీ వచ్చి బస్ స్టాప్ మీద వాలిపోయా. ఈసారి చాలా బాగుంది ఉత్సాహంగా సిగరెట్ వెలిగించి ఎంజాయ్ చేస్తున్నా ఆ మూడ్ ను. అప్పుడే నా దగ్గరకు వైశాలి వచ్చింది. కౌశిక్ నన్ను కొట్టిన విషయం తెలిసి మార్నింగ్ నుండి నాకోసం ఎదురుచూస్తుంది, అంట నేనెక్కడైనా కనబడతానేమోనని సారీ చెబుదామని ఇక బస్ స్టాప్ దగ్గర నేను కనబడేసరికి నా దగ్గరకి వచ్చింది. సారీ చెప్పింది. ఇక తన ఫ్రెండ్స్ గురించి చెబుతూ ఉంది నేనూ వింటూ ఉన్నాను.
ఒక పదిహేను నిమిషాల తరువాత అనుకుంట మేము ఇంకా ఆ బెంచ్ మీదే కూర్చున్నాం అనూష నా ముందుకు వచ్చి నిలబడింది. తను నా దగ్గరకు వస్తుంది అనుకోలేదు. కన్నీళ్ళ తో నే చెప్పింది “మీరెవరో నాకు తెలియదు నన్ను ప్రేమిస్తున్నా అంటున్నారు కానీ మీతో ప్రేమ పెళ్లి నాకు రాసి పెట్టలేదండీ. నేను మొన్నటి వరకు నాకంటూ ఒకడు వస్తాడు నాతో అలా ఉంటాడు ఇలా ఉంటాడు అని చాలా ఆశలు పెట్టుకున్న. కానీ అవన్నీ నిజం కావని అర్ధమయ్యాక నాకు నా గురించి ఆలోచనే లేదు. జీవితాంతం వాడితో నన్ను నేను పంచుకోవాలి ఇష్టం లేకున్నా ఇప్పుడు మీరు నా లైఫ్ లోకి వచ్చారు మీ తరువాత ఇంకెవరైనా నా లైఫ్ లోకి వస్తారా అంటే ఛాన్సే లేదు అది కళే. ఇష్టం లేని వాడితో కలిసి ఉండడం కన్నా ముక్కు మొఖం తెలియని మీతో కనీసం ఒక్కసారి కలిసినా అందులో సుఖం, తృప్తి ఉన్నా లేకున్నా ప్రశాంతత, మనశ్శాంతి నాకు దొరుకుతుందనిపిస్తుంది కాబట్టి నన్ను మీతో పంచుకోవాలనుకుంటున్నా ప్లీజ్ కాదనకండి” అన్నది. నాకు ఏం జరుగుతుందో అస్సలు అర్ధం కాలేదు కానీ అనూష ఎంత డిస్టర్బ్ అయ్యిందో అర్ధమైంది. తను అన్న ఆ మాటలకు నేను చలించిపోయా వెంటనే ఆ రమేష్ గాడిని ఇక్కడికి పిలిపించమన్నా. అనూష వద్దు అంది నేను బలవంతం చేసి వాడిని రప్పించా. రమేష్ వచ్చాడు విత్ హిస్ గాంగ్.
మరి మనం వస్తావా, నన్ను రమ్మంటావా అని బెదిరించాం , ఎలాగో వాడే వస్తా అన్నాడు కాబట్టి సరిపోయింది అదే నన్ను రమ్మంటే ఇక నేనైపోయింటా. మేం బస్ స్టాప్ దగ్గరే ఉన్నాం వాడు వచ్చీ రాగానే అనూష పక్కన నుంచున్న నా మొహం చూసి ఎవరు నువ్వు అని అడిగాడు. అనూష ను చూపిస్తూ వీళ్ళ అప్పు ఎంత అని అడిగా. హోటల్ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు . “తొమ్మిది లక్షలు” అన్నాడు రమేష్ పొగరుగా. వెంటనే ఒక ఫోన్ చేశా యూయస్ లో మా వాళ్ళకి అమౌంట్ చెప్పి ఒక అకౌంటు కి ట్రాన్సఫర్ చేయమన్నాను, రమేష్ కి ఫోన్ ఇచ్చా బ్యాంక్ అకౌంటు డీటైల్స్ చెప్పమ్మన్నా, అతను ఒక్క నిమిషం నా మొహం, అనూష మొహం చూశాడు సందేహంగా. తరువాత చెప్పాడు అంతే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అమౌంట్ క్రెడిట్ అయిపోయింది రమేష్ బ్యాంక్ అకౌంటు లో. రమేష్, అనూష, వైశాలి, వర్కర్స్ అందరూ కొంచెం షాక్ అయ్యారు అక్కడ జరిగిందానికి.
మళ్ళీ హోటల్ అనూష పేరు మీదకు మారాలి రేపే రిజిస్ట్రేషన్. ఒక్క కాల్ తో నీ అకౌంటు బ్యాలెన్స్ పెంచేశాను అదే ఇంకొక్క కాల్ తో నీ అకౌంటు లేకుండా చెయ్యగలను ఇంకోసారి ఇలా ఎవరినైనా చీట్ చేసినా చెయ్యాలని చూసినట్టు నాకు తెలిసినా ఇంకా నీ అకౌంటు డీటైల్స్ నా దగ్గరే ఉన్నాయి అకౌంటు ఏమైనా అయిపోద్ది అని ఫేస్ చూస్తూ వార్నింగ్ ఇచ్చా. వాడేం మాట్లాడలేదు. ఇక బయలుదేరు అని నేను చెప్పాకే వాడు వెళ్ళాడు, వెళ్ళాడండీ సైలెంట్ గా.
ఆ తరువాత వర్కర్స్ నాకు చేతులు ఎత్తి నమస్కరించారు వద్దన్నా థాంక్స్ ల మీద థాంక్స్ లు చెప్పారు. ఆ తరువాత అనూష “నన్ను క్షమించండీ ఇందాక తప్పుగా మాట్లాడేశాను.”
పర్లేదు మీ ప్లేస్ లో నేను ఉన్నా అలానే మాట్లాడేవాడినేమో మీరేం పట్టించుకోవద్దు దానిగురించి.
“మీరెవరో కూడా తెలియకుండా మీ నుంచి ఇంత పెద్ద సహాయం తీసుకోలేను ఎవరు మీరు?”
నాపేరు నారాయణ దాస్ అమెరికాలో ఉంటాను కొద్ది రోజులు ఇండియా కు వచ్చాను. మా నాన్న బిజినెస్ మ్యాన్ అందుకే నాకు చెప్పుకోవడానికి ఏ జాబూ లేదు. ఇంకేమైనా కావాలా.?
“ఆ! చాలు అండి మీ కాంటాక్ట్ డీటైల్స్ ఇస్తే కుదిరినప్పుడల్లా మీ బాకీ కొంచెం కొంచెం తీర్చేస్తాను”.
నాకు కావలిసినప్పుడు నేనే అడుగుత అంత వరకు మీరేం టెన్షన్ పెట్టుకోకండి.
“మరి, ఇందాక మాట్లాడింది.......?” అని కొంచెం ఇబ్బంది గానే అడిగింది.
నేనప్పుడో మర్చిపోయాను అన్నాను.
“థాంక్స్ అండి ఇక నేను వెళ్తాను పనుంది. రేపు రిజిస్ట్రేషన్ కు వస్తారుగా కలుసుకుందాం.”
సరే అన్నాను.
“బై అనూష” – వైశాలి.
“బై” – అనూష
అక్కడినుంచి బయలుదేరాం మధ్యలో , “నువ్వు చాలా గ్రేట్, నీలా ఎవ్వరూ హెల్ప్ చేయ్యరు తెలుసా!?” అంది వైశాలి. నేనేం అంత గ్రేట్ కాదు వాళ్ళకి హెల్ప్ చెయ్యగల ఎబిలిటీ ఉంది కాబట్టే చేశా, ఎవ్వరైనా అంతే అన్నాను. తను నాకు ఇంప్రెస్ అయ్యింది. ఆ తరువాత నాకు తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది.
“తరువాత మేం కొంచెం క్లోస్ అయ్యాం లైక్ ఫ్రెండ్స్, తను షాపింగ్ కు టెంపుల్ కు ఔటింగ్ కు ఈవెనింగ్ టీ తాగడానికి కూడా నన్ను పిలిచేది. నేను, సిద్దు, వైశాలి ముగ్గురం కలిసే వెళ్ళేవాళ్ళం. అఫ్కోర్స్ కౌశిక్ ను కూడా రమ్మని పిలిచేవాళ్ళం ప్రతి సారి కానీ తను ఎప్పుడూ రాడు. వచ్చినా అంత ఫ్రీ గా ఉన్నట్టు నాకు అనిపించదు. అవును దానికి ఏ కారణమైనా ఉండవచ్చు అది నాకూ కొంచెం ఇబ్బంది గా ఉన్నా నేను ఏం చెయ్యలేదు ఎందుకంటే ఐ వాంట్ టు బి విత్ హర్ అట్ యనీ కాస్ట్. అందుకే నేను అతని ఫీలింగ్స్ ను పట్టించుకునే వాడిని కాదు”.
“చూస్తూ చూస్తూ మేము చాలానే క్లోస్ అయిపోయాం. తను ఎప్పుడూ కౌశిక్ గురించి మాట్లాడినా వెంటనే నేను టాపిక్ మార్చేస్తా ఎందుకో తెలియని ఇబ్బంది వల్ల. వైశాలి తన తో కాల్ లో ఉన్నప్పుడు నా కాల్ ని హోల్డ్ లో పెడుతుంది నాతో కాల్ లో ఉన్నప్పుడు కౌశిక్ ను హోల్డ్ లో పెడుతుంది ఇదంతా ఏమి దాచలేదు. మా ఇద్దరికీ తెలుసు తను మమ్మల్ని సమానంగా చూస్తుంది అని అయినా సరే నాకు నా మీద ఎక్కడా కాన్ఫిడెంట్ తగ్గలేదు. కానీ కౌశిక్ ఎలా ఫీల్ అవుతున్నాడో నాకు తెలియదు. వైశాలి మార్కెట్ నుండి ఫ్రెండ్ పెళ్లి వరకు తను ఎక్కడికి వెళ్ళినా నన్నూ ఆహ్వానించేది నేనూ నో చెప్పకుండా వెళ్ళేవాడిని. మేం చాలా ప్లేసెస్ చూశాం కలిసి. నన్ను తన ఫ్రెండ్స్ అందరికీ కూడా పరిచయం చేసింది.
ఆ తరువాత ఒక రోజు ఉదయం పదకొండు గంటలకు వైశాలి, నేను అనుకోకుండా కలిశాం. తను ఆరోజు ఫ్రీగా ఉన్నానని చెప్పింది కౌశిక్ ను పిలించింది లాంగ్ డ్రైవ్ లేదా టెంపుల్ కి వెళ్దామని కానీ అతను బిజీ అన్నాడంట.ఏమీ చేయకుండా కాళీగా ఉంటే డే వేస్ట్ అయిపోతుందని “నువ్వు ఫ్రీ అయిన తరువాత వచ్చి మాతో జాయిన్ అవ్వు. నేను, నారీ కలిసి బయటకు వెళ్తున్నాము, కాల్ చెయ్యి” అని కౌశిక్ కు మెసేజ్ పెట్టి. ఇంట్లోంచి బయలుదేరింది తన బైక్ లో. తను ఉన్న ఏరియా ను దాటేసి బయటకు వస్తుండగా రోడ్డు లో నేను ఎదురు పడ్డాను నా కార్ లో. తను లాంగ్ డ్రైవ్ లేదా టెంపుల్ కు వస్తావా అని అడిగింది. నేను సరే అన్నాను.తన బైక్ అక్కడే వదిలేసి నా కార్ ఎక్కింది.
ముందు లాంగ్ డ్రైవ్ అనుకునే స్టార్ట్ అయ్యాము కానీ ఎందుకో గుడికి వెళ్దాం అంది మధ్యలో, నాకూ గుడికే వెల్దామనిపించింది కాబట్టి సరే అన్నాను. శివుని గుడికి వెళ్ళి చాలా సేపు ఉన్నాం అక్కడే. కొండ కింద గుడి అది. కాబట్టి చుట్టూ చెట్లతో,చిన్న చిన్న పక్షులు , ఉడతలతో ఎంతో ఆహ్లాదకరం గా ఉంది ఆ గుడి ఆవరణ.ఒక చెట్టు కింద బండ రాయి మీద కూర్చుని ఏవేవో మాట్లాడుకొని నవ్వుకున్నాం ప్రసాదం తింటూ. ఏం మాట్లాడామొ గుర్తులేదు కానీ అక్కడ నేను చాలా ప్రశాంతత ని ఆస్వాదించాను. నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయిన వాటిలో అది ఒకటి. ఈ హాయి ని పూర్తిగా మరచిపోక ముందే ఇంకొక మంచి విషయం నాకు జరిగింది. అది ఆరోజు నేను తనని ముట్టుకోవడానికి చాలా ట్రై చేశా కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా తనని కావాలనే టచ్ చేశా చాలా సార్లు తను పట్టించుకోలేదు. కానీ నేను ఆగలేదు ఎందుకంటే తను ఆరోజు అంత అందంగా ఉంది నావల్ల కావట్లేదు తనని టచ్ చెయ్యకుండా ఉండలేక పోతున్నాను,గుడి లో ఉన్నంత సేపు అటువంటి ఆలోచనలు రాకుండా నన్ను నేను అదుపులో పెట్టుకున్నాను. గుడి లో చాలా సేపు గడిపి, బయలుదేరేటప్పుడు నన్ను తను ఇంటికి ఆహ్వానించింది కాఫీకు. నేను ఇంక ఛాన్స్ వచ్చింది అనుకున్నా వెంటనే గుడి నుండి తన ఇంటికి వెళ్లాము.
ఎప్పటిలాగే వాళ్ళ ఇల్లు చాలా నీట్ గా ఉంది. ఇంట్లో వాళ్ళ నాన్న గారు లేరు “బయటకు వెళ్ళి ఉంటారు” అని చెప్పింది. కానీ ఇవేవీ నాకు కనబడడం లేదు ప్రస్తుతం నా ద్యాస అంతా తన మీదే ఉంది . తను ఇల్లెలా ఉంది అని అడిగింది , ఇంటిని తిరిగి చూసే ఓపిక కూడా లేదు . తనని ఎప్పెడెప్పుడు దగ్గరికి తీసుకుందామా! అని ఉంది కానీ అడిగింది కాబట్టి చాలా బాగుంది అన్నాను చూడకుండానే . నన్ను సోఫాలో కూర్చో మని తను కాఫీ తెస్తాను అని వెళ్ళింది. తను వెళ్తుంటే తన వీపును చూసా అలా శిలలా చూస్తూన్న తనని. ఆ చుడీదార్ ఎవడు తయారు చేసాడోగానీ దండం పెట్టాలి మరీ తనని ఇంతందం గా చూపించాలా.?! అంత చక్కగానా.?! అనిపించింది.
తను కాఫీ తెచ్చి ఇచ్చింది , తాగేసా, నేను అదును కోసం వెయిట్ చేస్తున్నాను, “కాఫీ ఎలా ఉంది?” అని అడిగింది. చాలా బాగుంది అన్నాను.”థాంక్స్” అంది . “ఇక నీకు లేట్ అవుతుందేమో నువ్వు ఇక బయలుదేరు” అంది. మానవత్వమే లేకుండా బయలుదేరమంది నన్ను. ఇక నేనూ లేచి నుంచున్నాను వెళ్ళడానికి కానీ వెళ్తూ వెళ్తూ చటుక్కున వెనక్కి తిరిగి తనని గట్టిగా ఒక్క ముద్దు పెట్టుకున్న ఆల్మోస్ట్ ఫ్యూ సెకండ్స్ తనని హోల్డ్ చేసి పట్టుకున్నాను. ఆ తరువాత తను నన్ను తోసేసి వెనక్కి జరిగింది అప్పుడు నేను తన కళ్ళల్లో చూసా తను చాలా సిగ్గు పడుతోంది నా కళ్ళలోకి చూస్తుంది , కానీ అదే చిరునవ్వుతో నన్ను బయటకి గెంటేసింది. నేనూ అంతకు మించి నాకు అదృష్టం లేదని తృప్తి తో అక్కడినుంచి వెళ్ళిపోయా.
ఇదిలా ఉండగా ఆ తరువాత ఒక రోజు కౌశిక్, వైశాలి ని పెళ్లి గురించి అడిగాడు పార్క్ లో.
“పెళ్ళా..?” - వైశాలి
“ఆ అదే , మన పెళ్లెప్పుడు?” – కౌశిక్
“నేను ఇప్పుడే, పెళ్లి చేసుకోలేను”.
“ఏ? ఎందుకు?”. (ఆశ్చర్యంగా అడిగాడు కౌశిక్)
“నాకు నీ మీద ఉన్న అదే ఇష్టం అదే కేర్. నువ్వు నాకు ఎంత ఇంపార్టంట్ అని ఫీల్ అవుతున్నానో దాస్ మీద కూడా అవే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి అనిపిస్తుంది”.
“అంటే?ఏమంటున్నావ్ ?”(అసహనంగా ఆ అరిచాడు)
“మీరిద్దరూ నాకు ఒకటే. మీ ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అంటే అది ఎవరా అని ఆలోచిస్తూ ఉంటానే కానీ సమాధానం మాత్రం ఎప్పటికీ చెప్పలేను”.
“నువ్విలా చేస్తావ...........”[పూర్తి చేయకుండానే]
“నేనూ అనుకోలేదు దాస్ ను ఇంతలా నా లోకి తీసుకుంటానని వద్దు వద్దు అనుకుంటూనే వాడిని నేను చాలా ఇష్టపడుతున్నాను”.
అది విన్న తరువాత వెంటనే అక్కడినుండి వెళ్ళిపోయాడు కౌశిక్ ఏం మాట్లాడకుండా కోపం తో.
వైశాలి అలా చూస్తూ ఉండిపోయింది.
సాయంత్రం అవుతూవుంది, వైశాలి అప్పుడే ఇంటికి వచ్చింది. వాళ్ళ నాన్న గారు ప్రభాకర్ గారు అప్పుడే మెట్లు దిగుతూ వచ్చారు. వైశాలి తనకు కౌశిక్ కు మధ్య జరిగిన విషయం తన తండ్రికి చెప్పాలని అనుకుంటూ ఉంది. వాళ్ళ నాన్న మెట్లు దిగుతూ వైశాలి ని చూసి “ఏంటి తల్లీ ఇప్పుడే వచ్చావా?, కాఫీ ఇవ్వనా” అని అడిగాడు. నాన్న, కౌశిక్ నన్ను పెళ్లి గురించి అడిగాడు అని గొణుగుతూ చెప్పింది. మొహం లో చిరునవ్వుతో “హమ్మయ్య నేను ఎప్పుడెప్పుడా అనుకుంటున్నాను , అయితే నీదే లేటు నువ్వు సరే అంటే వెంటనే పెళ్లి పనుల్లోకి నేను దిగిపోతాను” అన్నారు వాళ్ళ నాన్న.“నాన్న, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేను నాన్న”. ఆయన మొహం లో చిన్న కలవరింత “ఏమైనా సమస్యా ? లేదా మీరే ఏమైనా గొడవ పడ్డారా?”అని అడిగారు.“లేదు నాన్న” అని మొత్తం చెప్పింది వైశాలి.
మొత్తం విన్న వాళ్ళ నాన్న
“నువ్వనేది............”
“నాకు ఇద్దరూ ఇంపార్టంట్ యే నాన్న ఒకరు ఎక్కువని ఒకరు తక్కువనీ కాదు. చాలా స్పెషల్ నాకు వాళ్ళిద్దరూ. ఆయన ముఖం లో ఏ భావమూ లేదు. ఆయన ఒక పక్కకు తిరిగారు. వైశాలి ముఖం చూడట్లేదు.
నాన్నకు మొత్తం అర్ధమయ్యేలా చెప్పడానికి ఆయన పక్కకు వెళ్ళి ప్రయత్నించింది. “నేను చెప్పేది విను నాన్న” అని చెప్పడం ప్రారంభించింది.
“కొత్తగా పెళ్ళయిన ఒక అమ్మాయిని తీసుకుందాం. కొత్తగా పెళ్ళయి హ్యాపీ గా ఉండి కొంత కాలానికి సడన్ గా తన భర్త చనిపోతే ఆ తరువాత మళ్ళీ పెళ్లి చేసుకుని హ్యాపీ గా ఉన్నవారు చాలామంది ఉన్నారు. అవునా నాన్న?” అని అడిగింది . “అయితే” అన్నారు వాళ్ళ నాన్న, మొహం పక్కకు తిప్పి వైశాలి ని చూడకుండానే. ఆయన చాలా అసహనంగా ఉన్నారు. “ఇందులో ముందు పెళ్లి చేసుకున్న వారు చాలా స్వచ్ఛంగా ప్రేమించుకుంటారు. అలాగే రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ ఆడది తన రెండో భర్త ను అంతే స్వచ్ఛంగా ప్రేమిస్తుంది. అలా అని మొదటి భర్త ను తక్కువగాను రెండవ భర్తను ఎక్కువగాను ప్రేమించదు అలాగే ఇద్దరినీ కల్మషం లేకుండా ప్రేమిస్తుంది, చాలా నిజాయతీ గా ప్రేమిస్తుంది. కానీ వాళ్ళిద్దరి ప్రేమను ఎప్పుడూ కంపేర్ చెయ్యదు అన్లెస్ వాళ్ళలో ఎవరైనా తనకు ద్రోహం, మోసం,లేదా ఇంకేమైనా చేసి ఉంటే తప్ప.
అప్పుడు ఇప్పుడు ఆ ఆడది వాళ్లిద్దరిని స్వచ్ఛం గానే ప్రేమిస్తుంది. తను ఇక్కడ ఏ తప్పు చెయ్యడంలేదు. అవునా నాన్న?. అని సూటిగా చూస్తూ అడిగింది వాళ్ళ నాన్నను.
వైశాలి వైపు చూడకుండానే మొహం చిట్లించుకుంటూనే “అవును , అయితే?” అన్నారు.
“నేనూ ఇక్కడ ఏ తప్పు చేయట్లేదు అని చెప్తున్నా నాన్న”.
“అది వేరు ఇది వేరు. దానికి దీనికి చాలా తేడా ఉంది. అక్కడ ప్రయాణం,చావు, బ్రతుకు ఆ తరువాత తోడు కావాలి కాబట్టి తప్పు లేదు. కానీ ఇక్కడ ఇంకా ప్రయాణమే మొదలు పెట్టలేదు” అన్నాడు చాలా కఠినంగా.
కాసేపు ఇద్దరి మధ్యలో ఆ ఇంట్లో నిశ్శబ్దం నెలకొంది.
నెమ్మదిగా వాళ్ళ నాన్న అన్నారు “నువ్వు చెప్పేది సగం అర్ధం అవుతుంది సగం అర్ధం అవ్వట్లేదు, బహుశా నీకు ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియక ఇలా అంటున్నానేమో. కానీ నువ్వు చెప్పిన విషయానికి నేనూ ఒకటి చెప్పాలి రెండవ పెళ్లి చేసుకుని జీవితాలని నాశనం చేసుకున్నవారు కూడా చాలా మంది ఉన్నారు నీకా విషయం తెలియదనుకుంటా (అని సూటిగా వైశాలి కళ్ళలోకి చూస్తూ చెప్పారు ఆ చివరి మాట) , అసలు ఇప్పుడు ఏమంటావ్ మొత్తానికి ?”
“అదే అర్ధం కావట్లేదు నాన్న!”.
“మీ ముగ్గురికీ పెళ్లి చెయ్య మంటావా? (వెటకారంగా అడిగారు వాళ్ళ నాన్న)
“నాన్న!”
“ఇంకేం చేయ్యాలి నువ్వే చెప్పు, సరే ఒక వేళ ఈ సమాజం చట్టాలు ఏమంటారు అనేది కాసేపు మర్చిపో. నేను నిన్ను, కౌశిక్ కు నారాయణ కు ఇచ్చి పెళ్లి చేశాననుకో ఆ తరువాత నువ్వు ఇంకో ఇద్దరిని తీసుకు వచ్చి వీళ్ళు కూడా నాకు చాలా స్పెషల్ నాన్న, చాలా ఇంపార్టంట్ అని అనవని గ్యారంటీ ఏంటి.? (అని గట్టి గట్టి గా అరుస్తూ అడిగాడు)
“నాన్నా!” అని ఒక్క అరుపు అరిచింది వైశాలి అది విన్న ఎవరైనా చెప్తారు తన గుండె బద్దలైపోయింది అని. “నేనస్సలు అనుకోలేదు నాన్న.......” [ముగించేలోపే]
“నేనూ అనుకోలేదు రా, నా బంగారు తల్లి ఇలా అంటుందని.”
వైశాలి ఎంత ఆపుదామనుకున్నా తన వల్ల కావట్లేదు ఏడుపు తన్నుకొస్తుంది.
ఏడుస్తూ “నువ్వు నన్ను అర్ధం చేసుకుంటా.........”[ముగించే లోపు]
“నువ్వే అర్ధం చేసుకోలేదు రా ఇంకా! , నీ మనసు వ్యభిచారం చేస్తుందని!” అన్నారు. (బాధ కనబడింది ఆ మాటలో)
కన్నీళ్ళు ఆగిపోయాయి ఒక్క సారిగా వైశాలి కి, మళ్ళీ ఏడుస్తుంది గుండెలో తడి ఆరిపోయేలా.
“ఏం చేయ్యాలనుకున్నా బాగా ఆలోచించి చెయ్యి”. - నాన్న
ఇంత సేపూ తన తండ్రి అవసరమైతే తప్ప వైశాలి మొహం చూసి మాట్లాడిందే లేదు. కనీసం తను ఏడుస్తున్నప్పుడు కూడా.
వైశాలి, నాన్న మొహం చూసి ఏం మాట్లాడకుండా తన గదికి వెళ్ళిపోయింది.
అప్పుడు నేను కాల్ చేశాను రెండు మూడు సార్లు వైశాలికి, తనకు ఇచ్చిన ముద్దు గుర్తు చేసుకుంటూ, కానీ వైశాలి ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు.
మరుసటి రోజు, వైశాలి ఉదయాన్నే బయటకి వెళ్ళింది ముందు రోజు నైట్ అంతా కూడా ఆ ఇంట్లో జరిగిన ఆ విషయమే తలుచుకుంటూ చాలా లేట్ గా నిద్రపోయింది. తను తన బెస్ట్ ఫ్రెండ్ ను కోల్పోయింది. తన మొహం లో నిన్నటి వరకూ ఉన్న కళ ఇప్పుడు లేదు ఏడ్చి ఏడ్చి విషాదం తో తను చూడడానికి ఒక రోగి (పేషెంట్) లాగా ఉంది.
వైశాలికి కౌశిక్ కాల్ చేశాడు. ఫోన్ ఎవ్వరూ లిఫ్ట్ చెయ్యలేదు (ఫోన్ తన రూమ్ లో ఉంది). కౌశిక్ వైశాలి ఇంటికి వెళ్ళాడు తన బైక్ మీద వైశాలి కోసం. తను ఇంట్లో లేదు అని ఎక్కడికో వెళ్ళిందని చెప్పారు వాళ్ళ నాన్న. కౌశిక్ బైక్ ను వెనక్కి తిప్పాడు కానీ వెళ్ళేముందు వాళ్ళ నాన్న ని అడుగుదామనుకున్నాడు వాళ్ళ పెళ్లి గురించి కానీ ఎందుకైనా మంచిది ఒక్కసారి వైశాలి ను కలిశాక అడుగుదామనుకుని బయల్దేరి పోయాడు. తన ఫ్రెండ్స్ ను కూడా కనుక్కున్నాడు ఎవ్వరి దగ్గర ఆన్సర్ లేదు వైశాలి ఎక్కడ ఉందో అని. ఇక కౌశిక్ ఆఫీసు కి వెళ్ళిపోయాడు.
ఇక నారీ కూడా అంతే వైశాలి కి కాల్ చేశాడు. ఎవ్వరూ కాల్ ఎత్తలేదు. ఇక తనే తిరిగి కాల్ చేస్తుందని తన నుంచి రిప్లై కోసం ఎదురు చూస్తున్నాడు.
మధ్యాహ్నం అయ్యింది , వైశాలి మార్నింగ్ నుండి టెంపుల్, పార్క్, ఫ్రెండ్స్ తో ఫోన్ కాల్, మార్కెట్ , మాల్ ఎక్కడకు వెళ్లాలనిపిస్తుందో అక్కడికి వెళ్తుంది కాసేపు అక్కడే ఉంటుంది ఎక్కడ ప్రశాంతత ఉంటుందనిపిస్తుందో అక్కడికి వెళ్తుంది వెతుక్కుంటూ.
అవును తను వాలిద్దరికీ ఇద్దరికీ జరిగింది చెప్పవచ్చు కానీ ప్రయోజనం లేదు అనుకుంది.
కౌశిక్,నారీ మళ్ళీ కాల్స్ చేశారు తనకు కానీ ప్రయోజనం లేకపోయింది. వాళ్ళ నాన్న కూడా కూతురు ఎక్కడుందో చూశాడో ఇల్లంతా, ఎక్కడా కనిపించలేదు. తన గదిలోనే తన ఫోన్ ను చూశాడు. ఇక వైశాలి ఫ్రెండ్స్ కు కాల్ చేశాడు వాళ్ళలో ఒకరు తనతో మాట్లాడినట్లు చెప్పారు.
“కానీ మీరు చెప్పినట్టు తనని మీరు తిట్టినట్టు, మీ మధ్య గొడవైనట్టు తను నాకేం చెప్పలేదు అంకుల్. కలవాలనిపించింది అందుకే మీ ఇంటికి వచ్చా అని చెప్పింది తన ఫోన్ కూడా తీసుకురాలేదని చెప్పింది ఆ తరువాత కాసేపు పిచ్చాపార్టీ మాట్లాడుకున్నాం తరువాత వెళ్ళిపోయింది.. కానీ తను డల్ గా ఉందనిపించింది అంకుల్ ఎందుకని అలా ఉన్నావు అని అడిగితే ఏం లేదు అనే చెప్పింది అంకుల్”. అన్నది వైశాలి ఫ్రెండ్ భాను.
“అంతేనా ఇంకేం చెప్పలేదా , ఎక్కడివెళ్తుంది అని ఏం చెప్పలేదా!?”.
“లేదు అంకుల్ అంతే. ఏమయినా తెలిస్తే చెప్తా అంకుల్”.
“సరే అమ్మా!”.
తను కనబడట్లేదనే బాధ తప్ప ఆయన అలా మాట్లాడిందాని గురించి ఆయనకు అస్సలు దిగులు లేదు.
సాయంత్రం ఆరు గంటలు అవుతుంది, “సాల్మాన్ బీచ్”. సాల్మన్ బీచ్ “బీచ్ ఆఫ్ ప్యూరిటీ”గా చాలా ప్రసిద్ది చెందింది. ఒడ్డు నుంచి ఒక పది కిలో మీటర్ల మేరకు చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఈ సముద్రం. ఆ తరువాత మిగిలిన సముద్రం అంతా కూడా మురికి గా ఉంటుంది కిందకు చూస్తే చీకటి తప్ప ఇంకేమీ కనబడదు. నిజంగా నమ్మలేని విషయమ ఏమిటంటే ఈ సముద్రంలో పది కిలోమీటర్ల తరువాత ఉన్న మురికి నీటికి ఒక సన్నని తెల్లని గీత కనబడుతుంది అది ఆకాశం నుండి మాత్రమే కనబడుతుంది దగ్గరకు వెళ్ళి చూస్తే ఆ తేడాను అంతగా గమనించ డానికి వీలుకాదు. ఆ తెల్లటి గీత సముద్రం లోని మురికి నీటిని మరియు స్వచ్ఛంగా కనిపించే నీటిని వేరు చేస్తున్నట్టు కనిపిస్తుంది. సముద్రం లో నుండి చూస్తే అంతా ఒకేలా ఉందని భ్రమ పడుతాం అందుకే దాన్ని ధూరం నుంచి చూడదాన్ని ఇష్ట పడతారు పర్యాటకులు. అయితే ఇటువంటి అధ్బుతం ఉన్న చోట ఏ పుకార్లు,కట్టు కథలు లేక పోతే అది నిజం గా ఆశ్చర్యమే అందుకే కొందరు అంటారు ఆ నీటి కింద దేవుడు ఉన్నాడు అని అయితే ఇంకొందరు లేదు సముద్రం లో చనిపోయిన మునిగి చనిపోయిన మనుషుల మరియు సముద్ర జీవరాసుల ఆత్మలు ఈ నీటి కింద ఉన్నాయి అని. ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి చాలా కథలు ఉన్నాయి. ఈ సముద్రం ఇలా స్వచ్ఛంగా అందంగా ఉండడానికి రెండు కారణాలు ఒకటి “ప్రకృతి” ఆ పది కిలో మీటర్ల మేర సముద్రమే స్వయంగా చాలా వరకు స్వచ్ఛంగా ఉంటుంది. నిజంగా అది ఒక వింత అందుకే భారత దేశంలో ఉన్న అధ్బుతాలలో అదీ ఒకటిగా చరిత్రకెక్కింది అందువల్ల పర్యాటకులు అక్కడకు విరివిగా రావడం మొదలైంది ఆ అధ్బుతాన్ని చూడడానికి దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుని తగినంత కర్చుపెట్టి ఆ సముద్రాన్ని వీలైనంతవరకు పరిశుభ్రంగా చూసుకుంటుంది బ్యారియర్స్ వంటి వాటిని కూడా ఉపయోగిస్తుంది. శాస్త్రవేత్తలు కూడా దీనిని పరిశోధిస్తున్నారు సముద్రం అలా కనబడడానికి గల వెనుక ఉన్న కారణాన్ని.
చాలా చాలా బాగుంది ఆ క్త్లెమేట్ కి ఆ బీచ్ లుక్ కి ఎంత సేపైనా అక్కడే ఉండాలనిపించేంత లా ఉంది..
చుట్టూ జనం ఆ డార్క్ బ్లూ స్కై, బోట్ రైడ్స్ అన్నీ ఆరోజు చాలా అందంగా ఉన్నాయి. వైశాలి అక్కడకు వచ్చింది అక్కడున్న అన్నింటినీ చూస్తూ ఉంది. చేతులు కట్టుకుని ఆ ఇసుకలో కిందకు చూస్తూ అలా నడుస్తూ ముందుకెళ్తుంది. అలా కాసేపు తిరిగింది. చుట్టూ చూస్తూ ఉంది. తన మనసులో ఇవే ఆలోచనలు మెదులుతూ ఉన్నాయి. ఆ ఆలోచనలకు తోడు ఆ సముద్రపు చల్లని గాలులు తనని ఓదార్చేందుకు వస్తున్నాయి. తన కళ్ళు అప్పుడే చెమ్మగిల్లుతున్నాయి.
కానీ వెంటనే తన కన్నీళ్ళు ఆగిపోయాయి , తన ఫ్రెండ్స్ అక్కడ ఎదురు పడ్డారు. వెంటనే తన చిరునవ్వు వెనకాల దాచేసింది తన కన్నీళ్లను. ఏడు, ఎనిమిది మంది. వాళ్ళు కనబడినందుకు షంతోషాన్ని వ్యక్తం చేసింది నిజానికి అలా లేకున్నా!.
“మీరేంటి ఇక్కడ , అందరూ ఒకేసారి?”- వైశాలి.
“యాక్చువల్లి అలా సరదాగా కేఫ్ కు వెళ్దామనుకున్నాం కాని ఈ క్లైమేట్ చూసి ఇలా టర్న్ అయిపోయాం”.
“అవును, మీనాన్న , కౌశిక్ నీకోసం మార్నింగ్ కాల్ చేశారు ఏంటి ఏమైంది? అంతా ఒకే నా?”.
“ఆ ఏం పర్లేదు అంతా ఒకే!”. – వైశాలి
“ఇంట్లో ఏమైనా ఇష్యూ అయ్యిందా?”.
“ఇంట్లో ఇష్యూస్ నార్మల్ ఏ కదా!”
“ఒకే, అయితే అందరం కలిసి బోట్ రైడ్ కు వెళ్దామా?”. (అన్నారొకరు)
“యస్, ఈ స్కై వ్యూ కి బోట్ రైడ్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్ గా నిలిచి పోద్ది”. (ఇంకొకరు)
“అవును అందులో కొన్ని ఫోటోస్ తీసుకుంటే ఇక అంతకు మించి ఈరోజు గొప్పదేమి లేదు”. (ఇంకొకరు)
“వైశాలి, నువ్వు కూడా పదా!”.
“లేదు నేను......ఆ..” అని నసిగింది వైశాలి.
“ఏమైంది నువ్వు ఇప్పుడేందుకు రావు”.
“నేను వస్తాను కానీ మీ తరువాత రైడ్ లో వస్తా” -వైశాలి
“ఏ?, మాకేమైనా అంటు రోగం ఉందా, నువ్వు రావమ్మా తల్లి”.
“మాతో ఎందుకు రావు?” (అని అందరూ ఒకేసారి అడగడం మొదలెట్టారు)
“సరే సరే పదండి వెళ్దాం వస్తాను, వస్తా.......ను” - వైశాలి.
పోన్ టూన్ బోట్ రెండు గంటల రైడ్ ఎనిమిది వందల రూపాయలు ఒక్కొక్కరికి చార్జి చేశారు. అందరూ కలిసి బోట్ ఎక్కారు, రైడ్ స్టార్ట్ అయ్యింది. సమయం అరుగంటల నలభై ఐదు నిమిషాలు. ( ఆ బోట్ లో మొత్తం పదకొండు మంది ఉన్నారు వైశాలి తో కలిసి ఎనిమిది మంది అమ్మాయిలు. నలభై ఐదు ఏళ్ల కెప్టెన్ ఒకరు చూడడానికి మంచి ధృడమైన ఆకారం ఇంకా ఈ పడవ సవారిలో చాలా అనుభవజ్ఞుడు లా కనబడుతున్నాడు మరియు అతని ఇద్దరి అసిస్టెంట్ లు ముప్పై ఏళ్లలో ఉంటారు.)
కాసేపటికి “నిజంగా ఇక్కడేముందిలే అనుకున్నా కానీ నాకు చాలా నచ్చిందే!” (అన్నది ఇంత వరకు మాట్లాడని ఒక ఫ్రెండ్)
“అవునవును ఏమైనా ఉందా, ఫీలింగ్!”
“అయితే ఈ రోజంతా ఇక్కడే ఉండి పోదామా?”
“ఉండిపోవచచ్చు తప్పులేదు, ఏమైనా ఈరోజు క్త్లెమేట్ మత్తెక్కిస్తోంది”.
“అయితే ఇంకే కెప్టెన్ బాగున్నాడు వెళ్ళి ట్రై చెయ్ ఒకసారి ఈ మత్తులో” (అని తమాషాగా తన చెవిలో చెప్పింది తనతో వచ్చిన ఇంకో ఫ్రెండ్).
“నోరు ముయ్యి.”(అంది నవ్వుతూ)
అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ రైడ్ ను. వైశాలి కూడా బోట్ చివర నుంచుని ఆహ్లాదిస్తుంది ఆ రైడ్ ను. కింద సముద్రం లోకి చూస్తే కొంచెం భయం కొంచెం ఉత్సాహం వస్తుంది. అలా ఉంది సముద్రం.
అయితే ఉన్నట్టుండి తన ఫ్రెండ్ చూస్తూ ఉండగానే వైశాలి సముద్రం లోకి కాలు జారి పడిపోయింది. క్షణం వ్యవధిలో జరిగిన ఈ విషయాన్ని తన పక్కనే ఉన్న స్నేహితురాలు చూసి నోట మాట రాలేదు అరవాలన్న విషయం కూడా మర్చిపోయి అలా చూస్తూ ఉంది కళ్ళు పెద్దవి చేసి. అయితే వైశాలి పడిపోవడం చూసిన ఇంకో ఫ్రెండ్ గట్టిగా అరిచింది “ వైశాలి సముద్రం లో పడిపోయింది, వైశాలి సముద్రం లో పడిపోయింది” . అని గొంతు చించుకుని అరుస్తూనే ఉంది. అరుస్తున్న తన ఫ్రెండ్ దగ్గరకు వచ్చి తనను గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కుంది ఇంకో ఫ్రెండ్. అప్పుడు తను అరవడం ఆపింది. వెంటనే కెప్టెన్ ఇంజిన్ ఆపేసి వైశాలి పడిపోయిన చోటుకు వచ్చాడు, తన ఇద్దరు అసిస్టెంట్లు ఇంకా వైశాలి స్నేహితురాళ్ళు అందరూ కూడా ఒకే చోట చేరారు. “మన వైశాలికి స్విమ్మింగ్ వచ్చు” అన్నదొక అమ్మాయి వైశాలి పడిపోయిన చోటును ఆశగా చూస్తూ. “ఆ, అవును తను నాకు ఆ విషయం చెప్పింది” అన్నది ఇంకో ఫ్రెండ్.
ఇప్పటి వరకు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న క్లైమేట్ , వాళ్ళు చాలా ఎంజాయ్ చేసిన క్లైమేట్ , ఆ స్కై ఇప్పుడు చాలా భయంకరంగా కనిపించడం మొదలైంది వాళ్ళకు. వాళ్ళు ఎంతో ఆశపడి చూద్దాం చూద్దాం అనుకున్న ఆ సముద్రాన్ని ఇప్పుడు చూడాలంటే భయపడుతున్నారు. కొద్ది క్షణాలు చూశారు వైశాలి పైకి తెలుతుందేమో అని కానీ తను అలా పైకి కొట్టుకుంటూ తేలలేదు. కానీ తన లైవ్ జాకెట్ పైకి తేలుతూ వచ్చింది. ఇక కెప్టెన్ ఆలస్యం చెయ్యలేదు వెంటనే ఒక స్కూబా డైవ్ తొడుక్కుని, చిన్న ఆక్సిజన్ సిలిండర్ అలాగే గ్లాసెస్ తొడుక్కోవడం మొదలుపెట్టాడు తన అసిస్టెంట్ తనకు హెల్ప్ చేస్తున్నాడు. సిద్దమైన వెంటనే సముద్రం లోకి దూకేశాడు. ముందు అసిస్టెంట్ వెళ్తా అని పట్టు పట్టాడు “మీరు మా కెప్టెన్ మీరు వెళ్ళకండి” అన్నాడు. కానీ “నేనూ అదే అంటున్నా నేనే కెప్టెన్ మీరు చిన్న పిల్లలు మీకేమన్నా అయితే.........” నిజానికి అక్కడ లోతు ఉంటుంది ఇంకా సొరచేప తిరిగే అవకాశం కూడా ఉంది అందుకే తనే (కెప్టెన్) దిగాలనుకున్నాడు. కెప్టెన్ సముద్రం లోకి దూకేశాడు. టైమ్ ఏడు గంటల యాభై నిమిషాలు దాటింది , చీకటి పడుతోంది పైనున్న ఆకాశానికి సముద్రం కూడా నల్ల గా చీకటి సముద్రం లా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకరికి ఆ బోట్ వెలుతురు దూరంగా పడడం తో అక్కడ ఒక సొరచేప లేద ఏదో మసకగా కనబడింది. దాంతో తన లో, ఆకాశం లో ఉన్న చీకటి అంతా భయమైతే ఆ భయమంతా తనలోపల చేరిపోయింది. లోపల వైశాలి జాడ కెప్టెన్ కు దొరికిందో లేదో, అసలే ఆయనతో ఉన్న లైట్ ఎంత వెలుగని మాత్రం ఇస్తుంది. దీనికి తోడు ఆ సొరచేపలు ఉన్నాయనే ఆలోచన వచ్చినప్పుడల్లా కచ్చితంగా ఉండే ఉంటాయి ఎందుకంటే ఇది సముద్రం కదా అనే ఇంకో ఆలోచన తోడవుతుంది. తన ఫ్రెండ్స్ అందరూ ఒక చోట చేరి గుంపు గా సముద్రం లోకే చూస్తున్నారు. వాళ్ళ పక్కన అసిస్టెంట్లు వంగి సముద్రం లోకి చూస్తున్నారు. ఇద్దరి అసిస్టెంట్ల మొహం లో చెమటలు కారుతున్నాయి ఏం జరగబోతుందా అని .
ఈ అమ్మాయిలకు ఉన్న భయం సరిపోక దూరంగా ఎప్పుడూ అందం గా కనిపించే చంద్రుడు ఇప్పుడు చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు ఏదో చెడును సూచిస్తున్నట్టుగా. వాళ్ళలో ఒక్కొక్కరూ “అసలు బయటకి రాకుండా ఉండి ఉంటే బాగుండేది , ఇంట్లో టివి చూస్తూ ఉంటే ఎంత బాగుండేదో , వీళ్ళతో అసలు ఇక్కడికి వచ్చి ఉండకూడదు , కామ్ గా కాఫీ షాప్ కి వెళ్లిపోయినా బాగుండేది......” ఇలా అందరూ వాళ్ళ వాళ్ళ మనసుల్లో అనుకుంటున్నారు.
లోపల కెప్టెన్ ముందు తన దగ్గర ఉన్న ఎల్‌ఈడి టార్చ్ లైట్ తో వీలైనంత వరకు చూశాడు. వైశాలి కనబడ లేదు. ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూశాడు లైట్ దూరం లో ఏదో కదిలింది “కానీ వైశాలి అవ్వడానికి కేవలం ఒక్కశాతం మాత్రమే అవకాశం ఉంది. అది ఏ సొరచాపో ఏ ఇతర జీవి కూడా అయ్యుండొచ్చు లేదా ఆ రకం జీవరాసి అయ్యుండొచ్చు” అనుకున్నాడు కెప్టెన్ . ఇప్పుడు అతను భయపడి పైకి వెళ్లిపోవాలి లేదా తెగించి కిందకు వెళ్ళాలి. కిందకు వెళ్ళాలి అనే ఆలోచన అతని కాళ్ళు వనికేలా చేస్తుంది కానీ ఇంతదూరం వచ్చి కనీసం తనా?, కాదా? కూడా తెలియకుండా పైకి వెళ్ళిపోవడం...... అని ఆలోచించాడు ఇప్పుడు కిందకో పైకో త్వరగా వెళ్ళక పోతే తనకూ ప్రమాదమే వైశాలి కు ప్రమాదమే, ఇంకా కింద అదేదో కదలడం కనిపిస్తుంది. ఏమి ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోయాడు లోతుకి కొంచెం లోపలికి వెళ్ళిన తరువాత తెలిసింది అక్కడ ఉంది వైశాలి, ఇంకా తన కాళ్ళూ చేతులూ ఆడుతూ ఉన్నాయి,కానీ తను చాలా లోతులో ఉంది. ఆలస్యం చేస్తే ఇంకా లోతులోకి వెళ్ళిపోతుంది. తన దగ్గరకు వెళ్ళాలా? అని మళ్ళీ సందేహించాడు కెప్టెన్ .
వెంటనే ఈదుకుంటూ వైశాలి దగ్గరకు బయలుదేరాడు కెప్టెన్ , ప్రపంచం లో అన్నింటికన్నా వేగంగా ప్రస్తుతం తన బుర్రలో ఆలోచనలు పరిగెడుతున్నాయి, “ఎటు నుంచి ఏ జీవి వచ్చి , నా మీద కానీ తన మీద కానీ పడుతుందో అని, తను వైశాలి ను చేరుకోగలడా?, లేదా మధ్యలో ఏమైనా జరుగుతుందా?”. అన్నింటికన్నా వేగంగా తన గుండె కొట్టుకుంటుంది. అతను వైశాలి కి చేరువ అవుతున్నాడు, ఇంకొంచెం , అతి చేరువలో ఉన్నాడు ఇంకొంచెం, ఇంకొంచెం దగ్గరకు వెళ్ళాలి. చేరుకున్నాడు అతి కష్టం మీద. వైశాలి చేతులని పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే పైకి, బోట్ దగ్గరకు వళ్లయినంత వేగంగా మోటర్ లా ఈదడం మొదలుపెట్టాడు. ఇంతక ముందు కంటే ఇప్పుడు తన గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. బోట్ దగ్గరకు సురక్షితంగా చేరే అంత వరకు ఏమైనా జరగ వచ్చు. ఆ విషయం ఆ కెప్టెన్ కు బాగా తెలుసు. ఇంతక ముందు ఇలాంటి పరిస్థితిని ఎదురైయ్యింది అప్పుడు చివరి క్షణం లో సొరచేప తన ముందు నిలబడింది ఇక తను తప్పక చేసిన పని తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం తన చేతిలో ఉన్న ఒకరిని వదిలేశాడు తను ప్రాణాలు కాపాడడం కోసం అలా చెయ్యక పోతే ఇద్దరూ చనిపోయి ఉండేవారు.
ఇప్పుడు అటువంటి సమస్య రాకూడదని బలంగా అనుకుంటున్నాడు. పైకి చేరుకుంటున్నాడు, కానీ వైశాలి లో చలనం లేదు. తన కాళ్ళూ చేతులు ఆడడం ఆగిపోయింది.
పైకి చేరుకుంటున్నారు, తన లైట్ సూటిగా బోట్ లోంచి వంగి చూస్తున్న తన అసిస్టెంట్స్ కంటి చూపుకు కు కనబడింది. వాళ్ళిద్దరూ ఒకేసారి ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు వాళ్ళ ముఖాలలో ఒక చిన్న నవ్వు అయితే పుట్టింది. ఆ లైట్ చిన్నదవుతూ, అవుతూ అవుతూ వస్తుంది. వాళ్ళు పైకొస్తున్నారు అని అసిస్టెంట్స్ లో ఒకరు ఆ అమ్మాయిలకు చెప్పాడు. ఏడుపు ముఖాలతో ఉన్న అందరూ ఇప్పుడు ఏం జరగబోతుందా అని, వాళ్ళేం చూస్తారో అని దగ్గరకు వచ్చి లైట్ వైపు చూస్తున్నారు.
ఆ లైట్ చిన్నదయిపోయింది బుడుక్కున కెప్టెన్ తన తలను నీటి మీదకు తెచ్చి గాలి పీల్చాడు, కెప్టెన్ ఒక్కడే వచ్చాడా అని ఒక్క క్షణం సందేహించారు అందరూ కానీ తనతోపాటు వైశాలి ను చూశారు వాళ్ళు. అయితే ఇప్పుడు తను ఇంకా బ్రతికే ఉందా? అని కొందరు అమ్మాయిలు అనుమానం లో ఉన్నారు తనకేం కాలేదు తను ఇంకా బ్రతికే ఉంది అని ఇంకొదరూ అనుకుంటున్నారు.
అసిస్టెంట్లు ఇద్దరూ కలిసి తన కెప్టెన్ ను, వైశాలి ను బోట్ లోకి తీసుకొచ్చారు. అసిస్టెంట్లకు అర్ధమై పోయింది తను చనిపోయింది అని కానీ ఏం చెప్పలేదు ఎవ్వరికీ ,కామ్ గా ఉన్నారు. కెప్టెన్ కోపంగా ఉన్నాడు సముద్రంలో వైశాలి ని చూసినప్పటి నుండి అతను చాలా కోపంగా ఉన్నాడు. అమ్మాయిలందరి మీద కోపం గా ఉన్నాడు కనీసం వాళ్ళ మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఆ అమ్మాయిలందరినీ హీనంగా చూశాడు. జగదీష్, ఇంజిన్ స్టార్ట్ చెయ్ అని చెప్పి అక్కడ నుండి స్టీరింగ్ దగ్గరకు వెళ్ళాడు వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఇదంతా కేవలం నాలుగు నిమిషాల పధ్నాలుగు క్షణాల వ్యవధి లో జరిపోయింది.
కెప్టెన్ ఏమైనా వైశాలి గురించి చెప్తాడా అని అందులో కొంత మంది అమ్మాయిలు ఎదురుచూశారు. కానీ కెప్టెన్ ఏం చెప్పలేదు. అమ్మాయిలు అందరూ వైశాలి దగ్గరకు వెళ్లారు తనని పిలిచి పిలిచి ఏడుస్తున్నారు అందులో ఇద్దరి అమ్మాయిలకు విషయం అర్ధమై కనీసం వైశాలి దగ్గరకు కూడా వెళ్ళకుండా అక్కడే కూర్చుని బాధ పడుతున్నారు.
ఇంత సేపు ఆ అమ్మాయిలు వాళ్ళ ఇంటికి కాల్ చేద్దామా వద్దా అని అనుకుంటున్నారు వైశాలి సముద్రంలో పడినప్పటి నుండి ఇంటికి కాల్ చేసి ఏం చెప్పాలి అని పోనీ వైశాలి బయటకు వచ్చాక కాల్ చేద్దామా అంటే అప్పుడేం చెప్పాలో తెలియక ఇంతసేపూ కాల్ చెయ్యలేదు అందుకే ఇప్పుడు చేసి జరిగింది మొత్తం చెప్పారు. బోట్ వడ్డుకు చేరుకుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బీచ్ దగ్గరకు చేరుకున్నారు సమయం ఎనిమినది నలభై.
బోట్ వడ్డుకు చేరుకుంది. వైశాలి ని నేల మీద పడుకోబెట్టారు. ఆ అమ్మాయిలలో కొంతమంది కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు. చుట్టూ జనం గుమి గూడుతున్నారు.
“ఏ, ఎవరైనా వైశాలి ఫాథర్ కు కాల్ చేశారా?”( అని అడిగారు ఆ అమ్మాయిలలో ఒకరు)
“నేను చెయ్యలేదు” (అని ఒకేసారి నలుగురు చెప్పారు)
“నేను కౌశిక్ కు కాల్ చేసి చెప్పా” (అన్నారొకరు)
“ముందు వాళ్ళ నాన్నగారికి కదా చెప్పాలి!”
“భయమేసిందే ! అందుకే ముందు కౌశిక్ కు చెప్పా, తను అంకుల్ కు చెప్తాడు”
కొద్ది నిమిషాల వ్యవధిలో అక్కడికి కౌశిక్ చేరుకున్నాడు.
కౌశిక్ వైశాలి దగ్గరకు వెళ్ళాడు. తను దాన్ని నమ్మలేక పోతున్నాడు. బీచ్ లో వైశాలి దగ్గరకు నడుచుకుంటూ వచ్చే టప్పుడు ప్రతి అడుగూ కూడా “అది నిజమేనా? అది తనేనా? అని ఒక పక్క తన మనసు తను చనిపోయింది అనే అంటుంది కానీ కౌశిక్ దాన్ని ఒప్పుకోవట్లేదు ఇంకా దగ్గర కు చేరువవుతున్నప్పుడు వేసే ప్రతి అడుగు లో కూడా వద్దు వద్దు వద్దు అది తను కాకూడదు అనుకుంటూనే ముందుకు వెళ్ళాడు తనను చూసే ఒక్క క్షణం ముందు వరకు కూడా తను అయ్యుండ కూడదు అనే అనుకున్నాడు. కౌశిక్ వైశాలి ని చూశాడు ఒక శవం లాగా నే ఒక పక్కకు పెట్టేశారు తనను సముద్రపు ఒడ్డున.
కౌశిక్ నోరుకి చేతిని అడ్డం పెట్టుకుని ఏడ్చేశాడు తన చుట్టూ ఉన్న ప్రపంచం స్తంభించింది. అలానే ఏడుస్తున్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే ఆలోచిస్తుంది తన మైండ్. ఇదంతా నిజమా లేదా ఇక్కడేమయినా అయ్యిందా అని బ్రమ పడుతున్నాడేమో అనుకుంటున్నాడు.
కెప్టెన్ ఏడుస్తున్న కౌశిక్ ను చూశాడు, కౌశిక్ దగ్గరకు వచ్చాడు. కౌశిక్ కెప్టెన్ ను గమనించలేదు. వైశాలి నే చూస్తున్నాడు మోకాళ్ళ మీద కూర్చుని. కెప్టెన్ కౌశిక్ తో చెప్పాడు.
“తను కాలు జారీ కింద పడిపోయింది అనుకున్నారు అందరూ, నేనుకూడా (కౌశిక్ తల ఎత్తి కెప్టెన్ ను చూశాడు) తనని కాపాడడానికి వెళ్ళినప్పుడు తను చాలా లోతులో ఉంది ఇంకా లోతులోకి వెళ్తూంది కింద సముద్రం తనని లాగుతుంది అనుకున్నా కానీ తనే కావాలని కిందకు వెళ్తుంది ఈదుకుంటూ. నేను ఒక్క క్షణం తనను వదిలేసి వెళ్లిపోదామనుకున్నా కానీ ఎక్కడో చిన్న ఆశ తనను కాపాడగలనేమో అని తన దగ్గరకు వెళ్ళే చివరి క్షణం వరకు తను లోతు లోకి వెళ్లడానికే ప్రయత్నించింది. అతి కష్టం మీద తనను తీసుకువచ్చా. కానీ ప్రయోజనం లేక పోయింది!.”
కొద్దిక్షణాల తరువాత “చాలా థాంక్స్ సార్” అన్నాడు కౌశిక్ బొంగురు గొంతుతో.
వైశాలి ఇంట్లో వాళ్ళ నాన్న తన గదికి వెళ్ళి చూశాడు వైశాలి కోసం. ఎవరికి ఫోన్ చేద్దామా అని అనుకుంటుండగా కౌశిక్ కాల్ చేశాడు. కౌశిక్ పేరు చూడగానే వెంటనే కాల్ ఎత్తి.
“చెప్పు కౌశిక్ ఏమైనా తెలిసిందా వైశాలి గురించి, ఎక్కడుంది తను ?”
“అంకుల్ !!.!” (వైశాలి నాన్న గారికి ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు కౌశిక్)
“చెప్పరా ఏమైంది? తన గురించి ఏం తెలియలేదా పోనీ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇద్దామా?”
“అవసరం లేదు అంకుల్ వైశాలి కి మన అవసరం లేదనుకుంది (ఎలా చెబుతామన్నా ధైర్యం రావట్లేదు ముందు గొంతులోంచి మాటే రావట్లేదు) తను చనిపోయింది అంకుల్” (అని చాలా మెల్లగా చిన్నగా చెప్పాడు)
“ఏంటి వినబడట్లేదు”
“వైశాలి చనిపోయింది చనిపోయింది..........!!..” (ఒక్కొక్క అక్షరం చెప్పాడు మెల్లగా)
“ఎక్కడరా ఎక్కడా??” (అని గాబరాగా అడిగాడు)
కాసేపటికి అక్కడికి వైశాలి నాన్న గారు కూడా వచ్చారు, వైశాలి ను చూసి గుండె జళ్ళుమంది ఆయనకు. అప్పటికే అక్కడకు పోలీసులు కూడా వచ్చి ఉన్నారు.
అయితే పోలీసులు వచ్చేముందే కౌశిక్ కెప్టెన్ కు తన వైశాలి ఫ్రెండ్స్ కు ఇది స్లిప్ అయి సముద్రం లో పడిందని ఆక్సిడెంటల్ డెత్ అని చెప్పమని రిక్వెస్ట్ చేశాడు లేకపోతే పోలీసులతో తల నొప్పి అని. కెప్టెన్, ఆ అమ్మాయిలు సరే అన్నారు.
సో పోలీసులు వెళ్లిపోయారు. వైశాలి నాన్న తనను చూసి బోరు మని ఏడుస్తున్నాడు. ఆ రాత్రి వాళ్ళందరికీ పీడ కళలా మారింది, ఒక డార్క్ డే అయింది వైశాలి కుటుంబానికి తన ఫ్రెండ్స్ కి.
నారీ ఆ రోజంతా వైశాలి ను కలవలేదు. ఎన్ని సార్లు కాల్ చేసినా ఎవ్వరూ లిఫ్ట్ చెయ్యలేదు. ఇక ఆ రాత్రి నారీ తన గురించే ఆలోచిస్తూ నిద్ర పోయాడు.
ఇక ఆ తరువాతి రోజు ఉదయం చాలా మబ్బులు కమ్ముకున్నాయి నల్లటి మబ్బులు. తను ఎలా అయినా వైశాలి ని కలవాలని బయలుదేరాడు బైక్ లో సిద్దు ముందు రానన్నాడు కానీ నారీ చాలా అసహజంగా ఉన్నాడు కాబట్టి, తనతో వెళ్లడమే మంచిదనిపించింది. ఇక ఇద్దరూ కలిసి బయలుదేరారు.
నారీ నిన్ననే వైశాలి ఇంటికి వెళ్ళి ఉండవచ్చు కానీ వైశాలి చెప్పింది ఎప్పుడూ కూడా తను పిలవకుండా ఇంటికి రావద్దని . తనే ఒకరోజు నారీ ను ఇంటికి తీసుకు వెళతానంది అంటే వాళ్ళ నాన్న దగ్గరకు.
నారీ సిద్దూ బైక్ లో వెళ్తున్నారు ఒక “కల్నల్ సర్కిల్” లో టర్న్ తీసుకుంటుండగా వాళ్ళకెదురుగా కౌశిక్ టర్న్ తీసుకుని వస్తున్నాడు. అది సిద్దూ గమనించాడు కొడుతూ నారీ వేగంగా కౌశిక్ ను చేస్ చేస్తున్నాడు. కౌశిక్ నారీ చేస్ చెయ్యడం గమనించి కోపంగా ఇంకా స్పీడ్ గా వెళ్ళాడు. ఇక నారీ కూడా ఏం తగ్గలేదు చాలా స్పీడ్ గా వెళ్ళి కౌశిక్ పక్కకు చేరుకున్నాడు. వైశాలి ఎక్కడ? అని గట్టిగా అరుస్తూ అడిగాడు. కౌశిక్ కోపం తగ్గించుకుని “నన్ను ఫాలో అవ్వు” అని బైక్ ను వచ్చిన దారినే యు టర్న్ తీసుకుని వైశాలి ఇంటికే మళ్ళీ వెళ్ళాడు.
వైశాలి ఇంటి ముందు జనం దట్టంగా నుంచున్నారు. చుట్టూ, పైన బిల్డింగ్స్ నుండి కూడా అందరూ వైశాలి ఇంటినే చూస్తున్నారు. నారీ కు విషయం అర్ధం కాలేదు. కానీ సిద్దు గ్రహంచాడు “ఎవరైనా చనిపోయారా?” అని అడిగాడు కౌశిక్ ను.
“వెళ్ళి చూడండి” అన్నాడు కౌశిక్. నారీ భయపడుతూ వెళ్ళి చూశాడు. నిజానికి నారీ అనుకున్నాడు అక్క చనిపోయి ఉంటే అది వైశాలి నాన్న అయిఉంటాడు అని. కానీ అక్కడ అతను చూసింది వైశాలిని, చూసిన వెంటనే తన కళ్ళు పెద్దవి అయిపోయాయి.
అలా చూస్తూ నిలబడ్డాడు. పక్కన నుంచున్న వైశాలి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరు “బాబు నువ్వేం అవుతావు తనకి?” అని అడిగాడు.
“ఫ్రెండ్ ఆ?” అన్నాడు.
సిద్దు అవునంటూ తలూపాడు.
ఇది చూసిన వైశాలి నాన్న ఎవరు మీరు అని అడిగాడు.
“నా పేరు నారాయణ” అని చెప్పాడు మూగ గొంతుతో.
నివ్వెర పోయాడు వైశాలి నాన్న ఒక్క క్షణం.
వెంటనే “ఒరేయ్ నీ వల్లే రా నా కూతురు చనిపోయింది నువ్వే తన జీవితం లోకి రాకుండా ఉంటే ఇప్పుడు తను బ్రతికే ఉండేది అంటూ లేచి మీదకు వచ్చాడు వైశాలి నాన్న. ఆయనను పట్టుకున్నారు చుట్టూ ఉన్న వాళ్ళు. నారీ మీదకు వెళ్ళకుండా , “నువ్విక్కడి నుండి వెళ్లిపో బాబు” అంటున్నారందరూ, కౌశిక్ వెంటనే వచ్చి నారీ ను పట్టుకుని అక్కడికి నుండి తీసుకు వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతానికి కొంచెం దూరంగా తీసుకు వచ్చాడు.
“చూశావా? చూశావా ? నేను ఆరోజే చెప్పా మేం హ్యాపీ గా ఉన్నాం నువ్వు మా లైఫ్ లోకి రావద్దు అని! నువ్వు అదే చేశావ్. ఇప్పుడు తను లేదు.(కౌశిక్ కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి) నీ వల్ల ఒకరి కూతురు ఒకరికి కాబోయే భార్య అంతకు మించి ఒక మంచి అమ్మాయి చనిపోయింది. జస్ట్ నీవల్ల.”
“అదెలా మావాడి వల్ల అవుతుంది.........”( అని సిద్దూ అనబోతుండగా నారీ ఆపేశాడు)
“తను ఎలా చనిపోయింది” అడిగాడు నారీ (తల దించుకుని)
మొత్తం చెప్పాడు కౌశిక్.
“తను సూసైడ్ చేసుకుందా!! కానీ ఎందుకు ?” - నారీ
“అదే విషయం నేనూ వైశాలి ఫాథర్ ను అడిగా బాధ తోనో పశ్చాత్తాపం తోనో వాళ్ళ మద్య జరిగింది మొత్తం చెప్పాడు.
వైశాలి నాన్న చెప్పిన విషయాలన్నీ కౌశిక్ నారీ కు చెప్పాడు.
“తను నిన్నూ ప్రేమించింది, నన్నూ ప్రేమించింది కానీ ఇంకొకరిని కూడా ప్రేమించింది (నారీ తల పైకి ఎత్తాడు ) “అది వాళ్ళ నాన్న” . మన కన్నా ఎక్కువుగా ప్రేమించింది. తనెంతో నమ్మిన నాన్న అలా మాట్లాడుతాడని అస్సలు ఊహించి ఉండదు ఆ మాటలకు తనక్కడే చనిపోయి ఉంటుంది , కేవలం తన శరీరం మాత్రమే సముద్రం లో దూకింది.
(వర్షం పడడం మొదలైంది క్షణాలలో ముద్ద ముద్ద అయిపోయారు)
“తనలా చేసి ఉండ కూడదు, అలా చేసే ముందు ఒక్కసారి నన్ను కలిసి ఉండాల్సింది” - నారీ
“ఏం చేసి ఉంటావు నిన్ను కలిసి ఉంటే?” - కౌశిక్
(నారీ ఆలోచిస్తున్నాడు)” చెప్పు ఏం చేసి ఉంటావు ?” - కౌశిక్
“అట్ లీస్ట్ తనకు సారీ చెప్పి తన లైఫ్ లో నుండి వెళ్ళి పోయింటా ఇండియా నుండి కూడా!!”
“ఈ పని నువ్వు ముందే చేసి ఉండాల్సింది కనీసం నేను చెప్పినప్పుడు. ఇప్పుడు తన డెత్ కు రీసన్ ఎవరంటే నువ్వే అంటాను నేను.”
నారీ అన్నీ వింటున్నాడు కంటి నిండా నీళ్ళతో. కౌశిక్ అక్కడినుంచి వెళ్లిపోదామని రెండడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఒక చేత్తో మొహం తుడుచుకుంటూ “నిన్ను ఆరోజే చంపేయాల్సింది రా” అని చాచి గట్టిగా ఒక్కటి కొట్టాడు నారీ చంపమీద.
సిద్దు వెంటనే కౌశిక్ మీదకు వెళ్ళాడు కానీ నారీ సిద్దును ఆపేశాడు.
“నిన్ను అప్పుడు వదిలేసి తప్పు చేశాను”- కౌశిక్
“అవును నువ్వు నన్ను వదిలి ఉండ కూడదు అలా” (అన్నాడు నారీ మెల్లగా)
సిద్దూ ను నారీ గట్టిగా పట్టుకున్నాడు వెనక నుంచి.
“రే మా వాడు ఏం మోసం చెయ్యలేదు , మా వాడు స్ట్రెయిట్ గా లవ్ చేస్తున్నా అన్నాడు ఆ తరువాత అదే మా వాడి వెంట తిరిగింది. అప్పుడేమయిపోయావు నువ్వు?”- సిద్దు అన్నాడు ఆవేశంగా.
“రే, నోరు ముయ్యరా సిద్దు”- నారీ
ఆ వర్షం లో అలాగే ఏడ్చేశాడు నారీ. సిద్దూ ఎంత ట్రై చేసినా నారీ ఏడుపు ఆపలేదు.
నారీ కి ఏం చేయాలో అర్ధం కావడం లేదు. చాలా భాద లో ఉన్నాడు పైగా. నారీ ఫోన్ తీసి అమ్మకు కాల్ చేశాడు. వాళ్ళమ్మ ఫోన్ ఎత్తారు.
“రే నారీ , ఎన్ని రోజులైంది రా నువ్వు కాల్ చేసి!!” (ఆనందం తో అడిగారు.)
“మా నేనో పెద్ద తప్పు చేశానే, చాలా పెద్ద తప్పు చేశా”
(వాళ్ళమ్మ వెంటనే ఫోన్ నారీ నాన్న ముందు పెట్టింది ఫోన్ స్పీకర్ ఆన్ చేసి)
“ఇప్పుడు ఏడవడం తప్ప ఇంకేం చెయ్యలేక పోతున్నా”
“అసలేం జరిగింది రా!?” -అమ్మ
నారీ మొత్తం చెప్పాడు తను లవర్స్ ను ఎలా డిస్టర్బ్ చేస్తాడో ఇంతవరకు ఏమేం చేశాడో అన్నీ చెప్పాడు ఆ తరువాత వైశాలి గురించి చెప్పాడు.
“తప్పు చేశావ్ రా!!” -నాన్న (చాలా ప్రశాంతంగా అన్నాడు)
“లవర్స్ మధ్య లోకి వెళ్ళడం తప్ప్.............” (అని నాన్న పూర్తి చెయ్యక ముందే)
“అవును నాన్న తప్పే కానీ వైశాలి నన్ను ప్రేమించింది కదా..!”
“అవును నిన్నూ కౌశిక్ ను కానీ తరువాత, చివరికి ఏమైంది? అసలు ప్రేమంటే! నీకేలా చెప్పాలి!!.?” - నాన్న.
“ఒక్క నిమిషం ఒక్క నిమిషం అసలు మీరు నాకు ప్రేమ గురించి చెప్తున్నారా ఇప్పుడు!!? నా 10త్ క్లాస్ లో జరిగింది నేను ఇంకా మర్చిపోలేదు నాన్న. అమ్మ ఏం మాట్లాడకుండా ఉండడం మీరు ఒకరోజు అమ్మను కొట్టడం అమ్మ కూడా ఏం మాట్లాడకుండా భరించడం నేనేం మర్చిపోలేదు. మీరు ప్రేమ గురించి ఇప్పుడు నాకు చెప్తారా ? మీ వల్లే అసలు నేను ఇలా తయారయ్యాను ఇంతవరకు వచ్చింది ఇండియా కూడా వచ్చింది మీ వల్లే.!!”.(చాలా ఆవేశం గా అన్నాడు నారీ)
“అంతా చూసిన వాడివి వచ్చి నువ్వే నన్ను అడిగి ఉండవచ్చు కదరా ఏమైంది అని? చెప్పేవాడిని, నువ్వు చూసావని నాకు తెలియదు లేకపోతే నేను చెప్పేవాడిని నువ్వు అడగక పోయిన, దాని వల్లే నువ్వు ఇలా మారవంటే నాకు భాద గా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది నీ వల్ల”.
(వాళ్ళ ఏం చెపుతున్నాడో అర్ధం కానట్టు మొహం పెట్టాడు నారీ)
“మేం మొదట్లో చాలా అన్యోన్యం గా ఉండేవాళ్లం నీకు తెలిసి నట్టుగా కానీ కొంత కాలం తరువాత ఒకరోజు మీ అమ్మ వేరొకరితో తప్పుచేసింది. అది నేనే స్వయంగా చూసా. నేను దాన్ని తీసుకోలేక పోయా జీర్ణించుకోలేక పోయా. నన్ను అంతలా ప్రేమించిన తను ఎలా చేసింది ఇది. నేను నమ్మలేక పోయా మరి తను ఇంతవరకు నన్ను మోసం చేసిందా అంటే లేదు. తను నన్ను ప్రేమించింది, స్వయంగా తనే వచ్చి నేను నిన్ను ఇంతకాలం ప్రేమించలేదు అదంతా కూడా కేవలం నటనే, నటించా అంతే అన్నా, నేను నమ్మను. ఎందుకంటే పడక గదిలో దొరికేది మాత్రమే ప్రేమ కాదు తను మనకోసం చేసే ప్రతి పనిలో ఉంటుంది. తను మనకు చేసే ప్రతి సేవ లో ఉంటుంది, మనకు చూపించే కేరింగ్ లో ఉంటుంది, మనతో మాట్లాడే ప్రతి మాటలో ఉంటుంది. నువ్వు దాన్నిఫీల్ అవ్వగలవు. అదే ప్రేమంటే నా ధృష్టిలో. నేను అదే నమ్ముతాను కూడా, ఎందుకంటే అక్కడ స్వార్ధం ఉండదు.
నేను ఈ కన్ఫ్యూషన్ లోనే ఉన్నా మీ అమ్మ నన్ను ప్రేమించిందా లేదా మోసం చేసిందా అని. నేను రియలైజ్ అయ్యా మీ అమ్మ నన్ను ప్రేమించిది కానీ నా వల్లే మీ అమ్మ ఆ తప్పు చేసింది నేనే కానీ తనకు టైమ్ ఇచ్చి ఉంటే తనను కేర్ చేసి ఉంటే తనీ పని చేసి ఉండదు. సో, నావల్లే తను అలా చేసింది కాబట్టి నాకు తన మీద ఏ కోపం లేదు. రెండు రోజులు పట్టింది దాని నుంచి బయటకు రావడానికి.
కానీ మీ అమ్మ, నేను తనని అలా చూసినందుకు చాలా బాధపడింది. తను తప్పు చేశానని చాలా ఫీల్ అయ్యింది అందులోంచి బయటకు రాలేక పోయింది. నేను ఎన్నో విధాలుగా చెప్పా తప్పులు మనుషులే చేస్తారు. అంత మాత్రాన ప్రతి ఒక్కరూ ఇలా భాదపడుతూ కూర్చోవడం అనవసరం అని.
నువ్వలా చెయ్యడానికి కారణం నేనే అన్నాను. నువ్వేం బాధ పడొద్దు అన్నాను. కానీ మీ అమ్మ లో కొంచెం కూడా స్పందన లేదు. నీకు తెలుసు కదా మనతో మాట్లాడకుండా కనీసం మన ముఖాలని కూడా చూసేదీ కాదు. కొద్ది రోజులుగా తను అలాగే ఉండే సరికి ఒకరోజు నాకు దక్కదేమో అనిపించిది మనకు దూరమైపోతున్నట్టు అనిపించింది, నా చెయ్యి జారిపోతున్నట్టు.
అందుకే ఒకరోజు కొట్టాను, ఎంత కొడుతున్నా తను భరిస్తుందే కానీ ఏడవ లేదు కానీ కాసేపటికి తరువాత నా కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. అప్పుడు, నేను రిలీఫ్ గా ఫీల్ అయ్యా ఇక అప్పటినుంచి తను మారింది.
కానీ ఈ సంఘటనల వల్ల నువ్వు ఇలా మారవంటే నాకు కొంచెం బాధగానే ఉంది.”
“అయాం సారీ నాన్న ఐ మిస్ అండర్స్టుడ్ యు ,అయాం సారీ!”.
“ఇంటికి రారా! జరిగిందేదో జరిగింది అక్కడ బాబాయి వాళ్ళకు ఈ విషయాలు చెప్పొద్దు. మళ్ళీ వాళ్ళు కూడా బాధపడతారు. తరువాత చెబుదాం.
“సరే నాన్న”.
ఆ తరువాత నారీ అమెరికా వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే అమ్మను గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు.
ఆ తరువాత ఒక రెండేళ్ళు ఇంట్లోనే ఉన్నాడు నారీ. రోజూ అవే తలుచుకుంటూ. ఆ తరువాత మెల్లగా దాన్ని నుంచి బయట పడ్డాడు. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమంటే అలా రెండేళ్ల తరువాత పెళ్లి చేసుకోవడానికి తిరిగి ఇండియా కు వచ్చాడు. ఇంకా ఆ అమ్మాయికి కూడా నారీ చాలా నచ్చాడు ఇక వాళ్ళ పెళ్ళే మిగిలింది !!!.
మరి ఇంకేంటి , వాళ్ళ వైవాహిక జీవితం బాగుండాలని ఆశీర్వదించండి.
చదివినందుకు ధన్యవాదాలు ! మీ వినయ్ !.